Home Blog Page 13

లెనిన్ మూవీకి నాగార్జున వల్లే మైనస్ అవుతుందిగా...

Akhil Akkineni
Akhil Akkineni

Akhil Akkineni: వారసత్వం ఉన్నంత మాత్రాన ఇండస్ట్రీ లో రాణిస్తాం అనుకోవడం కరెక్ట్ కాదు. కష్టపడే తత్వం ఉంది ప్రేక్షకులను మెప్పించగలిగే కథలను ఎంచుకొని సక్సెస్ లను సాధించినవాళ్లకి మాత్రమే ఇక్కడ మంచి గుర్తింపు ఉంటుంది. ఇక అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో నాగేశ్వరరావు టాప్ హీరోగా మారాడు. తన నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున 40 సంవత్సరాలుగా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు సాగుతున్నాడు. కానీ తన నట వారసులు అయిన నాగ చైతన్య, అఖిల్ మాత్రం ఆశించిన మేరకు విజయాలను సాధించడం లేదు. కొంతవరకు నాగచైతన్య బెటర్ అనిపించినప్పటికి అఖిల్ మాత్రం ఎలాంటి సక్సెస్ లను సాధించడం లేదు. ఇక ఈనెల 10 వ తేదీన లెనిన్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే ఈ సినిమా అతనికి ఎంతవరకు యూజ్ అవుతుంది అఖిల్ ఈ సినిమాతో తను అనుకున్న సక్సెస్ ను సాధిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఒక రకంగా చెప్పాలి అంటే అఖిల్ కి నాగార్జున వల్లే మైనస్ అవుతుందని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే నాగార్జునకి ఉన్న ఇమేజ్ అఖిల్ మీద పడి అఖిల్ నుంచి వచ్చే సినిమాలేవి కూడా ప్రేక్షకులకు నచ్చడం లేదని, స్టార్ ఫ్యామిలీ స్టేటస్ ఉన్న హీరో కావడం వల్ల తను ఏ సినిమా చేసిన కూడా ప్రేక్షకులకు నచ్చడం లేదనే కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి.

ఇక ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయన లెనిన్ మూవీ కోసం మంచి కథతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. తన ఇమేజ్ కి తగ్గ కథని ఎంచుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ సినిమా 200 కోట్ల కు పైన కలెక్షన్స్ రాబడుతుంది అంటూ నిర్మాత నాగ వంశీ సైతం ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు.

అయినప్పటికి నాగార్జున ఇమేజ్ మళ్ళీ అఖిల్ మీద పడి ఈ మూవీకి ఏదైనా మైనస్ అవుతుందా అనేది కూడా తెలియాల్సి ఉంది… తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరో రెండు రోజుల పాటు వెయిట్ చేయాల్సిందే…

త్రివిక్రమ్ కి రైటింగ్ సెన్స్ పోయింది... అందుకే ఆ స్టార్ రైటర్ తో రాయిస్తున్నాడు...

Trivikram Srinivas
Trivikram Srinivas

Trivikram Srinivas: మాటల మాంత్రికుడిగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్న రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్… ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమాలో మాటలు తూటాల్లా పేలుతుంటాయి. ఇక దర్శకత్వ విభాగంలో కూడా ఆయన తన ప్రతిభను చూపించుకున్నాడు. ప్రస్తుతం ఆయన ‘ఆదర్శ కుటుంబం’ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో మూవీ చేయబోతున్నాడు. పురాణాల కథ ను తీసుకొని దానికి ఫిక్షన్ యాడ్ చేసి ఆ స్టోరీని మలచబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం త్రివిక్రమ్ కి రైటింగ్ సెన్స్ పోయిందని అందువల్లే ఆయన వేరే రైటర్స్ తో రాయిస్తున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి. నిజానికి ఎన్టీఆర్ సినిమాకి రచయిత త్రివిక్రమ్ కాదట. వేరే రైటర్స్ తో కథను సిద్ధం చేస్తున్నాడట. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ కథను రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక త్రివిక్రమ్ కూడా కథలో ఇన్వాల్వ్ అవుతున్నాడట. ఇద్దరు కలిసి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఆదర్శ కుటుంబం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాబట్టి ఈ సినిమాని అక్టోబర్ 2 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమా మీద తను పూర్తిస్థాయిలో ఫోకస్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది… త్రివిక్రమ్ బలం రైటింగ్ అలాంటిది ఆయన ఇప్పుడు రైటింగ్ సెన్స్ కోల్పోవడం అనేది సరైనది కాదని కొంతమంది అంటున్నారు. కొందరు కావాలని ఇలాంటి వార్తలను క్రియేట్ చేస్తున్నారని ఇప్పటికీ త్రివిక్రమ్ మంచి కథలను, డైలాగ్ లను రాయగలడు అని మరికొంతమంది భావిస్తూ ఉండడం విశేషం…

ఇక ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించగలిగే దర్శకులలో త్రివిక్రమ్ కూడా ఒకరంటూ చాలామంది చెబుతున్నారు. కానీ ఇప్పటివరకు ఆయన పాన్ ఇండియాలో ఒక సినిమా కూడా చేయలేదు. ఎన్టీఆర్ సినిమాతోనే పాన్ ఇండియా ప్రేక్షకులను సైతం తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

తను అనుకున్నట్టుగానే ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తుంది ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలను రెకెత్తిస్తుందా? ఎన్టీఆర్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ గా నిలుస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

నయా భారత్ రైల్వే.. ఇక నాన్ స్టాప్

Indian Railways
Indian Railways

Indian Railways: భారతీయ రైల్వే మరో అద్భుతం చేసింది. ఇప్పటికే ప్రమాదాల నివారణకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తుంది. రైల్వేకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో రైల్వే ట్రాక్లను పెంచుతుంది. కొత్త రైల్వే మార్గాలు ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలో రైల్వే ఇంజనీరింగ్ వ్యవస్థ మరో అద్భుతం చేసింది.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ మరో ట్రైన్‌తో పక్కపక్క ట్రాక్‌లపై ఆగకుండా, వేగంగా పయనిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో ఎక్స్‌ప్రెస్ లేదా వీఐపీ ట్రైన్లు వస్తే ఇతర ట్రైన్లను స్టేషన్ వద్ద నిలిపేసేవారు. ఇప్పుడు రెండు ట్రైన్లు స్వేచ్ఛగా, సురక్షితంగా వెళ్తున్నాయి. నెటిజన్లు దీన్ని “నయా భారత్.. పాత రోజులు పోయాయ్!” అంటూ ప్రశంసిస్తున్నారు. బీజేపీ కూడా ఈ వీడియోను ట్వీట్ చేసింది.

వీడియో వైరల్..
వీడియోలో వందే భారత్ ట్రైన్ మరో సాధారణ ట్రైన్‌తో పక్కపక్కనే ట్రాక్‌పై దూసుకెళ్తున్న దృశ్యం కనిపిస్తుంది. రెండు ట్రైన్లు ఆగకుండా, ఒకదాని వేగాన్ని మరొకటి అడ్డుకోకుండా వెళ్తున్నాయి. దీన్ని చూసిన వారు “ఇది ఇంజనీరింగ్ మార్వెల్”, “పాత రోజులు పోయాయి”, “మోడర్న్ టెక్ సిగ్నలింగ్‌కు థాంక్స్” అని కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో రైల్వే అభివృద్ధిని ప్రతిబింబిస్తుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

కొత్త యుగం ఆరంభం..

గతంలో భారతీయ రైల్వేల్లో మాన్యువల్ సిగ్నలింగ్ వ్యవస్థ ఉండేది. ఎక్స్‌ప్రెస్ లేదా ముఖ్యమైన ట్రైన్లు రాగా, ఇతర ట్రైన్లను స్టేషన్ వద్ద ఆపేవారు. ఇది సేఫ్టీ కారణాలు, ప్రయారిటీ ఇవ్వడం, ట్రాక్ సామర్థ్యం తక్కువగా ఉండడం వల్ల జరిగేది. ఫలితంగా ప్రయాణ సమయం పెరిగేది, ట్రైన్ల సామర్థ్యం పూర్తిగా వినియోగం కాకుండా పోయేది. ఇప్పుడు పరిస్థితి మారింది. డబుల్ ట్రాకింగ్, ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్, కేంద్రీకృత ట్రాఫిక్ కంట్రోల్ వంటి ఆధునిక సాంకేతికతలు వచ్చాయి. ఇవి ట్రైన్లను ఒకదానితో ఒకటి సురక్షితంగా, సమన్వయంగా నడపడానికి వీలు కల్పిస్తున్నాయి. రెండు ట్రైన్లు పక్కపక్క ట్రాక్‌లపై ఆగకుండా వెళ్లడం ఇప్పుడు సాధారణం అవుతోంది.

మోడర్న్ సిగ్నలింగ్ వ్యవస్థ..
ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థ రైల్వేల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. ట్రైన్ల మధ్య దూరం తగ్గించి, ఎక్కువ ట్రైన్లను నడపవచ్చు. మానవ తప్పిదాలు తగ్గుతాయి. వేగం పెరుగుతుంది, సమయం ఆదా అవుతుంది. సేఫ్టీ స్థాయి పెరుగుతుంది. వందే భారత్ వంటి సెమీ హై-స్పీడ్ ట్రైన్లు ఈ వ్యవస్థతో మరింత సమర్థవంతంగా నడుస్తున్నాయి. రైల్వేల్లో జరుగుతున్న సాంకేతిక విప్లవానికి ఇది మరో చిహ్నం.

భారతీయ రైల్వేల అభివృద్ధి..
గత కొన్నేళ్లలో రైల్వేలు డబుల్ ట్రాకింగ్, ఎలక్ట్రిఫికేషన్, కొత్త ట్రైన్లు, స్టేషన్ల ఆధునీకరణ వంటి అనేక మార్పులు చేశాయి. ఫలితంగా ప్రయాణ సమయం తగ్గింది. ట్రైన్ల సంఖ్య పెరిగింది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుతున్నాయి. తాజాగా రెండు ట్రైన్లు ఆగకుండా వెళ్లడం రైల్వేల సామర్థ్యం, సేఫ్టీ, సాంకేతికత మూడూ మెరుగుపడ్డాయని అర్థం.

ఈ వైరల్ వీడియో భారతదేశం ఆధునికీకరణ వైపు అడుగేస్తున్నట్లు చూపిస్తోంది. మోడర్న్ టెక్నాలజీ, మెరుగైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వల్ల ప్రజల జీవితాలు సులభతరం అవుతున్నాయి. ఇంకా మెరుగైన సిగ్నలింగ్ వ్యవస్థలు, హై-స్పీడ్ రూట్లు, మరిన్ని వందే భారత్ ట్రైన్లు వస్తే రైల్వేలు మరింత వేగవంతం, సురక్షితం అవుతాయి.

ఆ పరిణామాలతో వైసిపికి కష్టమే!

YSRCP
YSRCP

YSRCP: ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదం, తర్వాత సాయి కృష్ణ ఉదంతం, ఇప్పుడు జోసెఫ్ రావణ అరెస్ట్, మధ్యలో రఘురామకృష్ణంరాజు వివాదం.. ఇవన్నీ చూస్తే కచ్చితంగా రాజకీయ ప్రేరేపితం అనేది కనిపిస్తోంది. అయితే 2014 నుంచి 2019 మధ్య ఇటువంటి ఘటనలు చాలా జరిగాయి. అప్పట్లో చాలా ప్రభావం చూపాయి. అప్పటి టిడిపి ప్రభుత్వం పై వ్యతిరేకత వచ్చేందుకు కారణం అయ్యాయి. ఇప్పుడు కూడా అటువంటి ఘటనలే జరుగుతుండడంతో.. కూటమి ప్రభుత్వంపై ఆ ప్రభావం పడుతుందా అనే అనుమానం కలగక మానదు. అయితే అప్పట్లో జరిగిన ప్రచారానికి.. ఇప్పట్లో జరిగిన ప్రచారానికి ఒక తేడా ఉంది. అప్పట్లో టిడిపి అధికారంలో ఉంది. బలమైన ప్రతిపక్షంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది. దీంతో ఇలా వచ్చిన ప్రజా పోరాటాల వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది అనేది బహిరంగ రహస్యం. కానీ ప్రజలు దానిని పట్టించుకోలేదు. ఎందుకంటే అప్పట్లో వైసిపి బలమైన ప్రతిపక్షం కాదా ఇంకా అధికారం ఒక్కసారి కూడా చేపట్టకపోవడం ఆ పార్టీకి కలిసి వచ్చిన అంశం.

* ప్రజా పోరాటాలు లేకుండా..
అయితే ఇప్పుడు వరుసగా జరుగుతున్న పరిణామాల వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందన్నది ప్రధాన అనుమానం. అందుకు తగ్గట్టుగానే ఉంది ఆ పార్టీ వ్యవహార శైలి. ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి పెద్దగా ప్రజా పోరాటాలు చేసింది లేదు. పైగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చేస్తోందన్న ప్రచారం బలపడుతోంది. గతంలో కూడా వైసిపి ఇటువంటివి చేయడంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అలర్ట్ అయింది. అందుకే ఆ ప్రయత్నాలు పెద్దగా వర్కౌట్ కావడం లేదు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెంచడం లేదు.

* ఇప్పుడు వ్యూహంతో..
అప్పట్లో చంద్రబాబు ఒక్కరే ఉండేవారు. ముఖ్యమంత్రిగా ఉండడంతో అటు పాలనతో పాటు ఇటు రాజకీయాలు చూసుకోవాల్సిన బాధ్యత ఆయన పై ఉండేది. పార్టీని కూడా మోసేవారు లేకుండా పోయారు. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. కూటమిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. మరోవైపు టిడిపి బాధ్యతలను చూస్తున్నారు లోకేష్. రాజకీయంగా కూటమికి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ అండగా నిలుస్తున్నారు. లోకేష్ సైతం యాక్టివ్ అయి తన పని తాలు చేస్తున్నారు టీం వర్క్ తో. అయితే ఇప్పుడు మతపరమైన అంశాల వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందన్న అనుమానాలు ప్రజల్లోకి వెళ్లాయి. ఇది అంతిమంగా పార్టీకే నష్టం చేకూరుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మత ముద్ర అనేది అంత ఈజీ కాదు. పైగా ఏపీలో హిందుత్వవాదం పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అడ్డగోలు నిర్ణయాలు తీసుకోవడం కంటే.. ఆచితూచిగా తీసుకోవడమే మేలు అని శ్రేయోభిలాషులు సూచిస్తున్నారు. లేకుంటే వచ్చే ఎన్నికలు కూడా కష్టమేనని హెచ్చరిస్తున్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి.. ఇడుపాలపాయలో తప్పిన కళ!

YSR Jayanti 2026
YSR Jayanti 2026

YSR Jayanti 2026: రాష్ట్రవ్యాప్తంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇడుపాలపాయలో రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన భార్య భారతి, తల్లి విజయమ్మ కూడా వచ్చారు. అందరూ కలిసి నివాళులు అర్పించారు. జగన్మోహన్ రెడ్డిని దగ్గరకు తీసుకొని ఆత్మీయంగా ముద్దాడారు విజయమ్మ. మరోవైపు ఈ వేడుకల్లో వైయస్ షర్మిల కనిపించలేదు. గత కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డిని ఆమె రాజకీయంగా విభేదిస్తున్నారు. అప్పటి నుంచి ప్రత్యేక సందర్భాల్లో కూడా వారు కనిపించలేదు కలిసి. అయితే ఈ విషయంలో విజయమ్మ అటు షర్మిల తో పాటు ఇటు జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే తండ్రి రాజశేఖరరెడ్డి ఆస్తికి సంబంధించి మాత్రం ఆమె కుమార్తె షర్మిల వైపు ఉంటున్నారు. ఇప్పటికే కుమారుడుకు వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయినా సరే రాజశేఖర్ రెడ్డి జయంతి నాడు కుమారుడుతోనే ఆమె కలిసి నడవడం విశేషం.

* ఆస్తి వివాదాలు..
భారతి సిమెంట్స్ కంపెనీలో వాటాలకు సంబంధించి వివాదం నడుస్తోంది. ఆ కంపెనీ షేర్లు విజయమ్మ కుమార్తె షర్మిలకు బదలాయించడానికి తప్పుపడుతూ జగన్మోహన్ రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ సందర్భంలో విజయమ్మ న్యాయస్థానానికి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. లేఖ కూడా రాశారు. రాజశేఖర్ రెడ్డి తన ఇద్దరి పిల్లలకు సమానంగా ఆస్తిని పంచారని.. ఈ లెక్కన షర్మిలకు న్యాయం జరగాలని విజయమ్మ కోరుతున్నారు. ఈ క్రమంలో కుమారుడు జగన్మోహన్ రెడ్డితో ఆమెకు విభేదాలు ఉన్నట్లు టాక్ నడిచింది. కానీ విజయమ్మ తన భర్త రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలకు గాను కుమారుడు జగన్మోహన్ రెడ్డితో కలిసి రావడం ఇప్పుడు విశేషం. అదే సమయంలో షర్మిల ఎక్కడా కనిపించలేదు పులివెందులలో.

* అప్పట్లో కుటుంబం అంతా..
గతంలో రాజశేఖర్ రెడ్డి జయంతి, వర్ధంతి సమయంలో ఆయన కుటుంబమంతా ఏకతాటిపైకి వచ్చేది. సామూహికంగా అందరూ నివాళులు అర్పించేవారు. ఆపై సామూహిక ప్రార్ధనలు కూడా చేసేవారు.. కానీ కాలక్రమంలో ఆ కుటుంబంలో అనేక రకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి. వివేకానంద రెడ్డి హత్య అంశం అనేది ఆ కుటుంబాన్ని అడ్డగోలుగా చీల్చింది. జగన్మోహన్ రెడ్డితో షర్మిల విభేదించడం కూడా ఒక కారణం. అందుకే రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు కళ తప్పాయి. సగం మంది కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. అయితే కుమారుడిని విభేదిస్తున్నారని విజయమ్మ పై ఒక విమర్శ ఉంది. కానీ దానిని చూపించలేదు ఈ పర్యటనలో. కొడుకు, కోడలితో కలిసి విజయమ్మ నివాళులు అర్పించారు.

9 గంటలు సముద్రాన్ని ఈది బతికాడు.. మత్స్యకారుడి అద్భుత పోరాటం

Visakhapatnam Boat Accident
Visakhapatnam Boat Accident

Visakhapatnam Boat Accident: తన వెంట వచ్చిన వారు ఒక్కొక్కరు మునిగిపోతూ వస్తున్నారు.. ఆ సమయంలో కుటుంబం గుర్తుకు వచ్చింది.. బతకాలన్న ఆశ పుట్టింది.. అందుకే తొమ్మిది గంటలపాటు సముద్రాన్ని ఈదుకుంటూ వచ్చి మృత్యుంజయుడుగా నిలిచాడు ఆ మత్స్యకారుడు. విశాఖ తీరం నుంచి చేపల వేటకు బయలుదేరిన పడవ తీరానికి వస్తుండగా మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఏడుగురు మత్స్యకారులు బాధితులుగా మిగలగా.. కార్ ఇచ్చిన అనే మత్స్యకారుడు మృత్యుంజయుడుగా నిలిచాడు. ప్రాణాలతో బయటపడ్డాడు. ఓ మర్చంట్ నౌకా సిబ్బంది అతనిని రక్షించగా.. ప్రస్తుతం విశాఖ షీలానగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్పృహలోకి వచ్చాడు. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఎలా బయటపడ్డాడో వివరించాడు.

* వాతావరణ ప్రతికూలతతో..
ఈనెల 1న ఏడుగురు మత్స్యకారులు ఒక బోటులో విశాఖ తీరం నుంచి చేపల వేటకు బయలుదేరారు. ఇంతలో వాతావరణ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో తిరిగి తీరానికి వచ్చేయాలని బయలుదేరారు. ఈనెల 4న మధ్యాహ్నం సమయంలో తీరానికి దాదాపు పది నాటికల్ మైళ్ల దూరంలో ఉండగా ఓ భారీ అలా ఆ బోటును తాకింది. ఒక్కసారిగా బోటు తిరగబడింది. అందులో ఉన్న మొబైల్స్ తో పాటు ఇతర సామాన్లు కనిపించలేదు. తిరగబడ్డ బోటును పట్టుకొని మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి 9 గంటల వరకు వేలాడుతూ వారంతా ఉండి పోయారు. ఎంతలో మరో అలా తాకడంతో పూర్తిగా ఆ బోటు మునిగిపోయింది. దీంతో అందరూ చనిపోతామని ఒక నిర్ణయానికి వచ్చారు.

* పెద్దన్నయ్య మాటలతో..
అయితే కారి చిన్న పెద్దన్నయ్య ఒకరు ఆ బృందంలో ఉన్నారు. అవకాశం ఉన్న వరకు ఈదుకొని వెళ్ళండి.. ఏదో ఒక బోటు.. భారీ నౌక కనిపిస్తుంది.. వారి సాయంతో బ్రతకొచ్చు. నేను మాత్రం రాలేను అంటూ ఆయన కళ్ళెదుటే మునిగిపోయినట్లు చిన్ని చెబుతున్నారు. ఆయన అన్న కుమారుడు ప్రారంభం నుంచి కనబడలేదు. దీంతో మిగిలిన ఐదుగురు గుండె ధైర్యంతో ఈదడం ప్రారంభించారు. కానీ క్రమేపి ఆ ఐదుగురు కూడా కనిపించలేదు. దీంతో చిన్ని తొమ్మిది గంటలపాటు సముద్రంలో ఈదుతూ ముందుకు సాగాడు. వాతావరణం సరిగా లేక దారిలో ఏ ఒక్క బోటు కూడా కనిపించలేదు. అలా ఈదుతూ రక్షించే వారి కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాడు. ఇంతలో ఆయన వెంట ఈదుతూ వస్తున్న నలుగురు కూడా కనిపించకుండా మానేశారు. గంటల తరబడి ఈదడంతో చిన్న కు నీరసం వచ్చింది. కానీ తన కుటుంబం గుర్తుకు రావడంతో ముందుకు సాగుతుండగా ఓ మర్చంట్ నావి నౌక కనిపించింది. అక్కడి సిబ్బంది చూసి కాపాడారు. నౌకలో చేరాక చిన్ని స్పృహ తప్పి పడిపోయాడు. ఆసుపత్రిలో చేర్చడంతో కొంత తేరుకున్నాడు. తన తోటి వారిని తలచుకుని కన్నీటి పర్యంతం అవుతున్నాడు. అందరిదీ పేద కుటుంబాలని.. వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.

తమిళ దర్శకుడితో నవీన్ పోలిశెట్టి కొత్త సినిమా.. చాలా పెద్ద రిస్క్ చేస్తున్నాడు..

Naveen Polishetty
Naveen Polishetty

Naveen Polishetty: కెరీర్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు నూటికి నూరు శాతం సక్సెస్ రేట్ తో ఇండస్ట్రీ లో తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న హీరో నవీన్ పోలిశెట్టి. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’, ‘జాతి రత్నాలు’, ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’, ‘అనగనగా ఒక రాజు’ ఇలా ప్రతీ సినిమా కూడా ఒక దానిని మించి ఒకటి హిట్ అయ్యాయి. రీసెంట్ గా సంక్రాంతి కానుకగా విడుదలైన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం ఈ ఏడాది అత్యధిక లాభాలను రాబట్టిన అతి తక్కువ సినిమాల్లో ఒకటిగా నిల్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా తర్వాత నవీన్ ఎలాంటి సినిమా చేయబోతున్నారు?, ఈసారైనా వేగంగా సినిమాలు చేస్తారా ?, లేదా సంవత్సరాల గ్యాప్ తీసుకుంటారా అనే అనుమానం ఆయన అభిమానుల్లో , ప్రేక్షకుల్లో ఉంది.

అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ఏంటంటే , ఆయన ఒక తమిళ డైరెక్టర్ తో కలిసి పని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ డైరెక్టర్ పేరు ఆంటోని భాగ్యరాజ్. గతం లో ఈయన ‘సైరన్’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. జయం రవి , కీర్తి సురేష్ , అనుపమ పరమేశ్వరన్ వంటి వారు ఈ చిత్రం లో నటించారు . సినిమా బాగానే ఉంటుంది కానీ , కమర్షియల్ గా ఎందుకో పెద్దగా ఆడలేదు. కానీ ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరికి కలిగిన ఫీలింగ్ ఏంటంటే డైరెక్టర్ లో మంచి టాలెంట్ ఉంది , కచ్చితంగా మంచి అవకాశం ఇస్తే పెద్ద రేంజ్ కి వెళ్తాడు అని. నవీన్ పోలిశెట్టి తో సినిమా అంటే , హిట్ కొట్టేసినట్టే. ఎందుకంటే స్టోరీ మొత్తం నవీన్ చూసుకుంటారు , డైరెక్షన్ తనకు ఎలా కావాలో అలా అడిగి చేయించుకుంటారు.

ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రతీ సినిమాకు ఇదే తరహాలో వ్యవహరించారు. అన్ని కమర్షియల్ గా వర్కౌట్ అయ్యాయి కాబట్టి , ఈ సినిమా కూడా అవుతుందనే నమ్మకం ట్రేడ్ లో ఉంది. కానీ తమిళ డైరెక్టర్స్ తో పని చేసిన ఏ టాలీవుడ్ స్టార్ హీరో కూడా ఈమధ్య కాలం లో సక్సెస్ అందుకోలేదు. మరి నవీన్ పోలిశెట్టి ఆ సెంటిమెంట్ కి బ్రేక్ వేస్తారా లేదా అనేది చూడాలి. త్వరలోనే షూటింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టుకోనున్న ఈ చిత్రం , వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

డైరెక్టర్ అట్లీ కి అల్లు అర్జున్ స్ట్రాంగ్ వార్నింగ్.. డెడ్ లైన్ మిస్ అయితే 'రాకా' లేనట్టే..

Allu Arjun
Allu Arjun

Allu Arjun: ‘పుష్ప 2’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న చిత్రం ‘రాకా’. తమిళ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన అట్లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం పై సోషల్ మీడియా లో చాలా రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. అల్లు అర్జున్ ఇప్పటి వరకు తీసిన మూవీ ఔట్పుట్ పై సంతృప్తి గా లేరని , పదే పదే రీ షూట్స్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని , ఆ కారణం చేత ఆయన సహనం నశిస్తుందని , పలు సార్లు షూటింగ్ సెట్స్ లో తన అసహనాన్ని కూడా వ్యక్తం చేసారని , ఈ సినిమా కమర్షియల్ గా వర్కౌట్ అవ్వదు అనే ఫీలింగ్ తోనే వెంటనే ఆయన లోకేష్ కనకరాజ్ తో మరో సినిమా కమిట్ అయ్యారని , ఇలా రకరకాల రూమర్స్ చక్కర్లు కొట్టాయి.

ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న మాట ఏమిటంటే , అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లీ కి ఒక స్ట్రాంగ్ డెడ్ లైన్ పెట్టారట. డిసెంబర్ నుండి తాను లోకేష్ కనకరాజ్ మూవీ కి షిఫ్ట్ అవుతానని , అప్పటి లోపు ఎట్టి పరిస్థితి లోనూ ‘రాకా’ మూవీ షూటింగ్ ని పూర్తి చెయ్యాలని , అంతకు మించి ఈ సినిమాకు కాల్ షీట్స్ ఇచ్చే ప్రసక్తే లేదని చాలా బలమైన వార్నింగ్ ఇచ్చారట. దీంతో మూవీ టీం ఎలా అయినా షూటింగ్ ని డెడ్ లైన్ లోపు పూర్తి చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ముంబై లో జరుగుతోంది. అల్లు అర్జున్ మరియు ఇతర తారాగణం పై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరోపక్క అల్లు అర్జున్ రీసెంట్ గానే ముంబై లో లోకేష్ కనకరాజ్ మూవీ కోసం స్పెషల్ ఫోటో షూట్ చేశారట.

షూటింగ్ మొదలయ్యే ముందు అభిమానులకు ఈ స్పెషల్ వీడియో ని సర్ప్రైజ్ గిఫ్ట్ గా ఇచ్చే ప్లాన్ లో ఉన్నారట లోకేష్ కనకరాజ్. ఇది ఆయన మార్క్ అనే చెప్పాలి , ప్రతీ సినిమా షూటింగ్ మొదలయ్యే ముందు హీరోలతో ఆయన స్పెషల్ వీడియో షూట్ ఒకటి చేస్తారు. వాటిని షూటింగ్ ప్రారంభానికి ముందు విడుదల చేస్తుంటారు. ఇప్పుడు కూడా అదే చేశారు. ఈ వీడియో తోనే అభిమానుల్లో విపరీతమైన అంచనాలు ఏర్పాటు అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది. త్వరలోనే ఈ చిత్రం లో నటించబోయే ఇతర నటీనటులు , టెక్నీషియన్స్ వివరాలను అధికారికంగా చెప్పనున్నారు.

వద్దు అని చెప్పినా వినడు.. మా నాన్న అలాంటి వీడియోస్ షేర్ చేస్తూనే ఉంటాడు - శృతి హాసన్

Shruti Haasan
Shruti Haasan

Shruti Haasan: కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటికీ , అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకుంది శృతి హాసన్. తండ్రి లాగానే ఈమె కూడా గొప్ప టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్. అద్భుతంగా నటించలేదు , పాటలు పాడగలదు , డ్యాన్స్ వేయగలదు , ఇలా ఒక్కటి కాదు రెండు కాదు , ఈమెలో ఎన్నో కళలు ఉన్నాయి. రీసెంట్ గానే ఈమె ‘వారణాసి’ చిత్రం లో ‘సంచారి’ అనే పాటని ఎంత అద్భుతంగా పాడిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అదే విధంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం లో ఈమె చేసిన స్పెషల్ ఐటెం సాంగ్ కి కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. మరోపక్క హీరోయిన్ గా కూడా సినిమాలు చేస్తూ వరుస సూపర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంటూ వస్తోంది శృతి హాసన్.

ఇకపోతే రీసెంట్ గా ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన తండ్రి కమల్ హాసన్ తో ఉన్నటువంటి రిలేషన్ గురించి చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘మా నాన్న నాతో ఒక స్నేహితుడిగా , చాలా సరదాగా ఉంటారు. ఇన్ స్టాగ్రామ్ ని నాన్న బాగా అనుసరిస్తారు. నాకు కూడా కొన్ని ఫన్నీ వీడియోస్ పంపుతూ ఉంటారు. కొన్ని వీడియోస్ నాకు చాలా విచిత్రం గా అనిపిస్తుంటాయి. అప్పుడు నేను ఆయనతో ‘ఈ ఆంటీ చేసేవి పెద్దగా నవ్వు రప్పించడం లేదు , ఈమెవి పంపకండి నాన్న’ అని చెప్పేదాన్ని. అంతే కాకుండా కొన్ని కళాత్మకమైన వీడియోస్ కూడా పంపుతుంటారు. ఎవరైనా చిన్న పాప అద్భుతంగా పాడితే వాటిని నాకు షేర్ చేసినప్పుడు నాకు కలిగే ఫీలింగ్ , ఆ పాపని ఆయన చూసినప్పుడు నేను గుర్తు వచ్చి ఉంటానని అనిపిస్తుంది. అలాంటివి చూసేందుకు చాలా ముచ్చటగా అనిపిస్తుంటాయి. పల్లెటూర్లలో వంటచేసేవారి వీడియోస్ , సంగీతకారులు అంటే నాన్న కి చాలా ఇష్టం , వాళ్ళ వీడియోస్ ని కూడా షేర్ చేస్తుంటారు’ అంటూ చెప్పుకొచ్చారు శృతి హాసన్.

ఆమె చెప్పిన మాటలను బట్టీ చూస్తుంటే , కమల్ హాసన్ ఖాళీ సమయం లో ఇన్ స్టాగ్రామ్ తో కాలక్షేపం చేస్తారని అర్థం అవుతోంది. ఇకపోతే శృతి హాసన్ ప్రస్తుతం ఎంతటి పీక్ రేంజ్ లో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈమె ముట్టుకుంటే బంగారం అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఒకప్పుడు ఐరన్ లెగ్ గా పిలిపించుకున్న శృతి హాసన్ , ఇప్పుడు నిర్మాతల పాలిట గోల్డెన్ లెగ్ గా తయారైంది. ప్రస్తుతం ఈమె ట్రైన్ అనే ఒక తమిళ చిత్రం , అదే విధంగా ‘ఆకాశం లో ఒక తార’ అనే తెలుగు చిత్రం లో నటిస్తోంది.

రవితేజ , శ్రీవిష్ణు మల్టీస్టార్రర్ టైటిల్ ఇదే.. ఇంతటి రొటీన్ టైటిల్ ఊహించలేదు..

Ravi Teja Sree Vishnu Movie
Ravi Teja Sree Vishnu Movie

Ravi Teja Sree Vishnu Movie: మాస్ మహారాజా రవితేజ , శ్రీవిష్ణు కాంబినేషన్ లో ఒక మల్టీస్టార్రర్ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. హసిత్ గోలి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు ‘వీరాధి వీరులు’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్టు సమాచారం. హసిత్ గోలి గతం లో శ్రీవిష్ణు తో ‘రాజ రాజ చోర’, ‘స్వాగ్’ వంటి చిత్రాలను తెరకెక్కించారు. ఈ రెండు సినిమాల టైటిల్స్ దగ్గర నుండి టేకింగ్ వరకు ప్రతీ ఒక్కటి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆడియన్స్ కి థియేటర్స్ లో సరికొత్త అనుభూతిని కూడా ఇచ్చాయి. ఇప్పుడు రవితేజ , శ్రీవిష్ణు కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు కూడా టైటిల్ దగ్గర నుండే అన్ని చాలా డిఫరెంట్ గా ఉంటాయేమో అని అనుకున్నారు.

కానీ కట్ చేస్తే ‘వీరాధి వీరులు’ వంటి రొటీన్ టైటిల్ పెట్టారు. ఈ టైటిల్ పట్ల అభిమానులు కాస్త నిరాశ చెందారు. హసిత్ గోలి ని చూస్తుంటే ఈసారి ఆయన డిఫరెంట్ సబ్జెక్టు తో కాకుండా మామూలు కమర్షియల్ ఎంటర్టైనర్ తో రాబోతున్నారని తెలుస్తోంది. రవితేజ , శ్రీవిష్ణు లలో కామెడీ టైమింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సాధారణ సన్నివేశాన్ని కూడా వీళ్లిద్దరు తమ కామెడీ టైమింగ్ తో వేరే లెవెల్ కి తీసుకెళ్లగలరు. ఇలాంటి టైమింగ్ ఉన్న హీరోలను ఒకే సినిమాలో పెట్టుకొని , ప్రయోగాత్మక చిత్రాలు చేయడం సరైన నిర్ణయం కాదని డైరెక్టర్ అభిప్రాయం అట. అందుకే ఈ క్రేజీ ఎంటర్టైనర్ ని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభించుకోబోతున్న ఈ చిత్రం ఆడియన్స్ కి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ అందించబోతుందో చూడాలి. ఇక ఈ చిత్రం లో హీరోయిన్స్ గా ఎవరెవరు నటించబోతున్నారు , ఇతర నటీనటుల సంగతి ఏంటి వంటి వివరాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇకపోతే రవితేజ ప్రస్తుతం ‘ఇరుముడి’ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నారు. శివ నిర్వాణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం , వచ్చే నెల 21 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా పై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన గ్లింప్స్ వీడియో కి , టైటిల్ సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఏ యాంగిల్ లో చూసినా ఈ చిత్రం రవితేజ కం బ్యాక్ మూవీ లాగానే అనిపిస్తోంది. ఇక శ్రీవిష్ణు అయితే వరుస సూపర్ హిట్ సినిమాలతో మంచి ఊపు మీదున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రామ్ అబ్బరాజు తో ఒక సినిమా చేస్తున్నారు. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘సామజవరగమనా’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు , మళ్లీ వీళ్ళ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఎర్ర జెండా పట్టనున్న వైసిపి!

YSRCP
YSRCP

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక విషయంలో చాలా గర్వపడుతూ వస్తోంది. తాము ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చామని గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది. కానీ మొన్నటి ఎన్నికల్లో ఓటమితో ఆ పార్టీకి అసలు సినిమా అర్థమయింది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తే ఇబ్బందికరమని ఆ పార్టీ భావిస్తోంది. అలాగని ఆ పార్టీతో కలిసివచ్చే పార్టీలు లేవు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి స్వయంకృతాపం. అధికారంలో ఉన్నప్పుడు ఒక్క పార్టీతో కూడా చెలిమి లేదు. అసలు ఇతర రాజకీయ పార్టీలను లెక్క చేసేవారు కాదు. ఇప్పుడు అదే ఆ పార్టీకి మైనస్. ఆ పార్టీతో జత కలిసేందుకు ఏ పార్టీ ముందుకు రాని పరిస్థితి. అయితే ఇప్పుడు వామపక్షాల్లో ఒకటైన సిపిఐ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో జత కలుస్తోంది. కానీ అది ప్రభుత్వంపై పోరాటం చేసే క్రమంలో. ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శించే క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అనుసరిస్తోంది సిపిఐ. తాజాగా జోసెఫ్ రావణ్ అరెస్ట్ విషయంలో స్పందించారు సిపిఐ నారాయణ. ప్రభుత్వ చర్యలను తప్పుపడుతున్నారు. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో సిపిఐ జతకలుస్తుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

* ఉనికి ప్రశ్నార్ధకం..
దేశవ్యాప్తంగా వామపక్షాలు ఉనికిని కోల్పోయాయి. చివరకు కేరళలో సైతం ఆ పార్టీ చేతులెత్తేసింది. కానీ ఇప్పటికీ ప్రజా సంఘాల రూపాల్లో వామపక్షాలు బలంగా ఉన్నాయి. అయితే వామపక్షాల అవసరం అధికార పార్టీలకంటే ప్రతిపక్షాలకి ఎక్కువగా ఉంటుంది. క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలు చేయాలంటే వామపక్షాల అవసరం ఎక్కువగా ఉంటుంది. ఇంకా రెండున్నర సంవత్సరాలు మాత్రమే ఉండడంతో కచ్చితంగా ప్రజా పోరాటాలు చేయాల్సి ఉంటుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అందుకే వామపక్షాలను కలుపు కెళ్తే మంచి ప్రయోజనం ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని తక్కువ సీట్లు విడిచిపెట్టిన అది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లాభం అని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

* కూటమికి ధీటుగా..
వచ్చే ఎన్నికల్లో ఆ మూడు పార్టీలు కూటమిగా ముందుకు వెళ్లడం ఖాయం. మరో 15 ఏళ్ల పాటు కలిసి ఉంటామని పవన్ కళ్యాణ్ తేల్చి చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరాటం చేస్తే మాత్రం ఆ పార్టీకి ఇబ్బందికరమే. మొన్నటి ఎన్నికల వరకు ఒక ఎత్తు.. అంతకు ముందు పరిస్థితి వేరు.. మునుపటి మాదిరిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరించలేదు. ఆపై చాలా వర్గాలు దూరమయ్యాయి. తనకున్న సంప్రదాయ ఓటు బ్యాంకుకు తోడు వామపక్షాల బలం లభిస్తే మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం ఉంటుంది. లేకుంటే కష్టం అన్న టాక్ ఉంది. ముఖ్యంగా సిపిఐ లాంటి పార్టీతో దూకుడుగా ముందుకు సాగితే కొన్ని జిల్లాల్లో ప్రభావం చూపవచ్చు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదానికి సంబంధించి మంత్రి నారా లోకేష్ ను నిలదీసింది సిపిఐ నేతలు. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో సైతం సీపీఐ నేతలు కనిపించారు. అందుకే సిపిఐ తో వైసీపీ పొత్తు ఉంటుందన్న అనుమానం వ్యక్తం అవుతోంది. మరి జగన్ మనసులో ఏముందో తెలియాలి.

లోకేష్ ఒప్పిస్తున్నారు.. ఏపీకి వేలకోట్ల పెట్టుబడులు!

Nara Lokesh
Nara Lokesh

Nara Lokesh: మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ కు భారీగా విదేశీ పెట్టుబడులను తీసుకురావాలన్న లక్ష్యంతో నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లారు. అనుకున్న లక్ష్యం మేరకు ఆయన భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇది నిజంగా శుభ పరిణామం. రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఆహ్వానం మేరకు ఆరు రోజుల పర్యటన నిమిత్తం లోకేష్ వెళ్లారు. ఆ దేశ రాజధాని సీయోల్ లో అడుగు పెట్టారు. గ్లోబల్ టెక్నాలజీ, ఆటోమొబైల్, సిటీ కండక్టర్ దిగ్గజాలతో వరుసగా భేటీ అవుతూ వస్తున్నారు లోకేష్. పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో ఉన్న అనుకూల వాతావరణాన్ని వారికి వివరిస్తున్నారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్ గా మార్చేందుకు ఆయన గట్టి ప్రయత్నం లోనే ఉన్నారు.

* కీలక భేటీ..
మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మంగళవారం అత్యంత కీలక భేటీ జరిగింది. ఆటోమోటివ్ టెక్నాలజీ దిగ్గజం హుండాయ్ మోబీస్ టాప్ ఎగ్జిక్యూటివ్ లతో లోకేష్ చర్చలు జరిపారు. ఏపీలో ఎలక్ట్రిక్ వెహికల్ ఎకో సిస్టం బలోపేతం చేసేలా.. అనంతపురం లేదా తిరుపతి పరిధిలో ఒక మెగా ఈవి సెమీ కండక్టర్ హబ్ తో పాటు బ్యాటరీ సిస్టమ్స్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని.. లోకేష్ హ్యుందాయ్ ప్రతినిధులను కోరారు. గతంలో ఏపీలో కియా మోటార్స్ సాధించిన అద్భుత విజయమే కొరియన్ సంస్థలకు ఒక బెంచ్ మార్గాన్ని గుర్తు చేశారు. అనంతపురం జిల్లాను దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తీర్చిదిద్దేందుకు భాగస్వామ్యం కావాలని కోరారు. దీనిపై వారు సానుకూలంగా స్పందించారు.

* ఈసారి వాటికి ప్రాధాన్యం.
ఈసారి ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ రంగానికి ప్రాధాన్యమిస్తూ పెట్టుబడులను సాధించాలని లోకేష్ భావించారు. అందుకే ఈ పర్యటనలో ఎల్జి ఎలక్ట్రానిక్స్, సీయోల్ సెమీ కండక్టర్స్, APACT సంస్థల అధినేతలతో లోకేష్ ఈ విషయమై చర్చించారు. శ్రీ సిటీ కేంద్రంగా ఎల్జీ కంపెనీ 5000 కోట్ల భారీ ఇన్వెస్ట్మెంట్తో ఏర్పాటు చేయబోతున్న ప్లాంట్ పనులపై కూడా చర్చించారు. విశాఖలో అంతర్జాతీయ స్థాయి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని లోకేష్ ఎల్జి ప్రతినిధులను కోరారు. దాదాపు 468 కోట్ల రూపాయల వ్యయంతో ఏపీలో సెమీ కండక్టర్ అసెంబ్లీ, ప్యాకేజింగ్, టెస్టింగ్ కేంద్రాన్ని నిర్మిస్తున్న అపాక్ట్ సంస్థతో మాట్లాడి.. రాబోయే రోజుల్లో ఏపీ యువతకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేలా స్కిల్ డెవలప్మెంట్ అకాడమీతో ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రతిపాదించారు.

* ఫుట్వేర్ రంగానికి సైతం..
మరోవైపు స్మార్ట్ హెల్త్ కేర్ ఫుట్వేర్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్న షూ అల్స్ సంస్థ ప్రతినిధులతో లోకేష్ కీలక చర్చలు జరిపారు. ఏపీలో ప్రతిపాదిత 300 కోట్ల రూపాయల ఫుట్వేర్ ప్రాజెక్టు వేగవంతం చేయాలని కోరారు. దీంతో మూడు వేల మంది స్థానిక యువతకు ఉపాధి లభించనుంది. మొత్తానికి అయితే లోకేష్ దక్షిణ కొరియా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. వేలకోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.

అగ్రిగోల్డ్ కేసులో సంచలనాలు తప్పవా?!

AgriGold Case
AgriGold Case

AgriGold Case: అగ్రిగోల్డ్ బాధితులకు ఇంతవరకు న్యాయం జరగలేదు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన జరిగింది. 2019 ఎన్నికల్లో అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరిస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఆరు నెలల్లో పరిష్కార మార్గం చూపిస్తానని చెప్పడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది బాధిత కుటుంబాలు, వారి బంధువులు పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. కానీ ఐదేళ్ల వైసిపి పాలనలో ఎటువంటి న్యాయం జరగలేదు అగ్రిగోల్డ్ బాధితులకు.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 11 లక్షల మంది అగ్రిగోల్డ్ డిపాజిటర్లు ఉన్నారు. అయితే వారికి న్యాయం చేయకపోగా గత ఐదేళ్లలో వైసిపి నేతలు చేసిన పనులు అందరికీ తెలిసినవే. అయితే అగ్రిగోల్డ్ భూములను కొల్లగొట్టేందుకు వైసిపి నేతలు ప్రయత్నించారన్న ఆధారాలు ఇప్పుడు లభిస్తుండటం సంచలనంగా మారింది.

* అమలు కాని హామీ…
అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో అగ్రిగోల్డ్ బాధితుల కోసం 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తానని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఐదేళ్ల తన పాలనలో డిపాజిటర్లకు రూపాయి కూడా ఇవ్వలేకపోయారు. అందుకే ఈ విషయంలో కూటమి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తోంది. సీఎం చంద్రబాబు అగ్రిగోల్డ్ వ్యవహారం పై ప్రత్యేకంగా త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించారు. దీంతో వైసిపి హయాంలో జరిగిన అరాచకాలు బయటపడుతున్నాయి.

* పత్రాలతో పాటు రికార్డులు మాయం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అగ్రిగోల్డ్ ఆస్తులకు సంబంధించిన పత్రాలు, భూ రికార్డులను ఒక పద్ధతి ప్రకారం న్యాయం చేశారు. ఈ కేసును దర్యాప్తు చేసిన ఏపీ సిఐడి వద్ద భద్రంగా ఉండాల్సిన డిజిటల్ ఆధారాలు, హార్ట్ డిస్క్లు సైతం మాయం అయినట్లు తెలుస్తోంది. దీని వెనుక అప్పటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల హస్తం ఉన్నట్లు ఈ మంత్రి వర్గ ఉప సంఘం లో సభ్యుడైన మంత్రి నాదెండ్ల మనోహర్ ఆందోళన వ్యక్తం చేశారు. డిపాజిటర్లకు చందాల్సిన వేల కోట్ల విలువైన ఆస్తుల లోకేషన్లు, వేలం వివరాలు కోర్టులకు అందకుండా చేసేందుకే నాటి ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో ఈ రికార్డుల విధ్వంసం జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి.

* కదలనున్న డొంక..
ప్రధానంగా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన జోగి రమేష్ పైనే ఆరోపణలు వస్తున్నాయి. సిఐడి, ఈడి అటాచ్మెంట్ లో ఉన్న విజయవాడ రూరల్ అంబాపురంలోని అగ్రిగోల్డ్ స్థలాలను ఫోర్జరీ డాక్యుమెంట్లు, నకిలీ సర్వే నంబర్లకు తన కుమారుడు, సోదరుడి పేరిట మార్పించి, ప్లాట్లుగా చేసి విక్రయించడం ద్వారా జోగి రమేష్ కుటుంబం కోట్ల రూపాయలు వెనుకేసుకున్నట్లు ఏసీబీ, సిఐడి విచారణలో ఆధారాలతో సహా దొరికిపోయింది. ఈ ల్యాండ్ స్కామ్ లో ఇప్పటికే జోగి రమేష్ కుమార్ ని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అందుకే ఈ మొత్తం వ్యవహారంలో ఉన్న వైసీపీ నేతల హస్తం బయటపడే వీలుగా ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతోంది.

వీలైనంత త్వరగా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకు ఆరు నెలల గడువు విధించింది. ఈలోగా పక్కాగా న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. సిఐడి జప్తు చేసిన అన్ని స్థిరాస్తులను కోర్టుల ద్వారా వేగంగా వేలం వేసి.. ఆ సొమ్మును నేరుగా బాధితుల ఖాతాల్లో జమ చేసేందుకు వీలుగా లీగల్, సిఐడి విభాగాలను ప్రభుత్వం సమన్వయం చేస్తోంది. అగ్రిగోల్డ్ ఏజెంట్లనుంచి నెల రోజుల్లో బాండ్లు సేకరించాలని.. ప్రతి 15 రోజులకు ఒకసారి మంత్రుల కమిటీ ప్రగతిని సమీక్షిస్తుందని కూడా తెలుస్తోంది. మొత్తానికి అయితే అగ్రిగోల్డ్ వ్యవహారంలో సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది.

ఏపీలో పెరిగిన హిందుత్వవాదం!

Hindutva in AP
Hindutva in AP

Hindutva in AP: ఏపీలో సెక్యులర్ భావజాలం ఎక్కువ. ఇక్కడ మతానికి పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ పాతబస్తీలో ముస్లిం ప్రాబల్యం అధికంగా ఉండేది. అంతకుమించి మతం అనే మాట ఉండేది కాదు. వాస్తవానికి ఉమ్మడి ఏపీ మద్రాస్ ప్రెసిడెంట్ లో ఉండేది. అక్కడ ద్రవిడ భావజాలం ఎక్కువ. అందరూ సమానమే అన్న రీతిలో నడిచేది అక్కడి భావజాలం. అదే ఏపీలో కూడా విస్తరించింది. అందుకే వామపక్షాలకు మంచి ఆదరణ ఉండేది ఏపీలో. ఒకానొక దశలో వామపక్షాలు అధికారంలోకి వస్తాయి అనే పరిస్థితి వచ్చింది. దానికి కారణం సెక్యులరిజం. కుల భావన ఉండేది గాని.. మత భావన అనేది ఏపీలో మచ్చుకైనా కనిపించేది కాదు. ఆ కారణంతోనే హిందుత్వవాదంతో ముందుకు వచ్చిన భారతీయ జనతా పార్టీ ఏపీలో ఎదగలేదు.

* ఆ పరిణామాలతోనే..
అయితే గతంతో పోల్చితే ఏపీలో హిందుత్వవాదం పెరుగుతోంది. దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ప్రధానంగా అన్యమత ప్రచారం జోరుగా సాగింది. వైసిపి ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాలకు సంబంధించి విధ్వంసాలు చోటు చేసుకున్నాయి. అప్పట్లో విగ్రహాలను ధ్వంసం చేయడం.. రథాలను దగ్ధం చేయడం వంటివి జరిగాయి. అప్పటి ప్రభుత్వం పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. అదే ఇతర మతాలకు సంబంధించిన వాటికి ప్రాధాన్యం ఇచ్చారు. ఇవన్నీ ప్రజల మనసుల్లో ఉండి పోయాయి. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ లడ్డు కల్తీ వ్యవహారం హిందూ మతం పై విపరీతంగా ప్రభావం చూపింది. ఆపై హిందూ మతానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా పెరిగాయి. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది.

* అటువంటి వారి చర్యలతో..
ఎప్పుడైతే హిందుత్వవాదం అనేది ప్రారంభం అయ్యిందో.. అప్పటినుంచి ఇతర మతాలను విపరీతంగా ప్రేమించి.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారు తట్టుకోలేకపోయారు. వారు ఓపెన్ అయ్యారు. తాజాగా అరెస్టయిన జోసెఫ్ రావణ్ ఆకోవలోకి చెందిన వారే. హిందూ దేవతలతో పాటు దేవుళ్ళపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. అటువంటి వ్యక్తి అరెస్టును హిందుత్వవాదులు ఆహ్వానించారు. హిందూ సమాజం సైతం పోలరైజేషన్ అయ్యేలా కనిపిస్తోంది. రఘురామకృష్ణం రాజు సైతం హిందుత్వ వాదాన్ని బలంగా బయటపెడుతున్నారు. ఈ క్రమంలో ఆయనను టార్గెట్ చేసుకునే తీరులో మతవాదం కనిపిస్తోంది. అందుకే ఈసారి హిందుత్వ ఓటు ఏపీలో పోలరైజేషన్ అయ్యేలా ఉంది. గతంలో ఇటువంటి ప్రయత్నాలు బిజెపి చేసింది కానీ సక్సెస్ కాలేదు. కానీ ఇప్పుడు ప్రజల్లో భావోద్వేగం బయటపడుతోంది. మరి ఇది ఇటు దారితీస్తుందో చూడాలి.

గురక వస్తోందా.. ఇలా చేస్తే మరోసారి రాదు..

Snoring Remedies
Snoring Remedies

Snoring Remedies: నిద్రపోయేటప్పుడు గురక పెట్టడం చాలా మంది సాధారణ విషయంగా భావిస్తుంటారు. అయితే తరచూ గురక రావడం కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గురకతో పాటు నిద్రలో శ్వాస ఆగిపోవడం, పగటిపూట అధిక నిద్రమత్తు, అలసట వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. అసలు గురక వల్ల ఎలాంటి నష్టం ఉంటుంది?

గురక తగ్గించుకోవడానికి మొదట నిద్రించే విధానంలో మార్పు అవసరం. వెల్లకిలా పడుకునే బదులు పక్కకు తిరిగి నిద్రపోవడం వల్ల శ్వాసనాళంపై ఒత్తిడి తగ్గి గురక వచ్చే అవకాశం తగ్గుతుంది. తలను కొద్దిగా ఎత్తుగా ఉంచే దిండు ఉపయోగించడం కూడా కొంతమందికి ప్రయోజనం కలిగిస్తుంది.

అధిక బరువు కూడా గురకకు ప్రధాన కారణాల్లో ఒకటి. మెడ చుట్టూ కొవ్వు పెరగడం వల్ల శ్వాస మార్గం ఇరుకుగా మారి గురక వస్తుంది. అందుకే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా బరువు తగ్గితే గురక సమస్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

నిద్రకు ముందు ఆల్కహాల్ తీసుకోవడం, ధూమపానం చేయడం వల్ల గొంతు కండరాలు మరింత సడలిపోతాయి. దీంతో శ్వాస మార్గం ఇరుకై గురక తీవ్రంగా మారుతుంది. అందువల్ల మద్యం, ధూమపానానికి దూరంగా ఉండటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

శరీరంలో తగినంత నీరు లేకపోయినా గొంతులోని కణజాలం పొడిబారుతుంది. దీంతో శ్వాస తీసుకునేటప్పుడు కంపనం ఎక్కువై గురక రావచ్చు. కాబట్టి రోజంతా సరిపడా నీరు తాగడం అవసరం. అలాగే దిండు, బెడ్‌షీట్లు శుభ్రంగా ఉంచడం ద్వారా దుమ్ము, అలర్జీల వల్ల వచ్చే ముక్కు బ్లాకేజ్‌ను తగ్గించుకోవచ్చు.

ప్రతిరోజూ 7 నుంచి 8 గంటలపాటు నాణ్యమైన నిద్రపోవడం కూడా చాలా ముఖ్యం. నిద్రలేమి వల్ల గొంతు కండరాలు ఎక్కువగా సడలిపోవడంతో గురక పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ప్రాణాయామం, శ్వాస వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయడం వల్ల శ్వాసక్రియ మెరుగుపడి గురక తగ్గేందుకు సహాయపడుతుంది.

అయితే జీవనశైలిలో మార్పులు చేసినప్పటికీ గురక తగ్గకపోతే లేదా నిద్రలో శ్వాస ఆగిపోవడం, ఉదయం తలనొప్పి, తీవ్రమైన అలసట వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. అవసరమైతే పరీక్షలు చేసి అసలు కారణాన్ని గుర్తించి సరైన చికిత్స తీసుకోవడం ద్వారా సమస్యను సమర్థంగా నియంత్రించవచ్చు.

జగన్ ను దూషించిన జోసెఫ్ రావణ్!

Joseph Ravan
Joseph Ravan

Joseph Ravan: జోసెఫ్ రావణ్ వ్యవహారంలో డ్యామేజ్ కంట్రోల్ లో ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అందుకే రావణ్ గతంలో జగన్మోహన్ రెడ్డి పై చేసిన కామెంట్స్ ను సోషల్ మీడియాలో హైలెట్ చేస్తోంది. గతంలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తెరపైకి తెస్తోంది. తాము జోసెఫ్ రావణ్ కు అసలు మద్దతు తెలపడం లేదని.. ఆయనపై మోపిన కేసులను.. అరెస్టులను మాత్రమే వ్యతిరేకిస్తున్నామని చెప్పుకోస్తోంది. జోసెఫ్ రావణ్ ఎపిసోడ్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరుపై విమర్శలు రావడంతో ఆ పార్టీ డామేజ్ కంట్రోల్లో పట్టింది. అందుకే ఇప్పుడు కొత్త ప్రచారానికి తెర తీసింది. అయితే ఇప్పుడు ఆయన విషయంలో ప్రత్యేక ప్రచారం చేస్తుండడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డంగా బుక్ అయినట్లు అర్థం అవుతోంది.

* దేశద్రోహం కేసు..
పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు జోసెఫ్ రావణ్. డిప్యూటీ సీఎం తో పాటు సీఎం చంద్రబాబుపై కూడా కామెంట్స్ చేశారు. అయితే ఈ విమర్శలే కాదు గతంలో ఆయన చేసిన వివాదాస్పద కామెంట్స్ ను పరిగణలోకి తీసుకొని.. దీని వెనుక పెద్ద కుట్ర ఉందని అనుమానిస్తూ పోలీసులు దేశద్రోహం కేసును నమోదు చేశారు. అయితే దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో హిందూ దేవుళ్ళతో పాటు దేవతలను దారుణంగా కించపరిచిన జోసెఫ్ రావణ్ అరెస్టు సహేతుకం అని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. హిందుత్వవాదులు అయితే ఆహ్వానిస్తున్నారు. కానీ అదే సమయంలో జోసెఫ్ రావణ్ వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉందని.. ఆయనకు న్యాయసహాయం అందిస్తోందని ప్రచారం జరిగింది. ప్రజల్లోకి బలంగా వెళ్ళింది.

* డ్యామేజ్ కంట్రోల్
ఇప్పటికే హిందుత్వ వ్యతిరేక ముద్ర వైసిపి పై ఉంది. దీంతో ఈ అంశం ప్రజల్లోకి వెళ్లడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్నర్ అవుతోంది. జోసెఫ్ రావణ్ అరెస్ట్ తర్వాత ఆయన కుటుంబ సభ్యులు గన్నవరం ఎయిర్పోర్ట్ లో జగన్మోహన్ రెడ్డిని కలిశారు. న్యాయసహాయాన్ని అర్థించారు. ఆ విషయం చూడమని దేవినేని అవినాష్కు పురమాయించారు జగన్.. ఇంతలో జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించడం.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం ఎంట్రీ కావడం జరిగింది. దీంతో రావణ్ వెనుక వైసిపి ఉందనేది ప్రజల్లోకి వెళ్ళింది. ఈ మొత్తం ఎపిసోడ్లో వైసీపీ కార్నర్ అవుతోంది. ప్రజల్లోకి తప్పుడు సంకేతం వెళ్తుండడంతో వైసిపి డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా.. గతంలో జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేసిన జోసెఫ్ రావణ్ వీడియోలను సోషల్ మీడియాలో హైలెట్ చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.

తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ వీరాభిమాని కన్నుమూత.. శోకసంద్రంలో డీసీఎం

Niranjan Death
Niranjan Death

Niranjan Death: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ (17) ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ విషయం ప్రతి ఒక్కరిని తీవ్రమైన దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. వరంగల్ లోని హన్మకొండ కి చెందిన నిరంజన్ ఒక రకమైన జన్యు పరమైన వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడు. అతను చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని కావడంతో ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ అతన్ని కలిసి పరామర్శించాడు. ఇక అతనికి గిఫ్ట్ లను ఇచ్చి ఓ జి సినిమాని మనిద్దరం కలిసి చూద్దాం అని కూడా చెప్పి అతనికి ధైర్యాన్ని ఇచ్చాడు. ఇక ఈరోజు తెల్లవారుజామున నిరంజన్ ఆరోగ్యం విషమించడంతో ఆయన మరణించాడు. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం నిరంజన్ మృతి పట్ల వల్ల సానుభూతిని తెలియజేస్తున్నారు…

మొత్తానికైతే పవన్ కళ్యాణ్ తన అభిమానిని కొద్ది రోజులైనా ఆనందంగా ఉంచాలనే ఉద్దేశ్యంతో తనను వెళ్లి కలిసి అతనికి ఒక ధైర్యాన్ని నింపడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి… నిరంజన్ మరణ వార్త తెలుసుకున్న వెంటనే రెండు తెలుగు రాష్ట్రాలు సైతం ఉలిక్కిపడ్డాయి.

ఆయన ఇంకా కొన్ని రోజులు బతుకుతాడేమో అని అందరూ అనుకున్నారు కానీ ఆరోగ్యం విషమించడం తో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఇక ఈ విషయం మీద ఇప్పటికే కొంతమంది సినీ రాజకీయ ప్రముఖులు సైతం స్పందిస్తున్నారు.

నిరంజన్ వాళ్ల కుటుంబం మాత్రం శోకసంద్రంలో మునిగిపోయిందనే చెప్పాలి. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ వెళ్లి అతన్ని కలవడం వల్ల ఆయన పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలిసిపోయింది. తద్వారా అతని మృతి పట్ల ప్రతి ఒక్కరు వాళ్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు…