Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi: చిరంజీవి తో సినిమా చేయడం మా కల అంటున్న స్టార్ డైరెక్టర్స్... లిస్ట్ లో...

Chiranjeevi: చిరంజీవి తో సినిమా చేయడం మా కల అంటున్న స్టార్ డైరెక్టర్స్… లిస్ట్ లో ఎంతమంది ఉన్నారంటే..?

Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి చాలా మంచి గొప్ప గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఇక ఇప్పటివరకు ఆయన సాధించని విజయం లేదు. ఆయన అందుకొని అవార్డు లేదు. అలాంటి చిరంజీవి ఈ మధ్యకాలంలో కొంతవరకు డౌన్ అవుతున్నాడు. ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో సక్సెస్ ని సాధించిన కూడా అది ఆయన రేంజ్ హిట్ అయితే కాదని చాలామంది చెబుతున్నారు. ఆ సినిమాలో చిరంజీవి యాక్టింగ్ […]

Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి చాలా మంచి గొప్ప గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఇక ఇప్పటివరకు ఆయన సాధించని విజయం లేదు. ఆయన అందుకొని అవార్డు లేదు. అలాంటి చిరంజీవి ఈ మధ్యకాలంలో కొంతవరకు డౌన్ అవుతున్నాడు. ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో సక్సెస్ ని సాధించిన కూడా అది ఆయన రేంజ్ హిట్ అయితే కాదని చాలామంది చెబుతున్నారు. ఆ సినిమాలో చిరంజీవి యాక్టింగ్ కూడా అంత పెద్దగా ఎఫెక్టివ్ గా అనిపించలేదని కేవలం పండగ సీజన్ కాబట్టి ఆ సినిమా నడిచిందని చెప్పుకునే వారు కూడా ఉన్నారు. ఇక ఇలాంటి సందర్భంలోనే తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలంటే మాత్రం డిఫరెంట్ గా ప్రయత్నం చేయాల్సిన అవసరమైతే ఉంది. ఒకానొక సందర్భంలో చిరంజీవి అంటే ప్రేక్షకుల్లో ఒక క్రేజ్ ఉండేది. అతని నుంచి వచ్చే సినిమాలను ప్రేక్షకులు మొదటి రోజు చూడాలి అనేంతలా గొప్పగా ఉండేవి. కానీ ఇప్పుడు చిరంజీవి నుంచి వచ్చే సినిమాలు నాసిరకం కథలతో వస్తున్నాయని రొటీన్ కమర్షియల్ సినిమా నేపథ్యంలోనే సినిమాలు వస్తున్నాయని చాలామంది విమర్శిస్తున్నారు. మరి వీటన్నింటికి చెక్ పెడుతూ చిరంజీవి ఒక డిఫరెంట్ ప్రయత్నం చేయాల్సిన సమయమైతే ఆసన్నమైంది…ఇక ఇదిలా ఉంటే అతను ఓకే అంటే అతనితో సినిమాలు చేయడానికి చాలామంది దర్శకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొత్త దర్శకుల నుంచి స్టార్ట్ డైరెక్టర్స్ వరకు అతనితో సినిమాలు చేయడం వాళ్ళందరి కలగా భావిస్తున్నారు.

ఇక ఇప్పటికే ఆయనతో సినిమా చేసే అవకాశం కొంతమంది దర్శకులకు దక్కితే మరి కొంత మందికి మాత్రం దక్కడం లేదు. ఇక పూరి జగన్నాధ్ లాంటి దర్శకుడు సైతం కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా అతనితో సినిమా చేయడానికి ఇండస్ట్రీకి వచ్చానని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. అయినప్పటికి తనకు అవకాశమైతే ఇవ్వడం లేదు. ఎందుకని చిరంజీవి పూరిని పక్కన పెడుతున్నాడు అనే విషయంలో కూడా సరైన క్లారిటి రావడం లేదు.

ఇక బయపాటి శ్రీను సైతం చిరంజీవితో సినిమా చేయడం తన డ్రీమ్ అంటూ పలు సందర్భాల్లో చెప్పాడు. ఎందుకంటే చిరంజీవి, బాలకృష్ణ సినిమాలను చూసుకుంటూనే పెరిగాను కాబట్టి వాళ్ళతో సినిమా చేస్తే అదొక కిక్కు వస్తుంది అంటూ ఆయన చెప్పడం విశేషం… ఇక గోపీచంద్ మలినేని సైతం చిరంజీవితో సినిమా పక్కా చేస్తాను అంటూ ఆయన చాలా స్ట్రాంగ్ గా చెబుతున్నాడు. కారణం ఏంటి అంటే చిరంజీవిలో ఒక ఆరా ఉంటుందని దాన్ని మనం పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయగలిగితే ఆ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని ఆయన భావిస్తున్నాడు.

ఇక హరీష్ శంకర్ సైతం చిరంజీవితో సినిమా చేయడానికి పలు కథలను కూడా వినిపించాడు. కానీ చిరంజీవి మాత్రం ఆ కథలకు పెద్దగా ఇంప్రెస్ కానట్టుగా తెలుస్తుంది. దాని వల్ల అతన్ని పక్కనపెడుతున్నాడు. ఇక రీసెంట్ గా ఆయన పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చేశాడు. ఈ మూవీ కూడా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో హరీష్ శంకర్ ను పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ దర్శకులు చిరంజీవి తో ఎప్పుడు సినిమాలు చేస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper