Home Blog Page 199

ఏపీలోని ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

AP Weather Update
AP Weather Update

AP Weather Update: ఏపీలో భిన్న వాతావరణం కనిపిస్తోంది. ఇంకా ఎండల తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఇదే పరిస్థితి ఉంది. అదే సమయంలో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో చల్లటి గాలులు వియడం ప్రారంభించాయి. గత వారంతో పోల్చితే ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టాయి. వడగాలుల తీవ్రత తగ్గింది. మరోవైపు చాలా ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. దీంతో వర్షాకాలం ప్రవేశించినట్టు అర్థం అవుతోంది. అయితే ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం అవుతోంది. వర్షాలు అనుకున్న స్థాయిలో పడడం లేదు. కానీ ఇప్పుడు ఓపరితల ఆవర్తనం ప్రభావంతో చిరుజల్లుల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

* సంక్రాంతి తర్వాత నుంచి..
ఈ ఏడాది సంక్రాంతి తర్వాత నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతూ వచ్చాయి. మార్చి రెండో వారం నుంచి విపరీతమైన ప్రభావం చూపడం ప్రారంభించాయి. ఏప్రిల్ లో ఎండలు మండిపోయాయి. మేనాటికి విశ్వరూపం చూపాడు భానుడు. ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు దాటాయి. రాయలసీమ అయితే మండిపోయింది. కోస్తాంధ్రతో పాటు ఉత్తరాంధ్రలో కూడా ఎండల ప్రభావం అధికంగా ఉంది ఈ ఏడాది. ఓ వారం రోజులపాటు 45 డిగ్రీలకు పైగా అన్నిచోట్ల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కానీ గత రెండు రోజులుగా చల్లటి వాతావరణం నెలకొంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో చిరుజల్లుల గురించి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ చెబుతోంది.

* ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తాంధ్రతో పాటు ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ప్రధానంగా అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడవచ్చని అంచనాలు వెల్లడించింది వాతావరణ శాఖ. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతుందని చెబుతోంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరిస్తోంది. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేసింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. వర్షం పడిన సమయంలో చెట్లు, టవర్లు, స్తంభాల వద్ద నిల్చో వద్దని సూచిస్తోంది. పశువుల పెంపకం దారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది.

అమరావతి రైతులు నిజంగా జగన్ ను కలిశారా?!

YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాల విన్యాసాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఇప్పుడు అమరావతి రైతుల ద్వారా సరికొత్త గేమ్ ఆడాలని చూస్తున్నారు. కానీ అది వర్కౌట్ అయ్యేలా లేదు. నిన్ననే అమరావతి రైతులు జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అయితే ఇందులో ఆశ్చర్యం ఉంది. ఎందుకంటే ఇదే అమరావతి రైతులు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా గళం ఎత్తారు. వారి ఉద్యమాన్ని సైతం ఉక్కు పాదంతో అణచివేయాలని జగన్మోహన్ రెడ్డి చేయని ప్రయత్నం అంటూ లేదు. అటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గరకు అమరావతి రైతులు వెళ్లడం ఏంటనేది ఇప్పుడు ప్రశ్న. కచ్చితంగా దీని వెనుక రాజకీయం ఉంటుంది అనేది ఒక అనుమానం. కానీ కూటమికి వ్యతిరేకంగా రాజకీయం చేయాలి కాబట్టి కొంతమంది అమరావతి రైతులను తీసుకొచ్చి కూటమి ప్రభుత్వంపై ఒక వ్యతిరేకత తేవాలన్న ప్రయత్నం కనిపిస్తోంది.

* కొద్దిమంది రైతుల విముఖత..
అమరావతిలో రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం నిర్ణయించింది. రైతుల వద్ద నుంచి భూమిని సేకరించింది కూడా. అయితే అతి కొద్ది మంది రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. సిఆర్డిఏ తీరుపై వారు అసంతృప్తితో ఉన్నారు. ఇది తెలుసుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ అధినేత జగన్మోహన్ రెడ్డి వద్దకు వస్తే ఈ సమస్యను లేవనెత్తి ప్రభుత్వం పరిష్కారం చేసేలా చూస్తారని నమ్మబలికారు. అయితే వారి ప్రయత్నం కొంతవరకు మాత్రమే వర్కవుట్ అయింది. ఎందుకంటే అలా భూములు ఇవ్వని మెజారిటీ రైతులు అసలు జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు ఇష్టపడలేదు. రైతులు మరీ తక్కువ రావడంతో వైసీపీ నేతలను రైతు ముసుగు వేసి జగన్మోహన్ రెడ్డి వద్ద కూర్చోబెట్టారు. జగన్మోహన్ రెడ్డి ఏవేవో వారికి హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

* ఆ ఛాన్స్ ఉందా
అసలు అమరావతి వద్దు అన్న జగన్మోహన్ రెడ్డి వద్దకు రైతులు వెళ్తారా? అలా వెళ్ళిన వారు ఏ ప్రలోభాలకు లోనై వెళ్లి ఉంటారో ఇట్టే అర్థం అవుతుంది. ఎందుకంటే అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నది.. ఇప్పుడు చేయాలనుకున్నది జగన్మోహన్ రెడ్డి. ఒకవైపు వేలకోట్ల రూపాయలతో అమరావతి రాజధాని నిర్మాణం పనులు జరుపుతుంటే మావిగన్ అని ప్రతిపాదనలు తెచ్చారు. ఇప్పటికీ అమరావతి పై కుట్రలు చేస్తూనే ఉన్నారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి వద్దకు అమరావతి రైతులు వెళ్లారంటే అది నమ్మశక్యం కాదు. అమరావతిని వ్యతిరేకించడమే కాదు రైతులను పెయిడ్ ఆర్టిస్టులతో పోల్చారు. ఇప్పుడు ఆ పెయిడ్ ఆర్టిస్టులతోనే భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అమరావతి రైతులకు. జగన్మోహన్ రెడ్డి వైఖరి తెలిసిన ఏ అమరావతి రైతు కూడా ఆయనను కలిసేందుకు ఇష్టపడరు. కానీ భూముల సేకరణ విషయంలో ప్రభుత్వం తమను ఇబ్బంది పెట్టిందని భావిస్తున్న వారు సైలెంట్ గా ఉంటారే తప్ప.. జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు మాత్రం ఇష్టపడరు. కానీ అమరావతి రైతులు కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారని చెప్పేందుకు చేసిన ప్రయత్నం గా అర్థం అవుతోంది. అంతకుమించి ఏమీ కనిపించడం లేదు కూడా ఇందులో.

వైసిపి నేతల డిఎస్సీ అభ్యర్థులు!

YSRCP DSC Campaign
YSRCP DSC Campaign

YSRCP Leaders DSC Candidates: సోషల్ మీడియా యుగం ఇది. సమాజంలో ఏ తప్పు జరిగిన క్షణాల్లో తెలిసిపోతుంది. ఫ్యాక్ట్ చెక్ సైతం క్షణాల్లో వాలిపోతుంది. సమాజంలో తప్పుడు ప్రచారంతో ముందుకెళ్తామంటే కుదిరే పని కాదు. ఇప్పుడు అటువంటి పనిలోనే ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఉన్నఫలంగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత రావాలి. కూటమిలోని మూడు పార్టీలు విడిపోవాలి. కూటమి ప్రభుత్వంలో వైఫల్యాలు పెద్ద ఎత్తున బయటపడి ప్రజలు తిరస్కరించాలి. ఆ ఆలోచన తప్ప వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఆలోచన లేదు. ఈ క్రమంలో ఆ పార్టీ తప్పు మీద తప్పు చేస్తూనే ఉంది. తాజాగా డీఎస్సీ 2025 పై కూడా అదే మాదిరిగా విషప్రచారం చేస్తోంది.

* గత ఏడాది ఉపాధ్యాయ నియామకాలు..
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. సీఎం చంద్రబాబు తొలి ఫైల్ గా డీఎస్సీ నోటిఫికేషన్ పై సంతకం పెట్టారు. అందుకు తగ్గట్టుగానే ఏడాది వ్యవధిలో 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారు. వారి నియామకం జరిగి ఏడాది పూర్తవుతోంది. కానీ ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డీఎస్సీలో అక్రమాలు జరిగాయని.. పేపర్ లీకేజ్ జరిగిందని.. వివరాలు వెబ్సైట్లో డిలీట్ చేశారని ఆరోపిస్తూ రాష్ట్రస్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది. దీనిపై ప్రభుత్వంతో పాటు విద్యాశాఖ ఉన్నతాధికారులు సుదీర్ఘ వివరణ ఇచ్చారు. పేపర్ లీకేజీ, రిజర్వేషన్ల ప్రకారం నియామకాలు, రాంకర్ల విషయంలో అనుసరించిన తీరు, రోస్టర్ పద్ధతి వంటి వాటిపై పూర్తి స్పష్టతనిచ్చారు. అయినా సరే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అదేపనిగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

* కేవలం గందరగోళానికి..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచనతో ముందుకు వెళ్తోంది. పోతే 16 వేల కుటుంబ ఓట్లు.. వస్తే ఆరు లక్షల కుటుంబాల ఓట్లు అన్నట్టు ఆ పార్టీ రాజకీయం నడుస్తోంది. ఈ క్రమంలో డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన అంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తోంది. కానీ డీఎస్సీ అభ్యర్థుల ముసుగులో ఉన్నది వైసీపీ నేతలే. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం వారే. ఇప్పుడు ఎక్కడికి అక్కడ ఆ నిజం బయటకు వస్తోంది. పార్టీలో యాక్టివ్ గా ఉన్న వారిని డీఎస్సీ అభ్యర్థులుగా చూపి వారితో మాట్లాడిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్లు చేయిస్తున్నారు. దీంతో ఇప్పుడు అడ్డంగా బుక్ అవుతున్నారు. గతంలో 2014 నుంచి 2019 వరకు ఇటువంటి ప్రచారం చేశారు. అందుకే ఇప్పుడు ఎంత మాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం తరఫున ఫ్యాక్ట్ చెక్ రంగంలోకి దిగుతోంది. మరోవైపు అనుకూల సోషల్ మీడియా కూడా రంగ ప్రవేశం చేసింది. దీంతో వైసిపి ప్రయత్నాలు బట్టబయలు అవుతున్నాయి.

వైయస్సార్ పై పవన్ ద్వేషం.. మధ్యలో జగన్!

Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో వైరం ఉందనే చెప్పాలి. నిన్న హైదరాబాద్ ప్రెస్మీట్లో కూడా రాజశేఖర్ రెడ్డి విషయాన్ని ప్రస్తావించారు. ఆయన మూలంగానే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఆయన తమను ఇబ్బంది పెట్టారని.. అందుకే ఇంతటి వ్యతిరేకత అన్నట్టు సంకేతాలు ఇచ్చారు పవన్ కళ్యాణ్. 2004 నుంచి 2010 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు రాజశేఖర్ రెడ్డి. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేశారు మెగాస్టార్ చిరంజీవి. అయితే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. ఆ సమయంలో చిరంజీవి కుటుంబానికి బెదిరింపులు వచ్చి ఉంటాయి. అదే సమయంలో కొన్ని రకాల కుటుంబ వివాదాలు కూడా జరిగాయి. తప్పకుండా ఆ సమయంలోనే ఏదో జరిగి ఉంటుంది. దానిని ప్రస్తావించిన పవన్ రాజశేఖర్ రెడ్డి తీరు వల్లే తాను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

* బెదిరింపుల పర్వం..
రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కోసం 25 సంవత్సరాల పాటు వేచి చూశారు. 2004లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటివరకు ఒక ఎత్తు.. అప్పటినుంచి ఒక ఎత్తు అన్నట్టు పరిస్థితి మారింది. విపరీతమైన సంక్షేమ పథకాలతో ఆయన ప్రజామోదం పొందారు. అయితే ఈ క్రమంలో రాజకీయ ప్రత్యర్థులను బెదిరించారు అన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో కొన్ని రకాల బెదిరింపులు వెళ్లినట్లు తెలుస్తోంది. అలాగే ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత.. ఎన్నికల్లో 70 లక్షల ఓట్లు సాధించిన పిఆర్పి కాంగ్రెస్లో విలీనం వెనుక కూడా రాజశేఖర్ రెడ్డి కుటిల ప్రయత్నాలు ఉన్నట్లు పవన్ కళ్యాణ్ లో ఒక అనుమానం ఉంది. పైగా సంక్షేమాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసిన వ్యవహారంపై కూడా పవన్ సీరియస్ గా ఉన్నారు. దాని పర్యవసానమే జగన్మోహన్ రెడ్డి పై ఆయన కోపం.

* అడ్డగోలు దోపిడీపై..
తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా దోపిడీకి పాల్పడ్డారు అనేది పవన్ కళ్యాణ్ లో ఉన్న అనుమానం. వైయస్ రాజశేఖర్ రెడ్డి పై ద్వేషం జగన్మోహన్ రెడ్డి పై కూడా కొనసాగించారు పవన్. అందుకే 2014 ఎన్నికల్లో పార్టీని స్థాపించి టిడిపికి మద్దతు తెలిపారు. 2019లో ప్రత్యేక పరిస్థితుల్లోనే ఒంటరి పోరాటానికి మొగ్గు చూపారు. 2024 లో మాత్రం పొత్తు కోసం అహర్నిశలు శ్రమించారు. ఇప్పుడు కూటమి 15 ఏళ్ల పాటు ఏపీలో కొనసాగుతుందని కుండబద్దలు కొట్టి చెబుతున్నారు. వైయస్ పై ఉన్న ద్వేషం జగన్మోహన్ రెడ్డి పై కొనసాగిస్తున్న పవన్.. కూటమి విచ్చిన్నానికి జరుగుతున్న ప్రయత్నాన్ని కూడా అడ్డుకుంటున్నారు. మొత్తానికైతే పవన్ ద్వేషం ఈనాటిది కాదన్నమాట జగన్ పై.

తానా మిడ్ అట్లాంటిక్ బ్లడ్ డ్రైవ్‌కు విశేష స్పందన

TANA Mid Atlantic Blood Drive
TANA Mid Atlantic Blood Drive

TANA Mid Atlantic Blood Drive: ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం – 40 మందికిపైగా దాతల భాగస్వామ్యం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ బృందం ఆధ్వర్యంలో ప్రముఖ నటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 103వ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. మే 31న ఎక్స్‌టాన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 40 మందికిపైగా రక్తదాతలు పాల్గొని సామాజిక బాధ్యతను చాటుకున్నారు.

TANA Mid Atlantic Blood Drive
TANA Mid Atlantic Blood Drive

ఈ రక్తదాన శిబిరాన్ని తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాణాలను కాపాడే రక్తదానం అత్యంత గొప్ప సేవ అని పేర్కొన్నారు. 40 మందికిపైగా దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన తానా మిడ్ అట్లాంటిక్ బృందం, రీజినల్ రిప్రజెంటేటివ్ ఫణి కంతేటి, స్వచ్ఛంద సేవకులు మరియు రక్తదాతలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

అదేవిధంగా 50 సార్లకు పైగా రక్తదానం చేసి అరుదైన మైలురాయిని చేరుకున్న రంజిత్ కోమటిని ఘనంగా సత్కరించారు. సమాజ సేవలో ఆయన చూపుతున్న నిబద్ధత అందరికీ ఆదర్శమని కొనియాడారు.

తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి కూడా మిడ్ అట్లాంటిక్ బృందం చేపట్టిన ఈ సేవా కార్యక్రమాన్ని ప్రశంసించారు. ముఖ్యంగా మొదటిసారిగా రక్తదానం చేసిన యువత ముందుకు రావడం సంతోషకర పరిణామమన్నారు.

కార్యక్రమానికి వేదికను ఉచితంగా అందించిన వేణు సంగనికి, అలాగే నిర్వహణలో సహకరించిన బ్లడ్ బ్యాంక్ ఆఫ్ డెల్మార్వా బృందానికి తానా నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ బ్లడ్ డ్రైవ్‌కు స్ప్రూస్ ఇన్ఫోటెక్ గ్రాండ్ స్పాన్సర్‌గా వ్యవహరించగా, టెస్లా రియాల్టీ గ్రూప్, తనిష్క్ యూఎస్ఏ, చు ఫైనాన్షియల్ సర్వీసెస్, ఓక్స్టన్, స్ప్రింగ్ ఈగిల్స్, రియల్ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ వారణాసి సంస్థలు ప్రీమియం స్పాన్సర్లుగా మద్దతు అందించాయి.

ఈ కార్యక్రమంలో సురేష్ యలమంచి, భవాని క్రొత్తపల్లి, శైలజ కస్తూరి, సరోజ పావులూరి, విశ్వనాథ్ కోగంటి, రంజిత్ మామిడి, శ్రీధర్ సాదినేని, శ్రీనివాస్ అబ్బూరి, హరి, గౌరి కర్రోతు, నాగరాజ్, కోటి యాగంటి, శ్రీకాంత్ గుడూరు, ప్రసాద్ కునారపు, రమణ కోత, మధు నల్ల తదితరులు పాల్గొన్నారు.

ఈ రాశుల వారికి ఈరోజు అద్భుతమైన ధన అవకాశం..

Today 21 July 2026 Horoscope
Today 21 July 2026 Horoscope

Today 3 June 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అద్భుతమైన అవకాశాలు ఉండలున్నాయి. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారి జీవితం ఈరోజు సంతోషంగా గడుస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులకు ఆకస్మిక ధన లాభం ఉంటుంది. ఉద్యోగులు అనుకున్న సమయానికి ప్రాజెక్టులను పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఎవరికైనా డబ్బు ఇచ్చేముందు ఆలోచించాలి. దీర్ఘ కాలిక దృష్టిని పెట్టుకొని కొత్తగా పెట్టుబడులు పెడతారు. అయితే ఈ సమయంలో పెద్దలను సంప్రదించడం మంచిది. ఉద్యోగులకు అనుకోకుండా అపారమైన ప్రయోజనాలు ఉంటాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ప్రియమైన వారి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. కొత్తగా ప్రాజెక్టులను ప్రారంభించే అవకాశం ఉంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్తగా ప్రాజెక్టులను చేపట్టేవారు పెద్దలను సంప్రదించడం మంచిది. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు ఆర్థికపరమైన విషయాల్లో అన్ని విజయాలు సాధిస్తారు. వ్యాపారులు ప్రత్యర్థులపై కన్నేసి ఉంచాలి. గ్రహాల అనుకూలతతో అన్నిట్లోనూ విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారి ఇంట్లో ఈరోజు శుభప్రదం గా ఉంటుంది. అనుకోకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయాల్లో ఉండే వారికి ప్రజల నుంచి మద్దతు ఏర్పడుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కొత్తగా వస్తువులు కొనే సమయంలో నాణ్యతను దృష్టిలో ఉంచుకోవాలి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు అపారమైన అవకాశాలు అందుతాయి. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త విషయాలు తెలుసుకోవాలని అనుకునే వారికి కీలక సమాచారం అందుతుంది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందుతాయి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : తులా రాశి వారు ఈరోజు ఆర్థికంగా ప్రణాళికతో ముందుకు వెళ్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. శుక్రుడి అనుగ్రహం వల్ల ఈ రాశి వారికి ఈ రోజు అన్ని శుభ ఫలితాలే ఉంటాయి. ఆసక్తిని బట్టి అవకాశాలు ఉంటాయి. ఇతరులకు దానధర్మాలు చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు తోటి వారి నుంచి మద్దతు ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. స్నేహితుల సహకారంతో అప్పుల నుంచి బయటపడతారు. అనుకోకుండా కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని శుభ ఫలితాలే ఉంటాయి. బంధువులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య భావోద్వేగాలు ఏర్పడతాయి. మానసికంగా సంతృప్తిగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే గురువుల మద్దతు ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు కొత్త అవకాశాలు వస్తాయి. అధికారుల నుంచి మద్దతు ఉండడంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు అపారమైన అవకాశాలు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షల్లో రాణించడానికి కష్టపడాల్సి వస్తుంది కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. బంధువుల నుంచి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు ప్రతికూలమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఉద్యోగులకు మెరుగైన ఫలితాలు ఉంటాయి. కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మానసికంగా గందరగోళం ఉంటుంది. ఇలాంటి సమయంలో ఓపికతో వ్యవహరించాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

అనంతిక.. నీ అందాలు చూడలేమిక..

Ananthika Sanilkumar Looks Pretty
Ananthika Sanilkumar Looks Pretty

బెంగాల్ పోయింది.. ఇప్పుడు టీఎంసీ కూడా.. పాపం మమత

Mamata Banerjee
Mamata Banerjee

Mamata Banerjee: బెంగాల్ రాష్ట్రంలో 15 సంవత్సరాలు పాటు మమతా బెనర్జీ అప్రతిహతంగా పరిపాలన సాగించారు. ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం లేకుండా చేశారు. దాడులతో భయపెట్టారు. కేసులతో చుక్కలు చూపించారు. మమత అండదండలు.. ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఇష్టారాజ్యంతో బెంగాల్ మొత్తం 15 సంవత్సరాలపాటు అట్టుడికి పోయింది.

ఇన్నాళ్లకు జనాల్లో చైతన్యం వచ్చి.. మమత ప్రభుత్వాన్ని సాగనంపారు. చివరికి మమతను కూడా ఓడించారు. అక్కడితోనే ఆగిపోవడం లేదు.. ఇన్నాళ్లపాటు తమ హింసించిన టీఎంసీ నేతలకు బెంగాల్ ప్రజలు గట్టిగానే బుద్ధి చెబుతున్నారు. ఇటీవల మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని ఉరికించి కొట్టారు. దీనిని బట్టి బెంగాల్ ప్రజల్లో టీఎంసీ మీద ఏ స్థాయిలో ప్రజలలో ఆగ్రహం ఉందో అర్థం చేసుకోవచ్చు.

బెంగాల్ లో టీఎంసీను ఓడించడం.. మమతాను ఓడించడం.. అభిషేక్ బెనర్జీని కొట్టడం.. ఇవన్నీ కూడా ఇటీవల జరిగిపోయాయి. ఇప్పుడు బెంగాల్ రాష్ట్రంలో మరోపరిణామం చోటు చేసుకుంది. ఆ పార్టీలో దాదాపు 50 మంది శాసనభ సభ్యులు వ్యతిరేక స్వరం వినిపిస్తున్నట్టు తెలుస్తోంది. టీఎంసీలో బహిష్కృత నేతగా కొనసాగుతున్న రితబ్రత్ బెనర్జీ వద్దకు అసంతృప్తి నేతలు మొత్తం వెళ్లినట్టు తెలుస్తోంది. వీరంతా కూడా ఇప్పటికే కోల్కతాలో అనేక పర్యాయాలు రహస్యంగా సమావేశం నిర్వహించినట్లు సమాచారం. ఈ విషయాన్ని గుర్తించిన మమత ఇటీవల కీలక సమావేశం నిర్వహిస్తే.. చాలామంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదు.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో టిఎంసి కి ఇటీవల ఎన్నికల్లో80 స్థానాలు వచ్చాయి.. వారిలో ఇప్పుడు మూడో వంతు మంది దాకా తిరుగుబాటు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇవే గనుక నిజమైతే మమతకు కష్టాలు మొదలైనట్టు. అంతేకాదు వారంతా కూడా పార్టీ పేరు మీద.. ఎన్నికలలో గుర్తు మీద పోరాటం సాగిస్తే మమత మరింత ఇబ్బందుల్లో పడక తప్పదు. ఈ పరిణామాలు టిఎంసి భవిష్యత్తు మీద తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం కల్పిస్తోంది.

అప్పట్లో మమతా బెనర్జీ రిజు దత్త అనే నాయకుడిని సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఆయన అకస్మాత్తుగా వెలుగులోకి వచ్చారు.. తమ పార్టీకి సంబంధించిన యాభై మంది ఎమ్మెల్యేలు ఏకమయ్యారని.. వారంతా కూడా హోటల్లో సమావేశం అయ్యారని అన్నారు. మావద్ద మూడింట రెండు వంతుల మెజారిటీ ఉందని ఆయన స్పష్టం చేశారు. బెంగాల్ రాష్ట్రంలో మహారాష్ట్ర తరహాలోనే రాజకీయాలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.

పవన్ కళ్యాణ్ ప్రభావం తెలంగాణాలో 'పెద్ది ' పై పడనుందా..? చివరి నిమిషం లో ఊహించని ట్విస్ట్..

Ram Charan Peddi Collections
Ram Charan Peddi Collections

Ram Charan Peddi Movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ మూవీ రేపు ప్రీమియర్ షోస్ తో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సినిమా పై రామ్ చరణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు , ఇతర హీరోల అభిమానులు కూడా అంచనాలు భారీ రేంజ్ లో పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ చిత్రం నుండి విడుదలైన ప్రతీ కంటెంట్ బాంబు లెక్క పేలింది. ఈ స్థాయి కంటెంట్ ఈమధ్య కాలం లో ఏ స్టార్ హీరో సినిమాకు కూడా పడలేదు. సినిమా కూడా ప్రమోషనల్ కంటెంట్ కి తగ్గట్టుగానే , అద్భుతంగా ఉంటుందని , రామ్ చరణ్ కి మరో రంగస్థలం లాంటి సినిమా రాబోతుందని అందరూ బలంగా నమ్ముతున్నారు. అయితే ఈ సినిమాకు తెలంగాణ లో టికెట్ హైక్స్ దొరుకుతుందా లేదా అనే అంశంపై ఇప్పటికీ క్లారిటీ రాకపోవడం గమనార్హం.

కాసేపటి క్రితమే తెలంగాణ లో పెద్ది చిత్రానికి టికెట్ రేట్స్ పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందంటూ సోషల్ మీడియా లో ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు టికెట్ రేట్స్ రావడం కష్టమే అని అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణ లో అలాంటి రాజకీయ పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి. గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ పై కొంతమంది విశ్లేషకులు టార్గెట్ చేసి ఆరోపణలు చేయడం , దానికి పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇస్తే తెలంగాణ సెంటిమెంట్ ని తెరమీదకు తీసుకొని రావడం వంటివి జరిగాయి. దీంతో పవన్ కళ్యాణ్ నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా , జనసేన తెలంగాణ క్యాడర్ కోసం, ఒక ప్రత్యేకమైన మీటింగ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ని నిర్వహించబోతున్నాను అని ఒక సంచలన ప్రకటన చేసి , నేడు సాయంత్రం ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి , తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఏకిపారేసాడు .

దీంతో ప్రభుత్వం లో ఉన్న కాంగ్రెస్ పార్టీ , రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ కుటుంబానికి చెందిన వాడు కాబట్టి, ఆయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది ‘ కి టికెట్ రేట్స్ , ప్రీమియర్స్ షోస్ లకు అనుమతి నిరాకరించిందని ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కారణంగానే కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్స్ పెంచుకోవడానికి పెద్ది టీం కి ఇప్పటికే అనుమతి ఇచ్చేసిందని , కానీ నేడు తెలంగాణ లో హాలిడే కాబట్టి , జీవో అధికారికంగా విడుదల అవ్వలేదని, రేపు ఉదయం లోపు జీవో వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఇందులో ఎంత మాత్రం నిజముందో తెలియాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే.

USA లో 'అజ్ఞాతవాసి' కూడా దాటలేకపోయిన 'పెద్ది'.. ఘోరమైన అవమానమే ఇది..

Peddi Overseas Collections
Peddi Overseas Collections

Peddi Overseas Collections: నేటి తరం స్టార్ హీరోల్లో మాస్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల జాబితా తీస్తే అందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పేరు కచ్చితంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు . అందుకు ముఖ్య కారణం ఆయన చేసిన సినిమాలే. మొదటి సినిమా నుండి ఆయన సినిమాలన్నీ ఎక్కువగా మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూనే తెరకెక్కాయి. అయితే రామ్ చరణ్ కి ఉన్నటువంటి ఊర మాస్ ఇమేజ్ , ఆయనకీ అర్బన్ సెంటర్స్ లో ఓపెనింగ్స్ ని తీసుకొని రావడానికి నెగెటివ్ గా మారుతుందా అంటే అవుననే చెప్పాలి. ముఖ్యంగా నైజాం , ఓవర్సీస్ ప్రాంతాల్లో రామ్ చరణ్ సినిమాలకు మొదటి నుండి ఓపెనింగ్స్ లో చాలా బలమైన ప్రభావం పడుతూనే ఉంది. ఇప్పుడు ‘పెద్ది’ చిత్రం తో మరోసారి రుజువు అయ్యింది.

రామ్ చరణ్ కెరీర్ లోనే విపరీతమైన హైప్ , క్రేజ్ ని ఏర్పాటు చేసుకున్న చిత్రమిది. కానీ ఓవర్సీస్ లో మాత్రం చాలా దారుణమైన ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోబోతుంది. విడుదలకు ముందు ఈ సినిమాకు ఉన్నటువంటి హైప్ ని చూసి , కచ్చితంగా ఈ చిత్రం కూడా నార్త్ అమెరికా లో ఓజీ , దేవర, కల్కి , సలార్ రేంజ్ ఓపెనింగ్ ని సొంతం చేసుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే గేమ్ చేంజర్, హరి హర వీరమల్లు , రాజా సాబ్ రేంజ్ ఓపెనింగ్ ని సొంతం చేసుకోబోతుంది. ఈ స్థాయి హైప్ ఉన్న సినిమాకు ఇలాంటి ఓపెనింగ్ అవమానకరం అనే చెప్పొచ్చు. 2018 వ సంవత్సరం లో విడుదలైన పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ చిత్రం నార్త్ అమెరికా లో సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. దాదాపుగా 1.6 మిలియన్ డాలర్ల గ్రాస్ ని ప్రీమియర్ షోస్ నుండి రాబట్టి సంచలనం సృష్టించింది.

ఇప్పుడు ఈ కలెక్షన్స్ ని కూడా అందుకోవడం చాలా కష్టమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ‘పెద్ది’ కి ఓవర్సీస్ లో ఈ రేంజ్ దెబ్బ పడడానికి ముఖ్య కారణం , రామ్ చరణ్ నుండి ఈమధ్య కాలం లో సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేకపోవడం వల్లే. ‘రంగస్థలం’ తర్వాత #RRR ని మినహాయించి, విడుదలైన ప్రతీ రామ్ చరణ్ సినిమా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. #RRR చిత్రం లో రామ్ చరణ్ మెయిన్ హీరో అయినప్పటికీ, దాని క్రెడిట్ మొత్తం రాజమౌళి కే వెళ్ళింది. ప్రస్తుతం ఓవర్సీస్ లో ఒక సినిమాకు భారీ రేంజ్ లో ఓపెనింగ్ పడాలంటే, కచ్చితంగా క్రెడిబిలిటీ చాలా ముఖ్యం, అదే పెద్ది పై ప్రభావం చూపించింది, కానీ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం , ఈ చిత్రం అనకాపల్లి నుండి అమెరికా వరకు సెన్సేషనల్ రికార్డ్స్ ని సొంతం చేసుకుంటుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.

ఐపీఎల్ రేటింగ్స్ పెంచడానికి ఆ పనులు చేసేవాళ్లం.. అసలు నిజం బయటపెట్టిన లలిత్ మోడీ

Lalit Modi
Lalit Modi

Lalit Modi: ఐపీఎల్ జరుగుతున్నప్పుడు.. మైదానంలో కంటే మైదానం వెలుపల రకరకాల వ్యవహారాలు సాగుతూ ఉంటాయి. ఇవి బయటపడినప్పుడు మీడియాలో రకరకాల కథనాలు వస్తూ ఉంటాయి. అప్పుడు వాటి మీద ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. ఇంకా ఏదో జరుగుతోంది.. ఇంకా ఏదో ఉంది అన్న చర్చ నడుస్తుంది. అప్పుడు ఐపీఎల్ గురించి అందరిలోనూ ఒక ఆసక్తి మరింత పెరుగుతుంది. అందువల్లే indian premier league మిగతా లీగ్ ల కంటే ఎక్కువగా ఆదరణ పొందింది.

2008లో ప్రారంభమైన ఐపీఎల్ ఇప్పటివరకు కూడా ఈ స్థాయిలో ఆదరణ సొంతం చేసుకుంటున్నదంటే దానికి ప్రధాన కారణం ఇటువంటి వ్యవహారాలే. అయితే ఈ సంఘటనలు యాదృచ్ఛికంగా జరిగినవి కాదు. ప్రణాళిక ప్రకారం చోటుచేసుకున్నవి. ముందుగానే ఒక ప్లాన్ రూపొందిస్తారు. వాటి ఆధారంగా సంఘటనలు జరిగేలాగా క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత వాటిని మీడియాలో వ్యాప్తి చేస్తారు. అనంతరం ఐపీఎల్ మీద హైప్ పెంచుతారు. ఇదేమి ఆరోపణ కాదు. విమర్శ అంతకంటే కాదు.. ఈ మాటలు అన్నది మరెవరో కాదు ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోడీ.

ఆర్థిక కేసులలో నేపథ్యంలో లలిత్ విదేశాల్లో ఉంటున్నారు. అప్పుడప్పుడు ఇంటర్వ్యూల ద్వారా సంచలన విషయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా ఐపీఎల్ గురించి ఆయన కీలక విషయాన్ని బయటపెట్టారు. తద్వారా ఐపీఎల్ వెనక ఏముందో అందరికీ తెలిసేలా చెప్పారు.”ఐపీఎల్ రేటింగ్ లు పెంచడానికి మేము చాలా చేసేవాళ్లం. ఏదో ఒక విషయాన్ని క్రియేట్ చేసి.. దానికి విపరీతమైన హైప్ వచ్చేలా చేసేవాళ్లం. దీనివల్ల ఐపిఎల్ రేటింగ్స్ పెరిగేవి. దాంతో ఆదాయం విపరీతంగా వచ్చేది. అప్పట్లో ఓ దక్షిణాఫ్రికా ఆటగాడికి.. చీర్ లీడర్. తో సంబంధం క్రియేట్ చేసాం. ఆ తర్వాత అతడిని ఆమె పెళ్లి చేసుకుంది..ఇప్పుడు వారు ఏం చేస్తున్నారో తెలియదు గాని.. ఆ ఎపిసోడ్ ద్వారా భారీగా చర్చ మొదలైంది. మేము అనుకున్న రేటింగ్స్ వచ్చేసాయి. ఇంతకంటే చెప్పాల్సింది ఏముందని” లలిత్ వ్యాఖ్యానించాడు.

ఇప్పుడే కాదు లలిత్ అనేక సందర్భాలలో ఐపీఎల్ గురించి రకరకాల వ్యాఖ్యలు చేశాడు. యాజమాన్యాలు జట్లను కొనుగోలు చేయడం.. ఆటగాళ్ల మీద భారీగా డబ్బులు ఖర్చు పెట్టడం.. ప్రసార హక్కులు.. ప్రకటనలు.. ఇతర వ్యవహారాల గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఐపీఎల్ అసలు రంగు బయటపడింది. ఐపీఎల్ రేటింగ్ గురించి లలిత్ ఇప్పుడు కీలక వ్యాఖ్యలు చేయడంతో.. అసలు నిజం వెలుగులోకి వచ్చింది.

విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై తమిళనాడులో అలా జరుగుతుంది..

CM Vijay
CM Vijay

CM Vijay: ప్రజల కోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకొని.. వాటిని అమల్లో పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ అలా చేసేవారెవరున్నారు.. ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇస్తుంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పక్కన పెడతారు. ప్రజల కోణంలో కాకుండా.. తమ కోణంలో ఆలోచిస్తుంటారు. అప్పుడు ఓట్లు వేసిన ప్రజలు చింతిస్తూ ఉంటారు. ఇటువంటి రాజకీయాలు మనదేశంలో చాలా సంవత్సరాల నుంచి సాగుతూనే ఉన్నాయి. ప్రత్యామ్నాయ పార్టీలు కూడా ఇలానే వ్యవహరిస్తూ ఉండడంతో జనాలు కూడా నమ్మకాన్ని కోల్పోయారు. ఏదో ఓట్లు వేసే పండుగ వచ్చినప్పుడు తమ హక్కును వినియోగించుకొని.. ఆ తర్వాత బాధపడుతున్నారు.

ఇటువంటి రాజకీయాలు సాగుతున్న దేశంలో అప్పుడప్పుడు దీప శిఖలాగా కొంతమంది వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తున్నారు. రాజకీయల స్వభావాన్ని పూర్తిగా మార్చేస్తున్నారు. అంతేకాదు తాము ఒక టార్చ్ బేరర్ లాగా మారిపోతున్నారు. ఈ జాబితాలో టీవీకే అధినేత విజయ్ మొదటి స్థానంలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇటీవల ఆయన ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు.. ప్రజలకు అమలు చేయగలిగే హామీలు మాత్రమే ఇచ్చారు. వాటిని అమలు చేసేందుకు కార్యాచరణ కూడా రూపొందించారు. కొన్నింటిని ఆల్రెడీ అమల్లో పెడుతున్నారు కూడా.

ఫీజులు వసూలు చేయడం కుదరదు

ఇకపై తమిళనాడులో ప్రభుత్వేతర విద్యాలయాలు విద్యార్థుల నుంచి ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయడం కుదరదు. ప్రభుత్వం నిర్దేశించిన విధానంలో మాత్రమే ఫీజులు స్వీకరించాలి. అదనంగా ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. అవసరమైతే గుర్తింపు కూడా రద్దు చేస్తుంది. కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడదు. ప్రభుత్వ వెబ్ సైట్ లలో నమో చేసిన విధంగానే ప్రైవేట్ విద్యాలయాలు ఫీజులు వసూలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ.. ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే ప్రభుత్వం ఎటువంటి చర్యలైనా తీసుకుంటుంది.

అధిక ఫీజు వసూళ్లపై ఫిర్యాదు

తమిళనాడు ఇటీవల ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజు వసూళ్లపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి విజయ్ ఈ వ్యవహారం పై సీరియస్ అయ్యారు.వెంటనే కీలక ప్రకటన చేశారు. ప్రైవేట్ విద్యాలయాల నిర్వాహకులు అధికంగా ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత ప్రభుత్వం హయాంలో ప్రైవేట్ విద్యాలయాలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేసేవని, అధికార పార్టీకి చెందిన వారి విద్యాలయాలే ఇందులో అధికంగా ఉన్నాయని.. అందువల్లే ఇటీవల ప్రభుత్వానికి అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని.. ముఖ్యమంత్రి విజయ్ నేరుగా స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నారని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఈ సమ్మర్ ను వాడుకాలేకపోయిన మేకర్స్... సినిమాల కళ లేకుండా పోయిందిగా...

Summer Releases
Summer Releases

Summer Releases: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు తమ హవాని కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కానీ రీతిలో గొప్ప విజయాలను సాధిస్తున్న మన స్టార్ హీరోలు ఇకమీదట కూడా అదే హవాని చూపించాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇక వాళ్ళకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను సంపాదించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు… ఒక సినిమాని చేయడం ఎంత ముఖ్యమో దాన్ని సరైన సమయంలో రిలీజ్ చేయడం కూడా అంతే ముఖ్యం… అయితే సమ్మర్లో స్టూడెంట్స్ అందరికీ హాలిడేస్ ఉంటాయి. కాబట్టి సినిమాలను రిలీజ్ చేస్తే ఎక్కువ మంది చూడడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఈ సమ్మర్ మాత్రం స్టార్ హీరోలు సినిమాలు ఏవి ప్రేక్షకులను అలరించలేదు. దానికి తోడుగా అసలు సినిమాలను రిలీజ్ చెయ్యలేదు. జూన్ 4వ తేదీన వస్తున్న ‘పెద్ది’ సినిమాను మినహాయిస్తే మిగిలిన ఏ సినిమా కూడా ఈ సమ్మర్లో అయితే రాలేదు. మరి ఎందుకని ఈ సమ్మర్ ని అలా వృధాగా వదిలేశారు అంటూ కొంతమంది కొన్ని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలేవి ప్రేక్షకుల్ని అలరించడం లేదు. ఎందుకని అలాంటి సినిమాలను చేస్తున్నారు. మేకర్స్ కొంచెం శ్రద్ధ పెట్టి మంచి సినిమాలు చేస్తే బాగుంటుంది కదా అనే ధోరణిలో కూడా మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఇక మొత్తానికైతే ఈ సమ్మర్ ను వృధాగా వదిలేశారు అంటూ ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తుండటం విశేషం… ఇకమీదటైనా భారీ విజయాలను సాధించాలంటే సినిమా రిలీజ్ కీలకం కాబట్టి వచ్చే ఏడాది సమ్మర్ వరకు అయిన సరే ఎక్కువ సినిమాలను రిలీజ్ చేసి ప్రేక్షకుల అటెన్షన్ ను వాడుకోవాలని ప్రతి ఒక్కరు చెబుతున్నారు.

ఇక వచ్చే ఏడాది సమ్మర్ కి సందీప్ రెడ్డి వంగ చేసిన స్పిరిట్, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి సినిమాలైతే రిలీజ్ అవుతున్నాయని అనౌన్స్ చేశారు. ఇక ఇప్పటికే ఆ సినిమా రిలీజ్ డేట్స్ ను అనౌన్స్ చేశారు. కానీ ఈ డేట్స్ ను పోస్ట్ పోన్ చేయకుండా ఉంటే బాగుంటుందని మరి కొంతమంది భావిస్తున్నారు… ఇక వీటితో పాటుగా మరికొన్ని సినిమాలు కూడా వచ్చే సమ్మర్ కి రిలీజ్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…

బాలీవుడ్ దర్శకులను డామినేట్ చేస్తున్న తెలుగు స్టార్ డైరెక్టర్స్...

Telugu star directors
Telugu star directors

Telugu Star Directors: బాహుబలి సినిమా ఎప్పుడైతే వచ్చిందో అప్పటినుంచి తెలుగు సినిమాల హవా ఇండియా వైడ్ గా కొనసాగుతుంది. ఇప్పటికే మన దర్శకులు భారీ పాపులారిటిని సంపాదించుకున్నారు. ఒకప్పుడు ఇండియాలో స్టార్ డైరెక్టర్లు ఎవరు అంటే బాలీవుడ్ దర్శకుల పేర్లు చెప్పారు. కానీ ఆయా దర్శకులకు ఒక్కొక్కరికి మన ఒక్కొక్క దర్శకుడు చెక్ పెడుతూ వచ్చాడు. ముఖ్యంగా రాజ్ కుమార్ హిరానీ లాంటి స్టార్ డైరెక్టర్ కి వరుస సక్సెస్ లను సాధిస్తూ తనకెదురుగా ఎవరు లేరు అనేంతలా పేరును సంపాదించుకున్నాడు. కానీ అతనికి రాజమౌళి బాహుబలి సినిమాతో చెక్ పెట్టాడు. ఇక బాహుబలి 2 సినిమాతో బాలీవుడ్ దర్శకులందరిని ఒకేసారి పక్కన పెట్టేసిన రాజమౌళి ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా మారాడు…

కమర్షియల్ సినిమాలతో సక్సెస్ ను సాధించే రోహిత్ శెట్టికి సుకుమార్ చెక్ పెట్టాడు. ‘పుష్ప 2’ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టి తెలుగు దర్శకులు కమర్షియల్ సినిమాలు చేస్తే ఎలా ఉంటుందో వాళ్లందరికి చూపించాడు…ఇక బాలీవుడ్ హీరో తోనే అనిమల్ సినిమా చేసి ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

ఆయన సైతం బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు అయిన సంజయ్ లీలా భన్సాలీ కి చెక్ పెట్టాడు… ఇక నాగ్ అశ్విన్ లాంటి దర్శకుడు సైతం ఇండస్ట్రీలో ఉన్న మిగతా దర్శకులందరికి చెక్ పెట్టాడు. ఇలా మన దర్శకుల హవా కొనసాగడమే కాకుండా బాలీవుడ్ దర్శకులను సైతం డామినేట్ చేస్తూ మనవాళ్ళు ముందుకు దూసుకెళ్లడం అనేది నిజంగా ప్రతి ఒక్కరిని ఆనందానికి గురిచేస్తుంది.

ఇక అలాంటి దర్శకులు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి మరింత మంది రావాలని బాలీవుడ్ ఇండస్ట్రీ షేక్ అయ్యేలా మనవాళ్లు సినిమా చేయాలని బాలీవుడ్ హీరోలు సైతం మనవాళ్ళతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.

ఇక మొత్తానికైతే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు టాప్ పొజిషన్లో కొనసాగడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని శాసించే స్థాయికి వెళ్ళిపోయింది… ఇప్పటికే సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరో సైతం మన తెలుగు దర్శకుడైన వంశీ పైడిపల్లి తో సినిమా చేస్తున్నాడు. అమీర్ ఖాన్ సైతం తెలుగు దర్శకుల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. కానీ అతనితో సినిమా చేయడానికి పెద్దగా ఎవరు ఇంట్రెస్ట్ ని చూపించడం లేదు…

డేటా సెంటర్ మీద వైసిపి కేసులు.. నారా లోకేష్ చెప్పిన నీళ్ల లెక్కలు.. ఇప్పటికైనా జగన్ పార్టీ మూసుకుంటుందా..

Nara Lokesh
Nara Lokesh

Nara Lokesh: వినాశనం లేకుండా వికాసం సాధ్యం కాదు. కాకపోతే వినాశనం స్థాయి తక్కువగా ఉండాలి. వికాసం పరిధి ఎక్కువగా ఉండాలి అంటారు. కానీ.. తెలుగు రాష్ట్రాల్లో వికాసం జరుగుతుంటే కొంతమంది వ్యక్తులు జీర్ణించుకోవడం లేదు. ముఖ్యంగా కొన్ని పార్టీలు ప్రతీప శక్తుల మాదిరిగా వ్యవహరిస్తూ ఉన్నాయి. ఏపీ విషయంలో ఈ దారుణం మరింత ఎక్కువగా ఉంది. ఏపీ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వకపోయినప్పటికీ వైసీపీ విద్వేషపూరిత రాజకీయాలు చేస్తోంది. ముఖ్యంగా ఏపీ పురోగమనంలో ప్రతి సందర్భంలో అడ్డు తగులుతోంది.

వైజాగ్ నగరాన్ని గ్లోబల్ హబ్ గా మార్చేందుకు ఏపీ సర్కారు పని చేస్తోంది. ఇందులో భాగంగానే అనేక సంస్థలను వైజాగ్ లో ఇన్వెస్ట్ చేసేలా అనుకూల వాతావరణం కల్పిస్తోంది. ఇప్పటికే టిసిఎస్ లాంటి అగ్రశ్రేణి ఐటి కంపెనీలు విశాఖపట్నం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇక గూగుల్ కూడా డేటా సెంటర్ ను ఏర్పాటు చేసింది. ఈ డేటా సెంటర్ అమెరికా వెలుపల తర్వాత అంతటి స్థాయిలో గూగుల్ ఇక్కడ ఏర్పాటు చేయడం విశేషం. అయితే దీనిని వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది. మొదట్లో ఈ డేటా సెంటర్ ఘనత తనదేనని జగన్ చెప్పుకున్నారు. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని చెప్పారు.

కొద్దిరోజులకు వైసిపి గూగుల్ డాటా సెంటర్ మీద నెగిటివ్ స్టాండ్ తీసుకుంది. ఆ పార్టీ సంబంధించిన కొంతమంది నాయకులతో కేసులు వేయించింది. దీంతో డేటా సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు అవుతుందా.. ఈ విషయంలో న్యాయస్థానాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాయి అనే ప్రశ్నలు సగటు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో వ్యక్తమయ్యాయి. చివరికి వైసీపీ పాచికలు పారలేదు. ఫలితంగా గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది.

ప్రధానంగా గూగుల్ డేటా సెంటర్ మీద వైసిపి చేస్తున్న ఆరోపణ నీటి వినియోగం.. ఎక్కడ విదేశాలలో ఏదో జరిగితే.. ఇక్కడ కూడా అటువంటి సంఘటనలు జరుగుతాయని వైసీపీ మీడియా చెప్పడం గమనార్హం. అయితే దీనిపై నారా లోకేష్ ముంబై వేదికగా జరిగిన ఒక సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. “గోదావరికి ప్రతి ఏడాది వరదలు వస్తూ ఉంటాయి. ఈ క్రమంలో 3000 టీఎంసీల వరద నీరు వృధాగా సముద్రంలో కలుస్తూ ఉంటుంది. విశాఖపట్నంలో 6.5 గిగా వాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. దీని నిర్వహణకు శతకోటి ఘనపుటడుగుల(టీఎంసీ) నీరు సరిపోతుంది..ఒక గిగా వాట్ థర్మల్ ప్లాంట్ ఒక డేటా సెంటర్ కంటే ఏడు రెట్లు ఎక్కువగా నీటిని ఉపయోగించుకుంటుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఎవరో ఏదో ప్రచారం చేస్తున్నారని దానిని నమ్మొద్దు. అభివృద్ధిని సానుకూల కోణంలో చూడాలి. అభివృద్ధి జరిగితేనే ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్ర ఖజానాకు ఆదాయం వస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఏర్పడుతుందని” నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. దీంతో వైసిపి నోరు మూసుకుంది. ఇన్నాళ్లు చేసిన విష ప్రచారానికి ఇకనైనా అడ్డుకట్ట వేస్తుందో చూడాల్సి ఉంది.

సీనియర్ హీరోలకు ఈ తరం దర్శకులలో ఎవరంటే ఇష్టమో తెలుసా..?

Senior Heroes Favorite Directors
Senior Heroes Favorite Directors

Senior Heroes Favorite Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని పెంచిన వారిలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలయ్య బాబు, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున మొదటి స్థానంలో ఉంటారు. వీళ్ళందరు అప్పటి నుంచి ఇప్పటివరకు భారీ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు… ఈ నలుగురు తెలుగు సినిమా ఇండస్ట్రీకి నాలుగు పిల్లర్లుగా కొనసాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే వీళ్ళ నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. ఒకప్పుడు వాళ్ళు చేసిన సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లారు. ఈ సీనియర్ హీరోలకు ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లలో ఎవరంటే బాగా ఇష్టం అనే విషయం మీద ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో స్పందించారు.

ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవికి రాజమౌళి అంటే చాలా ఇష్టమని తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటిగా ముందుకు తీసుకుపోతున్నాడని ఈ తరం దర్శకులలోనే కాదు తర్వాత తరంలో కూడా రాజమౌళిని బీట్ చేసే దర్శకుడు ఎవరు లేరంటూ ఆయన ఒకానొక సందర్భంలో తెలియజేశాడు… నటసింహం బాలయ్య బాబు సైతం ఈ జనరేషన్లో ఉన్న దర్శకులలో తనకు కూడా రాజమౌళి అంటేనే చాలా ఇష్టమని పలు సందర్భాల్లో తెలియజేశాడు. విక్టరీ వెంకటేష్ మాత్రం అనిల్ రావిపూడి అంటే తనకు చాలా ఇష్టమని పలు సందర్భాల్లో చెప్పాడు.

ఎందుకంటే అంతరించిపోతున్న కామెడీని తన సినిమాలతో మరోసారి తీసుకువచ్చి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ అందరిని థియేటర్ కి రప్పించాడు. అందుకే అనిల్ అంటే తనకి చాలా ఇష్టమని చెప్పాడు… నాగార్జున సైతం ఈ జనరేషన్ లో ఉన్న దర్శకులలో సందీప్ రెడ్డి వంగా అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు.

ఎందుకంటే అతని సినిమాలో పెద్దగా కథ లేకపోయిన కూడా తన మేకింగ్ తో డైలాగులతో ప్రేక్షకుడిని స్టడీగా కూర్చోబెడతాడు. అలాగే యూత్ కి కావాల్సిన అంశాలు మొత్తం అతని సినిమాలో ఉంటాయి. కాబట్టి అతనంటే చాలా ఇష్టమని తెలియజేశాడు. అయితే ఈ హీరోలందరు వాళ్లకు ఇష్టమైన దర్శకులతో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది…

రామ్ చరణ్ బాడీ గార్డ్ రేంజ్ ఏంటో తెలుసా..? స్టార్ హీరోలకు కూడా ఇలాంటి హిస్టరీ లేదు..

Ram Charan Bodyguard Kevin Kunt
Ram Charan Bodyguard Kevin Kunt

Ram Charan Bodyguard Kevin Kunt: గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో విస్తృతంగా వినిపిస్తున్న పేరు కెవిన్ కుంట. ఈయన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి వ్యక్తిగత బాడీ గార్డ్. ‘పెద్ది’ మూవీ మరో రెండు రోజుల్లో విడుదల అవ్వబోతున్న సందర్భంగా , ఈ సినిమాకు సంబంధించిన ప్రొమోషన్స్ లో రామ్ చరణ్ ఫుల్ బిజీ గా ఉన్నాడు. ఈ సందర్భంగా ప్రతీ ఈవెంట్ లోనూ రామ్ చరణ్ కి సెక్యూరిటీ ఇస్తూ బాగా హైలైట్ అయ్యాడు కెవిన్. ముఖ్యంగా అభిమానుల పట్ల ఆయన నడుచుకునే తీరుకి సోషల్ మీడియా లో మంచి ఫాలోయింగ్ పెరిగింది. ఒక ఇంటర్వ్యూ లో రామ్ చరణ్ ని కెవిన్ గురించి అడగ్గా, అందుకు ఆయన సమాధానం చెప్తూ ‘కెవిన్ గొప్ప నైపుణ్యం ఉన్న మనిషి , మంచి మనసు ఉన్నోడు , అతను నాకు మాత్రమే బాడీ గార్డ్ కాదు , మా కుటుంబం మొత్తానికి బాడీ గార్డ్ గా వ్యవహరిస్తూ రక్షణ కల్పిస్తున్నాడు, అందుకు నేను కృతజ్ఞుడిని’ అంటూ చెప్పుకొచ్చాడు రామ్ చరణ్.

ఇంతకీ ఈ కెవిన్ మరెవరో కాదు , ఇటలీ దేశం లో ప్రొఫెషనల్ MMA ఫైటర్, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఎన్నో పోటీలలో కూడా ఆయన పాల్గొన్నాడు. అంతే కాదు , కెవిన్ కి సైతం ప్రత్యేకంగా బాడీ గార్డ్స్ ఉన్నారు. ఆయన్ని నిరంతరం వాళ్ళు బయటకి వచ్చినప్పుడల్లా రక్షిస్తూనే ఉంటారు. ఇటలీ లో ఆ స్థాయి సెలబ్రిటీ కెవిన్. అలాంటి వ్యక్తి ఇప్పుడు రామ్ చరణ్ కి , ఆయన కుటుంబానికి బాడీ గార్డ్ గా వ్యవహరిస్తున్నాడంటే, అతనికి ఏ రేంజ్ రెమ్యూనరేషన్ ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియా లో కెవిన్ మీద ప్రచారం అవుతున్న ఈ కథనాలు చూసి , రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలా గర్విస్తున్నారు. ఇతని ఫిజిక్ చూస్తుంటే సినిమాల్లో కూడా నటించొచ్చు కదా అని అనిపిస్తోంది అంటూ చరణ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ‘పెద్ది’ విషయానికి వస్తే , ఈ చిత్రం రేపు ప్రీమియర్ షోస్ తో గ్రాండ్ గా తెలుగు రాష్ట్రాల్లో మొదలు కాబోతుంది. ఈ ప్రీమియర్ షోస్ కి ఆంధ్ర ప్రదేశ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా జరిగాయి. కాసేపట్లో తెలంగాణ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా గ్రాండ్ గా ప్రారంభం కాబోతున్నాయి. తెలంగాణ లో బుకింగ్స్ మొదలు అవ్వకముందే , ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల రూపాయిల రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. పూర్తి స్థాయిలో బుకింగ్స్ మొదలయ్యాక 50 కోట్ల రూపాయలకు పైగానే అడ్వాన్స్ బుకింగ్స్ జరగొచ్చని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.