Actors imitating Mahesh Babu: సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు సక్సెస్ ల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ముఖ్యంగా మహేష్ బాబు లాంటి నటుడు ఈరోజు సూపర్ స్టార్ గా ఎదిగాడు అంటే ఆయన చాలావరకు కసరత్తులు చేశారనే చెప్పాలి. మహేష్ బాబును ఇమిటేట్ చేస్తూ కొంతమంది కుర్ర హీరోలు సైతం రాణిస్తున్నారు అనే విషయం మనలో చాలామందికి తెలియదు. ముఖ్యంగా అడవి శేషు, రామ్ లాంటి కుర్ర హీరోలు మహేష్ బాబు ను ఇమిటేట్ చేస్తూ ఉంటారు. వీళ్ళ యాక్టింగ్ లో మనకు అది కనిపిస్తూనే ఉంటుంది. ఇక ఈ మధ్యకాలంలో వచ్చిన నవీన్ పోలిశెట్టి సైతం కొన్ని సందర్భాల్లో మహేష్ బాబుని ఇమిటెడ్ చేస్తుండడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఇప్పటికే ప్రయోగాత్మకమైన సినిమాలను చేయడమే కాకుండా కమర్షియల్ సక్సెస్ లను సాధిస్తూ ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ ను క్రియేట్ చేశాడు.
ముఖ్యంగా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ కి పెట్టింది పేరుగా మారిన మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న వారణాసి సినిమాతో మరోసారి సంచలనాన్ని క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా మీద 1500 కోట్ల వరకు బడ్జెట్ అయితే కేటాయిస్తున్నారు.
ఓవరాల్ గా ఈ సినిమా 3000 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టడమే కాకుండా ప్రేక్షకులు అందరి చేత శభాష్ అనిపించుకునేలా విజువల్స్ ఉంటాయని చెబుతున్నారు. ఇక రాజమౌళి దర్శకత్వం కూడా ఈ సినిమాకి చాలావరకు ప్లస్ అవ్వనుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే రాజమౌళి ఈ మూవీ కోసం అహర్నిశలు కష్టపడుతున్నాడు.
గతంలో ఆయన చేసిన సినిమాల కంటే కూడా ఈ సినిమాని చాలా ప్రస్టేజీయస్ గా తీసుకున్నాడు. ఎందుకంటే ఈ సినిమా పాన్ వరల్డ్ లో రిలీజ్ అవుతుంది. కాబట్టి ప్రపంచ స్థాయి ప్రేక్షకుల ముందు మనం తగ్గకూడదనే ఉద్దేశ్యంతో వాళ్ళందర్నీ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాని చేస్తున్నట్టుగా తెలుస్తుంది…
