Home Blog Page 158

#RRR రికార్డు ని అవలీలగా దాటేసిన 'పెద్ది'.. ఇది కదా అసలు సిసలు మాస్ అంటే..

Peddi Movie Collections
Peddi Movie Collections

Peddi Movie Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ బాక్స్ ఆఫీస్ వద్ద రాబడుతున్న వసూళ్లు ప్రతీ రోజు ట్రేడ్ పండితులను విస్మయానికి గురి చేస్తోంది. ముఖ్యంగా కోస్తాంధ్ర లో ఒక సంక్రాంతి సూపర్ హిట్ సినిమాకు ఎలాంటి కలెక్షన్స్ వస్తాయో , అంతకు మించిన కలెక్షన్స్ ఈ చిత్రానికి వస్తున్నాయి. ఇదే తరహా ఊపు ని కొనసాగిస్తే ముందుకు వెళ్తే, ఈ చిత్రం కేవలం కోస్తాంధ్ర నుండే 100 కోట్ల షేర్ ని రాబట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదనై అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. పెద్ది చిత్రానికి కోస్తాంధ్ర నుండి 6 రోజుల్లో 60 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. రేపటి తో ‘ఓజీ’, ఎల్లుండి తో ‘దేవర’ ఫుల్ రన్ కలెక్షన్స్ ని ఈ ప్రాంతం లో దాటనుంది ఈ చిత్రం. అయితే కోస్తాంధ్ర లో ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి ఈ చిత్రానికి నమోదు అవుతున్న వసూళ్లను చూసి , ఇది కలనా ?, నిజమా? అని ఆశ్చర్యపోతున్నారు ట్రేడ్ పండితులు.

ఎందుకంటే ఈ చిత్రానికి 6 వ రోజున 1 కోటి 15 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. రాజమౌళి గతం లో రామ్ చరణ్ తో తీసిన #RRR చిత్రానికి 6 వ రోజున కేవలం 98 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది. కేవలం 6 రోజుల్లోనే ఈ ప్రాంతం నుండి 17 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. దీనిని బట్టీ చూస్తుంటే ఈ చిత్రానికి ఫుల్ రన్ లో పాతిక కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చేలా ఉందని , #RRR రికార్డు ని అవలీల గా దాటేస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అదే విధంగా వరల్డ్ వైడ్ గా కచ్చితంగా ఈ చిత్రం 200 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను ఈ వీకెండ్ తోనే దాటేస్తుందని, ఫుల్ రన్ లో 220 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు.

మరి ఆ రేంజ్ కి ఈ సినిమా వెళ్తుందో లేదో చూడాలి. ఫుల్ రన్ లో ఈ చిత్రం కచ్చితంగా 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడుతుందనే బలమైన నమ్మకం తో ఉన్నారు రామ్ చరణ్ అభిమానులు. నార్త్ ఇండియా కలెక్షన్స్ ఈమధ్యనే పుంజుకుంది , కానీ ఓవర్సీస్ ఏ మాత్రం సహకరించడం లేదు. అక్కడ ఈ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ముఖ్యంగా నార్త్ అమెరికా లో ఈ చిత్రాన్ని 7 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు , ఇప్పటి వరకు కేవలం 3 మిలియన్ డాలర్లు మాత్రమే వచ్చింది. అంటే అక్షరాలా 4 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లబోతుంది అన్నమాట. ఈ రేంజ్ డిజాస్టర్ గా నిలుస్తుందని ఓవర్సీస్ బయ్యర్స్ అసలు ఊహించలేదు.

సమంత తో కలిసి నటించడానికి నిరాకరించిన నాగ చైతన్య.. ఇది మామూలు ట్విస్ట్ కాదు..

Naga Chaitanya
Naga Chaitanya

Naga Chaitanya: సమంత , నాగ చైతన్య దంపతులు విడిపోయి చాలా ఏళ్ళు అవుతోంది , ఎవరి జీవితం లో వాళ్ళు ప్రస్తుతం ఫుల్ బిజీ గా ఉన్నారు , ఇద్దరూ కూడా కెరీర్ పరంగా మంచి స్థాయిలోనే ఉన్నారు. విడాకుల తర్వాత కొన్నాళ్ళకు నాగ చైతన్య ప్రముఖ యంగ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల ని పెళ్లి చేసుకోగా , సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ డైరెక్టర్ రాజ్ నిడిమోరు ని పెళ్లి చేసుకుంది. వీళ్లిద్దరి వైవాహిక జీవితాలు కూడా చాలా గొప్ప స్థాయిలో సాగుతున్నాయి , ఎలాంటి గొడవలు , మనస్పర్థలు ఈ జంటల మధ్యలో లేవు. అయితే సమంత , నాగ చైతన్య విడిపోయినప్పటికీ, ఈ కాంబినేషన్ ని ఇష్టపడే అభిమానుల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. విడిపోతే విడిపోయారు , కనీసం వీళ్లిద్దరు కలిసి ఒక సినిమా చేయొచ్చు కదా అని సోషల్ మీడియా లో కొంతమంది కోరుకుంటూ ఉంటారు.

అయితే గతం లో వీళ్లిద్దరు గాఢమైన ప్రేమలో ఉన్నప్పుడే , నాగ చైతన్య సమంత తో కలిసి నటించడానికి నిరాకరించాడట. అప్పట్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘అ ..ఆ’ అనే చిత్రం తెరకెక్కించిన సంగతి తెలిసిందే. నితిన్ , సమంత హీరో హీరోయిన్లు గా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ వద్ద సెన్సేషనల్ హిట్ గా నిల్చింది. ఈ చిత్రం లో ముందుగా హీరో పాత్ర కోసం నాగ చైతన్య న సంప్రదించాడట డైరెక్టర్ త్రివిక్రమ్. కానీ హీరో క్యారెక్టర్ కంటే , హీరోయిన్ క్యారెక్టర్ ఎక్కువ హైలైట్ అవుతుండడం తో , నాగ చైతన్య ఈ సినిమా ని రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. అప్పటికి ఆయన సమంత తో ప్రేమలోనే ఉన్నాడు , ఆమెతో డేటింగ్ కూడా చేస్తున్నాడు , అయినప్పటికీ ఆమెతో కలిసి నటించడానికి నిరాకరించడం గమనార్హం.

అయితే విడాకుల తర్వాత కొన్నాళ్ళకు జరిగిన ఒక ఇంటర్వ్యూ లో రిపోర్టర్ నాగ చైతన్య ని ఒక ప్రశ్న అడుగుతూ ‘మళ్లీ సమంత తో కలిసి నటించే అవకాశం వస్తే మీరు చేస్తారా ?’ అని అడగ్గా, నాగ చైతన్య అందుకు సమాధానం చెప్తూ ‘ఎందుకు చెయ్యను.. కచ్చితంగా చేస్తాను , నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. పైగా మా ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే క్రేజ్ కూడా వేరే లెవెల్ ఉంటుంది కదా’ అని చెప్పుకొచ్చాడు. మరి వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా భవిష్యత్తులో వస్తుందో లేదో చూడాలి. వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన చివరి చిత్రం ‘మజిలీ’. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా, టాలీవుడ్ లో కల్ట్ క్లాసిక్ చిత్రాల్లో ఒకటిగా నిల్చింది.

ఉగ్రవాద పాకిస్తాన్ కు.. మన శంకరుడు తగిన శాస్తి చేశాడు..

Muzaffarabad Helicopter Crash
Muzaffarabad Helicopter Crash

Muzaffarabad Helicopter Crash: హిందువులు ఆరాధ్య దైవంగా కొలిచే శివుడు హిమాలయాల మీద కొలువై ఉంటాడు. అక్కడ ధ్యానంలో ఉంటాడు. ఈశ్వరుడిని తలచుకుంటూ సాధువులు తపస్సు చేస్తుంటారు. తనను కొలిచే భక్తులకు.. తన పరిసర ప్రాంతంలో జీవించే ప్రజలకు ఏమైనా కష్టం వస్తే శంకరుడు క్షణంలోనే తన ప్రతాపం చూపిస్తాడు. ఇప్పుడు ఉగ్రవాద పాకిస్తాన్ దేశానికి కూడా శంకరుడు తన ఉగ్రరూపాన్ని చూపించాడు. అందువల్లే పాకిస్తాన్ తోక ముడుచుకుంది. తల వంచుకుంది.

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో కొంతకాలంగా అక్కడి ప్రజలు ఆందోళన చేస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం తీరు పట్ల తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అయితే ప్రజల నుంచి వస్తున్న ఆగ్రహాన్ని.. నిరసనను చల్లార్చడానికి పాకిస్థాన్ ప్రభుత్వం ఏకంగా ఆర్మీని రంగంలోకి దింపింది. విచక్షణ రహితంగా కాల్పులు జరిపిస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ కాల్పుల్లో గర్భిణులు.. చిన్నపిల్లలు చనిపోతున్నారు. అక్కడి మారణకాండను ప్రపంచ దేశాలు తీవ్రస్థాయిలో ఖండిస్తున్నాయి. అయినప్పటికీ పాకిస్తాన్ తీరు మారడం లేదు.

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద పాకిస్తాన్ దేశం చేస్తున్న దారుణాన్ని శివుడు చూస్తూ ఊరుకోలేకపోయాడు. అందువల్లే పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఎంఐ 17 హెలికాప్టర్ కు ప్రమాదం జరిగేలా చేశాడు. ఆ హెలికాప్టర్ ముజఫరాబాద్ లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 21 మంది చనిపోయారు. టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నిస్తుండగా హెలికాప్టర్ క్రాష్ అయ్యింది.. చూస్తుండగానే నేల కూలిపోయింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో చోటుచేసుకుంటున్న ఉద్రిక్తతల వల్ల.. పాకిస్తాన్ ఆర్మీ అదనపు బలగాలను తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఇందులో ఎవరు కూడా ప్రాణాలతో మిగలలేదని సమాచారం. మృతులకు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మునీర్ నివాళులర్పించారు.

పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ మొత్తం హిమాలయ పర్వతాలకు అత్యంత దగ్గరగా ఉంటుంది. అలాంటప్పుడు తన చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలకు అన్యాయం జరుగుతుంటే శివుడు చూస్తూ ఎలా ఉంటాడు.. అందువల్ల తన కోపాన్ని ఇలా చూపిస్తూ ఉంటాడు. ఇప్పటికైనా పాకిస్తాన్ పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఎందుకంటే అక్కడ శివుడు ఉన్నాడు. శివుడిని పాకిస్తాన్ నమ్మకపోవచ్చు. కానీ కోట్లాదిమంది హిందువులు నమ్ముతుంటారు. పాకిస్థాన్ ఆక్రమించిన జమ్మూ కాశ్మీర్ లో కూడా హిందువులు శివుడిని పూజిస్తుంటారు. వారి బాధలను మన శివయ్య విన్నట్టున్నాడు. అందుకే ఉగ్రవాద పాకిస్థాన్ ఆర్మీకి చావును పరిచయం చేశాడు.

తెలంగాణ మీ అయ్య జాగీరా.. పవన్ ప్రశ్నించింది అందుకే..

Pawan Kalyan Fans
Pawan Kalyan Fans

Pawan Kalyan Telangana Comments: తెలంగాణ రాష్ట్రంలో ఆమధ్య పవన్ కళ్యాణ్ సృష్టించిన రాజకీయ అలజడి కలకలం రేపింది. ప్రధాన మీడియా నుంచి మొదలు పెడితే సోషల్ మీడియా వరకు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల చుట్టూ తిరిగింది. కొంతమంది తెలంగాణ నాయకులు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్రస్థాయిలో మండిపడ్డారు..

పవన్ కళ్యాణ్ నాడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణలోకి ఎందుకు వద్దని అంటున్నారు.. తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు.. భారత రాష్ట్ర సమితికి సంబంధించిన కొంతమంది నాయకులు.. టిఆర్ఎస్ అధినాయకురాలు కవిత, ఇతర నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ వ్యవహారశూరి సరైనది కాదని మండిపడ్డారు.

నాడు తెలంగాణ మీ అయ్య జాగీరా అని తాను ఎందుకన్నాను.. దానికి దారి తీసిన పరిస్థితులను పవన్ కళ్యాణ్ వివరించారు. “నన్ను హైదరాబాద్ రాకూడదని కాంగ్రెస్ నాయకులు పదే పదే బెదిరించారు. తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు. 13 నెలలుగా టార్గెట్ చేశారు. నాకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుకు భంగం కలిగింది కాబట్టి నేను తెలంగాణ రాష్ట్రంలోకి అడుగు పెట్టారు. మీ అయ్య జాగీరా అంటూ ప్రశ్నించాను. భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు ఈ వైఖరి లేదని.. నన్ను రావద్దు అంటే రాహుల్ గాంధీ సౌత్ ఇండియాతో తనకు సంబంధం లేదని చెప్పాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో లోకేష్ తో పోటీ వల్లే తెలంగాణ మీద ఫోకస్ పెట్టడం అనేది అబద్ధమని” పవన్ పేర్కొన్నారు.

“నాకు తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ కళ్యాణ్ కుమార్ అని పేరు పెట్టారు. స్కూల్ రికార్డ్స్ లో శ్రీ అనే పదం తొలగించి కే కళ్యాణ్ కుమార్ అనే పేరు నమోదు చేశారు. మార్షల్ ఆర్ట్స్ టీచర్స్ నా పేరుకు ముందు పవన్ అని పేరు పెట్టారు. నా చాతి భాగం మీద 450 కిలోల స్టోన్ స్లాబ్స్ బ్రేక్ చేసేవారు. నన్ను హనుమంతుడితో పోల్చుతూ ఆ పేరు పెట్టారని” పవన్ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల తెలంగాణ నేతలు ఇంతవరకు స్పందించలేదు. చూడాలి మరి వారు ఏం మాట్లాడతారో.. గతంలో పవన్ కళ్యాణ్ మీద అనిరుధ్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

దుమ్ములేపుతున్న అలియా భట్ 'ఆల్ఫా' టీజర్.. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ రోల్?

Alia Bhatt Alpha Teaser
Alia Bhatt Alpha Teaser

Alia Bhatt Alpha Teaser: బాలీవుడ్ స్పై జానర్ సినిమాలకు కేవలం నార్త్ ఇండియా లో మాత్రమే కాదు , సౌత్ ఇండియా లో కూడా మంచి క్రేజ్ ఉంది. షారుఖ్ ఖాన్ , సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ వంటి వారు ఈ స్పై జానర్ సినిమాల్లో నటించి , సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ని తమ ఖాతాల్లో వేసుకున్నారు. ఈ స్పై యూనివర్స్ నుండి వచ్చిన చివరి చిత్రం ‘వార్ 2’. హృతిక్ రోషన్ హీరో గా నటించిన ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ విలన్ గా నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా , ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. యాష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లోనే అత్యంత తక్కువ వసూళ్లను రాబట్టిన సినిమా గా నిల్చింది ఈ చిత్రం. దీంతో ఈ యూనివర్స్ కి ఇక ఎండ్ కార్డు పడినట్టే అని అంతా అనుకున్నారు.

కానీ ‘వార్ 2’ మూవీ చివర్లోనే , ఈ యూనివర్స్ నుండి ‘ఆల్ఫా’ అనే చిత్రం తెరకెక్కబోతుంది , ఒక చిన్నపాటి క్లిప్ హ్యాంగర్ సన్నివేశం తో చెప్పకనే చెప్పాడు డైరెక్టర్. ఈ సినిమాలో అలియా భట్ ప్రధాన పాత్ర పోషించబోతుంది. ఆమెకు గురువుగా బాబీ డియోల్ నటిస్తున్నాడు. శర్వరి స్పై ఏజెంట్ ఆఫీసర్ గా నటించబోతుంది. అనిల్ కపూర్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ మూవీ కి సంబంధించిన టీజర్ ని నేడు ఉదయం విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. స్పై యూనివర్స్ కి ‘వార్ 2’ తో ఎండ్ కార్డు పడిందని అనుకున్నాం , కానీ ‘ఆల్ఫా’ చిత్రం స్పై యూనివర్స్ కి పూర్వ వైభవం తీసుకొచ్చేలా ఉందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.

ఈ టీజర్ లో బాబీ డియోల్ తన కూతురు కి 18 ఏళ్ళు నిండగానే , దేశం కోసం ఒక సీక్రెట్ ఆపరేషన్ ని అందించడం , అందుకోసం ఆమెని చిన్నప్పటి నుండి ఆయన ఎలా తయారు చేసాడు వంటి షాట్స్ ఈ టీజర్ లో ఆడియన్స్ ని ప్రత్యేకంగా ఆకర్షించింది. అయితే ఈ సినిమాలో హ్రితిక్ రోషన్ కబీర్ గా కనిపించబోతున్నాడట. ఇది కేవలం అతిధి పాత్ర మాత్రమే, హ్రితిక్ రోషన్ తో పాటు , జూనియర్ ఎన్టీఆర్ కూడా మేజర్ విక్రమ్ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. ఇదే కనుక నిజమైతే ఈ ఇద్దరి హీరోల అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. ఈ ఏడాది జులై 3 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సోషల్ మీడియా లో సంచలనం రేపుతున్న ఈ టీజర్ ని మీరు కూడా చూసేయండి.

 

 

టాలెంట్ కాదు.. అలా అయితేనే జట్టు కోసం ఎంపిక చేస్తారు..భువి మనసులో ఇంత బాధ దాగుందా

Bhuvneshwar Kumar
Bhuvneshwar Kumar

Bhuvneshwar Kumar: ఇటీవల జరిగిన ఐపిఎల్ లో అత్యంత పొదుపుగా బౌలింగ్ వేశాడు భువనేశ్వర్. అదే స్థాయిలో వికెట్లు కూడా పడగొట్టాడు.. పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. భువనేశ్వర్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. కానీ అతడు మాట్లాడినప్పుడు మీడియా మొత్తం సంచలనంగా మారుతుంది. ఎందుకంటే అతడి మాటలు అలా ఉంటాయి కాబట్టి.

తాజాగా టీమిండియాలో తనకు చోటు ఎందుకు లభించడం లేదు.. తను ఎంత గొప్పగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ సెలెక్టర్లు ఎందుకు లెక్కలోకి తీసుకోవడం లేదు.. అనే విషయాలపై క్లారిటీ ఇచ్చాడు భువనేశ్వర్ కుమార్. “దేశం కోసం ఆడాలని చాలామందికి ఉంటుంది. అందులో నేను కూడా ఒకడిని. కాకపోతే కొన్ని సందర్భాలలో జరిగిన విషయాలను బయట పెట్టుకోవడం భావ్యం కాదు. నేను నాకు నచ్చిన పని చేస్తున్నా. అందులో నన్ను నేను నిరూపించుకుంటున్నాను. సెలెక్టర్లు వాళ్ల పని వాళ్ళు చేస్తున్నారు. టాలెంట్ ఉండగానే సరిపోదు. జట్టుకు కూడా ఎంపిక కావాలి. జట్టులోకి ఎంపిక కావాలంటే దానిని సెలెక్టర్లు చూసుకోవాలి. వాళ్ళు ఓకే చెబితేనే జట్టులోకి అవకాశం ఉంటుందని” భువనేశ్వర్ వ్యాఖ్యానించాడు.

భువనేశ్వర్ గతంలో జట్టుకు ఎంపికైనప్పుడు అద్భుతమైన ఇన్ స్వింగ్ బౌలింగ్ తో ఆకట్టుకునేవాడు.. తక్కువ ఎత్తులో బంతులు వేసి ప్రత్యర్థి బ్యాటర్లను బోల్తా కొట్టించేవాడు. ముఖ్యంగా వికెట్ టు వికెట్ బంతులు వేయడంలో అతడి తర్వాతే ఎవరైనా. తక్కువ వేగంతో యార్కర్లు వేసి.. వికెట్లు పడగొట్టడంలో భువనేశ్వర్ కుమార్ నేర్పరి. అందువల్లే అతడిని వికెట్ మాస్టర్ అని పిలుస్తుంటారు. ఇటీవల ఐపీఎల్లో బెంగళూరు జుట్టు తరఫున ఆడిన అతడు అదరగొట్టాడు. వికెట్ల మీద వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. ఇన్ని సంవత్సరాలపాటు ఐపీల్ ఆడుతున్నప్పటికీ.. కొత్త బౌలర్ లాగా బౌలింగ్ వేసి సంచలనం సృష్టించాడు.. ఐపీఎల్ ట్రోఫీ బెంగళూరు గెలవడం వెనక మిగతా ఆటగాళ్ల పాత్ర ఎంతైతే ఉందో.. అంతకు మించిన పాత్ర భువనేశ్వర్ కుమార్ ది ఉంది.

ఐపీఎల్ లో సత్తా చూపించిన తర్వాత భువనేశ్వర్ కుమార్ కు వన్డే సిరీస్ లలో అవకాశం లభిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అది సాధ్యం కాలేదు. కనీసం ఐర్లాండ్, ఇంగ్లాండ్ జట్లో జరిగే టీ20 సిరీస్ లకైనా చోటు లభిస్తుందేమోనని అనుకున్నారు. చివరికి అది కూడా వీలుపడలేదు. మొత్తానికి టన్నుల కొద్దీ టాలెంట్ పెట్టుకుని భువనేశ్వర్ జట్టుకు ఎంపిక కాలేకపోతున్నాడు.

నెలకు 1.41 లక్షలు సంపాదించే మహిళకు 1.35 లక్షల భరణం.. మగాళ్లు ఎలా బతకాలి సార్..

Divorce Alimony Case
Divorce Alimony Case

Divorce Alimony Case: ఆ మధ్య బెంగళూరు నగరంలో ఓ ఐటీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి ప్రధాన కారణం విడాకుల పేరుతో అతని భార్య వేధించడమే. ఏం చేయాలో తెలియలేదు, ఎన్నిసార్లు కోర్టు మెట్లు ఎక్కినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీనికి తోడు భార్య నుంచి వేధింపులు మరింత పెరిగిపోయాయి. చట్టాలలో ఉన్న వెసలు బాట్లు ఆమెకు అనుకూలంగా మారిపోయా యి. అతడు ఆమె వల్ల తట్టుకోలేకపోయాడు. విసిగి వేసారి పోయాడు ఏం చేయాలో అర్థం కాలేదు తప్పనిసరి పరిస్థితుల్లో తనకు తానే శిక్ష విధించుకున్నాడు బలవంతంగా చనిపోయాడు. దేశవ్యాప్తంగా ఈ సంఘటన సంచలనం కలిగించింది. విడాకుల పేరుతో భార్యల వేధిస్తున్న తీరు కళ్ళకు కట్టింది.

ఆ మధ్య ఒక ప్రముఖ క్రికెటర్ కూడా తన భార్యకు భారీగా భరణం ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి.. అతడు ఇచ్చిన నగదు మొత్తం కోట్లల్లో ఉన్నట్టు ప్రచారం జరిగింది.. అయితే అతడు ఎంత ఇచ్చాడు.. ఆమె ఎంత స్వీకరించింది అనే విషయాలు బయటకు రాలేదు. కాకపోతే విడాకులకు సంబంధించిన భరణాల కేసులు మన దేశంలో సంచలనం సృష్టిస్తూనే ఉన్నాయి. ఈవిడాకులు తీసుకునే వారిలో ఎక్కువగా ఉన్నత చదువులు చదివిన వారే ఉంటున్నారు. అంతర్గతంగా విభేదాలు.. విపరీతమైన ఈగోల వల్ల వెంటనే విడాకులు తీసుకుంటున్నారు. అంతేకాదు, విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. భారీగా పరిహారాన్ని కోరుతున్నారు. ఇలాంటి సమయంలో భర్తలు సమిధలుగా మారిపోతున్నారు.

పూణే నగరంలో పెళ్లయిన ఆరు నెలలకే భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చాయి. ఎన్నిసార్లు ముఖాముఖి నిర్వహించినప్పటికీ వారిద్దరు కలిసి ఉండే అవకాశాలు కనిపించలేదు. దీంతో వారిద్దరు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.. ఈ క్రమంలో ప్రతినెల 2.79 లక్షలు సంపాదించే తన భర్త నుంచి తనకు 1.3 లక్షలు భరణం ఇప్పించాలని ఆమె న్యాయస్థానాన్ని కోరింది.. అతనితో కలిసి ఉన్న ఆరు నెలల సమయంలో అనుభవించిన జీవితాన్ని తాను జీవితాంతం ఆస్వాదించాలని పిటిషన్ లో కోరింది. దానికి న్యాయస్థానం ఒప్పుకుంది. దీంతో ప్రతి నెల ఆమెకు 1.35 లక్షలు చెల్లించాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.

ఆమె ప్రతినెల 1.4 లక్షలు సంపాదిస్తూ ఉంటుంది. ఆమె సంపాదించే జీతం.. వచ్చే భరణం మొత్తం కలిపి 2.75 లక్షల వరకు ఉంటుంది. ఈ లెక్కన తన భర్త కంటే ఆమె నెలకు 40 వేలు మాత్రమే తక్కువ సంపాదిస్తుంది. అయితే ఆమెకు కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయస్థానం ఇలా చేయడం అన్యాయమని వాదిస్తున్నారు. ఇలాగైతే మగాళ్లు భూమి మీద బతకడం కష్టమని వాపోతున్నారు.

పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్.. ఏకంగా 3 గంటల పాటు చర్చ.. అసలు ఏమి జరగబోతోంది..?

Pawan Kalyan And Allu Arjun
Pawan Kalyan And Allu Arjun

Allu Arjun And Pawan Kalyan: గత కొంతకాలం గా మెగా ఫ్యామిలీ , అల్లు ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ జరుగుతుందని , ముఖ్యంగా పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో గొడవలు జరిగాయని , ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో , మెయిన్ ఎలక్ట్రానిక్ మీడియా లో ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమి లేదని సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పకనే చెప్తున్నారు మామా – అల్లుడు. వీళ్ళ మధ్య ఉన్న బాండింగ్ , ప్రేమ వెలకట్టలేనిదని , బయట ఎంత మంది ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా పర్వాలేదని సోషల్ మీడియా లో కొంతమంది అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి కలిసి , ఆయనతో మూడు గంటల పాటు సమయాన్ని గడిపి వచ్చాడట.

పూర్తి వివరాల్లోకి వెళ్తే , రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురవ్వడం , దీంతో ఆయన ముక్కు కి కీలక సర్జరీ అవ్వడం వంటివి జరిగాయి. చాలా రోజుల పాటు ఆయన ఉప ముఖ్యమంత్రి బాధ్యతలను కూడా పక్కన పెట్టి , ఇంటికే పరిమితమై విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుంది, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఫుల్ బిజీ గా గడుపుతున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ విశ్రాంతి తీసుకుంటున్న సమయం లోనే అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా ఆయన ఇంటికి వెళ్లి , ఆయన్ని కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారట అల్లు అర్జున్. ఆ సమయం లో ఫోటోలు తీయడానికి ఆయన అనుమతించలేదట. మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి బంధాన్ని బయటకు తెలియజేయాల్సిన అవసరమే లేదని , అది మా మధ్యనే ఉంటే చాలని అల్లు అర్జున్ అనుకున్నాడట. అందుకే ఫోటోలు తీసేందుకు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది.

గతం లో కూడా పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ లో అగ్నిప్రమాదానికి గురయ్యినప్పుడు , అల్లు అర్జున్ తన సతీమణి స్నేహారెడ్డి తో కలిసి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఇప్పుడు మరోసారి ఆయన అదే పని చేశాడు , దీనిని బట్టీ వాళ్ళ మధ్య ఎలాంటి బంధం ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. ఇకనైనా సోషల్ మీడియా లో వీళ్లిద్దరి హీరోల అభిమానులు ఫ్యాన్ వార్స్ చేసుకోవడం వంటివి ఆపేస్తారో లేదో చూడాలి. వీళ్ళు లేటెస్ట్ గా కలిసిన ఆ ఫోటోలు సోషల్ మీడియా లో వచ్చి ఉండుంటే బాగుండేదని అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

#NBK111 మూవీ టీజర్ వచ్చేసింది.. 'ఓజీ' చిత్రాన్ని బాలయ్య చేస్తే ఎలా ఉంటుందో చూపించిన డైరెక్టర్..

NBK111
NBK111

NBK111 Teaser: ‘అఖండ 2’ వంటి భారీ డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో ఒక సినిమాని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘వీరసింహా రెడ్డి’ అనే చిత్రం వచ్చింది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా అంటే , కేవలం నందమూరి అభిమానులకు మాత్రమే కాదు , ఇతర హీరోలకు కూడా ఎంతో ఇష్టం. అలాంటి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది అనగానే , అంచనాలు భారీ రేంజ్ లో పెరిగాయి. ముందుగా హిస్టారికల్ జానర్ లో ఈ చిత్రాన్ని తీద్దాం అనుకున్నారు. కానీ బడ్జెట్ బాలయ్య మార్కెట్ ని మించి ఉండడం తో, ఆ సబ్జెక్టు ని పక్కన పెట్టి , యాక్షన్ ఎంటర్టైనర్ ని తెరమీదకు తీసుకొచ్చాడు. నేడు బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేశారు.

ఇప్పటి వరకు బాలయ్య బాబు చెయ్యని యాక్షన్ జానర్ లో , ఆయన్ని చాలా స్టైలిష్ గా , న్యూ జనరేషన్ యూత్ కి దగ్గర చేసేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడని ఈ టీజర్ ని చూస్తే అర్థం అవుతోంది. అయితే ఈ టీజర్ పై సోషల్ మీడియా లో ట్రోల్స్ చాలా ఎక్కువ అయ్యాయి. ఈ టీజర్ ని చూసిన వెంటనే , మాకు ఓజీ చిత్రం గుర్తుకొచ్చింది , బాలయ్య ఓజీ సినిమా చేస్తే ఎలా ఉంటుందో డైరెక్టర్ గోపీచంద్ మలినేని నేటి తరం ఆడియన్స్ కి చూపించే ప్రయత్నం చేసాడని అంటున్నారు. ఇక తమన్ అందించిన మ్యూజిక్ అయితే , జైలర్ ని నుండి కాపీ కొట్టినట్టుగా అనిపిస్తుందని , దొంగతనం చేసిన వెంటనే ఇలా దొరికిపోవడం తమన్ స్పెషాలిటీ అంటూ సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజెన్స్.

ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ట్రోల్స్ ఉన్నాయి. కానీ నందమూరి అభిమానులు మాత్రం బాలయ్య ని సరికొత్తగా చూపించినందుకు సంబరాలు చేసుకుంటున్నారు. ఇకపోతే ఈ చిత్రం లో విలన్ గా మంచు మనోజ్ నటించబోతున్న సంగతి తెలిసిందే. గతం లో మంచు మనోజ్ హీరో గా నటించిన ‘ఊ కొడతారా.. ఉలిక్కి పడుతారా’ చిత్రం లో బాలయ్య కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు అదే బాలయ్య చిత్రం లో మనోజ్ విలన్ గా నటించబోతుండడం గమనార్హం. అదే విధంగా ఈ చిత్రం లో హీరోయిన్ గా నయనతార నటించబోతుందని ఇప్పటికే మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం , వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక సోషల్ మీడియా ని దున్నేస్తున్న #NBK111 టీజర్ ని మీకోసం అందిస్తున్నాము చూడండి .

 

'కుకూ విత్ జాతి రత్నాలు 2' లో 'వైల్డ్ కార్డు' ఎంట్రీ ఇవ్వనున్న నలుగురు కంటెస్టెంట్స్.. ఎవరెవరంటే..

Kooku With Jathi Ratnalu 2 Wild Card Entry
Kooku With Jathi Ratnalu 2 Wild Card Entry

Kooku With Jathi Ratnalu 2 Wild Card Entry: స్టార్ మా ఛానల్ లో అద్భుతమైన రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతున్న ఎంటర్టైన్మెంట్ షోస్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా ‘కుకూ విత్ జాతి రత్నాలు 2’ కచ్చితంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతీ శని , ఆదివారాల్లో ప్రసారమయ్యే ఈ గేమ్ షోకి టీఆర్ఫీ రేటింగ్స్ 4 నుండి 4.5 రేంజ్ లో ఉంటుంది. మొదటి సీజన్ కంటే రెండవ సీజన్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సీజన్ లో భారీ ట్విస్ట్ ఇస్తూ మరో నలుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారని టాక్. వచ్చే వారం టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ లో ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వబోతున్నారు. అందుకే బ్యాలన్స్ చేయడానికి ఏకంగా నలుగురు కంటెస్టెంట్స్ ని ఈ షో లోకి కొత్తగా తీసుకొని రాబోతున్నారు, వాళ్ళు ఎవరో ఒకసారి చూద్దాం.

స్టార్ మా ఛానల్ లో సూపర్ హిట్ సీరియల్ గా కొనసాగిన ‘మగువా ఓ మగువా’ సీరియల్ హీరో శ్రవణ్ కుమార్ , ఈ షో లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈయనకు లేడీస్ లో ఉన్న ఫాలోయింగ్ మామూలుది కాదు. ఇదే సూపర్ హిట్ సీరియల్ లో హీరోయిన్ గా నటించిన కృతిక ఉమా శంకర్ కూడా ఈ షో లోకి వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతం ఈమె స్టార్ మా ఛానల్ లో నెంబర్ 1 టీఆర్ఫీ రేటింగ్స్ తో కొనసాగుతున్న ‘పొదరిల్లు’ సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ షో లోకి మూడవ వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది పునర్నవి భూపాళం. ఈమె బిగ్ బాస్ సీజన్ 3 లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇక నాల్గవ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న నటుడు సుమిత్ రాయ్.

అనేక సూపర్ హిట్ సీరియల్స్ లో హీరో గా , విలన్ గా నటించి బుల్లితెర ఆడియెన్స్ కి బాగా సుపరిచితుడు అయ్యాడు , వంటలు కూడా అద్భుతంగా చేస్తాడని టాక్. ఈ నాలుగు ఎంట్రీ తో , ఈ షో ఇంకా ఎంత ఎంటర్టైన్మెంట్ తో నిండిపోతుందో చూడాలి. అయితే గత వారం జాతి రత్నాలు లో మంచి క్రేజ్ సంపాదించుకున్న దీపికా గైర్హాజరు అవ్వడం గమనార్హం. వచ్చే వారం టెలికాస్ట్ అవ్వబోయే ఎపిసోడ్స్ ప్రోమో లో కూడా ఆమె లేదు. దీనిని బట్టీ ఆమె ఈ షో నుండి తప్పుకున్నట్టు తెలుస్తోంది. అదే విధంగా ఈ షో నుండి తనూజ ఎలిమినేట్ అయ్యినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి , ఇందులో ఎంత మాత్రం నిజముందో చూడాలి.

ట్రంప్‌తో నెతన్యాహూ కటీఫ్‌.. ప్రమాదంలో పశ్చిమాసియా పరిస్థితి?

Trump and Netanyahu fallout
Trump and Netanyahu fallout

Trump and Netanyahu fallout: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు తన సామ్రాజ్యవాద కాంక్షతో ఇరాన్‌పై యుద్ధం ప్రకటించారు. దీనికి ఎప్పటి నుంచో ఇరాన్‌తో వైరం ఉన్న ఇజ్రాయెల్‌ సహాయం తీసుకున్నారు. రెండు దేశాలు కలిసి ఇరాన్‌పై భీకర దాడులు చేశాయి. దాదాపు 50 రోజులు ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపించాయి. మరోవైపు ఇజ్రాయెల్‌ లెబనాన్‌ను టార్గెట్‌ చేసింది. హెజ్‌బొల్లా లక్ష్యంగా దాడులు కొనసాగించింది. తర్వాత అమెరికా ఇరాన్‌ మధ్య తాత్కాలిక సీజ్‌ఫైర్‌ కుదిరింది. శాశ్వత ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఇజ్రాయెల్‌ సీజ్‌ఫైర్‌ను ఉల్లంఘించి లెబనాన్, ఇరాన్‌పై దాడులు కొనసాగిస్తోంది. దీంతో డొనాల్డ్‌ ట్రంప్‌ ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమెన్‌ నెతన్యాహుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు ఆపాలని ఆదేశించారు. అయినా ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగిస్తోంది. అమెరికా మద్దతు ఉన్నా లేకపోయినా ఇరాన్‌పై దాడులు కొనసాగించాలని నెతన్యాహు నిర్ణయించారు. తాజా కేబినెట్‌ సమావేశంలో నెతన్యాహు ‘అమెరికా మద్దతు లేకుండానే ఇరాన్‌ను ఎదుర్కోవాల్సి వచ్చినా సిద్ధంగా ఉండాలి’ అని కేబినెట్‌ సభ్యులను హెచ్చరించినట్లు ఇజ్రాయెల్‌ మీడియా వెల్లడించింది. ఆయుధాల కొరత, అంతర్జాతీయ ఒత్తిడి, దౌత్యపరమైన ఒంటరితనం వంటి ధరలు చెల్లించాల్సి వచ్చినా వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు.

అమెరికా ముందస్తు సమాచారం..
ఇదే సమయంలో మరికొన్ని గంటల్లో ఇరాన్‌పై దాడి చేయబోతున్నట్లు అమెరికా ఇజ్రాయెల్‌కు ముందుగానే సమాచారం అందించినట్లు సమాచారం వెలువడింది. ఇటీవల హర్ముజ్‌ జలసంధి సమీపంలో అమెరికా అపాచీ హెలికాప్టర్‌ కూల్చివేతకు ప్రతిస్పందనగా అమెరికా ఇరాన్‌ దక్షిణ ప్రాంతాల్లోని జాస్క్, బందర్‌ అబ్బాస్, ఖెష్క్‌ దీవి ప్రాంతాల్లో వైమానిక దాడులు చేసింది. అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ఈ దాడులు తమ ఆత్మరక్షణ చర్యల్లో భాగమని ప్రకటించింది.

ఇరాన్‌ ప్రతీకారం..
తాజా దాడులపై ఇరాన్‌ కూడా తీవ్రంగా స్పందించింది. అమెరికా స్థావరాలు ఉన్న బహ్రెయిన్‌లోని నౌకాదళంపై ఎదురుదాడులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చి, ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్‌ప్స్‌ ఇంకా తీవ్రమైన ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించాయి. ఇదే సమయంలో లెబనాన్‌లో హెజ్బొల్లా పై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ చేస్తున్న దాడులు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను తీవ్రంగా అసంతృప్తి పరుస్తున్నాయి.

ఇజ్రాయెల్‌ ఆందోళన..
ఇజ్రాయెల్‌ సైన్యాధ్యక్షుడు ఎయాల్‌ జమీర్‌ అమెరికా–ఇరాన్‌ మధ్య ఏ ఒప్పందమైనా ఇజ్రాయెల్‌ భద్రతా ప్రయోజనాలకు ముప్పుగా మారవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్‌తో అణు ఒప్పందం కుదిరితే తమ సైనిక చర్యల స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని ఇజ్రాయెల్‌ భావిస్తోంది. ప్రస్తుత పరిస్థితి ఇజ్రాయెల్‌–అమెరికా మధ్య కూడా విబేధాలను పెంచుతోంది. ఒకవైపు ట్రంప్‌ ఇరాన్‌తో డీల్‌ ద్వారా శాంతి ప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు నెతన్యాహు తన సైనిక వ్యూహాలను కొనసాగించాలని పట్టుబట్టడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చేస్తోంది.

అమెరికా ఇజ్రాయెల్‌కు ముందస్తు సమాచారం ఇచ్చి దాడులు చేయడం ద్వారా రెండు దేశాల మధ్య ఇప్పటికీ ఉన్న భాగస్వామ్యం కనిపిస్తున్నా, నెతన్యాహు ఒంటరిగా కూడా యుద్ధం చేస్తామన్న సంకేతం పశ్చిమాసియాలో మరిన్ని పెద్ద ఘర్షణలకు దారి తీయవచ్చని ఆందోళనలు రేకెత్తుతున్నాయి. రాబోయే రోజులు ఈ ప్రాంత భద్రతా పరిస్థితిని ఎలా మార్చనున్నాయో చూడాలి.

హిందీ లో పుంజుకున్న 'పెద్ది' వసూళ్లు.. 6 రోజుల్లో వచ్చిన గ్రాస్ ఎంతో చూస్తే ఆశ్చర్యపోతారు..

Peddi Hindi box office collections
Peddi Hindi box office collections

Peddi Hindi box office collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తున్న వసూళ్ల సునామీ గురించి ఎంత చెప్పిన తక్కువే. మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలకు పబ్లిక్ లో టాక్ ఉంటే , కలెక్షన్స్ ఎక్కడ మొదలై , ఎక్కడ ఆగుతుంది అనేది ఎవ్వరూ చెప్పలేరని ట్రేడ్ విశ్లేషకులు అంటుంటారు. అందుకు ది బెస్ట్ ఉదాహరణ గా ‘పెద్ది’ చిత్రం నిల్చింది. 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 273 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అందులో కేవలం తెలుగు వెర్షన్ వసూళ్లే 250 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. అయితే ఈ చిత్రానికి మొదటి రోజు నుండి హిందీ వెర్షన్ లో ఆశించిన స్థాయి వసూళ్లు నమోదు అవ్వలేదు, కానీ 6 వ రోజున హిందీ వెర్షన్ వసూళ్లు కాస్త పికప్ అయ్యాయి. రోజులవారీగా ఈ చిత్రానికి హిందీ లో ఎంత నెట్ వసూళ్లు వచ్చిందో ఒకసారి చూద్దాం.

అక్కడి ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజున హిందీ వెర్షన్ నుండి 3 కోట్ల 25 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా రెండవ రోజున 2 కోట్ల 50 లక్షలు , 3 వ రోజున 3 కోట్ల 10 లక్షలు , నాల్గవ రోజున 3 కోట్ల 65 లక్షలు , 5 వ రోజున 1 కోటి 30 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. ఇక నార్త్ ఇండియా లో మంగళవారం రోజున నేషనల్ మల్టీప్లెక్స్ థియేటర్స్ లో టికెట్ రేట్స్ మీద ఆఫర్స్ ఇస్తుంటారు. ఆ కారణం చేత ఈ సినిమా కలెక్షన్స్ లో కాస్త జంప్ వచ్చింది. 6 వ రోజున దాదాపుగా 1 కోటి 55 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి.

ఓవరాల్ గా ఈ చిత్రానికి 6 రోజుల్లో 15 కోట్ల 35 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు హిందీ వెర్షన్ నుండి వచ్చాయి. గ్రాస్ వసూళ్లు దాదాపుగా 20 కోట్ల రూపాయిల వరకు ఉండొచ్చు. ఈ వీకెండ్ హిందీ కలెక్షన్స్ మరోసారి భారీ లెవెల్ లో పికప్ అయ్యే అవకాశాలు ఉన్నాయని , ఫుల్ రన్ లో ఈ చిత్రానికి 40 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 32 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు కచ్చితంగా వస్తాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. హిందీ లో కాస్త మేకర్స్ ప్రొమోషన్స్ చేయడం మొదలు పెడితే, కలెక్షన్స్ ఇంకా పికప్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు, చూడాలి మరి ఈ సినిమా హిందీ వెర్షన్ వసూళ్లు ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.

'పెద్ది ' 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. వర్కింగ్ డేస్ లో కూడా ఇదేమి కుమ్ముడు బాబోయ్..

Peddi 6 days worldwide collections
Peddi 6 days worldwide collections

Peddi 6 days worldwide collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏ మాత్రం జోరు తగ్గకుండా, సెన్సేషనల్ కలెక్షన్స్ తో ముందుకు దూసుకుపోతోంది. మన టాలీవుడ్ మార్కెట్ ఈమధ్య కాలం లో కేవలం పండగ సీజన్స్ కి మాత్రమే పరిమితం అయ్యింది. మామూలు పని దినాల్లో బాక్స్ ఆఫీస్ వెలవెలబోయే పరిస్థితి ఏర్పడింది. కానీ ‘పెద్ది’ చిత్రం మామూలు పని దినాల్లో కూడా సెన్సేషనల్ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ ఈమధ్య కాలం లో రాలేదనే చెప్పాలి. సరిగ్గా టాలీవుడ్ పరిస్థితి చక్కదిద్దే సినిమా కోసం ట్రేడ్ ఎంతగానో ఎదురు చూసింది. ఆ ఎదురు చూపులకు తగ్గట్టుగానే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేయడం బయ్యర్స్ కి మామూలు ఆనందాన్ని ఇవ్వడం లేదు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అయితే రాజమౌళి #RRR ని మించి కలెక్షన్స్ ఉన్నాయి.

ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి మాట్లాడుకోవాలి. మొదటి రోజు నుండి నేటి వరకు ఈ చిత్రం ఈ ప్రాంతం లో సృష్టిస్తున్న రికార్డ్స్ సాధారణమైనవి కాదు. #RRR చిత్రానికి 6 వ రోజున ఈ ప్రాంతం నుండి కేవలం 98 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది. కానీ ‘పెద్ది’ చిత్రానికి ఏకంగా 1 కోటి 14 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. దీనిని బట్టే చెప్పొచ్చు , ఈ సినిమా ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది. ఓవరాల్ గా ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి 6 రోజుల్లో ఎంత షేర్ వసూళ్లను రాబట్టింది , వరల్డ్ వైడ్ గా వచ్చిన గ్రాస్ ఎంత , ఇంకా ఎంత షేర్ వసూళ్లు వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది అనేది చూడాలి. ఒక్క నైజాం ప్రాంతం నుండే ఈ చిత్రం 6 రోజుల్లో 45 కోట్ల 38 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.

అదే విధంగా సీడెడ్ ప్రాంతం లో 6 రోజుల్లో దాదాపుగా 17 కోట్ల రూపాయిలు, ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 17 కోట్ల 45 లక్షలు , తూర్పు గోదావరి జిల్లా నుండి 10 కోట్ల 52 లక్షలు , పశ్చిమ గోదావరి జిల్లా నుండి 7 కోట్ల 33 లక్షలు , గుంటూరు జిల్లా నుండి 10 కోట్ల 89 లక్షలు , కృష్ణా జిల్లా నుండి 8 కోట్ల 40 లక్షలు , నెల్లూరు జిల్లా నుండి 4 కోట్ల 76 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి 121 కోట్ల 69 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 180 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చాయి. అదే విధంగా కర్ణాటక నుండి 12 కోట్ల 25 లక్షలు , తమిళనాడు + కేరళ కలిపి 1 కోటి 90 లక్షలు , హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 8 కోట్ల 85 లక్షలు వచ్చాయి. ఇక ఓవర్సీస్ నుండి అయితే దాదాపుగా 21 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 165 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు , 273 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి, మరో 54 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తే , ఈ సినిమా పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుంది.

భారత్‌పై పాకిస్తాన్‌ నిఘా.. సాయం చేస్తున్న చైనా!

Pakistan surveillance on India
Pakistan surveillance on India

Pakistan surveillance on India: దశాబ్దాలుగా స్తబ్దుగా ఉన్న తన అంతరిక్ష కార్యక్రమాన్ని పాకిస్తాన్‌ ఇటీవల హఠాత్తుగా ఉరకలెత్తిస్తోంది. చైనా సాయంతో శరవేగంగా ఉపగ్రహాలను ప్రయోగించి, భారత్‌ సరిహద్దులపై నిరంతర నిఘా ఏర్పాటు చేసుకోవాలని భావిస్తోంది. గత 16 నెలల్లోనే పాకిస్తాన్‌ ఏకంగా ఆరు భూపరిశీలన ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. ఇందులో ఆప్టికల్‌ ఇమేజింగ్, హైపర్‌స్పెక్ట్రల్, అధునాతన రిమోట్‌ సెన్సింగ్‌ సామర్థ్యాలు ఉన్న ఉపగ్రహాలు ఉన్నాయి.

సైనిక చర్యల కోసం..
పాక్‌ అధికారికంగా ఈ ఉపగ్రహాలను పౌర అవసరాలు (వ్యవసాయం, విపత్తు నిర్వహణ, నగరాభివృద్ధి) కోసం అని చెబుతున్నప్పటికీ, నిపుణులు వీటిని సైనిక ప్రయోజనాలకు కూడా వినియోగించే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు. హైపర్‌స్పెక్ట్రల్‌ ఉపగ్రహం ఏ –1 సాధారణ కెమెరాలు పసిగట్టలేని వస్తువులు, క్యామోఫ్లాజ్‌ చేసిన సైనిక వాహనాలు, దాచిన స్థావరాలను కూడా గుర్తించగలదు. పీఆర్‌ఎస్‌సీ–ఈవో2, పీఆర్‌ఎస్‌సీ–ఈవో3 వంటి ఉపగ్రహాలు అధునాతన చిత్రీకరణ, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత డేటా విశ్లేషణ సామర్థ్యాలను కలిగి ఉన్నాయి.
ఈ ఉపగ్రహాలు కలిసి పని చేయడం ద్వారా భారత్‌ సరిహద్దు ప్రాంతాలు, వ్యూహాత్మక స్థావరాలపై నిరంతరం నిఘా ఉంచడం సాధ్యపడుతుంది.

చైనా సహకారంతో..
పాక్‌ స్పేస్‌ ఏజెన్సీ గత దశాబ్దాల్లో చాలా నెమ్మదిగా ముందుకు సాగింది. కానీ ఇప్పుడు చైనా రాకెట్ల ద్వారా ఉపగ్రహాలను ప్రయోగించడం, టెక్నాలజీ బదలాయింపు, ఉమ్మడి అభివృద్ధి ద్వారా వేగం పెంచింది. రెండు దేశాల మధ్య డేటా షేరింగ్‌ కూడా జరుగుతోంది. ఈ సహకారం కేవలం అంతరిక్ష రంగానికి మాత్రమే కాకుండా, రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తోంది.

భారత సైనిక కదలికలపై నిఘా..
పాకిస్తాన్‌ ఈ ఉపగ్రహాల ద్వారా భారత్‌ సైనిక కదలికలు, సరిహద్దు ప్రాంతాల్లో మార్పులను నిరంతరం పర్యవేక్షించే సామర్థ్యం సాధించింది. ఇది భారత్‌కు కొత్త సవాలుగా మారనుంది. భారత్‌ తన స్వంత ఉపగ్రహ నెట్‌వర్క్‌ను మరింత వేగంగా విస్తరించి, కౌంటర్‌ సర్వైలెన్స్‌ సామర్థ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

దశాబ్దాల తర్వాత పాకిస్తాన్‌ అంతరిక్ష రంగంలో చూపుతున్న ఈ ఆకస్మిక చురుకుదనం సాధారణ సాంకేతిక పురోగతి కంటే ఎక్కువగా వ్యూహాత్మక ఉద్దేశ్యాలతో ముడిపడి ఉందని స్పష్టమవుతోంది. చైనా బలమైన టెక్నాలజీ మద్దతుతో పాక్‌ భారత్‌పై ఆకాశం నుంచి కన్ను వేసే సామర్థ్యం పెంచుకోవడం దక్షిణాసియా భద్రతా సమీకరణాలను మరింత క్లిష్టంగా మార్చనుంది.

నా అన్నయ్య రామ్ చరణ్ కి సెల్యూట్ చేస్తున్నాను అంటూ అక్కినేని అఖిల్ ఎమోషనల్ పోస్ట్..

Akhil emotional post on Ram Charan
Akhil emotional post on Ram Charan

Akhil emotional post on Ram Charan: నిన్న మొన్నటి వరకు రామ్ చరణ్ అభిమానులు ‘పెద్ది’ చిత్రం లో తమ అభిమాన హీరో అంత అద్భుతంగా నటిస్తే , ఒక్క స్టార్ హీరో కానీ , డైరెక్టర్ కానీ ఆయన్ని మెచ్చుకుంటూ పోస్టులు వెయ్యలేదని, రామ్ చరణ్ అంటే కుళ్ళుకుంటున్నారు అంటూ సోషల్ మీడియా లో విచారం వ్యక్తం చేశారు. కానీ నిన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పెద్ది’ చిత్రం గురించి అద్భుతంగా స్పందిస్తూ , రామ్ చరణ్ పై పొగడ్తల వర్షం కురిపించడంతో అభిమానులు చాలా సంతోషించారు. ఇప్పుడు లేటెస్ట్ గా అక్కినేని నాగ చైతన్య కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. కాసేపటి క్రితమే ఆయన ‘పెద్ది’ చిత్రం లోని రామ్ చరణ్ నటన పై ప్రశంసలు కురిపిస్తూ వేసిన ట్వీట్ బాగా వైరల్ అయ్యింది.

ఆయన మాట్లాడుతూ ‘మై డియర్ బ్రదర్ రామ్ చరణ్.. నీ కష్టం , డెడికేషన్ తో పెద్ది చిత్రాన్ని మొత్తం నడిపించావు. నీ అద్భుతమైన నటన గురించి చెప్పడానికి నా దగ్గర మాటలు సరిపోవడం లేదు. ప్రతీ క్రాఫ్ట్ లోనూ నువ్వు చూపించిన డెడికేషన్ కి సెల్యూట్ చేస్తున్నాను. పెద్ది చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచినందుకు మూవీ టీం మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతే కాకుండా ఈ చిత్రం లో నటించిన నటీనటులకు , టెక్నీషియన్స్ కి కూడా శుభాకాంక్షలు. మీరు పడిన కష్టం ప్రతీ ఫ్రేమ్ లోనూ కనిపించింది. మీ కష్టం తో ఇలాంటి క్వాలిటీ కంటెంట్ సినిమాని అందించి , మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. రామ్ చరణ్ , అఖిల్ సొంత అన్నదమ్ములు లాగా ఉంటారు అనే విషయం మన అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరి మధ్య బాండింగ్ అనేక సందర్భాల్లో బయటపడింది.

రామ్ చరణ్ పెద్ది సినిమా కోసం తన ‘లెనిన్’ చిత్రాన్ని కూడా నిర్మాతలతో మాట్లాడి వాయిదా వేయించాడు అఖిల్. ఆ స్థాయి అనుబంధం వీళ్లిద్దరి మధ్య ఉంది. టాలీవుడ్ లో దిగ్గజ స్టార్ హీరోలకు వారసులుగా ఎంట్రీ ఇచ్చి , ఏ మాత్రం ఈగో లేకుండా సాగుతున్న వీళ్లిద్దరి రిలేషన్ ని చూసి సోషల్ మీడియా లో అభిమానులు మురిసిపోతున్నారు. ఇకపోతే ‘లెనిన్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రామ్ చరణ్ ముఖ్య అతిథి గా విచ్చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. లెనిన్ ఈ చిత్రం ఈ నెల 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అఖిల్ కెరీర్ లోనే ఈ చిత్రం ది బెస్ట్ గా నిలిచిపోతుందని అంటున్నారు, చూడాలి మరి అది ఎంత వరకు నిజం అనేది.

'దృశ్యం 3' వెంకటేష్ చేయకపోవడానికి కారణం అదేనా.. సంచలనం రేపుతున్న డైరెక్టర్ వ్యాఖ్యలు..

Venkatesh New Movie
Venkatesh New Movie

Director comments on Drishyam 3: ఇండియాలో ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ లిస్ట్ తీస్తే , అందులో కచ్చితంగా ‘దృశ్యం’ సిరీస్ టాప్ స్థానం లో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మలయాళం లో మోహన్ లాల్ హీరో గా నటించిన , ‘దృశ్యం’ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. ఆ తర్వాత ఈ చిత్రాన్ని తెలుగు , తమిళం , హిందీ భాషల్లో రీమేక్ చేశారు. అక్కడ కూడా ఇదే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో విక్టరీ వెంకటేష్ ఎంత అద్భుతంగా నటించాడో మన కళ్లారా చూశాము. ఇక ఆ తర్వాత సీక్వెల్ కేవలం మలయాళం తో పాటు తెలుగు హిందీ భాషల్లో కూడా తెరకెక్కింది. కరోనా లాక్ డౌన్ కారణంగా తెలుగు , మలయాళం వెర్షన్స్ డైరెక్ట్ గా ఓటీటీ లోనే విడుదలయ్యాయి , కానీ హిందీ వెర్షన్ మాత్రం థియేటర్స్ లో విడుదలై సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది.

రీసెంట్ గానే ‘దృశ్యం 3’ మలయాళం లో భారీ అంచనాల నడుమ విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. టాక్ అయితే డివైడ్ గానే వచ్చింది కానీ , సినిమాకు కూడా కలెక్షన్స్ వేరే లెవెల్ లో వచ్చాయి. కేవలం 30 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగితే, ఇప్పటి వరకు ఈ చిత్రానికి 240 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దీన్ని బట్టీ ఏ రేంజ్ లో లాభాలు నిర్మాతకు వచ్చాయో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రానికి వచ్చిన కలెక్షన్స్ ని చూసి , ‘దృశ్యం 4’ ని కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాని తెలుగు లో విక్టరీ వెంకటేష్ చేయకపోవడానికి గల కారణాన్ని ఆ చిత్ర డైరెక్టర్ జీతూ జోసఫ్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.

ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమా క్లైమాక్స్ ని వెంకటేష్ గారు నచ్చలేదు. తన మీద అలాంటి క్లైమాక్స్ వర్కౌట్ అవ్వడం కష్టమని అన్నారు. అంతే కాకుండా, ఇప్పటి మార్కెట్ పరిస్థితులు కూడా మారడం తో , ఈ రీమేక్ ని ఆయన రిజెక్ట్ చేసాడు. కానీ హిందీ లో అజయ్ దేవగన్ గారు ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. షూటింగ్ కూడా చాలా వరకు అయిపోయింది’ అంటూ చెప్పుకొచ్చాడు జీతూ జోసఫ్. ప్రస్తుతం మన టాలీవుడ్ లో రీమేక్ సినిమాల హవా బాగా తగ్గిపోయింది. పైగా విక్టరీ వెంకటేష్ ఇప్పుడు 300 కోట్ల గ్రాస్ సినిమాలో హీరో గా నటించి, తన రేంజ్ ని బాగా పెంచుకున్నాడు. కాబట్టి, ఇలాంటి సమయం లో ఈ చిత్రం లో నటించడం కరెక్ట్ కాదని ఆయన నిర్ణయం తీసుకున్నాడు అంటూ విక్టరీ వెంకటేష్ అభిమానులు చెప్పుకొచ్చారు.

పవన్ కళ్యాణ్ వదిలేసిన కథ ని పట్టుకున్న బాలయ్య.. సూపర్ హిట్ అందుకుంటాడా?

Balakrishna
Balakrishna

Balakrishna new movie story: పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను వదిలేసినా సందర్భాలు ఉన్నాయి. టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ డైరెక్టర్స్ గా పిలవబడే ప్రతీ ఒక్కరికి పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చెయ్యాలని కోరిక ఉంటుంది. ఆయన్ని కలిసి ఒక కథ వినిపించాలనే ప్రయత్నాలు చాలానే చేశారు. కొన్ని కథలు విని రిజెక్ట్ చేశాడు , కొన్ని అయితే వినకుండానే రిజెక్ట్ చేశాడు . అలా రీసెంట్ గానే ఆయన ఒక క్రేజీ డైరెక్టర్ చెప్పిన కథని రిజెక్ట్ చేశాడు . ఆ డైరెక్టర్ మరెవరో కాదు , కొరటాల శివ. 6 నెలల క్రితం ఈయన పవన్ కళ్యాణ్ ని కలిసి ఒక పవర్ ఫుల్ కథ ని వినిపించాడట. సుమారుగా మూడు గంటల పాటు న్యారేషన్ ఇచ్చాడట. కానీ ఎందుకో పవన్ కళ్యాణ్ ఈ కథ ని రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.

తన ఇమేజ్ కి ఇలాంటి కథ సూట్ అవ్వదని , అభిమానులు తీసుకోలేరని చెప్పాడట. ఇప్పుడు ఆ కథని నందమూరి బాలకృష్ణ చేస్తున్నాడు. రీసెంట్ గానే ఈ ప్రాజెక్ట్ ని గ్రాండ్ గా ప్రకటించారు. త్వరలోనే షూటింగ్ కార్యక్రమాలు మొదలు కాబోతున్నాయి. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ఇంతటి క్రేజ్ ప్రాజెక్ట్ ని పవన్ కళ్యాణ్ మిస్ చేసుకున్నందుకు అభిమానులు బాధపడుతున్నారు. అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి చూస్తే , ఈ చిత్రం కథ రీసెంట్ గా విడుదలైన అర్జున్ సూపర్ హిట్ మూవీ ‘బ్లాస్ట్’ తో పోలి ఉంటుందట. ఇలాంటి కథలు పవన్ కళ్యాణ్ కి సూట్ అవుతాయా అంటే అనుమానమే, ఆయన సినిమాల్లో కేవలం ఆయన మాత్రమే హైలైట్ అవ్వాలి , మిగిలిన నటీనటులు కనపడరు , అభిమానులు ఆ స్థాయిలో ఆయన్ని ఊహించుకుంటారు.

అలాంటి ఇమేజ్ ఉన్న హీరో సినిమాలో , లేడీ క్యారెక్టర్స్ కి హీరో తో సమానమైన ఎలివేషన్స్ ఇస్తే , ఆడియన్స్ తీసుకోవడం కష్టమే , పవన్ కళ్యాణ్ ఈ చిత్రం రిజెక్ట్ చేసి మంచి పని చేశాడంటూ కొంతమంది అభిమానులు అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసి మంచి పని చేశాడా లేదా అనేది సినిమా విడుదల వరకు చెప్పలేం. కనీసం టీజర్ విడుదలైనా ఒక అంచనా కి వచ్చేయొచ్చు. ఇకపోతే ఈ చిత్రం లో విలన్ గా సీనియర్ హీరో రాజశేఖర్ నటించబోతున్నట్టు లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ , త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఈ చిత్రం సౌత్ లోనే మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ గా నిలుస్తుందని అంటున్నారు , అందులో ఎంత వరకు నిజముందో చూడాలి.