Homeవింతలు-విశేషాలుJapanese Wedding Traditions: కొత్త అల్లుడికి ‘అర్ధనగ్నంగా’ పరీక్ష.. పాస్ అయితే ఆ పని మరీ..

Japanese Wedding Traditions: కొత్త అల్లుడికి ‘అర్ధనగ్నంగా’ పరీక్ష.. పాస్ అయితే ఆ పని మరీ..

Japanese Wedding Traditions: కొత్త అల్లుడికి విపరీతమైన గౌరవం ఇవ్వడం మన భారతదేశంలో పరిపాటిగా ఉంటుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే కొత్త అల్లుడికి రకరకాల కానుకలు పెడుతుంటారు. పండగల సందర్భంగా బట్టలు.. బంగారం.. వాహనాలు కొనుగోలు చేసి ఇస్తుంటారు. పెద్ద పండుగలప్పుడు అల్లుడికి బ్రహ్మాండంగా భోజనాలు.. రకరకాల పిండి వంటలు పెడుతుంటారు. ఇక బామ్మర్దులయితే ఒక ఆట ఆడుకుంటారు. మనదేశంలో ఇలా ఉంటే జపాన్లో మాత్రం విచిత్రంగా ఉంటుంది. జపాన్ దేశంలో ఉయో నుమా అనే […]

Japanese Wedding Traditions: కొత్త అల్లుడికి విపరీతమైన గౌరవం ఇవ్వడం మన భారతదేశంలో పరిపాటిగా ఉంటుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే కొత్త అల్లుడికి రకరకాల కానుకలు పెడుతుంటారు. పండగల సందర్భంగా బట్టలు.. బంగారం.. వాహనాలు కొనుగోలు చేసి ఇస్తుంటారు. పెద్ద పండుగలప్పుడు అల్లుడికి బ్రహ్మాండంగా భోజనాలు.. రకరకాల పిండి వంటలు పెడుతుంటారు. ఇక బామ్మర్దులయితే ఒక ఆట ఆడుకుంటారు.

మనదేశంలో ఇలా ఉంటే జపాన్లో మాత్రం విచిత్రంగా ఉంటుంది. జపాన్ దేశంలో ఉయో నుమా అనే ప్రాంతంలో కొత్తగా పెళ్లయిన వరుడికి వణుకు పుట్టిస్తుంటారు. అయితే ఇది సరదాగా ఉంటుంది. దీనిని అక్కడివారు తమ ఆచారంగా చెబుతుంటారు. పెళ్లి జరిగిన తర్వాత వచ్చే తొలి చలికాలంలో బామ్మర్దులు వరుడుని మంచంలో అర్థనగ్నంగా నిలబెడతారు. ఆ తర్వాత అతని మీద విపరీతమైన చల్లటి నీళ్ళు పోస్తుంటారు.

ఇలా చల్లటి నీళ్లు పోయడానికి ఒక కారణం ఉంది. కొత్త పెళ్లికొడుకు ఇంటి బాధ్యతలను మోసేందుకు సరిపడా ధైర్యాన్ని.. ఓపికను కలిగి ఉన్నాడో లేదో తెలుసుకోవడానికి ఈ పరీక్ష నిర్వహిస్తుంటారు.. ఈ పరీక్షలో గనుక అల్లుడు పాస్ అయితే అతడు సమర్ధవంతుడు అని చెబుతుంటారు. కాకపోతే చాలామంది ఈ పరీక్షలో పాస్ అవుతుంటారు. బామ్మర్దులు ఆట పట్టిస్తుంటే.. ఎంత కష్టమైనా సరే ఆ చల్లటి నీళ్లను ఒంటిమీద పోసుకుంటారు. పైగా జపాన్ దేశంలో చలికాలంలో చలి విపరీతంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో అయితే ఉష్ణోగ్రత సింగిల్ డిజిట్ కు పడిపోతుంది.

అంతటి శీతల పరిస్థితుల్లో కూడా ఏమాత్రం భయపడకుండా ఆ చల్లటి నీళ్లను పోసుకుంటారు. ఆ తర్వాత చాలెంజ్లో గెలిచామని విజయ సంకేతాలు చూపిస్తుంటారు. చల్లటి నీళ్ళు పోసుకున్న తర్వాత గెలిచిన వరుడికి బామ్మర్దులు కానుకలు ఇస్తుంటారు. అతడిని భుజాల మీద మోసుకుంటూ గట్టిగా కేరింతలు కొడతారు.. సాధారణంగా అల్లుడికి గౌరవం కల్పించే సంప్రదాయం మనదేశంలో అధికంగా ఉంది.. మన పొరుగు దేశాలలో కూడా అది అదే స్థాయిలో ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper