Home Blog Page 219

నాగార్జున ప్రొడ్యూసర్ గా ఆ యంగ్ హీరో తో ఒక సినిమా చేయాలనుకున్నాడు...ఆ హీరో హ్యాండ్ ఇచ్చాడా..?

Nagarjuna
Nagarjuna

Nagarjuna planned movie with young hero: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది హీరోలు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుండటం విశేషం… నాగార్జున లాంటి స్టార్ హీరో సైతం తన కెరియర్ స్టార్టింగ్ లో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అయినప్పటికి తను హీరోగా నిదొక్కుకొని ప్రస్తుతం తన హవాను కొనసాగిస్తున్నాడు. సీనియర్ హీరోల్లో తను కూడా ఒకడిగా ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… నాగార్జున హీరో గానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా చాలా సక్సెసులనైతే అందుకున్నాడు. ముఖ్యంగా అతను సినిమా చేయాలంటే ఆ కథలో చాలా వెయిట్ ఉండాలి. దానికి తగ్గట్టుగానే దర్శకుడికి ఆ కథను సక్సెస్ఫుల్గా చేయగలిగే కెపాసిటి ఉండాలి. అలాంటివి ఉన్నప్పుడే నాగార్జున వాళ్ళతో సినిమాలను చేస్తాడు. లేకపోతే మాత్రం వారిని తీసి పక్కన పెట్టేస్తాడు అనేది వాస్తవం. ఇక ఇలాంటి క్రమంలోనే ఒక హీరోతో నాగార్జున ఒక సినిమాని ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నారట. కానీ అది వర్కౌట్ కాలేదు. ఇంతకీ ఆ హీరో ఎవరు అంటే నవీన్ పోలిశెట్టిగా తెలుస్తుంది.

కామెడీ టైమింగ్ గాని అతని యాక్టింగ్ గాని చాలా బాగుంటుంది. అందువల్లే నాగార్జున అతనితో సినిమా చేయడానికి ఆసక్తి చూపించాడు. కానీ నవీన్ పోలిశెట్టి మాత్రం వాళ్ళు చెప్పిన కథ అంత పెద్దగా ఎఫెక్ట్ గా అనిపించకపోవడంతో తను సినిమా నో చెప్పారట.

ఇక ఏది ఏమైనా కూడా నాగార్జున కొంతమంది కుర్ర హీరోలతో సినిమాలను చేసి వాళ్లకు సక్సెస్ లను అందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటివి నాగార్జున నవీన్ పోలిశెట్టి విషయంలో ఎందుకని కథ విషయంలో అంత పర్ఫెక్ట్ గా వర్క్ చేయలేకపోయారు అనేది కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరిలో చర్చనీయాంశముగా మారింది.

ఇక ఏది ఏమైనా కూడా నవీన్ పోలిశెట్టి లాంటి కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఇప్పటివరకు ఆయన చేసిన నాలుగు సినిమాల్లో నాలుగు సినిమాలు కూడా సూపర్ సక్సెస్ ని సాధించాయి అంటే అతను కథ మీద ఎంత ఫోకస్ తో ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు…

ఆ ఇద్దరు దర్శకులను రిపీట్ చేస్తున్న చిరంజీవి, బాలయ్య..

Chiranjeevi and Balakrishna
Chiranjeevi and Balakrishna

Chiranjeevi and Balakrishna: సినిమా ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోలు వాళ్లకు సక్సెస్ లను ఇస్తే చాలు ఆ దర్శకులను రిపీటెడ్ గా సినిమాలు చేస్తూనే ఉంటారు. దానికి ఉదాహరణగా మనం చిరంజీవి, బాలయ్య బాబులను తీసుకోవచ్చు. 2023 వ సంవత్సరంలో బాలయ్యకు ‘వీర సింహారెడ్డి’ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందించిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఇక అదే సంవత్సరం బాబీ దర్శకత్వంలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సైతం భారీ విజయాన్ని సాధించింది. అందుకే చిరంజీవి సైతం మరోసారి బాబీ ని రిపీట్ చేస్తూ అతనికి అవకాశాన్ని ఇచ్చాడు. బాబీ ఇంతకు ముందు బాలయ్య బాబుతో ‘డాకు మహరాజ్’ సినిమా చేశాడు. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సాధించడంతో చిరంజీవి అతన్ని పిలిచి మరి అవకాశం ఇచ్చాడు. రెండో సినిమాతో చిరంజీవిని ఎలా చూపిస్తాడు.

ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. బాబీకి ఇప్పటివరకు 90% సక్సెస్ రేట్ ఉంది. కాబట్టి ఆయన సినిమా వస్తుంది అంటే చాలు అది మినిమం గ్యారంటి సినిమాగా ప్రేక్షకులు ఒక అంచనాకి వచ్చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే బాబీ చిరంజీవిని ఎలా చూపిస్తాడు.

ప్రేక్షకులందరిని మెప్పించే విధంగా ఈ సినిమా ఉండబోతుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ఈ సినిమాలో మోహన్ లాల్ సైతం ఒక కీలకపాత్రలో నటించబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కూడా చాలా వైల్డ్ గా ఉండబోతుందట. ఇక చిరంజీవి బాబీ ఇంతకు ముందు చేసిన వాల్తేరు వీరయ్య సినిమా మాస్ కమర్షియల్ ప్రేక్షకులను అలరించింది.

ఇప్పుడు వస్తున్న సినిమాతో వాళ్ళని టార్గెట్ చేస్తూనే ఒక డెప్త్ స్టోరీని చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారట… గోపీచంద్ మలినేని, బాబీ ఇద్దరు కూడా మరోసారి వాళ్ళని నమ్మిన హీరోలకు సక్సెస్ లను అందిస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది… ఇక ఈ రెండు సినిమాలను కూడా 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు…

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా అప్డేట్ ఏంటి..?

Pawan Kalyan new movie update
Pawan Kalyan new movie update

Pawan Kalyan new movie update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏదో ఒక సినిమాను సెట్స్ మీద ఉంచుతాడు. కానీ ఫస్ట్ టైమ్ ఆయన ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి కూడా కమిట్ అవ్వడం లేదు. ఎందుకంటే ఆయన ఒకేసారి రెండు మూడు సినిమాలకు కమిటై ఉంటాడు కాబట్టి వాటిని నిదానంగా పూర్తి చేసుకుంటూ వస్తాడు. ఎప్పుడైతే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ అయిందో అప్పటినుంచి ఆయన ఖాళీగానే ఉన్నాడు. ఇక ఇప్పటికైనా ఆయన కాంబినేషన్లో ఎవరితో సినిమా చేస్తున్నాడు. ఎలాంటి కథతో మనల్ని మరోసారి మెస్మరైజ్ చేయడానికి సిద్ధమవుతున్నాడనే విషయంలో సరైన క్లారిటి అయితే రావడం లేదు. సురేందర్ రెడ్డి కథను ఫైనల్ చేసినప్పటికి ఆ కథ ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయాలను కూడా ఎక్కడ చెప్పడం లేదు. ఇక దానికి తోడుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో రెండు కథలను రీమేక్ చేయాలని చెప్పారట. ఆ కథలను కూడా ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది…

ఇక మీదట పవన్ కళ్యాణ్ చేసే సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఎందుకంటే ఆయన డిఫరెంట్ కథలను సెలెక్ట్ చేసుకుంటూ క్వాలిటీ సినిమాలు చేయగలిగితే ఇప్పటికి ఆయన్ని బీట్ చేసే హీరో ఎవరు ఉండరు.

మొత్తానికి పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు చూసుకుంటూనే అవకాశం దొరికిన ప్రతిసారి మంచి సినిమాలను చేస్తూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాడు. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ ను సాధించకపోవడంతో ఆయన దర్శకుల విషయంలో కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. దానివల్లే ఆయన ఇప్పటి వరకు మరో సినిమాకి కమిట్ అవ్వడం లేదు. సురేందర్ రెడ్డి సినిమా ఉంది అని చెప్తున్నారు.

కానీ అది ఎప్పుడు అనే విషయంలో ఇంకా క్లారిటి రావడం లేదు. పవన్ కళ్యాణ్ అభిమానులైతే ఆయన నుంచి కొత్త సినిమా అప్డేట్ ఎప్పుడు వస్తుంది అని చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు… ఇక గత సంవత్సరం ఓజీ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందించిన సుజీత్ సైతం తనతో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు…

రాబోయే రోజుల్లో వచ్చే పవర్ ఫుల్ హ్యాచ్ బ్యాక్ కార్లు ఇవే..

Upcoming Powerful Hatchback Cars
Upcoming Powerful Hatchback Cars

Upcoming Powerful Hatchback Cars: భారతీయ ఆటోమొబైల్ రంగంలో SUVల హవా కొనసాగుతున్నప్పటికీ.. నగరాల్లో ట్రాఫిక్ కష్టాలు, పార్కింగ్ సమస్యల దృష్ట్యా హ్యాచ్‌బ్యాక్ కార్లకు ఇప్పటికీ ఒక ప్రత్యేకమైన ఆదరణ ఉంది. ఈ క్రమంలో ప్రముఖ కంపెనీలు తమ హ్యాచ్‌బ్యాక్ శ్రేణిని మరింత ఆధునీకరిస్తూ.. వినూత్న ఫీచర్లు, ఇంధన సామర్థ్యంతో కొన్ని కార్లను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి. రాబోయే రోజుల్లో సందడి చేయబోయే ఆ నాలుగు ముఖ్యమైన కార్ల వివరాలు తెలుసుకుందాం..

మారుతి సుజుకి బాలెనో ఫేస్‌లిఫ్ట్ (Maruti Suzuki Baleno Facelift): భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లలో బాలెనో ఒకటి. ఇప్పుడు దీనికి రాబోయే ‘ఫేస్‌లిఫ్ట్’ వెర్షన్ మారుతి సుజుకి యొక్క నెక్సా లైనప్‌లో కీలక పాత్ర పోషించనుంది. సరికొత్త ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, రీడిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్ మరియు అత్యాధునిక ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో ఇది రాబోతోంది. ఇంజిన్ పనితీరులో కూడా స్వల్ప మార్పులతో పాటు, ఇంధన సామర్థ్యాన్ని పెంచే దిశగా ఇంజనీరింగ్ మెరుగుదలలు చేస్తున్నారు. ఇందులో1.2 లీటర్ డ్యూయెల్ జెట్ ఇంజిన్ ఇండనుంది. ఇది మాన్యువల్ తో పాటు ఏ ఎంటీ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. బాలెనోను మరింత ఆధునిక లుక్‌తో తీసుకురావడం ద్వారా, మారుతి సుజుకి మళ్లీ హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని చూస్తోంది.

హ్యుందాయ్ ఐ20 (Hyundai i20):ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో ఐ20 ఎప్పుడూ తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుంది. ఇప్పుడు హ్యుందాయ్ సంస్థ దీనిని మరింత ఆకర్షణీయమైన డిజైన్ మరియు అధునాతన టెక్నాలజీతో అప్‌డేట్ చేస్తోంది. 2027లో ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందులో మెరుగైన సేఫ్టీ ఫీచర్లు, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ , పవర్‌ఫుల్ ఇంజిన్ ఆప్షన్లు ఉండనున్నాయి. ముఖ్యంగా యువతను ఆకట్టుకునేలా దీని ఇంటీరియర్‌ను మరింత లగ్జరీగా తీర్చిదిద్దుతున్నారు. 1.0 లీటర్ 3 సిలిండర్ టర్బో పెట్రోల్, 1.2 లీటర్ 4 సిలిండర్ అస్పిరేటెడ్ పెట్రల్ ఇంజిన్ ఉండనుంది.

మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ (WagonR Flex-Fuel): పర్యావరణహిత ప్రయాణం
పర్యావరణ స్పృహ పెరిగిన తరుణంలో, మారుతి సుజుకి తీసుకురాబోతున్న ‘ఫ్లెక్స్ ఫ్యూయల్’ వేరియంట్ వ్యాగన్ ఆర్ ఒక విప్లవాత్మక అడుగు. ఈ కారు 20 శాతం నుండి 85 శాతం వరకు ఇథనాల్ మిశ్రమంతో కూడిన పెట్రోల్ (E20 to E85)తో నడవగలదు. పెట్రోల్ ధరల నుంచి ఉపశమనం పొందడమే కాకుండా, కాలుష్యాన్ని తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. రోజువారీ ప్రయాణాలకు, సిటీ డ్రైవింగ్‌కు ఎంతో అనువైన వ్యాగన్ ఆర్‌ను ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్‌లో తీసుకురావడం ద్వారా సామాన్య మధ్యతరగతి వినియోగదారులకు పొదుపుతో కూడిన ప్రయాణాన్ని అందించడమే కంపెనీ ప్రధాన లక్ష్యం.

ఎంజీ బింగ్వో ఈవీ (MG Bingo EV): ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ విప్లవంఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో సంచలనం సృష్టించేందుకు ఎంజీ మోటార్స్ ‘బింగ్వో ఈవీ’ని భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. దీని ప్రత్యేకమైన రెట్రో-మోడ్రన్ డిజైన్ మరియు కాంపాక్ట్ సైజు నగరాల్లోని వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎక్కువ దూరం ప్రయాణించగలిగేలా రూపొందించిన ఈ ఈవీ, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక ఫీచర్లతో రానుంది. ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో ఇది ఒక గేమ్‌ఛేంజర్‌గా మారే అవకాశం ఉంది, ఎందుకంటే తక్కువ మెయింటెనెన్స్ మరియు పెట్రోల్ ఖర్చు లేని ప్రయాణాన్ని కోరుకునే వారికి ఇది సరైన ఎంపికగా నిలవనుంది. 2026లో చివరి వరకు ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

ఇద్దరు వ్యక్తుల భావోద్వేగాల కలయిక.. ఈ సంగతి మీకు తెలుసా?

Human Emotions and Bonding
Human Emotions and Bonding

Human Emotions and Bonding: ప్రేమ, పరస్పర నమ్మకం, త్యాగం, అర్థం చేసుకోవడం… ఈ నాలుగు విలువల మీదే దాంపత్య జీవితం నిలబడుతుంది. అలాంటి భార్యాభర్తల బంధాన్ని మరింత గుర్తు చేసుకునే రోజు ‘దంపతుల దినోత్సవం’గా మే 29ను చాలామంది జరుపుకుంటారు. ఈ రోజు ప్రత్యేకంగా భార్యాభర్తల మధ్య ప్రేమను, అనుబంధాన్ని, కలిసి నడిచే జీవిత ప్రయాణాన్ని గుర్తు చేస్తుంది.

చాలామంది దాంపత్య జీవితం అంటే కేవలం ఒక కుటుంబ బాధ్యతగా భావిస్తారు. కానీ నిజానికి అది ఇద్దరు వ్యక్తుల భావోద్వేగాల కలయిక. జీవితంలో సుఖదుఃఖాలను పంచుకోవడం. ఒకరికి ఒకరు అండగా నిలవడం. కలిసి ఎదగడం దాంపత్య బంధానికి అసలైన అర్థం. అందుకే దంపతుల దినోత్సవం కేవలం ఒక సెలబ్రేషన్ కాదు… ఒకరికొకరు ఎంత ముఖ్యమో గుర్తు చేసుకునే సందర్భం.

ప్రతిరోజూ కలిసి టీ తాగడం, పని అయిపోయాక మాట్లాడుకోవడం, ఒకరి ఆరోగ్యం గురించి మరొకరు పట్టించుకోవడం… ఇవన్నీ చిన్న విషయాల్లా కనిపించినా దాంపత్య జీవితంలో ఎంతో విలువైనవి. ఈ రోజు అలాంటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని భార్యాభర్తలు తమ అనుబంధాన్ని మరింత బలపరుచుకుంటారు.

ఈరోజుల్లో ఉద్యోగ ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, సమయం లేకపోవడం వంటి కారణాలతో చాలామంది దంపతుల మధ్య దూరం పెరుగుతోంది. మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా కారణంగా కూడా వ్యక్తిగత సంభాషణలు తగ్గుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దంపతుల దినోత్సవం వంటి రోజులు ఒకరికొకరు సమయం కేటాయించుకోవాలని గుర్తు చేస్తాయి.

దంపతుల దినోత్సవం సందర్భంగా ఖరీదైన బహుమతులు ఇవ్వడం కంటే, ఒకరోజు పూర్తి సమయం కలిసి గడపడం ఎంతో విలువైనదిగా భావిస్తున్నారు చాలామంది. కలిసి భోజనం చేయడం, పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం, ఒక చిన్న ట్రిప్‌కు వెళ్లడం లేదా ఒక మంచి మాట చెప్పడం కూడా సంబంధాన్ని మరింత దగ్గర చేస్తాయి. భారతీయ సంప్రదాయంలో భార్యాభర్తల బంధానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ‘అర్ధాంగి’, ‘సహధర్మచారిణి’ వంటి పదాలు భార్యకు ఇచ్చిన గౌరవాన్ని తెలియజేస్తాయి. అలాగే కుటుంబ వ్యవస్థ బలంగా నిలబడటంలో దంపతుల పరస్పర అవగాహన కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే దాంపత్యాన్ని ఒక పవిత్ర బంధంగా భావిస్తారు.ౌ

అయితే ‘దంపతుల దినోత్సవం’ (Couples Day) అనే ప్రత్యేక దినానికి సంబంధించిన స్పష్టమైన అధికారిక చరిత్ర మాత్రం లేదు. ఇది ఏదైనా ఒక దేశ ప్రభుత్వం లేదా అంతర్జాతీయ సంస్థ అధికారికంగా ప్రకటించిన రోజు కాదు. కాలక్రమేణా సోషల్ మీడియా, గ్రీటింగ్ కల్చర్, ప్రేమ మరియు సంబంధాలను సెలబ్రేట్ చేసే ఆధునిక ట్రెండ్‌ల ద్వారా ఈ రోజు ప్రాచుర్యం పొందింది. అయితే ఈ రోజు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం ప్రేమను వ్యక్తపరచడం మాత్రమే కాదు, సంబంధాల్లో నమ్మకం, గౌరవం, పరస్పర అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో గుర్తు చేయడం. ఒక చిన్న శుభాకాంక్ష, ఒక మంచి మాట, కొద్దిసేపు కలిసి గడపడం కూడా బంధాన్ని మరింత బలపరుస్తుందని ఈ రోజు గుర్తుచేస్తోంది.

టైటానిక్‌ ప్రమాదం.. చివరి 60 సెకన్లలో ఏం జరిగింది? షాకింగ్ నిజాలు..

Titanic ship accident shocking details
Titanic ship accident shocking details

Titanic ship accident shocking details: ప్రపంచంలోనే అత్యాధునికంగా, అతి పెద్దగా, ‘‘మునగని’’ అని ప్రకటించబడిన టైటానిక్‌ షిప్‌ ఉత్తర అట్లాంటిక్‌ సముద్రంలో ఐస్‌బర్గ్‌తో ఢీకొని ఒక దురంత చరిత్రగా మారింది. 1912 ఏప్రిల్‌ 15వ తేదీ రాత్రి ప్రమాదం జరిగింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ప్రమాదం కేవలం ఒక షిప్‌ మునగడం కాదు మానవులు సముద్రాన్ని జయించాలనే గర్వం ఎంత పెళుసుగా ఉంటుందో గుర్తు చేసే హృదయవిదారక ఘటన. అయితే చివరి 60 సెన్లలో జరిగిన పేలుడు కారణాలను వదేళ్ల తర్వాత గుర్తించారు.

మునిగే ప్రక్రియ…
ప్రమాదం జరిగిన వెంటనే షిప్‌ ముందు భాగం(bౌఠీ) గదుల్లోకి నీరు భారీగా చేరింది. డిజైన్‌లో ఉన్న వాటర్‌టైట్‌ కంపార్ట్‌మెంట్లు కూడా ఈ తీవ్రమైన గాయాన్ని తట్టుకోలేకపోయాయి. నీరు వేగంగా వ్యాపించడంతో ముందు భాగం క్రిందకు మునిగి, వెనుక భాగం పైకి లేచి నిలబడే భయానక దృశ్యం ఏర్పడింది. ఈ అసమతుల్యత షిప్‌ నిర్మాణంపై అపారమైన ఒత్తిడిని కలిగించింది.సుమారు రెండున్నర గంటల కాలంలో ఈ దురంతం పూర్తయింది. ఈ సమయంలో లైఫ్‌బోట్ల కొరత, సిబ్బంది సన్నాహాలలోని లోపాలు, ప్రయాణికుల మధ్య అసమానతలు అన్నీ కలిసి విపత్తును మరింత ఘోరంగా మార్చాయి. వందల సంఖ్యలో మరణాలు జరగగా, కేవలం పదుల సంఖ్యలో మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.

చివరి క్షణాలు భయానకం..
నీటి బరువు మరియు షిప్‌ యొక్క స్వంత బరువు కలిసి హల్‌పై అపారమైన ఒత్తిడి పెరగడంతో టైటానిక్‌ రెండు భాగాలుగా విరిగిపోయింది. ఈ విచ్ఛేదనం షిప్‌ మునిగే వేగాన్ని పెంచింది. ముందు భాగం పూర్తిగా మునిగాక వెనుక భాగం కూడా నీటిలోకి జారవిడిచింది. అయితే, ఈ దురంతం అత్యంత భయానకమైన అధ్యాయం చివరి 60 సెకన్లలో జరిగింది. బయటి నుంచి అధిక జల ఒత్తిడి కారణంగా షిప్‌ లోపలి ఖాళీలు కుదించుకుపోయి భారీ ఇంప్లోషన్‌ జరిగింది. ఇది సాధారణ పేలుడు కాదు. లోపలి గాలి బయటి ఒత్తిడికి తట్టుకోలేక షిప్‌ నిర్మాణం చెక్కుచెదరైన ఘోర ఘటన. ఈ క్షణం టైటానిక్‌ పూర్తిగా సముద్రంలో కలిసిపోయే ముందు చివరి, అత్యంత హృదయవిదారక దృశ్యం.

టెటానిక్‌ ప్రమాదం మనకు అనేక పాఠాలు నేర్పుతుంది. సాంకేతికతపై అతిగా విశ్వాసం వేయడం ఎంత ప్రమాదకరమో, మానవ జీవితాలను కాపాడే సేఫ్టీ చర్యలు ఎంత కీలకమో ఈ ఘటన బోధిస్తుంది. ‘‘అన్‌సింకబుల్‌’’ అని ప్రకటించిన షిప్‌ కేవలం రెండున్నర గంటల్లో మునిగిపోవడం. ఇది మానవ గర్వానికి సముద్రం ఇచ్చిన తీవ్రమైన హెచ్చరిక. ఈ దురంతం తర్వాత సముద్ర ఇంజనీరింగ్‌లో, షిప్‌ డిజైన్‌లో, రక్షణ ప్రమాణాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. అయినా, టైటానిక్‌ కథ ఇప్పటికీ మనల్ని కదిలిస్తుంది. ఈ విషాదం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒక్కటే: సముద్రం ఎప్పటికీ ఆధిపత్యం వహిస్తుంది. మనం దానిని గౌరవించడం నేర్చుకోవాలి, లేకపోతే చరిత్ర మళ్లీ మళ్లీ రిపీట్‌ అవుతుంది.

కర్ణాటకలో పవర్ షేరింగ్.. ఏపీలో పవన్ సగం సీఎం అవుతారా? సాధ్యమేనా?

Pawan Kalyan Telangana Politics
Pawan Kalyan Telangana Politics

Pawan Kalyan become CM in AP: ఏపీలో మళ్లీ పవర్ షేరింగ్ పై కొత్త ప్రచారం ప్రారంభం అయింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలన్న ఆకాంక్షను బయట పెడుతున్నారు కొందరు. కర్ణాటకలో పవర్ షేరింగ్ నేపథ్యంలో ఇక్కడ కూడా జరగాలన్న విన్నపాన్ని జనసైనికులు సోషల్ మీడియా వేదికగా చేస్తూ వస్తున్నారు. అయితే దీని వెనుక వైసీపీ హస్తం ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఇటీవల పవన్ కళ్యాణ్ కులంతో పాటు తన సీఎం పదవి కోసం నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. కాపులకు ఎటువంటి ప్రాధాన్యత లేకుండా పోతుందని… పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితేనే కాపుల ఆకాంక్ష తీరుతుందని కొందరు ప్రచారం చేస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్. మరి అటువంటిది తనను 2019లో ఎందుకు ఓడించారు అంటూ ప్రశ్నించారు. కచ్చితంగా ఇప్పుడు పొత్తు ఇచ్చిన కావాలి. ఆ ప్రయత్నంలో భాగంగా జరుగుతున్న సోషల్ మీడియా ప్రచారంలో జనసైనికులు పాల్గొనవద్దని పవన్ స్పష్టమైన పిలుపు ఇచ్చారు. ఇప్పుడు అదే సమయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై రకరకాల చర్చ నడుస్తోంది.

అప్పట్లో పవర్ షేరింగ్ ఒప్పందంతో..
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది. 2023లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య గట్టి పోటీ నెలకొంది. అయితే అనుభవజ్ఞుడైన సిద్ధరామయ్య వైపు అప్పట్లో కాంగ్రెస్ హై కమాండ్ మొగ్గు చూపింది. అయితే తన దూకుడుతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు డీకే శివకుమార్. కానీ అప్పుడు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. డీకే శివకుమార్ ను డిప్యూటీ సీఎం చేశారు. అప్పట్లోనే 2.5 ఫార్ములాతో ముఖ్యమంత్రి పదవి షేర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ లెక్కన రెండున్నర సంవత్సరాలకు సిద్ధరామయ్య రాజీనామా చేయాలి. కానీ ఆయన ఆరు నెలలు అధికంగా పాలించారు. అయితే ఇప్పుడు సిద్ధరామయ్య రాష్ట్ర రాజకీయాలకు దూరం కావాలని నిర్ణయించుకున్నారు. రాజ్యసభ ద్వారా కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తున్నారు. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతున్నారు. అయితే కర్ణాటక మాదిరిగా ఇప్పుడు ఏపీలో కూడా పవర్ షేరింగ్ కావాలి అనేది సోషల్ మీడియా వేదికగా వస్తున్న డిమాండ్.

పదే పదే ప్రచారం..
ఏపీలో కూటమిలో ముఖ్యమంత్రి పదవి షేరింగ్ అనేది ఇప్పటి మాట కాదు. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ మాట వినిపిస్తూనే ఉంది. పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు నాయకత్వాన్ని సమర్థిస్తూ.. ఆయన నేతృత్వంలోనే నడుస్తామని ప్రకటిస్తూ వచ్చారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే 15 సంవత్సరాల పాటు కూటమి నిర్విరామంగా కొనసాగాలని ఆకాంక్షించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుందని తేల్చి చెప్పారు. తమ ప్రయత్నం రాజకీయం కోసం కాదని.. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అని పలుమార్లు తేల్చి చెప్పారు పవన్ కళ్యాణ్. ముఖ్యమంత్రి అనే మాట వినబడిన ప్రతి సారి ఆయన పార్టీ శ్రేణులకు సర్దుబాటు చేశారు. లేనిపోని ప్రకటనలు వద్దు అంటూ హెచ్చరికలు జారీ చేశారు. తన మాటలను, తన ఆదేశాలను పాటించని వారు పార్టీకి అవసరం లేదని కూడా తేల్చి చెప్పారు. టిడిపి తో పొత్తు ప్రకటించిన మరుక్షణం నుంచి తనకు సలహాలు ఇచ్చేవారు ఎక్కువయ్యారని చెప్పుకొచ్చారు. పొత్తును అడ్డుకోవాలని చూశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అస్థిర పరచాలని చూస్తున్నారు. ఈ విషయంపై బాహటంగానే పార్టీ శ్రేణులకు హెచ్చరించారు పవన్ కళ్యాణ్. పవర్ షేరింగ్ అనే మాట ఏపీలో వినిపించే అవకాశం లేదు. ముఖ్యమంత్రి పదవికి పవన్ నుంచి పోటీ వచ్చే ప్రసక్తి లేదు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా లో జనసైనికుల పేరుతో వస్తున్న ఈ డిమాండ్ వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందన్నది కూటమి పార్టీ నేతల అనుమానం.

పాక్‌తో యుద్ధానికి భారత్‌ సన్నాహాలు.. తెరవెనుక పెద్ద ప్లానింగే?

India war preparations
India war preparations

India war preparations: రాబోయే ఐదేళ్లలో భారత్‌–పాకిస్తాన్‌ మధ్య పెద్ద ఎత్తున సంఘర్షణ జరగవచ్చని అమెరికా అంచనాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, భారత్‌ తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారిస్తోంది. పాహల్గాం ఘటన తర్వాత సింధు జలాల ఒప్పందం హోల్డ్‌లో ఉంది. చైనా–పాకిస్తాన్‌ సహకారం పెరగడం, అమెరికా–ఇరాన్‌ ఉద్రిక్తతలు వంటి అంశాలు ఈ ప్రాంతంలో అస్థిరతను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌ ఎస్‌–400 వంటి అధునాతన వ్యవస్థలను మరింత విస్తరించడం కీలక నిర్ణయంగా కనిపిస్తోంది.

బ్యాటరీల ఆర్డర్‌..
భారత్‌ ప్రస్తుతం మూడు ఎస్‌–400 బ్యాటరీలను కలిగి ఉంది. వీటిలో రెండు పాకిస్తాన్‌ సరిహద్దు వైపు, ఒకటి సిలిగురి కారిడార్‌ వద్ద మోహరించబడ్డాయి. రష్యా నుంచి అదనపు బ్యాటరీలు మరియు మిస్సైళ్లు (288 మిస్సైళ్లు) కొనుగోలు చేయడం ద్వారా దీర్ఘకాలిక ఎయిర్‌ డిఫెన్స్‌ కవరేజ్‌ను మెరుగుపరచాలని లక్ష్యం.

ఆపరేషన్‌ సిందూర్‌లో విజయం..
ఈ వ్యవస్థ పాకిస్తాన్‌ మిస్సైళ్లు, డ్రోన్లు, చైనా సాయంతో వచ్చిన బెదిరింపులను సమర్థవంతంగా ఎదుర్కొంది. దీనికి విరుగుడుగా పాకిస్తాన్‌కు చైనా అందించిన హెచ్‌క్యూ–9 వ్యవస్థ విఫలమైంది. ఎస్‌–300 వంటి పాత వ్యవస్థలు ఇరాన్, వెనెజువెలాలలో విఫలమైనా, ఎస్‌–400 ఆధునిక సామర్థ్యాలు భారత్‌కు ఆత్మవిశ్వాసం ఇచ్చాయి. అయితే వీటి కొనుగోలు అమెరికా వంటి దేశాల నుంచి కొంత వ్యతిరేకతను ఎదుర్కొంటోంది, కానీ భారత్‌ తన భద్రతా అవసరాలను ప్రాధాన్యత ఇస్తోంది.

చైనా–పాకిస్తాన్‌ సహకారం..
చైనా పాకిస్తాన్‌కు జే–35 (ఫైఫ్త్‌ జెనరేషన్‌ స్టెల్త్‌ జెట్‌)లను అందించే ప్రక్రియలో ఉంది. ఇది భారత్‌ యొక్క ఎయిర్‌ సుపీరియారిటీని సవాలు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత్‌ తన ఎయిర్‌ డిఫెన్స్‌ మల్టి–లేయర్డ్‌ సిస్టమ్‌ను (ఎస్‌–400, అకాష్, ఇతరులు) మరింత బలపరుస్తోంది. అమెరికా ఎఫ్‌–35లు పాకిస్తాన్‌కు ఇవ్వడం లేదని అయినా, భవిష్యత్‌ సహకార అవకాశాలు ఉన్నాయి. ఇది భారత్‌ను మరింత అప్రమత్తంగా ఉండేలా చేస్తోంది.

ఇరాన్‌ సంచలన ప్రకటన..
ఇటీవల అమెరికా సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ మార్కో రూబియో భారత్‌ సందర్శించి, తాజ్‌మహల్‌ వద్ద భార్యతో ఫోటో దిగి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీనిపై ఇరాన్‌ తీవ్ర స్పందన వ్యక్తం చేసింది. తాజ్‌మహల్‌ నిర్మాణంలో పర్షియన్‌ (ఇరానియన్‌) స్థాపత్య ప్రభావం ఉందని, ఇరాన్‌ కళాకారులు, కూలీలు పని చేశారని గుర్తు చేసింది. ఇది వాస్తవం అయినా, తాజ్‌మహల్‌ భారతీయ సంస్కృతి, వారసత్వానికి ప్రతీక.

ఒకేచోటుకు ఎందుకు?
అతిథులను తరచూ తాజ్‌మహల్‌కు తీసుకెళ్లడం వెనుక దౌత్యపరమైన సందేశం ఉండవచ్చు. భారత్‌లో అనేక చారిత్రక, సహజ సౌందర్య ప్రదేశాలు ఉన్నా, తాజ్‌మహల్‌ గ్లోబల్‌ బ్రాండ్‌గా పని చేస్తుంది. అయితే వైవిధ్యం కోసం ఇతర ప్రదేశాలను కూడా ప్రమోట్‌ చేయాలనే చర్చలు ఉన్నాయి.

అమెరికా–ఇరాన్‌ ఉద్రిక్తతలు..
అమెరికా ఇరాన్‌పై దాడులు కొనసాగిస్తూ, హార్మూజ్‌ స్ట్రైట్‌లో ల్యాండ్‌ మైన్‌ షిప్పులను టార్గెట్‌ చేస్తోంది. ఒకవైపు శాంతి చర్చలు, మరోవైపు సైనిక చర్యలు జరుగుతున్నాయి. ఇది గ్లోబల్‌ ఎనర్జీ మార్కెట్‌ను ప్రభావితం చేస్తుంది. భారత్‌ వంటి దేశాల శక్తి భద్రతపై ప్రభావం చూపవచ్చు.

భారత్‌ స్వదేశీ రక్షణ వ్యవస్థల అభివృద్ధితో పాటు అంతర్జాతీయ సహకారాలను సమతుల్యం చేసుకోవాలి. ఎస్‌–400 విస్తరణ ఒక ముఖ్యమైన అడుగు అయినా, సమగ్ర రక్షణ వ్యూహం, డిప్లమసీ, ఆర్థిక బలం కూడా అవసరం. యుద్ధం తప్పించడం ఉత్తమం కానీ, సన్నాహాలు ఎప్పుడూ అత్యవసరం. భారత్‌ ఈ సమయంలో ఐక్యతతో ముందుకు సాగాలి.

జినాల్ జిగేల్.. స్విమ్ డ్రెస్ లో కాకరేపుతోంది..

Jinal Joshi Photos
Jinal Joshi Photos

ఆ యాప్ ను సొంతంగా క్రియేట్ చేసిన Apple.. వీరికి చాలా ఉపయోగం..

Siri App
Siri App

Siri App: ప్రపంచవ్యాప్తంగా Apple మొబైల్స్ కు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. అందులోనూ భారత్ లో ఈ ఫోన్లకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ మొబైల్ వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఈ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా లేటేస్ట్ గా తన వాయిస్ అసిస్టెంట్ Siri ని iOS 27 లో పూర్తిగా మార్చి, ఇప్పుడు స్వతంత్ర యాప్‌గా అందుబాటులోకి తెస్తోంది. ఈ యాప్‌లో టెక్స్ట్, వాయిస్ రెండింటి ద్వారా చాట్ చేయ వచ్చు. గతంలో సిరి కేవలం వాయిస్ కమాండ్‌లకు మాత్రమే పరిమితం కాగా, ఇప్పుడు గొప్ప చాట్‌బాట్ అనుభవాన్ని ఇవ్వడానికి యాపిల్ ప్రత్యేక యాప్ ని తయారు చేస్తోంది.

బ్లూమ్ బర్గ్ లీక్ చేసిన ఫొటోల ప్రకారం.. కొత్త Siri యాప్ చాట్ హిస్టరీని లిస్ట్ లేదా గ్రిడ్ రూపంలో చూపిస్తుంది. రిచ్‌టెక్స్ట్ కార్డ్‌ల ద్వారా వివరణాత్మక సమాచారాన్ని డైనమిక్ ఇస్లాండ్ నుండి పాప్‌అప్‌గా ఇస్తుంది. ఇంటర్‌ఫేస్ చాలా డార్క్ థీమ్‌లో ఉంటుంది. అలాగే వాయిస్ మోడ్, సాధారణ టెక్స్ట్ ఫీల్డ్, అటాచ్‌మెంట్ పికర్ లాంటి ఫీచర్‌లు ఉంటాయి. ఈ యాప్ ప్రధానంగా ChatGPT, Gemini, Claude లాంటి అప్లికేషన్‌లను పోలి ఉంటుంది.

ఇందులో మెసేజ్‌లు, ఇమెయిల్స్, నోట్స్ లాంటి పర్సనల్ డేటాను అర్థం చేసుకుని కమాండ్స్ ఎక్స్‌క్యూట్ చేస్తుంది. యాప్‌లలో పనులు చేయడం, వెబ్ సెర్చ్ చేయడం, వార్తలను అప్‌డేట్ చేయడం వంటి జటిలమైన టాస్క్‌లను కూడా చేయగలదు. అలాగే, స్క్రీన్ కంటెంట్‌ను అర్థం చేసుకోవడం వంటి ఫీచర్‌లు కూడా ఇందులో ఉంటాయి.

iOS 27 లో యాపిల్ మొదటిసారిగా రెన్యూవల్ ఏఐ మోడల్‌ ద్వారా రిలీజ్ అవుతుంది. సిస్టమ్ గూగుల్ Gemini టెక్నాలజీని ఉపయోగించి యూజర్లు App Store నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న థర్డ్-పార్టీ AI ఏజెంట్‌లకు ప్రత్యక్షంగా ప్రశ్నలను రౌట్ చేయవచ్చు. అదనంగా సిరీ ఇప్పుడు కెమెరా యాప్‌లో కూడా ఇంటిగ్రేట్ అవుతుంది . ఫోటో తీసి, దానిని AI ద్వారా చెక్ చేస్తుంది. ఈ కొత్త సిరి ఫీచర్‌లను యాపిల్ జూన్ 8, 2026 నాడు WWDC 2026 కీనోట్‌లో అధికారికంగా ప్రకటించనుంది. తర్వాత బీటా టెస్టింగ్ జరిగి, సెప్టెంబర్ 2026లో iOS 27 విస్తృతంగా రిలీజ్ కానుంది.

మహాలక్ష్మి’ బస్ పై కీలక అప్డేట్.. ఇక అవి ఉంటేనే జర్నీ..

Mahalakshmi Smart Card
Mahalakshmi Smart Card

Mahalakshmi Smart Card: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉచిత బస్సు ప్రయాణానికి ఆధార్ కార్డును గుర్తింపు పత్రంగా ఉపయోగిస్తున్న మహిళలకు ఇకపై ప్రత్యేకంగా ‘మహాలక్ష్మి’ స్మార్ట్ కార్డులను జారీ చేయనుంది. ఈ కొత్త విధానం జూన్ 2 నుంచి అమల్లోకి రానుంది. మహిళలు ఎక్కడైనా సులభంగా తమ అర్హతను నిరూపించుకుని ప్రయాణించేందుకు ఈ కార్డులు ఉపయోగపడనున్నాయి. అయితే ఈ స్మార్ట్ కార్డులు ఎక్కడ పొందాలంటే?

ఇప్పటి వరకు మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయాలంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా చూపించాల్సి వచ్చేది. అయితే ప్రతిసారి ఆధార్ వెంట తీసుకెళ్లడం, దాని భద్రతపై ఆందోళనలు ఉండటంతో ప్రభుత్వం కొత్తగా స్మార్ట్ కార్డు విధానాన్ని తీసుకొచ్చింది. ఇకపై ప్రత్యేకంగా జారీ చేసే ‘మహాలక్ష్మి’ కార్డును చూపిస్తే చాలు, మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు.

ఈ పథకాన్ని ప్రభుత్వం తొలిదశలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనుంది. ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని ఎంపిక చేసి అక్కడ ముందుగా స్మార్ట్ కార్డులను పంపిణీ చేస్తారు. ఆ ప్రాంతాల్లో అమలు విజయవంతమైతే, తరువాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఈ విధానాన్ని విస్తరించే అవకాశం ఉంది. దీంతో వ్యవస్థలో లోపాలు ఉంటే ముందుగానే గుర్తించి సరిచేసే అవకాశం ప్రభుత్వానికి లభిస్తుంది. స్మార్ట్ కార్డుల పంపిణీ పూర్తయ్యే వరకు మహిళలు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. కొత్త కార్డు చేతికి అందే వరకు ప్రస్తుతం అమలులో ఉన్న విధంగానే ఆధార్ కార్డుతో ఉచిత ప్రయాణం కొనసాగించవచ్చు. దీంతో ప్రయాణ సౌకర్యంలో ఎలాంటి అంతరాయం ఉండదని తెలిపారు.

‘మహాలక్ష్మి’ స్మార్ట్ కార్డులను మహిళలు మీ సేవా కేంద్రాలు, అలాగే ఆర్టీసీ బస్ పాస్ కేంద్రాల ద్వారా పొందవచ్చు. కార్డు జారీ కోసం రూ.50 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో అవసరమైన గుర్తింపు పత్రాలు, చిరునామా వివరాలు సమర్పించాల్సి ఉండొచ్చు. పూర్తి మార్గదర్శకాలను త్వరలో ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ స్మార్ట్ కార్డు వల్ల మహిళలకు ప్రయాణంలో మరింత సౌకర్యం కలగనుంది. ఆధార్‌ను ప్రతిసారీ వెంట తీసుకెళ్లాల్సిన అవసరం తగ్గడంతో పాటు, డిజిటల్ ధృవీకరణ ద్వారా వేగంగా ప్రయాణ అనుమతి పొందే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఈ కార్డును ఇతర ప్రభుత్వ సేవలతో కూడా అనుసంధానం చేసే అవకాశాలపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం.

మహిళల ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోంది. లక్షలాది మహిళలు ప్రతిరోజూ ఈ సౌకర్యాన్ని వినియోగిస్తున్నారు. ఇప్పుడు స్మార్ట్ కార్డుల జారీతో ఈ పథకం మరింత పారదర్శకంగా, సాంకేతికంగా బలోపేతం కానుందని అధికారులు భావిస్తున్నారు.

ఆ రెండు దేశాల మధ్య కేవలం 14 కిలోమీటర్లే.. కానీ వంతెన ఎందుకు లేదు..

Spain Morocco Tunnel Project
Spain Morocco Tunnel Project

Spain Morocco Tunnel Project: ఆ రెండు దేశాల మధ్య కేవలం 14 కిలోమీటర్లు మాత్రమే. అయతే మధ్యలో సముద్రపు నీరు. అయినా ఈ రెండు దేశాల మధ్య వంతెన నిర్మిస్తే ప్రపంచంలోని పలు దేశాలు ఎన్నో ప్రయోజనాలు పొందుతాయి. అయితే ఆ వంతెన నిర్మాణానికి 1980 నుంచి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక పరిశోధనల మధ్య ఇక్కడ వంతెన నిర్మించడం సాధ్యంకాదని భూగర్భ శాస్త్రవేత్తలు తేల్చారు. అయితే ఇప్పుడు టన్నెల్ నిర్మించాలనిఅనుకుంటున్నారు. మరి ఇది సాధ్యమేనా? ఇంతకీ ఈ ప్రదేశం ఎక్కడుంది?

స్పెయిన్, మొరాకో దేశాలను వేరు చేసే ‘జిబ్రాల్టర్ జలసంధి’ (Strait of Gibraltar) మీదుగా ఒక వంతెన లేదా సొరంగాన్ని నిర్మించడం అనేది దశాబ్దాలుగా సాగుతున్న ప్రక్రియ. ఐరోపా, ఆఫ్రికా ఖండాలను కలిపే ఈ ప్రాజెక్ట్ గురించి 1980ల నుండే ఇరు దేశాల మధ్య అధికారిక చర్చలు జరుగుతున్నాయి. 1980లో యూరఫ్ ఖండంలోని స్పెయిన్ రాజు జువాన్ కార్లోస్ I, ఆఫ్రికా ఖండంలోని మొరాకో రాజు హసన్ II ఈ ప్రాజెక్టుపై ప్రాథమిక అంగీకారానికి వచ్చారు. అప్పటి నుం చి SECEGSA (స్పెయిన్) , SNED (మొరాకో) వంటి ప్రత్యేక సంస్థలు ఈ ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాయి. 2003లో ఇరు దేశాలు సముద్ర గర్భం ద్వారా రైలు సొరంగాన్ని నిర్మించడానికి అంగీకరించాయి. ఇటీవలి కాలంలో 2023, 2025లో ఈ ప్రాజెక్టుపై మరోసారి ఆసక్తి రిగింది. 2030 ఫిఫా వరల్డ్ కప్ సన్నాహాల్లో భాగంగా ఈ సొరంగ మార్గాన్ని మరింత వేగవంతం చేయాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి.

ఈ ప్రాంతంలో వంతెనను నిర్మించకపోవడానికి ప్రధాన కారణం భౌగోళిక , ఇంజనీరింగ్ సవాళ్లు. జిబ్రాల్టర్ జలసంధి అతి తక్కువ వెడల్పు (సుమారు 14 కిలోమీటర్లు) కలిగినప్పటికీ, దాని లోతు ఆశ్చర్యకరంగా 300 నుండి 900 మీటర్ల వరకు ఉంటుంది. ఇంత లోతైన సముద్ర గర్భంలో వంతెన కోసం పునాదులు వేయడం ఇంజనీరింగ్ పరంగా అత్యంత కష్టమైన పని. అంతేకాకుండా, అట్లాంటిక్ మహాసముద్రం, మధ్యధరా సముద్రం కలిసే ఈ ప్రాంతంలో నీటి ప్రవాహాలు చాలా వేగంగా ఉంటాయి. వీటితో పాటు, ఈ ప్రాంతం భూకంపాలు వచ్చే అవకాశం ఉన్న ‘సిస్మిక్ జోన్’ (seismically active zone) లో ఉండటం కూడా భద్రతాపరమైన ఆందోళనలను పెంచుతోంది.

అయితే వంతెన కంటే సొరంగ మార్గమే (Tunnel) మేలని భావించి, దానిపైనే ఇప్పుడు పరిశోధనలు సాగుతున్నాయి. సుమారు 42 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గం కోసం ప్రణాళికలు రూపొందుతున్నాయి, ఇది కేవలం సముద్రం మీదుగానే కాకుండా భౌగోళికంగా అనుకూలమైన మార్గాల గుండా వెళ్తుంది. ఈ వంతెన మొత్తం పొడవు 60 కిలోమీటర్లు. ఇందులో 28 కి.మీ. సముద్రం అడుగున ఉంటుంది. స్పెయిన్‌లో Punta Paloma నుంచి మొరాకోలో Punta Malabata వరకు దీనిని నిర్మంచనున్నారు. సముద్ర మట్టం నుంచి 175–475 మీటర్ల లోతులో ఫిల్లర్లు వేయనున్నారు. దీనికి 15–30 బిలియన్ల డాలర్లకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది.

2030లో స్పెయిన్, మొరాకో మరియు పోర్చుగల్ కలిసి FIFA వరల్డ్ కప్‌ను నిర్వహించనున్నాయి. ఈ సమయానికి టన్నెల్ సిద్ధంగా ఉంటే, అభిమానులు యూరప్ , ఆఫ్రికా మధ్య సులభంగా ప్రయాణించవచ్చు అని ఆశించారు. కానీ, అనిశ్చితమైన భూగోళశాస్త్ర సవాళ్ల కారణంగా టన్నెల్ 10 ఏళ్ల ఆలస్యం అయ్యింది. దీంతో 2040 తర్వాతే ఇది ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

అల్లుడు క్యారెక్టర్ తెలుసుకునేందుకు మామ చేసిన పనికి పోలీసుల ఫిదా!

Father Checks Groom Character
Father Checks Groom Character

Father Checks Groom Character: అల్లారుముద్దుగా పెంచుకునే ఆడపిల్లలను అత్తారింటికి పంపించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. అల్లుడు మంచివాడా? కాదా? అని నిర్ధారించుకుని పిల్లను ఇవ్వాలి. లేకుంటే జీవితాంతం ఇక్కట్లు తప్పవు. కొందరు కారు ఉందని.. ఆస్తులు ఉన్నాయని.. పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని.. ఇలా రకరకాల ఆశలతో పిల్లలను ఇస్తారు. తీరా వారి దాంపత్య జీవితంలో ఎన్నెన్నో అపార్ధాలు, విభేదాలు పుడతాయి. చివరకు విడాకులు వరకు వెళ్తారు. మరికొందరు బలవన్మరణాలకు పాల్పడతారు. సమాజంలో ఇటువంటివి చూసిన ఓ పెద్దాయన.. తన కాబోయే అల్లుడు గురించి ఏకంగా పోలీసులను ఆశ్రయించాడు. వారితోనే అతడి క్యారెక్టర్ ను విచారించి.. సరైన వ్యక్తి అని నిర్ధారించుకుని పిల్లను ఇచ్చాడు.

* కుమార్తె కోసం..
కాకినాడ జిల్లా రాయుడుపాలెం కు చెందిన ఓ పెద్దాయనకు ఒక్కగానొక్క కుమార్తె ఉంది. ఆయన భార్య చనిపోవడంతో కుమార్తెను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. సమాజంలో జరుగుతున్న దుష్పరిణామాలను చూస్తున్న ఆయన సరైన వరుడు వస్తే తన పిల్లను వివాహం చేయాలని భావించాడు. ఇటీవల ఒక పెళ్లి సంబంధం వచ్చింది. కానీ వరుడి క్యారెక్టర్ తెలుసుకునేందుకు ఆయన ఒక వినూత్న ఆలోచన చేశాడు. సాధారణంగా మద్యం అలవాటు ఉంటే తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఉంటాయి. దూకుడు గల వ్యక్తి అయితే కచ్చితంగా ట్రాఫిక్ ఆంక్షలు దాటి వ్యవహరిస్తాడు. తప్పకుండా ట్రాఫిక్ చలానాలు కట్టి ఉంటాడు. అందుకే ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించాడు సదరు పెద్దాయన.

* కాకినాడలో ఘటన..
కాకినాడ భానుగుడి జంక్షన్ లో ట్రాఫిక్ సిఐ రామారావు విధులు నిర్వహిస్తున్నాడు. అక్కడకు వెళ్లిన పెద్దాయన.. కారుతో పాటు బైక్ రిజిస్ట్రేషన్ నెంబర్లు ఇచ్చాడు. ఈ నెంబర్లతో ట్రాఫిక్ చలానాలు కానీ.. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కానీ నమోదు అయ్యాయా అని ఆరా తీశాడు. అలా ఎందుకు ఆరా తీస్తున్నారని సీఐ ప్రశ్నించగా.. ఇది తన కాబోయే అల్లుడు వాహనాల నంబర్లు అని.. ఆయన క్యారెక్టర్ తెలుసుకునేందుకు ఇలా మిమ్మల్ని ఆశ్రయించానని చెప్పగా.. సిఐ రామారావు ఎంతగానో ఆనందించారు. వెంటనే ఆ నెంబర్లతో సెర్చ్ చేయగా ఎటువంటి చలానాలు లేవు. కేసులు కూడా నమోదు కాలేదు. ఆ విషయం చెప్పడంతో పెద్దాయన అక్కడ నుంచి ఆనందంతో వెళ్లిపోయాడు. కుమార్తెకు వివాహం ఖరారు చేస్తానని చెప్పాడు. ఆ పెద్దాయన లాంటి ఆలోచనను ప్రతి తల్లిదండ్రులు చేస్తే.. చాలా బాగుంటుందని అభిప్రాయపడ్డారు సీఐ రామారావు.

రాక్షసుడిని పూజిస్తారు.. హనుమంతుడిని ద్వేషిస్తారు.. మనదేశంలో ఈ వింత ఆచారం ఎక్కడంటే..

Maharashtra Strange Tradition
Maharashtra Strange Tradition

Maharashtra Strange Tradition: మనదేశంలో ఆంజనేయ స్వామికి గుడి లేని ప్రాంతం అంటూ ఉండదు. ఆంజనేయస్వామి పేరులేని వ్యక్తి అంటూ ఉండడు. మనదేశంలో రాముడికి ఏ స్థాయిలో అయితే విశేషమైన పూజలు లభిస్తుంటాయో.. హనుమంతుడికి కూడా అదే స్థాయిలో పూజా క్రతువులు జరుగుతుంటాయి. ఆంజనేయస్వామిని చాలామంది తమ ఇలవేల్పుగా భావిస్తుంటారు. కొందరైతే తమ ఇళ్లల్లో కూడా చిన్న చిన్న ఆలయాలు నిర్మించుకొని.. అందులో ఆంజనేయస్వామిని ప్రతిష్టించి పూజలు జరుపుతుంటారు. ఇక మనదేశంలో హనుమాన్ జయంతి వేడుకలు ఏ స్థాయిలో జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

హనుమంతుడిని ఇష్ట దైవంగా పూజించే మనదేశంలో.. భిన్నమైన ఆచారం కొనసాగుతోంది. అక్కడ హనుమంతుడిని పూజించరు. మారుతి అనే పేరు కూడా పెట్టుకోరు. చివరికి మారుతి కంపెనీకి సంబంధించిన కార్లను కూడా కొనుగోలు చేయరు. ఆంజనేయులు అనే పదం వినిపిస్తే బూతు లాగా భావిస్తుంటారు. ఇదంతా కూడా మనదేశంలోని మహారాష్ట్ర లోనార్ లోని నందుర్ నింభా ధైత్య గ్రామంలో సాగుతున్న వింత ఆచారం. ఇక్కడ హనుమంతుడికి ఆలయాలు ఉండవు. పిల్లలకు మారుతి, ఆంజనేయులు అనే పేర్లు పెట్టరు. చివరికి మారుతి కంపెనీ కార్లు కూడా కొనుగోలు చేయరు. ఇక్కడ ప్రజలు నింభా దైత్యుడు అనే రాక్షసుడిని పూజిస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామి విగ్రహాలు పెడితే ఈ గ్రామానికి కీడు జరుగుతుందని వారు భావిస్తుంటారు. ప్రమాదాలు చోటు చేసుకుంటారని భయపడుతుంటారు. అందువల్లే ఆ ఊర్లో ఆంజనేయస్వామికి ఆలయం ఉండదు. ఆంజనేయ స్వామికి సంబంధించిన ప్రస్తావన కనిపించదు. అయితే వందల సంవత్సరాల నుంచి ఈ ఆచారం కొనసాగుతున్న నేపథ్యంలో.. ఇప్పటికీ అక్కడి ప్రజలు దానిని కొనసాగిస్తున్నారు.

రాముడిని ఇలవేల్పుగా.. ఆంజనేయస్వామిని ధైర్యానికి ప్రతీకగా భావించే మనదేశంలో ఇలాంటి ఆచారం ఉండడం నిజంగా ఆశ్చర్యకరమే. అయితే ఆ రాక్షసుడు తమ గ్రామానికి కాపలా అని.. తమ గ్రామం ఈ స్థాయిలో సుఖ సౌఖ్యాలతో ఉంటోంది అంటే దానికి ఆ రాక్షసుడే కారణమని అక్కడి ప్రజలు భావిస్తుంటారు. ప్రతి ఏడాది ఉత్సవాలు కూడా జరుపుకుంటారు. దసరా నుంచి మొదలు పెడితే దీపావళి వరకు ప్రతి పండుగలోనూ రాక్షసుడికి ఉత్సవాలు జరుపుతుంటారు..

నింభాదైత్యుడు అనే రాక్షసుడికి నైవేద్యాలు.. పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఉత్సవాల సమయంలో అన్నదానాలు కూడా జరుపుతుంటారు.. గ్రామస్తులు తమ ఇళ్లల్లో రాక్షసుడి చిత్రపటాలు ఏర్పాటు చేసుకొని పూజలు నిర్వహించుకుంటారు. ఆ రాక్షసుడిని తమ పాలిట దైవంగా చెప్పుకుంటారు.

నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ప్రమాదం.. ఈ అలవాట్లతోనే నయం..

Blood Pressure Management
Blood Pressure Management

Blood Pressure Management: భారతదేశంలో హైబీపీ (అధిక రక్తపోటు) ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన ‘సైలెంట్ కిల్లర్’గా మారుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా All India Institute of Medical Sciences కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ అంబుజ్ రాయ్ వెల్లడించిన గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో ప్రతి ఏడాది సుమారు 16 లక్షల మంది హైబీపీ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన తెలిపారు. గుండెపోటు, స్ట్రోక్, కిడ్నీ సమస్యలు వంటి తీవ్రమైన వ్యాధులకు హైబీపీ ప్రధాన కారణంగా మారుతోందని వైద్యులు చెబుతున్నారు. లక్షణాలు పెద్దగా కనిపించకపోవడంతో చాలా మంది తమకు ఈ సమస్య ఉందనే విషయం ఆలస్యంగా తెలుసుకుంటున్నారు. అయితే హైబీపీ రాకుండా ఉండాలంటే జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా అవసరం. అవేంటంటే?

ప్రస్తుతం భారతదేశంలో దాదాపు 30 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని అంచనా. పట్టణ ప్రాంతాల్లో ఈ సమస్య మరింత వేగంగా పెరుగుతోంది. నగరాల్లో సుమారు 33 శాతం మంది, గ్రామీణ ప్రాంతాల్లో 25 శాతం మంది హైబీపీతో బాధపడుతున్నారని నిపుణులు వెల్లడించారు. మారుతున్న జీవనశైలి, అధిక ఒత్తిడి, శారీరక శ్రమ తగ్గిపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఈ పరిస్థితికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు.

హైబీపీని ‘సైలెంట్ కిల్లర్’ అని పిలవడానికి కారణం, ఇది చాలా కాలం పాటు ఎలాంటి స్పష్టమైన లక్షణాలు లేకుండానే శరీరాన్ని లోపల నుంచి దెబ్బతీయడం. కొందరికి తలనొప్పి, తల తిరగడం, అలసట వంటి స్వల్ప లక్షణాలు కనిపించినా, చాలామందిలో ఏ సంకేతాలూ కనిపించవు. దీంతో పరీక్షలు చేయించుకునే వరకు సమస్య బయటపడదు. అప్పటికే గుండె, మెదడు, కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది.

వైద్యుల అభిప్రాయం ప్రకారం, హైబీపీని పూర్తిగా నివారించలేకపోయినా, జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా అదుపులో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా రోజూ తీసుకునే ఉప్పు పరిమాణాన్ని తగ్గించడం చాలా అవసరం. అధిక ఉప్పు ఉన్న ప్యాకేజ్డ్ ఫుడ్స్, నిల్వ పచ్చళ్లు, చిప్స్, బేకరీ పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్స్ వంటి వాటిని తగ్గించాలి. నూనె, మసాలాలు అధికంగా ఉండే ఆహారాన్ని తరచుగా తినడం కూడా రక్తపోటును పెంచుతుంది.

శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవడం కూడా హైబీపీ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఊబకాయం ఉన్నవారిలో రక్తపోటు సమస్య ఎక్కువగా కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడక, యోగా లేదా ఇతర వ్యాయామాలు చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. అలాగే సరిపడ నిద్ర, మానసిక ప్రశాంతత కూడా ఎంతో అవసరం.

ఇప్పటి జీవనశైలిలో ఒత్తిడి కూడా హైబీపీకి ప్రధాన కారణంగా మారింది. ఉద్యోగ ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, నిద్రలేమి వంటి కారణాల వల్ల రక్తపోటు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ధ్యానం, యోగా, శ్వాస వ్యాయామాలు వంటి అలవాట్లు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. కుటుంబ సభ్యులతో సమయం గడపడం, హాబీలకు సమయం కేటాయించడం వంటి చిన్న మార్పులు కూడా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు హైబీపీ ప్రమాదాన్ని మరింత పెంచుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొగతాగడం వల్ల రక్తనాళాలు దెబ్బతింటాయి. మద్యం అధికంగా తీసుకోవడం వల్ల గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి వీటిని పూర్తిగా మానేయడం లేదా తగ్గించడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

వైద్యులు సూచిస్తున్న మరో ముఖ్యమైన విషయం రెగ్యులర్ హెల్త్ చెకప్. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి వ్యక్తి నిరంతరం రక్తపోటు పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. కుటుంబంలో ఇప్పటికే హైబీపీ లేదా గుండె జబ్బుల చరిత్ర ఉంటే మరింత జాగ్రత్త అవసరం. ప్రారంభ దశలోనే గుర్తిస్తే మందులు, జీవనశైలి మార్పులతో ఈ సమస్యను సమర్థంగా నియంత్రించవచ్చు.

చిరంజీవి ఇంకా ఎన్ని సినిమాలు చేస్తారో తెలుసా..?

Chiranjeevi
Chiranjeevi

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్నాడు. గత 50 సంవత్సరాల నుంచి ఆయన సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చో బెట్టాయి. ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా ఆయన పలు జాగ్రత్తలు తీసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు… 70 సంవత్సరాల పైబడిన వయసులో కూడా ఆయన ఇప్పటికి హీరోగా రాణిస్తూ కమర్షియల్ సక్సెస్ లను సాధిస్తున్నాడు అంటే నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పాలి. చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలు తన రేంజ్ కి సరిపడా లేవని కొన్ని విమర్శలైతే వస్తున్నాయి. ఇక వీటన్నింటికి చెక్ పెట్టడానికే ఇప్పుడు వరుసగా మరో రెండు సినిమాలకైతే కమిట్ అయ్యాడు. బాబీ డైరెక్షన్లో చేస్తున్న సినిమాతో కమర్షియల్ సక్సెస్ ని సాధించడమే కాకుండా విమర్శకుల నుంచి వచ్చే కామెంట్లను కూడా మూయించాలనే ప్రయత్నంలో చిరంజీవి ఉన్నాడు.

ఇక ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమా చేయడానికి కూడా తను సన్నాహాలు చేసుకుంటున్నాడు. వీళ్లిద్దరి సినిమాల తర్వాత నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తాడు అనే విషయంలో కూడా సరైన క్లారిటీ రావడం లేదు. ఇంకా ఎన్ని సినిమాలు చేస్తాడు సోలో హీరోగా అతను ఎప్పటి వరకు రాణిస్తాడు అనేది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది…

నిజానికి చిరంజీవి తన చివరి శ్వాస వరకు ఇండస్ట్రీ లోనే కొనసాగుతానని గతంలో చాలాసార్లు చెప్పాడు. ఇక ఏది ఏమైనా కూడా మిగతా హీరోలందరు సరైన సక్సెసులు లేక సతమతమవుతుంటే చిరంజీవి మాత్రం మంచి విజయాలను సాధించినా కూడా అతని రేంజ్ సక్సెసు లైతే రావడం లేదనేది విమర్శకుల వాదన…

రాబోయే రోజుల్లో చిరంజీవి ఇంతకు ముందు సాధించిన విజయాలను దాటి భారీ విజయాన్ని సాధించాల్సిన అవసరమైతే ఉంది… దానికితోడు ఇప్పుడున్న స్టార్ హీరోలందరు పాన్ ఇండియాలో తమ హవాను క్రియేట్ చేస్తుండడం కూడా చిరంజీవి మీద కొంత ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది… మొత్తానికైతే సీనియర్ హీరోల్లో ప్రస్తుతం చిరంజీవి మొదటి స్థానంలో కొనసాగుతుండటం విశేషము…

ప్రభాస్ ను తప్పుగా అర్థం చేసుకున్న స్టార్ డైరెక్టర్...

Prabhas
Prabhas

Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఉన్న ఇమేజ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చో బెట్టాయి. ప్రస్తుతం పాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరో కొనసాగుతున్న నటుడు కూడా తనే కావడం విశేషం…ఈ మధ్యకాలంలో ఆయన నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. రీసెంట్ గా ‘రాజాసాబ్’ సినిమాతో కొంతవరకు డీలా పడ్డప్పటికి ఆయన స్టాండర్డ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. తన మార్కెట్ ను కూడా విపరీతంగా విస్తరించుకున్నాడనే చెప్పాలి. ఇప్పుడు ప్రభాస్ తో ఒక సినిమా చేస్తే అది సూపర్ సక్సెస్ సాధిస్తే ఈజీగా 2000 కోట్ల మార్క్ ను అందుకోవచ్చనే కాన్సెప్ట్ తోనే దర్శక నిర్మాతలు ఉన్నారు…

గతంలో ప్రభాస్ చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యాన్ని చూపిస్తూ వచ్చాడు. అయితే ఆయన కొరియోగ్రాఫర్లను ఎక్కువగా ఎంకరేజ్ చేసిన విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా రాఘవ లారెన్స్, ప్రభుదేవా లాంటి వాళ్లతో సినిమాలను చేశాడు.

ఇదే సమయంలో అమ్మ రాజశేఖర్ తో కూడా ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. కానీ అది అనుకోని కారణాలవల్ల ఆగిపోయిందట. రీసెంట్ గా ఇంటర్వ్యూ ఇచ్చిన అమ్మ రాజశేఖర్ ప్రభాస్ తనతో సినిమా చేస్తానని చెప్పి హ్యాండ్ ఇచ్చాడని చెప్పాడు. నిజానికి తను ప్రభాస్ ని అపార్థం చేసుకున్నాడని కొంతమంది చెబుతున్నారు.

కారణం ఏంటి అంటే అప్పుడున్న బిజీ వల్ల ప్రభాస్ అతనితో సినిమా చేయలేకపోయాడని ఆ తర్వాత అతను చెప్పిన కథ ప్రభాస్ ఇమేజ్ కి సరిపడా విధంగా లేకపోవడం వల్ల ఆ తర్వాత కూడా అతనికి ఛాన్స్ అయితే ఇవ్వలేదని మరి కొంతమంది చెబుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఇప్పటికీ ఇండియాలో ఉన్న చాలా మంది దర్శకులు ప్రభాస్ తో సినిమా చేయాలనుకుంటున్నారు. కాబట్టి వాళ్లందరికి అవకాశం దొరికే ఛాన్స్ లేదు. ఎవరైతే అతన్ని తన కథతో మెప్పిస్తారో వాళ్లకు మాత్రమే అవకాశాలైతే దక్కుతున్నాయి…