Home Blog Page 183

జనసేన రాజ్యసభ సభ్యుడిగా లింగమనేని రమేష్.. మండిపడుతున్న జన సైనికులు..

Lingamaneni Ramesh
Lingamaneni Ramesh

Lingamaneni Ramesh: రాజ్య సభలో ఖాళీ అయినా స్థానాలకు కూటమి పార్టీ నుండి ఎవరెవరు అభ్యర్థులుగా ఢిల్లీ కి వెళ్లాలో నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తెలుగు దేశం పార్టీ నుండి ముగ్గురుని రాజ్య సభకు పంపుతుండగా, జనసేన పార్టీ నుండి ఒకరిని పంపుతున్నారు. రాబోయే మూడేళ్ళలో జనసేన పార్టీ కి మరో మూడు రాజ్యసభ స్థానాలు దక్కనున్నాయి. అయితే జనసేన పార్టీ తరుపున ఎవరు రాజ్యసభ కి వెళ్తున్నారు అనే దానిపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. బాలినేని శ్రీనివాస్ లేదా లింగమనేని రమేష్ , వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు రాజ్యసభ కి వెళ్లొచ్చు అని అంతా అనుకున్నారు. కట్ చేస్తే అదే జరిగింది , లింగమనేని రమేష్ ని రాజ్యసభ కి పంపుతున్నట్టు జనసేన పార్టీ నిన్న అధికారిక ప్రకటన చేసింది.

అయితే లింగమనేని రమేష్ పేరు ని ప్రకటించడం పై కొంతమంది జనసైనికుల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. ఎందుకంటే పార్టీ కోసం మొదటి నుండి ఎంతో కష్టపడి పనిచేసిన వారిలో ఎవరికో ఒకరికి ఇవ్వకుండా, అసలు పార్టీ తో సంబంధం ఉందో , లేదో తెలియని తెలుగు దేశం పార్టీ కి సంబంధించిన లింగమనేని రమేష్ ని రాజ్యసభ కు పంపడం ఏంటి?, ఇది సరైన నిర్ణయం కాదు అంటూ పవన్ కళ్యాణ్ ని కొంతమంది జనసైనికులు తప్పుబట్టారు. అయితే లింగమనేని రమేష్ తెలుగు దేశం పార్టీ కి సంబంధించిన వ్యక్తి కాదు. 2014 లో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుండి ఆయనకు తోడుగా ఉంటూ వచ్చిన అతి తక్కువమంది లో ఒకరు లింగమనేని రమేష్. జనసేన పార్టీ కి అన్ని రకాల అవసరాలను తీర్చిన వ్యక్తి ఆయన. అంతే కాదు ఆ పార్టీ కి ఆర్థికంగా లింగమనేని రమేష్ చేసిన సేవలు కూడా వర్ణనాతీతం.

అందుకే పవన్ కళ్యాణ్ అతని పేరు ని ప్రకటించడాన్ని అంటున్నారు. ఇకపోతే తనని రాజ్యసభకు ఎంపిక చేసినందుకు గానూ , పవన్ కళ్యాణ్ కి కృతఙ్ఞతలు తెలియజేస్తూ లింగమనేని రమేష్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘జనసేన పార్టీ తరుపున రాజ్యసభకు నన్ను ఎంపిక చేసినందుకు మా పార్టీ అధ్యక్షులు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాను. కూటమి తరుపున నా అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు గార్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది నాకు ఒక బలమైన బాధ్యత. సాధారణ పౌరుడి గొంతు ని వినిపించడమే లక్ష్యంగా నేను పని చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు రమేష్.

ఆఫ్గనిస్తానే కదా అని నిర్లక్ష్యం వద్దు.. టీమిండియా వీటి మీద దృష్టి పెట్టాల్సిందే..

India vs Afghanistan Test
India vs Afghanistan Test

India vs Afghanistan Test: దాదాపు 7 నెలల విరామం తర్వాత టీమిండియా ప్లేయర్లు తెలుపు రంగు దుస్తులు వేసుకోబోతున్నారు. స్వదేశం వేదికగా ఆఫ్గనిస్తాన్ జట్టుతో ఏకైక టెస్ట్ ఆడబోతున్నారు. టెస్ట్ క్రికెట్లో ఆఫ్ఘనిస్తాన్ పసికూన. అలాగని ఆ జట్టులో భయంకరమైన ప్లేయర్లు ఉన్నారు. ఏదైనా జరగరనిది జరిగితే భారత్ కు ఇబ్బంది తప్పదు. అసలే డబ్ల్యూటీసి పాయింట్లలో భారత్ ఆరవ స్థానంలో ఉంది. అలాంటప్పుడు ఆఫ్గనిస్తాన్ జట్టుతో జరిగే ఏకైక మ్యాచ్ భారత జట్టుకు అత్యంత ముఖ్యం. ఈ మ్యాచ్లో కనుక భారత్ భారీ తేడాతో గెలిస్తే.. డబ్ల్యూటీసి పాయింట్లలో తన స్థానాలను మెరుగుపరుచుకుంటుంది.

చండీగఢ్ కొత్త స్టేడియంలో శనివారం నుంచి ఈ టెస్ట్ జరుగుతుంది.. ఇటీవల ఈ మైదానంలో ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. ఆఫ్ఘనిస్తాన్ జట్టులో రషీద్ ఖాన్ లేడు. అలాగని ఆ జట్టు అంత సులభంగా కనిపించడం లేదు. టి20 ఫార్మాట్.. వన్డే ఫార్మేట్ లో పెద్ద పెద్ద జట్లకు షాక్ ఇచ్చిన ఆఫ్ఘనిస్తాన్.. టెస్ట్ క్రికెట్లో కూడా అదే స్థాయిలో ఆడితే మాత్రం భారత జట్టుకు ఇబ్బందులు తప్పవు.

టెస్ట్ క్రికెట్లో స్వదేశంలో టీం ఇండియాకు గతంలో తిరుగు లేని రికార్డు ఉండేది. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల చేతిలో దారుణమైన పరాభవాలు ఎదురు కావడం టీమిండియా ఆట తీరును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. రోహిత్, కోహ్లీ, అశ్విన్ వీడ్కోలు పలికిన తర్వాత టెస్ట్ జట్టు కాస్త కళ తప్పింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ విభాగంలో టీమిండియా ఆరో స్థానంలో ఉండడంతో ఈ మ్యాచ్ గెలవడం అత్యంత అవసరం.. ఈ మ్యాచ్లో జడేజా కూడా లేడు. అశ్విన్ రిటర్మెంట్ తీసుకోవడం.. జడేజా లేకపోవడం ఒకరకంగా టీమ్ ఇండియాకు ఇబ్బంది. భారత స్పిన్ విభాగాన్ని కులదీప్ యాదవ్ ముందుండి నడిపించాల్సిన అవసరం ఉంది. వాషింగ్టన్ సుందర్ కూడా అతడికి సహకారం అందిస్తాడు. ఇక హర్ష్ దూబే, మానవ సుతార్ ఎవరో ఒకరు జట్టులోకి వస్తారు. సిరాజ్ పేస్ బౌలింగ్ దళానికి నాయకత్వం ఇస్తాడు. ప్రసిద్ధి కృష్ణ అతడితోపాటు బంతి పంచుకుంటాడు. బుమ్రా కు విశ్రాంతి ఇచ్చారు.. ఓపెనర్లుగా జైస్వాల్, కేఎల్ రాహుల్ బరిలోకి దిగుతారు.. సాయి సుదర్శన్ మూడో స్థానం..గిల్, పంత్, జురెల్, సుందర్ తర్వాత స్థానాలలో బ్యాట్ అందుకుంటారు.. భారత్ ఒకవేళ ముందుగా బ్యాటింగ్ చేస్తే రెండవ ఇన్నింగ్స్ ఆడకుండానే.. భారీగా పరుగు చేస్తున్న అవసరం ఉందని అభిమానులు భావిస్తున్నారు.

2018లో ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో భారత్ బెంగళూరు వేదికగా ఒక టెస్ట్ ఆడింది. ఇన్నింగ్స్ 262 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ మైదానం లో నల్లటి మట్టితో కూడిన పిచ్ రూపొందించారు. బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. వర్షం ముప్పు లేదు. కాకపోతే ప్రారంభంలో పేస్ బౌలర్లకు.. ఆ తర్వాత స్పిన్ బౌలర్లకు మైదానం అనుకూలిస్తుంది.

మూడు వారాల్లో.. మూడు దేశాల అధినేతలు.. మోడీ స్కెచ్ ఇలా కూడా ఉంటుందా..

India Foreign Policy
India Foreign Policy

India Foreign Policy: ప్రపంచ వ్యాప్తంగా మందగమన పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆర్థికంగా ఒత్తిడి వాతావరణం.. దేశాల మధ్య యుద్ధాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీనికి తోడు ఇండియన్ కరెన్సీ మీద డాలర్ ఒత్తిడి పెరిగిపోతోంది. ఇదంతా కూడా ఇండియన్ ఎకానమీని తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ఈ క్రమంలో వాణిజ్యం.. భద్రత.. ఇంకా రకరకాల సమస్యలను పరిష్కరించుకోవడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ కీలక అడుగులు వేశారు. కేవలం మూడు వారాల్లోనే మూడు దేశాల అధినేతలు భారత్ లో సందర్శించే విధంగా చేశారు. ట్రేడ్ ఒప్పందాలు.. ఇంకా అనేక రకాల వ్యవహారాలు ఇక్కడ కుదిరాయి.

సైప్రస్ దేశాధినేత నికోస్ క్రిస్టో డో లైడ్స్ ఇటీవల భారత దేశంలో పర్యటించారు. మధ్యదరా సముద్ర తీర ప్రాంతంలో వ్యూహాత్మక దేశంగా సైప్రస్ ఉంది. యూరోపియన్ యూనియన్ లో కూడా ఈ దేశం అత్యంత కీలకం. యూరోపియన్ యూనియన్ తో భారత్ ఫ్రీ ట్రేడ్ ఎగుమతి ఒప్పందాలు కుదుర్చుకున్న తర్వాత.. సైప్రస్ దేశాధినేత ఇండియా రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.. సైప్రస్ కు టర్కీ దగ్గర ఉంటుంది. టర్కీ మొదటి నుంచి కూడా మనకు వ్యతిరేక ధోరణి ప్రదర్శిస్తోంది. అందువల్లే టర్కీ కి చెక్ పెట్టాలంటే సైప్రస్ దగ్గర కావడమే భారత్ ముందున్న ఏకైక మార్గం. పైగా మిడిల్ ఈస్ట్ కారిడార్ లో ట్రేడ్ ఒప్పందాలు.. వ్యవహారాలకు సైప్రస్ అత్యంత కీలకం.

మే 30 నుంచి జూన్ 3 వరకు మయన్మార్ దేశాధినేత మిన్ ఆంగ్ రాంగ్ మనదేశంలో పర్యటించారు. ఈ దేశం మీద అమెరికా నుంచి ఇతర దేశాల వరకు ఆంక్షలు కొనసాగిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం మిన్ బలవంతంగా అధికారాన్ని సొంతం చేసుకోవడం.. ఈ దేశానికి చైనా మాత్రమే సహకారం అందిస్తోంది. ఇక్కడ అత్యంత క్రిటికల్ మినరల్స్ ఉన్నాయి. పైగా మన దేశానికి సంబంధించి అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, వంటి రాష్ట్రాలలో 1600 కిలోమీటర్ల సరిహద్దు ఈ దేశం పక్కనే ఉంది. ఈ దేశం పైన ఉన్న కొండ ప్రాంతాలలో క్రైస్తవులు అధికంగా ఉన్నారు. వారంతా కూడా ఆదివాసి తెగలకు చెందినవారు. వీరు ఇటీవల కాలంలో మనదేశంలోని ఈశాన్య రాష్ట్రాలలో ఉగ్రవాదాన్ని ప్రేరేపించే విధంగా కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఆ దృశ్యాలను భారత సైనిక బృందాలు డ్రోన్ల ద్వారా గుర్తించాయి. పైగా కొంతమంది మాదకద్రవ్యాలను కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందువల్లే సరిహద్దుల్లో భద్రత.. ఈశాన్య రాష్ట్రాలలో శాంతి స్థాపన.. ఈ అంశాలు మయన్మార్ మీద ఆధారపడి ఉన్నాయి. అందువల్లే మయన్మార్ అధ్యక్షుడు భారత్లో పర్యటించారు. ఆయనకు భారత ప్రభుత్వం రెడ్ కార్పెట్ స్వాగతం పలికింది.. చైనాతో ఉద్రిక్తతలు ఎప్పుడు కొనసాగుతాయో తెలియదు. అందువల్లే మయన్మార్ కు భారత్ అత్యంత దగ్గరయింది.

వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సి రోడ్రిగ్జ్ ప్రస్తుతం ఇండియాలో ప్రకటిస్తున్నారు. మధురో ను అమెరికా అపహరించిన తర్వాత డెల్సి తాత్కాలిక అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం భారత్ వెనిజులా నుంచి ప్రతిరోజు 4,27,000 బ్యారెళ్ల ముడిచమురును భారత్ కొనుగోలు చేస్తోంది. హర్ముజ్ జల సంధిలో చమురు రవాణా సాఫీగా సాగకపోవడం.. అనేక రకాల ఇబ్బందుల నేపథ్యంలో వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు భారత్ లో పర్యటించడం.. అనేక రకాల ఒప్పందాలను భారత్ కుదుర్చుకోవడం ఇక్కడ విశేషం. అయితే భవిష్యత్తు కాలంలో ఇరాన్ నుంచి పూర్తిస్థాయిలో క్రూడ్ ఆయిల్ రాకపోతే.. వెనిజులా నుంచి తీసుకోవాలని భారత్ నిర్ణయించింది. దానిని అమల్లో కూడా పెట్టింది.

మూడు వారాలు.. మూడు దేశాల అధినేతలు.. కీలకమైన ఒప్పందాలు.. ఇవన్నీ కూడా మన దేశానికి ఎంతో మేలు చేసేవి. ఇప్పుడున్న పరిస్థితుల్లో దౌత్యపరంగా భారత్ కీలకమైన ముందడుగు వేయకపోతే భవిష్యత్తు కాలంలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్లే మోదీ తన మార్క్ తెలివిని ఇక్కడ ప్రదర్శించారు. అందువల్లే భవిష్యత్తు కాలంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఈ రాశి వారి ఇంట్లో ఈరోజు ధన పండుగ.. పట్టిందల్లా బంగారమే..

Today 6 June 2026 Horoscope
Today 6 June 2026 Horoscope

Today 6 June 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశరాసులపై ధనిష్ట నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అద్భుతమైన లాభాలు ఉండనున్నాయి. మరి కొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులకు కొందరు సపోర్టు ఇవ్వడంతో అధిక లాభాలు రానున్నాయి. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. దీంతో కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంది. మరికొందరికి అదనపు ఆదాయం చేకూరుతుంది. విద్యార్థుల పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. విద్యార్థులు కొత్త కోర్సుల్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. కురుమ జీవితం సంతోషంగా ఉంటుంది. కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. డబ్బు ప్రవాహం పెరుగుతుంది.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి ఈ రోజు అన్ని శుభ ఫలితాలే ఉంటాయి. లక్ష్మీదేవి ఆశీస్సులతో కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. అనుకోకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. స్నేహితుల సహకారంతో అప్పులను తీరుస్తారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈరోజు అన్నీ కలిసి వస్తాయి. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు అధిక లాభాలు ఉంటాయి. కొందరు విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే కష్టంగా విజయం సాధించే అవకాశం ఉంటుంది. సన్నిహితుల నుంచి కీలకమైన సమాచారాన్ని అందుకుంటారు. విదేశాల్లో ఉండే వారితో వ్యాపారం చేసే వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు స్నేహితులు ధన సహాయం చేస్తారు. అయితే ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో ఉండే వారికి ప్రజల నుంచి పదోన్నతులు ఉండే అవకాశం ఉంది. ప్రియమైన వారికి కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. శని దేవుడు ఆశీస్సులు ఉండడంతో అన్ని శుభ ఫలితాలే ఉంటాయి. పెండింగు పనులను పూర్తి చేస్తారు. కొత్త విషయాలపై ఆసక్తిగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు సమాజంలో గౌరవం పొందుతారు. ఖర్చులు గలనీయంగా పెరిగే అవకాశం ఉంది. పెద్దల ఆశీస్సులతో కొత్తగా పెట్టుబడును పెడతారు. కొన్ని దోషాల నుంచి విముక్తి పొందడంతో జీవితం సంతోషంగా సాగుతుంది. పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు మెరుగైన ఫలితాలు ఉంటాయి. గతంలో చేపట్టిన పనులన్నీ ఒకే సమయంలో పూర్తి చేస్తారు. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. సన్నిహితుల నుంచి కీలకమైన సమాచారం అందుతుంది. విద్యార్థులు గురువుల మద్దతుతో పోటీ పరీక్షలో పాల్గొనడానికి సిద్ధమవుతారు. పెద్దల అండదండలతో వ్యాపారులకు లాభాలు ఉంటాయి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అన్ని విజయాలే ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. శని దేవుడి అండదండలతో కొన్ని పనులు పూర్తి అవుతాయి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటి ఉద్యోగుల సహకారంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడుల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి స్నేహితుల సహకారం తీసుకుంటారు. ప్రియమైన వారితో కలిసి ఉంటారు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొత్త వస్తువులు కొనుగోలు చేసే విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కొందరు పక్కనే ఉండి మోసం చేసే అవకాశం ఉంటుంది.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారి ఆరోగ్య విషయంలో ఈరోజు మెరుగైన ఫలితాలు ఉంటాయి. ప్రియమైన వారికోసం కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. పెండింగ్ పల్లెలు పూర్తి చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే విషయంలో ఆలోచించాలి. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు ఎక్కువగా ఉంటాయి.

ఈ ఫోన్ లో రెండు చిప్‌సెట్‌లు.. భారత్ లో ఎలా ఉంటుంది..

Samsung Galaxy Z Flip 8
Samsung Galaxy Z Flip 8

Samsung Galaxy Z Flip 8: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఫోల్డబుల్ ఫోన్లకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో Samsung తన తదుపరి క్లామ్‌షెల్ ఫోల్డబుల్ ఫోన్ Galaxy Z Flip 8ను జూలైలో జరిగే Galaxy Unpacked ఈవెంట్‌లో ఆవిష్కరించే అవకాశం ఉన్నట్లు లీకులు చెబుతున్నాయి. ఈసారి ఫోన్‌లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఒకే మోడల్‌ను రెండు వేర్వేరు ప్రాసెసర్లు కనిపిస్తాయి. అలాగే ఇందులో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. ఈ ప్రాసెసర్లు.. ఫోన్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

Samsung Galaxy Z Flip 8 కొన్ని మార్కెట్లలో శాంసంగ్ సొంత Exynos 2600 చిప్‌తో, మరికొన్ని దేశాల్లో Snapdragon 8 Elite Gen 5 for Galaxy ప్రాసెసర్‌తో అందుబాటులోకి రావచ్చు. గత ఏడాది వచ్చిన Galaxy Z Flip 7 పూర్తిగా Exynos 2500 చిప్‌తోనే విడుదల కాగా.. ఈసారి కంపెనీ మళ్లీ రెండు చిప్‌సెట్ వ్యూహాన్ని అనుసరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.కొన్ని నివేదికల ప్రకారం Exynos 2600 తయారీ వ్యయం ఎక్కువగా ఉండటం.. మరోవైపు Qualcomm తన ఫ్లాగ్‌షిప్ చిప్‌కు అనుకూల ధరలు ఆఫర్ చేయడం వల్ల శాంసంగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో Snapdragon, మరికొన్ని ప్రాంతాల్లో Exynos వేరియంట్లను విక్రయించే అవకాశం ఉంది.

భారత్, యూరప్, దక్షిణ కొరియా వంటి మార్కెట్లలో Exynos 2600 వేరియంట్ వచ్చే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమెరికా, కెనడా, చైనా, జపాన్ వంటి దేశాల్లో Snapdragon వేరియంట్ అందుబాటులోకి రావచ్చని సమాచారం. అయితే దీనిపై శాంసంగ్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

Exynos 2600 ప్రపంచంలోనే తొలి 2 నానోమీటర్ (2nm) ప్రాసెస్ టెక్నాలజీతో తయారైన మొబైల్ చిప్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇందులో 10 కోర్ CPU, మెరుగైన AI సామర్థ్యాలు, అధునాతన GPU, మెరుగైన పవర్ ఎఫిషియెన్సీ వంటి ఫీచర్లు ఉంటాయని శాంసంగ్ చెబుతోంది. గేమింగ్, మల్టీటాస్కింగ్, AI ఆధారిత పనితీరులో ఇది గణనీయమైన మెరుగుదల అందించగలదని భావిస్తున్నారు.

Galaxy Z Flip 8 డిజైన్ పరంగా Flip 7ను పోలి ఉండే అవకాశం ఉంది. అయితే కొత్త హింజ్ డిజైన్, తక్కువగా కనిపించే స్క్రీన్ క్రీజ్, మరింత సన్నగా ఉండే బాడీ, తక్కువ బరువు వంటి చిన్నచిన్న మెరుగుదలలు ఉండొచ్చని లీకులు సూచిస్తున్నాయి. ఫోల్డబుల్ ఫోన్లలో క్రీజ్ సమస్యను తగ్గించడంపై శాంసంగ్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

ఈ Galaxy Z Flip 8లో 6.9 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉండొచ్చని అంటున్నారు. సుమారు 4.1 అంగుళాల కవర్ స్క్రీన్ ఉండొచ్చు. కెమెరా విభాగంలో 50MP ప్రధాన సెన్సార్, 12MP అల్ట్రా వైడ్ కెమెరా, 10MP సెల్ఫీ కెమెరా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఫోన్‌లో 4,300mAh బ్యాటరీ ఉండగా.. 25W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండొచ్చని సమాచారం. Android 16 ఆధారిత One UIతో పాటు Galaxy AI ఫీచర్లు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లను కూడా శాంసంగ్ అందించవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి.

మెగా డీఎస్సీ.. ఇదిగో నిజాలు.. వైసిపి తల ఎక్కడ పెట్టుకుంటుంది

AP Mega DSC
AP Mega DSC

AP Mega DSC: ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి బాధ్యత ఉండాలి. ప్రజల సమస్యలు పరిష్కరించే నేర్పు ఉండాలి. యువతకు ఉద్యోగాలు కల్పించే సత్తా ఉండాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల విషయంలో వైసిపి రంద్రాన్వేషణ చేస్తోంది. లేనిపోని విమర్శలు చేస్తూ ఇబ్బంది పెడుతోంది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ ని సమర్థవంతంగా అమలు చేసింది. ఉద్యోగాలను భర్తీ చేసింది. ఉద్యోగాలు సాధించిన వారంతా పేద కుటుంబాలకు సంబంధించిన వారు. ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడంతో వారు ఆనందంతో విధులు నిర్వహిస్తున్నారు. కానీ ఇందులో కూడా రాజకీయాన్ని చూసింది వైసిపి. ఇంకేముంది తన సొంత మీడియాలో రాతలు రాయడం మొదలుపెట్టింది. అంతేకాదు, మోకాలికి బోడి గుండుకు ముడిపెట్టి అష్టవంకర్లైన కథనాలు రాస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ అధికారులు రంగంలోకి దిగారు. డీఎస్సీ నియామకాల మీద క్లారిటీ ఇచ్చారు. అది కూడా గణాంకాలతో సహా ..

శుక్రవారం విలేకరుల సమావేశంలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్, విద్యాశాఖ కార్యదర్శి శశిధర్ మాట్లాడారు.. వైసిపి చేస్తున్న ఆరోపణలకు స్పష్టమైన సమాధానం చెప్పారు.” డీఎస్సీ నిర్వహణలో అన్ని నిబంధనలు పాటించాం. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఆధారంగానే వర్టికల్ రిజర్వేషన్ విధానాన్ని, అది కూడా క్రమ పద్ధతిలో అమలు చేశాం. కేటగిరిల వారీగా పోస్టులను ఇచ్చాం. మెరిట్ ఆధారంగానే నియామకాలు జరిగాయి. వివిధ విభాగాలలో పోస్టుల భర్తీకి స్థిరమైన రోస్టర్ పాయింట్ లేదు. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ విధానం వల్లే విమర్శలు చేస్తున్నారు. జీవో 77 పై ఇంకా అనేక విమర్శలు వస్తూనే ఉన్నాయి. డీఎస్సీ నిర్వహించిన విధానంపై ఇప్పటికే అన్ని వివరాలతో ప్రకటన కూడా ఇచ్చాం. నిబంధనల ఉల్లంఘన అనేది జరగలేదు. వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ గురించి తెలుసుకుంటే చాలా మంచిదని” అధికారులు వివరించారు.

“దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తర్వాత మార్పులు చోటు చేసుకున్నాయి. ఎంపికైన వారు సరిగానే ఆ ఉద్యోగానికి అర్హులయ్యారా.. లేదా అనే విషయాలను మాత్రమే చూడాలి.. సుప్రీంకోర్టు హారిజాంటల్ రిజర్వేషన్ విధానంపై చాలా క్లారిటీగా తీర్పు ఇచ్చింది.. ఒకవేళ అభ్యర్థులకు అసంతృప్తి ఉంటే ఎందుకు ఉద్యోగం రాలేదనే కారణాలు తెలుసుకోవాలి. క్రీడలు, దివ్యాంగులకు సంబంధించిన కోటా విధానంలో రోస్టర్ పాయింట్లు అనేవి ఉంటాయి. అది అందరికీ తెలిసిన విషయమే. గతంలో క్రీడా విభాగంలో ప్రత్యేకమైన పాయింట్ ఉండేది. ఇప్పుడు అది లేదు. ముందుగానే నోటిఫై చేసే విధానం కూడా లేదు. కేటగిరీల వారీగానే పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది.. ఒకవేళ కాల్ లెటర్ వచ్చినప్పటికీ.. ఉద్యోగానికి ఎంపిక కాకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. ప్రభుత్వం అభ్యర్థులకు పంపించింది కేవలం వెరిఫికేషన్ కాల్ లెటర్ మాత్రమే. ఒకవేళ కొంతమంది అభ్యర్థులు ఎక్కువ స్థానాలలో ఎంపికైతే.. ఒకచోట మాత్రమే తీసుకుంటారు.. ఉద్యోగం ఇచ్చే విషయంలో ఎటువంటి తప్పులు చేయలేదని” అధికారులు పేర్కొన్నారు.

ఇప్పటివరకు డీఎస్సీ విషయంలో వైసిపి రకరకాలుగా ఆరోపణలు చేసింది. సొంత మీడియాలో అడ్డగోలుగా కథనాలను ప్రసారం చేసింది. కానీ ఇప్పుడు అసలు విషయాలు అధికారులు చెప్పడంతో వైసిపి తల పట్టుకుంది. అంతేకాదు, డిఎస్సి విషయంలో ప్రభుత్వం పూర్తి క్లారిటీ తో ఉండడంతో వైసిపికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. మరి ఈ వ్యవహారంలో వైసిపి ఇంకా ఏం చేస్తుందో చూడాల్సి ఉందని టిడిపి నేతలు అంటున్నారు.

: కాళేశ్వరమే కాదు.. ఈ పథకం కూడా కేసీఆర్ మీద కాసులు కురిపించిందట.. రేవంత్ చెప్పిన నిజం..

Revanth Reddy Political Journey
Revanth Reddy Political Journey

Revanth Reddy Allegations: రేవంత్ రెడ్డి మరో బాంబు పేల్చారు. ముఖ్యమంత్రి హోదాలో తన సొంత జిల్లాలో పర్యటించిన ఆయన ఈసారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకున్నారు. కెసిఆర్ చేసిన దోపిడి గురించి.. వెనకేసుకున్న పైసల గురించి.. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చేసిన అన్యాయం గురించి స్పష్టంగా చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలోనే కరువు జిల్లాగా పేరుపొందింది ఉమ్మడి పాలమూరు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కూడా ఇదే. ఈ జిల్లా నుంచి తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కేసీఆర్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు పాలమూరు జిల్లాను పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి పదేపదే ఆరోపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలమూరు జిల్లాకు కేసిఆర్ ఏమి చేయలేదని.. పాలమూరు జిల్లాలో మరింత వెనక్కి నెట్టారని రేవంత్ ఆరోపిస్తున్నారు.

ముఖ్యమంత్రి హోదాలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పరిశీలిస్తున్నారు రేవంత్ రెడ్డి. రెండవ రోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనులను ఆయన దగ్గరుండి పరిశీలించారు. కరివేన రిజర్వాయర్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ కీలక విషయాలను బయటపెట్టారు.

“ఉమ్మడి పాలమూరు వెనుకబడిపోయింది. ముఖ్యంగా ఈ జిల్లాలో గత ప్రభుత్వం ఏ ప్రాజెక్టును కూడా పట్టించుకోలేదు. జూరాల మినహా మిగతా అన్ని ప్రాజెక్టులు వెనుకబడి ఉన్నాయి. కనీసం భూసేకరణ కూడా చేయలేదు.. పంపులు, లిఫ్ట్ పనుల్లో విపరీతమైన అవినీతి చోటు చేసుకుంది. ఈ అవినీతి వ్యతిరేకంగా అప్పట్లో నాగార్జున రెడ్డి సంవత్సరాల తరబడి పోరాటం చేశారు.. నేను నా జిల్లాను బాగు చేసుకోవాలని పరితపిస్తున్నాను. వారేమో నన్ను ఇబ్బంది పెడుతున్నారు.. పనులు ఎలా పూర్తి చేయాలో నాకు తెలుసు అని” రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి పథకాన్ని పట్టించుకోలేదని రేవంత్ ఆరోపించారు. ఒకవేళ ఈ పథకం గనుక పూర్తయితే 26 లక్షల ఎకరాలకు నీరు వచ్చేది. 27 వేల కోట్లు ఖర్చు చేసి పంపులు, లిఫ్ట్ పనులు పూర్తి చేశారు. ఈ పనుల వల్ల కేసీఆర్ దండిగా తన ఖజానా మొత్తాన్ని నింపుకున్నారు. కమిషనర్ల పేరుతో వేల కోట్లు మళ్లించుకున్నారు. ఒక ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదు. ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ కూడా పూర్తి చేయలేదు.. ప్రాజెక్టులు పూర్తయినట్టు కేసీఆర్ మాత్రం చెబుతున్నారని రేవంత్ ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 22 వేల కోట్లు ఖర్చు చేసింది. ఇందులో ఉమ్మడి పాలమూరు జిల్లాకు 8 వేల కోట్లు ఇచ్చింది. ఈ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే ఇంకా 4000 ఎకరాల భూమి అవసరం. భూసేకరణ జరపకుండా రిజర్వాయర్లలో నీళ్ళు నింపడం దాదాపు అసాధ్యం. పైగా ఇప్పుడు ప్రాజెక్టు నిర్మాణానికి కొత్తగా అప్పుడు కూడా పుట్టడం లేదు. పాలమూరు రంగారెడ్డి పథకానికి 55 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా. అయితే ఇప్పటివరకు 27 వేల కోట్లు మాత్రమే ఖర్చయింది. 50% నిధులు కూడా ఖర్చు చేయకుండా, 90% పనులు పూర్తి చేయడం సాధ్యం కాదు.. పైగా తనపై కోపంతో మక్తల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ను కెసిఆర్ పక్కన పెట్టారని రేవంత్ ఆరోపించారు.

జనసేన రాజ్యసభ సీటు టిడిపి వ్యక్తికి.. తెరవెనక ఏం జరిగింది

Jana Sena
Jana Sena

Jana Sena: పెద్దల సభకు సంబంధించి అభ్యర్థి విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ రాష్ట్రం నుంచి తనకు లభించిన అవకాశానికి తగ్గట్టుగా జనసేన నుంచి లింగమనేని రమేష్ పేరును ఖరారు చేశారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం మధ్యాహ్నం లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేస్తారని తెలుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇందులో మూడు స్థానాలు టిడిపి అభ్యర్థుల కోసం ఖరారు చేశారు. ఒక స్థానాన్ని టిడిపికి కేటాయించారు

రమేష్, పవన్ కళ్యాణ్ ‌కు మధ్య బలమైన బంధం ఉంది. 2015 నుంచి వీరు స్నేహితులుగా కొనసాగుతున్నారు. పవన్ కళ్యాణ్ అంటే రమేష్ కు విపరీతమైన అభిమానం. 2019లో జనసేనకు ఆశించిన ఫలితాలు రాకపోయినప్పటికీ.. ఎన్నో రకాల ఒత్తిళ్లు ఉన్నప్పటికీ రమేష్ వెనకడుగు వేయలేదు. సహనంతో నిలిచారు. పైగా పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారు. తన వెంట ప్రయాణించిన రమేష్ కు ఇప్పుడు ఈ స్థాయిలో పవన్ కళ్యాణ్ గౌరవం కల్పించారు..

వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వానీ, పెళ్లి సుభాష్ చంద్ర బోస్ పెద్దల సభకు ఎన్నికయ్యారు. కూటమి అధికరణలతో వచ్చిన తర్వాత సానా సతీష్ బాబు, టిడిపి తరఫున పెద్దల సభకు ఎంపికయ్యారు. ఈ నలుగురి పదవి కాలం పూర్తికావస్తోంది. అందువల్లే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. నాలుగు సీట్లలో టిడిపి కి మూడు, జనసేనకు ఒక స్థానం లభించాయి.

జనసేన నుంచి రమేష్ రేపు నామినేషన్ దాఖలు చేస్తారు. టిడిపి నుంచి ఆ ముగ్గురు ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది.. రేపు లేదా ఎల్లుండి టిడిపి అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అనుదిన సమాచారం ప్రకారం కంభంపాటి రామ్మోహన్ రావు, గల్లా జయదేవ్, చింతకాయల విజయ్, సాన సతీష్, రాజేష్, దేవినేని ఉమామహేశ్వరరావు, యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య, భాష్యం రామకృష్ణ వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. టిడిపి అధినేత ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం.

గింగిరాలు తిరిగే బంతులు.. టీమిండియా నేర్వాలి పాఠాలు..

Spin Bowling Weakness India
Spin Bowling Weakness India

Spin Bowling Weakness India: టెస్ట్ క్రికెట్లో మిగతా జట్లు వేరు.. టీమిండియా వేరు. ఆస్ట్రేలియా ప్రభంజనం మిగతా ఫార్మాట్లలో ఎదురులేకుండా సాగుతుంటే.. టీ మీడియా మాత్రం వైట్ బాల్ ఫార్మాట్లో దుమ్ము రేపేది. ప్రపంచ స్థాయి బౌలర్లు ముత్తయ్య మురళీధరన్.. షేన్ వార్న్ వంటి వారి బౌలింగ్ ను సైతం టీమ్ ఇండియా బ్యాటర్లు తుక్కుతుక్కు కొట్టేవారు. ప్రతి బంతికి బౌండర్ లైన్ దారి అంటూ చూపించేవారు.

ఇప్పుడు పరిస్థితి మారిపోయింది టీమిండియా ప్లేయర్లు టి20 క్రికెటర్లుగా మారిపోయారు. నాటి సచిన్ లేడు. ద్రావిడ్ లేడు. ఐపీఎల్ లాంటి టోర్నీలు ఆడుతున్న ప్లేయర్లు మాత్రమే ఇప్పుడు టీమిండియా లో ఉన్నారు. అందువల్లే టీమిండియా వైట్ బాల్ ఫార్మాట్లో అదరగొట్టలేకపోతోంది. పైగా గతంలో రెండుసార్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ దాకా వెళ్లిన టీమిండియా.. గత సీజన్లో ఆ స్థాయి దాకా వెళ్ళలేకపోయింది. అంతేకాదు ఇప్పుడు డబ్ల్యూటీసి పాయింట్లు జాబితాలో ఆరవ స్థానంలో ఉంది. దీనిని బట్టి టీమిండియా బ్యాటింగ్ ఎలా ఉందో.. ఆట తీరు ఎలా కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు.

టీమిండియా బ్యాటర్లు స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోలేకపోతున్నారు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు. న్యూజిలాండ్ నుంచి మొదలు పెడితే మొన్నటి ఆస్ట్రేలియా సిరీస్ ల వరకు టీమిండియా ఆటగాళ్లు స్పిన్ బౌలర్ల ఉచ్చులకు ఎలా చిక్కిపోయారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందువల్లే మేనేజ్మెంట్ ప్రత్యేకంగా స్పిన్ బౌలింగ్ ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా శిక్షకుడిని నియమించింది. అతడు మరెవరో కాదు సాయిరాజు బహుతులే.

సాయి రాజ్ నియామకం వెనుక బీసీసీఐ గట్టి ప్లాన్ చేసింది. ఎందుకంటే ఇతడు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 630 వికెట్లు తీశాడు. అనేక రాష్ట్రాల క్రికెట్ జట్లకు శిక్షకుడిగా వ్యవహరించాడు. ఐపీఎల్ లో ఇతడు పంజాబ్.. రాజస్థాన్ జట్లకు సేవలందించాడు.. డబ్ల్యూటీసీలో భాగంగా టీమిండియా ఆఫ్గనిస్తాన్ జట్టుతో ఒక టెస్ట్.. ఆ తర్వాత శ్రీలంక, న్యూజిలాండ్ లో పర్యటిస్తోంది. న్యూజిలాండ్, శ్రీలంక మైదానాలు స్పిన్ బౌలింగ్ కు అత్యంత అనుకూలంగా ఉంటాయి. పైగా న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలో భారత్ వైట్ వాష్ కు గురైంది. అందువల్లే బహుతులే ను మేనేజ్మెంట్ ప్రత్యేకంగా నియమించింది. అజిత్ అగర్కర్.. ఇతర ముఖ్యులు సమావేశమయ్యారు. టీమిండియా బ్యాటర్లు స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో పడుతున్న ఇబ్బందులను ప్రధానంగా చర్చించారు. బహుతులే కు బృహత్తరమైన బాధ్యతను అప్పగించారు.

రాయి లక్ష్మీ బికినీలో అందాల జాతర

Raai Laxmi bikini
Raai Laxmi bikini

'పెద్ది' నుండి ఆ సన్నివేశాలు తొలగించి.. కొత్త సన్నివేశాలు జత చేయనున్న మేకర్స్..

Peddi Movie Scenes Removed Update
Peddi Movie Scenes Removed Update

Peddi Movie Scenes Removed Update: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని , కళ్ళు చెదిరే ఓపెనింగ్ వసూళ్లను నమోదు చేసుకుంది. రెండవ రోజు కూడా ఈ చిత్రానికి అద్భుతమైన వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం లో రామ్ చరణ్ నటనకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది కానీ , కొన్ని సన్నివేశాలను మాత్రం ఆడియన్స్ చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్ ట్రాక్ ని తిట్టనోళ్లు ఎవరూ మిగిలి లేరు అనడంలో అతిశయోక్తి లేదు. జాన్వీ కపూర్ అందాల ఆరబోత ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రమే కాదు , చూసే యూత్ ఆడియన్స్ కి కూడా చిరాకు కలిగించింది.

అందుకే ఈ సన్నివేశాలు కొన్ని ట్రిమ్ చేయాలనీ చూస్తున్నారట మేకర్స్. అంతే కాకుండా, సెకండ్ హాఫ్ లో వచ్చే ఐటెం సాంగ్ కూడా కథ ఫ్లో కి అడ్డంగా మారినట్టు రివ్యూస్ వచ్చాయి. ఈ సాంగ్ ని కూడా తొలగించే పనిలో ఉన్నారట. వీటి బదులుగా రెండు సన్నివేశాలను అదనంగా జత చేస్తారట. అందులో హీరో ఢిల్లీ వెళ్ళినప్పుడు , ఒక సందర్భంలో భారీ ఫైట్ సన్నివేశం వస్తుంది , దానిని నిడివి దృష్ట్యా ఎడిటింగ్ లో కత్తిరించాల్సి వచ్చిందట. ఇప్పుడు ఆ సన్నివేశాన్ని జత చేయబోతున్నట్టు సమాచారం. అదే విధంగా ఫస్ట్ హాఫ్ లో అప్పలసూరి పాత్ర పోషించిన జగపతి బాబు తండ్రి , ప్రయాణ సౌకర్యం లేక చనిపోయే సన్నివేశం ఒకటి ఉంటుందట. అది చాలా ఎమోషనల్ గా ఉంటుందని , కానీ నిడివి దృష్ట్యా ఆ సన్నివేశాన్ని కూడా తొలగించాల్సి వచ్చిందని బుచ్చి బాబు రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆ సన్నివేశాన్ని కూడా జత చేయబోతున్నట్టు సమాచారం.

ఇలా ఈ సినిమాలోని ఈ చిన్న మార్పులతో సోమవారం నుండి అందుబాటులోకి వస్తుందని , ఈ మార్పుల కారణంగా ఈ చిత్రానికి ఇంకా మంచి టాక్ వచ్చే అవకాశాలు ఉంటాయని మేకర్స్ భావిస్తున్నారట. మరి ఇది ఎంత వరకు నిజం అవ్వబోతుందో చూడాలి. ఇకపోతే రెండవ రోజు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము లేచిపోయే రేంజ్ వసూళ్లను నమోదు చేస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ముఖ్యంగా ఆంధ్రా ప్రాంతం లో ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. ఒక్క సీడెడ్ ప్రాంతం నుండే ఈ చిత్రానికి రెండవ రోజున 3 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యింది అంటేనే అర్థం చేసుకోవచ్చు , ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది. చూడాలి మరి లాంగ్ రన్ లో ఇంకా ఎన్ని అద్భుతాలు సృష్టించబోతోంది అనేది.

'జన నాయగన్' మేకర్స్ కి కోలుకోలేని షాక్ ఇచ్చిన సీఎం విజయ్.. పాపం నిర్మాతలు..

Jana Nayagan
Jana Nayagan

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ విడుదలపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల అవ్వాల్సిన ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు కొన్ని సన్నివేశాలకు అభ్యంతరం వ్యక్తం చేయడం , అందుకు మేకర్స్ ఒప్పుకోకపోవడం , ఆ తర్వాత కోర్టుకు వెళ్లడం , కోర్టు కూడా సెన్సార్ బోర్డు మెంబెర్స్ కి మద్దతు ఇవ్వడం , ఇక చేసేది ఏమి లేక , మేకర్స్ సెన్సార్ సభ్యులు సూచించిన మార్పులు చేయడానికి అంగీకరించడం వంటివి జరిగాయి. కానీ సెన్సార్ సభ్యులు ఇప్పటికీ ఈ చిత్రానికి సర్టిఫికేట్ జారీ చేయకపోవడం గమనార్హం. కానీ ఇప్పుడు సెన్సార్ సర్టిఫికేట్ కి క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉందని జూన్ 19 న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ రీసెంట్ గానే అధికారికంగా ప్రకటించారు.

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ గతం లో చాలా పెద్ద ఎత్తులోనే జరిగింది. విజయ్ చివరి చిత్రం అనే పబ్లిసిటీ భారీ రేంజ్ లో జరగడం తో , బయ్యర్స్ పోటీ పడి మరీ ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ని కొనుగోలు చేశారు. అయితే జనవరి 9 నుండి ఈ సినిమా వాయిదా పాడడం, నెలల తరబడి విడుదల విషయంలో జాప్యం జరగడంతో ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన బయ్యర్స్ కి మేకర్స్ డబ్బులు తిరిగి ఇచ్చేసారు , ఇంకా కొంతమందికి తిరిగి ఇవ్వాల్సి ఉంది. అయితే ఏ బయ్యర్స్ కి అయితే ఈ సినిమా డబ్బులను తిరిగి ఇచ్చేశారో, ఇప్పుడు వాళ్ళే ఈ చిత్రాన్ని భారీ రేట్స్ తో కొనుగోలు చేయడానికి ముందుకొచ్చారట. కానీ KVN సంస్థ తాము ఇచ్చిన డబ్బులతో పాటు, వడ్డీ తో సహా చెల్లిస్తేనే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ని మీకు అమ్ముతానని చెప్పారట.

ఈ విషయం సీఎం విజయ్ కి తెలిసింది. ఆయన తక్షణమే అలాంటి చర్యలు ఆపేయాల్సిందిగా ఆదేశించాడు. అదే విధంగా మిగిలిన బయ్యర్స్ కి కూడా డబ్బులు తిరిగి ఇచ్చేసి , ఈ సినిమాని సొంతంగా విడుదల చెయ్యమని నిర్మాతలకు విజయ్ సూచించినట్టు తెలుస్తోంది, అందుకు నిర్మాతలు కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. సాటిలైట్ , ఓటీటీ రైట్స్ కూడా సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాతే విక్రయించాల్సిందిగా సీఎం విజయ్ కోరాడట , అందుకు కూడా మేకర్స్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. విజయ్ చివరి చిత్రం , అది కూడా ముఖ్యమంత్రి అయ్యాక విడుదల అవ్వబోతున్న మొదటి చిత్రం, ఇక బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. విజయ్ కెరీర్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రం లియో , దాదాపుగా 650 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది , ఈ రికార్డుని జన నాయగన్ అవలీలగా అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు , చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

మహారాజా టి20 టోర్నీ: కేఎల్ రాహుల్ ను ఎవరూ కొనలేదు..ఏందీ దారుణం

KL Rahul Unsold Maharaja T20 Trophy
KL Rahul Unsold Maharaja T20 Trophy

KL Rahul Unsold Maharaja T20 Trophy: నిజంగానే ఇది దారుణం. ఒక ఆనామక స్థాయి ఆటగాడికి ఈ స్థాయిలో పరాభవం ఎదురు కాదు. ఇలా జరుగుతుందని ఆటగాడు కూడా ఊహించి ఉండడు. తక్కువలో తక్కువ భారీ ధర దక్కుతుందని.. అతడు అనుకొని ఉంటాడు. కానీ అవేవీ జరగలేదు. అంతేకాదు అతడిని ఎవరూ కొనుగోలు చేయలేదు.

ఈ దుస్థితి అనుభవిస్తున్న ఆటగాడి పేరు కేఎల్ రాహుల్. టీమిండియాలో ఈ కాలపు రాహుల్ ద్రావిడ్ లాగా పేరు తెచ్చుకున్న ఇతడు మహారాజా టి20 టోర్నీలో అమ్ముడుపోలేదు. చదువుతుంటే ఆందోళన కలిగినప్పటికీ ఇది నిజంగానే నిజం. ఐపీఎల్లో కేఎల్ రాహుల్ ఢిల్లీ జట్టు తరఫున ఆడుతున్నాడు. ఇతడిని 14 కోట్లకు ఆ జట్టు గతంలోనే కొనుగోలు చేసింది. ఇటీవల జరిగిన ఐపీఎల్లో రాహుల్ ఏకంగా 593 పరుగులు చేశాడు. పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 152* పరుగులు చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇంతటి విధ్వంసకరమైన ఆటగాడికి వేలంలో దారుణమైన పరాభవం ఎదురయింది. ఎందుకంటే అతడిని ఎవరు కొనుగోలు చేయలేదు. కనీసం రెండు లక్షలకు కూడా అతడిని సొంతం చేసుకోలేదు. దీంతో కేఎల్ రాహుల్ అమ్ముడుపోని ఆటగాడిగా నిలిచాడు.

కేఎల్ రాహుల్ సొంత రాష్ట్రమైన కర్ణాటకలో అక్కడి రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతి ఏడాది మహారాజా టి20 పేరు మీద లీగ్ నిర్వహిస్తూ ఉంటుంది.. ఈ ఏడాది సీజన్ కి సంబంధించి బెంగళూరులో మెగా వేలం జరిగింది. ఇందులో రెండు లక్షల కనీస ధరతో కేఎల్ రాహుల్ వేలంలోకి వచ్చాడు. అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి ఇష్టపడలేదు.

దీని వెనక ఒక కారణం ఉంది. ఎందుకంటే అతని మీద ఆసక్తి లేకపోవడం కాదు. వేలం సమయంలో రాహుల్ అందుబాటులో ఉండే అవకాశం లేదు. అందువల్లే అన్ని జట్లు అతడిని కొనుగోలు చేయడానికి ఇష్టపడలేదు.. మరికొద్ది రోజుల్లో భారత జట్టు తరఫున రాహుల్ అంతర్జాతీయ మ్యాచులు ఆడుతాడు. ఈనెల 20న ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగే వన్డే సిరీస్ లో అతడు ఆడతాడు. ఇంగ్లాండ్ టూర్ లో కూడా అతడు పాల్గొంటాడు. అలాంటప్పుడు మహారాజ టోర్నీలో అతడు ఆడే అవకాశం లేదు.

మహారాజ టోర్నీ ఈనెల 20 నుంచి వచ్చే నెల 12 వరకు నిర్వహిస్తారు. ఈ టోర్నీ జరుగుతుండగానే భారత జాతీయ జట్టు ఐర్లాండ్తో జూన్ 26, 28 తేదీలలో రెండు టీ20 లో ఆడుతుంది. జూలై 1 నుంచి 10 వరకు ఇంగ్లాండ్ జట్టుతో ఐదు టి 20 మ్యాచ్లు ఆడుతుంది. కాగా మహారాజా క్రికెట్ టోర్నీలో కర్ణాటక ప్లేయర్లు కరుణ్ నాయర్, మనీష్ పాండే భారీగా బిడ్ లు సొంతం చేసుకున్నారు. నాయర్ ను మంగళూరు డ్రాగన్స్ జట్టు యాజమాన్యం 18 లక్షలు.. పాండే కు గుల్బర్గా మిస్టిక్స్ 12.75 లక్షలకు కొనుగోలు చేశాయి.

జడ్జీలు VS మెంటర్స్..'అగ్ని పరీక్ష 2' ప్రోమో వచ్చేస్తోంది.. పూర్తి వివరాలు మీకోసం..

Bigg Boss Agnipariksha 2
Bigg Boss Agnipariksha 2

Agnipariksha 2: గత ఏడాది బిగ్ బాస్ సీజన్ ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బంధాలు , అనుబంధాలు మధ్య ఒక మంచి ఫ్యామిలీ డ్రామా ని తలపించడం తో , ఈ సీజన్ కి ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. పైగా ‘అగ్నిపరీక్ష’ అనే షో ని నిర్వహించి , ఆ షో ద్వారా సామాన్యులను బిగ్ బాస్ హౌస్ లోకి పంపడం, వారిలో ఒకరు టైటిల్ విన్నర్ గా నిలవడం , మరొకరు టాప్ 3 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలబడడం వంటివి జరిగాయి. అంతే కాకుండా ఈ షో నుండి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన మిగిలిన సామాన్యులు కూడా మంచి ప్రభావం చూపించారు. వారిలో దివ్య నిఖిత టీఆర్ఫీ రేటింగ్స్ కంటెంట్ ఏ రేంజ్ లో ఇచ్చిందో అందరికీ తెలిసిందే.

అదే విధంగా దమ్ము శ్రీజ, మాస్క్ మ్యాన్ హరీష్, మర్యాద మనీష్ , ప్రియా వంటి వారు కూడా బ్లాక్ బస్టర్ కంటెంట్ ని అందించారు. ఆ కంటెంట్ కారణంగా ఈ సీజన్ ఎక్కడికో వెళ్లి కూర్చుంది. ‘అగ్నిపరీక్ష’ షో ద్వారా వచ్చిన కంటెస్టెంట్స్ ఆ రేంజ్ ప్రభావం చూపించారు కాబట్టే , ‘అగ్నిపరీక్ష 2’ ని కనీవినీ ఎరుగని రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ టీం. గతం లో లాగా కాకుండా , ఈసారి చాలా కొత్తగా ఉండేలా ప్రయత్నం చేస్తున్నారు. గతం లో లాగానే ఈసారి కూడా ముగ్గురు జడ్జీలు ఉంటారు , యాంకర్ గా శ్రీముఖి నే వ్యవహరించబోతుంది. అయితే ఈసారి జడ్జీలతో పాటు మెంటర్స్ కూడా ఉంటారని టాక్. ఆ మెంటర్స్ మరెవరో కాదు , గత అగ్నిపరీక్ష సీజన్ ద్వారా బిగ్ బాస్ షో కి ఎంపికై టైటిల్ విన్నర్ గా నిల్చిన కళ్యాణ్ పడాల, టాప్ 3 గా నిల్చిన డిమోన్ పవన్, షో లో బలమైన ప్రభావం చూపించిన శ్రీజ దమ్ము.

ఈ ముగ్గురు మూడు టీం లీడ్స్ గా వ్యవహరిస్తారట. వీళ్ళ టీమ్స్ లో కొంతమంది కంటెస్టెంట్స్ ఉంటారు. సెలక్షన్ ప్రక్రియ లో ఈ మెంటర్స్ కూడా చాలా కీలక పాత్ర పోషించబోతున్నారు. ఇక జడ్జీలుగా గత సీజన్ లో నవదీప్ , బిందు మాధవి , అభిజీత్ వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో నవదీప్ అందుబాటులో ఉండే అవకాశం లేదట, అదే విధంగా బిందు మాధవి కూడా వచ్చే అవకాశాలు లేవలేని అంటున్నారు. నవదీప్ స్థానం లో శివాజీ, బిందు మాధవి స్థానం లో గీత మాధురి వస్తరారట. అదే విధంగా అభిజీత్ ఈ సీజన్ లో కూడా జడ్జీగా కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సీజన్ కి సంబంధించిన అగ్నిపరీక్ష ప్రోమో షూటింగ్ కూడా అయిపోయిందట. ఈ నెల 7 న విడుదల ఈ ప్రోమో ని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

ఎనిమిది కూడా పాస్ కాలేదు.. సీన్ కట్ చేస్తే టాటా కంపెనీకి ఉత్పత్తులు అమ్ముతోంది.. ఎవరిమే.. సంపాదన ఎంత..

Charanjit Kaur Story
Charanjit Kaur Story

Charanjit Kaur Story: మన దేశంలో టాటా కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం మనదేశంలోనే కాదు.. గ్లోబల్ వ్యాప్తంగా టాటా కంపెనీ కార్యకలాపాలు సాగిస్తోంది. ఉప్పు నుంచి మొదలుపెడితే ఉక్కు వరకు వ్యాపారాలు చేస్తూ లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తూ ఉంది. అటువంటి టాటా కంపెనీకి ఒక మహిళ తాను తయారు చేసిన ఉత్పత్తులను అమ్ముతోంది.. అంతేకాదు ప్రతినెల దండిగా ఆదాయాన్ని సంపాదిస్తోంది. ఇంతకీ ఆ మహిళ ఎవరు.. ఆమె కథ ఏంటంటే..

అది పంజాబ్ రాష్ట్రం. లుధియానా లోని భగవాన్పుర గ్రామం.. ఈ క్రమంలో చరణ్ జీత్ కౌర్ అనే మహిళ ఉంది. ఈమెకు 54 సంవత్సరాలు. చిన్నప్పటి నుంచి కూడా ఈమె ది పేదరికమే. రెక్కలు ముక్కలు చేసుకొని కూలి పనులకు వెళితే అంతగా ఆదాయం వచ్చేది కాదు. పేదరికం వల్ల ఎనిమిదవ తరగతి మధ్యలోనే వదిలి పెట్టాల్సి వచ్చింది. అయితే ఈమెకు కుటుంబాన్ని పోషించుకోవాలని మొదటి నుంచి కూడా బలమైన కోరిక. పిల్లల్ని బాగా చదివించుకోవాలని.. ఆర్థికంగా స్థిరపడాలని ఉండేది.

ఎనిమిదో తరగతి మధ్యలోనే డ్రాప్ అవుట్ కావడంతో ఈమె మిషన్ కుట్టడంలో శిక్షణ పొందింది. తన మిషన్ మీద జనపనార సంచులను ఎలా కుట్టాలో కృషి విజ్ఞాన కేంద్రంలో శిక్షణ పొందింది. తన నైపుణ్యాలను పెంపొందించుకుంది. ఆ తర్వాత వ్యాపారంలో మరింత అవగాహన ఏర్పరచుకుంది. భారీగా కాకుండా.. చిన్నచిన్నగా వ్యాపారాన్ని మొదలుపెట్టింది. మొదట్లో తన వ్యాపారం అనుకున్నంత సాఫీగా సాగిపోలేదు. కొన్నిసార్లు ఆర్డర్లు కూడా వచ్చేవి కావు. ఆర్థికంగా ఇబ్బంది పడింది.

ఈ దశలో తన వ్యాపారాన్ని మెల్లమెల్లగా గాడిలో పెట్టుకుంది. పలు మీడియా సంస్థలు ఆమె గురించి ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి. దీంతో ఆర్డర్లు మెల్లమెల్లగా పెరిగాయి. వ్యాపారం విస్తరించింది.. టాటా తో పాటు జోన్టి, అగ్రి వంటి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇప్పుడు ఏకంగా నెలకు 50 వేలకు మించి సంపాదించుకునే స్థాయికి పెరిగింది. సాధారణ ప్రజలు కూడా ఆమె దగ్గర సంచులు కొనుగోలు చేస్తుంటారు.

చెప్పిన సమయానికి అంటే ముందుగానే ఆర్డర్లు ఇవ్వడం ఆమె గొప్పతనం. వస్తున్న ఆదాయంతో కుటుంబాన్ని మెరుగుపరచుకుంది. స్థానిక రైతుల దగ్గర ఆమె జనపనార కొనుగోలు చేస్తూ ఉంటుంది. తద్వారా అక్కడ రైతులకు కూడా ఆర్థికంగా భరోసా కల్పిస్తోంది. ఎనిమిదవ తరగతి మధ్యలో డ్రాప్ ఔట్ కావడం.. జనపనార సంచులు కుట్టి ఈ స్థాయి దాకా ఎదగడం అంటే మామూలు విషయం కాదు. ఎంతైనా ఆడవాళ్లు ఆడవాళ్లే. ఎటువంటి సమస్యలైనా సరే వారి ముందు దిగదుడుపే.

అమెరికా అండ చూసుకుని ఎగిరి పడితే.. పాకిస్తాన్ ను నేలకేసి కొట్టిన ఇజ్రాయిల్..

Israel Pakistan Tensions
Israel Pakistan Tensions

Israel Pakistan Tensions: ఇరాన్ , అమెరికా మధ్య ఇంతకాలం వరకు యుద్ధం చోటుచేసుకుంది. ఇప్పుడు కాస్త పరిస్థితులు నెమ్మదిగా మారిపోయినప్పటికీ.. దాడులు అడపాదడపా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని తగ్గించడానికి పాకిస్తాన్ మధ్యవర్తి పాత్ర పోషించింది. ఒకసారి ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు నిర్వహించింది. ఆ చర్చలు అర్థాంతరంగా ముగిసిపోయాయి.

రెండోసారి చర్చలు జరుగుతాయని వార్తలు వచ్చినప్పటికీ.. ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో యుద్ధాన్ని తగ్గించడానికి పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాన్ని ఇజ్రాయిల్ తీవ్రంగా తప్పు పట్టింది. ముఖ్యంగా పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరు పై ఇజ్రాయిల్ తీవ్రంగా మండిపడింది.. పాకిస్తాన్ విశ్వసనీయమైన మధ్యవర్తి కాదని బాంబు పేల్చింది..

ఇరాన్ దేశానికి పాకిస్తాన్ అనుకూలంగా ఉందని.. పాకిస్తాన్ కు ఇలాంటి దేశానికి సంబంధించిన సున్నితమైన అంశాలు తెలుసని.. అందువల్లే గోడ మీది పిల్లి లాగా వ్యవహరిస్తుందని ఇజ్రాయిల్ ప్రతినిధి రూవన్ అజార్ పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణం నెలకొల్పే విషయంలో ఇరాన్, అమెరికా పాకిస్తాన్ దేశాన్ని సంప్రదిస్తే తమకు ఎటువంటి ఇబ్బంది లేదని.. అయితే యుద్ధం విషయంలో తమ అభిప్రాయాన్ని పాకిస్తాన్ మార్చలేదని ఇజ్రాయిల్ స్పష్టం చేసింది..”ఉగ్రవాదం.. ప్రాంతీయ భద్రత.. ఇరాన్ ప్రభావం ఇవన్నీ కూడా ప్రాధాన్యపరమైన అంశాలు. వీటిని పాకిస్తాన్ భర్తీ చేస్తుందని మాకు నమ్మకం లేదని” ఇజ్రాయిల్ ప్రకటించింది.

ఇజ్రాయిల్ ఇలా అనుమానించడంలో అనేక కారణాలు ఉన్నాయి. ఇరాన్ దేశానికి సహకారం అందిస్తోందని ఇప్పటికే యూఏఈ పాకిస్తాన్ మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తుంది. తమ దేశంలో స్థిరపడిన పాకిస్తాన్ పౌరులను బయటికి పంపిస్తోంది. అంతేకాదు స్పష్టమైన ఆధారాలతో పాకిస్తాన్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తోంది. ఇది ఇజ్రాయిల్ కు అనుమానాలు బలపడే విధంగా చేసింది. పాకిస్తాన్ దేశంతో ఇజ్రాయిల్ కు గొప్పగా చెప్పుకునే దౌత్య సంబంధాలు లేవు. అధికారికంగా ఇంతవరకు దౌత్య సంబంధాలు కొనసాగించిన దాఖలాలు లేవు. గతంలో ఇజ్రాయిల్ పాలస్తీనా మీద దాడులు చేసినప్పుడు పాకిస్తాన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. ఇజ్రాయిల్ పాకిస్తాన్ పాత్ర మీద విమర్శలు చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారం కొత్త మలుపుతీసుకుంది..

మరోవైపు రూవెన్ అజర్ భారత్ పాత్ర పై ప్రశంసలు కురిపించారు. పశ్చిమ ఆసియా ప్రాంతంలో స్థిరత్వం తీసుకురావడం భారత్ వల్ల మాత్రమే అవుతుందని పేర్కొన్నారు. అంతేకాదు భారతదేశంతో తాము వ్యూహాత్మకమైన భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నామని.. అది ఇప్పుడు మరింత బలపడుతోందని ఆయన పేర్కొన్నారు. కాగా, పాకిస్తాన్, ఇజ్రాయిల్ మధ్య సంబంధాలు మొదటి నుంచి కూడా ఇబ్బందికరంగానే ఉన్నాయి. 974లో పాకిస్తాన్.. 1948లో ఇజ్రాయిల్ ఏర్పడినప్పటికీ.. ఇజ్రాయిల్ దేశాన్ని పాకిస్తాన్ ఇంతవరకు అధికారికంగా గుర్తించలేదు. పైగా పాలసీనకు మొదటి నుంచి కూడా సపోర్ట్ చేస్తోంది.

టాప్ 5 లో నాలుగు సినిమాలు.. టాలీవుడ్ రికార్డ్స్ లో మెగా ఫ్యామిలీ డామినేషన్..

Tollywood Heroes overseas box office records
Tollywood Heroes overseas box office records

Telugu Box Office Records: ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన చిరంజీవి, మెగాస్టార్ గా ఎదగడమే కాకుండా, తన కుటుంబ సభ్యులను కూడా ఇండస్ట్రీ కి పరిచయం చేసి , వాళ్ళని కూడా సూపర్ స్టార్స్ గా మలిచిన తీరుకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్ , ఆ తర్వాత అల్లు అర్జున్ , రామ్ చరణ్ వంటి వారు సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి , ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకొని సూపర్ స్టార్స్ గా ఎదిగారు. ఒకప్పుడు ఈ హీరోల రికార్డ్స్ మాత్రమే టాప్ 5 లో ఉండేవి. కేవలం ఓపెనింగ్స్ లో మాత్రమే కాకుండా, క్లోజింగ్ లో టాప్ 5 లో వీళ్ళ రికార్డ్స్ మాత్రమే ఉండేవి , ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏర్పడింది.

మొదటి రోజు అత్యధిక వసూళ్లను రాబట్టిన టాప్ 5 చిత్రాల లిస్ట్ తీస్తే , అందులో 4 సినిమాలు మెగా హీరోలవే ఉన్నాయి. మొదటి స్థానం లో రామ్ చరణ్ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన #RRR చిత్రం ఉన్నది. ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి దాదాపుగా 74 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఆ తర్వాతి స్థానం లో మరో మెగా హీరో లేటెస్ట్ సెన్సేషన్ ‘పుష్ప 2’ కూడా ఉంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల నుండి 70 కోట్ల 81 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక ఆ తర్వాత మూడవ స్థానం లో కూడా మెగా హీరో సినిమానే ఉంది. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ చిత్రం తెలుగు రాష్ట్రాల నుండి 65 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇలా టాప్ 5 లో మొదటి మూడు స్థానాలు మెగా హీరోలు కబ్జా చేయడం గమనార్హం.

కేవలం ఒక్క నాల్గవ స్థానం మాత్రమే ఇతర హీరోకి దక్కింది. ఆ హీరో మరెవరో కాదు, జూనియర్ ఎన్టీఆర్, ఆయన నటించిన ‘దేవర’ చిత్రం తెలుగు రాష్ట్రాల నుండి 62 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక 5 వ స్థానం లో మెగా హీరో రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ చిత్రం నిల్చింది. ఈ చిత్రానికి మొదటి రోజున దాదాపుగా తెలుగు రాష్ట్రాల నుండి 54 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇలా టాప్ 5 సినిమాల్లో 4 సినిమాలను మెగా హీరోలే కబ్జా చేసారని , ఇప్పటికీ రికార్డ్స్ వాళ్ళ చేతుల్లోనే ఉన్నారని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు .