Homeఅంతర్జాతీయంTrump and Netanyahu fallout: ట్రంప్‌తో నెతన్యాహూ కటీఫ్‌.. ప్రమాదంలో పశ్చిమాసియా పరిస్థితి?

Trump and Netanyahu fallout: ట్రంప్‌తో నెతన్యాహూ కటీఫ్‌.. ప్రమాదంలో పశ్చిమాసియా పరిస్థితి?

Trump and Netanyahu fallout: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు తన సామ్రాజ్యవాద కాంక్షతో ఇరాన్‌పై యుద్ధం ప్రకటించారు. దీనికి ఎప్పటి నుంచో ఇరాన్‌తో వైరం ఉన్న ఇజ్రాయెల్‌ సహాయం తీసుకున్నారు. రెండు దేశాలు కలిసి ఇరాన్‌పై భీకర దాడులు చేశాయి. దాదాపు 50 రోజులు ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపించాయి. మరోవైపు ఇజ్రాయెల్‌ లెబనాన్‌ను టార్గెట్‌ చేసింది. హెజ్‌బొల్లా లక్ష్యంగా దాడులు కొనసాగించింది. తర్వాత అమెరికా ఇరాన్‌ మధ్య తాత్కాలిక సీజ్‌ఫైర్‌ కుదిరింది. శాశ్వత ఒప్పందం కోసం […]

Trump and Netanyahu fallout: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు తన సామ్రాజ్యవాద కాంక్షతో ఇరాన్‌పై యుద్ధం ప్రకటించారు. దీనికి ఎప్పటి నుంచో ఇరాన్‌తో వైరం ఉన్న ఇజ్రాయెల్‌ సహాయం తీసుకున్నారు. రెండు దేశాలు కలిసి ఇరాన్‌పై భీకర దాడులు చేశాయి. దాదాపు 50 రోజులు ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపించాయి. మరోవైపు ఇజ్రాయెల్‌ లెబనాన్‌ను టార్గెట్‌ చేసింది. హెజ్‌బొల్లా లక్ష్యంగా దాడులు కొనసాగించింది. తర్వాత అమెరికా ఇరాన్‌ మధ్య తాత్కాలిక సీజ్‌ఫైర్‌ కుదిరింది. శాశ్వత ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఇజ్రాయెల్‌ సీజ్‌ఫైర్‌ను ఉల్లంఘించి లెబనాన్, ఇరాన్‌పై దాడులు కొనసాగిస్తోంది. దీంతో డొనాల్డ్‌ ట్రంప్‌ ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమెన్‌ నెతన్యాహుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు ఆపాలని ఆదేశించారు. అయినా ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగిస్తోంది. అమెరికా మద్దతు ఉన్నా లేకపోయినా ఇరాన్‌పై దాడులు కొనసాగించాలని నెతన్యాహు నిర్ణయించారు. తాజా కేబినెట్‌ సమావేశంలో నెతన్యాహు ‘అమెరికా మద్దతు లేకుండానే ఇరాన్‌ను ఎదుర్కోవాల్సి వచ్చినా సిద్ధంగా ఉండాలి’ అని కేబినెట్‌ సభ్యులను హెచ్చరించినట్లు ఇజ్రాయెల్‌ మీడియా వెల్లడించింది. ఆయుధాల కొరత, అంతర్జాతీయ ఒత్తిడి, దౌత్యపరమైన ఒంటరితనం వంటి ధరలు చెల్లించాల్సి వచ్చినా వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు.

అమెరికా ముందస్తు సమాచారం..
ఇదే సమయంలో మరికొన్ని గంటల్లో ఇరాన్‌పై దాడి చేయబోతున్నట్లు అమెరికా ఇజ్రాయెల్‌కు ముందుగానే సమాచారం అందించినట్లు సమాచారం వెలువడింది. ఇటీవల హర్ముజ్‌ జలసంధి సమీపంలో అమెరికా అపాచీ హెలికాప్టర్‌ కూల్చివేతకు ప్రతిస్పందనగా అమెరికా ఇరాన్‌ దక్షిణ ప్రాంతాల్లోని జాస్క్, బందర్‌ అబ్బాస్, ఖెష్క్‌ దీవి ప్రాంతాల్లో వైమానిక దాడులు చేసింది. అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ఈ దాడులు తమ ఆత్మరక్షణ చర్యల్లో భాగమని ప్రకటించింది.

ఇరాన్‌ ప్రతీకారం..
తాజా దాడులపై ఇరాన్‌ కూడా తీవ్రంగా స్పందించింది. అమెరికా స్థావరాలు ఉన్న బహ్రెయిన్‌లోని నౌకాదళంపై ఎదురుదాడులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చి, ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్‌ప్స్‌ ఇంకా తీవ్రమైన ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించాయి. ఇదే సమయంలో లెబనాన్‌లో హెజ్బొల్లా పై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ చేస్తున్న దాడులు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను తీవ్రంగా అసంతృప్తి పరుస్తున్నాయి.

ఇజ్రాయెల్‌ ఆందోళన..
ఇజ్రాయెల్‌ సైన్యాధ్యక్షుడు ఎయాల్‌ జమీర్‌ అమెరికా–ఇరాన్‌ మధ్య ఏ ఒప్పందమైనా ఇజ్రాయెల్‌ భద్రతా ప్రయోజనాలకు ముప్పుగా మారవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్‌తో అణు ఒప్పందం కుదిరితే తమ సైనిక చర్యల స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని ఇజ్రాయెల్‌ భావిస్తోంది. ప్రస్తుత పరిస్థితి ఇజ్రాయెల్‌–అమెరికా మధ్య కూడా విబేధాలను పెంచుతోంది. ఒకవైపు ట్రంప్‌ ఇరాన్‌తో డీల్‌ ద్వారా శాంతి ప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు నెతన్యాహు తన సైనిక వ్యూహాలను కొనసాగించాలని పట్టుబట్టడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చేస్తోంది.

అమెరికా ఇజ్రాయెల్‌కు ముందస్తు సమాచారం ఇచ్చి దాడులు చేయడం ద్వారా రెండు దేశాల మధ్య ఇప్పటికీ ఉన్న భాగస్వామ్యం కనిపిస్తున్నా, నెతన్యాహు ఒంటరిగా కూడా యుద్ధం చేస్తామన్న సంకేతం పశ్చిమాసియాలో మరిన్ని పెద్ద ఘర్షణలకు దారి తీయవచ్చని ఆందోళనలు రేకెత్తుతున్నాయి. రాబోయే రోజులు ఈ ప్రాంత భద్రతా పరిస్థితిని ఎలా మార్చనున్నాయో చూడాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper