Home Blog Page 198

రంగంలోకి మోజ్తబా ఖమేనీ.. యాక్టివ్‌ అవుతున్న ఇరాన్‌ సుప్రీం లీడర్‌!

Mojtaba Khamenei
Mojtaba Khamenei

Mojtaba Khamenei: అమెరికా – ఇరాన్‌ యుద్ధం మళ్లీ తీవ్రరూపం దాలుస్తోంది. ఒకవైపు శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఇంకోవైపు అమెరికా ఆత్మరక్షణ పేరుతో దాడులు చేస్తోంది. దీంతో ఇరాన్‌ కూడా ప్రతిదాడుల ప్రారంభించింది. అమెరికా అనుకూల గల్ఫ్‌ దేశాలపై ప్రతీకార దాడులు ప్రారంభించింది. దీంతో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. హర్మూజ్‌ మూసివేతతో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. తాజా ఉద్రిక్తతలో ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపనున్నాయి. ఇక అమెరికా–ఇజ్రాయెల్‌ దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ మళ్లీ యాక్టివ్‌ అవుతున్నట్లు తెలుస్తోంది.

అమెరికా విదేశాంగ మంత్రి ప్రకటన..
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ విషయంలో చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి. సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ బతికి ఉన్నారని, మరింత యాక్టివ్‌గా ఉన్నారని అమెరికా అధికారికంగా సంకేతాలు ఇచ్చారు. ఇరాన్‌–అమెరికా సంబంధాల్లో కొత్త మలుపును సూచిస్తోంది.ç రూబియో సెనేట్‌ ఫారిన్‌ రిలేషన్స్‌ కమిటీ ముందు చేసిన వ్యాఖ్యలు ప్రకారం, మొజ్తబా ఖమేనీ ఇటీవలి కాలంలో దేశ వ్యవహారాల్లో మరింత లోతుగా పాల్గొంటున్నారని సూచనలు ఉన్నాయి. ఆయన కమ్యూనికేషన్లు రాతపూర్వకంగా, మధ్యవర్తుల ద్వారా జరుగుతున్నప్పటికీ, ఇరాన్‌ వ్యవస్థలో ఆయన ప్రభావం పెరుగుతోందని అమెరికా అంచనా వేసింది. ఇది ఇరాన్‌లో ఇటీవలి రాజకీయ అస్థిరతను పరోక్షంగా ధ్రువీకరిస్తోంది. సుప్రీం లీడర్‌ స్థానం ఇరాన్‌ వ్యవస్థలో కీలకమైనది కాబట్టి, ఆయన కార్యకలాపాలు పునరుద్ధరణకు సంకేతం కావచ్చు. ఇది ఇరాన్‌ లోపలి శక్తుల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

హార్ముజ్‌ జలసంధి సమస్య..
ఇరాన్‌ హార్ముజ్‌ జలసంధిలో చేస్తున్న చర్యలను అమెరికా చట్టవిరుద్ధమని అభివర్ణించింది. ప్రపంచ ఆయిల్‌ మరియు ఎల్‌ఎన్‌జీ సరఫరాలో 20 శాతం ఈ జలసంధి ద్వారా వెళ్తుంది. దీనిని తిరిగి తెరవాలని అమెరికా స్పష్టమైన డిమాండ్‌ చేసింది. ఈ సమస్య ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతోంది. జలసంధి మూసుకుపోవడం వల్ల ఆయిల్‌ ధరలు పెరగడం, గ్లోబల్‌ సప్లై చైన్‌ అంతరాయాలు ఏర్పడడం వంటి సమస్యలు తలెత్తాయి. అమెరికా ఈ అంశాన్ని డిప్లమసీలో ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రాంతీయ స్థిరత్వానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది.

అణు కార్యక్రమంపై చర్చలు..
ఇరాన్‌ తన అణు కార్యక్రమాలతో సంబంధించిన అంశాలను చర్చించడానికి అంగీకరించిందని రూబియో తెలిపారు. ఇది గతంలో ఇరాన్‌ తీసుకున్న వైఖరికి భిన్నంగా ఉంది. యుద్ధం తర్వాత ఇరాన్‌ ఆర్థికంగా, సైనికంగా ఒత్తిడిలో ఉండటంతో డిప్లమసీ వైపు మొగ్గుచూపుతోందని విశ్లేషకులు అంటున్నారు. అయితే, ఇది పూర్తి ఒప్పందం కాదు. చర్చలు ఎంతవరకు ముందుకు వెళ్తాయి, ఇరాన్‌ ఎంతవరకు రాజీపడుతుంది అనేది కీలకం. అమెరికా వైపు నుంచి ఆంక్షల సడలింపు అణు కార్యక్రమం మీద ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ పరిణామాలు మధ్యప్రాచ్య ప్రాంతంలో స్థిరత్వం, అస్థిరత్వం రెండింటికీ మార్గం సుగమం చేస్తాయి. మొజ్తబా ఖమేనీ యాక్టివ్‌ అవడం ఇరాన్‌ లోపలి నిర్ణయాధికారాన్ని బలోపేతం చేయవచ్చు.
హార్ముజ్‌ జలసంధి తెరవడం గ్లోబల్‌ ఆయిల్‌ మార్కెట్లను స్థిరపరచవచ్చు.
అణు చర్చలు ముందుకు వెళితే దీర్ఘకాలిక ఉద్రిక్తతలు తగ్గవచ్చు.

టార్గెట్ రఘురామకృష్ణంరాజు.. అసలు ఎజెండా వైసీపీలో చేరడం!

Raghurama Krishnam Raju
Raghuramakrishnam Raju

Raghurama Krishnam Raju: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజును ఇద్దరు వ్యక్తులు టార్గెట్ చేసుకుంటున్నారు. ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్, న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ ఉన్నారు. ఇటీవల ఓ ఆలయ నిర్మాణం విషయంలో జడ శ్రావణ్ వర్సెస్ రఘురామకృష్ణంరాజు అన్నట్టు ఉంది. మరోవైపు పాత కేసుల విషయంలో రఘురామకృష్ణం రాజుతో తలపడుతున్నారు పీవీ సునీల్ కుమార్. దళిత కార్డును ప్రయోగిస్తూ పక్కా పొలిటికల్ స్కెచ్ వేశారన్నది బహిరంగ రహస్యం. అదే సమయంలో లేనిపోని వివాదాలతో రఘురామకృష్ణం రాజు కూటమికి ఇబ్బందులు తెచ్చి పెడుతున్నారు అని సొంత పార్టీ వారే వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇప్పటికే జడ శ్రావణ్ కుమార్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే పనిచేస్తున్నారు. కానీ పీవీ సునీల్ కుమార్ మాత్రం ఈనెలాఖరులో ఐపీఎస్ గా రిటైర్డ్ కానున్నారు. ఆయన మాత్రం రాజకీయ ప్రకటనలు చేస్తూ.. రఘురామకృష్ణం రాజు ఇష్యూతో పొలిటికల్ గేమ్ ఆడుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

* కూటమికి వ్యతిరేక పిలుపు..
ఏపీలో కాపులు, దళితులు, బీసీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు సునీల్ కుమార్. అప్పుడే రాజ్యాధికారం వీలు అవుతుందని అభిప్రాయపడ్డారు. కూటమి వైపు కాపులు ఉండడంతో వారిని టర్న్ చేసే విధంగా పివి సునీల్ కుమార్ కామెంట్స్ ఉన్నాయి. అయితే వైసిపి హయాంలో సిఐడి చీఫ్ గా ఉండేవారు. ఆ సమయంలోనే రఘురామకృష్ణం రాజును కస్టోడియల్ టార్చర్ పెట్టారు అనేది ప్రధాన ఆరోపణ. ఇప్పుడు అదే కేసుతో ఎటువంటి పోస్టింగ్ లేకుండా ఉన్నారు సునీల్ కుమార్. ఈ నెల చివర్లో ఆయన పదవీ విరమణ చేస్తారు. ప్రస్తుతం ఆయన సర్వీసులో ఉన్నారు కానీ రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా భీమవరం వేదికగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజుకు సవాల్ చేశారు. ఆయన రాజీనామా చేస్తే జరిగే ఉప ఎన్నికల్లో రఘురామకృష్ణం రాజు పై తాను పోటీ చేస్తానని… వెయ్యి ఓట్ల మెజారిటీతో గెలుస్తానని సవాల్ చేశారు. అయితే రఘురామకృష్ణంరాజు రాజీనామా చేసేది లేదు. ఉప ఎన్నికలు వచ్చేది లేదు. ఐపీఎస్ సునీల్ కుమార్ పోటీ చేసేది లేదు.

* వరుసగా రాజకీయ ప్రకటనలు..
వాస్తవానికి ప్రస్తుతం సర్వీస్ లో ఉన్నారు పివి సునీల్ కుమార్. కానీ రాజకీయ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. అయితే వైసిపి హయాంలో అనుకూల అధికారిగా పేరు ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు టార్గెట్ చేసుకున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన వైసీపీలో చేరడం ఖాయమని ప్రచారం నడుస్తోంది. అయితే జగన్మోహన్ రెడ్డి పివి సునీల్ కుమార్ ను చేర్పించుకుంటారా? అన్నది వేచి చూడాలి.

ప్రశాంత్ నీల్ కి భారీ ఆఫర్ ఇచ్చిన బాలీవుడ్ స్టార్ హీరో...

Prashanth Neel
Prashanth Neel

Prashanth Neel: కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి పాన్ ఇండియాను షేక్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్…సలార్ సినిమాతో ప్రభాస్ కి అదిరిపోయే సక్సెస్ ని అందించిన ఆయన ప్రస్తుతం ఎన్టీఆర్ కి భారీ విజయాన్ని కట్టబెట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… అయితే ప్రశాంత్ నీల్ ను తనతో సినిమా చేయమని ఒక బాలీవుడ్ హీరో అడుగుతున్నట్టుగా కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటికే బాలీవుడ్ హీరోల పని అయిపోయింది. ఎలాగైనా సరే సౌత్ దర్శకులను పట్టుకొని భారీ సక్సెస్ ను కొట్టి మరోసారి మార్కెట్లో తమ డిమాండ్ ను పెంచుకోవాలనే ప్రయత్నంలో ఆయా హీరోలైతే ఉన్నారు. మరి ఇలాంటి క్రమంలోనే ప్రశాంత్ నీల్ లాంటి దర్శకుడు అయితేనే బాగుంటుందని బాలీవుడ్ ఖాన్ త్రయం లో ఒకరైన షారుక్ ఖాన్భావిస్తున్నాడట. షారుక్ ఖాన్ అనుకున్నట్టుగానే ప్రశాంత్ నీల్ అతనితో సినిమా చేస్తాడా? లేదా అనే విషయం మీద సరైన క్లారిటి అయితే లేదు. కానీ మొత్తానికైతే వీళ్లిద్దరి మధ్య కొన్ని డిస్కషన్స్ నడుస్తున్నాయి.

ఇక తనతో సినిమా చేయడం కోసం భారీ రెమ్యునరేషన్ కూడా షారుక్ ఖాన్ ఆఫర్ చేశాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా పడితే అది బాగానే ఉంటుంది. కానీ బాలీవుడ్ ప్రేక్షకులు షారుక్ ఖాన్ ను చూసే ఇంట్రెస్ట్ ను కోల్పోయినట్టుగా తెలుస్తుంది. బాలీవుడ్ ప్రేక్షకులు సైతం అతని సినిమాకి పెద్దగా ఇంట్రెస్ట్ ని చూపించడం లేదంటే ఇతర ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులు ఆయన సినిమాలను చూసే అవకాశమే లేదు.

మరి ప్రశాంత్ నీల్ ఈ విషయంలో ఎలాంటి స్టెప్ వేయబోతున్నాడు. షారుక్ ఖాన్ ను హీరోగా పెట్టి సినిమా చేసి భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడా? లేదంటే అతన్ని పక్కన పెట్టి వేరే హీరోలతో సినిమాలు చేయాలని ఆరాటపడుతున్నాడా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో చేస్తున్న డ్రాగన్ సినిమా మీదనే ఎక్కువ ఫోకస్ చేశాడు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో ‘సలార్ 2’ సినిమా చేస్తాడు. అప్పుడు తను ఫ్రీ అయిపోతాడు… ఆ తర్వాత షారుక్ ఖాన్ తో చేస్తాడా లేదా అనేది చూడాలి.

స్థానిక ఎన్నికలు.. చంద్రబాబు ప్లాన్ అదుర్స్!

Andhra Pradesh Local Elections
Andhra Pradesh Local Elections

AP Local Body Elections: ఏపీలో ఒక రకమైన అనుమానం ఉండేది. కూటమి ప్రభుత్వం ఎన్నాళ్లు నడుస్తుందో చెప్పలేం అన్నవారు ఎక్కువగా ఉండేవారు ఎన్నికల సమయంలో. ఎందుకంటే చాలా రాజకీయ పార్టీల మధ్య పొత్తు కొద్ది రోజులకే విచ్ఛిన్నం అవుతూ వచ్చింది. అలాగే ఏపీలో కూటమిలోని టిడిపి, జనసేన మధ్య విభేదాలు వస్తాయని ఎక్కువ మంది ఆశించారు. కానీ వారి ఆశలు తీరలేదు. గత రెండేళ్లుగా రెండు పార్టీల మధ్య బంధం పెరుగుతుందే తప్ప తగ్గేదిగా కనిపించడం లేదు. అయితే క్షేత్రస్థాయిలో క్యాడర్ మధ్య మాత్రం విభేదాలు ఉన్నాయి. ఆ విషయం ఇరుపార్టీల అధినేతలకు తెలుసు. అయితే విభేదాలు ఎంత ఉన్నాయో అంతకుమించి ప్రచారం చేస్తోంది వైసీపీ సోషల్ మీడియా. ఏదైనా పరిణామం జరిగితే చాలు సోషల్ మీడియాను నింపేస్తోంది. కానీ వారి మధ్య ఎటువంటి అరమరికలు లేకుండా సజావుగా కొనసాగుతోంది పొత్తు. అయితే ఎంత పొత్తు ఉన్న ఓట్ల బదలాయింపు జరిగితేనే.. దానికి సరైన ఫలితం వస్తుంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఇదే మాదిరిగా సత్ఫలితం చూసింది కూటమి. అయితే మరోసారి అటువంటి ఫలితాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో చూడాలని భావిస్తున్నారు సీఎం చంద్రబాబు.

* ఉద్దేశపూర్వక జాప్యం..
ఏపీలో స్థానిక సంస్థలకు సంబంధించి పాలకవర్గాల గడువు ముగిసింది. ప్రత్యేక అధికారుల పాలన నడుస్తోంది. త్వరలో ఎన్నికలకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తోంది ప్రభుత్వం. అయితే చంద్రబాబు జరుపుతున్న ఈ జాప్యం వెనుక చాలా రకాల వ్యూహాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా స్థానిక సంస్థల్లో సైతం కూటమి పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు జరగాలన్నది చంద్రబాబు ప్రణాళిక. అందుకు ఆయన ఒక వ్యూహం రూపొందించారు. నియోజకవర్గ, మండల స్థాయిలో ఎన్డీఏ సమన్వయ కమిటీ సమావేశాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ నెల నాలుగున జరగనున్న ఎన్డీఏ సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.

* సాఫీగా ఓట్ల బదలాయింపు కోసం
సార్వత్రిక ఎన్నికల వరకు పొత్తు ఓకే. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు అలా కాదు. అక్కడ స్థానిక పరిస్థితులు విపరీతంగా ప్రభావం చూపుతాయి. నేతలు ఆశావహులుగా ఉంటారు. ఈ క్రమంలో ఎన్నికలు నిర్వహిస్తే కూటమి నేతల మధ్య ఘర్షణతో పాటు వివాదాలు జరుగుతాయి. దీనిని ముందుగానే గ్రహించారు సీఎం చంద్రబాబు. అందుకే కూటమి సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఏ మండలంలో ఎవరు జడ్పిటిసి గా పోటీ చేయాలి? సర్పంచ్ గా ఎవరికి అవకాశం కల్పించాలి? ఎంపీపీగా ఎవరికి ఛాన్స్ ఇవ్వాలి? ఆశావహుడు ఎప్పుడు నుంచి పనిచేస్తున్నారు? స్థానికంగా బలం ఎంత? ఇలా అన్ని వివరాలను ఆరా తీస్తుంది ఈ కమిటీ. ఒకవేళ బహుముఖ పోటీ ఉంటే సమన్వయం చేసుకొని ముందుకు సాగుతుంది. అప్పుడే ఓట్ల బదలాయింపు జరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ ఓటమి ఇచ్చేందుకు ఈ ప్రయత్నం గా తెలుస్తోంది. రేపు ఈ కమిటీల గురించి ప్రత్యేక ప్రకటన చేస్తారు సీఎం చంద్రబాబు.

తల్లికి వందనం నిధుల ఎప్పుడు జమ అవుతాయంటే?!

Talliki Vandanam:
Talliki Vandanam:

Talliki Vandanam Scheme: ఏపీలో తల్లికి వందనం పథకం పై బిగ్ అప్డేట్ వచ్చింది. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం కింద నగదు జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు షెడ్యూల్ మారినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల వివరాలను సచివాలయ సిబ్బంది సేకరిస్తున్నారు. తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. పారదర్శకంగా అమలు చేసేందుకు కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. అందుకే తల్లికి వందనం నిధుల జమకు సంబంధించి తేదీ మార్పు అనివార్యంగా మారింది. అయితే విద్యా సంవత్సరం ప్రారంభమై వారం రోజుల్లోగా నిధులు జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం.

* విద్యార్థుల వివరాలతో సర్వే..
రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం అందుతోంది. ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పాఠశాల విద్యా శాఖ వద్ద ఉన్న వివరాలు సచివాలయాల వారీగా పంపించారు. అక్కడ సిబ్బంది క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఆరా తీస్తున్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం సాయం అందనుంది. ఈసారి అనర్హులకు అందకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సర్వే చేపడుతోంది. పాఠశాల విద్యా శాఖ వద్ద ఉన్న వివరాలను సచివాలయాలకు పంపించి.. పరిశీలనలో కఠిన మార్గదర్శకాలు అమలు చేస్తోంది. 60 లక్షల మంది లబ్ధిదారులు ఉండడంతో వారి వివరాల సేకరణలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. అందుకే తల్లికి వందనం నిధుల జమ ఈనెల 12 నుంచి 19 కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

* ఈనెల 19న జమ..
వేసవి సెలవుల అనంతరం విద్యాసంస్థలు ఈనెల 12న తెరుచుకోనున్నాయి. అదేరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో పుస్తకాల కిట్లు అందించనున్నారు. పాఠ్యపుస్తకాలతో పాటు నోట్ పుస్తకాలు కూడా అందిస్తారు. యూనిఫారం తో పాటు ఇతర పరికరాలు అందిస్తారు. అదే రోజు తల్లికి వందనం నిధులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ క్షేత్రస్థాయిలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల వివరాలు సేకరించే సర్వేలో జాప్యం జరుగుతోంది. పూర్తి సర్వేలో వివరాలు సేకరించిన తర్వాత.. కేవలం అర్హులుకు మాత్రమే అందేలా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈనెల 19 నాటికి అటు ఇటుగా తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయడం ఖాయం.

రాత్రి నిద్రపోయేముందు స్నానం చేస్తున్నారా..

Warm Water Bath Before Sleep
Warm Water Bath Before Sleep

Warm Water Bath Before Sleep: ప్రస్తుత కాలంలో చాలా మందిది ఉరుకులు, పరుగుల జీవితం. ఇలాంటి జీవనశైలిలో ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు చాలా మందిని వేధిస్తున్నాయి. మంచి నిద్ర కోసం ప్రజలు అనేక మార్గాలను ప్రయత్నిస్తుంటారు. అయితే నిపుణులు సూచిస్తున్న ఒక సులభమైన అలవాటు ఏమిటంటే.. నిద్రపోయే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం. ఇది శరీరానికి, మనసుకు విశ్రాంతిని అందించి ప్రశాంతమైన నిద్రకు సహాయపడుతుందని చెబుతున్నారు. అదెలాగంటే?

రోజంతా పనులు, ప్రయాణాలు, శారీరక శ్రమ వల్ల కండరాలు అలసిపోతాయి. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల కండరాల్లోని బిగుతు తగ్గి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో శరీరం మొత్తం రిలాక్స్ అవుతుంది. ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవారికి లేదా శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారికి ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. గోరువెచ్చని నీటితో స్నానం చేసిన తర్వాత శరీర ఉష్ణోగ్రతలో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ ప్రక్రియ మెదడుకు నిద్ర సమయం సమీపించిందనే సంకేతాలను పంపిస్తుంది. ఫలితంగా శరీరం సహజంగానే నిద్రకు సిద్ధమవుతుంది. నిద్ర పట్టడానికి ఎక్కువ సమయం పట్టే వారికి ఈ అలవాటు ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

మానసిక ఒత్తిడి కారణంగా చాలా మంది రాత్రిళ్లు సరిగా నిద్రపోలేరు. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలో ప్రశాంతతను కలిగించే హార్మోన్ల ప్రభావం పెరుగుతుంది. దీంతో రోజంతా ఉన్న టెన్షన్, ఆందోళన కొంతవరకు తగ్గిపోతాయి. మనసు ప్రశాంతంగా మారి నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. రోజంతా బయట తిరగడం వల్ల చర్మంపై దుమ్ము, మురికి, చెమట, బ్యాక్టీరియా పేరుకుపోతాయి. నిద్రకు ముందు స్నానం చేయడం వల్ల ఇవి తొలగిపోతాయి. దీంతో చర్మం శుభ్రంగా ఉండటమే కాకుండా మొటిమలు, చర్మ ఇన్‌ఫెక్షన్లు వంటి సమస్యల ప్రమాదం కూడా తగ్గుతుంది. శుభ్రమైన శరీరంతో నిద్రపోవడం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పడుకునే సమయానికి కచ్చితంగా ముందు కాకుండా ఒక గంట నుంచి 90 నిమిషాల ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ఉత్తమం. ఈ వ్యవధిలో శరీర ఉష్ణోగ్రత సహజ స్థితికి చేరుకుంటుంది. ఇది నిద్ర చక్రాన్ని మెరుగుపరచి గాఢమైన నిద్రకు దోహదపడుతుంది.

అయితే నీరు చాలా వేడిగా ఉండకూడదు. అధిక ఉష్ణోగ్రత కలిగిన నీటితో స్నానం చేయడం వల్ల చర్మం పొడిబారే అవకాశం ఉంటుంది. గుండె సంబంధిత వ్యాధులు, రక్తపోటు సమస్యలు ఉన్నవారు లేదా ప్రత్యేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు వైద్యుల సలహా మేరకు ఈ అలవాటును పాటించడం మంచిది.

మహేష్ బాబు ఈ ఐదుగురు డైరెక్టర్స్ ను బ్లైండ్ గా నమ్మాడా...? ఒక్కరు తప్ప అందరు మోసం చేశారుగా.?

Mahesh Babu
Mahesh Babu

Mahesh Babu: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు బ్లైండ్ గా దర్శకులను నమ్మి సినిమాలు చేసేస్తూ ఉంటారు. అందులో కొంతమంది దర్శకులు ఆయా హీరోలకు భారీ సక్సెస్ లను తీసుకువచ్చి పెడుతుంటే, మరి కొంతమంది మాత్రం ప్లాప్ లను కట్టబెడుతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం గతంలో కథలను వినకుండా లేకుండా ఆయన దర్శకులను నమ్మి సినిమాలు చేస్తూ ఉండేవాడు. దానివల్ల ఆయన కొంతవరకు సక్సెస్ లను సాధించిన కూడా మరికొన్ని విషయాల్లో మాత్రం ఆయన చాలా వరకు దెబ్బ పడిపోయింది.

కొందరు దర్శకులైతే అతన్ని డిజాస్టర్ లను కట్టబెట్టి తన మార్కెట్ ను పూర్తిగా డౌన్ చేశారనే చెప్పవచ్చు. దూకుడు సినిమాతో సూపర్ సక్సెస్ ని అందించిన శ్రీను వైట్లకు ‘ఆగడు’ సినిమా చేసే అవకాశాన్ని ఇచ్చాడు. కానీ శ్రీను వైట్ల ప్రూవ్ చేసుకోలేకపోయాడు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా తర్వాత శ్రీకాంత్ అడ్డాలకి బ్రహ్మోత్సవం సినిమా చేసే అవకాశం ఇచ్చాడు.

మహేష్ బాబు కెరియర్ లోనే అత్యంత డిజాస్టర్ సినిమా ఏదైనా ఉంది అంటే అది బ్రహ్మోత్సవం అనే చెప్పాలి… ఒక గుణశేఖర్ కి సైతం ఒక్కడు సినిమా సక్సెస్ ని ఇచ్చిన తర్వాత అర్జున్, సైనికుడు లాంటి రెండు సినిమాలను చేసే అవకాశాలను ఇచ్చాడు. కానీ ఆ రెండు సినిమాలు కూడా డిజాస్టర్స్ గా మారడంతో మహేష్ బాబు మరోసారి గుణశేఖర్ కి సినిమా చేసే అవకాశం ఇవ్వలేదు…

ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం ఖలేజా, గుంటూరు కారం సినిమాలతో ఫ్లాప్ లను కట్టబెట్టినప్పటికి ఆ రెండు సినిమాలు కూడా మహేష్ బాబు ఇమేజ్ కి కొంతవరకు హెల్ప్ అయ్యాయి. ఒక పూరి జగన్నాథ్ మాత్రమే మహేష్ బాబు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు. పోకిరి సినిమాతో ఇండస్ట్రీ రికార్డును బ్రేక్ చేసే సక్సెస్ ని అందించాడు. ఈ సినిమాతో మహేష్ బాబు లోని ఒక కొత్త నటుడిని బయటికి తీసి అతని నటనను మరింత షార్ప్ చేశాడనే చెప్పాలి…

మహేష్ బాబు కోసం ఒక్కడు కథ రాయలేదు. అలా చేస్తే మూవీ ప్లాప్ అయ్యేది : గుణశేఖర్

Gunasekhar
Gunasekhar

Gunasekhar: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్తపుంతలను తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ప్రస్తుతం మన స్టార్ హీరోలందరు పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేసే సినిమాలను చేస్తున్నారు. ఇప్పటివరకు మన వాళ్ళు చేస్తున్న సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో మరింత ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ మధ్యకాలంలో మనవాళ్ల నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులైతే మన సినిమాలకి ఫిదా అయిపోయారు. ప్రస్తుతం వాళ్ళ నుంచి వచ్చే సినిమాలేవి ప్రేక్షకులను అలరించకపోవడంతో మన సినిమాల వైపే వాళ్ళు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి నటుడు సైతం ప్రస్తుతం రాజమౌళితో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఏకంగా ఆయన పాన్ వరల్డ్ లోకే అడుగుపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక మహేష్ బాబు కెరియర్ లోనే ది బెస్ట్ సినిమా గా నిలిచిన ఒక్కడు మూవీ గురించి ఆ మూవీ దర్శకుడు అయిన గురుశేఖర్ కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు.

ముఖ్యంగా తను ఒక్కడు సినిమా కథని మహేష్ బాబు కోసం రాయలేదని చార్మినార్ దగ్గర చాయ్ తాగే కుర్రాడు ఎలా ఉంటాడు. అతనికి ఏర్పడిన పరిస్థితులు ఏంటి అనే వాటిని మాత్రమే బేస్ చేసుకొని కథను రాశానని చెప్పాడు. అలా రాయడం వల్లే ఆ కథ చాలా జెన్యూన్ గా వచ్చిందని సినిమా కథ మొత్తం అయిపోయిన తర్వాత దానికి మహేష్ బాబు అయితే బాగుంటాడని అతని దగ్గరికి వెళ్ళామని చెప్పాడు.

అందువల్లే సినిమాలో ఒక ప్యూరిటీ ఉంటుందని తన చెప్పడం విశేషం…కానీ అర్జున్, సైనికుడు సినిమాలను మాత్రం మహేష్ బాబును దృష్టిలో పెట్టుకొని రాశాను. అందువల్లే ఆ సినిమాలు ఫ్లాపులుగా మారాయి అంటూ ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు.

ఇక ఏది ఏమైనా కూడా కథని కథలాగ రాస్తే బాగుంటుంది. హీరోల ఇమేజ్ కోసం కథను కాంప్రమైజ్ చేయడం వాళ్ళను ఇంప్రెస్ చేయడం కోసం అందులో కొన్ని సన్నివేశాలను ఇరికించడం లాంటివి చేస్తేనే సినిమా కథకి దెబ్బ పడుతుంది అనే విషయాన్ని గుణశేఖర్ ఇన్ డైరెక్ట్ గా ప్రతి ఒక్కరికి చెప్పాడు…

పేలుళ్లకు కుట్ర.. కేరళలో బయటపడ్డ అతిపెద్ద ముప్పు

Kerala Explosives Network
Kerala Explosives Network

Kerala Explosives Network: కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లాలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక సాధారణ లారీ సోదా నుంచి మొదలైన ఘటన ఇప్పుడు దక్షిణ భారతదేశ భద్రతా వ్యవస్థను కదిలిస్తోంది. ఉల్లిగడ్డల సంచుల్లో దాచిన 89,600 జెలటిన్‌ స్టిక్స్‌. 10,500 డిటోనేటర్ల స్వాధీనం కేవలం అక్రమ వ్యాపారం కాకుండా, భారీ స్థాయి ఉగ్రవాద సామర్థ్యాన్ని సూచిస్తున్నట్లు ఎన్‌ఐఏ దర్యాప్తు సంకేతాలు ఇస్తున్నాయి.

ఉల్లిగడ్డల మాటున జిలిటెన్‌ స్టిక్స్‌..
ఫిబ్రవరి 7న మలప్పురం జిల్లాలో పోలీసులు ఒక లారీని సోదా చేసి హాలో బ్రిక్స్‌తో పాటు ఉల్లిగడ్డల సంచుల్లో దాచిన జెలటిన్‌ స్టిక్స్‌ను గుర్తించారు. డ్రైవర్‌ వాదన (‘‘మూడో భార్య ఇంటికి తీసుకెళ్తున్నాను’’) మరింత అనుమానాస్పదంగా మారింది. అక్కడి సెర్చ్‌లో మరిన్ని పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. లైసెన్స్‌ లేకుండా గ్రానైట్‌ క్వారీలు, మైనింగ్‌ కోసం అని చెప్పుకునే ఈ పదార్థాలు వాస్తవానికి ఎంతటి వినాశకర శక్తిని కలిగి ఉన్నాయో ఇప్పుడు స్పష్టమవుతోంది.

ఎన్‌ఐఏ రంగప్రవేశం…
ఈ కేసును కేరళలోని అప్పటి కమ్యూనిస్టు ప్రభుత్వం మొదట ఎన్‌ఐఏకు అప్పగించకపోవడం గమనార్హం. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చాక ఎన్‌ఐఏ కేసును టేకప్‌ చేసింది. మే 30, 2026న కేరళ, కర్ణాటక, తమిళనాడు అంతటా ఏకకాలంలో 19 చోట్ల దాడులు జరిపి ఆయుధాలు, పేలుడు పదార్థాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. కోజికోడ్, మలప్పురం, కొండోట్టి వంటి ప్రాంతాల్లో నిల్వలు బయటపడ్డాయి. ఈ నెట్‌వర్క్‌ మూడు రాష్ట్రాల్లో విస్తరించి ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

మలప్పురం లారీతో సంబంధం?
కేరళలో ఇస్లామిక్‌ ఉగ్రవాదం దీర్ఘకాలిక సమస్య. ఐసిస్‌లో కేరళ యువకులు చేరడం, ఎల్‌కే అధ్వానీపై దాడి ప్రయత్నం, శివరాత్రి రోజు శివాలయం ఎదుట బాంబు వ్యాన్‌ పేల్చడం, మంగళూరులో ప్రెషర్‌ కుక్కర్‌ బాంబు ఇలాంటి ఘటనలు ఇప్పటికీ గుర్తుండిపోయాయి. గ్రానైట్‌ ఫ్యాక్టరీలు, ఖనిజ సంబంధిత కవర్‌ల కింద పేలుడు పదార్థాలు తరలించడం ఇప్పుడు కొత్త కోణం. ఫిబ్రవరి సీజర్‌కు, మే 30 దాడులకు మధ్య సంబంధం ఉందా అని ఎన్‌ఐఏ ప్రత్యేకంగా విచారిస్తోంది. ఇక్కడ ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిల్వలు జరగడం, భక్తల్‌ సోదరులు వంటి అంతర్జాతీయ లింకులు, ఉత్తరప్రదేశ్‌–రాజస్థాన్‌–పంజాబ్‌లో ఇటీవల అరెస్టైన ఐఎస్‌ఐ ఏజెంట్లు.. ఈ అన్నీ కలిపి చూస్తే ఒక పెద్ద నెట్‌వర్క్‌ ఆవరణ కనిపిస్తుంది.

భద్రతా లోపాలు…
కేరళలో ఉగ్రవాదులను విడుదల చేయాలని కాంగ్రెస్‌–కమ్యూనిస్టు పక్షాలు అసెంబ్లీలో తీర్మానం చేయడం వంటి రాజకీయ చర్యలు భద్రతా ఏజెన్సీల పనిని క్లిష్టతరం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌ఐఏకు కేసు అప్పగించడంలో ఆలస్యం చేయడం కూడా ప్రశ్నార్థకం. ఇంత భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు దేశంలో ఎక్కడైనా సులభంగా తిరగడం రాష్ట్ర యంత్రాంగంలోని లోపాలను బయటపెడుతోంది.

అక్రమ వ్యాపారమా లేక వినాశకర ప్రణాళికా?
89 వేల జెలటిన్‌ స్టిక్స్‌ అనేది గ్రానైట్‌ క్వారీల కోసం కాకుండా చాలా పెద్ద ఎత్తున ఉపయోగించగల శక్తి. లైసెన్స్‌ లేకుండా, ఉల్లిగడ్డలు–బ్రిక్స్‌ల మాస్క్‌లో రవాణా చేయడం, మల్టీ–స్టేట్‌ నెట్‌వర్క్‌ ఇవన్నీ సాధారణ క్రై మ్‌ కంటే ఉగ్రవాద లక్ష్యాలను సూచిస్తాయి. ఇప్పటి వరకు ‘‘దేనికి ఉపయోగించాలనుకున్నారు’’ అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు. కానీ కేరళ ఉగ్రవాద చరిత్ర, సరిహద్దు ఏజెంట్ల కార్యకలాపాలు, దక్షిణాది రాష్ట్రాల మధ్య కనెక్టివిటీ చూస్తే ఇది సాధారణ అక్రమ వ్యాపారం కంటే ఎక్కువగా ఉండవచ్చని అనుమానాలు బలపడుతున్నాయి.

ఈ కేసు కేవలం ఒక లారీ సీజర్‌ కాదు. ఇది దక్షిణ భారతదేశంలో ఉగ్రవాదం మళ్లీ సంస్థాగత స్థాయిలో పునరుద్ధరణ చేసుకుంటున్నట్లు హెచ్చరిక. ఎన్‌ఐఏ దర్యాప్తు పూర్తి స్వేచ్ఛతో, రాజకీయ జోక్యం లేకుండా ముందుకు సాగాలి. రాష్ట్రాలు కేంద్ర ఏజెన్సీలతో సహకరించకపోతే భద్రతా లోపాలు పునరావృతమవుతాయి.

కాంగ్రెస్ గూటికి జగన్.. డీకే శివకుమార్ కు అదే టాస్క్

YS Jagan And DK Shivakumar
YS Jagan And DK Shivakumar

YS Jagan And DK Shivakumar: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఈరోజు బాధ్యతలు తీసుకొనున్నారు. ఇటీవల సిద్దరామయ్య తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అగ్ర నాయకత్వం వ్యూహాత్మకంగా డీకే శివకుమార్ కు కర్ణాటక బాధ్యతలు అప్పగించింది. అయితే కేవలం కర్ణాటకలో రాజకీయ ప్రయోజనాలు పొందడం కాదు.. దక్షిణ భారతదేశంలో బలమైన శక్తిగా కాంగ్రెస్ పార్టీని తీర్చిదిద్దేందుకు డీకే శివకుమార్ ద్వారా అగ్ర నాయకత్వం బలమైన స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక, కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. తమిళనాడులో కాంగ్రెస్ సహకారంతో విజయ్ ప్రభుత్వం నడుస్తోంది. దక్షిణాది రాష్ట్రాలను మరింత బలమైన క్యారీడార్ గా రూపొందించుకొని.. 2029 ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలు దక్కించుకోవాలన్నది కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ప్లాన్. అయితే కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత లోటు అనేది ఏపీ నుంచి ఉంది. దానిని భర్తీ చేసే బాధ్యతను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. డీకే శివకుమార్ కు అప్పగించినట్లు తెలుస్తోంది.

* ఓటు బ్యాంకు టార్గెట్..
ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అంత జగన్మోహన్ రెడ్డి వైపు ఉంది. షర్మిల ద్వారా దాని టర్న్ చేసే ప్రయత్నం జరిగిన వర్కౌట్ కావడం లేదు. ఇప్పుడున్న ఏకైక మార్గం జగన్మోహన్ రెడ్డి వద్ద ఉన్న ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీ వైపు టర్న్ చేయడం.. లేకుంటే జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం.. అది కాదంటే జగన్మోహన్ రెడ్డితో పొత్తు పెట్టుకోవడం. అయితే కాంగ్రెస్ పార్టీతో దోస్తీ అంటేనే అంత ఈజీగా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకునే పరిస్థితి లేదు. అది డీకే శివకుమార్ ద్వారా చేయాలన్నది రాహుల్ గాంధీ ప్లాన్. రాజశేఖర్ రెడ్డి ఉన్న నాటి నుంచి కుటుంబ, వ్యాపార సన్నిహితుడు డికె శివకుమార్. ఆ కుటుంబం బలం, బలహీనతలు తెలుసు. పైగా ఆస్తి పంచాయితీలు ఇప్పుడు నడుస్తున్నాయి. ఆపై జగన్మోహన్ రెడ్డికి బెంగళూరులో విలువైన ఆస్తులు ఉన్నాయి. ఈ పరిణామాల క్రమంలో డీకే శివకుమార్ జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీతో కలపగల శక్తి కలిగి ఉన్నారు. అందుకే అగ్రనేత రాహుల్ కీలక టాస్క్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

* దక్షిణాది రాష్ట్రాలు కీలకం..
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలో కూటమి అధికారంలోకి రావాలి అంటే దక్షిణాది రాష్ట్రాలు కీలకం. ఐదు రాష్ట్రాలు ఉంటే అందులో మూడింట నేరుగా అధికారంలో ఉంది. మరో రాష్ట్రంలో అధికార భాగస్వామిగా ఉంది. ఏపీలో మాత్రం టీడీపీ కూటమి ఉంది. ఆ కూటమిని ఢీ కొట్టాలంటే జగన్మోహన్ రెడ్డికి మిగతా రాజకీయ పక్షాలు సాయం అవసరం. అందుకే ఆయనను కాంగ్రెస్ గూటికి తెచ్చేందుకు శివకుమార్ అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. 135 పార్లమెంట్ స్థానాలు ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో మెజారిటీ సీట్లు వస్తే ఈజీగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అందుకే ఆయన బిజెపి నుంచి బయటకు వచ్చినట్టు కనిపిస్తున్నారు. ఇదే ఊపుతో డీకే శివకుమార్ పట్టు బిగిస్తే.. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

ఏపీలోని ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

AP Weather Update
AP Weather Update

AP Weather Update: ఏపీలో భిన్న వాతావరణం కనిపిస్తోంది. ఇంకా ఎండల తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఇదే పరిస్థితి ఉంది. అదే సమయంలో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో చల్లటి గాలులు వియడం ప్రారంభించాయి. గత వారంతో పోల్చితే ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టాయి. వడగాలుల తీవ్రత తగ్గింది. మరోవైపు చాలా ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. దీంతో వర్షాకాలం ప్రవేశించినట్టు అర్థం అవుతోంది. అయితే ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం అవుతోంది. వర్షాలు అనుకున్న స్థాయిలో పడడం లేదు. కానీ ఇప్పుడు ఓపరితల ఆవర్తనం ప్రభావంతో చిరుజల్లుల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

* సంక్రాంతి తర్వాత నుంచి..
ఈ ఏడాది సంక్రాంతి తర్వాత నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతూ వచ్చాయి. మార్చి రెండో వారం నుంచి విపరీతమైన ప్రభావం చూపడం ప్రారంభించాయి. ఏప్రిల్ లో ఎండలు మండిపోయాయి. మేనాటికి విశ్వరూపం చూపాడు భానుడు. ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు దాటాయి. రాయలసీమ అయితే మండిపోయింది. కోస్తాంధ్రతో పాటు ఉత్తరాంధ్రలో కూడా ఎండల ప్రభావం అధికంగా ఉంది ఈ ఏడాది. ఓ వారం రోజులపాటు 45 డిగ్రీలకు పైగా అన్నిచోట్ల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కానీ గత రెండు రోజులుగా చల్లటి వాతావరణం నెలకొంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో చిరుజల్లుల గురించి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ చెబుతోంది.

* ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తాంధ్రతో పాటు ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ప్రధానంగా అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడవచ్చని అంచనాలు వెల్లడించింది వాతావరణ శాఖ. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతుందని చెబుతోంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరిస్తోంది. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేసింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. వర్షం పడిన సమయంలో చెట్లు, టవర్లు, స్తంభాల వద్ద నిల్చో వద్దని సూచిస్తోంది. పశువుల పెంపకం దారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది.

అమరావతి రైతులు నిజంగా జగన్ ను కలిశారా?!

YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాల విన్యాసాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఇప్పుడు అమరావతి రైతుల ద్వారా సరికొత్త గేమ్ ఆడాలని చూస్తున్నారు. కానీ అది వర్కౌట్ అయ్యేలా లేదు. నిన్ననే అమరావతి రైతులు జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అయితే ఇందులో ఆశ్చర్యం ఉంది. ఎందుకంటే ఇదే అమరావతి రైతులు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా గళం ఎత్తారు. వారి ఉద్యమాన్ని సైతం ఉక్కు పాదంతో అణచివేయాలని జగన్మోహన్ రెడ్డి చేయని ప్రయత్నం అంటూ లేదు. అటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గరకు అమరావతి రైతులు వెళ్లడం ఏంటనేది ఇప్పుడు ప్రశ్న. కచ్చితంగా దీని వెనుక రాజకీయం ఉంటుంది అనేది ఒక అనుమానం. కానీ కూటమికి వ్యతిరేకంగా రాజకీయం చేయాలి కాబట్టి కొంతమంది అమరావతి రైతులను తీసుకొచ్చి కూటమి ప్రభుత్వంపై ఒక వ్యతిరేకత తేవాలన్న ప్రయత్నం కనిపిస్తోంది.

* కొద్దిమంది రైతుల విముఖత..
అమరావతిలో రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం నిర్ణయించింది. రైతుల వద్ద నుంచి భూమిని సేకరించింది కూడా. అయితే అతి కొద్ది మంది రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. సిఆర్డిఏ తీరుపై వారు అసంతృప్తితో ఉన్నారు. ఇది తెలుసుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ అధినేత జగన్మోహన్ రెడ్డి వద్దకు వస్తే ఈ సమస్యను లేవనెత్తి ప్రభుత్వం పరిష్కారం చేసేలా చూస్తారని నమ్మబలికారు. అయితే వారి ప్రయత్నం కొంతవరకు మాత్రమే వర్కవుట్ అయింది. ఎందుకంటే అలా భూములు ఇవ్వని మెజారిటీ రైతులు అసలు జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు ఇష్టపడలేదు. రైతులు మరీ తక్కువ రావడంతో వైసీపీ నేతలను రైతు ముసుగు వేసి జగన్మోహన్ రెడ్డి వద్ద కూర్చోబెట్టారు. జగన్మోహన్ రెడ్డి ఏవేవో వారికి హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

* ఆ ఛాన్స్ ఉందా
అసలు అమరావతి వద్దు అన్న జగన్మోహన్ రెడ్డి వద్దకు రైతులు వెళ్తారా? అలా వెళ్ళిన వారు ఏ ప్రలోభాలకు లోనై వెళ్లి ఉంటారో ఇట్టే అర్థం అవుతుంది. ఎందుకంటే అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నది.. ఇప్పుడు చేయాలనుకున్నది జగన్మోహన్ రెడ్డి. ఒకవైపు వేలకోట్ల రూపాయలతో అమరావతి రాజధాని నిర్మాణం పనులు జరుపుతుంటే మావిగన్ అని ప్రతిపాదనలు తెచ్చారు. ఇప్పటికీ అమరావతి పై కుట్రలు చేస్తూనే ఉన్నారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి వద్దకు అమరావతి రైతులు వెళ్లారంటే అది నమ్మశక్యం కాదు. అమరావతిని వ్యతిరేకించడమే కాదు రైతులను పెయిడ్ ఆర్టిస్టులతో పోల్చారు. ఇప్పుడు ఆ పెయిడ్ ఆర్టిస్టులతోనే భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అమరావతి రైతులకు. జగన్మోహన్ రెడ్డి వైఖరి తెలిసిన ఏ అమరావతి రైతు కూడా ఆయనను కలిసేందుకు ఇష్టపడరు. కానీ భూముల సేకరణ విషయంలో ప్రభుత్వం తమను ఇబ్బంది పెట్టిందని భావిస్తున్న వారు సైలెంట్ గా ఉంటారే తప్ప.. జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు మాత్రం ఇష్టపడరు. కానీ అమరావతి రైతులు కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారని చెప్పేందుకు చేసిన ప్రయత్నం గా అర్థం అవుతోంది. అంతకుమించి ఏమీ కనిపించడం లేదు కూడా ఇందులో.

వైసిపి నేతల డిఎస్సీ అభ్యర్థులు!

YSRCP DSC Campaign
YSRCP DSC Campaign

YSRCP Leaders DSC Candidates: సోషల్ మీడియా యుగం ఇది. సమాజంలో ఏ తప్పు జరిగిన క్షణాల్లో తెలిసిపోతుంది. ఫ్యాక్ట్ చెక్ సైతం క్షణాల్లో వాలిపోతుంది. సమాజంలో తప్పుడు ప్రచారంతో ముందుకెళ్తామంటే కుదిరే పని కాదు. ఇప్పుడు అటువంటి పనిలోనే ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఉన్నఫలంగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత రావాలి. కూటమిలోని మూడు పార్టీలు విడిపోవాలి. కూటమి ప్రభుత్వంలో వైఫల్యాలు పెద్ద ఎత్తున బయటపడి ప్రజలు తిరస్కరించాలి. ఆ ఆలోచన తప్ప వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఆలోచన లేదు. ఈ క్రమంలో ఆ పార్టీ తప్పు మీద తప్పు చేస్తూనే ఉంది. తాజాగా డీఎస్సీ 2025 పై కూడా అదే మాదిరిగా విషప్రచారం చేస్తోంది.

* గత ఏడాది ఉపాధ్యాయ నియామకాలు..
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. సీఎం చంద్రబాబు తొలి ఫైల్ గా డీఎస్సీ నోటిఫికేషన్ పై సంతకం పెట్టారు. అందుకు తగ్గట్టుగానే ఏడాది వ్యవధిలో 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారు. వారి నియామకం జరిగి ఏడాది పూర్తవుతోంది. కానీ ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డీఎస్సీలో అక్రమాలు జరిగాయని.. పేపర్ లీకేజ్ జరిగిందని.. వివరాలు వెబ్సైట్లో డిలీట్ చేశారని ఆరోపిస్తూ రాష్ట్రస్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది. దీనిపై ప్రభుత్వంతో పాటు విద్యాశాఖ ఉన్నతాధికారులు సుదీర్ఘ వివరణ ఇచ్చారు. పేపర్ లీకేజీ, రిజర్వేషన్ల ప్రకారం నియామకాలు, రాంకర్ల విషయంలో అనుసరించిన తీరు, రోస్టర్ పద్ధతి వంటి వాటిపై పూర్తి స్పష్టతనిచ్చారు. అయినా సరే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అదేపనిగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

* కేవలం గందరగోళానికి..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచనతో ముందుకు వెళ్తోంది. పోతే 16 వేల కుటుంబ ఓట్లు.. వస్తే ఆరు లక్షల కుటుంబాల ఓట్లు అన్నట్టు ఆ పార్టీ రాజకీయం నడుస్తోంది. ఈ క్రమంలో డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన అంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తోంది. కానీ డీఎస్సీ అభ్యర్థుల ముసుగులో ఉన్నది వైసీపీ నేతలే. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం వారే. ఇప్పుడు ఎక్కడికి అక్కడ ఆ నిజం బయటకు వస్తోంది. పార్టీలో యాక్టివ్ గా ఉన్న వారిని డీఎస్సీ అభ్యర్థులుగా చూపి వారితో మాట్లాడిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్లు చేయిస్తున్నారు. దీంతో ఇప్పుడు అడ్డంగా బుక్ అవుతున్నారు. గతంలో 2014 నుంచి 2019 వరకు ఇటువంటి ప్రచారం చేశారు. అందుకే ఇప్పుడు ఎంత మాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం తరఫున ఫ్యాక్ట్ చెక్ రంగంలోకి దిగుతోంది. మరోవైపు అనుకూల సోషల్ మీడియా కూడా రంగ ప్రవేశం చేసింది. దీంతో వైసిపి ప్రయత్నాలు బట్టబయలు అవుతున్నాయి.

వైయస్సార్ పై పవన్ ద్వేషం.. మధ్యలో జగన్!

Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో వైరం ఉందనే చెప్పాలి. నిన్న హైదరాబాద్ ప్రెస్మీట్లో కూడా రాజశేఖర్ రెడ్డి విషయాన్ని ప్రస్తావించారు. ఆయన మూలంగానే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఆయన తమను ఇబ్బంది పెట్టారని.. అందుకే ఇంతటి వ్యతిరేకత అన్నట్టు సంకేతాలు ఇచ్చారు పవన్ కళ్యాణ్. 2004 నుంచి 2010 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు రాజశేఖర్ రెడ్డి. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేశారు మెగాస్టార్ చిరంజీవి. అయితే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. ఆ సమయంలో చిరంజీవి కుటుంబానికి బెదిరింపులు వచ్చి ఉంటాయి. అదే సమయంలో కొన్ని రకాల కుటుంబ వివాదాలు కూడా జరిగాయి. తప్పకుండా ఆ సమయంలోనే ఏదో జరిగి ఉంటుంది. దానిని ప్రస్తావించిన పవన్ రాజశేఖర్ రెడ్డి తీరు వల్లే తాను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

* బెదిరింపుల పర్వం..
రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కోసం 25 సంవత్సరాల పాటు వేచి చూశారు. 2004లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటివరకు ఒక ఎత్తు.. అప్పటినుంచి ఒక ఎత్తు అన్నట్టు పరిస్థితి మారింది. విపరీతమైన సంక్షేమ పథకాలతో ఆయన ప్రజామోదం పొందారు. అయితే ఈ క్రమంలో రాజకీయ ప్రత్యర్థులను బెదిరించారు అన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో కొన్ని రకాల బెదిరింపులు వెళ్లినట్లు తెలుస్తోంది. అలాగే ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత.. ఎన్నికల్లో 70 లక్షల ఓట్లు సాధించిన పిఆర్పి కాంగ్రెస్లో విలీనం వెనుక కూడా రాజశేఖర్ రెడ్డి కుటిల ప్రయత్నాలు ఉన్నట్లు పవన్ కళ్యాణ్ లో ఒక అనుమానం ఉంది. పైగా సంక్షేమాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసిన వ్యవహారంపై కూడా పవన్ సీరియస్ గా ఉన్నారు. దాని పర్యవసానమే జగన్మోహన్ రెడ్డి పై ఆయన కోపం.

* అడ్డగోలు దోపిడీపై..
తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా దోపిడీకి పాల్పడ్డారు అనేది పవన్ కళ్యాణ్ లో ఉన్న అనుమానం. వైయస్ రాజశేఖర్ రెడ్డి పై ద్వేషం జగన్మోహన్ రెడ్డి పై కూడా కొనసాగించారు పవన్. అందుకే 2014 ఎన్నికల్లో పార్టీని స్థాపించి టిడిపికి మద్దతు తెలిపారు. 2019లో ప్రత్యేక పరిస్థితుల్లోనే ఒంటరి పోరాటానికి మొగ్గు చూపారు. 2024 లో మాత్రం పొత్తు కోసం అహర్నిశలు శ్రమించారు. ఇప్పుడు కూటమి 15 ఏళ్ల పాటు ఏపీలో కొనసాగుతుందని కుండబద్దలు కొట్టి చెబుతున్నారు. వైయస్ పై ఉన్న ద్వేషం జగన్మోహన్ రెడ్డి పై కొనసాగిస్తున్న పవన్.. కూటమి విచ్చిన్నానికి జరుగుతున్న ప్రయత్నాన్ని కూడా అడ్డుకుంటున్నారు. మొత్తానికైతే పవన్ ద్వేషం ఈనాటిది కాదన్నమాట జగన్ పై.

తానా మిడ్ అట్లాంటిక్ బ్లడ్ డ్రైవ్‌కు విశేష స్పందన

TANA Mid Atlantic Blood Drive
TANA Mid Atlantic Blood Drive

TANA Mid Atlantic Blood Drive: ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం – 40 మందికిపైగా దాతల భాగస్వామ్యం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ బృందం ఆధ్వర్యంలో ప్రముఖ నటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 103వ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. మే 31న ఎక్స్‌టాన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 40 మందికిపైగా రక్తదాతలు పాల్గొని సామాజిక బాధ్యతను చాటుకున్నారు.

TANA Mid Atlantic Blood Drive
TANA Mid Atlantic Blood Drive

ఈ రక్తదాన శిబిరాన్ని తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాణాలను కాపాడే రక్తదానం అత్యంత గొప్ప సేవ అని పేర్కొన్నారు. 40 మందికిపైగా దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన తానా మిడ్ అట్లాంటిక్ బృందం, రీజినల్ రిప్రజెంటేటివ్ ఫణి కంతేటి, స్వచ్ఛంద సేవకులు మరియు రక్తదాతలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

అదేవిధంగా 50 సార్లకు పైగా రక్తదానం చేసి అరుదైన మైలురాయిని చేరుకున్న రంజిత్ కోమటిని ఘనంగా సత్కరించారు. సమాజ సేవలో ఆయన చూపుతున్న నిబద్ధత అందరికీ ఆదర్శమని కొనియాడారు.

తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి కూడా మిడ్ అట్లాంటిక్ బృందం చేపట్టిన ఈ సేవా కార్యక్రమాన్ని ప్రశంసించారు. ముఖ్యంగా మొదటిసారిగా రక్తదానం చేసిన యువత ముందుకు రావడం సంతోషకర పరిణామమన్నారు.

కార్యక్రమానికి వేదికను ఉచితంగా అందించిన వేణు సంగనికి, అలాగే నిర్వహణలో సహకరించిన బ్లడ్ బ్యాంక్ ఆఫ్ డెల్మార్వా బృందానికి తానా నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ బ్లడ్ డ్రైవ్‌కు స్ప్రూస్ ఇన్ఫోటెక్ గ్రాండ్ స్పాన్సర్‌గా వ్యవహరించగా, టెస్లా రియాల్టీ గ్రూప్, తనిష్క్ యూఎస్ఏ, చు ఫైనాన్షియల్ సర్వీసెస్, ఓక్స్టన్, స్ప్రింగ్ ఈగిల్స్, రియల్ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ వారణాసి సంస్థలు ప్రీమియం స్పాన్సర్లుగా మద్దతు అందించాయి.

ఈ కార్యక్రమంలో సురేష్ యలమంచి, భవాని క్రొత్తపల్లి, శైలజ కస్తూరి, సరోజ పావులూరి, విశ్వనాథ్ కోగంటి, రంజిత్ మామిడి, శ్రీధర్ సాదినేని, శ్రీనివాస్ అబ్బూరి, హరి, గౌరి కర్రోతు, నాగరాజ్, కోటి యాగంటి, శ్రీకాంత్ గుడూరు, ప్రసాద్ కునారపు, రమణ కోత, మధు నల్ల తదితరులు పాల్గొన్నారు.

ఈ రాశుల వారికి ఈరోజు అద్భుతమైన ధన అవకాశం..

Today 21 July 2026 Horoscope
Today 21 July 2026 Horoscope

Today 3 June 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అద్భుతమైన అవకాశాలు ఉండలున్నాయి. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారి జీవితం ఈరోజు సంతోషంగా గడుస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులకు ఆకస్మిక ధన లాభం ఉంటుంది. ఉద్యోగులు అనుకున్న సమయానికి ప్రాజెక్టులను పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఎవరికైనా డబ్బు ఇచ్చేముందు ఆలోచించాలి. దీర్ఘ కాలిక దృష్టిని పెట్టుకొని కొత్తగా పెట్టుబడులు పెడతారు. అయితే ఈ సమయంలో పెద్దలను సంప్రదించడం మంచిది. ఉద్యోగులకు అనుకోకుండా అపారమైన ప్రయోజనాలు ఉంటాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ప్రియమైన వారి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. కొత్తగా ప్రాజెక్టులను ప్రారంభించే అవకాశం ఉంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్తగా ప్రాజెక్టులను చేపట్టేవారు పెద్దలను సంప్రదించడం మంచిది. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు ఆర్థికపరమైన విషయాల్లో అన్ని విజయాలు సాధిస్తారు. వ్యాపారులు ప్రత్యర్థులపై కన్నేసి ఉంచాలి. గ్రహాల అనుకూలతతో అన్నిట్లోనూ విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారి ఇంట్లో ఈరోజు శుభప్రదం గా ఉంటుంది. అనుకోకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయాల్లో ఉండే వారికి ప్రజల నుంచి మద్దతు ఏర్పడుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కొత్తగా వస్తువులు కొనే సమయంలో నాణ్యతను దృష్టిలో ఉంచుకోవాలి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు అపారమైన అవకాశాలు అందుతాయి. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త విషయాలు తెలుసుకోవాలని అనుకునే వారికి కీలక సమాచారం అందుతుంది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందుతాయి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : తులా రాశి వారు ఈరోజు ఆర్థికంగా ప్రణాళికతో ముందుకు వెళ్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. శుక్రుడి అనుగ్రహం వల్ల ఈ రాశి వారికి ఈ రోజు అన్ని శుభ ఫలితాలే ఉంటాయి. ఆసక్తిని బట్టి అవకాశాలు ఉంటాయి. ఇతరులకు దానధర్మాలు చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు తోటి వారి నుంచి మద్దతు ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. స్నేహితుల సహకారంతో అప్పుల నుంచి బయటపడతారు. అనుకోకుండా కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని శుభ ఫలితాలే ఉంటాయి. బంధువులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య భావోద్వేగాలు ఏర్పడతాయి. మానసికంగా సంతృప్తిగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే గురువుల మద్దతు ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు కొత్త అవకాశాలు వస్తాయి. అధికారుల నుంచి మద్దతు ఉండడంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు అపారమైన అవకాశాలు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షల్లో రాణించడానికి కష్టపడాల్సి వస్తుంది కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. బంధువుల నుంచి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు ప్రతికూలమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఉద్యోగులకు మెరుగైన ఫలితాలు ఉంటాయి. కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మానసికంగా గందరగోళం ఉంటుంది. ఇలాంటి సమయంలో ఓపికతో వ్యవహరించాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

అనంతిక.. నీ అందాలు చూడలేమిక..

Ananthika Sanilkumar Looks Pretty
Ananthika Sanilkumar Looks Pretty