Homeఎంటర్టైన్మెంట్Director comments on Drishyam 3: 'దృశ్యం 3' వెంకటేష్ చేయకపోవడానికి కారణం అదేనా.. సంచలనం...

Director comments on Drishyam 3: ‘దృశ్యం 3’ వెంకటేష్ చేయకపోవడానికి కారణం అదేనా.. సంచలనం రేపుతున్న డైరెక్టర్ వ్యాఖ్యలు..

Director comments on Drishyam 3: ఇండియాలో ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ లిస్ట్ తీస్తే , అందులో కచ్చితంగా ‘దృశ్యం’ సిరీస్ టాప్ స్థానం లో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మలయాళం లో మోహన్ లాల్ హీరో గా నటించిన , ‘దృశ్యం’ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. ఆ తర్వాత ఈ చిత్రాన్ని తెలుగు , తమిళం , హిందీ భాషల్లో రీమేక్ చేశారు. అక్కడ కూడా ఇదే […]

Director comments on Drishyam 3: ఇండియాలో ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ లిస్ట్ తీస్తే , అందులో కచ్చితంగా ‘దృశ్యం’ సిరీస్ టాప్ స్థానం లో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మలయాళం లో మోహన్ లాల్ హీరో గా నటించిన , ‘దృశ్యం’ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. ఆ తర్వాత ఈ చిత్రాన్ని తెలుగు , తమిళం , హిందీ భాషల్లో రీమేక్ చేశారు. అక్కడ కూడా ఇదే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో విక్టరీ వెంకటేష్ ఎంత అద్భుతంగా నటించాడో మన కళ్లారా చూశాము. ఇక ఆ తర్వాత సీక్వెల్ కేవలం మలయాళం తో పాటు తెలుగు హిందీ భాషల్లో కూడా తెరకెక్కింది. కరోనా లాక్ డౌన్ కారణంగా తెలుగు , మలయాళం వెర్షన్స్ డైరెక్ట్ గా ఓటీటీ లోనే విడుదలయ్యాయి , కానీ హిందీ వెర్షన్ మాత్రం థియేటర్స్ లో విడుదలై సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది.

రీసెంట్ గానే ‘దృశ్యం 3’ మలయాళం లో భారీ అంచనాల నడుమ విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. టాక్ అయితే డివైడ్ గానే వచ్చింది కానీ , సినిమాకు కూడా కలెక్షన్స్ వేరే లెవెల్ లో వచ్చాయి. కేవలం 30 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగితే, ఇప్పటి వరకు ఈ చిత్రానికి 240 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దీన్ని బట్టీ ఏ రేంజ్ లో లాభాలు నిర్మాతకు వచ్చాయో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రానికి వచ్చిన కలెక్షన్స్ ని చూసి , ‘దృశ్యం 4’ ని కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాని తెలుగు లో విక్టరీ వెంకటేష్ చేయకపోవడానికి గల కారణాన్ని ఆ చిత్ర డైరెక్టర్ జీతూ జోసఫ్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.

ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమా క్లైమాక్స్ ని వెంకటేష్ గారు నచ్చలేదు. తన మీద అలాంటి క్లైమాక్స్ వర్కౌట్ అవ్వడం కష్టమని అన్నారు. అంతే కాకుండా, ఇప్పటి మార్కెట్ పరిస్థితులు కూడా మారడం తో , ఈ రీమేక్ ని ఆయన రిజెక్ట్ చేసాడు. కానీ హిందీ లో అజయ్ దేవగన్ గారు ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. షూటింగ్ కూడా చాలా వరకు అయిపోయింది’ అంటూ చెప్పుకొచ్చాడు జీతూ జోసఫ్. ప్రస్తుతం మన టాలీవుడ్ లో రీమేక్ సినిమాల హవా బాగా తగ్గిపోయింది. పైగా విక్టరీ వెంకటేష్ ఇప్పుడు 300 కోట్ల గ్రాస్ సినిమాలో హీరో గా నటించి, తన రేంజ్ ని బాగా పెంచుకున్నాడు. కాబట్టి, ఇలాంటి సమయం లో ఈ చిత్రం లో నటించడం కరెక్ట్ కాదని ఆయన నిర్ణయం తీసుకున్నాడు అంటూ విక్టరీ వెంకటేష్ అభిమానులు చెప్పుకొచ్చారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper