Home Blog Page 157

నీకు అవసరమా.. జగన్ తెలుగు భాష పై ట్రోల్స్!

YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: వైయస్ జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వస్తే చాలు.. సోషల్ మీడియాలో మీమ్స్, రీల్స్ దర్శనం ఇస్తుంటాయి. నిన్ననే ఆయన విశాఖలో స్టీల్ ప్లాంట్ బాధితుల పరామర్శకు వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మరోసారి అదే తడబాటుతో అడ్డంగా బుక్కయ్యారు. అప్పటినుంచి సోషల్ మీడియాకు ఆయన టార్గెట్ అయ్యారు. గతంలో నారా లోకేష్ విషయంలో వైసీపీ సోషల్ మీడియా ఇలానే టార్గెట్ చేసేది. ఆయన బయటకు వచ్చి ఏం మాట్లాడుతారా.. ఎలా ట్రోల్స్ చేయాలా అని చూసేది. కానీ ఇప్పుడు అదే ట్రోల్స్ కు బాధితుడు అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి. మానవీయ కోణం అనలేక.. పక్కన ఉన్నవారు ప్రామిటింగ్ ఇవ్వడంతో అతి కష్టం మీద సర్దుకుని మాట్లాడారు.

* మాట్లాడకుండా ఉండడమే మంచిది..
జగన్మోహన్ రెడ్డి ఒక పని చేయాలి. అచ్చ తెలుగు వ్యాఖ్యలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ప్రెస్మీట్లో కొన్ని తప్పుడు వ్యాఖ్యలు చేస్తారు. తనకు తెలుగు పెద్దగా తెలియదని మళ్లీ చెప్పుకొస్తారు. కానీ స్టీల్ ప్లాంట్ ఘటనకు సంబంధించిన విషయాలు చెప్పేటప్పుడు చాలా సీరియస్ గా ఉంటుంది పరిస్థితి. ఆవేశపూరితంగా మాట్లాడారు. ఆ మాటల్లోనే తప్పులు ధ్వనించాయి. అప్పటినుంచి సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా ట్రోల్స్ వీర లెవెల్లో దర్శనం ఇస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. తమ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడకుండా ఉండడమే మేలని సొంత పార్టీ వారే వ్యాఖ్యానించే దాకా పరిస్థితి వచ్చింది. అసలు ఆయన అచ్చ తెలుగు ఎందుకు మాట్లాడాలి? అడ్డంగా ఎందుకు బుక్ కావాలి? అన్నవారు కూడా ఉన్నారు.

* అప్పట్లో లోకేష్ టార్గెట్..
వాస్తవం మాట్లాడుకుంటే.. ఇదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నారా లోకేష్ ను ఏ విధంగా టార్గెట్ చేశాయో తెలియంది కాదు. విదేశాల్లో చదువుకొని వచ్చిన నారా లోకేష్ అప్పట్లో తెలుగు మాట్లాడడానికి ఇబ్బంది పడేవారు. ఆయన ఎప్పుడు మీడియా ముందు మాట్లాడతారా.. ఎప్పుడు ట్రోల్ చేద్దామా అని ఎదురు చూసేవారు. చివరకు మాజీ మంత్రి రోజా లాంటి వారు సైతం.. లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తామని సిద్ధపడగా.. ఒకసారి మంగళగిరి అని లోకేష్ వ్యాఖ్యానిస్తే చాలు అన్నంత రీతిలో టార్గెట్ చేశారు. చివరకు లోకేష్ పాదయాత్ర సమయంలో కూడా వేలమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు ఆయనను అనుసరించారు. అయితే ఇప్పుడు అదే లోకేష్ పరిణితి తో మాట్లాడుతున్నారు. తెలుగు చాలా అలవోకగా చెప్పేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం.. ఏవేవో మాట్లాడుతూ.. నోరు తిరగని వ్యాఖ్యలు చేస్తూ.. అడ్డంగా బుక్ అవుతుండడంతో వైసీపీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి.

సముద్ర తీరంలో రెండు ఆత్మలు.. గుండె ధైర్యం ఉన్నవారే అక్కడికి వెళ్లాలి.. ఎక్కడ ఈ ప్రదేశం.. ఏమా కథ

Quirpon Island Mystery
Quirpon Island Mystery

Quirpon Island Mystery: విశాలంగా సముద్రం.. అంతకంటే స్వచ్ఛమైన తీరం.. చుట్టూ కొండలు.. వాటిని ఆనుకొని ఉన్న వృక్షాలు.. చదువుతుంటే ఆ ప్రాంతం వద్దకు వెళ్లాలి అనిపిస్తోంది కదూ.. అక్కడ హాయిగా సేదతీరి.. ఆనందంగా ఆ ప్రాంతాన్ని తనివి తీరా చూడాలని ఉంది కదూ.. కాకపోతే ఇది ఒక యాంగిల్ మాత్రమే.. ఇంకో యాంగిల్ లో దయ్యాలు ఉంటాయి. అవి చూపించే చుక్కలు కూడా ఉంటాయి.

కెనడా దేశంలోని అట్లాంటిక్ మహాసముద్రంలో న్యూ ఫౌండ్ ల్యాండ్ అనే తీరం ఉంటుంది. దానికి అవతలి భాగంలో క్విర్పాన్ ఐలాండ్ అనే దీవి ఉంటుంది. ఈ దీవిలోకి మొన్నటి వరకు ఎవరు వెళ్లేవారు కాదు. దీని వెనక వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ దీవికి దయ్యాల పేరు రావడానికి ఒక కారణం ఉంది. సరిగ్గా 16వ శతాబ్దంలో ఫ్రెంచ్ నావికుడు కెప్టెన్ ఫ్రాంక్ యిస్ 1542లో తన సైనికులతో కలిసి నౌక యాత్రకు వెళ్లిపోయాడు. ఆ నౌకలో ఫ్రాంకోయిస్ బంధువు మార్గరెట్ కూడా ఉంది. అయితే ఆమె మీద ఫ్రాంకోయిస్ కు ప్రేమ ఉండేది. అతడి ప్రేమ ఆమెకు నచ్చేది కాదు.

ఈ నౌకలో ప్రయాణిస్తున్నప్పుడే ఆమె ఆ సైన్యంలో పనిచేసే ఒక యువ సైనికుడు మీద ప్రేమ పెంచుకుంది. అది కాస్త శారీరక సంబంధానికి దారి తీసింది. తనను కాదని ఒక సైనికుడిని ఆమె ప్రేమించడం.. శారీరకంగా సాన్నిహి త్యం పెంచుకోవడం.. ఫ్రాంకోయిస్ కు ఏమాత్రం నచ్చలేదు. పైగా తాను నచ్చిన అమ్మాయిని అతడు ప్రేమించడం.. వశం చేసుకోవడం అతడు తట్టుకోలేకపోయాడు. అంతే వారిద్దరిని ఈ దీవిలో పడేసి వెళ్లిపోయాడు.

ఎటు వెళ్లాలో తెలియక.. బతికి బట్ట కట్టే మార్గం అర్థం కాక వారిద్దరు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు. బయటికి వచ్చే ప్రయత్నం చేసే క్రమంలో ఆకలికి తట్టుకోలేక చనిపోయారు. అప్పటినుంచి వారిద్దరి ఆత్మలు అక్కడ సంచరించేవి. ఆ ప్రాంతంలోకి వెళ్లే వారిని తీవ్రంగా హింసించేవి. కొన్ని సందర్భాలలో క్రూరంగా చంపేసేవి. రాత్రి సమయాల్లో వింత శబ్దాలు.. వింత వింత మాటలు.. వింత ఆకారంలో ఉన్న జంతువులు కనిపించేవని అక్కడివారు చర్చించుకుంటారు. అయితే ఇటీవల కాలంలో ఈ ప్రాంతాన్ని కొంతమంది సందర్శిస్తున్నారు. అయితే పగటిపూట మాత్రమే వారు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు. రాత్రిపూట ఉండడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. అకస్మాత్తుగా ఇక్కడ గాలులు రావడం.. సముద్రపు అలలు పొంగడం.. వింత వింత శబ్దాలు వినిపించడం.. వంటివి చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఔత్సాహికులు కూడా పగటిపూట వరకే తమ ప్రయాణాన్ని సాగిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం అక్కడ ఆత్మలు లేవని.. దయ్యాలు కూడా లేవని వాదిస్తున్నారు. ప్రత్యక్షంగా ఆ అనుభవాలను ఎదుర్కొన్న వారు మాత్రం మరోసారి ఆ ప్రాంతానికి వెళ్లడానికి ఇష్టపడడం లేదు.

ఈ రాశి వ్యాపారులు ఈరోజు ఏదంటే అది జరుగుతుంది..

Today 4 July 2026 Horoscope
Today 4 July 2026 Horoscope

Today 11 June 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై అశ్విని నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకోకుండా ధన లాభం జరగనుంది. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈ రోజు అన్ని అనుకున్న పనులను పూర్తి చేస్తారు. కొన్ని సమస్యలు తొలగిపోవడంతో మనశ్శాంతి ఉంటుంది. అవసరమైన మీరకే ఖర్చులు పెట్టాలి. జీవిత భాగస్వామితో ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. దీంతో కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారి వ్యక్తిగత జీవితం ఈరోజు సంతోషంగా గడుస్తుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తను వింటారు. అధికారుల నుంచి ప్రశంసలు ఉండడంతో ఉద్యోగులు మనశాంతితో గడుపుతారు. అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈ రోజు కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. అధికారుల నుంచి ఉద్యోగులకు కాస్త ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేసే సమయంలో తోటి వారి సహకారం తీసుకోవాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల ముఖ్యమైన పనులను పూర్తిచేసుకోగలుగుతారు

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా గడుస్తుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. కొన్ని కీలక నిర్ణయాల వల్ల భవిష్యత్తు బాగుండే అవకాశం ఉంది. వ్యాపారులు కొత్తగా పెట్టుబడును పెడతారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెద్దల అండదండలతో కొత్తగా పెట్టుబడులు పెడతారు. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా గడుస్తుంది ఉద్యోగులు ప్రమోషన్ గురించి శుభవార్తలు వింటారు. గ్రహాలు అనుకూలంగా ఉండడంతో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారి పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆగిపోయిన పనులను ఈరోజు పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు అపారమైన లాభాలు ఉండే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను పూర్తి చేస్తారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి నిరుద్యోగులు ఈరోజు కొత్త శుభవార్తలు విని అవకాశం ఉంది. కుటుంబ సమస్యలు తొలగిపోవడంతో మనశ్శాంతి ఉండే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బకాయిలను తిరిగి వసూలు చేసుకుంటారు. స్నేహితుల సహకారంతో దూర ప్రయాణాలు చేస్తారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు అపారమైన లాభాలు ఉంటాయి. స్నేహితులతో సరదాగా ఉంటారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ పనులకు సంబంధించి బిజీగా ఉంటారు. వ్యాపారులు ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు వివాదాల్లోకి తల దూర్చకుండా ఉండాలి. కొత్తగా పెట్టుబడులు పెడతారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని సానుకూల ఫలితాలే ఉంటాయి. కుటుంబ బాధ్యతలను నెరవేరుస్తారు. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కొత్త ఆస్తిని కొనుగోలు చేస్తారు. అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల అండదండలు ఉంటాయి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. తల్లిదండ్రులు అండదండలతో కొత్త పెట్టుబడులు పెడతారు. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా గడుస్తుంది. ఉద్యోగులు తోటి వారి సహకారంతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు.

9 నెలల్లో 900 కోట్లు.. చరిత్ర తిరగరాసిన మెగా హీరోలు.. కం బ్యాక్ అదుర్స్..

Mega Heroes Comeback
Mega Heroes Comeback

Mega Heroes Comeback: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత అభిమానులకు పూనకాలు రప్పించే రేంజ్ లో కం బ్యాక్ ఇవ్వడం మెగా ఫ్యామిలీ కి కొత్తేమి కాదు. భోళా శంకర్ , గేమ్ చేంజర్ , బ్రో , హరి హర వీరమల్లు , ఇలా వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో మెగా ఫ్యాన్స్ ని టార్చర్ చేశారు ఈ ముగ్గురు మెగా హీరోలు. ఇలాంటి సినిమాలు తీయడం కంటే , ముగ్గురు రిటైర్మెంట్ ఇచ్చేస్తే ప్రశాంతంగా ఉంటాం కదా అని సోషల్ మీడియా లో ట్వీట్లు కూడా వేసేవారు. అలాంటి సమయం లో ‘ఓజీ’ చిత్రం నుండి మెగా ఫ్యామిలీ కి గోల్డెన్ డేస్ మొదలయ్యాయి. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ఓజీ’ చిత్రానికి , ఆడియన్స్ నుండి డివైడ్ టాక్ వచ్చింది , సెకండ్ హాఫ్ అసలు బాలేదంటూ కామెంట్స్ చేశారు.

కానీ సినిమాకు విపరీతమైన క్రేజ్ ఉండడం వల్ల, ఆ డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కూడా 320 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. హిందీ వెర్షన్ లో ఈ చిత్రం నేషనల్ మల్టీప్లెక్స్ థియేటర్స్ లో విడుదల కాలేదు , లేదంటే 400 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఉండేది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఓపెనింగ్స్ లో మెగా ఫ్యాన్స్ మరోసారి గర్వంగా కాలర్ ఎగరేసుకునేలా చేసింది ఈ చిత్రం. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది , ఓవర్సీస్ లో ఏకంగా 5 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను ప్రీమియర్స్ నుండి రాబట్టి , సెన్సేషన్ సృష్టించింది. ఈ సినిమా విడుదలైన మూడు నెలలకే మెగాస్టార్ చిరంజీవి కూడా గ్రాండ్ కం బ్యాక్ ఇచ్చాడు. ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు ‘ సంక్రాంతి కానుకగా విడుదలై 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ప్రాంతీయ బాషా చిత్రాల విభాగం లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా కూడా నిల్చింది. ఇక రీసెంట్ గా విడుదలైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు మొదట రోజు మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఆ టాక్ కి తగ్గట్టుగానే ఓపెనింగ్ వసూళ్లు అదిరిపోయాయి , ప్రపంచవ్యాప్తంగా 270 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కేవలం 6 రోజుల్లోనే రాబట్టింది. ఫుల్ రన్ లో ఈ చిత్రం కచ్చితంగా 350 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అంటే కేవలం 9 నెలల్లోనే 900 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మెగా హీరోల సినిమాల నుండి వచ్చాయి అన్నమాట. ఈ కం బ్యాక్ మెగా ఫ్యాన్స్ కి ఎక్కడలేని ఊపు ని తీసుకొచ్చింది.

నాకు అవకాశాలు లేని సమయంలో అన్నం పెట్టింది వాళ్ళే అంటూ హీరో అబ్బాస్ ఎమోషనల్ కామెంట్స్..

Abbas Emotional Comments
Abbas Emotional Comments

Abbas Emotional Comments: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు అబ్బాస్. ముఖ్యంగా అమ్మాయిల్లో ఈయనకు ఉన్నటువంటి క్రేజ్ , అప్పట్లో ఏ హీరో కి ఉండేది కాదు. ప్రేమ దేశం చిత్రం తో వెండితెర అరంగేట్రం చేసిన ఈయన , తొలిసినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత ఆయన హీరో గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు కానీ , స్టార్ స్టేటస్ ని మాత్రం సంపాదించలేకపోయాడు. ఒకానొక సమయం లో ఆయనకు వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ రావడం వల్ల, ఫేడ్ అవుట్ అయిపోయాడు. దీంతో ఆయన్ని హీరో గా పెట్టి సినిమాలు తీయడానికి నిర్మాతలు ధైర్యం చెయ్యలేని పరిస్థితి రావడం తో , ఇతర హీరోల సినిమాల్లో క్యారక్టర్ రోల్స్ చేయడం మొదలు పెట్టాడు. కొన్నాళ్ళకు ఆ క్యారెక్టర్ రోల్స్ కూడా రావడం ఆగిపోయాయి .

ఆ సమయం లో తనకు ఎదురైనా సంఘటన గురించి రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు అబ్బాస్. ఆయన మాట్లాడిన ఈ మాటలు వింటే , అయ్యో పాపం అనిపించక తప్పదు. ఆయన మాట్లాడుతూ ‘ఒకానొక సమయం లో నాకు సినిమా అవకాశాలు రావడం పూర్తిగా ఆగిపోయాయి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. అలాంటి కఠినమైన సమయం లో హార్పిక్ బ్రాండ్ కి నేను చేసిన యాడ్ నా జీవితానికి ఎంతో ఉపయోగపడింది. దాదాపుగా ఆ యాడ్ కాంట్రాక్టు కి 8 సంవత్సరాలు పని చేసాను. దాని ద్వారా వచ్చిన డబ్బుతోనే నేను ఆర్థికంగా స్థిరపడ్డాను అని గర్వం గా చెప్పుకోగలను. ఆ బ్రాండ్ యాజమాన్యం అన్నేళ్లు నన్ను పెంచి పోషించింది. సమాజం ఏమనుకున్నా సరే, హార్పిక్ యాడ్ వాళ్ళ నా కంచం లోక్ అన్నం ముద్ద వచ్చింది. వాళ్ళే నాకు అన్నం పెట్టారు , జీవితం లో ఎప్పటికీ వాళ్ళని మర్చిపోలేను’ అంటూ చెప్పుకొచ్చాడు అబ్బాస్. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

ఇకపోతే రీసెంట్ గానే ఆయన సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. జీవీ ప్రకాష్ కుమార్ హీరో గా నటించిన ‘హ్యాపీ రాజ్’ అనే చిత్రం లో అబ్బాస్ ఒక కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా కమర్షియల్ గా మంచి హిట్ అయ్యింది. ఓటీటీ లో కూడా ఆడియన్స్ నుండి ఈ చిత్రం మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. హ్యాపీ రాజ్ లో నాకు అద్భుతమైన పాత్ర దొరికిందని , భవిష్యత్తులో ఇలాంటి పాత్రలు వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చాడు . మరి ఈ సెకండ్ ఇన్నింగ్స్ అబ్బాస్ కి ఎలా ఉండబోతుందో రాబోయే రోజుల్లో చూడాలి.

రామ్ చరణ్ , సుకుమార్ సినిమా ఇప్పట్లో లేనట్టేనా.. ? మళ్లీ అదే మిస్టేక్ చేస్తున్న చరణ్..

Ram Charan And Sukumar
Ram Charan And Sukumar

Ram Charan And Sukumar: ఇండియా లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకరు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ . డైరెక్టర్స్ సరిగ్గా ఉపయోగించుకోవాలి కానీ , పాన్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయగల సత్తా రామ్ చరణ్ కి ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన టాలీవుడ్ కి గొప్ప పేరు ప్రఖ్యాతలు తీసుకొని రాగల అరుదైన సంపద రామ్ చరణ్. ఇలాంటి సూపర్ స్టార్ ఏడాది కనీసం రెండు సినిమాలైనా చేస్తే , ఇండస్ట్రీ చాలా పచ్చగా ఉంటుంది , థియేటర్స్ కళకళలాడుతాయి. కానీ అది జరగడం లేదు , ఈయన ఒక్కో సినిమా చేయడానికి రెండు నుండి మూడేళ్ళ సమయం తీసుకుంటున్నాడు , ఆ కారణం చేత రామ్ చరణ్ అప్పుడప్పుడు రేస్ లో వెనకబడినట్టుగా మన అందరికీ అనిపిస్తూ ఉంటుంది. #RRR తర్వాత దాదాపుగా మూడేళ్లు ‘గేమ్ చేంజర్ ‘ చిత్రానికి డేట్స్ కేటాయించాడు.

ఆ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన మరో ఏడాదిన్నర ‘పెద్ది’ చిత్రానికి కేటాయించాడు. రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఓపెనింగ్స్ నుండి , లాంగ్ రన్ వరకు అద్భుతాలు నెలకొల్పుతూ ముందుకు దూసుకెళ్తుంది. 6 రోజుల్లోనే 275 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టి , 300 కోట్ల గ్రాస్ వైపు పరుగులు తీస్తోంది. అయితే ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ సుకుమార్ తో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు అవుతుందో తెలియని పరిస్థితి. ఇప్పటికీ సుకుమార్ ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ని పూర్తి చేయలేదట, ఏ జానర్ లో సినిమా చెయ్యాలి అనేది కూడా ఫిక్స్ అవ్వలేదట.

ఈ ఏడాది అక్టోబర్ ,లేదా నవంబర్ నెలలో ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి అవ్వుద్దని , వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ నుండి షూటింగ్ కార్యక్రమాలు మొదలు అవుతాయని అంటున్నారు. సుకుమార్ తన ప్రతీ సినిమాని పూర్తి చేయడానికి ఎంత సమయం తీసుకుంటాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ చిత్రానికి కూడా ఆయన కనీసం రెండేళ్ల సమయం తీసుకునే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే రామ్ చరణ్ అభిమానులు మరోసారి నిరాశ చెందక తప్పదు. ఇలా ఒక్కో సినిమాని పూర్తి చేయడానికి ఇన్నేళ్ల సమయం తీసుకుంటే , జెన్ జీ ఆడియన్స్ మనకి కనెక్ట్ అవ్వరని , రాబోయే రోజుల్లో వాళ్ళ రాజ్యమే సినీ ఇండస్ట్రీ లో నడుస్తుందని , రామ్ చరణ్ ఇది అర్థం చేసుకోకుంటే కష్టమని , చేసిన తప్పునే మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తున్నాడంటూ సోషల్ మీడియా లో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

షూటింగ్ సెట్స్ లో క్రికెట్ ఆడుకుంటున్న ప్రభాస్ , శృతి హాసన్.. వీడియో వైరల్..

Prabhas Cricket Video
Prabhas Cricket Video

Prabhas Cricket Video: ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు ఆయన సమాంతరంగా ‘ఫౌజీ’, ‘కల్కి 2’ చిత్రాల షూటింగ్స్ లో కూడా పాల్గొంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఈ ఏడాది ఆరంభం లో సంక్రాంతి కానుకగా, ఆయన హీరో గా నటించిన ‘రాజా సాబ్’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఈ చిత్రం తర్వాత ఆయన ‘ఫౌజీ’ తో భారీ కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో కానీ , వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా కానీ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదంతా పక్కన పెడితే ప్రభాస్ షూటింగ్ సెట్స్ లో ఎంత సరదాగా ఉంటాడో చెప్పడానికి రీసెంట్ గా సోషల్ మీడియా లో ఒక వీడియో బాగా వైరల్ అయ్యింది.

ఇది సలార్ మూవీ షూటింగ్ సమయానికి సంబంధించిన వీడియో. ఈ వీడియో లో సలార్ టీం సరదాగా క్రికెట్ ఆడుతుండడం మనం చూడొచ్చు. హీరోయిన్ శృతి హాసన్ బ్యాటింగ్ చేస్తుండగా , ప్రభాస్ బౌలింగ్ చేస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించిన ప్రశాంత్ నీల్ వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. ‘సలార్’ చిత్రం లో ప్రభాస్ చిన్న పిల్లలతో కలిసి క్రికెట్ ఆడే సన్నివేశం మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఆ సన్నివేశం సమయం లో షాట్ మధ్యలో వచ్చిన బ్రేక్ లో , ఇలా మూవీ టీం మొత్తం కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అభిమానులను విశేషంగా ఆకర్షిస్తున్న ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ఇలాంటి అద్భుతమైన జ్ఞాపాకాలు సలార్ మూవీ షూటింగ్ సమయం లో చాలానే ఉన్నాయట.

చూసేందుకు బాగోలేదని పక్కన పెట్టకండి.. దీన్ని తింటే ఎన్ని లాభాలో తెలుసా..

Health Benefits Of Figs
Health Benefits Of Figs

Health Benefits Of Figs: ఆ పండు చూసేందుకు మామిడి పండులాగా మెరిసిపోదు. ద్రాక్ష పళ్ళ లాగా ఆసక్తిగా ఉండదు. నలుపు.. ముదురు ఆకుపచ్చ వర్ణంలో ఉంటుంది. కొనడానికి అంతగా మనసు ఒప్పుకోదు. దానిని తినాలంటే కూడా అంతగా ఆసక్తి ఉండదు. ఎందుకంటే దానిని మొత్తం ఒలిచి చూస్తే మేడిపండు లో పురుగుల మాదిరిగా ఉంటుంది. కానీ దానిని తింటే ఉంటుంది..

చాలామందికి పై ఉపోద్ఘాతం చాలా సందర్భాల్లో అనుభవంలోకి వచ్చే ఉంటుంది. ఆ పండు మరి ఏంటో కాదు అంజీర్. ఇది రాజస్థాన్ రాష్ట్రంలో నీటి సరఫరా అధికంగా ఉన్న ప్రాంతాలలో పండుతూ ఉంటుంది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సాగు చేస్తూ ఉన్నారు. కొంతమంది ఔత్సాహిక రైతులు వేరే ప్రాంతాల నుంచి మొక్కలను తీసుకొచ్చి అంజీర్ సాగు చేస్తున్నారు. అంజీర్ మామూలు పండ్ల మొక్క కాదు.. ఇది తక్కువ ఎత్తులో పెరుగుతుంది. నాటిన ప్రతి కాలం నుంచే కాపుకు వస్తుంది. దీని కాయలు పక్వానికి వచ్చినప్పుడు ముదురు నలుపు ఆకుపచ్చ రంగులోకి మారుతాయి.. అందులో ఉన్న గుజ్జు ఎర్రగా కనిపిస్తుంది.. దానిని తింటే పోషకాలు విపరీతంగా లభిస్తుంటాయి.

కీళ్ల నొప్పులతో బాధపడేవారు.. గుండె జబ్బులతో ఇబ్బంది పడేవారు.. కండరాలను బలోపేతం చేసుకోవాలి అనుకునేవారు.. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి అనుకునేవారు.. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలి అనుకునేవారు.. చర్మాన్ని కాంతివంతంగా ఉంచుకోవాలి అనుకునేవారు.. కచ్చితంగా ప్రతిరోజు రెండు నుంచి నాలుగు వరకు అంజీర్ పండ్లను తినాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్లను అధిక మోతాదులో తీసుకుంటే విరోచనాలు.. కడుపు ఉబ్బరం వంటి సమస్య ఎదురవుతుందని వైద్యులు అంటున్నారు.

అంజీర్ పండ్లు రుచికి తీపిగా ఉంటాయి.. ఈ పండులో పోషకాలు అధిక మోతాదులో ఉంటాయి. మధుమేహం.. ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ పండ్లను వైద్యుల సలహా మేరకు తీసుకోవాల్సి ఉంటుంది.

గమనిక

ఈ కథనం కేవలం పాఠకులకు అవగాహన కల్పించడానికి మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లో వైద్యుల చికిత్సకు ప్రత్యామ్యాయం కాదు. దీనిని పాఠకులు గుర్తించాలని మనవి.

ఫోన్ పే, గూగుల్ పే.. మీ జేబులకు ఎలా చిల్లు పెడుతున్నాయో తెలుసా..

Digital Payments
Digital Payments

Digital Payments: ఒకప్పుడు పర్సులో నగదు పెట్టుకుని వెళ్లేవాళ్ళు. ఏవైనా ఖర్చులకు ఆ డబ్బులను చెల్లించేవాళ్ళు. ఒకవేళ జేబులో డబ్బులు లేకపోతే వాటిని కొనుగోలు చేసేవారు కాదు. అత్యవసరం అనుకుంటే అప్పు తీసుకొచ్చి ఆ వస్తువులు కొనుగోలు చేసేవారు.. ఆ తర్వాత అప్పులు తీర్చేవారు. ఇదంతా ఒక పద్ధతి. అందువల్లే చాలా కుటుంబాలలో ఆర్థిక స్థిరత్వం కొనసాగుతూ ఉండేది.

ఇప్పుడు జేబులో డబ్బు లేకపోయినా పర్వాలేదు. కేవలం ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. అవసరాలు తీర్చుకోవచ్చు. హోటల్లో తాగే టీ నుంచి.. విమానంలో చేసే ప్రయాణం వరకు ప్రతిదీ కూడా డిజిటల్ పేమెంట్ల ద్వారానే సాగిపోతోంది.. కొన్ని సందర్భాలలో డబ్బు ఎంతైనా పర్వాలేదు జస్ట్ స్కాన్ చేస్తే సరిపోతుంది. అందువల్లే నేటి యువతరం నుంచి మొదలు పెడితే వృద్ధుల వరకు అందరూ కూడా డిజిటల్ పేమెంట్ యాప్స్ వాడుతున్నారు. మారిన కాలానికి డిజిటల్ పేమెంట్ యాప్స్ వాడటం సరైనదే అయినప్పటికీ.. దీనివల్ల మనకు తెలియకుండానే జేబులకు చిల్లుపడుతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

“ఆన్లైన్ విధానంలో జరిగే చెల్లింపులు మన జీవితాలను అత్యంత సులభతరం చేశాయి. అయితే ఇలాంటి ఈజీ చెల్లింపులకు అలవాటు పడటం వల్ల తెలియకుండానే ఖర్చులు పెరిగిపోతున్నాయి. నగదు నోట్లను లెక్కించినప్పుడు చాలామంది ఇంత ఖర్చు పెడుతున్నామా అనుకునేవారు. అందువల్లే చేసే ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఎంతైనా ఖర్చు పెడుతున్నారు. ఇలా ఖర్చు పెట్టడానికి ప్రధాన కారణం డిజిటల్ పేమెంట్ యాప్స్. వీటి ద్వారా డబ్బు చెల్లింపు సులభతరం కావడం.. డబ్బు తీసుకోవడం కూడా ఈజీ కావడంతో చాలామంది వీటిని వినియోగిస్తున్నారు. ప్రతినెల ఒకటో తేదీ నుంచి 30 వరకు చెల్లించిన చెల్లింపులు ఒకసారి లెక్కిస్తే మనకు పెట్టిన ఖర్చు అర్థం అవుతుందని” ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ఖర్చుపెట్టిన నగదు కంటికి కనిపించకపోవడం వల్లే ఇదంతా జరుగుతుంద ని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఇటీవల ఆర్థిక నిపుణులు మనదేశంలో కొన్ని ప్రాంతాలలో సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.. ప్రతి ఒక్కరు డిజిటల్ పేమెంట్ యాప్స్ వాడుతున్నారు. చెల్లింపులను వీటి ద్వారానే చేస్తున్నారు. అందువల్ల చేసిన ఖర్చు అర్థం కావడం లేదు. నగదు ఎలాగైతే వస్తున్నదో.. అంతకంటే వేగంగా ఖర్చవుతుంది. అందువల్లే నెల చివర్లో ఎవరి వద్ద కూడా డబ్బులు ఉండడం లేదని.. సాధ్యమైనంతవరకు ఖర్చులను తగ్గించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

విస్కీకే అగ్రతాంబూలం.. మందుబాబుల ఫస్ట్‌ ఛాయిస్‌ అదే!

Telangana Liquor Market
Telangana Liquor Market

Telangana Liquor Market: తెలంగాణలో మద్యం అమ్మకాలు మార్కెట్‌లో విస్కీ ఏకపక్ష ఆధిపత్యం కొనసాగిస్తోంది. గణాంకాల ప్రకారం, రాష్ట్రంలో అమ్ముడవుతున్న ప్రతీ 10 ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌ బాటిళ్లలో 9 బాటిళ్లు విస్కీవే అని తెలుస్తోంది. ఇది రాష్ట్ర మద్యం మార్కెట్‌లో విస్కీ ఎంత బలమైన స్థానం సంపాదించిందో స్పష్టం చేస్తోంది. మార్కెట్‌ వాటాలో విస్కీ 88 నుంచి 90 శాతం షేర్‌ ఉంది. బ్రాండీ 9.2 శాతం, వోడ్కా 1.24 శాతం, వైన్‌ 0.88 శాతం, రమ్‌ 0.32 శాతం, జిన్‌ 0.09 శాతం షేర్‌ ఉన్నాయి.

రెండో స్థానంలో బ్రాందీ…
విస్కీ తర్వాత బ్రాందీ రెండవ స్థానంలో ఉన్నప్పటికీ, విస్కీతో పోలిస్తే దాని వాటా చాలా తక్కువగా ఉంది. వోడ్కా, వైన్, రమ్, జిన్‌ వంటి ఇతర మద్యాలు కలిపినా విస్కీ మార్కెట్‌ ఆధిపత్యానికి సవాలు విసిరే స్థాయిలో లేవు.

వీస్కీకి ఎందుకు డిమాండ్‌?
విస్కీ మధ్యం ప్రియుల ఎంపికగా మారడానికి ప్రధాన కారణం సామాజిక జీవనంలో దాని భాగస్వామ్యం. పార్టీలు, స్నేహితులతో సమావేశాలు, కార్పొరేట్‌ ఈవెంట్స్, పండగలు వంటి సందర్భాల్లో విస్కీని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. మీడియం, ప్రీమియం సెగ్మెంట్‌ బ్రాండ్లకు మార్కెట్‌లో భారీ డిమాండ్‌ ఉంది. వినియోగదారులు నాణ్యత, రుచి, స్టేటస్‌ను దృష్టిలో ఉంచుకుని విస్కీని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.

మద్యం వినియోగంలో మార్పు..
తెలంగాణలో విస్కీ ఆధిపత్యం కేవలం ఒక ట్రెండ్‌ కాదు. ఇది రాష్ట్రంలో మద్యం వినియోగం సంస్కృతిలోనే మార్పును సూచిస్తోంది. గత కొన్ని సంవత్సరాల్లో మధ్య తరగతి వినియోగం పెరగడం, ఆధునిక లైఫ్‌స్టైల్‌లో మద్యం భాగం కావడం వంటి అంశాలు విస్కీ అమ్మకాలు పెరగడానికి దోహదపడ్డాయి. అయితే, ఇతర మద్యాలు మార్కెట్‌ షేర్‌ చాలా తక్కువగా ఉండటం ఆసక్తికరం. ఇది తెలంగాణ మద్యం వినియోగదారులు ఇంకా సంప్రదాయ రుచుల వైపే మొగ్గు చూపుతున్నారని తెలియజేస్తోంది.

తెలంగాణ మద్యం మార్కెట్‌లో విస్కీ పట్టుతప్పని ఆధిపత్యం కొనసాగుతోంది. ప్రతీ 10 బాటిళ్లలో 9 విస్కీ అమ్ముడవడం దీనికి సాక్ష్యం. మీడియం, ప్రీమియం సెగ్మెంట్‌లోని బ్రాండ్లకు ఉన్న డిమాండ్‌ రాబోయే రోజుల్లో కూడా విస్కీ ఆధిపత్యాన్ని కొనసాగించే అవకాశం ఉంది.

#RRR రికార్డు ని అవలీలగా దాటేసిన 'పెద్ది'.. ఇది కదా అసలు సిసలు మాస్ అంటే..

Peddi Movie Collections
Peddi Movie Collections

Peddi Movie Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ బాక్స్ ఆఫీస్ వద్ద రాబడుతున్న వసూళ్లు ప్రతీ రోజు ట్రేడ్ పండితులను విస్మయానికి గురి చేస్తోంది. ముఖ్యంగా కోస్తాంధ్ర లో ఒక సంక్రాంతి సూపర్ హిట్ సినిమాకు ఎలాంటి కలెక్షన్స్ వస్తాయో , అంతకు మించిన కలెక్షన్స్ ఈ చిత్రానికి వస్తున్నాయి. ఇదే తరహా ఊపు ని కొనసాగిస్తే ముందుకు వెళ్తే, ఈ చిత్రం కేవలం కోస్తాంధ్ర నుండే 100 కోట్ల షేర్ ని రాబట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదనై అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. పెద్ది చిత్రానికి కోస్తాంధ్ర నుండి 6 రోజుల్లో 60 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. రేపటి తో ‘ఓజీ’, ఎల్లుండి తో ‘దేవర’ ఫుల్ రన్ కలెక్షన్స్ ని ఈ ప్రాంతం లో దాటనుంది ఈ చిత్రం. అయితే కోస్తాంధ్ర లో ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి ఈ చిత్రానికి నమోదు అవుతున్న వసూళ్లను చూసి , ఇది కలనా ?, నిజమా? అని ఆశ్చర్యపోతున్నారు ట్రేడ్ పండితులు.

ఎందుకంటే ఈ చిత్రానికి 6 వ రోజున 1 కోటి 15 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. రాజమౌళి గతం లో రామ్ చరణ్ తో తీసిన #RRR చిత్రానికి 6 వ రోజున కేవలం 98 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది. కేవలం 6 రోజుల్లోనే ఈ ప్రాంతం నుండి 17 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. దీనిని బట్టీ చూస్తుంటే ఈ చిత్రానికి ఫుల్ రన్ లో పాతిక కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చేలా ఉందని , #RRR రికార్డు ని అవలీల గా దాటేస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అదే విధంగా వరల్డ్ వైడ్ గా కచ్చితంగా ఈ చిత్రం 200 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను ఈ వీకెండ్ తోనే దాటేస్తుందని, ఫుల్ రన్ లో 220 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు.

మరి ఆ రేంజ్ కి ఈ సినిమా వెళ్తుందో లేదో చూడాలి. ఫుల్ రన్ లో ఈ చిత్రం కచ్చితంగా 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడుతుందనే బలమైన నమ్మకం తో ఉన్నారు రామ్ చరణ్ అభిమానులు. నార్త్ ఇండియా కలెక్షన్స్ ఈమధ్యనే పుంజుకుంది , కానీ ఓవర్సీస్ ఏ మాత్రం సహకరించడం లేదు. అక్కడ ఈ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ముఖ్యంగా నార్త్ అమెరికా లో ఈ చిత్రాన్ని 7 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు , ఇప్పటి వరకు కేవలం 3 మిలియన్ డాలర్లు మాత్రమే వచ్చింది. అంటే అక్షరాలా 4 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లబోతుంది అన్నమాట. ఈ రేంజ్ డిజాస్టర్ గా నిలుస్తుందని ఓవర్సీస్ బయ్యర్స్ అసలు ఊహించలేదు.

సమంత తో కలిసి నటించడానికి నిరాకరించిన నాగ చైతన్య.. ఇది మామూలు ట్విస్ట్ కాదు..

Naga Chaitanya
Naga Chaitanya

Naga Chaitanya: సమంత , నాగ చైతన్య దంపతులు విడిపోయి చాలా ఏళ్ళు అవుతోంది , ఎవరి జీవితం లో వాళ్ళు ప్రస్తుతం ఫుల్ బిజీ గా ఉన్నారు , ఇద్దరూ కూడా కెరీర్ పరంగా మంచి స్థాయిలోనే ఉన్నారు. విడాకుల తర్వాత కొన్నాళ్ళకు నాగ చైతన్య ప్రముఖ యంగ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల ని పెళ్లి చేసుకోగా , సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ డైరెక్టర్ రాజ్ నిడిమోరు ని పెళ్లి చేసుకుంది. వీళ్లిద్దరి వైవాహిక జీవితాలు కూడా చాలా గొప్ప స్థాయిలో సాగుతున్నాయి , ఎలాంటి గొడవలు , మనస్పర్థలు ఈ జంటల మధ్యలో లేవు. అయితే సమంత , నాగ చైతన్య విడిపోయినప్పటికీ, ఈ కాంబినేషన్ ని ఇష్టపడే అభిమానుల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. విడిపోతే విడిపోయారు , కనీసం వీళ్లిద్దరు కలిసి ఒక సినిమా చేయొచ్చు కదా అని సోషల్ మీడియా లో కొంతమంది కోరుకుంటూ ఉంటారు.

అయితే గతం లో వీళ్లిద్దరు గాఢమైన ప్రేమలో ఉన్నప్పుడే , నాగ చైతన్య సమంత తో కలిసి నటించడానికి నిరాకరించాడట. అప్పట్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘అ ..ఆ’ అనే చిత్రం తెరకెక్కించిన సంగతి తెలిసిందే. నితిన్ , సమంత హీరో హీరోయిన్లు గా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ వద్ద సెన్సేషనల్ హిట్ గా నిల్చింది. ఈ చిత్రం లో ముందుగా హీరో పాత్ర కోసం నాగ చైతన్య న సంప్రదించాడట డైరెక్టర్ త్రివిక్రమ్. కానీ హీరో క్యారెక్టర్ కంటే , హీరోయిన్ క్యారెక్టర్ ఎక్కువ హైలైట్ అవుతుండడం తో , నాగ చైతన్య ఈ సినిమా ని రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. అప్పటికి ఆయన సమంత తో ప్రేమలోనే ఉన్నాడు , ఆమెతో డేటింగ్ కూడా చేస్తున్నాడు , అయినప్పటికీ ఆమెతో కలిసి నటించడానికి నిరాకరించడం గమనార్హం.

అయితే విడాకుల తర్వాత కొన్నాళ్ళకు జరిగిన ఒక ఇంటర్వ్యూ లో రిపోర్టర్ నాగ చైతన్య ని ఒక ప్రశ్న అడుగుతూ ‘మళ్లీ సమంత తో కలిసి నటించే అవకాశం వస్తే మీరు చేస్తారా ?’ అని అడగ్గా, నాగ చైతన్య అందుకు సమాధానం చెప్తూ ‘ఎందుకు చెయ్యను.. కచ్చితంగా చేస్తాను , నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. పైగా మా ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే క్రేజ్ కూడా వేరే లెవెల్ ఉంటుంది కదా’ అని చెప్పుకొచ్చాడు. మరి వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా భవిష్యత్తులో వస్తుందో లేదో చూడాలి. వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన చివరి చిత్రం ‘మజిలీ’. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా, టాలీవుడ్ లో కల్ట్ క్లాసిక్ చిత్రాల్లో ఒకటిగా నిల్చింది.

ఉగ్రవాద పాకిస్తాన్ కు.. మన శంకరుడు తగిన శాస్తి చేశాడు..

Muzaffarabad Helicopter Crash
Muzaffarabad Helicopter Crash

Muzaffarabad Helicopter Crash: హిందువులు ఆరాధ్య దైవంగా కొలిచే శివుడు హిమాలయాల మీద కొలువై ఉంటాడు. అక్కడ ధ్యానంలో ఉంటాడు. ఈశ్వరుడిని తలచుకుంటూ సాధువులు తపస్సు చేస్తుంటారు. తనను కొలిచే భక్తులకు.. తన పరిసర ప్రాంతంలో జీవించే ప్రజలకు ఏమైనా కష్టం వస్తే శంకరుడు క్షణంలోనే తన ప్రతాపం చూపిస్తాడు. ఇప్పుడు ఉగ్రవాద పాకిస్తాన్ దేశానికి కూడా శంకరుడు తన ఉగ్రరూపాన్ని చూపించాడు. అందువల్లే పాకిస్తాన్ తోక ముడుచుకుంది. తల వంచుకుంది.

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో కొంతకాలంగా అక్కడి ప్రజలు ఆందోళన చేస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం తీరు పట్ల తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అయితే ప్రజల నుంచి వస్తున్న ఆగ్రహాన్ని.. నిరసనను చల్లార్చడానికి పాకిస్థాన్ ప్రభుత్వం ఏకంగా ఆర్మీని రంగంలోకి దింపింది. విచక్షణ రహితంగా కాల్పులు జరిపిస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ కాల్పుల్లో గర్భిణులు.. చిన్నపిల్లలు చనిపోతున్నారు. అక్కడి మారణకాండను ప్రపంచ దేశాలు తీవ్రస్థాయిలో ఖండిస్తున్నాయి. అయినప్పటికీ పాకిస్తాన్ తీరు మారడం లేదు.

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద పాకిస్తాన్ దేశం చేస్తున్న దారుణాన్ని శివుడు చూస్తూ ఊరుకోలేకపోయాడు. అందువల్లే పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఎంఐ 17 హెలికాప్టర్ కు ప్రమాదం జరిగేలా చేశాడు. ఆ హెలికాప్టర్ ముజఫరాబాద్ లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 21 మంది చనిపోయారు. టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నిస్తుండగా హెలికాప్టర్ క్రాష్ అయ్యింది.. చూస్తుండగానే నేల కూలిపోయింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో చోటుచేసుకుంటున్న ఉద్రిక్తతల వల్ల.. పాకిస్తాన్ ఆర్మీ అదనపు బలగాలను తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఇందులో ఎవరు కూడా ప్రాణాలతో మిగలలేదని సమాచారం. మృతులకు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మునీర్ నివాళులర్పించారు.

పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ మొత్తం హిమాలయ పర్వతాలకు అత్యంత దగ్గరగా ఉంటుంది. అలాంటప్పుడు తన చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలకు అన్యాయం జరుగుతుంటే శివుడు చూస్తూ ఎలా ఉంటాడు.. అందువల్ల తన కోపాన్ని ఇలా చూపిస్తూ ఉంటాడు. ఇప్పటికైనా పాకిస్తాన్ పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఎందుకంటే అక్కడ శివుడు ఉన్నాడు. శివుడిని పాకిస్తాన్ నమ్మకపోవచ్చు. కానీ కోట్లాదిమంది హిందువులు నమ్ముతుంటారు. పాకిస్థాన్ ఆక్రమించిన జమ్మూ కాశ్మీర్ లో కూడా హిందువులు శివుడిని పూజిస్తుంటారు. వారి బాధలను మన శివయ్య విన్నట్టున్నాడు. అందుకే ఉగ్రవాద పాకిస్థాన్ ఆర్మీకి చావును పరిచయం చేశాడు.

తెలంగాణ మీ అయ్య జాగీరా.. పవన్ ప్రశ్నించింది అందుకే..

Pawan Kalyan Fans
Pawan Kalyan Fans

Pawan Kalyan Telangana Comments: తెలంగాణ రాష్ట్రంలో ఆమధ్య పవన్ కళ్యాణ్ సృష్టించిన రాజకీయ అలజడి కలకలం రేపింది. ప్రధాన మీడియా నుంచి మొదలు పెడితే సోషల్ మీడియా వరకు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల చుట్టూ తిరిగింది. కొంతమంది తెలంగాణ నాయకులు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్రస్థాయిలో మండిపడ్డారు..

పవన్ కళ్యాణ్ నాడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణలోకి ఎందుకు వద్దని అంటున్నారు.. తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు.. భారత రాష్ట్ర సమితికి సంబంధించిన కొంతమంది నాయకులు.. టిఆర్ఎస్ అధినాయకురాలు కవిత, ఇతర నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ వ్యవహారశూరి సరైనది కాదని మండిపడ్డారు.

నాడు తెలంగాణ మీ అయ్య జాగీరా అని తాను ఎందుకన్నాను.. దానికి దారి తీసిన పరిస్థితులను పవన్ కళ్యాణ్ వివరించారు. “నన్ను హైదరాబాద్ రాకూడదని కాంగ్రెస్ నాయకులు పదే పదే బెదిరించారు. తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు. 13 నెలలుగా టార్గెట్ చేశారు. నాకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుకు భంగం కలిగింది కాబట్టి నేను తెలంగాణ రాష్ట్రంలోకి అడుగు పెట్టారు. మీ అయ్య జాగీరా అంటూ ప్రశ్నించాను. భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు ఈ వైఖరి లేదని.. నన్ను రావద్దు అంటే రాహుల్ గాంధీ సౌత్ ఇండియాతో తనకు సంబంధం లేదని చెప్పాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో లోకేష్ తో పోటీ వల్లే తెలంగాణ మీద ఫోకస్ పెట్టడం అనేది అబద్ధమని” పవన్ పేర్కొన్నారు.

“నాకు తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ కళ్యాణ్ కుమార్ అని పేరు పెట్టారు. స్కూల్ రికార్డ్స్ లో శ్రీ అనే పదం తొలగించి కే కళ్యాణ్ కుమార్ అనే పేరు నమోదు చేశారు. మార్షల్ ఆర్ట్స్ టీచర్స్ నా పేరుకు ముందు పవన్ అని పేరు పెట్టారు. నా చాతి భాగం మీద 450 కిలోల స్టోన్ స్లాబ్స్ బ్రేక్ చేసేవారు. నన్ను హనుమంతుడితో పోల్చుతూ ఆ పేరు పెట్టారని” పవన్ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల తెలంగాణ నేతలు ఇంతవరకు స్పందించలేదు. చూడాలి మరి వారు ఏం మాట్లాడతారో.. గతంలో పవన్ కళ్యాణ్ మీద అనిరుధ్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

దుమ్ములేపుతున్న అలియా భట్ 'ఆల్ఫా' టీజర్.. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ రోల్?

Alia Bhatt Alpha Teaser
Alia Bhatt Alpha Teaser

Alia Bhatt Alpha Teaser: బాలీవుడ్ స్పై జానర్ సినిమాలకు కేవలం నార్త్ ఇండియా లో మాత్రమే కాదు , సౌత్ ఇండియా లో కూడా మంచి క్రేజ్ ఉంది. షారుఖ్ ఖాన్ , సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ వంటి వారు ఈ స్పై జానర్ సినిమాల్లో నటించి , సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ని తమ ఖాతాల్లో వేసుకున్నారు. ఈ స్పై యూనివర్స్ నుండి వచ్చిన చివరి చిత్రం ‘వార్ 2’. హృతిక్ రోషన్ హీరో గా నటించిన ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ విలన్ గా నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా , ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. యాష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లోనే అత్యంత తక్కువ వసూళ్లను రాబట్టిన సినిమా గా నిల్చింది ఈ చిత్రం. దీంతో ఈ యూనివర్స్ కి ఇక ఎండ్ కార్డు పడినట్టే అని అంతా అనుకున్నారు.

కానీ ‘వార్ 2’ మూవీ చివర్లోనే , ఈ యూనివర్స్ నుండి ‘ఆల్ఫా’ అనే చిత్రం తెరకెక్కబోతుంది , ఒక చిన్నపాటి క్లిప్ హ్యాంగర్ సన్నివేశం తో చెప్పకనే చెప్పాడు డైరెక్టర్. ఈ సినిమాలో అలియా భట్ ప్రధాన పాత్ర పోషించబోతుంది. ఆమెకు గురువుగా బాబీ డియోల్ నటిస్తున్నాడు. శర్వరి స్పై ఏజెంట్ ఆఫీసర్ గా నటించబోతుంది. అనిల్ కపూర్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ మూవీ కి సంబంధించిన టీజర్ ని నేడు ఉదయం విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. స్పై యూనివర్స్ కి ‘వార్ 2’ తో ఎండ్ కార్డు పడిందని అనుకున్నాం , కానీ ‘ఆల్ఫా’ చిత్రం స్పై యూనివర్స్ కి పూర్వ వైభవం తీసుకొచ్చేలా ఉందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.

ఈ టీజర్ లో బాబీ డియోల్ తన కూతురు కి 18 ఏళ్ళు నిండగానే , దేశం కోసం ఒక సీక్రెట్ ఆపరేషన్ ని అందించడం , అందుకోసం ఆమెని చిన్నప్పటి నుండి ఆయన ఎలా తయారు చేసాడు వంటి షాట్స్ ఈ టీజర్ లో ఆడియన్స్ ని ప్రత్యేకంగా ఆకర్షించింది. అయితే ఈ సినిమాలో హ్రితిక్ రోషన్ కబీర్ గా కనిపించబోతున్నాడట. ఇది కేవలం అతిధి పాత్ర మాత్రమే, హ్రితిక్ రోషన్ తో పాటు , జూనియర్ ఎన్టీఆర్ కూడా మేజర్ విక్రమ్ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. ఇదే కనుక నిజమైతే ఈ ఇద్దరి హీరోల అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. ఈ ఏడాది జులై 3 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సోషల్ మీడియా లో సంచలనం రేపుతున్న ఈ టీజర్ ని మీరు కూడా చూసేయండి.

 

 

టాలెంట్ కాదు.. అలా అయితేనే జట్టు కోసం ఎంపిక చేస్తారు..భువి మనసులో ఇంత బాధ దాగుందా

Bhuvneshwar Kumar
Bhuvneshwar Kumar

Bhuvneshwar Kumar: ఇటీవల జరిగిన ఐపిఎల్ లో అత్యంత పొదుపుగా బౌలింగ్ వేశాడు భువనేశ్వర్. అదే స్థాయిలో వికెట్లు కూడా పడగొట్టాడు.. పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. భువనేశ్వర్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. కానీ అతడు మాట్లాడినప్పుడు మీడియా మొత్తం సంచలనంగా మారుతుంది. ఎందుకంటే అతడి మాటలు అలా ఉంటాయి కాబట్టి.

తాజాగా టీమిండియాలో తనకు చోటు ఎందుకు లభించడం లేదు.. తను ఎంత గొప్పగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ సెలెక్టర్లు ఎందుకు లెక్కలోకి తీసుకోవడం లేదు.. అనే విషయాలపై క్లారిటీ ఇచ్చాడు భువనేశ్వర్ కుమార్. “దేశం కోసం ఆడాలని చాలామందికి ఉంటుంది. అందులో నేను కూడా ఒకడిని. కాకపోతే కొన్ని సందర్భాలలో జరిగిన విషయాలను బయట పెట్టుకోవడం భావ్యం కాదు. నేను నాకు నచ్చిన పని చేస్తున్నా. అందులో నన్ను నేను నిరూపించుకుంటున్నాను. సెలెక్టర్లు వాళ్ల పని వాళ్ళు చేస్తున్నారు. టాలెంట్ ఉండగానే సరిపోదు. జట్టుకు కూడా ఎంపిక కావాలి. జట్టులోకి ఎంపిక కావాలంటే దానిని సెలెక్టర్లు చూసుకోవాలి. వాళ్ళు ఓకే చెబితేనే జట్టులోకి అవకాశం ఉంటుందని” భువనేశ్వర్ వ్యాఖ్యానించాడు.

భువనేశ్వర్ గతంలో జట్టుకు ఎంపికైనప్పుడు అద్భుతమైన ఇన్ స్వింగ్ బౌలింగ్ తో ఆకట్టుకునేవాడు.. తక్కువ ఎత్తులో బంతులు వేసి ప్రత్యర్థి బ్యాటర్లను బోల్తా కొట్టించేవాడు. ముఖ్యంగా వికెట్ టు వికెట్ బంతులు వేయడంలో అతడి తర్వాతే ఎవరైనా. తక్కువ వేగంతో యార్కర్లు వేసి.. వికెట్లు పడగొట్టడంలో భువనేశ్వర్ కుమార్ నేర్పరి. అందువల్లే అతడిని వికెట్ మాస్టర్ అని పిలుస్తుంటారు. ఇటీవల ఐపీఎల్లో బెంగళూరు జుట్టు తరఫున ఆడిన అతడు అదరగొట్టాడు. వికెట్ల మీద వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. ఇన్ని సంవత్సరాలపాటు ఐపీల్ ఆడుతున్నప్పటికీ.. కొత్త బౌలర్ లాగా బౌలింగ్ వేసి సంచలనం సృష్టించాడు.. ఐపీఎల్ ట్రోఫీ బెంగళూరు గెలవడం వెనక మిగతా ఆటగాళ్ల పాత్ర ఎంతైతే ఉందో.. అంతకు మించిన పాత్ర భువనేశ్వర్ కుమార్ ది ఉంది.

ఐపీఎల్ లో సత్తా చూపించిన తర్వాత భువనేశ్వర్ కుమార్ కు వన్డే సిరీస్ లలో అవకాశం లభిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అది సాధ్యం కాలేదు. కనీసం ఐర్లాండ్, ఇంగ్లాండ్ జట్లో జరిగే టీ20 సిరీస్ లకైనా చోటు లభిస్తుందేమోనని అనుకున్నారు. చివరికి అది కూడా వీలుపడలేదు. మొత్తానికి టన్నుల కొద్దీ టాలెంట్ పెట్టుకుని భువనేశ్వర్ జట్టుకు ఎంపిక కాలేకపోతున్నాడు.