Home Blog Page 185

2వ రోజు కూడా కొనసాగుతున్న 'పెద్ది' వసూళ్ల సునామీ.. గ్రాస్ ఏ రేంజ్ లో ఉందంటే..

Peddi Movie Scenes Removed Update
Peddi Movie Scenes Removed Update

Peddi day 2 collections: కరువులో ఉన్న టాలీవుడ్ కి ధమ్ బిర్యానీ దొరికితే ఎలా ఉంటుందో, అలా అన్నమాట నిన్న విడుదలైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఆ టాక్ కి తగ్గట్టుగానే ఓపెనింగ్ వసూళ్లు కూడా సెన్సేషనల్ గా నమోదు అయ్యాయి. ఈమధ్య కాలం లో విడుదల అవుతున్న ప్రతీ స్టార్ హీరో సినిమాకు సంపూర్ణమైన పాజిటివ్ టాక్ రాలేదు. ఎన్టీఆర్ ‘దేవర’ , పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రాలకు కూడా డివైడ్ టాక్ వచింది, కానీ భారీ హైప్ ఉండడం వల్ల, ఆ రెండు సినిమాలు కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యాయి. ఒక్క ‘పుష్ప 2’ చిత్రానికి మాత్రమే సంపూర్ణమైన పాజిటివ్ టాక్ వచ్చింది , ఆ తర్వాతి స్థానం మాత్రం ‘పెద్ది’ చిత్రానికే దక్కింది.

ఆకాశాన్ని అంటిన అంచనాలను అందుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు. బుచ్చి బాబు ఆ విషయం లో డిస్టింక్షన్ లో పాస్ అయ్యాడు అనే చెప్పాలి. మొదటి రోజు ఓపెనింగ్ తర్వాత , రెండవ రోజు ఈ సినిమాకు ఎలాంటి ఓపెనింగ్ వస్తుందో , ఆడియన్స్ థియేటర్స్ కి కదులుతారా లేదా అనే అనుమానాలు చాలానే ఉండేవి. కానీ ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ , ఈ చిత్రానికి రెండవ రోజున మార్నింగ్ షోస్ నుండే బ్లాక్ బస్టర్ ఆక్యుపెన్సీలు నమోదు అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా హౌస్ ఫుల్స్ బోర్డులు కనపడుతున్నాయి. ఇక బుక్ మై షో యాప్ లో అయితే ఈ చిత్రానికి గంటకు 25 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. మ్యాంటీ షోస్ అయితే నిన్నటి కంటే ఈరోజు ఎక్కువ ఉన్నాయి అనడం లో అతిశయోక్తి లేదు.

ఇక ఫస్ట్ షోస్ , సెకండ్ షోస్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఉన్న ఊపుని బట్టీ చూస్తుంటే ఈ చిత్రానికి రెండవ రోజున ప్రపంచవ్యాప్తంగా 35 నుండి 40 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఫస్ట్ షోస్ , సెకండ్ షోస్ ఊపుని బట్టీ , ఈ లెక్క పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి రిటర్న్ జీఎస్టీ తో కలిపి 15 నుండి 17 నుండి కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రెండవ రోజున వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చూడాలి మరి ఆ రేంజ్ కి వెళ్తుందా లేదా అనేది.

సూర్య కుమార్ యాదవ్ ను తప్పిస్తారా.. తర్వాత ఏం జరుగుతుందో తెలుసా..

Suryakumar Yadav Comeback
Suryakumar Yadav Comeback

Suryakumar Yadav captaincy future: భారత జట్టుకు టి20 వరల్డ్ కప్ అందించిన కెప్టెన్లలో సూర్య కుమార్ యాదవ్ మూడోవాడు. ముందుగా ధోని.. ఆ తర్వాత రోహిత్ టీమ్ ఇండియాకు టి20 వరల్డ్ కప్ లు అందించారు. సూర్య కుమార్ యాదవ్ ఇటీవలి టి20 ప్రపంచ కప్ లో టీమిండియాను విజేతగా నిలపడంలో ముఖ్యపాత్ర పోషించాడు. ఆటగాడిగా తన ముద్ర బలంగా వేసుకోలేకపోయినప్పటికీ.. జట్టును మాత్రం సమర్థవంతంగా నడిపించాడు.

ఆటగాడిగా అతడు విఫలమవుతున్న నేపథ్యంలో టి20 జట్టు సారథి బాధ్యతల నుంచి అతడిని తప్పిస్తారని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆ బాధ్యతను అయ్యర్ కు అప్పగిస్తారని ప్రచారం కూడా జరుగుతుంది. అయ్యర్ తో పాటు తిలక్ వర్మ, సంజు శాంసన్ రేసులో ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. సూర్య కుమార్ యాదవ్ ను పక్కన పెట్టే విషయంలో ఇంతవరకు మేనేజ్మెంట్ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. కాకపోతే మీడియాలో ఈ తరహా వార్తలు వస్తున్న నేపథ్యంలో అది నిజమే కావచ్చని అందరూ అనుకుంటున్నారు.

సూర్య కుమార్ యాదవ్ ను కెప్టెన్ స్థానం నుంచి తప్పించే విషయంలో మాజీ కోచ్ ఎంఎస్కే ప్రసాదు కీలక వ్యాఖ్యలు చేశారు..”ఇంగ్లాండ్ పర్యటనకు ముందుగా ప్రధాన జట్టును పంపిస్తారా.. లేకుంటే రెండవ స్థాయి జట్టను పంపిస్తారా అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఒకవేళ అత్యుత్తమమైన బృందాన్ని పంపిస్తే.. సూర్య కుమార్ యాదవ్ దానికి సారధ్యం వహించాల్సి ఉంటుంది. ఆ బాధ్యత నుంచి అతడిని తప్పిస్తే పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. ఒకవేళ కొత్త సారధిని సిద్ధం చేసుకోవాలి అనుకుంటే.. ముందు సూర్య కుమార్ యాదవ్ ను ఉప నాయకుడిగా నియమించుకోండి. ఆ తర్వాత మిగతా కథను పూర్తి చేయండి. టి20 ప్రపంచ కప్ సాధించేవరకు అక్షర్ పటేల్ రెండవ నాయకుడిగా ఉండేవాడు. ఇప్పుడు నాయకుడి బాధ్యతలను స్వీకరించడానికి చాలామంది ప్లేయర్లు రంగంలో ఉన్నట్టు తెలుస్తోంది. సూర్య అద్భుతమైన ఆటగాడు. కాకపోతే కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నాడు. కొత్త కుర్రాళ్ళు కూడా అవకాశాల కోసం తాపత్రయపడుతున్నారు. అలాంటప్పుడు సూర్యను నాయకుడి స్థానం నుంచి తప్పించడం ఏమాత్రం కరెక్ట్ కాదు. అతడికి కొన్ని అవకాశాలిస్తే.. నిరూపించుకుంటాడు. అప్పటికి అతడు నిలబడకపోతే పక్కన పెట్టడం బెటర్ అని” ప్రసాద్ వ్యాఖ్యానించాడు.

ఇక ప్రస్తుతం ఐపీఎల్ ముగిసింది. ఈ ఐపీఎల్లో ఈసారి చాలామంది ప్లేయర్లు తమ ప్రతిభను నిరూపించుకున్నారు. తిలక్ వర్మ.. పాటిదర్.. అయ్యర్.. కిషన్.. సంజు వంటి ప్లేయర్లు సత్తా చూపించారు. వారికి చెట్లను నడిపిన అనుభవం కూడా ఉంది. అందువల్ల ఇంగ్లాండ్ పర్యటనకు యంగ్ ప్లేయర్లకు అవకాశాలు ఇస్తే ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా సూర్య వంశీ వంటి ఆటగాడిని రంగంలోకి తీసుకొస్తే అప్పుడు ఫలితాలు వేరే విధంగా ఉంటాయి. ఐర్లాండ్.. ఇంగ్లాండ్ టూర్లలో టీమిండియా ఇదే తరహాలో దూకుడు కొనసాగిస్తే మాత్రం వెనకడుగు వేసే ప్రసక్తి ఉండదు. కాకపోతే మేనేజ్మెంట్ ఏ తరహాలో ఆలోచిస్తుందో అర్థం కావడం లేదు.

ఐటీ కంపెనీలు విప్రోను చూసి నేర్చుకోవాలి

Wipro success story 2026
Wipro success story 2026

Wipro success story 2026: ఐటీ కంపెనీలు కార్పొరేట్ వాతావరణాన్ని ప్రతిబింబిస్తాయి. వర్క్ కల్చర్, ఉద్యోగుల వేషధారణ, వారి మాటతీరు ప్రతీది కూడా మనల్ని మరోదేశంలోకి తీసుకెళ్తుంది. అందుకే ఐటీ కంపెనీలు ఉద్యోగులకు తగ్గట్టుగా పని వాతావరణాన్ని కల్పిస్తూ ఉంటాయి. ఆహ్లాదానికి పార్కులు, తినడానికి క్యాంటిన్లు, సేద తీరడానికి ఓపెన్ ఏరియాలు.. అలా అనేకం ఉంటాయి.

ప్రశాంతతకు, కోట్ల రూపాయల ప్రాజెక్టులకు కేంద్రాలైన ఐటీ కంపెనీలు దారుణ మైన కార్యకలాపాలకు కేంద్రాలుగా మారిపోతున్నాయి.. ఇటీవల టిసిఎస్ కంపెనీలో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఉద్యోగుల భద్రత.. ఇతర అంశాలపై ఆందోళనకు కారణమైంది. ఇది రాజకీయ దుమారానికి కూడా కారణమైంది. దీనిపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు.

టిసిఎస్ కంపెనీలో జరిగిన ఘటనను మర్చిపోకముందే విప్రోలు ఓ మాజీ మహిళా ఉద్యోగి చేసిన ఆరోపణలు సంచలనం కలిగించాయి. తాను పని చేస్తున్న కార్యాలయంలో రకరకాల వేధింపులు ఎదురయ్యాయని.. ఆ మహిళ వాపోయింది. పూణేలో ఆ మహిళ పనిచేస్తున్న సమయంలో కొంతమంది మానసిక ఒత్తిడికి గురి చేశారు. మతం మారే విషయంలో ఇబ్బందులు పెట్టారు. దీంతో ఆమె హింజ వాడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. సంస్థలో వేధింపులు.. పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆమె మానవ హక్కుల కమిషన్ వద్దకు వెళ్లారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో.. విప్రో కంపెనీ స్పందించింది.

ఆ మహిళ చెప్పినట్టుగా కొంతమంది సీనియర్ మేనేజర్లు.. టీం లీడర్లు బలవంతం చేస్తే.. కఠిన చర్యలు ఉంటాయని విప్రో కంపెనీ స్పష్టం చేసింది. ఉద్యోగుల సంక్షేమం విషయంలో.. గౌరవం విషయంలో.. స్వేచ్ఛ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గే అవకాశం లేదని స్పష్టం చేసింది. ఉద్యోగులకు సురక్షితంగా పని పరిస్థితులు కల్పిస్తామని.. వారితో నిబద్ధతను కలిగి ఉంటామని విప్రో కంపెనీ స్పష్టం చేసింది. అంతేకాదు ఈ కేసు వ్యవహారంలో పోలీసులు అడిగిన పత్రాలు మొత్తం ఇచ్చామని.. ఇటువంటి వ్యవహారాలలో ఉపేక్షకు తావు లేకుండా వ్యవహరిస్తామని విప్రో కంపెనీ ప్రకటించింది.

గ్రాండ్ గా మొదలైన నాగ చైతన్య 'దూత 2' వెబ్ సిరీస్.. ఈసారి ప్లానింగ్ మామూలుగా లేదు..

Naga Chaitanya Dhootha 2 web series
Naga Chaitanya Dhootha 2 web series

Naga Chaitanya Dhootha 2 web series: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న అక్కినేని నాగ చైతన్య కి మంచి బ్రేక్ ఇచ్చిన సిరీస్ ‘దూత’. థాంక్యూ , కస్టడీ వంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ తో , ఇక నాగ చైతన్య కెరీర్ ఏంటో అని కంగారు పడుతున్న అక్కినేని ఫ్యాన్స్ కి , ఈ వెబ్ సిరీస్ సక్సెస్ ఇచ్చిన జోష్ మామూలుది కాదు. సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ , అమెజాన్ ప్రైమ్ వీడియో లో అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకున్న సిరీస్ గా నిల్చింది. సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న నిర్మాత శరత్ మరార్ కి కూడా ఈ సిరీస్ ఇచ్చిన సక్సెస్ జోష్ మామూలుది కాదు. ‘మనం’ తర్వాత డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ కి కూడా ఈ సిరీస్ ద్వారా మంచి బ్రేక్ దొరికింది.

అయితే ఈ సిరీస్ కి కొనసాగింపుగా ‘దూత 2’ కూడా ఉంటుంది అని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. నేడు ఈ సీక్వెల్ కి సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో జరిగాయి. ఈ కార్యక్రమానికి నాగ చైతన్య తండ్రి అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేసి, ముహూర్తపు షాట్ కి క్లాప్ కొట్టాడు. అనంతరం చిత్ర బృందానికి ఆయన శుభాకాంక్షలు కూడా తెలియజేశాడు. ఈ నెలాఖరు నుండి ఈ సిరీస్ కి సంబంధించిన షూటింగ్ మొదలు అవుతుందని, మొదటి సీజన్ లో కనిపించిన నటీనటులతో పాటు, మరికొంతమంది కొత్త నటీనటులు కూడా ఈ సిరీస్ లో కనిపించబోతున్నారని, ఈసారి హారర్ థ్రిల్లింగ్ అంశాలు మొదటి భాగాన్ని మించి ఉంటాయని అంటున్నారు. చూడాలి మరి రెండవ సీజన్ కి కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుందా లేదా అనేది. ఇకపోతే నాగ చైతన్య ప్రస్తుతం ‘వృషకర్మ’ అనే చిత్రం చేస్తున్నాడు .

మిస్టిక్ హారర్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియో ని విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మీనాక్షి చౌదరి ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం , ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ‘తండేల్ ‘ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకొని ఫామ్ లోకి వచ్చిన నాగ చైతన్య , ‘దూత 2’, ‘వృషకర్మ’ చిత్రాలతో అభిమానులను ఆడియన్స్ ని ఏ మేరకు అలరిస్తాడో చూడాలి.

ఓ మహిళ 23 ఏళ్ల పోరాటం.. 85 కోట్ల పరిహారం..ఈమె విడాకుల కథ సినిమాను మించి..

Varsha Gohil divorce case
Varsha Gohil divorce case

Varsha Gohil divorce case: ఏ భార్య కూడా తన భర్త మరో సంబంధం పెట్టుకుంటే తట్టుకోలేదు. గోల పెడుతుంది. భర్తను నిలదీస్తుంది. అవసరమైతే ఘర్షణకు దిగుతుంది. ఎందుకంటే భార్యలకు భర్తలంటే విపరీతమైన ప్రేమ ఉంటుంది. వారి మీద సర్వహక్కలూ వారికే ఉంటాయి. అటువంటిది ఓ మహిళ భర్త దారి తప్పాడు. మరోసంబందం పెట్టుకున్నాడు. ఆమెకు ఈ విషయం తెలసింది. అరిచింది, గోల పెట్టింది.. చివరికి కోర్టు మెట్లు ఎక్కింది.

ఆమె పేరు వర్షా గోహిల్ లండన్ లో స్థిర పడిన భారతీయురాలు. ఈమెకు గతంలోనే వివాహం జరిగింది. ఈమె భర్త పేరు భద్రేశ్ గోహిల్. భద్రేశ్ వర్ష ఉండగానే మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. 2002లో అతడి నుంచి విడాకులు కావాలని వర్ష కోర్టు మెట్లు ఎక్కారు. ఆమె విడాకుల కేసు కోర్టు లో వేసే నాటికి ముగ్గురు సంతానాన్ని ఆమె కలిగి ఉన్నారు. ముందు ఆమె రూ.3.5 కోట్ల భరణానికి ఒప్పుకున్నారు.

భర్త తన ఆస్తిపాస్తుల విషయం ఆమెకు చెప్పేవాడు కాదు. ఎందుకో వర్షకు అనుమానం వచ్చింది. ఈనేపథ్యంలో ఆమె భర్తకు నైజీరియా మాజీ గవర్నర్ జేమ్స్ జుటోరీతో సంబంధాలున్నాయని వార్తలు మీడియాలో వచ్చాయి. వాటిని వర్ష ధ్రువీకరించుకుంది. ఆయన పై ఆర్థిక నేరాలకు సంబంధించిన విచారణ కూడా జరుగుతోందని ఆమె తెలుసుకుంది. అంతేకాదు భ్రజేశ్ కు సంబంధించిన ఆస్తులను అధికారులు జప్తు చేస్తున్నట్టు ఆమె తెలుసుకుంది.

ఈనేపథ్యంలో వర్ష తన భరణం కేసును మళ్లీ పరిశీలించాలని కోర్టకు విన్నవించింది. తన భర్తకు భారీగా ఆస్తులున్నాయని.. వాటి నుంచి తనకు మరింత సొమ్ము కావాలని ఆమె న్యాయస్థానానికి విన్నవించింది. అతడు సంపాదించింది మొత్తం అక్రమ సంపాదన కాదని, అందులో కష్టపడింది కూడా ఉందని వర్ష కోర్టుకు విన్నవించింది. ఆమె వాదనతో ఏకిభవించిన కోర్టు జప్తు చేసిన ఆస్తుల్లో దాదాపు 66 లక్షల పౌండ్లను వర్షకు చెల్లించాలని బ్రిటన్ కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పు బ్రిటన్ దేశంలో సంచలనం కలిగించింది. కోర్టు కేసును మళ్లీ పరిశీలించి.. భరణం మంజూరు చేయించడం ఇంతవరకూ ఆ ధేశ న్యాయ చరిత్రలో జరగలేదని అక్కడి మీడియాలో వార్తలు వస్తున్నాయి.

జాన్వీ కపూర్ ని ఏకిపారేస్తున్న నెటిజెన్స్.. బుచ్చి బాబు కనిపిస్తే కొట్టేలా ఉన్నారుగా..

Janhvi Kapoor trolled by netizens
Janhvi Kapoor trolled by netizens

Janhvi Kapoor trolled by netizens: మహానటి శ్రీదేవి కూతురిగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ కి , అక్కడ వరుసగా పరాజయాలు ఎదురు అయ్యాయి. కానీ ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది , అద్భుతంగా నటిస్తోంది , డ్యాన్స్ కూడా అదరగొట్టేస్తుంది , మంచి భవిష్యత్తు ఉంది , తల్లి లాగానే ఈమె కూడా పెద్ద స్టార్ అవుతుందని అనుకున్నారు. కానీ వరుస ఫ్లాప్స్ రావడం తో ఆమె కెరీర్ ఒక్కసారిగా డైలమా లో పడింది. కానీ బాలీవుడ్ లో ఆమెకు కలిసిరాలేదు కానీ , టాలీవుడ్ మాత్రం బాగా కలిసొచ్చింది. ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం ద్వారా ఆమె మన టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయమైంది. ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా తర్వాత ఆమె వెంటనే ఒప్పుకున్న చిత్రం ‘పెద్ది’.

నిన్ననే థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రానికి కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. లాంగ్ రన్ లో ఈ చిత్రం 400 కోట్లు రాబడుతుందా?, లేకపోతే 600 కోట్లు రాబడుతుందా అనే దానిపైనే ట్రేడ్ లో ప్రస్తుతం చర్చ నడుస్తోంది. అలా తెలుగు లో ఈమె నటించిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వడం ఆమె అదృష్టమే. కానీ ఈ రెండు సినిమాల్లోనూ డైరెక్టర్స్ ఆమెని చూపించిన విధానం అత్యంత నీచం గా ఉందని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ‘దేవర’ చిత్రం లో జాన్వీ కపూర్ పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత లేదు. కేవలం అందాలను ఆరబోస్తూ, ఒక వ్యాంప్ లాగా ఆమెని చూపించాడు డైరెక్టర్ కొరటాల శివ. ‘పెద్ది’ చిత్రం లో అయితే జాన్వీ కపూర్ ని కొరటాల శివ కంటే నీచం గా చూపించాడు డైరెక్టర్ బుచ్చి బాబు. ఈ సినిమాకు అతి పెద్ద మైనస్ ఏదైనా ఉందా అంటే , అది జాన్వీ కపూర్ క్యారెక్టర్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.

థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ కి జాన్వీ కపూర్ క్యారెక్టర్ అంత చిరాకు కలిగించింది. ఆమె ముఖాన్ని తెరపై చూపించడం కంటే , ఆమె నడుము, మరియు ఇతర భాగాలను చూపించడానికే డైరెక్టర్ బుచ్చి బాబు ఎక్కువ శ్రద్ద పెట్టాడు. అందుకే జాన్వీ కపూర్, బుచ్చి బాబు లపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ కారాలు , మిరియాలు నూరుతున్నారు. జాన్వీ కపూర్ చాలా సత్తా ఉన్న నటి అని , ఆమెని మన తెలుగు డైరెక్టర్ వ్యాంప్ పాత్రలకే పరిమితం చేస్తున్నారని , ముఖ్యంగా పెద్ది చిత్రం లో ఆమెని చూపించిన విధానంపై ఆడియన్స్ చాలా ఫైర్ మీద ఉన్నారని , బుచ్చి బాబు రోడ్డు మీద కనిపిస్తే ఆడియన్స్ కొట్టేసేలా ఉన్నారని అంటున్నారు నెటిజెన్స్.

'పెద్ది' హిందీ వెర్షన్ మొదటి రోజు వసూళ్లు.. 'గేమ్ చేంజర్' లో పావు శాతం గ్రాస్ కూడా లేదుగా..

Peddi Hindi version first day collections
Peddi Hindi version first day collections

Peddi Hindi version first day collections: బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్నటువంటి టాలీవుడ్ హీరోల్లో ఒకరు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. నిన్న మొన్న వచ్చిన క్రేజ్ కాదు ఇది , తన అద్భుతమైన నటనతో మగధీర నుండే నార్త్ ఇండియన్స్ మనసులో స్థానం సంపాదించుకున్నాడు రామ్ చరణ్. ఆ తర్వాత ఆయన ప్రతీ సినిమా డబ్ అయ్యి , అక్కడి లోకల్ టీవీ చానెల్స్ లో టెలికాస్ట్ అయ్యేవి. వాటిల్లో నాయక్ , ఎవడు చిత్రాలకు సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. అప్పట్లో ఆయనకు వచ్చిన క్రేజ్ ని బాలీవుడ్ బడా నిర్మాతలు, దర్శకులు ఆయనతో ఒక్క సినిమా చేయడానికి పరితపించారు. అలాంటి సందర్భం లోనే ఆయన నుండి విడుదలైన చిత్రం ‘జంజీర్’ ఈ సినిమా ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా ఆరోజుల్లోనే 30 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత రామ్ చరణ్ బాలీవుడ్ లో మరో సినిమా చేయలేదు.

అయితే #RRR చిత్రం తో రామ్ చరణ్ మరోసారి నార్త్ ఇండియన్స్ లో బలమైన ముద్ర వేసుకున్నాడు. ఈ చిత్రం లో రామరాజు పాత్రలో ఆయన జీవించిన తీరుకి నార్త్ ఇండియన్స్ జేజేలు పలికారు. ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ నుండి భారీ అంచనాల నడుమ విడుదలైన ‘గేమ్ చేంజర్ ‘ చిత్రం నిరాశపరిచింది. అయినప్పటికీ కూడా హిందీ వెర్షన్ నుండి ఈ చిత్రం 30 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టింది. ఇక నిన్న విడుదలకైనా ‘పెద్ది’ చిత్రానికి విడుదలకు ముందు హిందీ లో అద్భుతమైన ప్రొమోషన్స్ చేశారు. ముఖ్యంగా భోపాల్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏకంగా 4 లక్షల మంది జనాలు హాజరయ్యారు. కచ్చితంగా బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ పడుతుందని అంతా అనుకున్నారు.

కానీ తీరా చూస్తే డిజాస్టర్ ఓపెనింగ్స్ వచ్చాయి. ‘ధురంధర్’ సిరీస్ నిర్మాతలు జియో స్టూడియోస్ సంస్థ నే ఈ చిత్రాన్ని హిందీ లో గ్రాండ్ గా విడుదల చేసింది. అయినప్పటికీ కేవలం 2 కోట్ల 40 లక్షల రూపాయిల నెట్ వసూళ్లను మాత్రమే రాబట్టింది ఈ చిత్రం. ‘గేమ్ చేంజర్’ చిత్రానికి మొదటి రోజు దాదాపుగా 8 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయి. అంటే ఆ చిత్రానికి వచ్చిన ఓపెనింగ్ లో ‘పెద్ది’ కి పావు శాతం కూడా రాలేదు అన్నమాట. బహుశా ‘గేమ్ చేంజర్’ ప్రభావం ‘పెద్ది’ మీద పడి ఉండొచ్చని అంటున్నారు విశ్లేషకులు. మొదటి రోజు ఓపెనింగ్ సంగతి పక్కన పెడితే , కనీసం రెండవ రోజు నుండి అయినా పికప్ అవుతుందో లేదో చూడాలి. నేడు హిందీ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ డల్ గానే ఉన్నాయి. ఇదే తరహా ట్రెండ్ కొనసాగితే మాత్రం ఈ చిత్రానికి క్లోజింగ్ లో 10 కోట్ల నెట్ వసూళ్లు కూడా రావడం కష్టమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

భారత్, రష్యా చేతులు కలిపాయి..అమెరికా ఇక రోజూ ఈనో తాగాల్సిందే

India Russia strategic partnership
India Russia strategic partnership

India Russia strategic partnership: బలవంతుడు అక్రమాలకు పాల్పడుతుంటే.. దారుణాలకు తెగిస్తుంటే .. వాటిని భరించిన వారు.. ఓపిక నశించి తిరుగుబాట చేస్తే అప్పుడు పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. ఆ తర్వాత బలవంతుడు నిలబడేందుకు చోటు ఉండదు. చరిత్ర చెప్పిందిదే. ఇప్పటి వర్తమానం కూడా అదే చెబుతోంది. అమెరికాకు వ్యతిరేకంగా భారత్, రష్యా నిలుస్తున్న తీరు, చేయి కలిపిన తీరు పై ఉపోద్ఘాతానికి బలం చేకూర్చుతున్నాయి.

భారత్, రష్యా కు చుట్టూ శత్రు దేశాలు ఎక్కువ. అందుకే వైమానిక దళాలను బలోపేతం చేసేందుకు తాపత్రయపడుతున్నాయి. ఈక్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ కు గొప్ప శుభవార్త చెప్పారు. అత్యాధునిక స్టెల్త్ సామర్థ్యమున్నసుఖోయ్ ఎస్ యూ 57 యుద్ధ విమానాలను మనదేశంలో రష్యా తీర్చిదిద్దబోతోంది. దీనికి మన సహకారం కూడా తీసుకోబోతోంది. కీలకమైన సాంకేతికతను పంచుకునేందుకు రష్యా తన సుముఖతను వ్యక్తం చేసింది.

మన దేశ వైమానిక దళంలో ఐదో తరానికి సంబంధించిన యుద్ధ విమానాలు లేవు. పాకిస్థాన్ దేశానికి చైనా షెన్ యాంగ్ జె 35 ఏఈ స్టెల్త్ ఫైటర్ విమానాన్ని ఇవ్వనుంది. ఈనేపథ్యంలోనే రష్యా భారత్ కు అపన్న హస్తం అందించింది. అంతేకాదు, రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలున్నాయని, డిఫెన్స్ రంగంలో ఎటువంటి పరిమితులు లేవని పుతిన్ పేర్కొనడం విశేషం. తద్వారా వెస్ట్రన్ కంట్రీస్ కు పుతిన్ సాలిడ్ కౌంటర్ ఇచ్చారు. పాశ్చాత్య దేశాలు సాంకేతికతను ఇచ్చేందుకు అనేక రకాల కండీషన్లు పెడుతుంటాయి.

సు 57 అనే ఫైటర్ జెట్ ను డెవలప్ చేయడానికి రష్యా గతంలో ఆఫర్ ఇచ్చింది. 2018లో దీనికి సంబంధించి చర్చలు కూడా జరిగాయి. కారణాలు తెలియవు గాని అందులో నుంచి ఇండియా పక్కకు వెళ్లింది. సు 57 యుద్ధ విమానం ద్వారా భారత్ అవసరాలు తీరవని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనిని ఐఏఎఫ్ నిర్ధారించింది. దీంతో భారత్ వెనక్కి వెళ్లకతప్పలేదు. భారత్ కూడా ఐదో తరం యుద్ద విమానాలను తయారు చేస్తోంది. వాటికి అడ్వాన్స్ డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అనే పేరు పెట్టింది. మరో నాలుగు సంవత్సరాలలో ఇది సైన్యం లో చేరే అవకాశం ఉంది.

భారత్, రష్యా మధ్య ఐదో తరం యుద్ధ విమానాల గురించి చర్చలు దాటి, తయారీ వరకు అడుగులు పడుతున్ననేపథ్యంలో అమెరికా రోజూ ఈనో తాగాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

'దేవర', 'ఓజీ' మొదటి రోజు వసూళ్లను అందుకోలేకపోయిన 'పెద్ది'.. కానీ ఇది ఆరంభం మాత్రమే..

Peddi Movie Collections
Peddi Movie Collections

Peddi first day collections: ప్రస్తుత పరిస్థితిలో నేటి తరం స్టార్ హీరోలు తమ సినిమాలకు కచ్చితంగా 100 కోట్ల గ్రాస్ వసూళ్లు మొదటి రోజే కొట్టాలి , లేదంటే యావేరేజ్ ఓపెనింగ్ గా చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మన మార్కెట్ ఆ రేంజ్ లో వృద్ధి చెందిది కాబట్టి. ఇప్పటి వరకు మన టాలీవుడ్ లో ప్రభాస్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్ మాత్రమే తమ సినిమాలతో 100 కోట్ల గ్రాస్ ఓపెనింగ్ ని కొల్లగొట్టారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఆ జాబితాలోకి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా వచ్చి చేరాడు. ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై , మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని 115 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది.

ఓవర్సీస్ ఓపెనింగ్స్ బాగా నిరాశకు గురి చేసినప్పటికీ , తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని నమోదు చేసుకుంది ఈ చిత్రం. కానీ ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా పవన్ కళ్యాణ్ ‘ఓజీ’, ఎన్టీఆర్ ‘దేవర’ ఓపెనింగ్ వసూళ్లను అందుకోవడం లో విఫలం అయ్యింది. ఎన్టీఆర్ దేవర చిత్రానికి వరల్డ్ వైడ్ గా 148 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రానికి 154 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ ‘పెద్ది’ కేవలం 115 కోట్ల వద్దనే ఆగాల్సి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం ‘దేవర’, ‘ఓజీ’ కలెక్షన్స్ ని అందుకోలేకపోయింది. దేవర చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రిటర్న్ జీఎస్టీ తో కలిపి 58 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాగా , పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రానికి రిటర్న్ జీఎస్టీ తో కలిపి 65 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

కానీ పెద్ది చిత్రానికి కేవలం 55 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రిటర్న్ జీఎస్టీ తో కలిపి వచ్చాయి. అయితే ఇది తక్కువ ఓపెనింగ్ ఏమి కాదు , చాలా బలమైన ఓపెనింగ్ అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. వరుస ఫ్లాప్స్ , సినిమా సినిమాకు భారీ గ్యాప్, ఇవన్నీ రావడం వల్ల, రామ్ చరణ్ ఓపెనింగ్స్ స్టామినా ఈమధ్య కాలం లో కాస్త తగ్గింది , అయినప్పటికీ కూడా ఈ రేంజ్ ఓపెనింగ్స్ రావడం అనేది సాధారణమైన విషయం కాదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే , మరో సూపర్ హిట్ చిత్రం పడితే మాత్రం రామ్ చరణ్ కి పూర్వ వైభవం వచ్చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చూడాలి మరి రాబోయే రోజుల్లో రామ్ చరణ్ రేంజ్ ఎలా ఉండబోతుంది అనేది.

జాన్వీ కపూర్ కి తెలుగు సినిమాలు కలిసి రావడం లేదా..? ఇలా అయితే కష్టమే..

Peddi Movie
Peddi Movie

Janhvi Kapoor Telugu movies: ఇండస్ట్రీలో చాలామంది హీరోలు పెను సంచలనాన్ని క్రియేట్ చేస్తూ భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క హీరో తెలుగు దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక హీరోయిన్స్ సైతం మన స్టార్ హీరోలతో నటించి స్టార్ స్టేటస్ ని పొందాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఒక హీరోయిన్ మాత్రం అటు జూనియర్, ఇటు ఎన్టీఆర్ రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించిన కూడా ఆమెకు అంత గుర్తింపైతే రాలేదు. ఇంతకీ ఆమె ఎవరు అంటే జాన్వీ కపూర్ కావడం విశేషం… ముఖ్యంగా ఆమె తెలుగులో దేవర సినిమాతో అరంగేట్రం చేసింది. ఇప్పుడు పెద్ది సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాల్లో కూడా ఆమె పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం ఆమె అసలు సినిమాలో ఎందుకు ఉందో ఎవరికీ అర్థం కావడం లేదట. ఆమె క్యారెక్టర్ సినిమాలో లేకపోయినా కూడా సినిమా ఫ్లోకి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ఉండేదని జనాలు సైతం తిట్టుకునే స్థాయికి ఆమె క్యారెక్టర్ వచ్చింది అంటే ఆమెను ఎందుకని అలాంటి ఒక నాసిరకం క్యారెక్టర్ కోసం సెలెక్ట్ చేసుకుంటున్నారు.

కథ విన్నప్పుడు ఆమె ఆ క్యారెక్టర్ తనకు సరిపోతుందా? లేదా అని చెక్ చేసుకొని మరి చేస్తే బాగుంటుంది కదా అని చాలామంది జాన్వీ ని విమర్శిస్తున్నారు. మొత్తానికైతే ఇక మీదట ఆమె తెలుగు సినిమాల్లో నటించడం చాలా కష్టమనే చెప్పాలి.

కారణం ఏంటంటే రెండు సినిమాలతో కూడా ఆమె ఏమాత్రం తన సత్తా చాటుకోలేకపోయినప్పుడు దర్శక నిర్మాతలు సైతం ఆమెను పక్కన పెట్టేస్తారు…పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాం జాన్వీ కపూర్ ఉంటే పాన్ ఇండియా మార్కెట్ పరంగా కొంతవరకు హెల్ప్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే దర్శక నిర్మాతలు ఆమెను తీసుకుంటున్నారు.

అంతే తప్ప ఆమెను డిఫరెంట్ క్యారెక్టర్ లో చూపించే ప్రయత్నం ఎవ్వరు చేయడం లేదు…కాబట్టి ఇకమీదట ఆమె తెలుగు సినిమాల్లో నటించే అవకాశాలు కూడా చాలా తక్కువనే చెబుతున్నారు. అసలు తెలుగు దర్శకులు సైతం ఆమెకు కథ చెప్పినప్పుడు ఒక రకంగా చెప్పి దాన్ని స్క్రీన్ మీద తీసేటప్పుడు మరొక రకంగా చేస్తున్నారని ఆమె తన సన్నిహితుల దగ్గర చెబుతుందట…

మోహన్ బాబు వల్ల నాగార్జున తో సినిమా చేసే అవకాశాన్ని కోల్పోయిన స్టార్ డైరెక్టర్...

Nageshwar Reddy Nagarjuna Movie
Nageshwar Reddy Nagarjuna Movie

Nageshwar Reddy Nagarjuna Movie: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోతో సినిమా చేయడానికి మరొక హీరోతో వచ్చిన అవకాశాన్ని కోల్పోయిన దర్శకులు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా కొంతమంది హీరోల మధ్య ఉన్న ఈగో ల వల్ల ఆ హీరోతో సినిమా చేసిన దర్శకుడు నాతో సినిమా చేయడమేంటి అంటూ సినిమాలను క్యాన్సిల్ చేసిన హీరోలు కూడా ఉన్నారు. ఇలా కొంతమంది దర్శకులు స్టార్ హీరోలతో ఆఫర్ వచ్చిన కూడా వాళ్ల ఛాన్స్ లను మిస్ చేసుకున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన నాగేశ్వర్ రెడ్డి గత 25 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్నాడు. ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన ఎలిమెంట్ ఉండడమే కాకుండా దానిని మొత్తం కామెడీతో చుట్టేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన ‘సీమాటపాకాయ్’ సినిమా మంచి విజయాన్ని సాధించింది. దాంతో నాగార్జున నుంచి ఆయనకి ఒక ఆఫర్ వచ్చిందట. నాగార్జున రాజన్న సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు రామోజీ ఫిలిం సిటీకి నాగేశ్వర్ రెడ్డి ని పిలిచి ఒక కథ చెప్పమని అడిగారట. దానికి ఆయన కొన్ని రోజుల పాటు సమయాన్ని తీసుకొని మరి కథ రెడీ చేసి పెట్టుకున్నాడు. ఇక ఈ క్రమంలోనే అతను అప్పుడే మంచు విష్ణుతో ‘దేనికైనా రెడీ’ అనే సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. స్క్రిప్ట్ డిస్కషన్ లో భాగంగా మోహన్ బాబు సిట్టింగ్ లో కూర్చోవలసి వచ్చిందట. అప్పటికే విష్ణు తో ఇలా నాగార్జునతో మీటింగ్ ఉందని కూడా చెప్పాడట. నాగార్జునకు సోమవారం రోజునా కలుస్తానని చెప్పాడట. ఇక ఆ సోమవారం రానే వచ్చింది. మోహన్ బాబుది స్క్రిప్ట్ డిస్కషన్ లో కూర్చున్న నాగేశ్వర్ రెడ్డి సోమవారం 11 గంటలకు నాగార్జున తో మీటింగ్ కి అటెండ్ అవ్వాలి. అలాంటిది అతను నాగార్జునతో చేయాల్సిన సినిమాకు సంబంధించిన పూర్తి కథ రెడీ చేసి పెట్టుకున్నారట. ఇక ఇక్కడ లేటవుతుందని గమనించిన నాగేశ్వర్ రెడ్డి నాగార్జునతో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న ప్రొడ్యూసర్ శివప్రసాద్ రెడ్డి వల్ల కొడుక్కికి ఫోన్ చేసి 11 గంటలకు నాగార్జున గారిని కలుస్తానని చెప్పాను. మూడు గంటలకు మీటింగ్ పెట్టే ప్రయత్నం చేయండి అని చెప్పారట. ఆయన నేను నాగార్జునతో మాట్లాడుతానని చెప్పాడట. ఇక తనే ఫోన్ చేసి ఈరోజు మీటింగ్ కుదరదు.

రేపు మాట్లాడదాం అన్నారు అని చెప్పడంతో ఆయన కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు. ఇక నెక్స్ట్ డే అన్నపూర్ణ స్టూడియోస్ కి నాగేశ్వర్ రెడ్డి వెళ్లారట. సినిమా షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో అప్పుడే ఆ సినిమా షాట్ గ్యాప్ లో నాగార్జున వచ్చి నాగేశ్వర్ రెడ్డిని కలిశారట. రోజు నాకు 10 మంది కథలు చెప్పడానికి వస్తారు. అలాంటిది నేను నిన్ను పిలిచి కథ చెప్పమంటే 11 గంటలకు వస్తానని చెప్పావు. అలాంటిది నేను అన్నపూర్ణ స్టూడియోలోకి వచ్చి 11 నుంచి 2 గంటల వరకు నీకోసం వెయిట్ చేస్తూనే ఉన్నాను.

అయిన కూడా నువ్వు నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇక్కడ వెయిట్ చేయించావని చెప్పారట. మొత్తానికైతే అప్పుడే మోహన్ బాబు నాగార్జునకి ఫోన్ చేసి నాగేశ్వర్ రెడ్డి తో నాకు డిస్కషన్ ఉందని చెప్పారట. నాగార్జున సైతం మోహన్ బాబు తో నీకు డిస్కషన్ ఉందంట కదా అని నాగేశ్వర్ రెడ్డి ని అడిగాడట. దాంతో నాగేశ్వర్ రెడ్డి అవును సార్ అక్కడి నుంచే వస్తున్నానని చెప్పారట.

ముందు మోహన్ బాబు సినిమా సంగతి అయితే చూడు ఆయన మామూలోడు కాదు కోపానికి వస్తాడు. ఆయన సినిమా తర్వాత మనం చేద్దామని చెప్పాడట. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు నాగేశ్వర్ రెడ్డి చాలాసార్లు కథ చెప్పాలనే ప్రయత్నం చేసిన కూడా నాగార్జున వినడానికి ఇంట్రెస్ట్ చూపించలేదట. ఇలా మోహన్ బాబు సినిమా చేయడం వల్ల తనకు నాగార్జునతో సినిమా చేసే అవకాశం పోయింది అంటూ నాగేశ్వర్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం…

పెద్ది మూవీ ని వదిలేసి మంచి పని చేసిన యూట్యూబ్ స్టార్ హీరో..

Bandi Saroj Kumar rejected Peddi movie
Bandi Saroj Kumar rejected Peddi movie

Bandi Saroj Kumar rejected Peddi movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. మన స్టార్ హీరోలందరు భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళుతూ ఉండడం విశేషం… ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన రాని గుర్తింపు ఇప్పుడు చేస్తున్న పాన్ ఇండియా సినిమాలతో తెచ్చుకుంటున్నారు. మన స్టార్ హీరోలు ఈ మధ్య కాలంలో చేస్తున్న సినిమాలతో పెను ప్రభంజనాలను సృష్టిస్తున్నారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ సైతం పెద్ది సినిమాతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు. ఇక ఈ సినిమాలో దివ్యేందు శర్మ పోషించిన క్యారెక్టర్ కోసం మొదట బుచ్చిబాబు బండి సరోజ్ కుమార్ ని అనుకున్నారట. కానీ ఆయనకి ఆ క్యారెక్టర్ నచ్చకపోవడంతో తను ఆ పాత్ర ను రిజెక్ట్ చేశాడు.

మొత్తానికైతే బండి సరోజ్ కుమార్ ఆ క్యారెక్టర్ రిజెక్ట్ చేసిందే మంచిదైందని సినిమాను చూసిన చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ లో పెద్దగా వేరియేషన్స్ ఏమీ లేవు.మధ్యలో కొద్ది సేపు ఆ క్యారెక్టర్ వచ్చి వెళ్తుంది. అసలు ఆ పాత్ర కి ఎండింగ్ కూడా సరిగ్గా ఇవ్వలేదు. అందుకని అలాంటి క్యారెక్టర్ లో బండి సరోజ్ నటించిన కూడా అతనికి పెద్దగా గుర్తింపు వచ్చే ఉండకపోయేదని పలువురు సినిమా మేధావులు సైతం చెబుతున్నారు…

ఇక ఇలాంటి క్రమంలోనే తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలుగుతున్న మన స్టార్ హీరోలకు పోటీగా బండి సరోజ్ కుమార్ యూట్యూబ్ లో తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ఆయనకంటూ ఒక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు.

ఇక ఇలాంటి నాసిరకం క్యారెక్టర్లు చేయడం వల్ల అతని ఇమేజ్ డ్యామేజ్ అయిపోవడం తప్ప ఇంకేమి ఉండదనే ఉద్దేశ్యంతోనే అతను ఆ క్యారెక్టర్ని రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది…మొత్తానికైతే పెద్ది మూవీ కి ప్రేక్షకుల నుంచి డివైడ్ టాక్ రావడం ప్రతి ఒక్క మెగా అభిమానని తీవ్రంగా కలిచి వేస్తుందనే చెప్పాలి…

'పెద్ది' లో రజినీకాంత్ వదులుకున్న పాత్ర అదేనా.. చేసి ఉంటే వేరే లెవెల్ ఉండేది..

Rajinikanth rejected role in Peddi
Rajinikanth rejected role in Peddi

Rajinikanth rejected role in Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నట విశ్వరూపానికి నిదర్శనం లాగా నిల్చిన చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా ఆరంభం నుండి ఎండింగ్ వరకు ఆయన భుజాల మీదనే నడిచింది. రామ్ చరణ్ వెండితెర పై కనిపించినంతసేపు మరో ఆర్టిస్ట్ ఆయన ముందు షైన్ అవ్వలేకపోయాడు. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు , రామ్ చరణ్ ఏ రేంజ్ లో నటించాడు అనేది. ఈ చిత్రం లో జగపతి బాబు , దివ్యేన్దు శర్మ, శివరాజ్ కుమార్ వంటి టాప్ ఆర్టిస్టులు ఉన్నారు, అదే విధంగా కమెడియన్ సత్య , రావు రమేష్ వంటి వారు కూడా ఉన్నారు. అయినప్పటికీ కథ మొత్తం రామ్ చరణ్ చుట్టూనే తిరిగింది. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ తర్వాత అత్యధిక స్క్రీన్ స్పేస్ ని షేర్ చేసుకున్న నటుడు ఎవరైనా ఉన్నారా అంటే , అది శివరాజ్ కుమార్ మాత్రమే.

కన్నడ లో సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలిగిన ఆయన , ఈ చిత్రం లో రామ్ చరణ్ మీద అభిమానంతో అడగగానే నటించాడు. గౌర్ నాయుడు పాత్రలో, రామ్ చరణ్ కి గురువుగా ఆయన నటించిన తీరు అద్భుతం. అయితే ఈ పాత్ర కోసం ముందుగా అనేక మంది సూపర్ స్టార్స్ ని సంప్రదించాలని అనుకున్నాడట డైరెక్టర్ బుచ్చి బాబు. విడుదలకు ముందు ఇంటర్వ్యూస్ లో ఆ పాత్ర కోసం డైరెక్ట్ గా శివ రాజ్ కుమార్ ని మాత్రమే సంప్రదించినట్టుగా చెప్పుకొచ్చాడు కానీ , వాస్తవం మాత్రం అది కాదని ఫిలిం నగర్ లో వినిపిస్తున్న మాట. ముందుగా తమిళ హీరో విజయ్ సేతుపతి ని సంప్రదించాడట డైరెక్టర్ బుచ్చి బాబు. ఆయన నాకు ఈ పాత్ర సరిపోదని రిజెక్ట్ చేసాడు. స్వయంగా ఈ విషయాన్ని విజయ్ సేతుపతి ఒక ఇంటర్వ్యూ లో కూడా చెప్పుకొచ్చాడు.

అదే విధంగా సూపర్ స్టార్ రజినీకాంత్ ని కలిసి , ఈ కథని వినిపించి , గౌర్ నాయుడు పాత్ర చేయించే ప్రయత్నం కూడా చేశాడట బుచ్చి బాబు. రజినీకాంత్ కి ఇలాంటి క్యారెక్టర్ రోల్స్ చేయడం కొత్తేమి కాదు. కెరీర్ లో ఎన్నో స్పెషల్ రోల్స్ ఇతర హీరోల సినిమాల్లో ఆయన చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ పాత్ర చెప్పినప్పుడు రజినీకాంత్ కి చాలా బాగా నచ్చిందట , కానీ కొన్ని మార్పులు సూచించాడట , ఆ మార్పులు బుచ్చి బాబు చేసినప్పటికీ కూడా రజిని సంతృప్తి చెందలేదట. ఆ కారణం చేత ఈ చిత్రంలో రజినీకాంత్ నటించే ఛాన్స్ పోయింది. ఒకవేళ రజినీకాంత్ చేసుంటే , ఈ సినిమా రేంజ్ ఇంకా ఎలా ఉండేదో ఊహించుకోండి , తమిళనాడు లో రికార్డ్స్ క్రియేట్ అయ్యేవి , బ్యాడ్ లక్ అనుకోవచ్చు.

'పెద్ది' థియేటర్ లో అభిమాని పై చిరాకుపడ్డ ఉపాసన.. సంచలనం రేపుతున్న వీడియో..

Upasana angry at fan in Peddi theatre
Upasana angry at fan in Peddi theatre

Upasana angry at fan in Peddi theatre: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఓపెనింగ్స్ కూడా సెన్సేషనల్ రేంజ్ లోనే వచ్చాయి. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి మొదటి రోజు 115 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది సాధారణమైన విషయం కాదు. గతం లో ఏ రామ్ చరణ్ సినిమాకు కూడా ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు నమోదు అవ్వలేదు , ఒక్క #RRR చిత్రాన్ని మినహాయిస్తే. ఒకప్పుడు ఓపెనింగ్స్ లో పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ తరహా రేంజ్ హీరో అయినటువంటి రామ్ చరణ్, చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత కాస్త డౌన్ అయ్యాడు. మళ్లీ ఇన్నాళ్లకు రామ్ చరణ్ కి ఓపెనింగ్స్ పరంగా పూర్వ వైభవం దక్కింది.

ఇకపోతే అభిమానులు కూడా ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇదంతా పక్కన పెడితే రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల నిన్న అభిమానులతో కలిసి హైదరాబాద్ లోని శ్రీరాములు థియేటర్ లో ఈ చిత్రాన్ని వీక్షించింది. అభిమానులతో కలిసి ఆమె ఈలలు కొడుతూ, పేపర్స్ ఎగురవేస్తూ ఎంజాయ్ చేయడం చాలా కొత్తగా అనిపించింది. అయితే ఒక సందర్భం లో ఆమె అభిమానులపై కోపం తెచ్చుకొని అరవడం గమనార్హం. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది. అభిమానులు ఎవరైనా ఉపాసన తో తప్పుగా ప్రవర్తించారో , లేదంటే ఆమెకు కోపం కలిగించే పని ఏదైనా చేశారో తెలియదు కానీ , ఆమెలోని ఫైర్ ని చూసి సోషల్ మీడియా లో ఫ్యాన్స్ షాక్ కి గురయ్యారు.

ఉపాసన లో ఇలాంటి యాంగిల్ ని ఇప్పటి వరకు చూడలేదని , ఆమెకు కోపం తెప్పించిన ఆ సందర్భం ఏంటో అర్థం కావడం లేదని సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక పెద్ది రెండవ రోజు ట్రెండ్ విషయానికి వస్తే , మార్నింగ్ షోస్ నుండే రామ్ చరణ్ శివ తాండవం ఆడడం మొదలు పెట్టేశాడు . బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 25 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. చిన్న సెంటర్స్ నుండి పెద్ద సెంటర్స్ వరకు , అన్ని చోట్ల అద్భుతమైన హోల్డ్ ని కనబరుస్తూ , బ్లాక్ బస్టర్ లాంగ్ రన్ ని సూచిస్తోంది ఈ చిత్రం. రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.

రాహుల్ గాంధీ గ్రేట్ నికోబార్ ఎందుకు వెళ్లారు..సముద్రంలోకి ఎందుకు దూకారు..కోటిన్నర చెట్ల కథేంటి..

Rahul Gandhi Great Nicobar visit
Rahul Gandhi Great Nicobar visit

Rahul Gandhi Great Nicobar visit: నేడు పర్యావరణ దినోత్సవం. ధరిత్రిని కాపాడాలని.. పర్యావరణ పరిరక్షణకు పాటుపాడాలని ప్రతి ఒక్కరూ ప్రతీన బూనుతున్నారు. పర్యావరణాన్ని కాపాడతామని చెబుతున్నారు. ఇదే సమయంలో దేశ ప్రతిపక్షనాయకుడు రాహుల్ గాంధీ ఒక వీడియోను విడుదల చేశారు.అంతేకాదు, సంచలన విషయాలను బయట పెట్టారు.

రాహుల్ గాంధీ ఉన్నట్టుండి గ్రేట్ నికోబార్ వెళ్లారు. ఆయన వెంట కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఆ వీడియోలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యారవణ విధ్వంసాన్ని రాహుల్ గాంధీ వివరించారు. సముద్రంలోకి వెళ్లి అక్కడి మత్స్య సంపదను చూశారు. చూడటం మాత్రమే కాదు, దేశ ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించారు.

నరేంద్రమోడీ ఓ వ్యాపారవేత్త కోసం పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. గ్రేట్ నికోబార్ ప్రాంతంలో ఓ వ్యాపారవేత్త హోటళ్లు,కాసినోలు నిర్మిస్తున్నారని, దీనికోసం కోటిన్నర చెట్లను తొలగిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. కానీ ఆ వ్యాపారవేత్త పేరు చెప్పకుండా రాహుల్ గాంధీ మార్మికతను ప్రదర్శించారు. అయితే ఇదంతా గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు రక్షణ అవసరాల కోసమని మోడీ చెబుతున్నారని.. అది నిజం కాదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఐఎన్ఎస్ భజరంగ్ కోసం ఇదంతా చేస్తే మాత్రం తాము పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

గ్రేట్ నికోబార్ అనేది అందమైన సముద్రప్రాంతం. ఇక్కడి తీరం అత్యంత విస్తారమైనది. అరుదైన జంతువులు ఇక్కడ అనేకం ఉంటాయి. సముద్ర జంతువులు, శైవలాలు,నాచు, చెట్లు విస్తారంగా ఉంటాయి. మాంగ్రూవ్ చెట్లు ఇక్కడి తీరాన్ని కాపాడుతూ ఉంటాయి. దేశ రక్షణ కోసం ఐఎన్ఎస్ భజరంగ్ ను కేంద్రం ఇక్కడి నిర్మిస్తున్నామని చెబుతోంది. దీనిపై రాహుల్ గాంధీ వాదన మరో విధంగా ఉంది. రాహుల్ గాంధీ కీలకమైన వీడియో విడుదల చేసిన నేపథ్యంలో బీజేపీ ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి. ఒకవేళ బీజేపీ గనుక వివరణ ఇస్తే అప్పుడు ఈ వ్యవహారం మరింత రంజుగా మారుతుంది.

ఎమ్మెల్యేలే కాదు.. ఎంపీలు కూడా.. మమత కు బంగ్లాదేశే దిక్కు

Mamata Banerjee
Mamata Banerjee

Mamata Banerjee: మనలో ఎవరికైనా ఊహించని కష్టం ఎదురైతే.. భర్తీ చేయలేని నష్టం ఎదురైతే.. ఇక వాడి బతుకు అస్సామే అంటాం. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరిస్థితి కూడా ఇలానే ఉంది. అక్కడ ఎప్పుడైతే బిజెపి అధికారంలోకి వచ్చిందో.. వరుసగా పరిణామాలు మారిపోతున్నాయి. దేశ భద్రత విషయంలో.. అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశ్ దేశస్థుల విషయంలో.. సరిహద్దుల విషయంలో.. అవినీతి అక్రమాలపై విచారణ సాగిస్తున్న విషయంలో స్పష్టంగా మార్పులు కనిపిస్తున్నాయి. అందువల్లే మమతా బెనర్జీకి శంకరగిరి మాన్యాలు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ లో సంక్షోభం తారస్థాయికి చేరింది. ఎమ్మెల్యేలు మొత్తం తిరుగుబాటు జెండా ప్రదర్శిస్తున్నారు. ఏకంగా 58 మంది ఎమ్మెల్యేలు వేరే దారి చూసుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా ఎంపీలు కూడా అదే దారిలో ప్రయాణం సాగిస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు 20 మంది ఎంపీలు బిజెపిలోకి వెళ్తామని సంకేతాలు ఇస్తున్నారు. హై లెవెల్ చర్చలు కూడా సాగుతున్నట్టు సమాచారం.

ఒకవేళ ఆ ఎంపీలు కనుక బిజెపిలోకి వెళ్ళిపోతే మమతా బెనర్జీకి చుక్కలు కనిపించడం ఖాయం. మమతా పార్టీకి పార్లమెంట్లో 28 మంది ఎంపీల బలం ఉంది. రాజ్యసభలో 13 మంది ఎంపీలు ఉన్నారు. మమతా బెనర్జీ బెంగాల్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఆర్జీకర్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థిని పై దారుణం జరిగింది. నాడు ఈ ఘటనపై మమత వ్యవహరించిన తీరు ఆమె ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది. నాడు మమత వ్యవహార శైలిని తప్పు పట్టిన వారు ఇటీవల సువెందు అధికారి నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు. వారంతా కూడా తమ బాధను చెప్పుకున్నారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే మమతా బెనర్జీ పార్టీలో చిలిక ఖాయం అన్నట్టుగా తెలుస్తోంది.

ఇప్పటికే మమత పార్టీ ప్రతిపక్ష నేత పదవిని కోల్పోయింది. రెబల్ నాయకుడు రుత వ్రత బెనర్జీ 58 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష నాయకుడి బాధ్యతను స్వీకరించారు. దీనికి తోడు కోల్కతా మేయర్ పదవికి పర్హద్ హకీం రాజీనామా చేశాడు. అంతేకాదు బెంగాల్ ముఖ్యమంత్రితో సంప్రదింపులు జరిపిన తర్వాతే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు హాకీమ్ వెల్లడించాడు. అంతేకాదు ఈ విషయాన్ని అతడు మమతతో కూడా చెప్పాడు.

విధాన నగర్ కార్పొరేషన్ కు అక్కడి మేయర్ కృష్ణ చక్రవర్తి కూడా రాజీనామా చేశారు. ఆమె కూడా మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితురాలు. కృష్ణ చక్రవర్తి దాదాపు 16 సంవత్సరాలుగా ఈ పదవిలోనే ఉన్నారు. తాను సాధారణ కౌన్సిలర్ గా ఉంటున్నానని.. తన రాజీనామా విషయంలో ఎవరివతుడు లేదని కృష్ణ చక్రవర్తి ఈ సందర్భంగా వెల్లడించడం విశేషం. ఇలా పార్టీ మొత్తం ముక్కలు అవుతున్న నేపథ్యంలో మమతకు బంగ్లాదేశే దిక్కని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సక్రమంగా పరిపాలన సాగించి ఉంటే మమతా బెనర్జీకి ఈ కష్టం వచ్చేది కాదని వారు చెబుతున్నారు.

షర్మిల రాజ్యసభ సభ్యురాలు కాకుండా అడ్డుకున్నదెవరు.. ఏం జరిగింది

Sharmila Rajya Sabha
Sharmila Rajya Sabha

Sharmila Rajya Sabha: మొన్నటి వరకు కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యురాలిగా షర్మిల ఎన్నిక అవుతారని.. ఆమె ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున కర్గే ను తన భర్త అనిల్ తో కలిసినప్పుడు అందరూ ఇదే అనుకున్నారు. పైగా రాహుల్ గాంధీ ఆశీస్సులు కూడా ఆమెకు ఉన్నాయని.. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె కావడంతో ఆమెకు అన్ని విధాలుగా మంచి జరుగుతుందని అందరూ భావించారు. షర్మిల కూడా ఇదేవిధంగా సంకేతాలు ఇచ్చారు. కానీ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఆమె పేరు కనిపించలేదు.

మొత్తం ఏడుగురు సభ్యులతో జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. కర్ణాటక నుంచి మల్లికార్జున కర్గే, పవన్ కేరా, మన్సూర్ అలీఖాన్ ను అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. మీనాక్షి నటరాజన్ కు మధ్యప్రదేశ్ నుంచి.. నీరజ్ డాంగ్లి ని రాజస్థాన్ నుంచి.. ప్రణవ్ ఝా జార్ఖండ్ నుంచి అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఇప్పటికే రాజ్యసభలో ఆ పార్టీకి సభా పక్ష నేతగా ఉన్నారు. ఎంపీగా ఆయన పదవీకాలం కూడా ముగింపు దశలో ఉంది. అందువల్లే పార్టీ మరొకసారి ఆయనకు అవకాశం కల్పించింది. తమిళనాడు రాష్ట్రంలో అన్నా డీఎంకే ఎంపీ రాజీనామాతో ఆస్థానం ఖాళీ అయింది. దీంతో ఆస్థానాన్ని టీవీకే పార్టీ అధినేత విజయ్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ స్థానం నుంచి ప్రవీణ్ చక్రవర్తి రంగంలో నిలిచారు.

ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కొనసాగుతున్న షర్మిలకు కర్ణాటక నుంచి అభ్యర్థిగా అవకాశం లభిస్తుందని వార్తలు వినిపించాయి. అయితే ఆమెకు ఆ అవకాశం లభించలేదు. షర్మిలకు ఆ అవకాశం లభించకుండా చేసింది ఎవరనే చర్చ నడుస్తోంది. వాస్తవానికి షర్మిల ఏపీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బలమైన వాయిస్ వినిపిస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక స్థానం కూడా గెలుచుకోలేకపోయినప్పటికీ.. చాలా ప్రాంతాలలో మెరుగైన ఓటు బ్యాంక్ సాధించింది.

ఈ నేపథ్యంలో షర్మిలకు ఎంపీ పదవి ఇచ్చి.. అధిష్టానం ఆమెకు గౌరవం కల్పిస్తుందని అనుకున్నప్పటికీ.. అలా జరగలేదు. కొన్ని కోటరీలు ఆమెకు వ్యతిరేకంగా పనిచేశాయని.. అందువల్లే ఆమెకు ఆ పదవి లభించలేదని సమాచారం. అభ్యర్థిగా తన పేరు ఖరారు కాకపోవడంతో షర్మిల ఒకింత నిరాశలో ఉన్నట్టు తెలుస్తోంది..

దేశంలోని 10 రాష్ట్రాల పరిధిలో 24 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఏపీలో నాలుగు.. గుజరాత్ లో నాలుగు.. కర్ణాటకలో నాలుగు.. మధ్యప్రదేశ్లో మూడు.. రాజస్థాన్లో మూడు.. జార్ఖండ్లో రెండు.. మణిపూర్ ప్రాంతంలో ఒకటి.. మేఘాలయ ప్రాంతాల్లో ఒకటి.. అరుణాచల్ ప్రదేశ్ లో ఒకటి.. మిజోరం రాష్ట్రంలో ఒక స్థానం ఉన్నాయి. ఇవే కాకుండా తమిళనాడు.. ఒడిస్సా రాష్ట్రంలో కూడా ఒక్కొక్క స్థానానికి ఇదే రోజున ఉప ఎన్నికలు జరుగుతాయి.