Homeజాతీయ వార్తలుMamata Banerjee: బెంగాల్ పోయింది.. ఇప్పుడు టీఎంసీ కూడా.. పాపం మమత

Mamata Banerjee: బెంగాల్ పోయింది.. ఇప్పుడు టీఎంసీ కూడా.. పాపం మమత

Mamata Banerjee: బెంగాల్ రాష్ట్రంలో 15 సంవత్సరాలు పాటు మమతా బెనర్జీ అప్రతిహతంగా పరిపాలన సాగించారు. ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం లేకుండా చేశారు. దాడులతో భయపెట్టారు. కేసులతో చుక్కలు చూపించారు. మమత అండదండలు.. ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఇష్టారాజ్యంతో బెంగాల్ మొత్తం 15 సంవత్సరాలపాటు అట్టుడికి పోయింది. ఇన్నాళ్లకు జనాల్లో చైతన్యం వచ్చి.. మమత ప్రభుత్వాన్ని సాగనంపారు. చివరికి మమతను కూడా ఓడించారు. అక్కడితోనే ఆగిపోవడం లేదు.. ఇన్నాళ్లపాటు తమ హింసించిన టీఎంసీ నేతలకు బెంగాల్ […]

Mamata Banerjee: బెంగాల్ రాష్ట్రంలో 15 సంవత్సరాలు పాటు మమతా బెనర్జీ అప్రతిహతంగా పరిపాలన సాగించారు. ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం లేకుండా చేశారు. దాడులతో భయపెట్టారు. కేసులతో చుక్కలు చూపించారు. మమత అండదండలు.. ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఇష్టారాజ్యంతో బెంగాల్ మొత్తం 15 సంవత్సరాలపాటు అట్టుడికి పోయింది.

ఇన్నాళ్లకు జనాల్లో చైతన్యం వచ్చి.. మమత ప్రభుత్వాన్ని సాగనంపారు. చివరికి మమతను కూడా ఓడించారు. అక్కడితోనే ఆగిపోవడం లేదు.. ఇన్నాళ్లపాటు తమ హింసించిన టీఎంసీ నేతలకు బెంగాల్ ప్రజలు గట్టిగానే బుద్ధి చెబుతున్నారు. ఇటీవల మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని ఉరికించి కొట్టారు. దీనిని బట్టి బెంగాల్ ప్రజల్లో టీఎంసీ మీద ఏ స్థాయిలో ప్రజలలో ఆగ్రహం ఉందో అర్థం చేసుకోవచ్చు.

బెంగాల్ లో టీఎంసీను ఓడించడం.. మమతాను ఓడించడం.. అభిషేక్ బెనర్జీని కొట్టడం.. ఇవన్నీ కూడా ఇటీవల జరిగిపోయాయి. ఇప్పుడు బెంగాల్ రాష్ట్రంలో మరోపరిణామం చోటు చేసుకుంది. ఆ పార్టీలో దాదాపు 50 మంది శాసనభ సభ్యులు వ్యతిరేక స్వరం వినిపిస్తున్నట్టు తెలుస్తోంది. టీఎంసీలో బహిష్కృత నేతగా కొనసాగుతున్న రితబ్రత్ బెనర్జీ వద్దకు అసంతృప్తి నేతలు మొత్తం వెళ్లినట్టు తెలుస్తోంది. వీరంతా కూడా ఇప్పటికే కోల్కతాలో అనేక పర్యాయాలు రహస్యంగా సమావేశం నిర్వహించినట్లు సమాచారం. ఈ విషయాన్ని గుర్తించిన మమత ఇటీవల కీలక సమావేశం నిర్వహిస్తే.. చాలామంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదు.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో టిఎంసి కి ఇటీవల ఎన్నికల్లో80 స్థానాలు వచ్చాయి.. వారిలో ఇప్పుడు మూడో వంతు మంది దాకా తిరుగుబాటు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇవే గనుక నిజమైతే మమతకు కష్టాలు మొదలైనట్టు. అంతేకాదు వారంతా కూడా పార్టీ పేరు మీద.. ఎన్నికలలో గుర్తు మీద పోరాటం సాగిస్తే మమత మరింత ఇబ్బందుల్లో పడక తప్పదు. ఈ పరిణామాలు టిఎంసి భవిష్యత్తు మీద తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం కల్పిస్తోంది.

అప్పట్లో మమతా బెనర్జీ రిజు దత్త అనే నాయకుడిని సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఆయన అకస్మాత్తుగా వెలుగులోకి వచ్చారు.. తమ పార్టీకి సంబంధించిన యాభై మంది ఎమ్మెల్యేలు ఏకమయ్యారని.. వారంతా కూడా హోటల్లో సమావేశం అయ్యారని అన్నారు. మావద్ద మూడింట రెండు వంతుల మెజారిటీ ఉందని ఆయన స్పష్టం చేశారు. బెంగాల్ రాష్ట్రంలో మహారాష్ట్ర తరహాలోనే రాజకీయాలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper