Trump and Netanyahu fallout: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు తన సామ్రాజ్యవాద కాంక్షతో ఇరాన్‌పై యుద్ధం ప్రకటించారు. దీనికి ఎప్పటి నుంచో ఇరాన్‌తో వైరం ఉన్న ఇజ్రాయెల్ సహాయం తీసుకున్నారు. రెండు దేశాలు కలిసి ఇరాన్‌పై భీకర దాడులు చేశాయి. దాదాపు 50 రోజులు ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపించాయి. మరోవైపు ఇజ్రాయెల్ లెబనాన్‌ను టార్గెట్ చేసింది. హెజ్‌బొల్లా లక్ష్యంగా దాడులు కొనసాగించింది. తర్వాత అమెరికా ఇరాన్ మధ్య తాత్కాలిక సీజ్‌ఫైర్ కుదిరింది. శాశ్వత ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఇజ్రాయెల్ సీజ్‌ఫైర్‌ను ఉల్లంఘించి లెబనాన్, ఇరాన్‌పై దాడులు కొనసాగిస్తోంది. దీంతో డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు ఆపాలని ఆదేశించారు. అయినా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. అమెరికా మద్దతు ఉన్నా లేకపోయినా ఇరాన్‌పై దాడులు కొనసాగించాలని నెతన్యాహు నిర్ణయించారు. తాజా కేబినెట్ సమావేశంలో నెతన్యాహు ‘అమెరికా మద్దతు లేకుండానే ఇరాన్‌ను ఎదుర్కోవాల్సి వచ్చినా సిద్ధంగా ఉండాలి’ అని కేబినెట్ సభ్యులను హెచ్చరించినట్లు ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. ఆయుధాల కొరత, అంతర్జాతీయ ఒత్తిడి, దౌత్యపరమైన ఒంటరితనం వంటి ధరలు చెల్లించాల్సి వచ్చినా వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు.
అమెరికా ముందస్తు సమాచారం..
ఇదే సమయంలో మరికొన్ని గంటల్లో ఇరాన్‌పై దాడి చేయబోతున్నట్లు అమెరికా ఇజ్రాయెల్‌కు ముందుగానే సమాచారం అందించినట్లు సమాచారం వెలువడింది. ఇటీవల హర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా అపాచీ హెలికాప్టర్ కూల్చివేతకు ప్రతిస్పందనగా అమెరికా ఇరాన్ దక్షిణ ప్రాంతాల్లోని జాస్క్, బందర్ అబ్బాస్, ఖెష్క్ దీవి ప్రాంతాల్లో వైమానిక దాడులు చేసింది. అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ దాడులు తమ ఆత్మరక్షణ చర్యల్లో భాగమని ప్రకటించింది.
ఇరాన్ ప్రతీకారం..
తాజా దాడులపై ఇరాన్ కూడా తీవ్రంగా స్పందించింది. అమెరికా స్థావరాలు ఉన్న బహ్రెయిన్‌లోని నౌకాదళంపై ఎదురుదాడులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్‌ప్స్ ఇంకా తీవ్రమైన ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించాయి. ఇదే సమయంలో లెబనాన్‌లో హెజ్బొల్లా పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను తీవ్రంగా అసంతృప్తి పరుస్తున్నాయి.
ఇజ్రాయెల్ ఆందోళన..
ఇజ్రాయెల్ సైన్యాధ్యక్షుడు ఎయాల్ జమీర్ అమెరికా–ఇరాన్ మధ్య ఏ ఒప్పందమైనా ఇజ్రాయెల్ భద్రతా ప్రయోజనాలకు ముప్పుగా మారవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్‌తో అణు ఒప్పందం కుదిరితే తమ సైనిక చర్యల స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని ఇజ్రాయెల్ భావిస్తోంది. ప్రస్తుత పరిస్థితి ఇజ్రాయెల్–అమెరికా మధ్య కూడా విబేధాలను పెంచుతోంది. ఒకవైపు ట్రంప్ ఇరాన్‌తో డీల్ ద్వారా శాంతి ప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు నెతన్యాహు తన సైనిక వ్యూహాలను కొనసాగించాలని పట్టుబట్టడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చేస్తోంది.
అమెరికా ఇజ్రాయెల్‌కు ముందస్తు సమాచారం ఇచ్చి దాడులు చేయడం ద్వారా రెండు దేశాల మధ్య ఇప్పటికీ ఉన్న భాగస్వామ్యం కనిపిస్తున్నా, నెతన్యాహు ఒంటరిగా కూడా యుద్ధం చేస్తామన్న సంకేతం పశ్చిమాసియాలో మరిన్ని పెద్ద ఘర్షణలకు దారి తీయవచ్చని ఆందోళనలు రేకెత్తుతున్నాయి. రాబోయే రోజులు ఈ ప్రాంత భద్రతా పరిస్థితిని ఎలా మార్చనున్నాయో చూడాలి.
















'దృశ్యం 3' వెంకటేష్ చేయకపోవడానికి కారణం అదేనా.. సంచలనం రేపుతున్న డైరెక్టర్ వ్యాఖ్యలు..
Director comments on Drishyam 3: ఇండియాలో ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ లిస్ట్ తీస్తే , అందులో కచ్చితంగా ‘దృశ్యం’ సిరీస్ టాప్ స్థానం లో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మలయాళం లో మోహన్ లాల్ హీరో గా నటించిన , ‘దృశ్యం’ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. ఆ తర్వాత ఈ చిత్రాన్ని తెలుగు , తమిళం , హిందీ భాషల్లో రీమేక్ చేశారు. అక్కడ కూడా ఇదే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో విక్టరీ వెంకటేష్ ఎంత అద్భుతంగా నటించాడో మన కళ్లారా చూశాము. ఇక ఆ తర్వాత సీక్వెల్ కేవలం మలయాళం తో పాటు తెలుగు హిందీ భాషల్లో కూడా తెరకెక్కింది. కరోనా లాక్ డౌన్ కారణంగా తెలుగు , మలయాళం వెర్షన్స్ డైరెక్ట్ గా ఓటీటీ లోనే విడుదలయ్యాయి , కానీ హిందీ వెర్షన్ మాత్రం థియేటర్స్ లో విడుదలై సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది.
రీసెంట్ గానే ‘దృశ్యం 3’ మలయాళం లో భారీ అంచనాల నడుమ విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. టాక్ అయితే డివైడ్ గానే వచ్చింది కానీ , సినిమాకు కూడా కలెక్షన్స్ వేరే లెవెల్ లో వచ్చాయి. కేవలం 30 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగితే, ఇప్పటి వరకు ఈ చిత్రానికి 240 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దీన్ని బట్టీ ఏ రేంజ్ లో లాభాలు నిర్మాతకు వచ్చాయో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రానికి వచ్చిన కలెక్షన్స్ ని చూసి , ‘దృశ్యం 4’ ని కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాని తెలుగు లో విక్టరీ వెంకటేష్ చేయకపోవడానికి గల కారణాన్ని ఆ చిత్ర డైరెక్టర్ జీతూ జోసఫ్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.
ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమా క్లైమాక్స్ ని వెంకటేష్ గారు నచ్చలేదు. తన మీద అలాంటి క్లైమాక్స్ వర్కౌట్ అవ్వడం కష్టమని అన్నారు. అంతే కాకుండా, ఇప్పటి మార్కెట్ పరిస్థితులు కూడా మారడం తో , ఈ రీమేక్ ని ఆయన రిజెక్ట్ చేసాడు. కానీ హిందీ లో అజయ్ దేవగన్ గారు ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. షూటింగ్ కూడా చాలా వరకు అయిపోయింది’ అంటూ చెప్పుకొచ్చాడు జీతూ జోసఫ్. ప్రస్తుతం మన టాలీవుడ్ లో రీమేక్ సినిమాల హవా బాగా తగ్గిపోయింది. పైగా విక్టరీ వెంకటేష్ ఇప్పుడు 300 కోట్ల గ్రాస్ సినిమాలో హీరో గా నటించి, తన రేంజ్ ని బాగా పెంచుకున్నాడు. కాబట్టి, ఇలాంటి సమయం లో ఈ చిత్రం లో నటించడం కరెక్ట్ కాదని ఆయన నిర్ణయం తీసుకున్నాడు అంటూ విక్టరీ వెంకటేష్ అభిమానులు చెప్పుకొచ్చారు.