Home Blog Page 187

ఢిల్లీలో బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ రద్దు.. ఏంటి ఈ పాలసీ.. ఎందుకు ఈ చర్చ..

Delhi Bed And Breakfast Policy
Delhi Bed And Breakfast Policy

Delhi Bed And Breakfast Policy: సాధారణంగా పర్యటక రంగం అనేది ఆ దేశ పరిస్థితులు ఆధారంగా ఉంటుంది. అక్కడి ప్రభుత్వాలు సానుకూల నిర్ణయాలు తీసుకుంటే.. పర్యాటక రంగానికి అనుకూలంగా విధానాలను మార్చుకుంటే పెద్దగా ఇబ్బంది ఉండదు. ప్రపంచంలో పర్యాటక స్వర్గధామాలుగా పేరుపొందిన ప్రాంతాలు.. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల వల్లే ఆ స్థాయిలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. మన దేశానికి కూడా పర్యాటక రంగంలో మంచి పేరు తీసుకురావాలని ప్రభుత్వాలు రకరకాల విధానాలను అమలు చేస్తున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని పర్యాటకులు పెద్ద ఎత్తున సందర్శిస్తూ ఉంటారు. ప్రతి ఏడాది లక్షలాదిమంది ఢిల్లీ నగరానికి వస్తుంటారు. ఇక్కడి చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శిస్తూ ఉంటారు. అయితే అందరూ పర్యటకులు లగ్జరీ సౌకర్యాల కోసం ఖర్చుపెట్టరు. కొందరు పరిమిత బడ్జెట్లోనే తమ టూర్ మొత్తం పూర్తి కావాలని భావిస్తుంటారు. అదే అటువంటి వారికోసం గతంలో బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ విధానాన్ని తీసుకొచ్చారు. బెడ్, బ్రేక్ ఫాస్ట్ అనగానే చాలామంది హోటల్ అనుకుంటారు.. కానీ అది కాదు.. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి.. దానిని మరింత బలోపేతం చేయడానికి.. స్థానికులకు అదనపు ఆదాయాన్ని కల్పించడానికి ఢిల్లీలో ఈ వసతి విధానాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఢిల్లీలో ఇటీవల జరిగిన భారీ అగ్నిప్రమాదానికి ఈ పాలసీనే కారణమని.. దానిని రద్దు చేయాలని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది.

అగ్ని ప్రమాదం వల్ల చాలామంది చనిపోయారు. అదే స్థాయిలో గాయపడ్డారు. అగ్ని ప్రమాదం వల్ల ఏర్పడిన మంటలు ఢిల్లీలో చాలా నష్టాన్ని కలుగజేసాయి. ఈ ప్రమాదం నేపథ్యంలో బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ విధానాన్ని పక్కన పెట్టాలని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ విధానం ప్రకారం ఇంటి ఓనర్లు తమ ఇంట్లో ఉన్న కొంత భాగాన్ని పర్యాటకులకు కల్పిస్తారు. వారికి వసతి.. ఆహారం.. ఇతర సదుపాయాలు కల్పిస్తారు. దీనివల్ల కొంతమేర ఆదాయాన్ని వారు సంపాదిస్తారు. బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ విధానంలో గరిష్టంగా ఆరుగదులకు అనుమతి ఉంటుంది. ఫైర్ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలి.

ఇటీవల ఢిల్లీలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదానికి బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ విధానం కారణమని నిపుణులు అంటున్నారు. సరైన విధానాలు పాటించకపోవడం.. ఫైర్ సేఫ్టీ నిబంధనలను పక్కన పెట్టడంతో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చాలామంది చనిపోయారు. అసలే ఎండాకాలం.. దానికి మంటలు కూడా తోడు కావడంతో ప్రమాదం తీవ్రత అధికంగా ఉంది. అందువల్లే ప్రాణం నష్టం చోటుచేసుకుంది. ఇంతటి ప్రమాదానికి ఆ విధానం కారణమని భావించిన ఢిల్లీ ప్రభుత్వం.. ఇకపై దానిని పక్కన పెడతామని.. భవిష్యత్తులో కూడా అమలు చేసే అవకాశం లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చాలామందికి ఉపాధి దూరమైనప్పటికీ.. ప్రజల ప్రాణాల దృష్ట్యా తీసుకోవడం తప్పడం లేదని ఢిల్లీ ప్రభుత్వం చెబుతోంది.

రెండేళ్ల పాలన.. కూటమి కొత్త ఆలోచన!

AP Coalition Government Achievements
AP Coalition Government Achievements

AP Coalition Government Achievements: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. ఈనెల 12 నాటికి రెండేళ్ల పాలన పూర్తి కానుంది. మరోవైపు కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలన పుష్కరకాలం పూర్తిచేసుకోనుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో భారీ ప్రగతి సభలు నిర్వహించాలని టిడిపి కూటమి నిర్ణయించింది. నిన్న చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎన్డీఏ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పాల్గొన్నారు. రెండేళ్ల పాలనలో సాధించిన ప్రగతి, అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించేందుకుగాను ఈ నెల 9 నుంచి 15 వరకు కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రధానంగా మూడు ప్రాంతాల్లో మూడు సభలు పెట్టాలని డిసైడ్ అయ్యారు. ఈ మూడు సభలను వేర్వేరు ధీమ్ లతో నిర్వహించాలని నిర్ణయించారు.. కేవలం పండుగలా కాకుండా తమ రెండేళ్ల పాలనలో ప్రజలకు ఏం చేసింది… అనేది వివరించే ప్రయత్నం చేయనున్నారు.

* మూడు ప్రాంతాల్లో సభలు..
జూన్ 9న తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. రాయలసీమ రీజియన్ లో నిర్వహించనున్న ఈ సభ ద్వారా.. సంక్షేమాలను వివరించనున్నారు. ఉచిత పథకాలతో పాటు సామాజిక భద్రతకు పెద్దపీట వేస్తూ అమలు చేసిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేయనున్నారు. జూన్ 12న అమరావతి ప్రాంతంలో భారీ బహిరంగ సభ ఉంటుంది. సుపరిపాలనతోపాటు అమరావతి రాజధాని నిర్మాణంలో కూటమి ప్రభుత్వం అనుసరించిన వైఖరి గురించి వివరించనున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సృష్టించిన అడ్డంకులను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి అన్నది ప్రధాన అజెండా. జూన్ 15న విశాఖలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, ఐటీ సంస్థలు, తయారీ రంగ పరిశ్రమలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటుకు సంబంధించిన అంశాలను ప్రజలకు వివరిస్తారు.

* ఐక్యతను చాటే ప్రయత్నం..
అయితే ఈ భారీ బహిరంగ సభల ద్వారా కూటమిలో ఉన్న ఐక్యతను చాటాలని చూస్తున్నారు చంద్రబాబు. కూటమి విచ్చిన్నానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేయని ప్రయత్నం అంటూ లేదు. చివరకు వ్యతిరేక ప్రచారం కూడా చేస్తోంది. కానీ ఏది వర్కౌట్ కావడం లేదు. మూడు పార్టీల మధ్య గందరగోళానికి కూడా అనేక రకాల ప్రయత్నాలు జరుగుతూ వచ్చాయి. కానీ అవేవీ సత్ఫలితాలు ఇవ్వలేదు. ఇప్పుడు కూటమి భారీ బహిరంగ సభల ద్వారా తమ ఐక్యతతో విపక్షాలకు షాక్ ఇవ్వాలని చూస్తోంది. అయితే మూడు ప్రాంతాల్లో మూడు బహిరంగ సభల ద్వారా గట్టిగానే చాటి చెప్పాలని చూస్తోంది.

జనసేన రాజ్యసభ అభ్యర్థి ఫిక్స్!

Jana Sena Rajya Sabha Candidate
Jana Sena Rajya Sabha Candidate

Jana Sena Rajya Sabha Candidate: ఏపీ నుంచి జనసేన రాజ్యసభలో ప్రాతినిధ్యం దక్కించుకోనుంది. ఆ పార్టీకి ఒక రాజ్యసభ ఇచ్చేందుకు టిడిపి అధినేత చంద్రబాబు నిర్ణయించారు. రాష్ట్రం నుంచి నలుగురు సభ్యులు పదవీ విరమణ చేస్తుండగా ఆ నాలుగు పదవులు కూటమికి దక్కనున్నాయి. అయితే తీవ్ర తర్జన భర్జన నడుమ బిజెపికి ఈసారి ఛాన్స్ లేదని తేలిపోయింది. నాలుగు పదవుల్లో టిడిపికి మూడు, జనసేనకు ఒకటి కేటాయించారు. రెండుసార్లు బిజెపికి అవకాశం ఇవ్వడంతో ఈసారి ఛాన్స్ లేదని కేంద్ర పెద్దలకు చెప్పారు. వారు సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. టిడిపి తో పాటు జనసేన తమ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉన్నాయి. అయితే జనసేన రాజ్యసభ పదవిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది.

* తొలిసారిగా ప్రాతినిధ్యం..
జనసేన ఇప్పటివరకు శాసనసభలో ప్రాతినిధ్యం దక్కించుకుంది. శాసనమండలిలో సైతం ప్రాతినిధ్యం దక్కించుకుంది. రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవుల్లో సైతం ఆ పార్టీ తన కోటాను దక్కించుకోగలిగింది. ఇప్పుడు రాజ్యసభలో ప్రాతినిధ్యం దక్కించుకోవడం ద్వారా పార్లమెంటులో సైతం ప్రాతినిధ్యం పెంచుకోనుంది. అయితే తొలిసారి రాజ్యసభ సీటు కావడంతో పవన్ కళ్యాణ్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మంచి నేతను తొలిసారిగా రాజ్యసభకు పంపడం ద్వారా.. జాతీయ స్థాయిలో సైతం ఉనికి చాటుకోవాలని చూస్తున్నారు.

* మరో రెండు పదవులు సైతం..
అయితే జనసేన తరఫున రాజ్యసభకు ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరును ఖరారు చేస్తారని అంతా భావించారు. అయితే ఇప్పటివరకు ఆయనే ముందు వరుసలో ఉన్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన లింగమనేని రమేష్ జనసేనకు అండగా నిలుస్తూ వచ్చారు. మరోవైపు మెగా బ్రదర్ నాగబాబు, బండారు నరసింహారావు తో పాటు తెలుగు చిత్ర ప్రముఖుడు పేరు వినిపిస్తోంది. అయితే ఇప్పటివరకు ఉన్న పరిస్థితుల్లో లింగమనేని రమేష్ కే ప్రాధాన్యమిస్తారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకొని జనసేనలో సైతం మార్పులు చేసే అవకాశం ఉంది. నాగబాబును పంపించిన ఆశ్చర్యపోనవసరం లేదన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పవన్ రాష్ట్ర రాజకీయాల్లో ఉండగా నాగబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే బాగుంటుందన్న అభిప్రాయం ఉంది. 2029 ఎన్నికల్లోగా రాజ్యసభలో జనసేనకు మూడు సీట్లు దక్కే అవకాశం ఉంది. ఈసారికి లింగమనేని రమేష్ ను పంపించి మిగతా వారికి తరువాత ఇస్తారన్న ప్రచారం కూడా ఉంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

బాలయ్య పిలిచి అవకాశాన్ని ఇస్తే ప్రూవ్ చేసుకోలేకపోయిన ఇద్దరు స్టార్ డైరెక్టర్స్...

Balakrishna
Balakrishna

Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలయ్య బాబుకి ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆయన లాంటి హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు ఉండరనేది వాస్తవం… అలాంటి బాలయ్య బాబు తో సినిమాలు చేయడానికి చాలా మంది దర్శకులు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇద్దరు దర్శకులకు ఆయన పిలిచి మరి అవకాశాన్ని ఇచ్చాడు. కానీ వాళ్ళు అవకాశాన్ని వాడుకోలేదనే చెప్పాలి. యజ్ఞం సినిమాతో సక్సెస్ ని సాధించిన ఏ ఎస్ రవికుమార్ చౌదరి కి బాలయ్య పిలిచి మరి ఒక సినిమా చేయమని ఛాన్స్ ఇచ్చాడు. దాంతో ఆయన ‘వీరభద్ర’ అనే సినిమా చేసి భారీ డిజాస్టర్ ను మూట గట్టుకున్నాడు.

ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య బాబు మరింత డౌన్ ఫాల్ అయిపోయాడు. ఇక దేవదాసు సినిమా చేసి సూపర్ సక్సెస్ ని సాధించిన వైవిఎస్ చౌదరికి సైతం బాలయ్య పిలిచి మరి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు. దాంతో ఆయన ఒక దేశభక్తికి సంబంధించిన కథను చేస్తానని చెప్పి భారతీయుడు సినిమా కథనే అటు ఇటు తిప్పి ‘ఒక్క మగాడు’ మూవీ చేశాడు. ఈ సినిమా బాలయ్య బాబు కెరియర్ లోనే వరస్ట్ సినిమా అని చెప్పొచ్చు.

అయితే ఇద్దరు దర్శకులు బాలయ్య ఇచ్చిన ఆఫర్ ని వాడుకోలేకపోయారు. కానీ బాలయ్య బాబుతో చాలామంది దర్శకులు సినిమా చేయడానికి ఎదురుచూస్తున్నారు. వాళ్లకి ఒక్క అవకాశం వస్తే చాలు బాలయ్య బాబుని టాప్ లెవెల్లో చూపించి సినిమాలను సూపర్ సక్సెస్ గా నిలుపుతామంటూ మంచి కథలను పట్టుకొని తిరుగుతున్నారు.

అయినప్పటికి వాళ్ళకి అవకాశాలైతే రావడం లేదు. ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య ఈ ఏజ్ లో కూడా వరుసగా కమర్షియల్ సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు అంటే ఆయన ఎలాంటి కథలను సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు…

రాజశేఖర్ రెడ్డి స్నేహితుడు అనిపించుకున్న కేవీపీ!

KVP Ramachandra Rao
KVP Ramachandra Rao

KVP Ramachandra Rao: వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం పై రాజకీయ విమర్శలు వస్తుంటాయి. రాజకీయాలు అన్నాక అవి సర్వసాధారణం కూడా. కానీ రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకొని రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ విమర్శలను పట్టించుకోవడం లేదు. ఆ పార్టీ నేతలు సైతం పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ రాజశేఖర్ రెడ్డి తో అనుబంధం ఉన్నవారు మాత్రం ఆ వ్యాఖ్యలను ఖండిస్తుంటారు. రాజశేఖర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నేతగానే ఇష్టపడేవారు వెంటనే రియాక్ట్ అవుతుంటారు. తాజాగా రాజశేఖర్ రెడ్డి పై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై స్పందించారు కెవిపి రామచంద్ర రావు. ఏకంగా పవన్ కళ్యాణ్ కు సవాల్ విసిరారు. 10 కోట్ల రూపాయల సవాల్ అది. ఇంత జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి నుంచి మాత్రం ఒక్క మాట అనలేదు తన తండ్రి పై జరుగుతున్న ప్రచారంపై. మొన్న కూడా తన తాత రాజారెడ్డి ప్రస్తావన తీసుకొచ్చి.. కుటుంబంపై ప్రచారం జరిగేలా చేశారు.

* వైఎస్ పై పవన్ విమర్శలు..
ఇటీవల తెలంగాణలో రాజకీయ వ్యవహారాలు అందరికీ తెలిసిన విషయమే. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎపిసోడ్ అటు తిరిగి ఇటు తిరిగి పవన్ కళ్యాణ్ తెలంగాణలో సభ పెట్టే వరకు తెచ్చింది పరిస్థితి. అయితే ఆ సభకు అనుమతి ఇవ్వలేదు తెలంగాణ ప్రభుత్వం. దీంతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్. ప్రాంతీయ వాదం పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అనుమతులు ఇవ్వక పోవడాన్ని ఆక్షేపించారు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి తన విషయంలో ఇలానే వ్యవహరించేందుకు ప్రయత్నం చేశారని.. ఓ ఐపీఎస్ అధికారి ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారని.. తాను రాజకీయాల్లోకి అందుకే వచ్చానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. దానిపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు కెవిపి రామచంద్రరావు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మగా పేర్కొనే రామచందర్రావుకు అప్పట్లో జరిగిన పరిణామాలు తెలుసు. అందుకే పవన్ కళ్యాణ్ మాటలను ఖండించారు. పవన్ ఆధారాలతో రుజువు చేస్తే ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.10 కోట్ల రూపాయలు ఇస్తానని సవాల్ చేశారు. లేకుంటే పవన్ తన ముక్కును నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక ఆత్మీయ స్నేహితుడిగా కెవిపి రామచంద్రరావు సవాల్ లో ఎటువంటి తప్పిదం లేదు.

* రాజశేఖర్ రెడ్డి తో రాజకీయ లబ్ధి..
రాజశేఖర్ రెడ్డి ముఖాన్ని పెట్టుకుని రాజకీయం చేశారు జగన్మోహన్ రెడ్డి. నిత్యం తన సాక్షి మీడియాలో రాజశేఖర్ రెడ్డి ఫోటో పెట్టుకుని వార్తలు ప్రచురిస్తున్నారు. కానీ రాజశేఖర్ రెడ్డి పై రాజకీయం విమర్శలు వచ్చిన సమయంలో జగన్ మాట్లాడడం లేదు. తన పార్టీ నేతలతో మాట్లాడించడం లేదు. ఈ విషయంలో షర్మిల 100 రెట్లు ఎక్కువ. ఎందుకంటే ఆమె రాజశేఖర్ రెడ్డి ప్రస్తావన వచ్చినప్పుడల్లా తన బాధను వ్యక్తం చేస్తుంటారు. ప్రత్యర్థుల ఆరోపణలను ఖండిస్తుంటారు. తన తాతను చంపిన వారిని క్షమించానని.. తనకంటే గొప్ప వారు ఎవరు ఉంటారు అంటూ జగన్ ఆ మధ్యన మీడియా సమావేశంలో మాట్లాడిన సంగతి తెలిసిందే. అటు తరువాత వైయస్ కుటుంబం పై ప్రత్యర్ధులు ఎదుర దాడి చేశారు. కానీ జగన్ మాత్రం మీడియా ముందుకు వస్తున్నారే కానీ తన తండ్రి పై ఆరోపణలను ఖండించడం లేదు. అయితే తన తండ్రిని ఏమైనా అంటే జగన్ ఊరుకుంటారో ఏమో కానీ తన స్నేహితుడిని అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని కెవిపి రామచంద్రరావు చాటిచెప్పారు.

హమ్మయ్య.. ఏపీకి చల్లటి కబురు!

AP Monsoon
AP Monsoon

AP Monsoon: ఏపీకి చల్లటి కబురు. నైరుతి రుతుపవనాలు త్వరలో తాకనున్నాయి. కేరళకు ఇప్పటికే తాకాయి. క్రమేపి కర్ణాటకతోపాటు అరేబియా మహాసముద్రంలో విస్తరిస్తున్నాయి. అటు తర్వాత తమిళనాడు, ఏపీలో రాయలసీమకు సైతం విస్తరించనున్నాయి రుతుపవనాలు. జూన్ 1 నాటికి కేరళ తీరానికి రుతుపవనాలు తాకుతాయని అంచనా ఉండేది. కానీ రెండు రోజులు ఆలస్యం అయ్యింది. గురువారమే కేరళ తీరానికి తాకిన రుతుపవనాలు క్రమేపి విస్తరిస్తున్నాయి. అయితే పూర్తిస్థాయిలో విస్తరించి ఏపీలో సమృద్ధిగా వర్షాలు పడేందుకు మరో వారం రోజుల పాటు సమయం పట్టే అవకాశం ఉంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉండే నైరుతి రుతుపవనాల ప్రభావంతో 90 శాతం వర్షాలు కురిసే అవకాశం ఉంది. కానీ ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తగ్గుముఖం పడతాయి అన్న అంచనాలు ఉన్నాయి.

* కొనసాగుతున్న ఎండల తీవ్రత..
రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత కొనసాగుతోంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఒకటే పరిస్థితి ఉంది. అయితే మధ్యలో ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో ఆకాశం మేఘావృతం అవుతోంది. వాతావరణం చల్లబడుతోంది. ఈరోజు ఉభయగోదావరి, పోలవరం, కాకినాడ తదితర జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం పడే సూచనలు ఉన్నాయి. ఇంకోవైపు పోలవరం తో పాటు ఉమ్మడి కృష్ణాజిల్లాలో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే చాన్స్ ఉంది. రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో.. వర్షాల జాడ కూడా లేకుండా పోయింది. ఇప్పుడు రుతుపవనాలు ఏపీకి తాకనుండడంతో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

* ప్రమాద ఘంటికలు..
సాధారణంగా నైరుతి రుతుపవనాల ప్రభావం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది. అయితే ఈ ఏడాది జూన్ మొదటి వారం దాటుతున్న రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడడం లేదు. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. మరోవైపు ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు ఉండవని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తూ వస్తోంది. ఇంతవరకు ఏపీలో చాలా ప్రాంతాలకు చినుకు జాడలేదు. ఇటువంటి పరిస్థితుల్లో వర్షాలు లేకపోతే పంటలు పండే అవకాశం లేదు. దీనిని ముందుగానే గుర్తించిన ఏపీ వ్యవసాయ శాఖ రైతులను అప్రమత్తం చేసింది. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని రైతులకు సూచిస్తోంది. కానీ ఈ నెల 15 నుంచి రుతుపవనాలు మరింతగా చురుగ్గా కదులుతాయని.. వర్షాలు సమృద్ధిగా పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

చంద్రబాబు ఒత్తిడికి తలొగ్గిన బిజెపి!

Chandrababu BJP
Chandrababu BJP

Chandrababu BJP: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. రాజ్యసభ పదవుల ఎంపికలో చంద్రబాబు తన వ్యూహాన్ని చాటుకున్నారు. ముఖ్యంగా బిజెపి హై కమాండ్ ను ఇప్పించడంలో సక్సెస్ అయ్యారు. ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ పదవులు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి బిజెపికి ఎటువంటి కేటాయింపులు లేవు. తెలుగుదేశం పార్టీకి మూడు, జనసేనకు ఒక పదవి సర్దుకొనున్నారు. బిజెపి విషయంలో ఇప్పటికే కేంద్ర పెద్దలతో చర్చించి వారిని ఒప్పించారు. ప్రాంతీయ అవసరాల దృష్ట్యా ఈసారి తమకు విడిచి పెట్టాలని చంద్రబాబు చేసిన విన్నపానికి కేంద్ర పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో టీడీపీ నుంచి ముగ్గురికి, జనసేన నుంచి ఒకరికి రాజ్యసభ పదవి దక్కడం ఖాయమని తెలుస్తోంది.

* రెండుసార్లు బిజెపికి ఛాన్స్..
కూటమి వచ్చిన తర్వాత రాజ్యసభ ఎన్నికలు రావడం ఇది మూడోసారి. ఇప్పటివరకు ఏపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యుల ఎన్నిక జరిగితే అందులో రెండు పదవులు బిజెపి దక్కించుకుంది. మరో రెండు పదవులు టిడిపికి వచ్చాయి. జనసేనకు ఇంతవరకు రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు. గతంలో రాజ్యసభలో బిజెపికి ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రధాన కారణం ఎగువ సభలో ఆ పార్టీకి తక్కువ మంది సభ్యులు ఉండడమే కారణం. అందుకే అప్పట్లో హై కమాండ్ విజ్ఞప్తి మేరకు బిజెపికి ప్రాధాన్యమిచ్చారు చంద్రబాబు. లోక్సభలో బిజెపి నేతృత్వంలో ఎన్డీఏ మెజారిటీ ఉంది. కానీ రాజ్యసభలో మాత్రం కాంగ్రెస్ దాని మిత్రపక్షాల బలం ఎక్కువ. అందుకే బీజేపీ విజ్ఞప్తి మేరకు రెండుసార్లు రాజ్యసభ పదవులు ఇచ్చారు. అయితే ఇప్పుడు పది రాష్ట్రాల నుంచి 24 మంది రాజ్యసభ సభ్యులు ఎంపిక కానుండడం.. అందులో బీజేపీ కి ఎక్కువ స్థానాలు రానుండడంతో.. ఏపీ నుంచి వదులుకునేందుకు బిజెపి సిద్ధపడింది.

* తొలిసారిగా జనసేనకు..
రాజ్యసభలో తొలిసారిగా జనసేనకు ప్రాతినిథ్యం దక్కనుంది. గతంలో రెండుసార్లు రాజ్యసభ పదవులు వచ్చినప్పుడు జనసేన త్యాగం చేసింది. ఈసారి మాత్రం ఆ పార్టీకి ఒక ఛాన్స్ రానుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరు ఖరారు అయ్యే అవకాశం ఉంది. టిడిపిలో అయితే ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. ఉత్తరాంధ్ర నుంచి స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ బీసీ కోటాలో పదవి దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మహిళకు ఒక రాజ్యసభ ఇచ్చేందుకు లోకేష్ పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సానా సతీష్ రాజ్యసభ సభ్యుడుగా ఉంటూ ఏడాదిన్నరకే పదవీ విరమణ చేశారు. ఆయనకు మరోసారి ఛాన్స్ ఇస్తారు. మొత్తానికైతే బీజేపీని చంద్రబాబు అలా తెగ్గొట్టారు.

‘తేనె పూసిన కత్తి’ అని ఎందుకు అంటారో తెలుసా..

Honey Coated Sword Idiom
Honey Coated Sword Idiom

Honey Coated Sword Idiom: తెలుగు భాషలో సామెతలు, జాతీయాలు మన జీవన అనుభవాల నుంచి పుట్టిన జ్ఞాననిధులు. వాటిలో ఎంతో ప్రసిద్ధి చెందిన జాతీయం ‘తేనె పూసిన కత్తి’. పైకి ఎంతో ప్రేమగా, మృదువుగా, మధురంగా మాట్లాడే వ్యక్తి లోపల మాత్రం మోసం, కపటం, హాని చేసే ఉద్దేశంతో ఉంటే అతడిని ఈ జాతీయంతో పోలుస్తారు. మనుషుల స్వభావాన్ని అద్భుతంగా వివరించే ఈ పదబంధం నేటికీ విరివిగా వినిపిస్తుంది. అసలు ఈ పదం ఎలా పుట్టిందంటే?

తేనె సహజంగా తియ్యగా, రుచికరంగా ఉంటుంది. కత్తి మాత్రం పదునైనది, ప్రమాదకరమైనది. ఒక పదునైన కత్తికి తేనె పూస్తే, దాని తీపికి ఆకర్షితులై దానిని నాకాలని ప్రయత్నించే వ్యక్తికి నాలుక కోసుకుపోయే ప్రమాదం ఉంటుంది. అంటే బయటకు కనిపించే తీపి, లోపల దాగి ఉన్న ప్రమాదాన్ని గుర్తించలేకపోతే నష్టం తప్పదని ఈ జాతీయం హెచ్చరిస్తుంది. జీవితంలో కొంతమంది వ్యక్తులు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతారు. వారి మాటలు వినడానికి మధురంగా ఉంటాయి. కానీ వారి ఉద్దేశాలు మాత్రం స్వార్థపూరితంగా ఉండవచ్చు. అలాంటి వారు తమ ప్రయోజనాల కోసం ఇతరులను నమ్మించి మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. అందుకే పెద్దలు ‘మాటలు కాదు, మనుషుల పనులు చూడాలి’ అని చెబుతుంటారు. ఈ జాతీయం కూడా అదే సందేశాన్ని అందిస్తుంది.

తెనాలి రామకృష్ణ కవి ప్రస్తావన:
విజయనగర సామ్రాజ్యానికి చెందిన ప్రముఖ కవి తెనాలి రామకృష్ణ రచించిన పాండురంగ మాహాత్మ్యంలో ఈ భావనకు సంబంధించిన ఒక ప్రసిద్ధ ప్రయోగం కనిపిస్తుంది. అందులో నిగమశర్మ అనే పాత్రను వర్ణిస్తూ ‘తేనె బూసిన కత్తి ధాత్రీ సురుండు’ అని పేర్కొన్నట్లు సాహిత్య పండితులు వివరిస్తారు. ఇక్కడ కవి ఆ వ్యక్తి పైకి ఎంతో మంచివాడిలా కనిపించినా, లోపల కపట స్వభావం కలిగిన వాడని సూచించారు.

ఈ జాతీయం నేటి కాలంలో మరింత ప్రాసంగికంగా మారింది. సోషల్ మీడియా, ఆన్‌లైన్ మోసాలు, నకిలీ పెట్టుబడి పథకాలు వంటి వాటిలో చాలా మంది మధురమైన మాటలతో ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారు. “త్వరగా డబ్బు వస్తుంది”, “ఎలాంటి రిస్క్ లేదు” వంటి ఆకర్షణీయమైన మాటల వెనుక మోసం దాగి ఉండవచ్చు. అందుకే ప్రతి విషయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఈ జాతీయం సూచిస్తుంది.

జగన్ ను కలిశాడు.. అమరావతికి భూములు ఇచ్చేశాడు!

Jagan Mohan Reddy
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: అమరావతి రైతులకు అండగా ఉంటానని జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అమరావతి పరిధిలోని ఉండవెల్లి, పెనుమాక రైతులు జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డుకు తమ భూములు ఇవ్వమని జగన్మోహన్ రెడ్డి ఎదుట చెప్పారు. ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోందని చెప్పుకొచ్చారు. అక్కడ భూముల ధరలు అధికంగా ఉన్నందున పరిహారం ఎక్కువగా ఇస్తేనే ఇస్తామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం బలవంతంగా తీసుకునేందుకు సిద్ధంగా ఉందని జగన్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే జగన్ స్పందించారు. న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు వైసిపి అధికార వకీలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ని రంగంలోకి దించుతామని చెప్పారు. అయితే ఇలా చెప్పిన రైతు.. అదే రోజు నేరుగా వెళ్లి అమరావతి భూ సేకరణలో భాగంగా తన భూమిని అప్పగించేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి పై నమ్మకం పోయి ఉండాలి.. పొన్నవోలు సుధాకర్ రెడ్డి పేరు చెప్పిన తర్వాత భయపడి ఉండాలి.

* 27 మంది రైతులు..
ఇటీవల అమరావతి రైతులు జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఓ 27 మంది రైతులు కలిసిన వారిలో ఉన్నారు. అందులో అశోక్ రెడ్డి అనే రైతు కూడా ఉన్నారు. ఆ గ్రామంలో తాను ఒక్కడినే వైసీపీ సానుభూతిపరుడునని చెప్పుకొచ్చారు. అయితే తమ గ్రామం మీదుగా సీడ్ యాక్సిస్ రోడ్డు వెళుతుందని.. ఆ రోడ్డుకు గాను భూ సమీకరణ చేస్తున్నారని.. కానీ భూముల ధరలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయని.. ఇక్కడి ధరలకు అనుగుణంగా పరిహారంతో పాటు రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వమంటే ప్రభుత్వం అంగీకరించడం లేదని చెప్పారు. వెంటనే ఈ రైతుకు న్యాయపరమైన సహాయం అందించాలని అక్కడ ఉన్న వారిని ఆదేశించారు జగన్మోహన్ రెడ్డి. అయితే అదే అశోక్ రెడ్డి అక్కడకు కొద్దిసేపటికి తనకున్న 1.40 ఎకరాల భూమిని అమరావతి అధికారులకు అందించడం విశేషం.

* అనవసర వివాదమని..
జగన్మోహన్ రెడ్డిని అమరావతి రైతులు కలవడం వాస్తవం. వారంతా వైసిపికి అనుకూలమైన వారు కావడం అంతకంటే నిజం. బలవంతంగా వైసీపీ నేతలు తీసుకెళ్లడం అంతకంటే వాస్తవం. కానీ అక్కడకు వెళ్లిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు వారికి ఇబ్బంది తెచ్చిపెట్టి ఉంటాయి. ఏదైనా న్యాయం జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్లి ఉండవచ్చు. కానీ లీగల్ సాయం పేరుతో పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి వారిని రంగంలోకి దించితే.. ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని వారు గ్రహించినట్టు ఉన్నారు. న్యాయ పోరాటం అంటే వివాదం మరింత ముదరడం ఖాయమన్న వాస్తవాన్ని వారు గుర్తించారు. అందుకే ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా స్వచ్ఛందంగా భూములు ఇచ్చేస్తున్నారు. అయితే వైసీపీ నేతలు అమరావతి రైతుల విషయంలో చేసిన ప్రయత్నాలు వృధా ప్రయాసగా మిగిలాయి.

మద్యం కుంభకోణంలో 'కీ'లకం.. జగన్ కు నోటీసులు?!

YS Jagan Liquor Scam
YS Jagan Liquor Scam

YS Jagan Liquor Scam: ఏపీలో మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో వేల కోట్ల రూపాయలను పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగింది. మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈడి రంగంలోకి దిగింది. మద్యం కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న వారి ఇళ్లల్లో తనిఖీలు ముమ్మరం చేసింది. అయితే ఏకకాలంలో అటు ప్రత్యేక దర్యాప్తు బృందం, ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణలు కొనసాగుతున్నాయి. కీలక దశకు చేరుకున్నాయి. ఇప్పుడు అంతిమ లబ్ధిదారుడు ఎవరనే దానిపై విచారణ సంస్థలు దృష్టిపెట్టాయి. అంతిమ లబ్ధిదారులకు నోటీసులు అందించేందుకు సిద్ధపడుతున్నాయి.

* ఒక్కొక్కరు అరెస్ట్..
మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్రధారి,సూత్రధారి రాజ్ కసిరెడ్డి. ఆయన అరెస్టు తరువాత మద్యం కుంభకోణం కేసులో ఒక్కొక్కరు అరెస్ట్ అవుతూ వచ్చారు. వివిధ కారణాలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు విజయసాయిరెడ్డి. ఓ కేసు విచారణకు హాజరైన ఆయన మద్యం కుంభకోణం కేసులో లీకులు ఇచ్చారు. అప్పటినుంచి అరెస్టుల పర్వం కూడా ప్రారంభమైంది. రాజ్ కసిరెడ్డి తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు జరిగింది. మరోవైపు అప్పటి సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, అప్పటి ఓ ఎస్ డి కృష్ణమోహన్ రెడ్డి ఇలా అందరి అరెస్టులు జరిగాయి. తర్వాత బెయిల్ పై అందరూ బయటకు వచ్చారు. అయితే మనీ లాండరింగ్ జరిగిందని తెలియడంతో ఈడి ఎంట్రీ ఇచ్చింది. ప్రత్యేక దర్యాప్తు బృందం నుంచి వివరాలు సేకరించి ఒక్కొక్కరిపై నిఘా పెట్టింది. ఈడి విచారణ చేయడమే కాదు సోదాలు కూడా నిర్వహించింది. అయితే ఇప్పుడు అంతిమ లబ్ధిదారుడిగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు ఈడి సిద్ధపడినట్లు తెలుస్తోంది.

* మద్యం కంపెనీల నుంచి కమీషన్లు..
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలు నడిపింది. అయితే మద్యం సరఫరా చేసే కంపెనీల నుంచి భారీగా కమీషన్లు వసూలు చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఇష్టారాజ్యంగా బ్రాండ్లు, నాసిరకం మద్యాన్ని ఎక్కువ ధరకు అని .. అలా వచ్చిన ఆదాయాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పంచుకున్నారు అనేది ప్రధాన అభియోగం. దీనిని ఒక వ్యవస్థీకృత నేరంగా విస్తరించారు. అయితే ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారందరికీ ఈ కేసులో భాగంగా ఉంది. కానీ అంతిమ లబ్ధిదారుడు మాత్రం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనేది ఒక అనుమానం. ఇప్పుడు కేసు విచారణలో భాగంగా మిగతా నిందితుల వాంగ్మూలంతో.. జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు ఈడి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

వైసీపీ సచివాలయ ఉద్యోగాలపై ఉపాధ్యాయురాలి ఓపెన్ ఛాలెంజ్.. వైరల్!

YSRCP DSC 2025 Allegations
YSRCP DSC 2025 Allegations

YSRCP DSC 2025 Allegations: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డీఎస్సీ 2025 పై బురద జల్లుతోంది. వ్యతిరేక ప్రచారం చేస్తోంది. మాజీ మంత్రి పేర్ని నాని అయితే పేకాట ఆడే వారిని ఉపాధ్యాయులుగా ఎంపిక చేశారు అని.. స్పోర్ట్స్ కోటాలో పేకాటను చూపారంటూ.. బ్రిడ్జ్ అనే ఆటను ఎత్తిచూపారు. ఇక తక్కువ ర్యాంకు లు వచ్చేవారిని పక్కన పెట్టారని.. ఎక్కువ ర్యాంకులు వచ్చే వారికి ఉద్యోగాలు కట్టబెట్టారని.. పేపర్ లీకేజీ కి గురైందని.. వెబ్సైట్లో వివరాలు డిలీట్ చేశారని ఇలా ఏవేవో ఆరోపణలు చేస్తున్నారు. అయితే అదంతా ఉత్త ప్రచారం అని తేల్చింది ప్రభుత్వం. విద్యాశాఖ కార్యదర్శి తో పాటు ఉన్నతాధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి సుదీర్ఘ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినా సరే వైసిపి వ్యతిరేక ప్రచారం ఆపడం లేదు. అందుకే ఇప్పుడు నేరుగా ఎవరైతే ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారో వారే రంగంలోకి దిగుతున్నారు. సచివాలయం ఉద్యోగ ఎంపికపై కొత్త అంశాన్ని బయటపెడుతున్నారు.

* జిల్లా కమిటీల ఆధ్వర్యంలో..
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అంటే 2019 అక్టోబరు రెండున గాంధీ జయంతి నాడు ఈ ఉద్యోగ నియామకాలను పూర్తి చేశారు. అప్పట్లో ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎంపికలు జరిగాయి. ఎక్కడ కూడా ర్యాంకులు ప్రకటించలేదు. చాలా పోస్టులకు అర్హత సాధించిన వారిని సైతం ఎంపిక చేశారు. ఎందుకంటే అప్పట్లో పోస్టులు మిగిలిపోయాయి. కట్ ఆఫ్ మార్కులు కంటే తక్కువ వచ్చిన వారిని సైతం పిలిచి మరి ఉద్యోగాలు ఇచ్చారు. ఎక్కడ ర్యాంకుల ప్రస్తావన లేదు. ఇప్పుడు అదే అంశాన్ని గుర్తు చేస్తున్నారు డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు. తప్పు మీరు చేసి.. ఇప్పుడు డీఎస్సీ 2025 పై బురద జల్లడం దారుణమని వ్యాఖ్యానిస్తున్నారు.

* అడ్డగోలుగా పేర్ని నాని వాగుడు..
ప్రధానంగా మాజీ మంత్రి పేర్ని నాని కామెంట్స్ ప్రజల్లోకి తప్పుగా వెళుతున్నాయి. ఒక రాష్ట్రానికి మంత్రిగా వ్యవహరించిన ఆయన అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. బ్రిడ్జ్ అనే స్పెల్లింగ్ తెలియకుండా కూడా మాట్లాడుతున్నారు. చెస్ అనే మేధో సంపత్తితో కూడిన క్రీడతో బ్రిడ్జి సమానం. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆ బ్రిడ్జి అనే అంశాన్ని చేర్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ కోటాలో ఒక్క ఉద్యోగం కూడా నియమించలేదు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ మాత్రం అదే పనిగా ప్రచారం చేస్తోంది. ముఖ్యంగా పేర్ని నాని కామెంట్స్ ను చదువుకున్నవారు అసహ్యించుకుంటున్నారు. వైసిపి ఆయాంలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు తీయకపోగా.. ఇలా అడ్డగోలు వాదనతో కుట్రలను తెరతీయడం మాత్రం విమర్శలకు తావిస్తోంది.

* వైసీపీకి సవాల్..
తాజాగా ఎంపికైన ఉపాధ్యాయుల్లో చాలామంది సచివాలయ ఉద్యోగులు కూడా ఉన్నారు. అప్పట్లో సచివాలయ ఉద్యోగానికి ఎంపికయ్యారు. అటువంటి వారు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఓపెన్ చాలెంజ్ ఇస్తున్నారు. డీఎస్సీ 2025 పై ప్రభుత్వం అన్ని వివరాలు సమర్పించిందని.. సచివాలయ ఉద్యోగుల ఎంపికలో మార్గదర్శకాలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బయట పెట్టగలరా అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. అసలు ర్యాంకులు, విధి విధానాలంటూ లేకుండా అప్పట్లో సచివాలయ ఉద్యోగ నియామకాలు జరిగాయి అనేది బహిరంగ రహస్యం. కానీ దానిపై టిడిపి అనవసర జోక్యం చేసుకోలేదు. నిరుద్యోగ యువతతో ఆడుకోలేదు. కానీ ఇప్పుడు పారదర్శకంగా జరిగిన డీఎస్సీ 2025 పై కుట్ర చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.

షర్మిలకు షాక్.. ఆమె స్థానంలో..

YS Sharmila
YS Sharmila

YS Sharmila: వైయస్ షర్మిల కు కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ షాప్ కి ఇచ్చింది. రాజ్యసభ పదవి ఇస్తున్నట్టు లీకులిచ్చి.. చివరి నిమిషంలో పక్కన పెట్టేసింది. మొన్ననే ఢిల్లీకి పిలిచి అగ్రనేత రాహుల్ గాంధీ అభయం ఇచ్చారు. కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రమోట్ చేస్తున్నట్లు హామీ ఇచ్చారు. రెట్టింపు ఉత్సాహంతో ఆమె ఏపీకి వచ్చారు. కానీ ఇంతలోనే కర్ణాటకలో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. సీఎం డీకే శివకుమార్ చేతులెత్తేసారు. షర్మిలకు ఇవ్వాలనుకున్న రాజ్యసభ పదవి.. హై కమాండ్ కోటాలో కాంగ్రెస్ జాతీయ మీడియా విభాగం చైర్మన్, అధికార ప్రతినిధి పవన్ ఖేరా కు కేటాయించారు. దీంతో షర్మిలకు షాక్ తప్పలేదు.

* పార్టీ విలీన సమయంలో..
తెలంగాణలో తన తండ్రి పేరిట పార్టీని ఏర్పాటు చేశారు షర్మిల. పాదయాత్ర కూడా చేశారు. పార్టీ వర్కౌట్ కాకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ప్రయత్నించారు. కానీ అవకాశం దక్కలేదు. అప్పట్లో రాజ్యసభ పదవికి హామీ ఇచ్చింది కాంగ్రెస్ హై కమాండ్. ఏదో ఒక రాష్ట్రం నుంచి సర్దుబాటు చేస్తామని చెప్పుకొచ్చింది. ఇప్పుడు కర్ణాటక నుంచి ఆ అవకాశం వచ్చింది. కానీ చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చింది కాంగ్రెస్ హై కమాండ్. జాతీయస్థాయిలో ప్రముఖంగా ఉన్న పవన్ ఖేరాకు ఖరారు చేసింది.

* జాతీయ కోటాలో..
కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిచే మూడు రాజ్యసభ పదవులు ఉన్నాయి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ఛాన్స్ దక్కింది. రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్ కుమారుడు మన్సూర్ ఆలీ ఖాన్, పవన్ ఖేరాలను ఖరారు చేసింది కాంగ్రెస్ హై కమాండ్. అయితే షర్మిలకు ఛాన్స్ ఇస్తామని చెప్పింది అగ్రనాయకత్వం. ఒక విధంగా ఇది షర్మిలకు షాకింగ్ పరిణామమే. డీకే శివకుమార్ ద్వారా ఆమె గట్టి ప్రయత్నాలు చేశారు. కానీ స్థానిక పరిస్థితులకు ఆయన తలవంచక తప్పలేదు. మరోసారి షర్మిల కు రాజ్యసభ పదవి ఇస్తామని హై కమాండ్ బుజ్జగించినట్లు తెలుస్తోంది. అయితే పదవి వచ్చినట్టే వచ్చి చేజారిపోవడం పై ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

టిడిపి హై కమాండ్ ను కలవర పెడుతున్న ఆ జిల్లా!

TDP
TDP

TDP Internal Conflicts: ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి కృష్ణాజిల్లా తలనొప్పిగా మారుతోంది. తెలుగుదేశం పార్టీకి ఈ జిల్లా పెట్టని కోట. కానీ గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలతో టిడిపిలో ఒక రకమైన విభేదాలు కనిపిస్తున్నాయి. దానికి కారణం లేకపోలేదు. కొత్త, పాత నేతల మధ్య ఆధిపత్య పోరే కారణం. మొన్నటివరకు విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని వర్సెస్ తిరువూరు ఎమ్మెల్యే కొలిక పూడి శ్రీనివాసరావు అన్నట్టు నడిచింది వ్యవహారం. ఇంకోవైపు మైలవరంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వర్సెస్ మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నట్టు ఉంది పరిస్థితి. మరోవైపు విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని వ్యవహారం కూడా తీవ్ర దమారం రేపు తోంది. నిత్యం ఆయన సోదరుడు కేశినేని నాని సంచలన ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అయితే పరిస్థితి మాత్రం తెలుగుదేశం పార్టీలో అదుపుతప్పుతోందని అర్థం అవుతోంది.

* ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే
తిరువూరు ఎమ్మెల్యేగా ఉన్నారు కొలికపూడి శ్రీనివాసరావు. అమరావతి ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన శ్రీనివాసరావుకు మంచి పేరు ఉండేది. విద్యావేత్త కూడా. సబ్జెక్టు పై స్పష్టమైన అవగాహన ఉంది. కానీ ఆయన దూకుడుగా ఉంటారు. చాలా ఆవేశంగా మాట్లాడతారు. ఈ అంశం పైన అయినా వేగంగా స్పందిస్తారు. ఈ క్రమంలోనే ఆయన అత్యంత వివాదాస్పదుడు అయ్యారు. సొంత పార్టీ శ్రేణులు వ్యతిరేకించడంతో టీడీపీ హై కమాండ్ ఎంపీ కేసినేని చిన్నికి తిరువూరు బాధ్యతలు అప్పగించింది. అప్పటినుంచి అక్కడ ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ అన్నట్టు పరిస్థితి మారిపోయింది. కేశినేని చిన్ని పై ఎమ్మెల్యే శ్రీనివాసరావు నిత్యం సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అయితే తిరువూరు ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు మాత్రం టిడిపి వెనుకడుగు వేస్తోంది.

* మైలవరంలో విభేదాలు..
మరోవైపు మైలవరం నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీలో విభేదాలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. ఇక్కడ ఎమ్మెల్యేగా వసంత కృష్ణ ప్రసాద్ ఉన్నారు. మొన్నటి ఎన్నికలకు ముందు ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టిడిపిలో చేరారు. అంతకుముందు ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన వసంత కృష్ణ ప్రసాద్ దేవినేని ఉమామహేశ్వరరావు పై గెలిచారు. అయితే వసంత కృష్ణ ప్రసాద్ రాకతో దేవినేని ఉమామహేశ్వరరావు సీటు త్యాగం చేయాల్సి వచ్చింది. అయితే గెలిచిన తర్వాత వసంత కృష్ణ ప్రసాద్ వర్గం దేవినేని ఉమామహేశ్వరరావు వర్గాన్ని అణచివేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. పైగా దేవినేని ఉమామహేశ్వరరావుకు ఇప్పటివరకు నామినేటెడ్ పదవి సైతం లభించలేదు. దీంతో ఆయన వర్గంలో సైతం తీవ్ర అసంతృప్తి ఉంది. అందుకే అక్కడ తరచూ విభేదాలు తలెత్తుతున్నాయి.

* కేశినేని సోదరులతో హీట్..
మరోవైపు కేశినేని సోదరులు ఇద్దరు ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హీటెక్కిస్తున్నారు. మొన్నటి ఎన్నికలకు ముందు టిడిపికి గుడ్ బై చెప్పారు కేసినేని నాని. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన సోదరుడు చిన్ని చేతిలో ఓడిపోయారు. అంతకుముందు రెండు ఎన్నికల్లో టిడిపి తరఫున గెలిచిన నాని పదేళ్లపాటు ఎంపీగా కొనసాగారు. అయితే టిడిపి నాయకత్వం పట్ల మంచి భావం ఉన్న స్థానిక పరిస్థితుల వల్ల ఆయన వైసీపీలోకి జంప్ చేయాల్సి వచ్చింది. అయితే ఈ పరిస్థితికి కారణం తన సోదరుడు చిన్ని అని రగిలిపోతున్నారు నాని. అందుకే టిడిపి నాయకత్వానికి దగ్గరయ్యే క్రమంలో సోదరుడు చిన్ని పై సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అయితే కృష్ణాజిల్లాలో జరుగుతున్న ఈ విభేదాలను చెక్ పెట్టాల్సిన అవసరం నాయకత్వంపై ఉంది. లేకుంటే మాత్రం ఇబ్బందికరమే

ఏపీలో సందడి లేని 'రాజ్యసభ'.. ఉన్నది మూడు రోజులే!

Andhra Pradesh Rajya Sabha Seats
Andhra Pradesh Rajya Sabha Seats

Andhra Pradesh Rajya Sabha Seats: ఏపీలో ఇంకా రాజ్యసభ పదవులు ఎంపిక జరగలేదు. నామినేషన్లకు మరో మూడు రోజులు గడువు మాత్రమే ఉంది. కూటమి నుంచి అభ్యర్థుల ప్రకటన జరగలేదు. నాలుగు పదవులను కూటమిలోని మూడు పార్టీలు ఎలా సర్దుబాటు చేసుకుంటాయి అనేది తెలియడం లేదు. ఈసారి బిజెపికి ఛాన్స్ ఇస్తారా? లేదా? అన్నదానిపై కూడా క్లారిటీ రావడం లేదు. అసలు అభ్యర్థుల ఎంపికపై ఏం చేశారు అన్నది తెలియడం లేదు. అయితే ఈసారి జనసేనకు మాత్రం ఖాయమని తెలుస్తోంది. మరోవైపు పదవి విరమణ చేస్తున్న టిడిపి సభ్యుడు సానా సతీష్ కు మరోసారి ఛాన్స్ అన్నది తేలిపోయింది. అయితే బిజెపికి పదవి ఇస్తారా లేదా అన్నది బయటపడడం లేదు. అయితే ఈ గోప్యత ఎందుకు ప్రదర్శిస్తున్నారో తెలియడం లేదు. ఆశావహులు ఎక్కువగా ఉండటమే కారణం అన్నది స్పష్టం అవుతుంది. కానీ గడువు చూస్తే సమీపిస్తోంది. కూటమి నుంచి ఎటువంటి కదలిక లేదు.

* 8తో నామినేషన్ల గడువు
దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. ప్రస్తుతం నామినేషన్ల పర్వం నడుస్తోంది. ఈనెల 8 తో గడువు ముగియనుంది. ఏపీలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ పదవుల భర్తీకి సంబంధించిన ప్రక్రియ కూడా కొనసాగుతోంది. కానీ కూటమి నుంచి అభ్యర్థులను ఖరారు చేస్తూ ఎటువంటి ప్రకటన రావడం లేదు. ఆశావహులు మాత్రం పదుల సంఖ్యలో ఉన్నారు. ఎవరికి వారుగా తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. తెలుగుదేశం పార్టీలో పోటీ తీవ్రంగా ఉంది. కూటమిలో ప్రధాన భాగస్వామ్యైన తెలుగుదేశం అందుకే గోప్యత పాటిస్తోంది. మరో మూడు రోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో అందరిలోనూ ఒకటే ఉత్కంఠ నెలకొంది.

* ఈసారి నో ఛాన్స్..
గత రెండుసార్లు బిజెపికి అవకాశం కల్పించింది టిడిపి కూటమి. 2024లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. లోక్సభలో స్పష్టమైన మెజారిటీ ఉంది. కానీ రాజ్యసభలో ఎన్డీఏకు అనుకున్న స్థాయిలో మెజారిటీ లేదు. బిజెపి సొంతంగా అక్కడ ముద్ర చాటాలనుకుంది. గత రెండు సంవత్సరాల్లో ఖాళీ అయిన రాజ్యసభ పదవులను భర్తీ చేయగలిగింది. అలా మిత్రుల కు విజ్ఞప్తి చేసి ఏపీ నుంచి రెండు రాజ్యసభ సీట్లను సొంతం చేసుకుంది. తాజాగా పది రాష్ట్రాల నుంచి 24 మంది రాజ్యసభ సభ్యుల భర్తీ జరగనుంది. అందులో 11 పదవులను బిజెపి సొంతంగానే గెలుచుకొనుంది. దీంతో రాజ్యసభలో సైతం బిజెపి సొంతంగానే మెజారిటీ మార్కు దాటి పరిస్థితి కనిపిస్తోంది. అందుకే ఏపీ నుంచి ఈసారి అవకాశం ఇవ్వలేమని టిడిపి తేల్చి చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

అమరావతి రైతులకు అండగా జగన్.. నిజం ఇది!

Jagan And Amaravati Farmers
Jagan And Amaravati Farmers

Jagan And Amaravati Farmers: అమరావతి రైతులకు అండగా నిలుస్తానని ప్రకటన చేశారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ ప్రకటన చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఐదేళ్ల తన పదవీకాలంలో ఎన్నడూ అమరావతి రైతుల ముఖం చూడలేదు. కనీసం వారితో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. తనకు అమరావతి రాజధాని విషయంలో వేరే ఆలోచన ఉందని.. మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నానని కనీసం చెప్పలేకపోయారు వారితో. మొన్నటికి మొన్న మావిగన్ అని ప్రతిపాదన చేశారు. అమరావతికి ప్రత్యామ్నాయం ఇది అంటూ సలహా ఇచ్చారు. ఇప్పుడు అమరావతి రైతులను తన వద్దకు పిలిపించుకుని వారికి న్యాయ సహాయం అందిస్తామని చెబుతున్నారు. అయితే ఇక్కడే ఒక లాజిక్. భూములు ఇచ్చిన 30 వేల మంది రైతులకు కాదని.. భూములు ఇవ్వని 27 మంది రైతులను పిలిపించుకొని వారికి న్యాయ సహాయం చేస్తామని చెప్పడం మాత్రం నిజంగా గమనించదగ్గ విషయం. అయితే ఆది నుంచి ఈ 27 మంది రైతులను తన గుప్పెట్లో పెట్టుకుంది వైసిపి. అందుకే ఇప్పుడు వారు జగన్మోహన్ రెడ్డి వద్దకు వచ్చినట్లు అర్థమవుతోంది. అలాగని వీరంతా భూములు ఇవ్వరు అనుకోవడం పొరపాటే. తమ వద్ద ఉన్న భూములు ఇచ్చేందుకు సిద్ధం కానీ.. అదనపు పరిహారం కోరుకుంటున్నారు వీరంతా. అందుకే జగన్మోహన్ రెడ్డిని కలిస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా అన్న ఆలోచనతో ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డిని కలిసిన వారిలో అశోక్ అనే రైతు ఉన్నారు. ఒకవైపు జగన్ ను కలిసి తన సమస్యను చెప్పుకున్నారు. అదే రోజు భూసేకరణలో భాగంగా తనకున్న 1.40 ఎకరాల భూమిని అమరావతికి స్వాధీనం చేస్తూ అధికారులకు అప్పగించారు. అంటే అక్కడి రైతుల భిన్న వైఖరి కూడా అర్థం అవుతుంది.

* రెడ్డి రైతులు ఉన్నారా?
అమరావతిలో ఉన్నది కమ్మ సామాజిక వర్గం వారి అని జగన్మోహన్ రెడ్డి తో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. చివరకు ఆ విషయాన్ని కమ్మ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కొడాలి నానితో కూడా చెప్పించారు. కానీ జగన్మోహన్ రెడ్డిని కలిసిన 27 మంది రైతుల్లో.. దాదాపు 25 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే. వారంతా కలిసింది వైసీపీ ఇన్చార్జ్ దొంతి రెడ్డి వేమారెడ్డి ఆధ్వర్యంలోనే. ఇప్పటివరకు కమ్మ సామాజిక వర్గం వారు మాత్రమే అమరావతిలో ఉన్నారని.. వారి ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నారు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కానీ ఇప్పుడు అక్కడ రెడ్డి సామాజిక వర్గం వారు సైతం ఉన్నారని అర్థమవుతోంది. కేవలం కమ్మ సామాజిక వర్గం వారి ఉన్నారని చెబుతుండడం అబద్ధం అని తేలిపోయింది. అన్ని కులాల సమాహారం అమరావతి అని స్పష్టం అవుతోంది.

* సీడ్ యాక్సిస్ రోడ్డుకు అడ్డంకి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అమరావతి విషయంలో తీసుకున్న స్టాండ్ చిన్నపిల్లడిని అడిగిన తెలిసిపోతుంది. అమరావతి పై విషం చిమ్మాలి. రాజకీయ ప్రయోజనం పొందాలి. అంతకుమించి ఏం ఆలోచన లేదు ఆ పార్టీకి. అందుకే వీలైనంతవరకు అమరావతికి అడ్డు చెప్పాలన్నది ఆ పార్టీ ఆలోచన. అమరావతి రాజధాని కి ప్రధానమైన మార్గం సీడ్ యాక్సిస్ రోడ్డు. కానీ ఇంతవరకు దాని నిర్మాణం పూర్తిగా జరగలేదు. దాని వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నారన్నది తాజా సమావేశం ద్వారా తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డిని కలిశారు ఉండవెల్లి రైతులు. దాదాపు సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించి భూ సేకరణ జరిగింది. ఒక్క రోడ్డు మాత్రమే కాదు దానికి అనుబంధంగా కొన్ని రకాల నిర్మాణాలు జరగాలి. అందుకు దాదాపు 3,000 ఎకరాల భూమి సమీకరించాలి. కానీ ఉండవెల్లి, పెనుమాక రైతులు అభ్యంతరాలు చెబుతున్నారు. తమ భూమి మంగళగిరి కి దగ్గరగా ఉన్నందున ధర ఎక్కువగా ఉంటుందని.. అమరావతి రైతులకు మించి తమకు పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ఇప్పటికే 33 వేల ఎకరాలకు పైగా భూమి సమీకరించారు. అక్కడి రైతులను కాదని ఇక్కడి రైతులకు అదనపు ప్రయోజనాలు కల్పిస్తే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అయినా సరే రకరకాల మార్గాల్లో భూ సమీకరణకు సిద్ధపడుతోంది. 33,000 మంది రైతులు తమ భూములను త్యాగం చేశారు. 300 మంది రైతుల అభ్యంతరం చెబితే ఆ ప్రాజెక్టు నిలిచిపోయే అవకాశం లేదు. ప్రజా ప్రయోజనం కోసం అతి కొద్ది మందికి ఇబ్బందులు వచ్చినా ప్రాజెక్టు పూర్తి చేయాల్సిందేనని చట్టం చెబుతోంది. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి తో పాటు ఆ రైతులకు తెలుసు. కానీ దీనిని రాజకీయం చేయాలి. రాజకీయ ప్రయోజనం పొందాలి.

* శతాబ్దపు జోక్..
అమరావతికి అండగా జగన్మోహన్ రెడ్డి అంటూ సాక్షి మీడియాలో బ్యానర్ కథనం వచ్చింది. అయితే ఇది ఈ శతాబ్దపు జోక్. ఎందుకంటే అమరావతి రైతులను కనీసం మనుషులుగా కూడా చూసేవారు కాదు జగన్. కేసులతో ఎలా ఉక్కు పాదం మోపారో తెలియనిది కాదు. న్యాయబద్ధంగా వారు చేస్తున్న పోరాటాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కేసుల మీద కేసులు పెట్టారు. పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. మహిళా రైతులను వేశ్యలతో పోల్చారు. ఇలా ఎన్నెన్నో ఆకృత్యాలకు పాల్పడ్డారు. ఇప్పుడేమో అమరావతి పనులు శరవేగంగా జరుగుతుంటే మావిగన్ అంటూ ప్రతిపాదించారు. అమరావతి రైతులను పిలిపించుకొని.. మీకు న్యాయ సహాయం చేస్తాం.. భూములు ఇవ్వకండి అని చెప్పడం అమరావతిపై ప్రేమ అనాలా? ద్వేషం అనాలా? అనేది జగన్మోహన్ రెడ్డి విజ్ఞతకే విడిచిపెడదాం.

కోట్లు సంపాదిస్తున్న వైభవ్ సూర్య వంశీ.. ఐటి చెల్లించేందుకు అర్హుడేనా..

Vaibhav Suryavanshi
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: 15 సంవత్సరాల వయసులోనే క్రికెట్ ద్వారా కోట్లు సంపాదిస్తున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ కాంట్రాక్టులు.. ఇతర వ్యవహారాల ద్వారా అతడు ఇప్పటివరకు ఏడు కోట్ల దాకా సంపాదించాడు. ఈ స్థాయిలో సంపాదించాడు కాబట్టి.. అతడి ఆదాయపు పన్ను ఎవరు చెల్లించాలి.. 15 సంవత్సరాల వయసులో ఏడు కోట్లు సంపాదిస్తే.. దానికి సంబంధించిన ఆదాయపు పన్ను చెల్లించే అవకాశం ఉందా.. మన దేశానికి సంబంధించిన నిబంధనలు ఎలా ఉన్నాయంటే..

ఇండియన్ ఐటి చట్టాల ప్రకారం 18 ఏళ్ల లోపు ఉన్న వారిని కౌమార పిల్లల మాదిరిగానే పరిగణిస్తారు. వారు ఒకవేళ ఆ చిన్న వయసులో డబ్బు సంపాదించినప్పటికీ అదంతా కూడా వారి పేరెంట్స్ ఆదాయం గానే లెక్కిస్తారు. మామూలుగా పిల్లల పేరు మీద చేసే ఫిక్స్ డ్ డిపాజిట్లు.. ఇన్వెస్ట్మెంట్లు ఈ పరిధిలోకి వస్తాయి. కౌమార పిల్లల పేరు మీద వచ్చిన ఆదాయాన్ని ఇన్కమ్ టాక్స్ చట్టంలోని సెక్షన్ 64 (1) ఏ ప్రకారం కౌమార పిల్లల ఆదాయాన్ని.. వారి తల్లిదండ్రులలో ఎవరికైతే ఎక్కువ ఆదాయం ఉంటుందో.. వారి ఆదాయంతో కలిసి ట్యాక్స్ వేస్తారు.

సూర్య వంశీ కి మినహాయింపు

ఐపీఎల్ స్టార్ ఆటగాడు సూర్య వంశీ విషయంలో ఒక మినహాయింపు ఇక్కడ కనిపిస్తోంది. కౌమార దశలో ఉన్న ఒక బాలుడు తన సొంత ప్రతిభ లేదా ఇతర నైపుణ్యాల ఆధారంగా.. శారీరకంగా శ్రమ చేసి.. ఆ వృత్తిలో సంపాదించిన డబ్బు ను ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రుల ఆదాయంతో కల్పకూడదు. సూర్య వంశీ సంపాదన మొత్తం క్రికెట్ కాంట్రాక్టులు.. మ్యాచ్ ఫీజులు.. ఒప్పందాలు మాత్రమే వచ్చింది. ఈ ఆదాయాన్ని క్రికెట్ ద్వారా సొంతం చేసుకున్న నైపుణ్యం ద్వారానే వచ్చిందిగా భావిస్తుంటారు. అప్పుడు దానిని వైభవ్ సొంత ఆదాయం గానే చూస్తుంటారు.

కేవలం క్రికెట్ మాత్రమే కాదు ఇంకా రకరకాల విభాగాలలో గుర్తింపు తెచ్చుకున్న కౌమార పిల్లలకు ఇదే సూత్రం వర్తిస్తూ ఉంటుంది. ఇలా సంపాదించిన ఆదాయం మొత్తం కౌమార పిల్లలు తమ పేరు మీదుగానే ఆదాయపు పన్ను రిటర్న్లు దాఖలు చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆ పిల్లల తరఫున వారి పేరెంట్స్ లేదా ఇతర సంరక్షకులు ప్రతినిధులుగా వ్యవహరిస్తూ ఉంటారు. వారు రిటర్న్ ల దాఖలు ప్రక్రియ చేయాల్సి ఉంటుంది.

సూర్య వంశీ ఆదాయం వృత్తి లేదా వ్యాపారం ద్వారా వచ్చిందని భావిస్తుంటారు. కాబట్టి ఈ పరిధిలో ఉన్నవారు ఐటిఆర్ 3 లేదా ఐటిఆర్ 4 మాత్రమే దాఖలు చేయాల్సి ఉంటుంది. పన్ను ఆదాయం.. పర్సనల్ ఇన్కమ్ చెల్లించే వారికి వర్తించే స్లాబులే సూర్య వంశీకి వర్తిస్తూ ఉంటాయి. సూర్య వంశీ ఆదాయం కోట్లలో ఉంది కాబట్టి అతడు ఏకంగా 30 శాతం వరకు ట్యాక్స్ చెల్లించాలి.

ఈ రాశి వ్యాపారులకు ఈరోజు శుభదినం.. ధనయోగం ప్రారంభమయ్యే అవకాశం..

Today 5 june 2026 Horoscop
Today 5 june 2026 Horoscop

Today 5 june 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై శ్రవణ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని వాసుల వ్యాపారులకు ఈరోజు నుంచి ధనయోగం ప్రారంభమవుతుంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): . ఈ రాశి వారికి ఈ రోజు అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వీరికి కుటుంబ సభ్యుల అండదండలు ఉండడంతో వ్యాపారంలో బాగా రాణిస్తారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. కొత్తగా ప్రాజెక్టులు చేపట్టడానికి ఇదే మంచి సమయం. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కొన్ని ప్రత్యేక రంగాల్లో దూసుకుపోతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి విద్యార్థులు ఈ రోజు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంటుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. చట్టపరమైన చిక్కులు ఉంటే వాటి నుంచి బయటపడతారు. ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావడంతో మానసికంగా సంతృప్తిగా ఉంటారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): స్నేహితులతో సరదాగా ఉంటారు. మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం బాగా పెరుగుతుంది. దీంతో వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. కొన్ని ఖర్చులు పెరుగుతాయి. ఇలాంటి సమయంలో కొత్త వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకున్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు భారీగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఇల్లు నిర్మించుకోవడానికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. గతంలో అనుకున్న కోరికల్లో ఒకటి నెరవేరే అవకాశం.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు చాలా ఉత్సాహంగా పనిచేస్తారు. అయితే పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సొంత వాహనాలపై ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తికావడానికి పెద్దల సలహా తీసుకుంటారు. వైవాహిక జీవితం సంతోషంగా గడుస్తుంది. మాటల మాధుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈరోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. మానసిక సమస్యల నుంచి బయటపడతారు. జీవిత భాగస్వామితో విభేదాలు తొలగిపోతాయి. గతంలో అనుకున్న కోరికల్లో ఇప్పుడు ఒకటి నెరవేరే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడంతో మానసికంగా సంతృప్తిగా ఉంటారు. ప్రియమైన వారితో కలిసి షాపింగ్ చేస్తారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. గతంలో మొదలు పెట్టిన పనులను ఈరోజు విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి భారీగా లాభాలు వస్తాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి పెద్దల సలహా తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం లభిస్తుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావడంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొత్త వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఈ ప్రయాణాలు అనుకూలిస్తాయి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు మాటలు మాధుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. కొన్ని శుభయోగాల వల్ల కొత్త సంబంధాలు వస్తాయి. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు మెరుగైన లాభాలు ఉంటాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారికి ఇదే మంచి సమయం. ఎవరికైనా డబ్బు ఇచ్చే విషయంలో ఆలోచించాలి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు పెద్దల నుంచి ఆశీస్సులు ఎక్కువగా ఉంటాయి. దీంతో వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే అధిక లాభాలు పొందుతారు. అనుకోకుండా చేసే దూర ప్రయాణాల వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు కొత్త విషయాలు తెలుస్తాయి. దీంతో ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేస్తారు. వ్యాపారులకు ధనయోగం ప్రారంభమవుతుంది. ఉద్యోగులకు అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి విద్యార్థులు ఈ రోజు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది. విదేశాల నుంచి ముఖ్యమైన సమాచారం అందుతుంది. వ్యాపారులో కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే కుటుంబ సభ్యుల మద్దతు పొందాలి.