Homeబిజినెస్Samsung Massive Employee Bonus: కంపెనీ అంటే ఇదిరా సామీ.. కష్టపడ్డందుకు ఏకంగా ఒక్కో ఉద్యోగికి...

Samsung Massive Employee Bonus: కంపెనీ అంటే ఇదిరా సామీ.. కష్టపడ్డందుకు ఏకంగా ఒక్కో ఉద్యోగికి 3.25 కోట్ల బోనస్

Samsung Massive Employee Bonus: అంతర్జాతీయంగా పరిస్థితులు బాగోలేదు. బాగుపడతాయని నమ్మకం కూడా లేదు. ఐటీ కార్యకలాపాలు మొత్తం ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా సాగుతున్నాయి. భవిష్యత్తు కాలంలో మనుషుల అవసరం ఉంటుందో.. లేదో కూడా తెలియడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఐటీ కంపెనీలు ఉద్యోగులను పక్కన పెడుతున్నాయి. అర్ధాంతరంగా తొలగిస్తున్నాయి. దీంతో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇటువంటి పరిస్థితులున్న నేటి కాలంలో ఓ కంపెనీ భారీగా లాభాలను సంపాదించింది. అంతేకాదు ఈ లాభాలు సాధించడానికి […]

Samsung Massive Employee Bonus: అంతర్జాతీయంగా పరిస్థితులు బాగోలేదు. బాగుపడతాయని నమ్మకం కూడా లేదు. ఐటీ కార్యకలాపాలు మొత్తం ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా సాగుతున్నాయి. భవిష్యత్తు కాలంలో మనుషుల అవసరం ఉంటుందో.. లేదో కూడా తెలియడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఐటీ కంపెనీలు ఉద్యోగులను పక్కన పెడుతున్నాయి. అర్ధాంతరంగా తొలగిస్తున్నాయి. దీంతో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు.

ఇటువంటి పరిస్థితులున్న నేటి కాలంలో ఓ కంపెనీ భారీగా లాభాలను సంపాదించింది. అంతేకాదు ఈ లాభాలు సాధించడానికి కారణమైన ఉద్యోగుల విషయంలో గొప్ప నిర్ణయం తీసుకుంది. ఆ ఉద్యోగులు ఊహించిన విధంగా ఆఫర్ ఇచ్చింది. దీంతో ఆ సంస్థలో పనిచేస్తున్న ఎంప్లాయిస్ మొత్తం ఎగిరి గంతులు వేస్తున్నారు. ఏమి మా మహాభాగ్యమంటూ సంబరాలు చేసుకుంటున్నారు.

మనదేశంలో దీపావళి సందర్భంగా కంపెనీలు ఉద్యోగులకు బోనస్ లు ప్రకటిస్తుంటాయి. ఉత్తమమైన ఉద్యోగులకు అద్భుతమైన కానుకలు ఇస్తుంటాయి. అయితే ఇప్పుడు దీపావళి కాదు. పేరుపొందిన పండగలు కూడా లేవు. కానీ సాంసంగ్ కంపెనీ తన సంస్థలో పనిచేసే ఉద్యోగులకు ఈ సంవత్సరంలో దీపావళి పండుగను ముందుగానే తీసుకొచ్చింది. అన్ని కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలలో కోతలు విధిస్తుంటే.. సాంసంగ్ కంపెనీ మాత్రం భిన్నంగా ఆలోచిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో.. సాంసంగ్ కంపెనీ ఊహించని లాభాలు సొంతం చేసుకోండి. గత క్వార్టర్లో ఆ కంపెనీకి సంబంధించిన షిఫ్ట్ డివిజన్ ఆదాయం ఏకంగా 49 రెట్లు పెరిగిపోయింది. ఫలితంగా ఆవిభాగంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి 3.25 కోట్లను బోనస్ గా ఇచ్చేందుకు సాంసంగ్ కంపెనీ యూనియన్ ఆమోదాన్ని తెలిపింది. సాంసంగ్ కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఏకంగా 78,000 మంది ఉద్యోగులకు ప్రత్యక్ష లబ్ధి చేకూరుతుంది. కొత్తకాలంగా చిప్ యూనిట్ ల విషయంలో సాంసంగ్ కంపెనీ ప్రధానంగా దృష్టి సారించింది. దీంతో ఆ కంపెనీ ఆదాయం భారీగా పెరిగింది. అందువల్లే ఉద్యోగులకు ఈ స్థాయిలో బోనస్ ప్రకటించింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper