Home Blog Page 14

ఈ ఇయర్ అత్యధిక కలెక్షన్స్ ను కొల్లగొట్టే మూవీ ఇదే...

Highest Grossing Movie 2026
Highest Grossing Movie 2026

Highest Grossing Movie 2026: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ లను బట్టే క్రేజ్ వస్తుంది. వాళ్ళ మార్కెట్ కూడా పెరుగుతుంది. హీరోల ఇమేజ్ కూడా తారాస్థాయికి వెళ్లాలంటే వాళ్లకు వచ్చిన సక్సెస్ లను బట్టే క్యాలిక్లెట్ చేస్తారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సంవత్సరం చాలామంది హీరోలు వాళ్ళ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వాళ్ళలో ఇప్పటివరకు భారీ విజయాన్ని సాధించిన సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమా మొదటి స్థానంలో నిలిచింది… ఈ సంవత్సరం ఇప్పటికే ఆరు నెలలు గడిచిపోయింది. ఇక మిగతా 6 నెలల్లో మరికొన్ని సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇక ఈ సినిమాలన్నింటిలో ఏ సినిమా సూపర్ సక్సెస్ గా నిలిచి ఈ సంవత్సరం భారీ సక్సెస్ ని సాధించబోతుంది అనే విషయంలో సరైన క్లారిటి రావాల్సి ఉంది .ప్రస్తుతానికైతే చిరంజీవి హీరోగా చేసిన మన శంకర్ వరప్రసాద్ సినిమా 400 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టి టాప్ వన్ లో నిలిచింది.

ఇక ఇప్పుడు రాబోతున్న సినిమాల్లో ఈ సినిమాలేవీ కూడా 400 కోట్ల కలెక్షన్స్ ను వసూలు చేసే అవకాశాలు లేనట్టుగా తెలుస్తుంది. విజయ్ దేవరకొండ ‘రణబాలి’ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంటే ఆ మూవీకి భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. కానీ అది ఎంతవరకు సాధ్యపడుతుంది అనేది క్లారిటీగా తెలియడం లేదు.

ఇక నాని హీరోగా వస్తున్న ప్యారడైజ్ మూవీ ఇప్పటికే ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలను పెంచేసింది. కానీ ఈ సినిమా ఈ సంవత్సరం వస్తుందా? లేదా అనేది విషయంలో ఇప్పటికి సరైన క్లారిటి రావడం లేదు. ఆగస్టు 21వ తేదీన ఈ సినిమాని ప్రేక్షకు ముందుకు తీసుకురావాలనే సన్నాహాలు చేశారు. కానీ ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ని ఇంకా అనౌన్స్ చేయలేదు…

ఇక మిగతా కొన్ని సినిమాలు రిలీజ్ రెడీ అవుతున్నప్పటికి ఆ సినిమాలు భారీ సక్సెస్ ని సాధించినా కూడా 400 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టే అవకాశం లేదు అంటు కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఈ లెక్కన మెగాస్టార్ చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ సినిమానే ఈ ఇయర్ బిగ్గెస్ట్ సక్సెస్ గా నిలిచే అవకాశాలైతే ఉన్నాయంటూ మరి కొంతమంది ట్రేడ్ పండితులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండడం విశేషం…

SBI కొత్త సైబర్ స్కామ్.. అప్రమత్తంగా ఉండకపోతే ఖాతా ఖాళీ..

SBI Cyber Scam
SBI Cyber Scam

SBI Cyber Scam: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మరో కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారు. ఇప్పటికే రివార్డ్ పాయింట్లు, KYC అప్‌డేట్, బ్యాంక్ ఖాతా బ్లాక్ అవుతుందంటూ ప్రజలను మోసం చేస్తున్న వీరు.. ఇప్పుడు SBI YONO యాప్‌ను వెంటనే అప్‌డేట్ చేయకపోతే మీ బ్యాంక్ ఖాతాలోని డబ్బు ప్రమాదంలో పడుతుందని భయపెడుతూ ఫేక్ సందేశాలు పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని SBI అధికారికంగా హెచ్చరించింది. ఈ మోసం ఎలా ఉంటుందంటే?

సైబర్ నేరగాళ్లు SMSలు, వాట్సాప్ సందేశాలు లేదా ఈ-మెయిల్స్ ద్వారా ‘YONO యాప్‌ను వెంటనే అప్‌డేట్ చేయండి’ అంటూ ఓ లింక్ పంపిస్తున్నారు. ఆ లింక్‌పై క్లిక్ చేస్తే అధికారిక యాప్ కాకుండా ఫేక్ APK ఫైల్ డౌన్‌లోడ్ అవుతుంది. దానిని మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసిన వెంటనే ఫోన్‌లోని వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, OTPలు, పాస్‌వర్డ్లు వంటి సున్నితమైన డేటా సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉంది. అనంతరం బాధితుల బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బును దోచేస్తున్నారు.

ఈ తరహా మోసాలపై స్పందించిన SBI.. YONO యాప్‌ను ఎప్పుడూ అధికారిక Google Play Store లేదా Apple App Store నుంచే అప్‌డేట్ చేసుకోవాలని స్పష్టం చేసింది. SMSలు, వాట్సాప్ లేదా ఈ-మెయిల్ ద్వారా వచ్చే APK ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్‌లోడ్ చేయవద్దని, తెలియని లింక్‌లపై క్లిక్ చేయవద్దని సూచించింది. బ్యాంకు ఎప్పుడూ ఈ విధంగా APK ఫైల్స్ పంపదని కూడా వెల్లడించింది.

ఖాతాదారులు తమ బ్యాంకింగ్ వివరాలు, OTP, CVV, PIN, పాస్‌వర్డ్ వంటి గోప్య సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని SBI సూచిస్తోంది. అనుమానాస్పద సందేశాలు, కాల్స్ లేదా లింకులు ఎదురైతే వెంటనే వాటిని విస్మరించి, బ్యాంకును సంప్రదించాలని తెలిపింది.

ఒకవేళ ఇటువంటి సైబర్ మోసానికి గురైనట్లయితే లేదా అనుమానాస్పద లావాదేవీలు గమనించినట్లయితే వెంటనే జాతీయ సైబర్ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేయాలని, అలాగే సమీపంలోని SBI శాఖను సంప్రదించాలని బ్యాంక్ సూచించింది. అదనంగా, జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. కొద్దిపాటి అప్రమత్తతతోనే ఇటువంటి సైబర్ మోసాల నుంచి తమ డబ్బును, వ్యక్తిగత సమాచారాన్ని రక్షించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

డైరెక్టర్ల కెరియర్లతో ఆడుకుంటున్న స్టార్ హీరోలు...

Star Heroes
Star Heroes

Star Heroes: సినిమా ఇండస్ట్రీ అనగానే స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకు వస్తారు…కారణం వాళ్ళకి ఉన్న క్రేజ్, వాళ్ల మీద ప్రేక్షకులు పెంచుకున్న అభిమానం ఇవి అన్ని కలిపి సినిమా అంటే స్టార్ హీరో అనే రేంజ్ కి తీసుకువచ్చాయి. ఇప్పుడున్న స్టార్ హీరోలు వాళ్ళ ఇమేజ్ ను పెంచుకోవడానికి వాళ్లకు కావాల్సినట్టుగా సినిమాలను తెరకెక్కిస్తున్నారు. కొంతమంది హీరోలయితే దర్శకులను పక్కన పెట్టీ వాళ్ళే డైరెక్షన్ చేసేసుకుంటున్నారు. ఇప్పటివరకు టాప్ హీరోలుగా వెలుగొందుతున్న చాలా మంది హీరోలు ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారు. ఇది చూస్తున్న ఆయా మూవీస్ డైరెక్టర్స్ మాత్రం హీరోలే సినిమాలు వాళ్ళకి నచ్చినట్టుగా తీసుకున్న తర్వాత ఇక మేము ఉంది దీనికి అంటూ చాలామంది దర్శకులు సైతం నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదంతా చూస్తున్న సినిమా మేధావులు సైతం దర్శకుల పనిలో హీరోలు ఎందుకు వేలు పెట్టడం అనే చర్చలు కొనసాగిస్తున్నారు. కొంతమంది స్టార్ హీరోలు మాత్రం దర్శకులకు పూర్తిగా సరెండర్ అయిపోయి వాళ్లు ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఇంకొంతమంది హీరోలు మాత్రం వారికి దర్శకత్వం విభాగంలో ఎంతో కొంత ప్రావీణ్యం ఉండడం వల్ల వాళ్లకు తగ్గట్టుగా సినిమాలను తెరకెక్కించాలని దర్శకుల మీద ఒత్తిడి తెస్తున్నారు. ఇక దానికి తగ్గట్టుగానే వాళ్లను ఫోర్స్ చేసి మరి వాళ్లతో సినిమాలను చేయించుకుంటున్నారు. ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న దర్శకుల కెరియర్ తో స్టార్ హీరోలు ఆటలాడుకుంటున్నారు అంటూ మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.

ఇప్పటివరకు చాలామంది దర్శకులు ఇలా హీరోల చేతుల్లో నలిగిపోయిన వారే కావడం వల్ల అందుకే వాళ్ళు మీడియం రేంజ్, చిన్న హీరోలతో సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు… స్టార్ హీరోలు ఎందుకని అలా చేస్తున్నారు దాని వల్ల వాళ్ళ కెరియర్ కి కూడా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది కదా అంటే వాళ్లకు డైరెక్షన్ చేయాలని ఆశ ఉంటుంది.

స్వతహాగా డైరెక్షన్ చేస్తే ఏదైనా తేడా జరిగితే వల్ల మార్కెట్ కి ఇబ్బంది కలుగుద్ది కాబట్టి దర్శకుడు చేసే పనిలో వాళ్ల ఇన్వాల్వ్మెంట్ ఉండాలనుకుంటున్నారు.అలా చేయడం వల్ల ఆ మూవీ హిట్ అయితే ఇది నా వల్లే హిట్ అయిందని చెప్పుకుంటారు. దాంతో మనకి కూడా దర్శకత్వం చేసే కెపాసిటీ ఉందనే నమ్మకం వాళ్ళకి కలుగుతుంది.

ఒకవేళ సినిమా తేడా కొడితే మాత్రం అదంతా దర్శకుడు మీద తోసేసి దర్శకుడు వల్లే సినిమా ఫ్లాప్ అయిందని చెప్పుకుంటున్నారు. దీనివల్ల సినిమా ప్లాప్ అఅవ్వడమే కాకుండా కొంత మంది దర్శకుల కెరియర్లు కూడా నాశనం అయిపోతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని హీరోలు వాళ్ల పనులు చేసుకుంటే బాగుంటుందని విమర్శకులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…

బాలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తున్న అడివి శేష్.. మొదటి సినిమా డైరెక్టర్ ఎవరంటే..

Adivi Sesh
Adivi Sesh

Adivi Sesh: విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులకు అద్భుతమైన థియేట్రికల్ అనుభూతి ని కలిగించాలని తపన పడే హీరోల్లో ఒకరు అడివి శేష్. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న అడివి శేష్ , ఆ తర్వాత హీరో గా మారి వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నారు. అడివి శేష్ సినిమా వస్తుందంటే చాలు , కళ్ళు మూసుకొని థియేటర్ కి వెళ్లిపోయే ఆడియన్స్ ఉన్నారు. అలాంటి ఆడియన్స్ కారణంగా ఆయన లేటెస్ట్ చిత్రం ‘డెకాయిట్’ కి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కూడా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఆయన తన ఫోకస్ ని బాలీవుడ్ పై పెట్టారు.

త్వరలోనే ఆయన బాలీవుడ్ లోకి ఒక భారీ యాక్షన్ డ్రామా సినిమా చేయబోతున్నారు. రీసెంట్ గానే బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఒక యంగ్ డైరెక్టర్ ఈ సినిమాకు పని చేస్తారట. ధర్మ ప్రొడక్షన్స్ పై కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు సమాచారం. అక్టోబర్ నెల నుండి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయట. ప్రస్తుతానికి అడివి శేష్ ‘గూఢచారి 2’ చిత్రం లో నటిస్తున్నారు. అయన కెరీర్ లో మైల్ స్టోన్ గా నిల్చిన ‘గూఢచారి’ చిత్రానికి ఇది రీమేక్. 100 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వామికా గబ్బీ ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తోంది , ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో నటిస్తున్నారు. వినయ్ కుమార్ సిరిగినీడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది సెకండ్ హాఫ్ లోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మొదటి భాగం అతి తక్కువ బడ్జెట్ తో తీసినప్పటికీ ప్రొడక్షన్ వాల్యూస్ వేరే లెవెల్ లో ఉండేలా చూసుకున్నావారు అడివి శేష్. ఆ చిత్రానికి కథ , స్క్రీన్ ప్లే అందించింది కూడా ఆయనే. ఈ చిత్రానికి కూడా ఆయన కథ , స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మరి పార్ట్ 1 రేంజ్ లో ఈ సినిమా కూడా భారీ విజయం సాధిస్తుందో లేదో చూడాలి.

ఈ ఐదు రాశుల వారికి ఈరోజు అన్ని శుభాలే..

Today 8 July 2026 Horoscope
Today 8 July 2026 Horoscope

Today 8 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై రేవతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈ రోజు అనుకోకుండా శుభ ఫలితాలు ఉండనున్నాయి. మరి కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈరోజు కెరియర్ విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారులకు గతంలో కంటే ఎప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా గడుస్తుంది. ప్రియమైన వారి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు అనేక రంగాల్లో రాణిస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. ఇతరులకు డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయవద్దు. అధికారుల నుంచి ఉద్యోగులు ప్రశంసలు పొందుతారు. కొందరికి పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి ఈ రోజు అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి ఇతరుల సహాయం తీసుకుంటారు. ఉద్యోగులకు కార్యాలయాలు అనుకూలమైన వాతావరణం ఉండడంతో ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు సకాలంలో డబ్బు అందుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. ఉద్యోగులు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. కొత్తగా ప్రాజెక్టులు చేపట్టే వారికి ఇదే మంచి సమయం. ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారులు భావోద్వేగాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు తోటి వారి సహకారం ఉండడంతో ప్రాజెక్టులను వెంటనే పూర్తిచేస్తారు. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు.

కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారులకు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి మద్దతు పొందుతారు. గతంలో కంటే ఇప్పుడు వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పొదుపు చేయడానికి ఆసక్తి చూపుతారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు ప్రమోషన్ గురించి శుభవార్తలు వందే అవకాశం ఉంది. వ్యాపారులు గతంలో కంటే ఇప్పుడు అధిక లాభాలు పొందుతారు. అనుకోకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడం పై విద్యార్థులు ఆసక్తి చూపుతారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. వ్యాపారులకు ఆదాయం ఘననీయంగా పెరుగుతుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశ్నించడం అందుతాయి. కొత్త వాహనాలు కొనుగోలు చేయడంలో ఆసక్తి చూపుతారు. జీవిత భాగస్వామి సహకారంతో వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. ఇంటికి సంబంధించిన కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అనవసరమైన రిస్కులు తీసుకోకుండా ఉండడమే మంచిది. భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొత్తగా పెట్టుబడును పెట్టడానికి ఇదే మంచి సమయం. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. దీంతో కుటుంబ వాతావరణం సంతోషంగా గడుస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారులు ప్రత్యర్థులపై కన్నీసి ఉంచాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. అవసరం ఉన్న వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలి. భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దల అండదండలతో కొత్తగా పెట్టుబడులు పెడతారు.

నడివీధుల్లో ఈత కొడుతున్న ముంబై వాసులు.. ఎందుకు ఈ పరిస్థితి అంటే..

Mumbai Floods

Mumbai Floods : వర్షాకాలం వచ్చిందంటే చాలు ముంబై నగర వాసుల పరిస్థితి వెనిస్ నగరంలో ఉన్నట్టే ఉంటుంది. ఎందుకంటే అక్కడ వర్షాలు విపరీతంగా కురుస్తాయి. పైగా ముంబై నగరంలో ప్రతి వర్షాకాలంలో క్లౌడ్ బరస్ట్ అన్నట్టుగా వర్షాలు పడుతుంటాయి. ఈ వర్షాల వల్ల అక్కడ జనజీవనం పూర్తిగా స్తంభించిపోతుంది. గత సంవత్సరాలతో పోల్చి చూస్తే ఈ సంవత్సరం వర్షాకాలం అక్కడ కాస్త ఆలస్యంగా మొదలైంది. అయినప్పటికీ భారీ వర్షాలు ఆ ప్రాంతంలో దంచి కొడుతున్నాయి. ఫలితంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారుతుంది.

ఇటీవల ముంబై లోకల్ రైల్వే పట్టాల మీదికి వరద నీరు వచ్చింది. దీంతో లోకల్ రైళ్లు రద్దయ్యాయి. ముంబై కి శివారు ప్రాంతంలో వర్షాల వల్ల పర్వతప్రాంతాల నుంచి మట్టి కొట్టుకు వచ్చింది. రాళ్లు కూడా దారులకు అడ్డంగా పడ్డాయి. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అక్కడ ఇప్పటికి సహాయక కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముంబై నగరంలో కురుస్తున్న వర్షాలకు చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే నడుములోకి వరకు వరదనీరు వచ్చి చేరింది. దీంతో ఆ ప్రాంతంలో రాకపోకలు ఆగిపోయాయి.

చాలా రోజుల తర్వాత పూర్తిస్థాయిలో వర్షాకాలం ఆస్వాదిస్తున్న నేపథ్యంలో ముంబై నగర వాసులు ఈ వరద నీటిని పెద్ద ఇబ్బందిగా అనుకోవడం లేదు. ఈ వరద నీటిలో ఈ త కొడుతున్నారు. ఆ వరద నీటిని స్విమ్మింగ్ పూల్ లాగా భావిస్తున్నారు. అందులో ఈత కొట్టి ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా సర్కులేట్ అవుతున్నాయి. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ముంబై నగరంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

వాస్తవానికి రుతుపవనాలు మనదేశంలో ప్రవేశించిన తర్వాత మహారాష్ట్రలో విపరీతంగా వర్షాలు కురుస్తూ ఉంటాయి. అనుకూల వాతావరణం కనుక ఉండి ఉంటే మహారాష్ట్రలో సమృద్ధిగా వర్షాలు పడుతుంటాయి. అయితే ఈసారి రుతుపవనాల విస్తరణ ఆశించిన స్థాయిలో లేకపోవడం.. వాతావరణంలో మార్పులు స్పష్టంగా ఉండడంతో వర్షాలు కురవలేదు. అయితే ఆలస్యంగా నైనా వర్షాలు మొదలు కావడం.. అవి కూడా రికార్డు స్థాయిలో వర్షపాతాన్ని నమోదు చేయడంతో మహారాష్ట్రలో ఒకప్పటి వాతావరణం కనిపిస్తుంది. దీనికి తోడు వర్షాల వల్ల ముంబై నగరం చాలావరకు తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. ఈ నీటిలోనే ముంబై నగరవాసులు ఈతకొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. వర్షాకాలాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదిస్తున్నారు. మొన్నటి దాకా తాము ఎండలతో ఇబ్బంది పడ్డామని.. ఇప్పుడు వర్షాలు కురుస్తుంటే ఆనందిస్తున్నామని చెబుతున్నారు.

చైనాకు చెక్ పెట్టిన నరేంద్ర మోడీ.. ఈ ప్లాన్ మామూలుగా లేదుగా..

Narendra Modi

ఇటీవల కాలంలో మన చుట్టూ ఉన్న సముద్ర ప్రాంతాలలో పట్టు సాధించడానికి చైనా అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. పాకిస్తాన్ దేశంతో దోస్తీ కడుతోంది. బంగ్లాదేశ్ తో కూడా మైత్రి కొనసాగిస్తోంది. చివరికి చిన్న చిన్న దేశాలను కూడా వదిలిపెట్టడం లేదు. తద్వారా భవిష్యత్ కాలంలో ఏవైనా పరిణామాలు జరిగితే.. మన దేశాన్ని ఇబ్బంది పెట్టడానికి చైనా అందించిన ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. సహజంగానే చైనా దుర్మార్గమైన దేశం. తన ప్రయోజనాల కోసం ఏమైనా చేసే దేశం. అలాంటప్పుడు చైనాతో జాగ్రత్తగా ఉండాలి. చైనా తో స్నేహం కొనసాగించే దేశాలతో భారత్ మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇదే సమయంలో వ్యూహాత్మక ధోరణి ప్రదర్శించాలి.

సరిగ్గా ఇదే ఆలోచనతో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇండోనేషియా దేశంలో పర్యటిస్తున్నారు. కీలకమైన ఒప్పందాలు చేసుకుంటున్నారు. అయితే అక్కడితోనే నరేంద్ర మోడీ ఆగిపోవడం లేదు. చైనాకు ఏకకాలంలో చెక్ పెట్టే విధంగా ఇండోనేషియాతో ఆయన ఒప్పందాలకు కుదుర్చుకున్నారు. ఇందులో ప్రధానమైనది మలక్కా జల సంధి వద్ద నిర్మిస్తున్న సబాంగ్ పోర్ట్.

ఈ పోర్టును భారత్.. ఇండోనేషియా దేశాలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తాయి. మలక్కా జల సంధి ద్వారా 40% గ్లోబల్ ట్రేడ్ జరుగుతుంది. చైనా టోటల్ మారీ టైం ట్రేడ్ 60 నుంచి 70% ఇక్కడ నుంచే సాగుతూ ఉంటుంది. ఈ జలసంధికి 100 మైళ్ళ దూరంలో భారత్.. ఇండోనేషియా కలిసి సభాంగ్ పోర్టు నిర్మిస్తున్నాయి. దీంతోపాటు భారత్ ఇండోనేషియా తో కలిసి అత్యంత వ్యూహాత్మకమైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.. ఇటీవల కాలంలో హార్మోజ్ జల సంధి మూతపడితే ప్రపంచం ఏ స్థాయిలో ఒత్తిడి ఎదుర్కొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేటి ఆధునిక కాలంలో కూడా చాలావరకు సరుకు రవాణా జల సందుల మీదుగానే సాగుతూ ఉంది. అలాంటప్పుడు వ్యూహాత్మకంగా పోర్టులు నిర్మించుకుంటే భవిష్యత్తు కాలంలో వచ్చే ఇబ్బందులను సులువుగా ఎదుర్కోవచ్చు.

సబాంగ్ పోర్టు ద్వారా భారత చైనాకు చెక్ పెడుతుంది. ఎలాగంటే చైనాకు సంబంధించిన ట్రేడ్ లో సింహభాగం ఇక్కడి నుంచే కొనసాగుతూ ఉంటుంది. అలాంటప్పుడు భారత్ ఇక్కడ పోర్ట్ నిర్మిస్తే.. చైనా ఒకవేళ భవిష్యత్తు కాలంలో తోక జాడించే కార్యక్రమాలకు శ్రీకారం చుడితే.. భారత్ ఇక్కడ అడ్డుకోవచ్చు. ఫలితంగా చైనాకు వాణిజ్యపరంగా ఎదురు దెబ్బ తగులుతుంది. చైనా జుట్టు మన చేతిలో ఉండాలంటే కచ్చితంగా ఇండోనేషియా మనకు అనుకూలంగా ఉండాలి. అన్నిటికంటే ఇక్కడి పోర్టు మీద మన పెత్తనం ఉండాలి. అందువల్లే నరేంద్ర మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇండోనేషియాతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఈ ప్రీమియం ఫోన్ పై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ.13వేల డిస్కౌంట్..

Google Pixel 10A Series

Google Pixel 10 : ప్రీమియం ఫోన్లు కొనాలని చాలా మందికి ఉంటుంది. కానీ వాటి ధరలు చూసి వెనుకడుగు వేస్తారు. అయితే ఒక్కోసారి వీటి సేల్స్ పెంచుకునేందుకు ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటారు. లేటేస్ట్ గా గూగుల్ పిక్సెల్ 10 పై భారీ డిస్కౌంట్ ను ప్రకటించారు. ఈ ఫోన్ పై ఏకంగా రూ.13,000 డిస్కౌంట్ ను ప్రకటించారు. అధునాతన ఫీచర్లు, అప్డేట్ ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ పై ఎంత డిస్కౌంట్ లభిస్తుంది? ఇందులో ఉండే ఫీచర్లు ఏంటీ? పూర్తి వివరాల్లోకి వెళితె..

Google Pixel 10 మొబైల్ లో 6.3 AMOLED డిస్ ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. 3000 nits పీక్ బ్రైట్‌నెస్‌తో కూడిన దీనికి గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణ కల్పించారు. ఇందులో గూగుల్ సొంతంగా తయారు చేసిన శక్తివంతమైన Tensor G5 చిప్‌సెట్‌ ను అమర్చారు. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఓఎస్‌తో వస్తుంది. అంతేకాకుండా, దీనికి గూగుల్ ఏకంగా 7 సంవత్సరాల పాటు సాఫ్ట్‌వేర్, సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తామని హామీ ఇచ్చింది.

సున్నితమైన మల్టీటాస్కింగ్ కోసం గూగుల్ పిక్సెల్ 10 లో 12GB RAM తో పాటు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అందించారు. నాన్ ప్రో మోడల్స్‌లో మొదటిసారిగా గూగుల్ ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను పరిచయం చేసింది. దీని వెనుక భాగంలో 48MP ప్రధాన కెమెరా, 13MP అల్ట్రా వైడ్ లెన్స్, 5x ఆప్టికల్ జూమ్ సామర్థ్యం ఉన్న 10.8MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 10.5MP ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఈ మొబైల్ లో 4,970mAh సామర్థ్యం గల బ్యాటరీ ఉండగా.. దీనికి 30W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ పాటు 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌లో ఇన్-బిల్ట్‌గా సరికొత్త AI ఫీచర్లు ఉన్నాయి. రైటింగ్ అసిస్టెన్స్, పిక్సెల్ స్టూడియో, మ్యాజిక్ క్యూ, సర్కిల్ టు సెర్చ్ మరియు ఫోటో ఎడిటింగ్ కోసం ‘ఆస్క్ ఫోటోస్’ వంటి ఎన్నో ఉపయోగకరమైన ఫీచర్లు రోజువారీ పనులను మరింత సులువు చేస్తాయి.

ఇదిలా ఉండగా.. అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ ముగింపు సందర్భంగా గూగుల్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ Google Pixel 10 పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. లాంచ్ సమయంలో దీని అసలు ధర రూ. 79,999 ఉండగా, ఈ ఆఫర్ లో ఏకంగా రూ. 13,000 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తూ రూ. 66,999 కే అమెజాన్‌లో అందుబాటులో ఉంచారు. దీనితో పాటు పాత ఫోన్ ఎక్స్ఛేంజ్‌పై అదనపు తగ్గింపులు, బ్యాంక్ కార్డ్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యాలు కూడా లభిస్తుండటంతో ఈ ప్రీమియం ఫోన్‌ను సొంతం చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా మారింది.

అయ్యర్ కు కెప్టెన్సీ.. మేనేజ్మెంట్ పై సూర్య ఆగ్రహం.. క్లారిటీ

Suryakumar Shreyas

Suryakumar Yadav : నేటి సోషల్ మీడియా కాలంలో ఇదిగో పులి అంటే.. అదిగో తోక అన్నట్టుగా సాగుతోంది ప్రచారం. నిజాలు, అబద్దాలతో సంబంధం లేదు.. ప్రచారం ఉంటే చాలు.. దాన్ని నమ్మేవాళ్ళు నమ్ముతున్నారు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు.. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ విషయంలో కూడా ఇలానే జరుగుతుంది.

టీమిండియా టి20 సారధిగా మొన్నటిదాకా కొనసాగిన అతడిని.. మేనేజ్మెంట్ పక్కన పెట్టింది. అతని స్థానంలో అయ్యర్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. అయ్యర్ నాయకత్వంలో టీం ఇండియా ఐర్లాండ్ జట్టు మీద సిరీస్ కోల్పోయింది. తొలిసారిగా వైట్ వాష్ కు గురైంది. ఇంగ్లాండ్ గడ్డమీద కూడా టీం ఇండియా ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోతోంది. తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దు అయితే.. రెండవ మ్యాచ్ ఇంగ్లాండ్ గెలిచింది. వాస్తవంగా ఈ మ్యాచ్లో ఇండియా గెలవాలి. కానీ బౌలింగ్ లోపం వల్ల టీమిడియా ఓటమిపాలైంది.

అయ్యర్ కు కెప్టెన్సీ ఇవ్వడంతో సూర్య కుమార్ యాదవ్ మేనేజ్మెంట్ మీద తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కోచ్ గంభీర్ మీద మండిపడ్డాడు. అంతేకాదు, త్వరలోనే జట్టు నుంచి అతడు బయటికి రాబోతున్నాడు.. ఇదిగో ఇలా జరుగుతోంది సోషల్ మీడియాలో ప్రచారం. పైగా దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వీడియోలు సూర్య కుమార్ యాదవ్ కంటపడ్డాయి. దీంతో ఆయన స్పందించక తప్పలేదు.

” జట్టు ఎంపిక విషయంలో ఎప్పటికీ సానుకూల దృక్పథంతోనే ఉంటాను. దేశం కోసం ఆడాను. దేశం గొప్పగా ఉండాలని భావిస్తాను. దేశం కోసం ఆడతాను. దేశానికి సంబంధించి ఎప్పటికీ నేను మద్దతు ఇస్తూనే ఉంటాను. సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న వీడియో నా దృష్టికి వచ్చింది. అదంతా కూడా ఫేక్. నకిలీ వార్తలను నాకు భాగస్వామ్యం ఆపాదించకూడదు. ఇండియన్ క్రికెట్.. తోటి ప్లేయర్లకు నా సపోర్ట్ ఉంటూనే ఉంటుంది” అని సూర్య కుమార్ యాదవ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకువచ్చారు.

Suryakumar Yadav

'వారణాసి' మూవీ టీజర్ అప్డేట్ వచ్చేసింది.. రాజమౌళి సడన్ సర్ప్రైజ్ మాములుగా లేదుగా!

Mahesh Babu Srirama Look

Mahesh Babu Srirama Look : సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ‘వారణాసి’ మూవీ అప్డేట్ కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. షూటింగ్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఫస్ట్ లుక్ గ్లింప్స్, సంచారి సాంగ్ , రణకుంభ థీమ్ సాంగ్స్ మాత్రమే వచ్చాయి. సినిమాపై భారీ హైప్ ని పెంచే టీజర్ అప్డేట్ మాత్రం ఇప్పటి వరకు రాలేదు. ఈ చిత్రం లో మహేష్ బాబు శ్రీరాముడి లుక్ లో కనిపించబోతున్నాడని , అందుకు సంబంధించిన షూటింగ్ ని కూడా పూర్తి చేసినట్టు రాజమౌళి ఇది వరకే అధికారికంగా ప్రకటించారు. తన మొబైల్ వాల్ పేపర్ కూడా మహేష్ శ్రీరాముడి లుక్ లో ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ ని పెట్టుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు . రీసెంట్ గానే మహేష్ శ్రీరాముడి లుక్ సోషల్ మీడియా లో లీక్ అయ్యిందంటూ కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి.

అయితే అవన్నీ AI ద్వారా క్రియేట్ చేయబడిన ఫోటోలు అట. మహేష్ బాబు నిజమైన శ్రీరాముడి లుక్ ని రివీల్ చేసే సమయం ఆసన్నమైంది. ఆగస్టు 9 న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఒక టీజర్ ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట రాజమౌళి. ఈ టీజర్ లో మహేష్ బాబు శ్రీరాముడి లుక్ లో కనిపిస్తారట. అభిమానులకు ఆ లుక్ ని చూసిన తర్వాత గూస్ బంప్స్ వస్తాయని , ఆ షాట్ ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారని , వారణాసి చిత్రం గ్లోబల్ వైడ్ గా సృష్టించబోయే వసూళ్ల సునామీ కి ఈ టీజర్ ఒక చిన్న శాంపిల్ గా నిలుస్తుందని అంటున్నారు. ఒక్క షాట్ కే అభిమానులు ఏమైపోతారో అనే వైబ్స్ ఉన్నాయి , ఇక సినిమాలో మహేష్ బాబు ఈ గెటప్ లో 20 నిమిషాలకు పైగా ఉంటారట. ఇక వెండితెర మీద రాజమౌళి విజన్ లో మహేష్ బాబు శ్రీరాముడిగా ఎలా మెరిసిపోతారో ఇప్పటి నుండే ఊహించుకోండి.

శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితిలోనూ సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలోపు పూర్తి చెయ్యాలనే టార్గెట్ తో ముందుకు దూసుకెళ్తున్నారు రాజమౌళి. నిన్నటి నుండి హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ మొదలైంది. ఏప్రిల్ 7 న ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల అవ్వబోతున్న ఈ పాన్ ఇండియన్ విజువల్ వండర్ ఎన్ని అద్భుతాలను నెలకొల్పబోతుందో చూడాలి. #RRR తో ఇంటర్నేషనల్ మార్కెట్ విండో ని ఓపెన్ చేసిన రాజమౌళి , ‘వారణాసి’ చిత్రం తో ఏకంగా హాలీవుడ్ రికార్డ్స్ పై కన్నేశాడా ? అనేది చూడాలి.

మీ పిల్లలు తరచూ ఇలా కడుపునొప్పి అంటున్నారా.. కారణం ఇవే..

Intestinal Worms : ప్రస్తుత కాలంలో కొంతమంది పిల్లలు చాలా నీరసంగా కనిపిస్తారు. ఇలాంటి వారు ఎక్కువగా ఆహారం తినకపోవడం.. చురుకుదనం తక్కువగా కనిపించడం వంటివి ఉంటాయి. ఈ సమస్యలకు ప్రధాన కారణాల్లో నులి పురుగులు (Intestinal Worms) కూడా ఒకటి. ఇవి పేగుల్లో నివసిస్తూ పిల్లలు తినే ఆహారంలోని పోషకాలను పీల్చుకుంటాయి. ఫలితంగా శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా 1 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే పిల్లలో ఈ నులిపురుగులు ఎలా వ్యాపిస్తాయి? ఇవి ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి?

నులి పురుగులు ఎలా వ్యాపిస్తాయి?
వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం వల్ల నులి పురుగులు సులభంగా వ్యాపిస్తాయి. భోజనం చేసే ముందు, మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోకపోవడం, కలుషితమైన నీరు తాగడం, సరిగా కడగని కూరగాయలు, పండ్లు తినడం, బయట దుమ్ము, మట్టిలో చెప్పులు లేకుండా తిరగడం వంటి కారణాల వల్ల పురుగుల గుడ్లు శరీరంలోకి చేరి పేగుల్లో పెరుగుతాయి. ఒక పిల్లవాడి నుంచి మరొకరికి కూడా ఈ సమస్య వ్యాపించే అవకాశం ఉంటుంది.

పిల్లల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
నులి పురుగులు పిల్లలు తీసుకునే ఆహారంలోని విటమిన్లు, ఐరన్, ప్రోటీన్లు వంటి కీలక పోషకాలను గ్రహించేస్తాయి. దీంతో శరీరానికి సరిపడా పోషకాలు అందక రక్తహీనత, బలహీనత, ఎదుగుదల మందగించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. రోగనిరోధక శక్తి తగ్గి తరచూ జలుబు, జ్వరం, ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. కొందరు పిల్లల్లో చదువుపై ఏకాగ్రత తగ్గడం, అలసట, బరువు పెరగకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

కనిపించే లక్షణాలు ఏమిటి?
నులి పురుగుల సమస్య ఉన్న పిల్లల్లో తరచూ కడుపునొప్పి, ఆకలి తగ్గడం లేదా కొన్నిసార్లు అసాధారణంగా ఎక్కువ ఆకలి వేయడం, బరువు తగ్గడం, వికారం, వాంతులు, విరేచనాలు లేదా మలబద్ధకం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ముఖ్యంగా రాత్రి సమయంలో మలద్వారం వద్ద తీవ్రమైన దురద ఉండటం నులి పురుగుల ప్రధాన లక్షణంగా భావిస్తారు. కొంతమంది పిల్లల్లో చిరాకు, నిద్రలేమి కూడా కనిపిస్తుంది.

చికిత్స ఎలా ఉంటుంది?
నులి పురుగుల నివారణకు వైద్యుల సలహా మేరకు ఆల్బెండజోల్ (Albendazole) వంటి డీ-వార్మింగ్ మాత్రలు ఇస్తారు. వయస్సు, బరువు ఆధారంగా మోతాదు నిర్ణయిస్తారు. స్వయంగా మందులు కొనుగోలు చేసి పిల్లలకు ఇవ్వకుండా తప్పనిసరిగా వైద్యుల సూచనలు పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులందరికీ కూడా చికిత్స అవసరమవుతుంది.

నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నులి పురుగుల నుంచి పిల్లలను కాపాడాలంటే వ్యక్తిగత పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. భోజనం ముందు, మరుగుదొడ్డి తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవడం అలవాటు చేయాలి. కాచి చల్లార్చిన లేదా శుభ్రమైన నీటినే తాగించాలి. కూరగాయలు, పండ్లను బాగా కడిగి వాడాలి. గోళ్లను చిన్నగా కత్తిరించి శుభ్రంగా ఉంచాలి. పిల్లలు బయట చెప్పులు లేకుండా తిరగకుండా చూడాలి. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం కూడా చాలా ముఖ్యం.

'నాగ బంధం' 4 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. డిజాస్టర్ టాక్ తో ఇంత గ్రాస్ ఊహించలేదు..

Naga Bandham Pre Release Business
Naga Bandham Pre Release Business

Naga Bandham Box Office : విడుదలకు ముందు ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకున్న చిత్రం ‘నాగబంధం’. భారీ బడ్జెట్ తో , కళ్ళు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ తో థియేట్రికల్ ట్రైలర్ తోనే భారీ అంచనాలను రేకెత్తించింది ఈ చిత్రం. కానీ విడుదల తర్వాత ఈ చిత్రానికి మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ వచ్చింది. ఆ రేంజ్ టాక్ వచ్చినప్పటికి కూడా కలెక్షన్స్ డీసెంట్ రేంజ్ లో రావడం గమనార్హం. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించాము అని మేకర్స్ చేసిన పబ్లిసిటీ ఈ చిత్రానికి బాగా వర్కౌట్ అయ్యిందని అనిపిస్తోంది. 4 వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 1 కోటి 20 లక్షల రూపాయిల రేంజ్ గ్రాస్ వసూళ్లు రాగా, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 1 కోటి 80 లక్షల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఓవరాల్ గా 4 వ రోజున వరల్డ్ వైడ్ షేర్ వసూళ్లు 80 లక్షల రేంజ్ లో ఉంటాయని సమాచారం. నాలుగు రోజులు పూర్తి అయ్యేసరికి ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి వచ్చిన గ్రాస్ వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే, నైజాం ప్రాంతం నుండి 5 కోట్ల 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, ఆంధ్ర ప్రదేశ్ + సీడెడ్ ప్రాంతాల నుండి ఈ చిత్రానికి 4 కోట్ల 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 9 కోట్ల 55 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 4 కోట్ల 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. వచ్చిన నెగెటివ్ టాక్ కి ఈ మాత్రం వసూళ్లు రావడం నిజంగా గ్రేట్. కానీ నిర్మాతకు బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఈ వసూళ్లు ఏ మాత్రం సరిపోవు అనేది వాస్తవం.

ఇక ఇతర ప్రాంతాల విషయానికి వస్తే కర్ణాటక నుండి 1 కోటి 55 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగ, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 2 కోట్ల 5 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు , ఓవర్సీస్ నుండి 1 కోటి 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇండియా వైడ్ గా డీసెంట్ స్థాయి వసూళ్లు వచ్చాయి , ఓవర్సీస్ లో మాత్రం డిజాస్టర్ రేంజ్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రం కనీసం స్థాయిలో సేఫ్ అవ్వాలంటే వరల్డ్ వైడ్ గా 28 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే కేవలం 10 నుండి 15 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చేలా అనిపిస్తోంది. నిర్మాతకు భారీ నష్టాలు తప్పేలా లేవు.

'పెద్ది' వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్.. కలెక్షన్స్ అదిరిపోయాయి.. కానీ నష్టాలు తప్పలేదు..

Peddi OTT
Peddi OTT

Peddi Closing Collections : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన నటించిన ‘పెద్ది’ మూవీ బాక్స్ ఆఫీస్ రన్ దాదాపుగా ముగిసింది. ఎల్లుండి నుండి ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. విడుదలైన మొదటి రోజు మొదటి ఆట నుండే ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన టాక్ వచ్చింది. మధ్యలో కొంతమంది ఆడియన్స్ ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నెగెటివిటీ పెంచినప్పటికీ కూడా వసూళ్లు ఆగలేదు. నాన్ స్టాప్ గా బాక్స్ ఆఫీస్ ని కుమ్ముతూనే ఉన్నింది ఈ చిత్రం. 32 వ రోజున కూడా ప్రధాన నగరాల్లో ఈ చిత్రం హౌస్ ఫుల్ బోర్డ్స్ ని నమోదు చేసుకుందంటే సాధారణమైన విషయం కాదు. ఓవరాల్ గా థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా ఎంత షేర్ వసూళ్లు వచ్చాయి అనేది ఇప్పుడొకసారి చూద్దాం.

నైజాం ప్రాంతం లో 16 కోట్ల ఓపెనింగ్ తో మొదలైన ఈ చిత్రానికి 55 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లతో ముగిసింది. ఇది చాలా మంచి రన్ అనే చెప్పాలి , కానీ ఓపెనింగ్స్ ఇంకా బాగా వచ్చి ఉండుంటే , ఈ సినిమా క్లోజింగ్ ఇంకా పెద్దదిగా ఉండేదని అంటున్నారు. ఇక రామ్ చరణ్ కి కంచుకోటగా పిలవబడే రాయలసీమ ప్రాంతం లో ఆశించిన స్థాయి వసూళ్లు రాలేదు. 24 కోట్ల రూపాయలకు ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ని కొనుగోలు చేయగా, కేవలం 21 కోట్ల 26 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. అదే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 23 కోట్ల 20 లక్షలు , ఈస్ట్ గోదావరి నుండి 13 కోట్ల రూపాయిలు , వెస్ట్ గోదావరి నుండి 9 కోట్ల 22 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

ఇక కృష్ణా జిల్లా నుండి 10 కోట్ల 39 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టగా, గుంటూరు జిల్లా నుండి 12 కోట్ల 76 లక్షలు , నెల్లూరు జిల్లా నుండి 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 150 కోట్ల రూపాయిల 80 లక్షల షేర్ వసూళ్లు , 234 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక నుండి 15 కోట్ల 30 లక్షల రూపాయిలు , తమిళనాడు + కేరళ నుండి 2 కోట్ల 40 లక్షలు , హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 12 కోట్ల 15 లక్షలు , ఓవర్సీస్ నుండి 23 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా 205 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు 350 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ బిజినెస్ 220 కోట్ల రూపాయలకు జరగ్గా 15 కోట్ల నష్టం వాటిల్లింది.

తుని జ్ఞానేశ్వరి మిస్సింగ్.. పోలీసుల సంచలన ప్రకటన

Tuni Gnaneswari missing case update
Tuni Gnaneswari missing case update

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తుని ప్రాంతంలో జ్ఞానేశ్వరి అనే బాలిక మిస్సింగ్ అయింది. ఈ సంఘటన జరిగి దాదాపు 15 రోజులు దాటింది.. అయినప్పటికీ ఇంతవరకు ఈ కేసులో పురోగతి లేదు. ఇంతవరకు ఆ బాలిక ఆచూకీ కనిపించలేదు. అనేక దఫాలుగా.. అనేక విధాలుగా అధికారులు ఆ పాప కోసం గాలింపు చేపట్టినప్పటికీ ఇంతవరకు ఆమె జాడ లభించలేదు. అనేక విధాలుగా ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ ఇంతవరకు ఉపయోగం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు కీలక ప్రకటన చేశారు.

ప్రత్యేకమైన బలగాలు.. ప్రత్యేకమైన బృందాల సహాయంతో గాలింపు చేపట్టినప్పటికీ ఇంతవరకు పాప జాడ కనిపించలేదు. సీసీ కెమెరాలు జల్లెడ పట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పాప మిస్సింగ్ అయినచోట చికెన్ ముక్కలు పెట్టారు. ఆట బొమ్మలు కూడా ఏర్పాటు చేశారు. ఇన్ని రకాలుగా ఏర్పాటు చేసినప్పటికీ పాప జాడ కనిపించలేదు.

పాప మిస్సింగ్ అయి రోజులు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ పాపను ఎవరైనా ఎత్తుకెళ్లి ఉంటే అప్పగించాలని.. వారి మీద ఎటువంటి కేసులు నమోదు చేసే అవకాశం లేదని పోలీసులు హామీ ఇచ్చారు. ఒకవేళ సమాచారం ఇచ్చినా సరే తాము నేరుగా వెళ్లి పాపను తీసుకొస్తామని చెప్పారు. పాపను ఆమె తల్లికి అందించడాన్నే తమలక్ష్యంగా పెట్టుకున్నామని పోలీసులు చెబుతున్నారు. అపహరణ కోణంలోనే కేసులు దర్యాప్తు చేస్తున్నామని.. మొబైల్ ఫోన్ అసలు ఉపయోగించని వ్యక్తులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. జ్ఞానేశ్వరి కేసులో ఓ కారు గురించి చర్చ జరిగింది. కొంతమంది వ్యక్తులు అందులో వచ్చి ఆమెను అపహరించుకుని వెళ్లారని వార్తలు వచ్చాయి. అయితే అదంతా ఫేక్ ప్రచారమని పోలీసులు కొట్టిపడేశారు.

ఇన్ని రకాలుగా దర్యాప్తు చేపట్టినప్పటికీ జ్ఞానేశ్వరి జాడ లభించకపోవడంతో.. కొంతమంది కావాలని ఆమెను అపహరించారని.. పాపను బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. పై ఆ పాపను వేరే ప్రాంతానికి తీసుకొని వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ పాప జాడ లభించడం లేదని పోలీసులు చెబుతున్నారు. అందువల్లే వారి మీద ఎటువంటి కేసులు నమోదు చేయకుండా.. పాపను ఆమె తల్లి దగ్గరికి చేర్చుతామని.. పాపను తీసుకెళ్లినవారు తమకు సమాచారం ఇస్తే సరిపోతుందని పోలీసులు పేర్కొంటున్నారు.

గొప్ప మనసు చాటుకున్న హీరో నిఖిల్.. భీమవరం విద్యార్థుల కోసం ఎంత పనిచేశాడంటే..

Nikhil Siddhartha

Nikhil Siddhartha : ప్రముఖ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ అప్పుడప్పుడు తన శక్తి కి తగ్గట్టు సేవా కార్యక్రమాలు చేస్తుండడం మనం గమనిస్తూనే ఉన్నాం. రాజకీయ బ్యాక్ గ్రౌండ్ ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ, ఏ రోజు కూడా తన మావయ్య పేరుని ఉపయోగించుకోలేదు , కేవలం తన వ్యక్తిగతంగానే సహాయ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. రీసెంట్ గానే ఆయన భీమవరం లో ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భీమవరం వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో ని వెయ్యి మంది విద్యార్థులకు ఆయన విద్యా సామగ్రి ని అందించడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. నిఖిల్ చేసిన ఈ గొప్ప పని పై నెటిజెన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ మన జీవితం లో విద్యనే భవిష్యత్తుని మార్చగల ఏకైక శక్తి. విద్యార్థులందరూ బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలి. తల్లిదండ్రులను , గురువులను గౌరవించాలి. భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు కూడా ఈ కిట్స్ ని అందించడమే నా లక్ష్యం’ అంటూ నిఖిల్ సిద్దార్థ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాజీఫా వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నియోజకవర్గాల్లో భీమవరం కూడా ఒకటి. అలాంటి చోట ఇలాంటి గొప్ప సేవా కార్యక్రమం చేసినందుకు పవన్ ఫ్యాన్స్ కూడా నిఖిల్ ని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ఇలాంటి విషయాల్లో మా సపోర్టు ఎప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా చెప్పుకొస్తున్నారు. ఇక నిఖిల్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన ‘స్వయంభు’ అనే సోషియో ఫాంటసీ చిత్రం చేస్తున్నారు. నభ నటేష్ , సంయుక్త మీనన్ ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తున్నారు. నిఖిల్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా పై ఆయన భారీ ఆశలు పెట్టుకున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ కి పర్వాలేదు అనే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్ 3 వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. నిఖిల్ గత చిత్రం ‘స్పై’ ఆశించిన స్థాయి ఫలితాన్ని సొంతం చేసుకోలేక పోయింది. ‘కార్తికేయ 2’ తో పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ ని అందుకున్న ఆయన , ‘స్వయంభు’ తో మరోసారి తన సత్తా చాటుతారో లేదో చూడాలి. ఈ సినిమాతో పాటు ఆయన ‘ఇండియా హౌస్’ అనే చిత్రం లో కూడా నటిస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రానికి నిర్మాత.

 

నరేంద్ర మోడీ ఇండోనేషియా పర్యటన... తెర వెనక పెద్ద కథ ఉంది..

Narendra modi indonesia

Narendra Modi : ఇటీవల కాలంలో భారత ప్రధాన నరేంద్ర మోడీ విదేశాల్లో ఎక్కువగా పర్యటిస్తున్నారు. చిన్న చిన్న దేశాల నుంచి మొదలు పెడితే.. పెద్ద దేశాల వరకు నరేంద్ర మోడీ కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. నరేంద్ర మోడీ ఇలా ఎందుకు వెళ్తున్నారు.. దీని వెనక ఏముంది.. దేశ ప్రయోజనాలు ఏ స్థాయిలో దాగి ఉన్నాయి.. అనేవి ఆసక్తికరమైన అంశాలుగా మారిపోయాయి.

ప్రస్తుతం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇండోనేషియాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన ఆసక్తికరంగా మారింది.. గ్లోబల్ మీడియా కూడా ఆయన పర్యటనకు విపరీతమైన ప్రయారిటీ ఇచ్చింది. దానికి ప్రధాన కారణం బ్రహ్మోస్. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ పాకిస్తాన్ మీద బ్రహ్మో స్ మిసైల్స్ ప్రయోగించింది. 100% సక్సెస్ రేట్ తో అవి పని చేశాయి. దీంతో వాటిని కొనుగోలు చేయడానికి ప్రపంచ దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా ఈ మిస్సైల్స్ కోసం ఇండోనేషియా కూడా మన దేశాన్ని సంప్రదించింది. ఇండోనేషియా క భారత్ ఈ మిస్సైల్స్ కోసం ఒప్పందాలు కుదురుతుంది. ఇవి మాత్రమే కాకుండా అస్త్ర మిస్సైల్స్ కోసం కూడా రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది.

ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య అనేక రకాల చర్చలు జరిగాయి. కీలకమైన ఒప్పందాలు కూడా కుదిరాయి. ఇండోనేషియాలో అపారమైన ఖనిజ వనరులు ఉన్నాయి. వాటి మీద భారీగా పెట్టుబడి పెట్టబోతోంది. ముఖ్యంగా స్టీల్.. నికెల్, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ తయారీలో భారత్ భారీగా ఇన్వెస్ట్ చేయబోతోంది. ఇండోనేషియా ప్రాంతంలో సభాంగ్ పోర్టు కూడా నిర్మిస్తోంది. ఈ పోర్టు మలక్కా జల సంధికి దగ్గరగా ఉంటుంది. ఇది మన దేశానికి అత్యంత వ్యూహాత్మకమైనది.

ఇండోనేషియా కోసం భారత్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తయారుచేసి అందించనుంది. ప్రధానికి ఇండోనేషియా ప్రభుత్వం బింటాంగ్ ఆది పూర్ణ రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా పురస్కారంతో గౌరవించింది. ఈ నేపథ్యంలో ఇండోనేషియా అధ్యక్షుడు భారత ప్రధానమంత్రిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. రామాయణ కాలం నుంచి భారతదేశానికి, ఇండోనేషియాకు బలమైన సంబంధాలు ఉన్నాయని.. నరేంద్ర మోడీని చూసి తాను అనేక పథకాలను.. అనేక కార్యక్రమాలను కాపీ కొట్టానని ఇండోనేషియా అధ్యక్షుడు ప్రకటించడం విశేషం.

'ఓజీ 2' పై తమన్ షాకింగ్ అప్డేట్.. ఇలా ట్విస్ట్ ఇచ్చాదేంటి.. వీడియో వైరల్..

OG 2 Producer Change
OG 2 Producer Change

OG 2 : ‘ఓజీ 2’ గురించి ఏ చిన్న అప్డేట్ బయటకి వచ్చిన సోషల్ మీడియా మొత్తం ఒక రేంజ్ లో ఊగిపోతోంది అనే సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వీడియో కి పవన్ ఫ్యాన్స్ సృష్టించిన భీభత్సాన్ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. పవన్ కళ్యాణ్ సైతం ఈ ప్రాజెక్ట్ పై స్పెషల్ ఆసక్తి చూపిస్తుండడం తో , కచ్చితంగా మరోసారి ఈ చిత్రం తో ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు అవుతాయనే నమ్మకం తో ఉన్నారు ఫ్యాన్స్. ఓజాస్ గంభీర తండ్రి ‘జై గంభీర’ కి ఫ్లాష్ బ్యాక్ కి సంబంధించిన స్టోరీ తో ‘ఓజీ 2’ ని తెరకెక్కించబోతున్నారు. యాక్షన్ తో పాటు ఫాంటసీ కూడా మిక్స్ అయ్యి ఉండే ఈ సినిమా పై మూవీ లవర్స్ లో కూడా ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.

ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ని , ఆ చిత్ర సంగీత దర్శకుడు తమన్ ‘హృదయం మురళి’ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో ప్రకటించారు. శంషాబాద్ లోని గణేష్ థియేటర్లో ఈ ఈవెంట్ ని ఏర్పాటు చేయగా , తమన్ మైక్ అందుకొని మాట్లాడుతున్న సమయంలో , అక్కడి విద్యార్థులు పెద్ద ఎత్తున ‘ఓజీ..ఓజీ’ అంటూ నినాదాలు చేయడం మొదలు పెట్టారు. అప్పుడు తమన్ ‘సెప్టెంబర్ లో కలుద్దాం’ అంటూ ప్రకటన చేయడం తో ఒక్కసారిగా థియేటర్ మొత్తం బ్లాస్టింగ్ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయబోతున్నారు. అదే రోజున షూటింగ్ ప్రారంభం తేదీని కూడా ప్రకటిస్తారట. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం షూటింగ్ ని సెప్టెంబర్ నెలలోనే మొదలు పెట్టబోతున్నారట.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది. సుజిత్ ఈ సినిమాకు సంబంధించిన క్యాస్ట్ ని ఫైనల్ చేసే పనిలో పడ్డారు. ఈ చిత్రం లో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించిన టాక్ , కానీ అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. సుజిత్ బాలీవుడ్ హీరోయిన్ కోసం సంప్రదింపులు జరుపుతున్నారట. అదే విధంగా ఈ చిత్రం లో అనేక కొత్త క్యారెక్టర్స్ పరిచయం అవుతాయని , పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న నటీనటులు ఈ సినిమాలో భాగం అవ్వబోతున్నారని టాక్. సెప్టెంబర్ నెలలో షూటింగ్ ని మొదలు పెట్టి , వచ్చే ఏడాది సమ్మర్ లోపు షూటింగ్ ని పూర్తి చేసే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్.