Home Blog Page 188

డీఎంకే, కాంగ్రెస్.. చెన్నై లవ్ స్టోరీ ముగిసింది..

DMK Congress Alliance
DMK Congress Alliance

DMK Congress Alliance: రాజకీయాలు అంటే అవసరాలు మాత్రమే ఉంటాయి. ఆ సమయానికి అనుకూలంగా ఉన్న వాటితోనే రాజకీయ పార్టీలు స్నేహం కొనసాగిస్తాయి. ఒకసారి అవసరం తీరితే మీకు మీరే మాకు మేమే అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటాయి. మన దేశ రాజకీయాలలో ఇది కొత్తది కాదు.

ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. టీవీకే లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. కాకపోతే అధికారాన్ని సొంతం చేసుకునే విధంగా ఆ పార్టీకి మెజారిటీ రాలేదు. దీంతో అనేక పార్టీల సపోర్ట్ తీసుకుంది. ఇందులో కాంగ్రెస్ కూడా ఉంది. కాంగ్రెస్ మొన్నటి దాకా డీఎంకేకు సపోర్ట్ చేసింది. డీఎంకే మెరుగైన స్థానాలు సాధించకపోవడం.. అన్నిటికంటే ముఖ్యంగా స్టాలిన్ కూడా ఓడిపోవడంతో ఆ పార్టీ పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. మరో మాటకు తావు లేకుండా టీవీ కేకు సపోర్ట్ చేసింది. అంతేకాదు, రాహుల్ గాంధీ విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా హాజరయ్యారు.

ఇండియా కూటమిలో ఉంటూ డిఎంకె మిత్రభేదానికి పాల్పడింది. దీంతో అందరు ఊహించినట్టుగానే ఇండియాకుటమి నుంచి డీఎంకే బయటికి వస్తుందని అనుకున్నారు. ఇప్పుడు డీఎంకే అదే పని చేస్తోంది. ఈనెల 8న ఢిల్లీలో ప్రతిపక్ష కూటమి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో తాము పాల్గొనబోమని డిఎంకె గురువారం స్పష్టం చేసింది. దాని వెనక కారణాన్ని కూడా వెల్లడించింది. ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ పాల్గొంటున్నది కాబట్టి.. తాము హాజరు అయ్యేది లేదని డీఎంకే స్పష్టం చేసింది.

ఇండియా కూటమిలో అత్యంత బలమైన పార్టీ డిఎంకె. ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. ఆ తర్వాత టీవీ కేకు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇచ్చింది. దీంతో డిఎంకె ఒకింత అసంతృప్తిగా ఉంది. ఇటీవల తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో డీఎంకే కూటమిలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. ఐదు స్థానాలు సొంతం చేసుకుంది. మరోవైపు సమావేశానికి హాజరు కాకపోయినప్పటికీ.. మిగతా పార్టీలు వ్యక్తం చేసే దేశ సంక్షేమ అంశాలపై రాజీపడే ప్రసక్తి లేదని.. ఎప్పటి మాదిరిగా తమ గొంతును వినిపిస్తామని డిఎంకె వెల్లడించింది.. అయితే మరోసారి పార్లమెంటు ముందుకు డీ లిమిటేషన్ బిల్లు వస్తుందని వార్తలు వస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలలో బిజెపి సానుకూల ఫలితాలు సాధించిన నేపథ్యంలో.. ఈ బిల్ పాస్ అవడానికి అవకాశం ఉంది. టిఎంసి ఎంపీలు కూడా ఈ బిల్ ఆమోదం పొందడానికి సహకారం అందించే అవకాశం ఉందని సమాచారం. డీఎంకే కూడా సపోర్ట్ చేస్తుందని తెలుస్తోంది. అలాంటప్పుడు ఇండియా కూటమి ఏం చేస్తుందో చూడాల్సి ఉంది.

OnePlus నుంచి రెండు కొత్త మొబైల్స్.. ధర ఎంతంటే..

OnePlus New Phones
OnePlus New Phones

OnePlus New Phones: వన్‌ప్లస్ మొబైల్స్ కు మార్కెట్లో ప్రత్యేకంగా గుర్తింపు ఉన్నాయి. ఈ కంపెనీతో పాటు దీనికి అనుబంధంగా ఉన్న ఐక్యూ నుంచి లేటేస్ట్ గా రెండు కొత్త ఫోన్లు రాబోతున్నాయి. ఇవి లేటేస్ట్ ప్లాగ్ షిప్ ను కలిగి ఉండంతో పాటు బలమైన బ్యాటరీ వ్యవస్థను కలిగి ఉన్నాయి. వీటి గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

OnePlus నుంచి 16, iQOO 16 రెండు లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు రాబోతున్నాయి. ఇవి చైనాలో మొదట లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇంజనీర్లు ప్రస్తుతం iQOO 16తో సహా ఈ ఫోన్‌లను యాక్టివ్‌గా టెస్ట్ చేస్తున్నారు. ఈ రెండు ఫోన్‌లు 2nm ప్రాసెస్‌పై ఆధారపడిన స్నాప్‌డ్రాగన్ 8 ఎలిట్ జెన్ 6 ప్రో చిప్‌లతో రానున్నాయి. ఇది పర్ఫార్మెన్స్, బ్యాటరీ ఎఫిషియన్సీలో గణనీయమైన మెరుగుదలను అందిస్తుంది.

OnePlus 16:
OnePlus 16 మొబైల్ 1.5K రిజల్యూషన్ తో LTPO OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 240Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 9,000mAh బ్యాటరీతో ఉండడంతో దీనికి 120W వైడెడ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్టు చేయనుంది. కెమెరా సెటప్‌లో భాగంగా ఇందులో 200MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా వైడ్, 50MP టెలిఫోటో ఉంటాయి. ఈ మొబైల్ IPC69 రేటింగ్, అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ , USB 3 సపోర్ట్ చేస్తుంది.

iQOO 16:
iQOO 16 ఫోన్ లో 6.85-అంగుళాల AMOLED డిస్ ప్లే ఉండనుంది. ఇది 165Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 200MP మెయిన్ కెమెరా సెన్సార్‌తో రానుంది. 50MP పెరిస్కోప్ టెలిఫోటో, 50MP అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉంటాయి. Snapdragon 8 Elite Gen 6 Pro చిప్‌ సెట్ ను కలిగి ఉంటుంది.

OnePlus 16 , iQOO 16 రెండు 2nm చిప్‌లతో రానున్నాయి. ఇవి సుమారు 5,000 యువాన్ (సుమారు రూ.66,880) ప్రారంభ ధరతో ఉండవచ్చు, ఇది iQOO 15 ప్రారంభ ధర (4,199 యువాన్ లేదా రూ.56,160) కంటే ఎక్కువ. iQOO 16 భారతదేశంలో మధ్య నవంబర్ నుండి డిసెంబర్ 2026 మధ్యలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ధర సుమారు రూ.74,990 వరకు ఉండవచ్చు.

ఐఫోన్ 18 సిరీస్ ఫీచర్స్ లీక్.. ఎప్పుడు రిలీజ్ అంటే..

IPhone 18 Series
IPhone 18 Series

IPhone 18 Series: భారతదేశంలో యాపిల్ ఫోన్లకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు.. ఈ కంపెనీ నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఉత్సాహం చూపిస్తారు. అయితే ఇప్పటి వరకు 17 సిరీస్ లను తెచ్చిన ఈ కంపెనీ లేటేస్ట్ గా 18 సిరీస్ ను మార్కెట్లోకి తీసుకురాబోతుంది. అయితే లేటేస్ట్ గా ఆపిల్ ఐఫోన్ 18 Pro Max గురించి కొంత సమాచారం లీక్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ ఎలా ఉండబోతుందో చూద్దాం..

ఐఫోన్ తరువాతి సిరీస్ 18 Pro Max సెప్టెంబర్ 2026 రెండో వారంలో భారతదేశంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ ఇప్పటికే టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్లు, కెమెరా సిస్టమ్, డిజైన్ అన్ని విభాగాల్లో ప్రీమియం అనుభూతిని అందిస్తుందని సమాచారం. సాధారణంగా ఆపిల్ వరుసగా రెండేళ్లపాటు డిజైన్ లాంగ్వేజీని మార్చదు. కాబట్టి ఐఫోన్ 18 ప్రో మాక్స్ కూడా గత మోడల్ లుక్‌ను కొనసాగించే అవకాశం ఉంది.

ఐఫోన్ 18 ప్రో మాక్స్ 6.9-అంగుళాల స్క్రీన్ సైజులో రానుంది. ఇది ఇప్పటికే వచ్చిన మోడల్‌లతో సమానమే అనుకోవచ్చు. ఈ ఫోన్ 1320×2868 రెజల్యూషన్‌తో OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు HDR సపోర్ట్ ఉండనుంది.

ఐ ఫోన్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా TSMC యొక్క అత్యంత అధునాతన 2nm ప్రాసెస్ ఆధారంగా తయారైన A20 Pro చిప్‌తో రానుంది. ఈ చిప్ 4.5 GHz బిగ్ కోర్ స్పీడ్, 2.5 GHz స్మాల్ కోర్ స్పీడ్‌ను కలిగి ఉంటుంది. 2 బిగ్ కోర్లు, 4 స్మాల్ కోర్‌లతో 12GB RAM దీనిలో ఉంటుంది. ఈ చిప్ పర్ఫార్మెన్స్, బ్యాటరీ ఎఫిషియన్సీ , ఏఐ ఫీచర్‌లలో మెరుగుదలను అందిస్తుంది.

ఐఫోన్ 18 ప్రో మాక్స్ వెనుక వైపు ట్రిపుల్ 48MP కెమెరా సెటప్‌తో రానుంది. ఈ సెటప్‌లో అల్ట్రా వైడ్, టెలిఫొటో లెన్స్‌లు ఉంటాయి. ముఖ్యంగా, వేరియబుల్ మెకానిజం ప్రధాన సెన్సార్‌లో ఉండనుంది. 18 ప్రో మాక్స్ 5,000-5,200mAh బ్యాటరీతో రానుంది. ఇది 40W ఫాస్ట్ వైడెడ్ ఛార్జింగ్, 25W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టు చేయనుంది.

ఇందులో 12GB RAM, 256 నుంచి 1TB వరకు స్టోరేజ్ ఆప్షన్‌లతో రానుంది. భారతదేశంలో 256GB వేరియంట్ ధర రూ.1,64,900గా ఉండే అవకాశం ఉంది. 1TB వేరియంట్ ధర రూ.2,14,900 వరకు ఉండవచ్చు.ఈ ఫోన్ iOS 27 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రానుంది. 5G మరియు 4G కనెక్టివిటీ, USB టైప్ C పోర్ట్, ఆపిల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఫీచర్‌లలో మెరుగుదలలు ఉంటాయి. 5G సేటెలైట్ కనెక్టివిటీ కూడా మొదటిసారి ఐఫోన్‌లో ఉండవచ్చు.

ఐటీ కాదు.. లోకేష్ మదిలో ఉన్నది వేరే.. దెబ్బకు గ్లోబల్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్

Nara Lokesh Russia Visit
Nara Lokesh Russia Visit

Nara Lokesh Russia Visit: ఇప్పటివరకు ఐటీ రంగం అత్యధిక ఉద్యోగాలను కల్పిస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఐటీ రంగానికి విశేషమైన ప్రాధాన్యం ఇచ్చారు. పెట్టుబడులు పెట్టే విధంగా కంపెనీలకు ప్రోత్సాహకాలు కల్పించారు. ఆయన కల్పించిన స్వేచ్ఛాయుతమైన వాణిజ్య విధానం నేడు హైదరాబాద్ నగరాన్ని మన దేశానికి రెండవ ఐటి రాజధానిగా చేసింది.

విభజిత ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఐటీ రంగానికి విశేషమైన ప్రాధాన్యం ఇస్తున్నారు చంద్రబాబు. ఈ క్రమంలో దేశీయంగా పేరుపొందిన కంపెనీలు పెట్టుబడులు పెట్టే విధంగా రూపకల్పన చేస్తున్నారు. గూగుల్ నుంచి మొదలు పెడితే టిసిఎస్ వరకు పెద్ద పెద్ద కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఐటీరంగం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియడం లేదు ఈ నేపథ్యంలో కొత్త ఆలోచన చేశారు ఏపీ మంత్రి నారా లోకేష్. తన తండ్రి మాదిరిగానే వినూత్నంగా ఆలోచించి.. ఏపీ రాష్ట్రానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు.

నారా లోకేష్ ప్రస్తుతం రష్యాలో పర్యటిస్తున్నారు. అక్కడ అనేక రకాల కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. ఏపీలో ఉన్న పరిస్థితుల గురించి.. పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న విధానాల గురించి వెల్లడించారు. ఇక్కడితోనే నారా లోకేష్ ఆగిపోలేదు. ఏకంగా స్పేస్ పాలసీ గురించి వెల్లడించారు. తమ రాష్ట్రానికి స్పేస్ పాలసీ అనేది ఒకటి ఉందని.. తద్వారా రెండు ప్రత్యేకమైన స్పేస్ సిటీలను ఏర్పాటు చేస్తున్నామని నారా లోకేష్ వివరించారు.

రష్యాలోని ఎస్పీఐఎఫ్ వేదికగా జరుగుతున్న సదస్సులో ఆయన మాట్లాడారు.. స్పేస్ సిటీల ద్వారా 25వేల కోట్ల పెట్టుబడులు.. 5000 మందికి ప్రత్యక్షంగా.. 30 వేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు అందిస్తామని ఆయన ప్రకటించారు.. అంతరిక్షంలో ప్రయోగాలు చేసే వాహనాలకు సంబంధించిన అసెంబ్లింగ్.. ఉపగ్రహాల తయారీ.. ఇతర పరికరాల కోసం తిరుపతి సమీపంలో దాదాపు 2,800 ఎకరాల విస్తీర్ణంలో స్పేస్ సిటీని ఏర్పాటు చేస్తున్నామని నారా లోకేష్ వివరించారు.

ఇప్పటికే రాయల్ ఎన్ఫీల్డ్ రాయలసీమలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. కియా పరిశ్రమ రాయలసీమ ముఖ చిత్రాన్ని మార్చేసింది. ఇంకా అనేక రకాల పరిశ్రమలు రాయలసీమలో ఏర్పాటు కాబోతున్నాయి. ఇప్పుడు స్పేస్ సిటీ ద్వారా రాయలసీమలో ప్రధాన పట్టణమైన తిరుపతికి సరికొత్త గుర్తింపు రానుంది. ఆధ్యాత్మిక ప్రాంతంగా ప్రపంచ స్థాయి పేరు తెచ్చుకున్న తిరుపతి.. ఇప్పుడు పారిశ్రామికపరంగా కూడా సరికొత్తగా గుర్తింపును అందుకోనుంది.

ఫ్లెక్స్ ఫ్యూయెల్ బైక్ లు కూడా మార్కెట్లోకి.. ధర ఎంతో తెలుసా..

Flex Fuel Bikes In India
Flex Fuel Bikes In India

Flex Fuel Bikes In India: ప్రస్తుత కాలంలో పెట్రోల్ ధరలు ఇబ్బంది పెడుతున్న తరుణంలో ప్రత్యామ్నాయ ఇంధనం కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇథనాల్ తో నడిచే బైక్ గురించి ఆసక్తిగా చర్చ సాగుతోంది. ఇప్పటికే మారుతి సుజుకీ కంపెనీ నుంచి ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహనం రాబోతుంది.అయితే టూవీలర్ లోనూ ఇదే తరహా వాహనం మార్కెట్లోకి రాబోతుంది. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, హర్దీప్ సింగ్ పురీ కలిసి ఇటీవల ఢిల్లీలో హీరో స్ప్లెండర్‌+ ఫ్లెక్స్‌ ఫ్యూయల్, హెచ్‌ఎఫ్‌ డీలక్స్ ఫ్లెక్స్‌ ఫ్యూయల్ అనే బైక్ లను ఆవిష్కరించారు. ఈ బైక్ లు ఎలా ఉండబోతున్నాయంటే?

హీరో మోటోకార్ప్ కంపెనీ భారతదేశంలో ఇథనాల్‌తో నడిచే మొదటి 100సీసీ ఫ్లెక్స్‌ ఫ్యూయల్ మోటార్ సైకిళ్లను ప్రవేశపెట్టింది. కంపెనీ తన అత్యంత ప్రజాదరణ పొందిన స్ప్లెండర్‌+ , హెచ్‌ఎఫ్‌ డీలక్స్ మోడల్‌లను ఫ్లెక్స్‌ ఫ్యూయల్ వెర్షన్‌లలో అందుబాటులోకి తెచ్చింది. ఈ బైక్‌లు E20 నుంచి E85 వరకు ఉన్న ఇథనాల్ మిశ్రమాలపై సులభంగా నడుస్తాయి, అంటే 20 నుంచి 85 శాతం ఇథనాల్‌తో కూడిన ఇంధనంపై వీటిని ఉపయోగించవచ్చు.

హీరో స్ప్లెండర్‌+ ఫ్లెక్స్‌ ఫ్యూయల్ :
హీరో స్ప్లెండర్‌+ ఫ్లెక్స్‌ ఫ్యూయల్ బైక్ ఢిల్లీ ఎక్స్‌-షోరూమ్ ప్రకారం రూ.82,710 ధరకు అందుబాటులో ఉంది. ఈ బైక్ 97.2సీసీ ఇంజిన్‌తో నడుస్తుంది. ఇది E85 ఇంధనంపై నడిచే సమయంలో 8,000 RPM వద్ద 8 హార్స్‌పవర్ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్ప్లెండర్‌+ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌లలో ఒకటి. ఇది మైలేజ్, ధర పరంగా ఉత్తమంగా ఉంటుంది.

హెచ్‌ఎఫ్‌ డీలక్స్ ఫ్లెక్స్‌ ఫ్యూయల్:
హీరో హెచ్‌ఎఫ్‌ డీలక్స్ ఫ్లెక్స్‌ ఫ్యూయల్ బైక్ ఢిల్లీ ఎక్స్‌-షోరూమ్ ప్రకారం రూ.72,792 ధరకు అందుబాటులో ఉంది. ఈ బైక్ కూడా 97.2సీసీ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇది E85 ఇంధనంపై 8,000 RPM వద్ద 8 హార్స్‌పవర్ పవర్‌ను, 6,000 RPM వద్ద 8.3 న్యూటన్‌-మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 85 కిలోమీటర్లు.

ధర :
హెచ్‌ఎఫ్‌ డీలక్స్ ఫ్లెక్స్‌ ఫ్యూయల్ వెర్షన్, ప్రస్తుతం ఉన్న హెచ్‌ఎఫ్‌ డీలక్స్ బేస్ వెర్షన్‌ కంటే రూ.13,315 ఎక్కువ. అయితే హెచ్‌ఎఫ్‌ డీలక్స్ Pro వేరియంట్‌ కంటే కేవలం రూ.172 మాత్రమే ఎక్కువ. ఇది చాలా ఖరీదైనది కాదు. స్ప్లెండర్‌+ ఫ్లెక్స్‌ ఫ్యూయల్ కూడా దాని ప్రామాణిక వెర్షన్‌లతో పోలిస్తే కొంచెం ఎక్కువ ధరకే అందుబాటులో ఉంది.

ఈ ఫ్లెక్స్‌ ఫ్యూయల్ బైక్‌లు జూలై 2026 నుంచి ఢిల్లీ, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ బైక్‌ల ప్రవేశం భారతదేశంలో పర్యావరణ హిత ఇంధనాలను స్వీకరించడం , పెట్రోల్‌పై ఆధారపడటాన్ని తగ్గించడంలో గొప్ప మైలురాయిగా నిలుస్తుంది.

అనిల్ రావిపూడి మల్టీస్టారర్.. స్క్రిప్ట్ పూర్తికాగానే ఏం చేశాడో చూస్తే ఆశ్చర్యపోతారు..

Anil Ravipudi Multistarrer
Anil Ravipudi Multistarrer

Anil Ravipudi Multistarrer: కెరీర్ ప్రారంభం నుండి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోతున్న డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే మనకి గుర్తుకు వచ్చే పేర్లు రెండే , ఒకటి రాజమౌళి కాగా, మరొకటి అనిల్ రావిపూడి. రాజమౌళి సినిమా అంటే ఆడియన్స్ లో ఎలాంటి బ్రాండ్ ఇమేజ్ అయితే ఉందో , అనిల్ రావిపూడి సినిమాకు కూడా అదే రేంజ్ బ్రాండ్ ఇమేజ్ ఉంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో అనిల్ రావిపూడి రేంజ్ ని అందుకోవడం ఎవరికైనా కష్టమే. గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ , ఈ ఏడాది ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాలతో వరుసగా రెండు సార్లు రీజనల్ ఇండస్ట్రీ హిట్స్ ని అందుకొని తన సత్తా చాటాడు. ఇప్పుడు ఆయన లేటెస్ట్ గా విక్టరీ వెంకటేష్ , కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో ఒక మంచి మల్టీస్టార్రర్ ని ప్లాన్ చేసాడు.

ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ని నిన్న గాక మొన్ననే మొదలు పెట్టినట్టు అనిపిస్తుంది , కానీ అప్పుడే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయ్యిందట. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి తన స్వగ్రామం అయినటువంటి బాపట్ల జిల్లాలోని యద్దనపూడి మండలం , చిలుకూరివారిపాలెం లోని శ్రీ ఆంజనేయస్వామి సన్నిధిలో పండితుల నేతృత్వం లో నూతన మూవీ కి సంబంధించిన స్క్రిప్ట్ కి పూజలు చేయించారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. జులై లేదా, ఆగస్టు నెలలో ఈ సినిమా షూటింగ్ ని మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు . ప్రస్తుతానికి నందమూరి కళ్యాణ్ రామ్ ఖాళీగానే ఉన్నాడు, విక్టరీ వెంకటేష్ మాత్రం ‘ఆదర్శ కుటుంబం’ మూవీ షూటింగ్ తో బిజీ గా ఉన్నాడు. ఆగస్టు నాటికి ఆ సినిమా పూర్తి అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. కాబట్టి ఈ రెండు సినిమాల షూటింగ్స్ ని సమాంతరంగా చెయ్యాలని చూస్తున్నాడు వెంకటేష్. ఎట్టి పరిస్థితిలోనూ ఈ చిత్రాన్ని సంక్రాంతికి దింపే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్.

బీచ్ లో బి*కి*నీలో నైరా అందాల అరాచకం

Nyra Banerjee Summer Look
Nyra Banerjee Summer Look

'కరుప్పు' 20 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. 300 కోట్ల గ్రాస్ కి అతి చేరువలో..

Karuppu Movie Collections
Karuppu Movie Collections

Karuppu Movie Collections: ‘తమిళ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘కరుప్పు’ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన వసూళ్ల సునామీ ని నేటి తరం ఆడియన్స్ అంత తేలికగా మర్చిపోవడం కష్టమే. సూర్య ఇక ఎప్పటికీ కం బ్యాక్ ఇవ్వలేదు , ఆయన పని ఇక అయిపోయింది అని అనుకున్న ప్రతీ ఒక్కరి నోర్లను మూయించిన సినిమా ఇది. గత సినిమాల ప్రభావం కారణంగా కాస్త ఓపెనింగ్ వసూళ్లు తగ్గాయి కానీ, రెండవ రోజు నుండి మాత్రం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద శివ తాండవం చేసింది అనే చెప్పాలి. 20 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి ఎంత గ్రాస్ వసూళ్లు వచ్చాయి, బయ్యర్స్ కి ఎంత లాభాలు వచ్చాయి అనేది ఒకసారి వివరంగా చూద్దాం.

ముఖ్యంగా తమిళనాడు ప్రాంతం నుండి ఈ చిత్రానికి నమోదైన వసూళ్లు ట్రేడ్ విశ్లేషకులను విస్మయానికి గురి చేస్తోంది. అక్కడి ట్రేడ్ విశ్లేషకుల లెక్కల ప్రకారం చూస్తే ఈ చిత్రానికి తమిళనాడు నుండి 20 రోజుల్లో 150 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో 165 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా తెలుగు రాష్ట్రాల నుండి 32 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టగా, కర్ణాటక నుండి 21 కోట్ల 60 లక్షలు, కేరళ నుండి 13 కోట్లు , హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 3 కోట్ల రూపాయిలు , ఓవర్సీస్ నుండి 80 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 298 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. రేపు లేదా ఎల్లుండి తో ఈ చిత్రం 300 కోట్ల గ్రాస్ మార్కుని అందుకోనుంది.

ఇప్పటి వరకు కోలీవుడ్ లో 300 కోట్ల గ్రాస్ మార్కుని అందుకున్న హీరోలు కేవలం నలుగురే. సూపర్ స్టార్ రజినీకాంత్ రోబో నుండి వరుసగా ఆ మార్కుని అందుకుంటూ రాగా, విజయ్ బిజిల్ , మెర్సల్, లియో , గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం చిత్రాలతో ఈ 300 కోట్ల మార్కుని అందుకున్నారు. ఆ తర్వాత కమల్ హాసన్ విక్రమ్ చిత్రం తో ఈ క్లబ్ లోకి జాయిన్ అవ్వగా, లేటెస్ట్ గా సూర్య కూడా ఈ ఎలైట్ క్లబ్ లోకి చేరిపోయాడు. అంతే కాదు బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం మరో 10 నుండి 15 కోట్ల గ్రాస్ ని రాబట్టే అవకాశం ఉంది. బయ్యర్స్ కి ఇప్పటి వరకు 70 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయి.

తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్ రిటైర్మెంట్.. ఏం జరిగింది.. ఎందుకీ హఠాత్ నిర్ణయం

KS Bharat Retirement
KS Bharat Retirement

KS Bharat Retirement: కేఎస్ భరత్.. తెలుగు కుర్రాడు.. వర్ధమాన క్రికెటర్. వికెట్ కీపర్ కూడా. జాతీయ జట్టులో టెస్ట్ ఫార్మాట్ లో కూడా ఆడాడు. అటువంటి భరత్ కేవలం 32 సంవత్సరాల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. సామాజిక మాధ్యమాల వేదికగా అతడు ఈ విషయాన్ని ప్రకటించాడు. ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న భరత్ ఇలా రిటైర్మెంట్ ప్రకటించడంక్రికెట్ వర్గాలకు ఆశ్చర్యంతో పాటు ఆందోళన కలిగించింది.

సరిగ్గా 2023లో ఆస్ట్రేలియా జట్టుతో నాగపూర్ ప్రాంతంలో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా సుదీర్ఘ ఫార్మాట్లోకి భరత్ ఎంట్రీ ఇచ్చాడు. భారత జట్టు తరఫున ఏడు టెస్టులు ఆడాడు. మొత్తం 221 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ గా ఇతడు మెరుగైన ప్రదర్శన చేశాడు. మొత్తంగా 18 క్యాచ్లు.. ఒక స్టంప్ అవుట్ తన ఖాతాలో నమోదు చేసుకున్నాడు.

ఇంటర్నేషనల్ లెవెల్ లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ.. డొమెస్టిక్ క్రికెట్ లో మాత్రం సత్తా చూపించాడు. మొత్తం 113 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచులు ఆడాడు. 6102 రన్స్ చేశాడు. ఇందులో 11 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇతడి హైయెస్ట్ స్కోర్ 308.

లిస్ట్ ఏ క్రికెట్ లో ఇతడు మొత్తం 82 మ్యాచ్ లు ఆడాడు. ఇందులో 8 సెంచరీలున్నాయి. పది హాఫ్ సెంచరీలున్నాయి. మొత్తంగా 2692 పరుగులు చేశాడు. దేశవాళీ టి20 లలో 91 మ్యాచ్లు ఆడాడు. ఇందులో 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ విభాగంలో అతడు మొత్తం 1812 రన్స్ చేశాడు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భరత్ మొత్తం 11 మ్యాచులు ఆడాడు. ఒక హాఫ్ సెంచరీ చేశాడు..

కారణాలు బయటకు తెలియకపోయినప్పటికీ అంతర్గత రాజకీయాల వల్ల తను ఎదగలేనని విషయం భరత్ కు అర్థమై ఉంటుందని అందువల్లే రిటైర్మెంట్ ప్రకటించాడని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై భరత్ ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పినప్పటికీ.. భవిష్యత్తు కాలంలో కోచింగ్.. మెంటారింగ్ ద్వారా యంగ్ ప్లేయర్లకు సలహాలు సూచనలు ఇస్తానని అతడు చెప్పాడు.

“నేను భారత జట్టుకు ఆడటం గొప్ప విషయం గా భావిస్తున్నాను. ఈ ప్రయాణంలో నాకు కుటుంబ సభ్యులు అండగా నిలిచారు. శిక్షకులు.. తోటి ప్లేయర్లు.. బీసీసీఐ నాకు సపోర్ట్ చేసింది. కెరియర్ ప్రారంభంలో విరాట్ కోహ్లీ.. రోహిత్ శర్మ.. రాహుల్ ద్రావిడ్ ప్రత్యేకమైన ముద్ర నామీద వేశారు. వారికి ప్రత్యేకమైన నాది కృతజ్ఞతలు” అంటూ భరత్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు.

కొత్త అల్లుడికి ‘అర్ధనగ్నంగా’ పరీక్ష.. పాస్ అయితే ఆ పని మరీ..

Japanese Wedding Traditions
Japanese Wedding Traditions

Japanese Wedding Traditions: కొత్త అల్లుడికి విపరీతమైన గౌరవం ఇవ్వడం మన భారతదేశంలో పరిపాటిగా ఉంటుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే కొత్త అల్లుడికి రకరకాల కానుకలు పెడుతుంటారు. పండగల సందర్భంగా బట్టలు.. బంగారం.. వాహనాలు కొనుగోలు చేసి ఇస్తుంటారు. పెద్ద పండుగలప్పుడు అల్లుడికి బ్రహ్మాండంగా భోజనాలు.. రకరకాల పిండి వంటలు పెడుతుంటారు. ఇక బామ్మర్దులయితే ఒక ఆట ఆడుకుంటారు.

మనదేశంలో ఇలా ఉంటే జపాన్లో మాత్రం విచిత్రంగా ఉంటుంది. జపాన్ దేశంలో ఉయో నుమా అనే ప్రాంతంలో కొత్తగా పెళ్లయిన వరుడికి వణుకు పుట్టిస్తుంటారు. అయితే ఇది సరదాగా ఉంటుంది. దీనిని అక్కడివారు తమ ఆచారంగా చెబుతుంటారు. పెళ్లి జరిగిన తర్వాత వచ్చే తొలి చలికాలంలో బామ్మర్దులు వరుడుని మంచంలో అర్థనగ్నంగా నిలబెడతారు. ఆ తర్వాత అతని మీద విపరీతమైన చల్లటి నీళ్ళు పోస్తుంటారు.

ఇలా చల్లటి నీళ్లు పోయడానికి ఒక కారణం ఉంది. కొత్త పెళ్లికొడుకు ఇంటి బాధ్యతలను మోసేందుకు సరిపడా ధైర్యాన్ని.. ఓపికను కలిగి ఉన్నాడో లేదో తెలుసుకోవడానికి ఈ పరీక్ష నిర్వహిస్తుంటారు.. ఈ పరీక్షలో గనుక అల్లుడు పాస్ అయితే అతడు సమర్ధవంతుడు అని చెబుతుంటారు. కాకపోతే చాలామంది ఈ పరీక్షలో పాస్ అవుతుంటారు. బామ్మర్దులు ఆట పట్టిస్తుంటే.. ఎంత కష్టమైనా సరే ఆ చల్లటి నీళ్లను ఒంటిమీద పోసుకుంటారు. పైగా జపాన్ దేశంలో చలికాలంలో చలి విపరీతంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో అయితే ఉష్ణోగ్రత సింగిల్ డిజిట్ కు పడిపోతుంది.

అంతటి శీతల పరిస్థితుల్లో కూడా ఏమాత్రం భయపడకుండా ఆ చల్లటి నీళ్లను పోసుకుంటారు. ఆ తర్వాత చాలెంజ్లో గెలిచామని విజయ సంకేతాలు చూపిస్తుంటారు. చల్లటి నీళ్ళు పోసుకున్న తర్వాత గెలిచిన వరుడికి బామ్మర్దులు కానుకలు ఇస్తుంటారు. అతడిని భుజాల మీద మోసుకుంటూ గట్టిగా కేరింతలు కొడతారు.. సాధారణంగా అల్లుడికి గౌరవం కల్పించే సంప్రదాయం మనదేశంలో అధికంగా ఉంది.. మన పొరుగు దేశాలలో కూడా అది అదే స్థాయిలో ఉంది.

'పెద్ది' చిత్రాన్ని థియేటర్ లో దొంగచాటున చూసి పారిపోయిన హీరో శ్రీవిష్ణు.. వీడియో వైరల్..

Sree Vishnu Peddi
Sree Vishnu Peddi

Sree Vishnu Peddi: సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ మూవీ మేనియా నే కనిపిస్తోంది. థియేటర్స్ లో అభిమానులు ఈ సినిమాకు చేసిన హంగామా వీడియోస్ ని చూస్తే ఎవరికైనా కడుపు నిండిపోతుంది. నాలుగు నెలల నుండి సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేక , కరువు లో ఉన్న టాలీవుడ్ కి ఈ చిత్రం కొత్త పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. ఎక్కడ చూసినా హౌస్ ఫుల్స్, థియేటర్స్ సరిపోక , అదనపు థియేటర్స్ ని జత చేయడం, ఇలా జరగడం చూసింది చివరి సారిగా సంక్రాంతి కానుకగా విడుదలైన చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికే. ఆ తర్వాత ఆయన అబ్బాయి కే అలాంటి వైభోగాన్ని చూసే పరిస్థితి వచ్చింది. ఈ సినిమాకు కేవలం అభిమానులు , మూవీ లవర్స్ మాత్రమే కాదు , సినీ సెలెబ్రిటీలు కూడా థియేటర్స్ కి క్యూలు కట్టారు.

వారిలో మోస్ట్ క్రేజీ హీరో శ్రీ విష్ణు కూడా ఉన్నాడు. నేడు ఆయన ఒక థియేటర్ లో పెద్ది చిత్రాన్ని వీక్షించి , కెమెరా కి కనిపించకుండా, దొంచాటున వెళ్లిపోయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతోంది. శ్రీ విష్ణు సాధారణంగా ఇంతటి పబ్లిక్ థియేటర్స్ లో సినిమాలు చూసే రకం కాదు , అలాంటి ఆయన కూడా ఈ చిత్రాన్ని ఒక మాస్ థియేటర్ లో అభిమానుల మధ్య చూసి ఎంజాయ్ చెయ్యాలని కోరుకున్నదంటే , ఈ చిత్రం ఏ రేంజ్ అంచనాలను ఏర్పాటు చేసిందో అర్థం చేసుకోవచ్చు. కేవలం శ్రీవిష్ణు మాత్రమే కాదు , రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా నిన్న శ్రీరాములు థియేటర్ లో అభిమానులతో కలిసి సినిమా చూసి , పేపర్స్ గాల్లోకి ఎగురవేస్తూ ఎంజాయ్ చేసింది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

అదే విధంగా రాజమౌళి కుటుంబం మొత్తం నిన్న AMB సినిమాస్ లో ఈ చిత్రాన్ని వీక్షించారు. ఇక మాస్ మహారాజ రవితేజ కుమారుడు మహాధాన్ కూడా ఈ చిత్రాన్ని AMB సినిమాస్ లో వీక్షించాడు , అందుకు సంబంధించిన వీడియోలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, శ్రీవిష్ణు వీడియో నే చూసేందుకు చాలా ఫన్నీ గా అనిపించింది. ఆ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. చాలా కాలం తర్వాత ఒక సినిమాకు సినీ సెలబ్రిటీలు సైతం క్యూలు కట్టడం ఈ చిత్రానికే జరిగింది. ఇక రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఇంకా ఎంతటి ప్రభంజనాలను సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుందో చూడాలి.

పైకేమో ఆదర్శ దంపతులు.. లోపలేమో కోట్లల్లో మోసాలు.. ఇదీ యూట్యూబ్ నందుస్ వరల్డ్..

Telugu YouTubers Fraud Case
Telugu YouTubers Fraud Case

Telugu YouTubers Fraud Case: తెలుగు స్పష్టంగా మాట్లాడుతారు. తెలుగు వాళ్ళ కోసమే మేమున్నాం అన్నట్టుగా కలరింగ్ ఇస్తుంటారు. అంతేకాదు తెలుగుజాతి గురించి.. తెలుగు మనుషుల గురించి గొప్పగా చెబుతుంటారు. అదంతా నిజమైన నమ్మి చాలామంది మోసపోయారు. ఆ మోసపోయిన వాళ్లు కూడా తెలుగువాళ్లే కావడం విశేషం.

యూట్యూబ్ వేదికగా నందుస్ వరల్డ్ అనే పేరుతో ఒక ఛానల్ ఏర్పాటు చేశారు జాగర్లమూడి మధుకర్, రమానందన. వీరిది గుంటూరు జిల్లా. వీరు నందుస్ వరల్డ్ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు.. అందులో ఇంగ్లాండ్లో స్థిరపడిన భారతీయుల గురించి.. ఇంగ్లాండ్ కు రావాలి అనుకుంటున్న భారతీయుల గురించి రకరకాల విషయాలు చెప్పేవారు. దీంతో అనతి కాలంలోనే విశేషమైన గుర్తింపు సంపాదించుకున్నారు. వీరు యూట్యూబ్ వేదికగా మోసాలు చేయడానికి ఈ ఛానల్ ఏర్పాటు చేశారని ఇప్పుడు తేలింది.

రమానందన, మధుకర్ యూకే కు చాలా కాలం క్రితం వెళ్లారు. అక్కడ విరు స్థిరపడ్డారు. వీరిది గుంటూరు జిల్లా. వీరు మోసం చేశారని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఏడాది నవంబర్లో ఒక కేసు నమోదు అయింది. ఆ కేసు కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్ జిల్లాలోని కొత్తూరు ప్రాంతానికి చెందిన శివ క్రాంతి కుమార్ అనే వ్యక్తి లండన్ లో చదువుకున్నాడు. ఇతడు అక్కడ చదువుకున్నప్పుడు మధుకర్ పరిచయమయ్యాడు. శివ క్రాంతి అక్కడ ఉద్యోగం చేసి.. ఆ తర్వాత ఇండియాకు వచ్చాడు. అతడి వీసా రెన్యువల్.. భార్య కు సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్.. ఉద్యోగ అవకాశాల కోసం శివ క్రాంతి ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలో మధుకర్ ను కలిశాడు. ఈ నేపథ్యంలో మధుకర్ శివ క్రాంతిని గుంటూరులో ఉన్న డెస్టినీ అనే కార్యాలయంలో స్పందించాలని సూచించాడు. అక్కడ తన తండ్రి మోహన్ రావు ఉంటాడని.. అతడికి 15 లక్షలు ఇవ్వాలని చెప్పాడు. మోహన్ రావు శివ క్రాంతి 2023లో కలిశాడు. అతడు చెప్పినట్టుగా రెండు ఖాతాలకు 15 లక్షలు పంపించాడు.

నగదు చెల్లించిన రెండు నెలల తర్వాత అగార్డ్ సొల్యూషన్స్ పేరుతో మధుకర్ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ను శివ క్రాంతికి పంపించాడు. దీంతో శివ క్రాంతి ఆ కంపెనీలో ఆరా తీశాడు.. తన కంపెనీని మధుకర్ తప్పుడు మార్గానికి వాడుకున్నాడని సంస్థ అధినేత ఫైజల్ చెప్పాడు. దీంతో శివ క్రాంతి కాళ్ళకింది భూమి కంపించిపోయింది. దీంతో అతడు మధుకర్ దంపతులను నిలదీశాడు. తన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఫలితంగా మధుకర్ దంపతులు కేవలం రెండు లక్షలు మాత్రమే ఇచ్చారు. మిగతా డబ్బులు ఇవ్వలేదు. దీంతో శివ క్రాంతి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంలో కేసులు నమోదు చేసిన పోలీసులు.. నోటీసులు పంపించారు. మధుకర్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. కేసును క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. అది విచారణ దశలో ఉంది

కేవలం శివ క్రాంతి మాత్రమే కాకుండా గుజరాత్ రాజస్థాన్ బీహార్ రాష్ట్రాలకు చెందిన చాలామంది యువకులను వీరిద్దరూ ఇలానే మోసం చేసినట్టు తెలుస్తోంది. ఒక్కో వ్యక్తి దగ్గర దాదాపు 20 లక్షల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంపై రమానందన స్పందించారు. తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తమకు ఎటువంటి కంపెనీలు లేవని చెప్పారు. కానీ ఇప్పటికే సోషల్ మీడియాలో జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

సూర్య ఔట్.. టీమిండియా టి20 కెప్టెన్ ఇతడే..

Suryakumar Yadav Comeback
Suryakumar Yadav Comeback

Suryakumar Yadav Removed As T20 Captain: టీమ్ ఇండియా టి20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కు ఉద్వాసన పలుకుతున్నారా.. అతడి స్థానంలో వేరే ఆటగాడికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించబోతున్నారా.. మేనేజ్మెంట్ ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసిందా.. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉందా.. ఈ ప్రశ్నలకు అవును అని సమాధానం చెబుతున్నారు క్రికెట్ విశ్లేషకులు. ఎందుకంటే కేవలం రెండు రోజుల్లోనే టీమిండియా టి20 కెప్టెన్ విషయంలో ఒక కీలక ప్రకటన వస్తుందని వారు వివరిస్తున్నారు.

టీమిండియా తదుపరి ఐర్లాండ్, ఇంగ్లాండ్ జట్లతో టి20 సిరీస్ మాత్రమే కాకుండా ఆసియా గేమ్స్ లో కూడా రంగంలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూడు సిరీస్లలో ఆడే జట్టు వివరాలను మేనేజ్మెంట్ ప్రకటించబోతోంది. టి20 జట్టు లో సారథిగా సూర్య అదరగొట్టాడు. ఆటగాడిగా అతడు అంతగా ప్రభావం చూపించలేదు. అయితే భవిష్యత్తు లక్ష్యాలు వేరే విధంగా ఉండడంతో మేనేజ్మెంట్ కొత్త కెప్టెన్ వైపు దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది.

కొత్త సారథిగా అతడే

టి20 ప్రపంచ కప్ లో భారత జట్టును సూర్య కుమార్ యాదవ్ ముందుకు నడిపించాడు. ఏకంగా వరల్డ్ కప్ అందించాడు. ఐపీఎల్ లో ముంబై జట్టు తరఫున ఆడాడు. కానీ స్థిరమైన ఆట తీరు కొనసాగించడం విఫలమయ్యాడు. 2028లో టి20 ప్రపంచ కప్.. లాస్ ఏంజిల్స్ వేదికగా ఒలంపిక్స్ జరుగుతాయి.. ఈ టోర్నీల కోసం జట్టును సిద్ధం చేయాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. కొత్త సారధిగా పంజాబ్ జట్టు కెప్టెన్ అయ్యర్ కు అవకాశం కల్పిస్తారని ప్రచారం జరిగింది. అయితే అతడు మాత్రమే కాకుండా తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కూడా జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. సంజు శాంసన్, ఇషాన్ కిషన్ వంటి వారు కూడా కెప్టెన్ రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. గంభీర్, సెలెక్టర్ల మధ్య కెప్టెన్ విషయంలో ఇంకా క్లారిటీ లేదని తెలుస్తోంది.

ఆసియా క్రీడలకు సంబంధించి ఇప్పటికే కొంతమంది ప్లేయర్లను బీసీసీఐ ప్రకటించింది. అందులో సూర్య, గిల్ కు అవకాశం లభించలేదు. వెస్టిండీస్ జట్టుతో జరిగే సిరీస్, 2028లో జరిగే ఒలంపిక్ గేమ్స్, టి20 వరల్డ్ కప్ వంటి టోర్నీలు ఉన్న నేపథ్యంలో.. సూర్య కుమార్ యాదవ్ ను ఆసియా గేమ్స్ కు ఎంపిక చేయలేదని తెలుస్తోంది.

ఒకవేళ కొత్త కెప్టెన్ ను ఇప్పుడు నియమిస్తే కేవలం ఐర్లాండ్, ఇంగ్లాండ్ జట్లతో జరిగే సిరీస్ లకు మాత్రమేనా.. భవిష్యత్తు టోర్నీలకు కూడా ఉంటుందా అనే ప్రశ్నకు త్వరలోనే సమాధానం లభించబోతుంది. ఆసియా క్రీడల కోసం పంపే భారత జట్టులో సీనియర్లు ఆడబోరని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఇంగ్లాండ్ జట్టుతో జరిగే పొట్టి సిరీస్ కు మాత్రమే పూర్తిస్థాయిలో జట్టు వెళ్తుంది. అదే సూర్య స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరో త్వరలో తేలిపోతుంది.

సూర్య కుమార్ యాదవ్ విషయాన్ని కాస్త పక్కన పెడితే ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్ లలో టి20 జట్టులో సూర్య వంశీ కి చోటు లభించే అవకాశం ఎక్కువ కనిపిస్తోంది.. సూర్య వంశీ ఐపీఎల్ లో అదరగొట్టాడు. అన్ని వ్యక్తిగత ట్రోఫీలను సొంతం చేసుకున్నాడు. అతడికి ఈ సిరీస్లలో అవకాశం ఇవ్వాలని చాలామంది కోరుతున్నారు. బీసీసీఐ కూడా సానుకూల ధోరణితో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అతడు గనుక అంతర్జాతీయ క్రికెట్ లోకి ప్రవేశిస్తే సచిన్ రికార్డును బ్రేక్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు.

టీమిండియా ఈనెల 26 నుంచి 25 వరకు ఐర్లాండ్ జట్టుతో రెండు టీ20 లను ఆడుతుంది.

వచ్చేనెల 1వ తేదీ నుంచి 19 వరకు ఇంగ్లాండ్ లో ఇండియా పర్యటిస్తోంది. ఐదు టి 20 మ్యాచ్లు ఆడుతుంది.

వచ్చేనెల 23 నుంచి 26 వరకు జింబాబ్వే తో మూడు టి20 మ్యాచ్ల సిరీస్ ఆడుతుంది.

సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్ వేదికగా ఆసియా గేమ్స్ జరుగుతాయి. ఇందులో టీమ్ ఇండియా ఆడుతుంది.

'పెద్ది' థియేటర్ లో లేడీ అభిమాని హంగామా..ఇదేమి డ్యాన్స్ బాబోయ్.. వీడియో వైరల్..

Peddi Theater Viral Video
Peddi Theater Viral Video

Peddi Theater Viral Video: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. నిన్నటి ప్రీమియర్ షోస్ నుండే ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఆ తర్వాత మొదటి రోజు రెగ్యులర్ షోస్ నుండి ఎలాంటి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందో అనే భయం అభిమానుల్లో ఉండేది. ఎందుకంటే ఈ సినిమా క్లైమాక్స్ అంత రిస్కీ కాబట్టి , కానీ ఆ క్లైమాక్స్ కి కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రెగ్యులర్ ఆడియన్స్ నుండి వచ్చింది. దీంతో ఈ సినిమా ఓపెనింగ్స్ కి ఆకాశమే హద్దు అయిపోయింది. మొదటి రోజు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 120 నుండి 130 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

ఇది కాసేపు పక్కన పెడితే ఈ చిత్రాన్ని అభిమానులు థియేటర్స్ వద్ద ఏ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకున్న వీడియోలు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అయ్యాయి. ఆ వీడియోస్ లో ఒక అమ్మాయి థియేటర్ లో ‘రయ్ రయ్ రారా’ పాటకు డ్యాన్స్ వేస్తూ కనిపించడం ఆడియన్స్ ని ప్రత్యేకంగా ఆకర్షించింది. చూసేందుకు చాలా చక్కగా ఉన్న ఈ అమ్మాయిని చూసి యూత్ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. సోషల్ మీడియా మొత్తాన్ని ఈ వీడియో ఇప్పుడు ఒక రేంజ్ లో చుట్టేస్తోంది. ఆ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ఇలాంటి వీడియోస్ సోషల్ మీడియా లో ఎన్నో వచ్చాయి, లెక్కే లేదు , ఇలాంటి సినీ పండుగ వాతావరణం మన టాలీవుడ్ లో చూసి చాలా రోజులే అయ్యింది. ఈ పెద్ది సునామీ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి. హిందీ లో కూడా ఆదరణ దక్కితే , కచ్చితంగా ఈ చిత్రం 600 కోట్ల గ్రాస్ ని కొల్లగొడుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

 

View this post on Instagram

 

A post shared by AkkaBro (@akkabro_memes_songs)

46 ఏళ్ళ రితబ్రత బెనర్జీ బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు

Ritabrata Banerjee

Ritabrata Banerjee : రితబ్రత బెనర్జీ.. ఈ పేరు ఎప్పుడూ వినుండరు.. పబ్లిక్ గా ఈ పేరు ఎవరికి తెలిసి ఉండదు. 46 ఏళ్ల ఈ టీఎంసీ నేత ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిగా పశ్చిమ బెంగాల్ లో ఎన్నికయ్యారు. 59 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు కలిపి ఎన్నుకున్న యువ నాయకుడు. మే 4న ఫలితమే బెంగాల్ లో ఒక సంచలనం. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు రితబ్రత బెనర్జీ ఎన్నికవడం ఒక సంచలనం.. ఈయన చరిత్ర చూస్తే గమ్మత్తుగా ఉంది. పైకి ఎదిగినటువంటి తీరు మాత్రం ఆశ్చర్యం కలిగిస్తోంది.

కాలేజీలో చదువుకున్నప్పుడు స్టూడెంట్ లీడర్ గా ఎదిగి అక్కడ నుంచి ఎస్.ఎఫ్.ఐ సీపీఎం అనుబంధం సంఘంలో యాక్టివ్ గా ఉండేవాడు. 30 ఏళ్లలోపే ఎస్ఎఫ్ఐ అఖిల భారత సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్నికయ్యాడు. అప్పటి బెంగాల్ మంత్రి గౌతమ్ దేవ్ కు సన్నిహితుడిగా ఉండి రాజకీయాల్లో ఎదిగాడు. 2008 నుంచి ఎస్ఎఫ్ఐ లీడర్ గా.. జనరల్ సెక్రటరీగా కొనసాగాడు.

2013లో సంచలనమైంది. వెస్ట్ బెంగాల్ ఫైనాన్స్ మినిస్టర్ అమిత్ మిశ్రాను విద్యార్థి నాయకులు కొట్టారు. ఈ దాడిలో రితబ్రత బెనర్జీని అరెస్ట్ చేశారు. దీంతో రితబ్రతను తీసేయ్యకపోగా అతడికి గుర్తింపునిచ్చి నేతలు పైకి తీసుకొచ్చారు. బుద్దదేవ్ భట్టాచార్య, సీతారం ఏచూరికి మరింత ఆకర్షించి వారి దృష్టిలో పడి రాజకీయాల్లో పైకి ఎదిగాడు.

46 ఏళ్ళ రితబ్రత బెనర్జీ బెంగాల్ ప్రతిపక్ష నాయకుడిగా ఎలా ఎదిగాడన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..

చిరంజీవి తో సినిమా చేయడం మా కల అంటున్న స్టార్ డైరెక్టర్స్... లిస్ట్ లో ఎంతమంది ఉన్నారంటే..?

Chiranjeevi
Chiranjeevi

Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి చాలా మంచి గొప్ప గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఇక ఇప్పటివరకు ఆయన సాధించని విజయం లేదు. ఆయన అందుకొని అవార్డు లేదు. అలాంటి చిరంజీవి ఈ మధ్యకాలంలో కొంతవరకు డౌన్ అవుతున్నాడు. ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో సక్సెస్ ని సాధించిన కూడా అది ఆయన రేంజ్ హిట్ అయితే కాదని చాలామంది చెబుతున్నారు. ఆ సినిమాలో చిరంజీవి యాక్టింగ్ కూడా అంత పెద్దగా ఎఫెక్టివ్ గా అనిపించలేదని కేవలం పండగ సీజన్ కాబట్టి ఆ సినిమా నడిచిందని చెప్పుకునే వారు కూడా ఉన్నారు. ఇక ఇలాంటి సందర్భంలోనే తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలంటే మాత్రం డిఫరెంట్ గా ప్రయత్నం చేయాల్సిన అవసరమైతే ఉంది. ఒకానొక సందర్భంలో చిరంజీవి అంటే ప్రేక్షకుల్లో ఒక క్రేజ్ ఉండేది. అతని నుంచి వచ్చే సినిమాలను ప్రేక్షకులు మొదటి రోజు చూడాలి అనేంతలా గొప్పగా ఉండేవి. కానీ ఇప్పుడు చిరంజీవి నుంచి వచ్చే సినిమాలు నాసిరకం కథలతో వస్తున్నాయని రొటీన్ కమర్షియల్ సినిమా నేపథ్యంలోనే సినిమాలు వస్తున్నాయని చాలామంది విమర్శిస్తున్నారు. మరి వీటన్నింటికి చెక్ పెడుతూ చిరంజీవి ఒక డిఫరెంట్ ప్రయత్నం చేయాల్సిన సమయమైతే ఆసన్నమైంది…ఇక ఇదిలా ఉంటే అతను ఓకే అంటే అతనితో సినిమాలు చేయడానికి చాలామంది దర్శకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొత్త దర్శకుల నుంచి స్టార్ట్ డైరెక్టర్స్ వరకు అతనితో సినిమాలు చేయడం వాళ్ళందరి కలగా భావిస్తున్నారు.

ఇక ఇప్పటికే ఆయనతో సినిమా చేసే అవకాశం కొంతమంది దర్శకులకు దక్కితే మరి కొంత మందికి మాత్రం దక్కడం లేదు. ఇక పూరి జగన్నాధ్ లాంటి దర్శకుడు సైతం కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా అతనితో సినిమా చేయడానికి ఇండస్ట్రీకి వచ్చానని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. అయినప్పటికి తనకు అవకాశమైతే ఇవ్వడం లేదు. ఎందుకని చిరంజీవి పూరిని పక్కన పెడుతున్నాడు అనే విషయంలో కూడా సరైన క్లారిటి రావడం లేదు.

ఇక బయపాటి శ్రీను సైతం చిరంజీవితో సినిమా చేయడం తన డ్రీమ్ అంటూ పలు సందర్భాల్లో చెప్పాడు. ఎందుకంటే చిరంజీవి, బాలకృష్ణ సినిమాలను చూసుకుంటూనే పెరిగాను కాబట్టి వాళ్ళతో సినిమా చేస్తే అదొక కిక్కు వస్తుంది అంటూ ఆయన చెప్పడం విశేషం… ఇక గోపీచంద్ మలినేని సైతం చిరంజీవితో సినిమా పక్కా చేస్తాను అంటూ ఆయన చాలా స్ట్రాంగ్ గా చెబుతున్నాడు. కారణం ఏంటి అంటే చిరంజీవిలో ఒక ఆరా ఉంటుందని దాన్ని మనం పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయగలిగితే ఆ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని ఆయన భావిస్తున్నాడు.

ఇక హరీష్ శంకర్ సైతం చిరంజీవితో సినిమా చేయడానికి పలు కథలను కూడా వినిపించాడు. కానీ చిరంజీవి మాత్రం ఆ కథలకు పెద్దగా ఇంప్రెస్ కానట్టుగా తెలుస్తుంది. దాని వల్ల అతన్ని పక్కనపెడుతున్నాడు. ఇక రీసెంట్ గా ఆయన పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చేశాడు. ఈ మూవీ కూడా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో హరీష్ శంకర్ ను పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ దర్శకులు చిరంజీవి తో ఎప్పుడు సినిమాలు చేస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది…

'పెద్ది' చిత్రం లో ఈ మార్పు చేసి ఉంటే 1000 కోట్లు కొల్లగొట్టి ఉండేదా..?

Peddi movie alternate changes
Peddi movie alternate changes

Peddi movie alternate changes: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం నేడు కనీవినీ ఎరుగని రేంజ్ అంచనాల మధ్య విడుదలైన ప్రీమియర్ షోస్ నుండే అద్భుతమైన పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈమధ్య కాలం లో ఒక స్టార్ హీరో సినిమాకు , ఆడియన్స్ నుండి ఈ రేంజ్ పాజిటివ్ టాక్ రావడం పెద్ది కే చూస్తున్నాం అంటూ సోషల్ మీడియా లో ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు. బుచ్చి బాబు దర్శకత్వ విభాగం లో కాస్త తడబడినప్పటికీ , రామ్ చరణ్ తన అద్భుతమైన నటనతో ఆడియన్స్ ని థియేటర్స్ లో థ్రిల్ కి గురి చేశాడని , అందుకే ఈ సినిమాకు ఈ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందని అంటున్నారు. అయితే ఈ సినిమా కు బుచ్చి బాబు కొన్ని చిన్న చిన్న మార్పులు చేసి ఉంటే మరో లెవెల్ కి వెళ్లి ఉండేదని అంటున్నారు.

వాటిల్లో ప్రధానంగా చెప్పుకునేది స్క్రీన్ ప్లే గురించి . ఇందులో హీరో ఒక ఆట నుండి మరో ఆటకు వెళ్లే ప్రక్రియ కాస్త న్యాచురాలిటీ కి దూరంగా ఉందని , క్రికెట్ నుండి కుస్తీ కి మారడం వరకు ఓకే కానీ , ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో హీరో ఏకంగా కాళ్ళు విరగ్గొట్టుకొని , ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొనడం మరీ దారుణంగా ఉందని , దానిని మార్చేసి , సెకండ్ హాఫ్ మొత్తం కుస్తీ లైన్ లోనే ఈ సినిమాని ముందుకు సాగించి ఉండుంటే , వేరే లెవెల్ లో ఉండేదని , డైరెక్టర్ బుచ్చి బాబు ఆ చిన్న మార్పు చేసి ఉండుంటే ఈ సినిమా వెయ్యి కోట్ల రూపాయలకు ఒక్క రూపాయి కూడా తగ్గేది కాదని అంటున్నారు. ఇప్పటికీ ఈ సినిమాకు 500 కోట్ల గ్రాస్ ని అవలీల గా అందుకునే అవకాశం ఉంది కానీ, వెయ్యి కోట్ల పొటెన్షియల్ ని కిల్ చేసారని అంటున్నారు విశ్లేషకులు.

అంతే కాకుండా ఫస్ట్ హాఫ్ సగానికి పైగా రొటీన్ గా సాగిందని, హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రకు కూడా ఘోరమైన నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందని , వీటిని కరెక్ట్ చేసుకొని ఉండుంటే ఇంకా అద్భుతమైన టాక్ వచ్చి ఉండేదని అంటున్నారు. అంతే కాకుండా ఈ సినిమాలో పెద్ద పెద్ద ఆర్టిస్టులను తీసుకున్నారు కానీ , వాళ్లకు సరైన క్యారెక్టర్స్ డిజైన్ చేయడం లో బుచ్చి బాబు విఫలం అయ్యాడని, ఒక్క జగపతి బాబు క్యారెక్టర్ ఒక్కటే బాగుందని , ఆయన పాత్రని ఇంకా కొద్దిగా పొడిగించి ఉండుంటే బాగుండేదని అంటున్నారు. సినిమా మొత్తం రామ్ చరణ్ భుజాల మీద మోసినట్టు గానే ఉందని , సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా కాస్త సహకరించి ఉండుంటే ఈ సినిమా స్థాయి వేరే లెవెల్ లో ఉండేదని అంటున్నారు , చూడాలి మరి ఈ సినిమా లాంగ్ రన్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.