Homeజాతీయ వార్తలుWipro success story 2026: ఐటీ కంపెనీలు విప్రోను చూసి నేర్చుకోవాలి

Wipro success story 2026: ఐటీ కంపెనీలు విప్రోను చూసి నేర్చుకోవాలి

Wipro success story 2026: ఐటీ కంపెనీలు కార్పొరేట్ వాతావరణాన్ని ప్రతిబింబిస్తాయి. వర్క్ కల్చర్, ఉద్యోగుల వేషధారణ, వారి మాటతీరు ప్రతీది కూడా మనల్ని మరోదేశంలోకి తీసుకెళ్తుంది. అందుకే ఐటీ కంపెనీలు ఉద్యోగులకు తగ్గట్టుగా పని వాతావరణాన్ని కల్పిస్తూ ఉంటాయి. ఆహ్లాదానికి పార్కులు, తినడానికి క్యాంటిన్లు, సేద తీరడానికి ఓపెన్ ఏరియాలు.. అలా అనేకం ఉంటాయి. ప్రశాంతతకు, కోట్ల రూపాయల ప్రాజెక్టులకు కేంద్రాలైన ఐటీ కంపెనీలు దారుణ మైన కార్యకలాపాలకు కేంద్రాలుగా మారిపోతున్నాయి.. ఇటీవల టిసిఎస్ కంపెనీలో […]

Wipro success story 2026: ఐటీ కంపెనీలు కార్పొరేట్ వాతావరణాన్ని ప్రతిబింబిస్తాయి. వర్క్ కల్చర్, ఉద్యోగుల వేషధారణ, వారి మాటతీరు ప్రతీది కూడా మనల్ని మరోదేశంలోకి తీసుకెళ్తుంది. అందుకే ఐటీ కంపెనీలు ఉద్యోగులకు తగ్గట్టుగా పని వాతావరణాన్ని కల్పిస్తూ ఉంటాయి. ఆహ్లాదానికి పార్కులు, తినడానికి క్యాంటిన్లు, సేద తీరడానికి ఓపెన్ ఏరియాలు.. అలా అనేకం ఉంటాయి.

ప్రశాంతతకు, కోట్ల రూపాయల ప్రాజెక్టులకు కేంద్రాలైన ఐటీ కంపెనీలు దారుణ మైన కార్యకలాపాలకు కేంద్రాలుగా మారిపోతున్నాయి.. ఇటీవల టిసిఎస్ కంపెనీలో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఉద్యోగుల భద్రత.. ఇతర అంశాలపై ఆందోళనకు కారణమైంది. ఇది రాజకీయ దుమారానికి కూడా కారణమైంది. దీనిపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు.

టిసిఎస్ కంపెనీలో జరిగిన ఘటనను మర్చిపోకముందే విప్రోలు ఓ మాజీ మహిళా ఉద్యోగి చేసిన ఆరోపణలు సంచలనం కలిగించాయి. తాను పని చేస్తున్న కార్యాలయంలో రకరకాల వేధింపులు ఎదురయ్యాయని.. ఆ మహిళ వాపోయింది. పూణేలో ఆ మహిళ పనిచేస్తున్న సమయంలో కొంతమంది మానసిక ఒత్తిడికి గురి చేశారు. మతం మారే విషయంలో ఇబ్బందులు పెట్టారు. దీంతో ఆమె హింజ వాడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. సంస్థలో వేధింపులు.. పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆమె మానవ హక్కుల కమిషన్ వద్దకు వెళ్లారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో.. విప్రో కంపెనీ స్పందించింది.

ఆ మహిళ చెప్పినట్టుగా కొంతమంది సీనియర్ మేనేజర్లు.. టీం లీడర్లు బలవంతం చేస్తే.. కఠిన చర్యలు ఉంటాయని విప్రో కంపెనీ స్పష్టం చేసింది. ఉద్యోగుల సంక్షేమం విషయంలో.. గౌరవం విషయంలో.. స్వేచ్ఛ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గే అవకాశం లేదని స్పష్టం చేసింది. ఉద్యోగులకు సురక్షితంగా పని పరిస్థితులు కల్పిస్తామని.. వారితో నిబద్ధతను కలిగి ఉంటామని విప్రో కంపెనీ స్పష్టం చేసింది. అంతేకాదు ఈ కేసు వ్యవహారంలో పోలీసులు అడిగిన పత్రాలు మొత్తం ఇచ్చామని.. ఇటువంటి వ్యవహారాలలో ఉపేక్షకు తావు లేకుండా వ్యవహరిస్తామని విప్రో కంపెనీ ప్రకటించింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper