Homeక్రీడలుక్రికెట్‌RCB IPL trophy hopes: అతడు జట్టులో ఉన్నాడు.. రాసి పెట్టుకోండి ఐపీఎల్ ట్రోఫీ బెంగళూరు...

RCB IPL trophy hopes: అతడు జట్టులో ఉన్నాడు.. రాసి పెట్టుకోండి ఐపీఎల్ ట్రోఫీ బెంగళూరు దే..

RCB IPL trophy hopes: దాదాపు 18 సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ లభించింది. 2025 సీజన్లో బెంగళూరు ఐపిఎల్ విజేతగా నిలిచింది. ఈ సీజన్లో కూడా బెంగళూరు ఫైనల్ వెళ్లిపోయింది. క్వాలిఫైయర్ మ్యాచ్లో గుజరాత్ జట్టు మీద అద్భుతమైన విజయం సాధించి.. బెంగళూరు వరుసగా రెండవ సీజన్లో కూడా ఫైనల్ వెళ్లిపోయి సరికొత్త చరిత్ర సృష్టించింది. బెంగళూరులో విరాట్ కోహ్లీ నుంచి మొదలు పెడితే కృనాల్ పాండ్యా […]

RCB IPL trophy hopes: దాదాపు 18 సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ లభించింది. 2025 సీజన్లో బెంగళూరు ఐపిఎల్ విజేతగా నిలిచింది. ఈ సీజన్లో కూడా బెంగళూరు ఫైనల్ వెళ్లిపోయింది. క్వాలిఫైయర్ మ్యాచ్లో గుజరాత్ జట్టు మీద అద్భుతమైన విజయం సాధించి.. బెంగళూరు వరుసగా రెండవ సీజన్లో కూడా ఫైనల్ వెళ్లిపోయి సరికొత్త చరిత్ర సృష్టించింది. బెంగళూరులో విరాట్ కోహ్లీ నుంచి మొదలు పెడితే కృనాల్ పాండ్యా వరకు అద్భుతమైన ప్లేయర్లు ఉన్నారు. వీరంతా సూపర్ బ్యాటింగ్ తో ఆకట్టుకుంటున్నారు.

బెంగళూరు ఈసారి కూడా ట్రోఫీ సాధిస్తుందని అంచనాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ జట్టు ఆడుతున్న తీరు అలా ఉంది మరి. ప్రతి మ్యాచ్లో కూడా వీరోచితమైన పోరాటం చేస్తోంది బెంగళూరు. ఫలితంగా ఏకపక్ష విజయాలు సాధిస్తూ సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. అయితే బెంగళూరులో మిగతా ఆటగాళ్లు ఎలా ఉన్నప్పటికీ.. జోష్ హేజిల్ వుడ్ ఉంటే చాలు ట్రోఫీ ఆ జట్టు సొంతమవుతుందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆస్ట్రేలియా బౌలర్ హేజిల్ వుడ్ జట్లకు లక్కీ చాం లాంటివాడని గణాంకాలు చెబుతున్నాయి. వైట్ బాల్ ఫార్మేట్ లో అతడు ప్రాతినిధ్యం వహించిన జట్లు ఇప్పటివరకు ఫైనల్ మ్యాచ్లలో ఓడిపోలేదు.

2010లో అండర్-19 వరల్డ్ కప్ ను ఆసీస్ సొంతం చేసుకుంది. 2012లో సిఎల్ టి20 టోర్నీలో సిడ్నీ సిక్సర్స్ విజయం సాధించింది. 2015లో వన్డే వరల్డ్ కప్ ను కంగారు జట్టు సొంతం చేసుకుంది. 2020లో బిబిఎల్ టోర్నీలో సిడ్నీ సిక్సర్స్.. 2021లో చెన్నై సూపర్ కింగ్స్.. 2021 టి20 వరల్డ్ కప్ లో కంగారు జట్టు.. 2023లో వన్డే వరల్డ్ కప్ లో మళ్లీ కంగారు జట్టు సొంతం చేసుకున్నాయి.. 2025 ఐపీఎల్ ఫైనల్ లో బెంగళూరు గెలుపును అందుకుంది. ఈ జట్లు ఫైనల్ లలో ట్రోఫీలు గెలవడంలో హేజిల్ వుడ్ కీలకపాత్ర పోషించాడు. అయితే ఐపీఎల్ ఫైనల్ లో కూడా ఈసారి కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని కన్నడ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఒకవేళ గనుక బెంగళూరు విషయంలో అతడు కీలకపాత్ర పోషిస్తే.. ఇక తిరుగు ఉండదు. అంతేకాదు అతడి క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం నమోదు అవుతుంది.

ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో హేజిల్ వుడ్ విపరీతంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. బంతిని వైవిద్యంగా ఎలా వేయాలో నేర్చుకుంటున్నాడు. అంతేకాదు మైదానంలో పరుగులు పెడుతూ సరికొత్తగా సాధన చేస్తున్నాడు. ఫైనల్ మ్యాచ్లో హేజిల్ వుడ్ చుక్కలు చూపించడం ఖాయమని బెంగళూరు అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper