Home Blog Page 184

జడ్జీలు VS మెంటర్స్..'అగ్ని పరీక్ష 2' ప్రోమో వచ్చేస్తోంది.. పూర్తి వివరాలు మీకోసం..

Bigg Boss Agnipariksha 2
Bigg Boss Agnipariksha 2

Agnipariksha 2: గత ఏడాది బిగ్ బాస్ సీజన్ ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బంధాలు , అనుబంధాలు మధ్య ఒక మంచి ఫ్యామిలీ డ్రామా ని తలపించడం తో , ఈ సీజన్ కి ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. పైగా ‘అగ్నిపరీక్ష’ అనే షో ని నిర్వహించి , ఆ షో ద్వారా సామాన్యులను బిగ్ బాస్ హౌస్ లోకి పంపడం, వారిలో ఒకరు టైటిల్ విన్నర్ గా నిలవడం , మరొకరు టాప్ 3 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలబడడం వంటివి జరిగాయి. అంతే కాకుండా ఈ షో నుండి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన మిగిలిన సామాన్యులు కూడా మంచి ప్రభావం చూపించారు. వారిలో దివ్య నిఖిత టీఆర్ఫీ రేటింగ్స్ కంటెంట్ ఏ రేంజ్ లో ఇచ్చిందో అందరికీ తెలిసిందే.

అదే విధంగా దమ్ము శ్రీజ, మాస్క్ మ్యాన్ హరీష్, మర్యాద మనీష్ , ప్రియా వంటి వారు కూడా బ్లాక్ బస్టర్ కంటెంట్ ని అందించారు. ఆ కంటెంట్ కారణంగా ఈ సీజన్ ఎక్కడికో వెళ్లి కూర్చుంది. ‘అగ్నిపరీక్ష’ షో ద్వారా వచ్చిన కంటెస్టెంట్స్ ఆ రేంజ్ ప్రభావం చూపించారు కాబట్టే , ‘అగ్నిపరీక్ష 2’ ని కనీవినీ ఎరుగని రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ టీం. గతం లో లాగా కాకుండా , ఈసారి చాలా కొత్తగా ఉండేలా ప్రయత్నం చేస్తున్నారు. గతం లో లాగానే ఈసారి కూడా ముగ్గురు జడ్జీలు ఉంటారు , యాంకర్ గా శ్రీముఖి నే వ్యవహరించబోతుంది. అయితే ఈసారి జడ్జీలతో పాటు మెంటర్స్ కూడా ఉంటారని టాక్. ఆ మెంటర్స్ మరెవరో కాదు , గత అగ్నిపరీక్ష సీజన్ ద్వారా బిగ్ బాస్ షో కి ఎంపికై టైటిల్ విన్నర్ గా నిల్చిన కళ్యాణ్ పడాల, టాప్ 3 గా నిల్చిన డిమోన్ పవన్, షో లో బలమైన ప్రభావం చూపించిన శ్రీజ దమ్ము.

ఈ ముగ్గురు మూడు టీం లీడ్స్ గా వ్యవహరిస్తారట. వీళ్ళ టీమ్స్ లో కొంతమంది కంటెస్టెంట్స్ ఉంటారు. సెలక్షన్ ప్రక్రియ లో ఈ మెంటర్స్ కూడా చాలా కీలక పాత్ర పోషించబోతున్నారు. ఇక జడ్జీలుగా గత సీజన్ లో నవదీప్ , బిందు మాధవి , అభిజీత్ వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో నవదీప్ అందుబాటులో ఉండే అవకాశం లేదట, అదే విధంగా బిందు మాధవి కూడా వచ్చే అవకాశాలు లేవలేని అంటున్నారు. నవదీప్ స్థానం లో శివాజీ, బిందు మాధవి స్థానం లో గీత మాధురి వస్తరారట. అదే విధంగా అభిజీత్ ఈ సీజన్ లో కూడా జడ్జీగా కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సీజన్ కి సంబంధించిన అగ్నిపరీక్ష ప్రోమో షూటింగ్ కూడా అయిపోయిందట. ఈ నెల 7 న విడుదల ఈ ప్రోమో ని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

ఎనిమిది కూడా పాస్ కాలేదు.. సీన్ కట్ చేస్తే టాటా కంపెనీకి ఉత్పత్తులు అమ్ముతోంది.. ఎవరిమే.. సంపాదన ఎంత..

Charanjit Kaur Story
Charanjit Kaur Story

Charanjit Kaur Story: మన దేశంలో టాటా కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం మనదేశంలోనే కాదు.. గ్లోబల్ వ్యాప్తంగా టాటా కంపెనీ కార్యకలాపాలు సాగిస్తోంది. ఉప్పు నుంచి మొదలుపెడితే ఉక్కు వరకు వ్యాపారాలు చేస్తూ లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తూ ఉంది. అటువంటి టాటా కంపెనీకి ఒక మహిళ తాను తయారు చేసిన ఉత్పత్తులను అమ్ముతోంది.. అంతేకాదు ప్రతినెల దండిగా ఆదాయాన్ని సంపాదిస్తోంది. ఇంతకీ ఆ మహిళ ఎవరు.. ఆమె కథ ఏంటంటే..

అది పంజాబ్ రాష్ట్రం. లుధియానా లోని భగవాన్పుర గ్రామం.. ఈ క్రమంలో చరణ్ జీత్ కౌర్ అనే మహిళ ఉంది. ఈమెకు 54 సంవత్సరాలు. చిన్నప్పటి నుంచి కూడా ఈమె ది పేదరికమే. రెక్కలు ముక్కలు చేసుకొని కూలి పనులకు వెళితే అంతగా ఆదాయం వచ్చేది కాదు. పేదరికం వల్ల ఎనిమిదవ తరగతి మధ్యలోనే వదిలి పెట్టాల్సి వచ్చింది. అయితే ఈమెకు కుటుంబాన్ని పోషించుకోవాలని మొదటి నుంచి కూడా బలమైన కోరిక. పిల్లల్ని బాగా చదివించుకోవాలని.. ఆర్థికంగా స్థిరపడాలని ఉండేది.

ఎనిమిదో తరగతి మధ్యలోనే డ్రాప్ అవుట్ కావడంతో ఈమె మిషన్ కుట్టడంలో శిక్షణ పొందింది. తన మిషన్ మీద జనపనార సంచులను ఎలా కుట్టాలో కృషి విజ్ఞాన కేంద్రంలో శిక్షణ పొందింది. తన నైపుణ్యాలను పెంపొందించుకుంది. ఆ తర్వాత వ్యాపారంలో మరింత అవగాహన ఏర్పరచుకుంది. భారీగా కాకుండా.. చిన్నచిన్నగా వ్యాపారాన్ని మొదలుపెట్టింది. మొదట్లో తన వ్యాపారం అనుకున్నంత సాఫీగా సాగిపోలేదు. కొన్నిసార్లు ఆర్డర్లు కూడా వచ్చేవి కావు. ఆర్థికంగా ఇబ్బంది పడింది.

ఈ దశలో తన వ్యాపారాన్ని మెల్లమెల్లగా గాడిలో పెట్టుకుంది. పలు మీడియా సంస్థలు ఆమె గురించి ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి. దీంతో ఆర్డర్లు మెల్లమెల్లగా పెరిగాయి. వ్యాపారం విస్తరించింది.. టాటా తో పాటు జోన్టి, అగ్రి వంటి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇప్పుడు ఏకంగా నెలకు 50 వేలకు మించి సంపాదించుకునే స్థాయికి పెరిగింది. సాధారణ ప్రజలు కూడా ఆమె దగ్గర సంచులు కొనుగోలు చేస్తుంటారు.

చెప్పిన సమయానికి అంటే ముందుగానే ఆర్డర్లు ఇవ్వడం ఆమె గొప్పతనం. వస్తున్న ఆదాయంతో కుటుంబాన్ని మెరుగుపరచుకుంది. స్థానిక రైతుల దగ్గర ఆమె జనపనార కొనుగోలు చేస్తూ ఉంటుంది. తద్వారా అక్కడ రైతులకు కూడా ఆర్థికంగా భరోసా కల్పిస్తోంది. ఎనిమిదవ తరగతి మధ్యలో డ్రాప్ ఔట్ కావడం.. జనపనార సంచులు కుట్టి ఈ స్థాయి దాకా ఎదగడం అంటే మామూలు విషయం కాదు. ఎంతైనా ఆడవాళ్లు ఆడవాళ్లే. ఎటువంటి సమస్యలైనా సరే వారి ముందు దిగదుడుపే.

అమెరికా అండ చూసుకుని ఎగిరి పడితే.. పాకిస్తాన్ ను నేలకేసి కొట్టిన ఇజ్రాయిల్..

Israel Pakistan Tensions
Israel Pakistan Tensions

Israel Pakistan Tensions: ఇరాన్ , అమెరికా మధ్య ఇంతకాలం వరకు యుద్ధం చోటుచేసుకుంది. ఇప్పుడు కాస్త పరిస్థితులు నెమ్మదిగా మారిపోయినప్పటికీ.. దాడులు అడపాదడపా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని తగ్గించడానికి పాకిస్తాన్ మధ్యవర్తి పాత్ర పోషించింది. ఒకసారి ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు నిర్వహించింది. ఆ చర్చలు అర్థాంతరంగా ముగిసిపోయాయి.

రెండోసారి చర్చలు జరుగుతాయని వార్తలు వచ్చినప్పటికీ.. ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో యుద్ధాన్ని తగ్గించడానికి పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాన్ని ఇజ్రాయిల్ తీవ్రంగా తప్పు పట్టింది. ముఖ్యంగా పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరు పై ఇజ్రాయిల్ తీవ్రంగా మండిపడింది.. పాకిస్తాన్ విశ్వసనీయమైన మధ్యవర్తి కాదని బాంబు పేల్చింది..

ఇరాన్ దేశానికి పాకిస్తాన్ అనుకూలంగా ఉందని.. పాకిస్తాన్ కు ఇలాంటి దేశానికి సంబంధించిన సున్నితమైన అంశాలు తెలుసని.. అందువల్లే గోడ మీది పిల్లి లాగా వ్యవహరిస్తుందని ఇజ్రాయిల్ ప్రతినిధి రూవన్ అజార్ పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణం నెలకొల్పే విషయంలో ఇరాన్, అమెరికా పాకిస్తాన్ దేశాన్ని సంప్రదిస్తే తమకు ఎటువంటి ఇబ్బంది లేదని.. అయితే యుద్ధం విషయంలో తమ అభిప్రాయాన్ని పాకిస్తాన్ మార్చలేదని ఇజ్రాయిల్ స్పష్టం చేసింది..”ఉగ్రవాదం.. ప్రాంతీయ భద్రత.. ఇరాన్ ప్రభావం ఇవన్నీ కూడా ప్రాధాన్యపరమైన అంశాలు. వీటిని పాకిస్తాన్ భర్తీ చేస్తుందని మాకు నమ్మకం లేదని” ఇజ్రాయిల్ ప్రకటించింది.

ఇజ్రాయిల్ ఇలా అనుమానించడంలో అనేక కారణాలు ఉన్నాయి. ఇరాన్ దేశానికి సహకారం అందిస్తోందని ఇప్పటికే యూఏఈ పాకిస్తాన్ మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తుంది. తమ దేశంలో స్థిరపడిన పాకిస్తాన్ పౌరులను బయటికి పంపిస్తోంది. అంతేకాదు స్పష్టమైన ఆధారాలతో పాకిస్తాన్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తోంది. ఇది ఇజ్రాయిల్ కు అనుమానాలు బలపడే విధంగా చేసింది. పాకిస్తాన్ దేశంతో ఇజ్రాయిల్ కు గొప్పగా చెప్పుకునే దౌత్య సంబంధాలు లేవు. అధికారికంగా ఇంతవరకు దౌత్య సంబంధాలు కొనసాగించిన దాఖలాలు లేవు. గతంలో ఇజ్రాయిల్ పాలస్తీనా మీద దాడులు చేసినప్పుడు పాకిస్తాన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. ఇజ్రాయిల్ పాకిస్తాన్ పాత్ర మీద విమర్శలు చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారం కొత్త మలుపుతీసుకుంది..

మరోవైపు రూవెన్ అజర్ భారత్ పాత్ర పై ప్రశంసలు కురిపించారు. పశ్చిమ ఆసియా ప్రాంతంలో స్థిరత్వం తీసుకురావడం భారత్ వల్ల మాత్రమే అవుతుందని పేర్కొన్నారు. అంతేకాదు భారతదేశంతో తాము వ్యూహాత్మకమైన భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నామని.. అది ఇప్పుడు మరింత బలపడుతోందని ఆయన పేర్కొన్నారు. కాగా, పాకిస్తాన్, ఇజ్రాయిల్ మధ్య సంబంధాలు మొదటి నుంచి కూడా ఇబ్బందికరంగానే ఉన్నాయి. 974లో పాకిస్తాన్.. 1948లో ఇజ్రాయిల్ ఏర్పడినప్పటికీ.. ఇజ్రాయిల్ దేశాన్ని పాకిస్తాన్ ఇంతవరకు అధికారికంగా గుర్తించలేదు. పైగా పాలసీనకు మొదటి నుంచి కూడా సపోర్ట్ చేస్తోంది.

టాప్ 5 లో నాలుగు సినిమాలు.. టాలీవుడ్ రికార్డ్స్ లో మెగా ఫ్యామిలీ డామినేషన్..

Tollywood Heroes overseas box office records
Tollywood Heroes overseas box office records

Telugu Box Office Records: ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన చిరంజీవి, మెగాస్టార్ గా ఎదగడమే కాకుండా, తన కుటుంబ సభ్యులను కూడా ఇండస్ట్రీ కి పరిచయం చేసి , వాళ్ళని కూడా సూపర్ స్టార్స్ గా మలిచిన తీరుకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్ , ఆ తర్వాత అల్లు అర్జున్ , రామ్ చరణ్ వంటి వారు సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి , ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకొని సూపర్ స్టార్స్ గా ఎదిగారు. ఒకప్పుడు ఈ హీరోల రికార్డ్స్ మాత్రమే టాప్ 5 లో ఉండేవి. కేవలం ఓపెనింగ్స్ లో మాత్రమే కాకుండా, క్లోజింగ్ లో టాప్ 5 లో వీళ్ళ రికార్డ్స్ మాత్రమే ఉండేవి , ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏర్పడింది.

మొదటి రోజు అత్యధిక వసూళ్లను రాబట్టిన టాప్ 5 చిత్రాల లిస్ట్ తీస్తే , అందులో 4 సినిమాలు మెగా హీరోలవే ఉన్నాయి. మొదటి స్థానం లో రామ్ చరణ్ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన #RRR చిత్రం ఉన్నది. ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి దాదాపుగా 74 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఆ తర్వాతి స్థానం లో మరో మెగా హీరో లేటెస్ట్ సెన్సేషన్ ‘పుష్ప 2’ కూడా ఉంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల నుండి 70 కోట్ల 81 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక ఆ తర్వాత మూడవ స్థానం లో కూడా మెగా హీరో సినిమానే ఉంది. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ చిత్రం తెలుగు రాష్ట్రాల నుండి 65 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇలా టాప్ 5 లో మొదటి మూడు స్థానాలు మెగా హీరోలు కబ్జా చేయడం గమనార్హం.

కేవలం ఒక్క నాల్గవ స్థానం మాత్రమే ఇతర హీరోకి దక్కింది. ఆ హీరో మరెవరో కాదు, జూనియర్ ఎన్టీఆర్, ఆయన నటించిన ‘దేవర’ చిత్రం తెలుగు రాష్ట్రాల నుండి 62 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక 5 వ స్థానం లో మెగా హీరో రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ చిత్రం నిల్చింది. ఈ చిత్రానికి మొదటి రోజున దాదాపుగా తెలుగు రాష్ట్రాల నుండి 54 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇలా టాప్ 5 సినిమాల్లో 4 సినిమాలను మెగా హీరోలే కబ్జా చేసారని , ఇప్పటికీ రికార్డ్స్ వాళ్ళ చేతుల్లోనే ఉన్నారని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు .

అన్నామలై కి రజనీకాంత్ ఫోన్.. తనతో చేయి కలపాలని వర్తమానం.. ఏం జరుగుతుంది తమిళనాడులో..

Rajinikanth Annamalai Phone Call
Rajinikanth Annamalai Phone Call

Rajinikanth Annamalai Phone Call: మొన్ననే కదా తనకు రాజకీయాలంటే ఇష్టం లేదని.. రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని.. ఆ వయసు కూడా దాటిపోయిందని తలైవా రజనీకాంత్ చెప్పింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ ని అభినందించింది.. కానీ ఇంతలోనే ఏం జరిగింది.. తమిళనాడులో ఏం జరుగుతోంది.. నిన్నటి వరకు విజయ్ చుట్టూ తిరిగిన రాజకీయాలు.. ఇప్పుడు ఎందుకు అన్నామలై వైపు వెళ్లిపోయాయి.. నిజానికి తమిళనాడు రాజకీయాలలో ఇప్పుడు ఏం జరుగుతోంది.. రాజీనామా చేసిన అన్నామలై ఏం చేయబోతున్నారు..

చాలా రోజుల నుంచి తమిళనాడు రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నయి.. ఇప్పటివరకు కూడా ముఖ్యమంత్రి విజయ్ చుట్టూ అక్కడి రాజకీయాలు తిరిగాయి. ఇప్పుడు ఏకంగా అన్నామలై వైపు కేంద్రీకృతమయ్యాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడు మీడియా నుంచి జాతీయ మీడియా వరకు ఆసక్తికరమైన చర్చ మొదలైంది. అంతేకాదు, భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన అన్నామలై అనేక విషయాలను ఇప్పుడు బయటపెడుతున్నారు.

2024లో అన్నామలై ఐపీఎస్ అధికారిగా ఉండేవారు. ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాలలోకి రావాలని ఆయన నిర్ణయించుకున్నారు. అన్నామలై రాజీనామా చేస్తున్న విషయం రజినీకాంత్ కి తెలిసింది. దీంతో ఆయన అన్నామలై కి ఫోన్ చేశారు. అయితే అప్పటికే అన్నామలై బిజెపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్య నిర్వాహక అధ్యక్షుడు బీఎల్ సంతోష్ కు మాట ఇచ్చారు. అయితే రజనీకాంత్ ఫోన్ చేసి తాను నేతృత్వం వహించబోయే రాజకీయ ఉద్యమంలోకి రావాలని అన్నామలై కి ఆహ్వానం పలికారు. అయితే రజనీకాంత్ ఆఫర్ ను అన్నామలై తిరస్కరించారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు. పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీకి మెరుగైన ఓటు బ్యాంకు లభించేలా చేశారు.

ఇటీవలీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వ్యవహరించిన తీరు అన్నామలై కి ఏమాత్రం నచ్చలేదు. దీంతో అభిప్రాయ బేధాలు వచ్చాయి. అందువల్లే ఆయన పార్టీకి రాజీనామా చేశారు.. కొద్దిరోజులుగా చర్చలు జరుగుతున్నప్పటికీ భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం విషయంలో అన్నామలై సానుకూల ధోరణి అందుపుచ్చుకోలేకపోయారు. కాగా అన్నామలై మక్కల్ ఇయక్కం పేరుతో రాజకీయ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. దానికి తమిళనాడులో విశేషమైన స్పందన లభిస్తోంది.

ఓరీ నీ.. వైభవ్ క్లాస్ మెట్స్ ఎలా ఉన్నారో తెలుసా.. ఇంత బుడ్డోడివా.

Vaibhav Suryavanshi
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: బీహార్ యువ సంచలనం వైభవ్ సూర్య వంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం 15 సంవత్సరాల వయసులోనే అతడు అనితర సాధ్యమైన క్రికెట్ ఆడుతున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఏ ఆటగాడు కూడా ఊహించని విధంగా బ్యాటింగ్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ లో ఐదు పురస్కారాలు ఉంటే.. అవన్నీ కూడా అతడే సొంతం చేసుకున్నాడు. తద్వారా కోట్ల డబ్బు సంపాదించాడు. అంతకుమించి అభిమానుల ప్రేమను సొంతం చేసుకున్నాడు. దిగ్గజ ప్లేయర్లు కూడా అతడి ఆట ముందు ఎవరైనా దిగదుడుపే అంటున్నారంటే.. మనవాడి బ్యాటింగ్ స్టైల్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

సూర్య వంశీ వయసు 15 సంవత్సరాలు. కానీ అతడు అంతకు మించిన స్థాయిలో బ్యాటింగ్ చేస్తున్నాడు. పెద్ద పెద్ద బౌలర్ల బౌలింగ్ సైతం అతడి ముందు గడ్డి పోచమాదిరిగా మారిపోతోంది. అందువల్లే ఏ మాత్రం జాలి అనేది లేకుండా బంతిని కనిపించగానే స్టాండ్స్ అవతలికి పంపిస్తున్నాడు. అవలీలగా సిక్సర్లు.. ఫోర్లు కొట్టేస్తున్నాడు. అందువల్లే ఐపిఎల్ లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా ఆవిర్భవించాడు. సెంచరీ తో పాటు.. అర్థ శతకాలు కొట్టేశాడు. మూడుసార్లు సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. లేకపోతే ఐపిఎల్ లో సరికొత్త చరిత్ర సృష్టించేవాడే.

సూర్య వంశీ ఐపీఎల్ ముగిసిన తర్వాత తన సొంత రాష్ట్రమైన బీహార్ వెళ్ళిపోయాడు. అక్కడ తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో బీహార్ రాష్ట్రానికి చెందిన కొంతమంది ప్రజా ప్రతినిధులు.. ఇతర వ్యక్తులు సూర్య వంశీని కలిశారు. అతనితో కలిసి ఫోటోలు దిగారు. ఈ జాబితాలో సూర్య వంశీ స్నేహితులు కూడా ఉన్నారు. సూర్య వంశీ స్నేహితులు అనగానే అతడి మాదిరిగా ఎత్తుగా, దృఢంగా ఉంటారని అనుకోవద్దు. ఎందుకంటే అతడిలో సగం ఎత్తు కూడా లేరు. అతడి శరీర సౌష్టవంలో పావు వంతు కూడా లేరు. సూర్య వంశీ అంత ఎత్తు కనిపిస్తుంటే.. అతడి ముందు వారంతా పిల్ల బచ్చాల మాదిరిగా ఉన్నారు.

సూర్య వంశీ చిన్నప్పటినుంచి బొద్దుగా ఉండేవాడు. దానికి తగ్గట్టుగానే ఎత్తు పెరిగాడు. పైగా అతడు మటన్ విపరీతంగా తినేవాడు. మైదానంలో ఎక్కువసేపు గడిపేవాడు. అందువల్లే అతడు అలా ఉన్నాడు. సూర్య వంశీ స్నేహితులను చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. సూర్య వంశీ ఆ స్థాయిలో ఎత్తు కనిపిస్తుంటే.. స్నేహితులు మాత్రం చిన్న పిల్ల మాదిరిగా ఉన్నారని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఓవర్సీస్ లో డిజాస్టర్ దిశగా 'పెద్ది'.. ఇక్కడొక్కటే ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది?

Peddi Movie
Peddi Movie

Peddi Overseas Box Office: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చి , మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని , అద్భుతమైన ఓపెనింగ్ వసూళ్లను సొంతం చేసుకుంది. కేవలం మొదటి రోజు మాత్రమే కాకుండా, రెండవ రోజు కూడా ఈ చిత్రానికి అద్భుతమైన వసూళ్లు నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం ఉన్నఉవంటి ట్రెండ్ చూస్తుంటే ఈ చిత్రానికి 2 వ రోజున ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు వచ్చేలా ఉందని అంటున్నారు. ఈ వీకెండ్ ముగిసే సమయానికి ఈ చిత్రం కచ్చితంగా 250 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అంతా బాగానే ఉంది కానీ , ఓవర్సీస్ లో మాత్రం ఈ చిత్రం డిజాస్టర్ ఫ్లాప్ దిశగా అడుగులు వేస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

ఓవర్సీస్ మొత్తానికి కలిపి ఈ చిత్రం 10 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. అంటే దాదాపుగా 100 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది అన్నమాట. ప్రీమియర్ షోస్ నుండి దాదాపుగా 27 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఒక్క నార్త్ అమెరికా లోనే ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ 7 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది అంటేనే అర్థం చేసుకోవచ్చు , ఈ సినిమా బిజినెస్ ఏ రేంజ్ లో ఉంది అని చెప్పడానికి. అయితే ఈ చిత్రం ఇప్పుడు బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం దాదాపుగా అసాధ్యం అనే అంటున్నారు ట్రేడ్ పండితులు. నార్త్ అమెరికా లో ఈ చిత్రానికి ప్రీమియర్స్ + మొదటి రోజుకి కలిపి 1.9 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అదే విధంగా ఈ మూడు రోజులకు కలిపి మరో 1.5 మిలియన్ డాలర్స్ ని రాబడుతుందని , ఓవరాల్ గా వీకెండ్ కి 3.4 మిలియన్ డాలర్లు , అదే విధంగా ఓవర్సీస్ మొత్తం కలిపి 4.8 మిలియన్ డాలర్లు రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు.

ఓవర్సీస్ లో మన తెలుగు సినిమాలకు వీకెండ్ తర్వాత భారీ వసూళ్లు నమోదు అయ్యే అవకాశం లేదు. కాబట్టి మహా అయితే ఈ చిత్రం మరో 1 మిలియన్ డాలర్లు ఓవర్సీస్ ఫుల్ రన్ లో రాబట్టే అవకాశాలు ఉన్నాయని , ఓవరాల్ గా 5.8 మిలియన్ డాలర్లు రాబడుతుందని , దాదాపుగా 4.2 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంటున్నారు. దాదాపుగా అన్ని ప్రధాన సైట్స్ లో ‘పెద్ది’ చిత్రానికి అద్భుతమైన రేటింగ్స్ వచ్చాయి, అయినప్పటికీ ఈ రేంజ్ ఫ్లాప్ గా నిలబడడానికి కారణం ఏంటో కనిపెట్టలేకపోతున్నారు ట్రేడ్ అభిమానులు. కచ్చితంగా రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కడం , ఓవర్సీస్ ఆడియన్స్ కి అది అంతగా నచ్చకపోవడం వల్లే, ఈ సినిమా ఫ్లాప్ దిశగా అడుగులు వేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందులో ఎంత మాత్రం నిజముందో తెలియదు కానీ , ‘పెద్ది’ కి ఓవర్సీస్ లో ఇలాంటి ఫలితం వస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు.

సెక్యూరిటీ అందుకోకపోతే.. చంద్రబాబుకు తప్పిన భారీ ప్రమాదం

Chandrababu
Chandrababu

Chandrababu Naidu narrow escape: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వయసు ఇప్పుడు ప్రస్తుతం ఏడుపదులు దాటిపోయింది. అయినప్పటికీ ఆయన ఇప్పటికీ ఉత్సాహంగానే ఉన్నారు. పరిపాలనలో దూకుడు కొండ సాగిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలను కలుస్తున్నారు. ప్రతినెల పింఛన్ల పంపిణీలో భాగంగా ఏపీ రాష్ట్రంలో ఏదో ఒక గ్రామాన్ని ఎంచుకుంటున్నారు. లబ్ధిదారుల దగ్గరికి నేరుగా వెళ్తున్నారు. వారితో మాట్లాడి పింఛన్ అందజేస్తున్నారు.

ఐటి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు గతంలో సీఈఓ మాదిరిగా ఉండేవారు. ఐటీ ని డెవలప్ చేసే క్రమంలో.. ప్రజలతో అప్పుడప్పుడు మాత్రమే మమేకం అవుతూ ఉండేవారు. అధికారుల ద్వారా క్షేత్రస్థాయిలో సమస్యలను నిత్యం తెలుసుకుంటూనే.. వాటికి పరిష్కార మార్గం చూపించేవారు. అయితే ఇప్పుడు చంద్రబాబు పూర్తిగా మారిపోయారు. కేవలం ఐటీ మాత్రమే కాకుండా.. స్పేస్ విభాగాలలో కూడా ఏపీ రాష్ట్రంలో కంపెనీలు పెట్టుబడులు పెట్టే విధంగా విధానాలు రూపొందిస్తున్నారు. అక్కడితోనే చంద్రబాబు ఆగిపోవడం లేదు.. మౌలిక సదుపాయాలు.. వ్యవసాయం.. ఇతర అనుబంధ రంగాల అభివృద్ధికి ఆయన కృషి చేస్తున్నారు.

గతంలో అధికారులతో ఆయన గంటల తరబడి సమీక్షలు నిర్వహించేవారు. ఇప్పుడు అలా కాకుండా నేరుగా ఆయన క్షేత్రస్థాయికి వెళ్తున్నారు. సమస్యలు తెలుసుకుంటున్నారు. పరిష్కార మార్గాన్ని అక్కడికక్కడే వెతుకుతున్నారు. అధికారులను నిందించడం లేదు. ప్రజలను దూరం పెట్టడం లేదు. మొత్తంగా నాయుడు మారిపోయాడు అన్నట్టుగా సంకేతాలు ఇస్తున్నారు. ప్రజలతో కలిసి టీ తాగుతున్నారు. వారింట్లో చేపల కూరతో వండిన భోజనం తింటున్నారు.. ఇంకా చెప్పాలంటే కల్లు కూడా రుచి చూస్తున్నారు.

చంద్రబాబు క్షేత్రస్థాయిలో పర్యటించడానికి ఇటీవల ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం విశాఖపట్నం లో నెట్ జీరో కార్యక్రమంలో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి నోవాటెల్ హోటల్ వరకు సైకిల్ మీద ప్రయాణించారు. దాదాపు నోవాటెల్ హోటల్ ప్రాంగణం వరకు చేరుకునే సమయంలో చంద్రబాబు తొక్కుతున్న సైకిల్ కాస్త అదుపుతప్పింది. ఆ సమయంలో సెక్యూరిటీ గార్డ్ ఆయన సైకిల్ పట్టుకున్నారు. అయినప్పటికీ చంద్రబాబు తన సైకిల్ కంట్రోల్ చేసుకోగలిగారు. ఏం పర్వాలేదు అమ్మ.. సైకిల్ వదిలిపెట్టండి.. నేను చూసుకుంటాను.. ఇబ్బంది లేదని సెక్యూరిటీ సిబ్బందితో చంద్రబాబు అన్నారు.

ఈ వయసులో కూడా చంద్రబాబు సైకిల్ తొక్కడం ఒక రికార్డ్ అయితే.. సైకిల్ అదుపుతపుతున్నప్పటికీ కూడా ఆయన తనను తాను కంట్రోల్ చేసుకున్న విధానం గొప్పగా ఉందని టిడిపి శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి ఆయన కంటే వయసులో చిన్న వాళ్లయిన నాయకులు చంద్రబాబు వెనుక ఉండిపోతే.. చంద్రబాబు మాత్రం నవ యువకుడిలా సైకిల్ తొక్కడం మొదలుపెట్టారు. చంద్రబాబు పరిమిత స్థాయిలో డైట్ తీసుకుంటారు. ఆయన మద్యం ముట్టరు. చక్కెర పదార్థాలను దగ్గరికి రానివ్వరు. ఆయిల్ ఫుడ్ తీసుకోరు. కేవలం మిల్లెట్స్.. మితంగా మాంసాహారం తింటారు. అందువల్లే చంద్రబాబు ఈ వయసులో కూడా ఇంత హెల్తీగా ఉన్నారు.

ఆన్లైన్ లో HD క్వాలిటీ తో లీకైన 'పెద్ది' మూవీ.. పాపం నిర్మాతలు..

Peddi Movie
Peddi Movie

Peddi movie HD leak online: టాలీవుడ్ ఇండస్ట్రీ అసలే పీకల్లోతు కష్టాలు ఉన్నాయి. స్టార్ హీరోలు సంవత్సరానికి కనీసం మూడు సినిమాలు అయినా విడుదల చేయకుంటే , థియేటర్స్ ని మూసి వేసుకోవాల్సిన దయనీయమైన పరిస్థితి. ఈ ఏడాది అయితే అత్యంత దారుణం. సంక్రాంతికి విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం మినహా మిగిలిన సినిమాలన్నీ డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగిలాయి. పవన్ కళ్యాణ్ , ప్రభాస్ సినిమాలపై బోలెడన్ని ఆశలతో ఉండేవారు ట్రేడ్ విశ్లేషకులు. కానీ వాళ్ళిద్దరి సినిమాలు కూడా దెబ్బేశాయి. ‘పెద్ది’ చిత్రం విడుదలయ్యే వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో , అత్యధిక థియేటర్స్ ని మూసేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి కష్టసమయంలో పిరాసీ మహమ్మారి మరోవైపు నిర్మాతలను వణుకుపుట్టిస్తోంది. ibomma రవి అరెస్ట్ అయ్యేలోపు , ఇక పైరసీ మాఫియా ని మొత్తం బ్రేక్ చేసేయొచ్చు అని అంతా అనుకున్నారు.

కానీ అలాంటివేమీ జరగలేదు, పైరసీలు జరుగుతూనే ఉన్నాయి , అది కూడా థియేటర్ ప్రింట్ కాదండోయ్, ఏకంగా HD ప్రింట్. ఏళ్ళ తరబడి కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేసి , ఎంతో కష్టపడి సినిమాలను నిర్మిస్తే , ఇలా విడుదలైన రోజే HD క్వాలిటీ తో దర్శనం ఇవ్వడం బాధాకరం. నిన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ‘పెద్ది ‘ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై , అద్భుతమైన పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని , రికార్డు స్థాయి ఓపెనింగ్స్ ని కైవసం చేసుకొని , ఇప్పుడు రెండవ రోజున కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపేస్తోంది. అలాంటి సినిమా ఇప్పుడు ఆన్లైన్ లోకి HD క్వాలిటీ తో అందుబాటులోకి వచ్చింది. ఇదే ఇప్పుడు నిర్మాతలను భయభ్రాంతులకు గురి చేస్తున్న విషయం.

అభిమానులు మేకర్స్ ని ట్యాగ్ చేసి సోషల్ మీడియా లో ఈ పైరసీ ప్రింట్ గురించి సమాచారం అందించారు. మేకర్స్ కంప్లైంట్స్ ని పరిగణలోకి తీసుకున్నారు. తర్వాత ఏమి చేయబోతున్నారో చూడాలి. ప్రస్తుతానికి అయితే ఈ సినిమా ఆన్లైన్ లోనే ఉంది , కొంతమంది ఈ చిత్రం లోని కొన్ని సన్నివేశాలను ముక్కలుగా కట్ చేసి యూట్యూబ్ , ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా మద్యలలో అప్లోడ్ చేస్తున్నారు. వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇలా HD ప్రింట్ ఆన్లైన్ లో లీక్ అవ్వడం వల్ల, పెద్ది సినిమా పై ఏమైనా ప్రభావం పడుతుందా అని సోషల్ మీడియా లో అభిమానులు లెక్కలేసుకుంటున్నారు, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

హాస్పిటల్ బెడ్ పైన నుండి ఎమోషనల్ వీడియో విడుదల చేసిన పండు మాస్టర్..

Pandu Master emotional video
Pandu Master emotional video

Pandu Master emotional video: ఈటీవీ లో ప్రసారమయ్యే ‘ఢీ ‘ డ్యాన్స్ షో ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది ఆడియన్స్ అభిమానాన్ని సొంతం చేసుకున్న పండు మాస్టర్ , రీసెంట్ గానే రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రమైన గాయాలపాలైన సంగతి తెలిసిందే. ఒక ఈవెంట్ ని ముగించుకొని తిరిగి వస్తుండగా , ఈ ఘోరం జరిగింది. అయితే సమీపం లో ఉన్న స్థానికులు వెంటనే పండు మాస్టర్ ని హాస్పిటల్ కి తీసుకెళ్లి చేర్చి , మెరుగైన వైద్యం అందించడం తో , పండు మాస్టర్ ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డాడు. అయితే ఆయన అభిమానులు , ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియకపోవడం కాస్త కంగారు పడ్డారు. సోషల్ మీడియా లో పండు మాస్టర్ ని ట్యాగ్ చేస్తూ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. అయితే కాసేపటి క్రితమే పండు మాస్టర్ ఒక వీడియో ని విడుదల చేశాడు .

ఈ వీడియో లో పండు మాస్టర్ తన ఆరోగ్య పరిస్థితి గురించి , అదే విధంగా తనకు ప్రమాదం ఎలా జరిగింది? అనే అంశం గురించి చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘ఒక ఈవెంట్ ని ముగించుకొని , కార్లో తిరిగి వస్తున్న సమయం లో నాకు అనుకోకుండా వామిటింగ్స్ ఫీలింగ్ వచ్చింది. దీంతో కారుని రోడ్డు పక్కన ఆపాము. ఈలోపు ఒక వాహనం అతి వేగంగా వచ్చి మా కారుని ఢీ కొట్టింది. పక్కనే ఉన్న నాకు దెబ్బలు తగిలేలోపు అక్కడిక్కడే స్పృహ తప్పి క్రింద పడిపోయాను , మళ్లీ కళ్ళు తెరిచి చూసేసరికి ఇలా హాస్పిటల్ బెడ్ మీద పడి ఉన్నాను. నా రెండు కాళ్లకు చాలా తీవ్రమైన గాయాలు అయ్యాయి. ముఖ్యంగా హిప్ జాయింట్ దిస్ లొకేట్ అవ్వడం వల్ల, కింది భాగం లో ఎముకలు , జాయింట్లు బాగా దెబ్బ తిన్నట్టు డాక్టర్లు గుర్తించారు’.

‘హాస్పిటల్ లో నాకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసిన తర్వాత , ఒక మేజర్ సర్జరీ అవసరమని డాక్టర్లు చెప్పడం తో , ఆ సర్జరీ ని కూడా విజయవంతంగా చేయించుకున్నాను. ప్రస్తుతానికి నా ఆరోగ్యం స్థిరంగానే ఉంది. కాకపోతే పూర్తి స్థాయిలో కోలుకొని మీ ముందుకు రావడానికి కాస్త సమయం పడుతుంది. ఈ కష్టమైన సమయం లో నాకు తోడుగా ఉంటూ , నేను కోలుకోవాలని ప్రార్థించిన మిత్రులు , అభిమానులు శ్రేయోభిలాక్షులకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాను ‘ అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు పండు మాస్టర్. కెరీర్ పీక్ రేంజ్ కి వెళ్తున్న సమయం లో , సరిగ్గా కాళ్లకు తీవ్రమైన గాయాలవ్వడం , పాపం నిజంగా పండు మాస్టర్ చేసుకున్న దురదృష్టం అనే చెప్పాలి.

ఈ ఆహారాన్ని కుక్కులు కూడా తినవు.. మీరెలా తింటారు.. వైద్యుడి వీడియో వైరల్..

Doctor food warning viral clip
Doctor food warning viral clip

Doctor food warning viral clip: ప్రస్తుత కాలంలో చాలా మంది ఇంట్లో ఆహారం కంటే ఫాస్ట్ ఫుడ్ ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇది చూడ్డానికి ఆకర్షణీయంగా ఉండడంతో పాటు టేస్టీగా ఉండడంతో చాలా మంది దీనిని లైక్ చేస్తున్నారు. అయితే ఫాస్ట్‌ఫుడ్ ఆరోగ్యానికి హానికరమని వైద్యులు, పోషకాహార నిపుణులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ రుచి కోసం చాలా మంది తరచూ బర్గర్లు, ఫ్రైడ్ చికెన్, పిజ్జాలు, నూడుల్స్, ఇతర జంక్ ఫుడ్ పదార్థాలను తీసుకుంటున్నారు. తాజాగా ఓ వైద్యుడు సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. రోడ్డు పక్కన విక్రయించే కొన్ని ఫాస్ట్‌ఫుడ్ చికెన్ ముక్కలను వీధి కుక్కలు కూడా తినవని.. ఎందుకంటే అవి సహజమైన ఆహారం కాదని జంతువులు కూడా గుర్తిస్తాయని ఆయన పేర్కొన్నారు. అసలు ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయంటే?

సోషల్ మీడియాలో వైద్యుడు చెబుతున్న ప్రకారం.. చాలా ఫాస్ట్‌ఫుడ్ పదార్థాలు అధిక ఉష్ణోగ్రతల వద్ద నూనెలో వేయించడం వల్ల వాటిలో హానికరమైన రసాయనాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఒకే నూనెను పలుమార్లు వేడి చేసి ఉపయోగిస్తే ట్రాన్స్ ఫ్యాట్లు, ఆక్సిడైజ్డ్ సమ్మేళనాలు పెరిగి గుండె సంబంధిత వ్యాధులు, రక్తనాళాల సమస్యలకు దారితీయవచ్చు. అందుకే బయట దొరికే వేయించిన ఆహారాల విషయంలో జాగ్రత్త అవసరమని ఆయన సూచించారు.

పురుగులు పట్టిన కూరగాయలను తొలగించి మిగిలిన భాగాన్ని ఉపయోగించవచ్చని, కానీ అధికంగా ప్రాసెస్ చేసిన ఫాస్ట్‌ఫుడ్‌లో మాత్రం పోషక విలువలు చాలా తక్కువగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఆహారాల్లో సాధారణంగా అధిక ఉప్పు, చక్కెర, కృత్రిమ రంగులు, రుచికారక పదార్థాలు, ప్రిజర్వేటివ్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అందించలేవని చెప్పారు.

ఫాస్ట్‌ఫుడ్‌ను తరచూ తీసుకోవడం వల్ల ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ పెరగడం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం, జీర్ణక్రియలో సమస్యలు, గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరగవచ్చు. చిన్న వయసులోనే ఈ అలవాటు పెరిగితే భవిష్యత్తులో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

పిల్లలు, యువతలో ఫాస్ట్‌ఫుడ్ వినియోగం అధికంగా ఉండటం మరింత ఆందోళన కలిగించే అంశంగా వైద్యులు పేర్కొంటున్నారు. టెలివిజన్ ప్రకటనలు, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లు, తక్కువ ధరలో లభించే ఆఫర్లు వీటిని మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాయి. అయితే తాత్కాలిక రుచి కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఇంట్లో తయారుచేసిన తాజా ఆహారం, పండ్లు, కూరగాయలు, సంపూర్ణ ధాన్యాలు, ప్రోటీన్ అధికంగా ఉండే పదార్థాలను ఆహారంలో చేర్చాలని వైద్యులు సూచిస్తున్నారు. అప్పుడప్పుడు ఫాస్ట్‌ఫుడ్ తీసుకున్నా పరిమితంగా ఉండాలని, దాన్ని రోజువారీ ఆహారంలో భాగంగా మార్చుకోవద్దని చెబుతున్నారు. రుచికంటే ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తేనే దీర్ఘకాలంలో మంచి ఫలితాలు పొందవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

సుకుమార్ - రామ్ చరణ్ మూవీ కథలో మార్పులు జరుగుతున్నాయా..?

Sukumar RC17 story changes
Sukumar RC17 story changes

Sukumar RC17 story changes: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంటలిజెంట్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్…గత కొద్దిరోజులుగా ఆయన నుంచి వచ్చే సినిమాలు సూపర్ సక్సెస్ ను సాధిస్తున్నాయి. ముఖ్యంగా రంగస్థలం, పుష్ప, పుష్ప 2 సినిమాలతో వరుసగా హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకున్న సుకుమార్ ఇప్పుడు మరోసారి రామ్ చరణ్ తో సినిమా చేయడానికి సన్న హాలు చేసుకుంటున్నాడు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో చేసిన పెద్ది సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా విషయంలో రామ్ చరణ్ మొదటి నుంచి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నప్పటికి ఫైనల్ గా ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది. దాంతో ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంతటి కలెక్షన్స్ ను రాబడుతుంది. ఫైనల్ గా ఈ సినిమాకి ఎలాంటి టాక్ వస్తుంది అనేది కూడా చర్చనీయాంశంగా మారింది.

ఇదంతా చూస్తున్న సుకుమార్ తను రాసుకున్న కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటున్నాడు. ఎందుకంటే జనాలు ఏ కథలను ఆదరిస్తారు. వేటిని రిజెక్ట్ చేస్తారు అనే విషయం సుకుమార్ కైతే ఒక క్లారిటి ఉంది. కానీ ఆయన రాసుకున్న కథలో కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నాయట.

ఆ సీన్స్ మరి ఓవర్ గా అవుతాయా లేదంటే సినిమా ఫ్లో కి తగ్గట్టుగానే ఉంటాయా అనే విషయంలో మరోసారి క్రాస్ చెక్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు పెద్ది మూవీ రిలీజ్ అయింది కాబట్టి వీలైనంత తొందరగా రామ్ చరణ్ తో సుకుమార్ తన సినిమాని స్టార్ట్ చేసే అవకాశాలైతే ఉన్నాయి.

ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ఉంటుంది… ఇక దానికి తగ్గట్టుగానే సుకుమార్ సైతం మరోసారి కథను రీరైట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కొన్ని మార్పులు చేర్పులను చేసి కథను ఎలా స్ట్రాంగ్ గా డిజైన్ చేయాలనే ధోరణిలోనే ప్రయత్నం చేస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి…

పవన్ కళ్యాణ్ పై విషం కక్కి తెలంగాణ సెంటిమెంట్ రాజేసి...

Pawan Kalyan controversy

Pawan Kalyan controversy : పవన్ కళ్యాణ్ పై ఆ విషం కక్కడం ఆగలేదు. దాన్ని అడ్డం పెట్టుకొని పవన్ పై విషం కక్కుతూ తెలంగాణ సెంటిమెంట్ ను రాజేస్తూ తమ ఉనికిని కాపాడుకోవడానికి రాజకీయ పార్టీలు, వ్యక్తులు, మేధావులు ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. నిన్న సీపీఐ ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, కోదండరాం, నాగేశ్వర్, ఆంధ్రజ్యోతి కే శ్రీనివాస్, సీపీఐ , కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

ప్రొఫెసర్ నాగేశ్వర్ గొంతు నొక్కేస్తున్నారన్న భావనను మీటింగ్ లో ప్రస్తావించారు. లేని అంశంలో ఆంధ్రా తెలంగాణ అంశంను లేవనెత్తి ప్రాంతీయ విద్వేశాలను రెచ్చగొట్టారు వ్యక్తులు. ఈ రౌండ్ టేబుల్ లో బూతులు తిట్టేవారు కాకుండా.. మాజీ జడ్జి సుదర్శన్ రెడ్డి లాంటి వారితో మాట్లాడించారు. భావస్వేచ్ఛపై ప్రసంగించారు.

పవన్ కళ్యాణ్ పై విషం కక్కి తెలంగాణ సెంటిమెంట్ రాజేసి… దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

కోట్ల భూమి కొట్టేసే పన్నాగం.. వైసిపి మాజీ ఎమ్మెల్యే ఇలా తెలంగాణ పోలీసులకు చిక్కాడు

YSRCP Ex-MLA Brahmanaidu arrested
YSRCP Ex-MLA Brahmanaidu arrested

YSRCP Ex-MLA Brahmanaidu arrested: అది హైదరాబాద్ నగరం.. గండిపేట శివారు ప్రాంతం.. ఇక్కడ ప్రభుత్వానికి విస్తారంగా భూములు ఉన్నాయి. ఎకరం భూమి కోట్లల్లో పలుకుతూ ఉంటుంది. ఈ భూముల మీద ఓ వైసిపి మాజీ ఎమ్మెల్యే కన్ను వేశాడు. నకిలీ జీవోలు సృష్టించాడు. ఆ భూమిని మొత్తం కాజేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. చివరికి అతని పాపం పండింది.

గండిపేట ప్రాంతంలో 9 ఎకరాల 28 ప్రభుత్వ భూమిని దక్కించుకోవడానికి వైసిపి మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అనేక రకాల ప్రయత్నాలు చేశాడు. తెర వెనుక బీభత్సమైన మంతనాలు జరిపాడు. సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో ఇతడి బాగోతం బయటపడింది. రంగారెడ్డి జిల్లాలోని గండిపేట గ్రామంలో సర్వేనెంబర్ 18లో ప్రభుత్వ భూమికి సంబంధించి ఇతడు నకిలీ జీవోలను సృష్టించాడు. వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నాడు. తన ఖాతా నుంచి 1.25 కోట్ల నగదును బదిలీ చేశాడు. ఇది కాస్త పోలీసుల అభియోగాలకు మరింత బలాన్ని ఇచ్చింది.

పోలీసులు ఈ కేసు వ్యవహారంలో కీలకమైన సమాచారాన్ని సేకరించారు. భూమిని కొట్టి వేయడానికి కుట్ర పన్నినట్టు ఆధారాల సేకరించారు. మొత్తం తొమ్మిది మంది మీద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో బ్రహ్మనాయుడుని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నరసరావుపేటకు వెళ్లారు. అక్కడ ఆయన లేరు.

ఈ వ్యవహారంలో మిగతా నిందితులు రమేష్, సునీల్, మరో ఇద్దరు కూడా పరారిలో ఉన్నారు. అయితే వీరంతా వివిధ రాష్ట్రాలు తిరిగారు. చివరికి పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్ సాధారణంగా కాంచీపురంలో ఉన్నట్టు కనుక్కున్నారు. వారందరిని కూడా శుక్రవారం కాంచీపురంలో అరెస్ట్ చేశారు. ఈ కేసు కు సంబంధించి మరిన్ని వివరాలను తెలంగాణ పోలీసులు మీడియాకు వెల్లడించనున్నారు.

బ్రహ్మనాయుడి భూభాగోతం బయటపడిన నేపథ్యంలో టిడిపి నాయకులు స్పందిస్తున్నారు. తమ పార్టీ అధినేత మాదిరిగానే కిందిస్థాయి వ్యక్తులు కూడా అలానే చేస్తున్నారని.. ప్రభుత్వ భూములను మొత్తం నాశనం చేస్తున్నారని.. చివరికి తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూములను కూడా వదిలిపెట్టడం లేదని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. వైసిపి నేతల బాగోతం పక్క రాష్ట్రాల్లో కూడా బయటపడుతోందని.. ఇంతకంటే దారుణం మరొకటి ఏముంటుందని టిడిపి నేతలు అంటున్నారు. ఇటువంటి పార్టీకి ఓటు వేసి ప్రజలు మరోసారి మోసపోకూడదని.. ఒకసారి ఏపీలో అధికారంలోకి తీసుకొస్తేనే రాష్ట్రం అనేక సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిందని.. ఇంకా వీళ్ళకు అధికారం అప్పగిస్తే మరో బంగ్లాదేశ్ అవుతుందని టిడిపి నేతలు అంటున్నారు.

2వ రోజు కూడా కొనసాగుతున్న 'పెద్ది' వసూళ్ల సునామీ.. గ్రాస్ ఏ రేంజ్ లో ఉందంటే..

Peddi Movie Scenes Removed Update
Peddi Movie Scenes Removed Update

Peddi day 2 collections: కరువులో ఉన్న టాలీవుడ్ కి ధమ్ బిర్యానీ దొరికితే ఎలా ఉంటుందో, అలా అన్నమాట నిన్న విడుదలైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఆ టాక్ కి తగ్గట్టుగానే ఓపెనింగ్ వసూళ్లు కూడా సెన్సేషనల్ గా నమోదు అయ్యాయి. ఈమధ్య కాలం లో విడుదల అవుతున్న ప్రతీ స్టార్ హీరో సినిమాకు సంపూర్ణమైన పాజిటివ్ టాక్ రాలేదు. ఎన్టీఆర్ ‘దేవర’ , పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రాలకు కూడా డివైడ్ టాక్ వచింది, కానీ భారీ హైప్ ఉండడం వల్ల, ఆ రెండు సినిమాలు కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యాయి. ఒక్క ‘పుష్ప 2’ చిత్రానికి మాత్రమే సంపూర్ణమైన పాజిటివ్ టాక్ వచ్చింది , ఆ తర్వాతి స్థానం మాత్రం ‘పెద్ది’ చిత్రానికే దక్కింది.

ఆకాశాన్ని అంటిన అంచనాలను అందుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు. బుచ్చి బాబు ఆ విషయం లో డిస్టింక్షన్ లో పాస్ అయ్యాడు అనే చెప్పాలి. మొదటి రోజు ఓపెనింగ్ తర్వాత , రెండవ రోజు ఈ సినిమాకు ఎలాంటి ఓపెనింగ్ వస్తుందో , ఆడియన్స్ థియేటర్స్ కి కదులుతారా లేదా అనే అనుమానాలు చాలానే ఉండేవి. కానీ ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ , ఈ చిత్రానికి రెండవ రోజున మార్నింగ్ షోస్ నుండే బ్లాక్ బస్టర్ ఆక్యుపెన్సీలు నమోదు అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా హౌస్ ఫుల్స్ బోర్డులు కనపడుతున్నాయి. ఇక బుక్ మై షో యాప్ లో అయితే ఈ చిత్రానికి గంటకు 25 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. మ్యాంటీ షోస్ అయితే నిన్నటి కంటే ఈరోజు ఎక్కువ ఉన్నాయి అనడం లో అతిశయోక్తి లేదు.

ఇక ఫస్ట్ షోస్ , సెకండ్ షోస్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఉన్న ఊపుని బట్టీ చూస్తుంటే ఈ చిత్రానికి రెండవ రోజున ప్రపంచవ్యాప్తంగా 35 నుండి 40 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఫస్ట్ షోస్ , సెకండ్ షోస్ ఊపుని బట్టీ , ఈ లెక్క పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి రిటర్న్ జీఎస్టీ తో కలిపి 15 నుండి 17 నుండి కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రెండవ రోజున వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చూడాలి మరి ఆ రేంజ్ కి వెళ్తుందా లేదా అనేది.

సూర్య కుమార్ యాదవ్ ను తప్పిస్తారా.. తర్వాత ఏం జరుగుతుందో తెలుసా..

Suryakumar Yadav Comeback
Suryakumar Yadav Comeback

Suryakumar Yadav captaincy future: భారత జట్టుకు టి20 వరల్డ్ కప్ అందించిన కెప్టెన్లలో సూర్య కుమార్ యాదవ్ మూడోవాడు. ముందుగా ధోని.. ఆ తర్వాత రోహిత్ టీమ్ ఇండియాకు టి20 వరల్డ్ కప్ లు అందించారు. సూర్య కుమార్ యాదవ్ ఇటీవలి టి20 ప్రపంచ కప్ లో టీమిండియాను విజేతగా నిలపడంలో ముఖ్యపాత్ర పోషించాడు. ఆటగాడిగా తన ముద్ర బలంగా వేసుకోలేకపోయినప్పటికీ.. జట్టును మాత్రం సమర్థవంతంగా నడిపించాడు.

ఆటగాడిగా అతడు విఫలమవుతున్న నేపథ్యంలో టి20 జట్టు సారథి బాధ్యతల నుంచి అతడిని తప్పిస్తారని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆ బాధ్యతను అయ్యర్ కు అప్పగిస్తారని ప్రచారం కూడా జరుగుతుంది. అయ్యర్ తో పాటు తిలక్ వర్మ, సంజు శాంసన్ రేసులో ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. సూర్య కుమార్ యాదవ్ ను పక్కన పెట్టే విషయంలో ఇంతవరకు మేనేజ్మెంట్ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. కాకపోతే మీడియాలో ఈ తరహా వార్తలు వస్తున్న నేపథ్యంలో అది నిజమే కావచ్చని అందరూ అనుకుంటున్నారు.

సూర్య కుమార్ యాదవ్ ను కెప్టెన్ స్థానం నుంచి తప్పించే విషయంలో మాజీ కోచ్ ఎంఎస్కే ప్రసాదు కీలక వ్యాఖ్యలు చేశారు..”ఇంగ్లాండ్ పర్యటనకు ముందుగా ప్రధాన జట్టును పంపిస్తారా.. లేకుంటే రెండవ స్థాయి జట్టను పంపిస్తారా అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఒకవేళ అత్యుత్తమమైన బృందాన్ని పంపిస్తే.. సూర్య కుమార్ యాదవ్ దానికి సారధ్యం వహించాల్సి ఉంటుంది. ఆ బాధ్యత నుంచి అతడిని తప్పిస్తే పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. ఒకవేళ కొత్త సారధిని సిద్ధం చేసుకోవాలి అనుకుంటే.. ముందు సూర్య కుమార్ యాదవ్ ను ఉప నాయకుడిగా నియమించుకోండి. ఆ తర్వాత మిగతా కథను పూర్తి చేయండి. టి20 ప్రపంచ కప్ సాధించేవరకు అక్షర్ పటేల్ రెండవ నాయకుడిగా ఉండేవాడు. ఇప్పుడు నాయకుడి బాధ్యతలను స్వీకరించడానికి చాలామంది ప్లేయర్లు రంగంలో ఉన్నట్టు తెలుస్తోంది. సూర్య అద్భుతమైన ఆటగాడు. కాకపోతే కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నాడు. కొత్త కుర్రాళ్ళు కూడా అవకాశాల కోసం తాపత్రయపడుతున్నారు. అలాంటప్పుడు సూర్యను నాయకుడి స్థానం నుంచి తప్పించడం ఏమాత్రం కరెక్ట్ కాదు. అతడికి కొన్ని అవకాశాలిస్తే.. నిరూపించుకుంటాడు. అప్పటికి అతడు నిలబడకపోతే పక్కన పెట్టడం బెటర్ అని” ప్రసాద్ వ్యాఖ్యానించాడు.

ఇక ప్రస్తుతం ఐపీఎల్ ముగిసింది. ఈ ఐపీఎల్లో ఈసారి చాలామంది ప్లేయర్లు తమ ప్రతిభను నిరూపించుకున్నారు. తిలక్ వర్మ.. పాటిదర్.. అయ్యర్.. కిషన్.. సంజు వంటి ప్లేయర్లు సత్తా చూపించారు. వారికి చెట్లను నడిపిన అనుభవం కూడా ఉంది. అందువల్ల ఇంగ్లాండ్ పర్యటనకు యంగ్ ప్లేయర్లకు అవకాశాలు ఇస్తే ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా సూర్య వంశీ వంటి ఆటగాడిని రంగంలోకి తీసుకొస్తే అప్పుడు ఫలితాలు వేరే విధంగా ఉంటాయి. ఐర్లాండ్.. ఇంగ్లాండ్ టూర్లలో టీమిండియా ఇదే తరహాలో దూకుడు కొనసాగిస్తే మాత్రం వెనకడుగు వేసే ప్రసక్తి ఉండదు. కాకపోతే మేనేజ్మెంట్ ఏ తరహాలో ఆలోచిస్తుందో అర్థం కావడం లేదు.

ఐటీ కంపెనీలు విప్రోను చూసి నేర్చుకోవాలి

Wipro success story 2026
Wipro success story 2026

Wipro success story 2026: ఐటీ కంపెనీలు కార్పొరేట్ వాతావరణాన్ని ప్రతిబింబిస్తాయి. వర్క్ కల్చర్, ఉద్యోగుల వేషధారణ, వారి మాటతీరు ప్రతీది కూడా మనల్ని మరోదేశంలోకి తీసుకెళ్తుంది. అందుకే ఐటీ కంపెనీలు ఉద్యోగులకు తగ్గట్టుగా పని వాతావరణాన్ని కల్పిస్తూ ఉంటాయి. ఆహ్లాదానికి పార్కులు, తినడానికి క్యాంటిన్లు, సేద తీరడానికి ఓపెన్ ఏరియాలు.. అలా అనేకం ఉంటాయి.

ప్రశాంతతకు, కోట్ల రూపాయల ప్రాజెక్టులకు కేంద్రాలైన ఐటీ కంపెనీలు దారుణ మైన కార్యకలాపాలకు కేంద్రాలుగా మారిపోతున్నాయి.. ఇటీవల టిసిఎస్ కంపెనీలో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఉద్యోగుల భద్రత.. ఇతర అంశాలపై ఆందోళనకు కారణమైంది. ఇది రాజకీయ దుమారానికి కూడా కారణమైంది. దీనిపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు.

టిసిఎస్ కంపెనీలో జరిగిన ఘటనను మర్చిపోకముందే విప్రోలు ఓ మాజీ మహిళా ఉద్యోగి చేసిన ఆరోపణలు సంచలనం కలిగించాయి. తాను పని చేస్తున్న కార్యాలయంలో రకరకాల వేధింపులు ఎదురయ్యాయని.. ఆ మహిళ వాపోయింది. పూణేలో ఆ మహిళ పనిచేస్తున్న సమయంలో కొంతమంది మానసిక ఒత్తిడికి గురి చేశారు. మతం మారే విషయంలో ఇబ్బందులు పెట్టారు. దీంతో ఆమె హింజ వాడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. సంస్థలో వేధింపులు.. పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆమె మానవ హక్కుల కమిషన్ వద్దకు వెళ్లారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో.. విప్రో కంపెనీ స్పందించింది.

ఆ మహిళ చెప్పినట్టుగా కొంతమంది సీనియర్ మేనేజర్లు.. టీం లీడర్లు బలవంతం చేస్తే.. కఠిన చర్యలు ఉంటాయని విప్రో కంపెనీ స్పష్టం చేసింది. ఉద్యోగుల సంక్షేమం విషయంలో.. గౌరవం విషయంలో.. స్వేచ్ఛ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గే అవకాశం లేదని స్పష్టం చేసింది. ఉద్యోగులకు సురక్షితంగా పని పరిస్థితులు కల్పిస్తామని.. వారితో నిబద్ధతను కలిగి ఉంటామని విప్రో కంపెనీ స్పష్టం చేసింది. అంతేకాదు ఈ కేసు వ్యవహారంలో పోలీసులు అడిగిన పత్రాలు మొత్తం ఇచ్చామని.. ఇటువంటి వ్యవహారాలలో ఉపేక్షకు తావు లేకుండా వ్యవహరిస్తామని విప్రో కంపెనీ ప్రకటించింది.