Homeఎంటర్టైన్మెంట్Peddi movie alternate changes: 'పెద్ది' చిత్రం లో ఈ మార్పు చేసి ఉంటే 1000...

Peddi movie alternate changes: ‘పెద్ది’ చిత్రం లో ఈ మార్పు చేసి ఉంటే 1000 కోట్లు కొల్లగొట్టి ఉండేదా..?

Peddi movie alternate changes: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం నేడు కనీవినీ ఎరుగని రేంజ్ అంచనాల మధ్య విడుదలైన ప్రీమియర్ షోస్ నుండే అద్భుతమైన పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈమధ్య కాలం లో ఒక స్టార్ హీరో సినిమాకు , ఆడియన్స్ నుండి ఈ రేంజ్ పాజిటివ్ టాక్ రావడం పెద్ది కే చూస్తున్నాం అంటూ సోషల్ మీడియా లో ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు. బుచ్చి బాబు […]

Peddi movie alternate changes: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం నేడు కనీవినీ ఎరుగని రేంజ్ అంచనాల మధ్య విడుదలైన ప్రీమియర్ షోస్ నుండే అద్భుతమైన పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈమధ్య కాలం లో ఒక స్టార్ హీరో సినిమాకు , ఆడియన్స్ నుండి ఈ రేంజ్ పాజిటివ్ టాక్ రావడం పెద్ది కే చూస్తున్నాం అంటూ సోషల్ మీడియా లో ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు. బుచ్చి బాబు దర్శకత్వ విభాగం లో కాస్త తడబడినప్పటికీ , రామ్ చరణ్ తన అద్భుతమైన నటనతో ఆడియన్స్ ని థియేటర్స్ లో థ్రిల్ కి గురి చేశాడని , అందుకే ఈ సినిమాకు ఈ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందని అంటున్నారు. అయితే ఈ సినిమా కు బుచ్చి బాబు కొన్ని చిన్న చిన్న మార్పులు చేసి ఉంటే మరో లెవెల్ కి వెళ్లి ఉండేదని అంటున్నారు.

వాటిల్లో ప్రధానంగా చెప్పుకునేది స్క్రీన్ ప్లే గురించి . ఇందులో హీరో ఒక ఆట నుండి మరో ఆటకు వెళ్లే ప్రక్రియ కాస్త న్యాచురాలిటీ కి దూరంగా ఉందని , క్రికెట్ నుండి కుస్తీ కి మారడం వరకు ఓకే కానీ , ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో హీరో ఏకంగా కాళ్ళు విరగ్గొట్టుకొని , ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొనడం మరీ దారుణంగా ఉందని , దానిని మార్చేసి , సెకండ్ హాఫ్ మొత్తం కుస్తీ లైన్ లోనే ఈ సినిమాని ముందుకు సాగించి ఉండుంటే , వేరే లెవెల్ లో ఉండేదని , డైరెక్టర్ బుచ్చి బాబు ఆ చిన్న మార్పు చేసి ఉండుంటే ఈ సినిమా వెయ్యి కోట్ల రూపాయలకు ఒక్క రూపాయి కూడా తగ్గేది కాదని అంటున్నారు. ఇప్పటికీ ఈ సినిమాకు 500 కోట్ల గ్రాస్ ని అవలీల గా అందుకునే అవకాశం ఉంది కానీ, వెయ్యి కోట్ల పొటెన్షియల్ ని కిల్ చేసారని అంటున్నారు విశ్లేషకులు.

అంతే కాకుండా ఫస్ట్ హాఫ్ సగానికి పైగా రొటీన్ గా సాగిందని, హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రకు కూడా ఘోరమైన నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందని , వీటిని కరెక్ట్ చేసుకొని ఉండుంటే ఇంకా అద్భుతమైన టాక్ వచ్చి ఉండేదని అంటున్నారు. అంతే కాకుండా ఈ సినిమాలో పెద్ద పెద్ద ఆర్టిస్టులను తీసుకున్నారు కానీ , వాళ్లకు సరైన క్యారెక్టర్స్ డిజైన్ చేయడం లో బుచ్చి బాబు విఫలం అయ్యాడని, ఒక్క జగపతి బాబు క్యారెక్టర్ ఒక్కటే బాగుందని , ఆయన పాత్రని ఇంకా కొద్దిగా పొడిగించి ఉండుంటే బాగుండేదని అంటున్నారు. సినిమా మొత్తం రామ్ చరణ్ భుజాల మీద మోసినట్టు గానే ఉందని , సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా కాస్త సహకరించి ఉండుంటే ఈ సినిమా స్థాయి వేరే లెవెల్ లో ఉండేదని అంటున్నారు , చూడాలి మరి ఈ సినిమా లాంగ్ రన్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper