Bike Purchased With Coins: తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఓ యువకుడు తన వినూత్న ఆలోచనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. వెలిమినేడు గ్రామానికి చెందిన కొండే రఘుపతి అనే యువకుడు చాలా కాలంగా దాచుకున్న ₹10 నాణేలతో ఏకంగా కొత్త బైక్‌ను కొనుగోలు చేసి వార్తల్లో నిలిచాడు. సాధారణంగా పెద్ద మొత్తంలో నగదు లేదా డిజిటల్ చెల్లింపులతో వాహనాలు కొనుగోలు చేసే ఈ రోజుల్లో, పూర్తిగా ₹10 కాయిన్ల రూపంలో రూ.1.10 లక్షలు చెల్లించడం విశేషంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
రఘుపతి స్థానిక ద్విచక్ర వాహనాల షోరూమ్‌కు వెళ్లి సుమారు రూ.1.10 లక్షల విలువైన హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్‌ను కొనుగోలు చేశాడు. అయితే బైక్ ధర మొత్తాన్ని నగదు నోట్లతో కాకుండా, తాను ఎన్నో సంవత్సరాలుగా పొదుపు చేసిన ₹10 నాణేలతోనే చెల్లించాడు. ఇందుకోసం ప్రత్యేకంగా సంచుల్లో తీసుకొచ్చిన నాణేలను షోరూమ్ సిబ్బందికి అందజేశాడు.
మొదట భారీ మొత్తంలో చిల్లర నాణేలను చూసిన షోరూమ్ సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం సిబ్బంది కలిసి గంటల పాటు అన్ని ₹10 నాణేలను జాగ్రత్తగా లెక్కించి మొత్తం రూ.1.10 లక్షలు పూర్తయ్యాయని నిర్ధారించారు. ఆ తర్వాత బైక్‌కు సంబంధించిన అన్ని అధికారిక ప్రక్రియలు పూర్తి చేసి రఘుపతికి కొత్త వాహనాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా రఘుపతి మాట్లాడుతూ, రోజువారీ ఖర్చుల్లో మిగిలిన ₹10 నాణేలను చాలా కాలంగా ప్రత్యేకంగా దాచుకుంటూ వచ్చానని తెలిపారు. చిన్నచిన్న పొదుపులు కూడా ఒకరోజు పెద్ద లక్ష్యాన్ని నెరవేర్చగలవని నిరూపించాలనే ఉద్దేశంతో ఈ విధంగా బైక్ కొనుగోలు చేశానని చెప్పారు.
ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రఘుపతి సహనం, పొదుపు అలవాటు, వినూత్న నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. చిన్న మొత్తాలను కూడా క్రమం తప్పకుండా దాచుకుంటే పెద్ద కలలను సాకారం చేసుకోవచ్చని ఈ ఘటన మరోసారి చాటి చెప్పిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
POK Protest : కాశ్మీర్ అంశాన్ని దశాబ్దాలుగా అంతర్జాతీయ వేదికలపై భారత్‌పై ఒత్తిడి తీసుకురావడానికి పాకిస్తాన్ ప్రధాన రాజకీయ ఆయుధంగా ఉపయోగించుకుంది. ఐక్యరాజ్యసమితి నుంచి ఇస్లామిక్ దేశాల వేదికల వరకు అవకాశం దొరికినప్పుడల్లా కాశ్మీర్ ప్రజల హక్కుల పేరుతో భారత్‌ను విమర్శించడం ఇస్లామాబాద్ విదేశాంగ విధానంలో భాగంగా మారిపోయింది. అయితే కాలం మారింది. పరిస్థితులు మారాయి. ముఖ్యంగా సమాచార విప్లవం వచ్చిన తర్వాత ప్రజలు తమ కళ్లతో వాస్తవాలను చూసే స్థితికి చేరుకున్నారు. ఇప్పుడు అదే కాశ్మీర్ అంశంలో పాకిస్తాన్ రక్షణాత్మక వైఖరిని అవలంబించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో గత కొంతకాలంగా ప్రజా అసంతృప్తి పెరుగుతోంది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, విద్యుత్ సంక్షోభం, అభివృద్ధి లోపం, ప్రభుత్వ నిర్లక్ష్యం వంటి అంశాలపై అక్కడి ప్రజలు నిరసన గళం వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూలై 9న భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినట్లు స్థానిక వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ఆందోళనలు పాకిస్తాన్ ప్రభుత్వానికి సవాలుగా మారాయి.
అభివృద్ధి పోలికే అసంతృప్తికి కారణమా?
గత కొన్ని సంవత్సరాలుగా భారత పాలనలోని జమ్మూ-కాశ్మీర్‌లో అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టబడ్డాయి. కొత్త రహదారులు, సొరంగ మార్గాలు, రైల్వే కనెక్టివిటీ, ఆరోగ్య సేవలు, విద్యా రంగంలో పెట్టుబడులు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలు అక్కడి పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
ఆయుష్మాన్ భారత్ వంటి ఆరోగ్య పథకం ద్వారా పేదలకు వైద్య సేవలు అందుబాటులోకి రావడం, ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణం, ఉచిత రేషన్ వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. శ్రీనగర్‌కు రైల్వే అనుసంధానం, జాతీయ రహదారుల విస్తరణ, వందే భారత్ రైళ్ల ప్రారంభం వంటి ప్రాజెక్టులు కూడా అభివృద్ధి చర్చల్లో ప్రధాన అంశాలుగా నిలిచాయి.
ఇంటర్నెట్ విస్తరణతో ఈ మార్పులను పీఓకే ప్రజలు కూడా ప్రత్యక్షంగా గమనించే అవకాశం లభించింది. ఒకే భౌగోళిక ప్రాంతంలో రెండు వేర్వేరు పరిపాలనా వ్యవస్థల మధ్య ఉన్న అభివృద్ధి వ్యత్యాసంపై అక్కడి ప్రజల్లో ప్రశ్నలు మొదలయ్యాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పీఓకేలో ప్రజల అసంతృప్తి ఎందుకు పెరిగింది?
పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ద్రవ్యోల్బణం, విదేశీ మారక నిల్వల కొరత, అప్పుల భారం, విద్యుత్ సంక్షోభం వంటి సమస్యల ప్రభావం పీఓకేపై కూడా తీవ్రంగా పడింది.
గోధుమల ధరలు పెరగడం, విద్యుత్ చార్జీలు అధికమవడం, ఉపాధి అవకాశాలు లేకపోవడం, ప్రభుత్వ సేవలు సరిగా అందకపోవడం వంటి సమస్యలపై అక్కడి ప్రజలు పలుమార్లు వీధుల్లోకి వచ్చారు. తమకు సబ్సిడీపై గోధుమలు ఇవ్వాలని, విద్యుత్ ధరలు తగ్గించాలని, స్థానిక వనరులపై తమకే హక్కు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆందోళనలపై బలప్రయోగం ఆరోపణలు
పీఓకేలో జరిగిన కొన్ని నిరసనల సందర్భంగా భద్రతా బలగాలు బలప్రయోగానికి దిగినట్లు, పలువురు గాయపడినట్లు, మరణాలు సంభవించినట్లు గతంలో అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి. అయితే వివిధ ఘటనల్లో మరణాల సంఖ్య, బాధ్యత వంటి అంశాలపై భిన్న వాదనలు ఉన్నాయి. అందువల్ల ప్రతి ఘటనకు సంబంధించి అధికారిక సమాచారం, స్వతంత్ర ధృవీకరణలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.
పాకిస్తాన్‌కు మారుతున్న సవాలు
ఒకప్పుడు కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్‌పై ఒత్తిడి కోసం వినియోగించిన పాకిస్తాన్‌కు ఇప్పుడు పీఓకేలోనే ప్రజల అసంతృప్తి పెద్ద సవాలుగా మారుతోంది. స్థానిక ప్రజలు తమ జీవన ప్రమాణాలు మెరుగుపరచాలని, అభివృద్ధి కావాలని, ప్రభుత్వ సేవలు అందించాలని కోరుతున్నారు. ఈ డిమాండ్లను కేవలం భద్రతా సమస్యగా చూడటం ద్వారా పరిష్కారం లభించదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
జూలై 9పై ఉత్కంఠ
జూలై 9న జరగనున్నట్లు ప్రచారం జరుగుతున్న నిరసనలు ఎంత పెద్ద స్థాయిలో ఉంటాయి? పాకిస్తాన్ ప్రభుత్వం వాటిని ఎలా ఎదుర్కొంటుంది? ప్రజల డిమాండ్లపై స్పందిస్తుందా? లేక భద్రతా చర్యలతోనే పరిమితం అవుతుందా? అనే అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
కాశ్మీర్ సమస్యలో గతంలో ప్రపంచానికి పాఠాలు చెప్పిన పాకిస్తాన్, ఇప్పుడు తన నియంత్రణలో ఉన్న ప్రాంత ప్రజల అసంతృప్తికి ఎలా సమాధానం చెబుతుందన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల వంటి అంశాలే చివరికి ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేస్తాయనే విషయాన్ని ఈ పరిణామాలు మరోసారి గుర్తు చేస్తున్నాయి.
9న పాకిస్తాన్ తో తాడోపేడో తేల్చుకోనున్న కాశ్మీరీలు.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణాన్ని కింది వీడియోలో చూడొచ్చు.
ప్రతీ హీరో కి , నిర్మాతకు , వాళ్ళ అభిమానులకు కెరీర్ పరంగా కొన్ని అవమానాలు ఎదురు అవుతుంటాయి. ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమా అయినా , ఏదో ఒక సందర్భంలో ఘోరమైన డిజాస్టర్ ఫలితాన్ని అందుకోవాల్సి వస్తుంది , అది తప్పదు. అలా ఎన్టీఆర్ కెరీర్ లో కూడా ఇటీవల కాలంలో ఒక మాయని మచ్చ లాగా , ఆయన అభిమానులకు పీడకల లాగా మిగిలిపోయిన సినిమాల్లో ‘వార్ 2’ ఒకటి. యాష్ రాజ్ ఫిలిమ్స్ పై , ఆయన ముఖర్జీ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రంలో హృతిక్ రోషన్ హీరో గా నటించగా, ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఘోరమైన డిజాస్టర్ గా నిల్చింది. తెలుగు వెర్షన్ నుండి ఈ చిత్రానికి కనీసం 100 కోట్ల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదు.
ఈ సినిమా డిజాస్టర్ అవ్వడం తో నిర్మాత నాగవంశీ ఎదుర్కొన్న ట్రోల్స్ మామూలివి కాదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన ఈ చిత్రం గురించి కాస్త హద్దులు దాటి మరీ మాట్లాడారు. ఈ సినిమా ఫ్లాప్ అయితే నన్ను మీ ఇష్టమొచ్చిన బూతులతో తిట్టండి అంటూ తొడగొట్టి మరీ సవాల్ చేశారు నాగవంశీ. అంతే కాకుండా, అదే ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ తన రెండు కాలర్లను పైకి ఎత్తి మరీ చూపడం అప్పట్లో సెన్సేషనల్ టాపిక్ గా మారింది. ఇక నేడు జరిగిన ‘లెనిన్’ మూవీ ప్రెస్ మీట్ లో నాగవంశీ ని ఒక విలేక్షరి ప్రశ్న అడుగుతూ ‘ఈ సినిమాతో అక్కినేని ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోవచ్చా ‘ అని అడగ్గా , అందుకు నాగవంశీ సమాధానం చెప్తూ ‘కాలర్ ఎత్తడాలు వంటివి ఏమి లేవు , అసలు కాలర్ టాపిక్ తీసుకొని రాకండి’ అంటూ సమాధానం ఇచ్చారు నాగవంశీ.
అంటే ఆయన పరోక్షంగా జూనియర్ ఎన్టీఆర్ కాలర్ ఎత్తడం పై సెటైర్లు వేసినట్టుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అర్థమైంది. దీంతో సోషల్ మీడియా లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నాగవంశీ పై మండిపడుతున్నారు. తిన్నగా అడిగిన దానికి సమాధానం చెప్పకుండా, ఈ బలుపు కామెంట్స్ ఏంటి అంటూ నాగవంశీ ని ట్యాగ్ చేసి బూతులు తిడుతున్నారు. మరి దీనిపై నాగవంశీ క్లారిటీ ఇచ్చి అభిమానులకు క్షమాపణలు చెప్తారో లేదో చూడాలి. ఈ ఏడాది ఆరంభం లో ‘అనగనగా ఒక రాజు’ తో భారీ హిట్ ని అందుకున్న నాగవంశీ , ఆ తర్వాత ‘ఫంకీ ‘ చిత్రం తో భారీ డిజాస్టర్ ని ఎదుర్కొన్నారు. ఇప్పుడు ‘లెనిన్’ తో సూపర్ హిట్ ని అందుకొని మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కుతారో లేదో చూడాలి.
Sai Dharam Tej : మెగా ఫ్యామిలీ నుండి నందమూరి హీరోలతో మంచి రిలేషన్ ని మైంటైన్ చేసే హీరోల్లో ఒకరు సాయి ధరమ్ తేజ్. ఈయనకు జూనియర్ ఎన్టీఆర్ ఎంత మంచి స్నేహితుడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విన్నర్ మూవీ ఓపెనింగ్ రోజు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేసి క్లాప్ కూడా కొట్టారు. అంతే కాదు , మెగా ఫ్యామిలీ హీరోలు కాకుండా, బయట హీరోల్లో మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు అని సాయి ధరమ్ తేజ్ ని అడిగితే , క్షణం కూడా ఆలోచించకుండా ఎన్టీఆర్ పేరు చెప్తాడు ఒక ఇంటర్వ్యూ లో. కేవలం ఎన్టీఆర్ తో మాత్రమే కాదు , ఇండస్ట్రీ లో అందరితోనూ సాయి ధరమ్ తేజ్ కి మంచి సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి. టాలీవుడ్ లో ఏ హీరో సినిమా విడుదలైనా సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్ ద్వారా ఆల్ ది బెస్ట్ చెప్తుంటారు.
సీనియర్ హీరోలతో కూడా సాయి ధరమ్ తేజ్ కి మంచి సంబంధాలు ఉన్నాయి. గతం లో ‘అన్ స్టాపబుల్ విత్ NBK ‘ టాక్ షోలో పాల్గొన్నప్పుడు, సాయి ధరమ్ తేజ్ బాలయ్య బాబు తో చేసిన అల్లరి ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. వీళ్లిద్దరి మధ్య ఇంత మంచి రిలేషన్ ఉందా అని అప్పట్లో చూసిన ప్రతీ ఒక్కరు అనుకునేవారు. ఇక నేడు సాయి ధరమ్ తేజ్ హీరో గా నటిస్తున్న ‘సంబరాల యేటి గట్టు’ మూవీ సెట్స్ లో తళుక్కుమని మెరిశారు బాలయ్య. పక్కనే తన సినిమా షూటింగ్ కూడా జరుగుతుండడం తో , ఒక్కసారి కలిసి వెళ్లేందుకు ఈ సెట్స్ లోకి అడుగుపెట్టిన బాలయ్య , కాసేపు మూవీ టీం తో సరదాగా గడిపి వెళ్లారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఫ్యాన్స్ ఫోటోల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ‘సంబరాల యేటి గట్టు’ సినిమా విషయానికి వస్తే , ఇది సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో మొట్టమొదటి భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం. షూటింగ్ మొదలై దాదాపుగా రెండేళ్లు అయ్యింది , ఇప్పటికీ పూర్తి అవ్వలేదు. 2024 దసరా కానుకగా విడుదల చేద్దామని అనుకున్నారు , షూటింగ్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడంతో వాయిదా వేశారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో విడుదల చెయ్యాలని చూస్తున్నారు మేకర్స్. ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ భారీ బ్లాక్ బస్టర్ ని అందుకొని , టయర్ 1 రేస్ లోకి అడుగుపెట్టాలని చూస్తున్నారు.
Prabhas Spirit Update : రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటిస్తున్న సినిమాల్లో , అభిమానులతో పాటు , ప్రేక్షకులు కూడా భారీ అంచనాలతో ఎదురు చూస్తున్న చిత్రం ‘స్పిరిట్’. సందీప్ వంగ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం సమయం నుండే భారీ అంచనాలను ఏర్పాటు చేసుకుంది. ఆ అంచనాలకు తగ్గట్టుగా, ఈ ఏడాది న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి ఏ రేంజ్ సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విలన్స్ ఫస్ట్ లుక్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మార్చి 5 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమా, టార్గెట్ ని ఎట్టి పరిస్థితిలోనూ మిస్ చేయకుండా ఉండేలా డైరెక్టర్ సందీప్ వంగ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో షెడ్యూల్స్ ని పూర్తి చేస్తున్నారు. ఇక లేటెస్ట్ షెడ్యూల్ పై సోషల్ మీడియా లో ఒక హాట్ టాపిక్ నడుస్తోంది.
నేడు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ని కూకట్ పల్లి లో చేయబోతున్నారట. అర్థ రాత్రి 12 గంటలకు ఈ షూట్ ని ప్లాన్ చేశారట. ప్రభాస్ తో పాటు ఇతర తారాగణం పాల్గొనబోయే ఈ షూటింగ్ లో భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించబోతున్నట్టు సమాచారం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే , ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అత్యధిక శాతం హైదరాబాద్ లోని పాపులర్ ప్రాంతాల్లోనే చేస్తున్నారు. లేడీస్ లా కళాశాల లో కొన్ని రోజులు, విమల్ థియేటర్ లో కొన్ని రోజులు ఇంతకు ముందు షూట్ చేశారు. ఇప్పుడు స్టూడెంట్స్ , వ్యాపారవేత్తలు అత్యధిక శాతం తిరిగే కూకట్ పల్లి ప్రాంతం లో చేయబోతున్నారు. మరి ఈ విషయాన్ని తెలుసుకున్న అభిమానులు , ఈ సినిమా షూటింగ్ ని చూసేందుకు ఏ రేంజ్ లో తరళి రాబోతున్నారో చూడాలి.
ఈ చిత్రంలో త్రిప్తి దిమిరి హీరోయిన్ గా నటిస్తుండగా , వివేక్ ఒబెరాయ్ , ఐశ్వర్య మీనన్ లు విలన్స్ గా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ ఈ చిత్రం లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రం లో ప్రభాస్ తండ్రి క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. ఈ పాత్రలో ఒక ప్రముఖ స్టార్ హీరో నటిస్తారని మొదటి నుండి ఒక వార్త ప్రచారం లో ఉంది. ఆ పాత్ర పోషించబోయేది మరెవరో కాదు , మెగాస్టార్ చిరంజీవి అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదట. ఒక బాలీవుడ్ సీనియర్ హీరో ని ఈ పాత్ర కోసం ఎంచుకున్నట్టు తెలుస్తోంది.
MG Windsor EV: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుండడంతో కొన్ని కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునే వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇందులో భాగంగా MG మోటార్ సంస్థ MG Windsor EVని మార్కెట్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇది మార్కెట్లోకి వచ్చిన కేవలం రెండు సంవత్సరాల లోపే అత్యధిక సేల్స్ ను నమోదు చేసుకుంది. ఇంతకీ ఈ కారులో ఏముంది? దీనిని ఎందుకు ఎగబడి కొంటున్నారు?
MG Windsor EV అత్యధిక సేల్స్ నమోదు కావడానికి ప్రధాన కారణం ఇందులో ఉండే బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) విధానం. సాధారణంగా ఎలక్ట్రిక్ కార్ల ధరలు పెరగడానికి వాటిలో వాడే బ్యాటరీ కాస్ట్ కారణం అవుతుంది. అయితే MG సంస్థ కారు ధరను, బ్యాటరీ ధరను వేరు చేసింది. బ్యాటరీ లేకుండా కారును కేవలం ₹9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకే అందిస్తూ, బ్యాటరీ వినియోగానికి కిలోమీటరుకు ₹3.9 చొప్పున అద్దె కట్టేలా సరికొత్త ఆప్షన్ ఇచ్చింది. ఈ వ్యూహం భారతీయ వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంది. ఒకవేళ బ్యాటరీతో కలిపి కారును పూర్తిగా సొంతం చేసుకోవాలనుకునే వారి కోసం ₹14.70 లక్షల నుండి ₹19 లక్షల ధరల్లో వేరియంట్లను అందుబాటులో ఉంచింది.
విండ్సర్ ఈవీ లో సౌకర్యాలు, ఫీచర్లు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఇందులో ప్రయాణం చేస్తే విలాసవంతమైన అనుభూతిని ఇస్తుంది. దీనిలోని ‘ఏరో లాంజ్’ వెనుక సీట్లను ఏకంగా 135 డిగ్రీల వరకు వెనక్కి వాల్చుకోవచ్చు . దీనివల్ల విమానాల్లోని బిజినెస్ క్లాస్ తరహా కంఫర్ట్ లభిస్తుంది. అంతేకాకుండా డ్యాష్‌బోర్డ్‌పై అమర్చిన భారీ 15.6 అంగుళాల గ్రాండ్‌వ్యూ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, గ్లాస్ రూఫ్ మరియు అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఫ్యామిలీ కొనుగోలుదారులను ఎంతగానో ఆకర్షించాయి.
ఈ కారులో రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో ఒకటి స్టాండర్డ్ వేరియంట్. ఇది 38 kWh బ్యాటరీ ప్యాక్. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 332 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. సిటీ రైడింగ్‌కు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. రెండోది ప్రో వేరియంట్. 52.9 kWh బ్యాటరీ ప్యాక్ ఉండగా.. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 449 కిలోమీటర్ల లాంగ్ రేంజ్ అందిస్తుంది. హైవే ప్రయాణాలకు ఇది అనుకూలం. రెండు వేరియంట్లలోనూ 136 hp పవర్ మరియు 200 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు.
ఈవీలు అనగానే కేవలం హైదరాబాద్, ముంబై, ఢిల్లీ లాంటి పెద్ద నగరాలకే పరిమితం అనుకునే అంచనాలను విండ్సర్ ఈవీ తిరగరాసింది. ఎందుకంటే ఈ కారు మొత్తం అమ్మకాలలో దాదాపు 70 శాతం సేల్స్ నాన్ మెట్రో నగరాలు, టౌన్లు, ఎమర్జింగ్ మార్కెట్ల నుంచే ఉన్నాయి. ఈ ఏడాది జనవరి జూన్ మధ్య 19,000 పైగా విండ్సర్ కార్లు అమ్ముడయ్యాయి. అంతేకాకుండా మార్కెట్లోకి వచ్చిన కేవలం రెండు సంవత్సరాల లోపే 75,000 యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటేసింది. ఈ భారీ డిమాండ్ కారణంగా JSW MG మోటార్ ఇండియా కంపెనీ ఓవరాల్ సేల్స్ కూడా 13% వృద్ధిని సాధించాయి. ఈ విధంగా కేవలం నంబర్ల పరంగానే కాకుండా, భారత్‌లో ఈవీ కారును కొనుగోలు చేసే విధానాన్ని, చూసే కోణాన్ని మార్చడంలో ఎమ్‌జీ విండ్సర్ ఈవీ ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.
Sonali Bendre: మన చిన్నతనం లో ఎంతగానో ఇష్టపడిన హీరోయిన్స్ లో ఒకరు సోనాలి బ్రిందే. చిరంజీవి తో ఇంద్ర , శంకర్ దాదా MBBS , బాలకృష్ణ తో పల్నాటి బ్రహ్మనాయుడు, అక్కినేని నాగార్జున తో మన్మధుడు , సూపర్ స్టార్ మహేష్ బాబు తో మురారి, కృష్ణ వంశీ ఖడ్గం , ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించి మన తెలుగు ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. వాస్తవానికి బాలీవుడ్ లో సోనాలి బ్రిందే పెద్ద హీరోయిన్. సల్మాన్ ఖాన్ , షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ ఇలా ఎంతో మంది బాలీవుడ్ సూపర్ స్టార్స్ తో కలిసి ఆమె ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి యూత్ ఆడియన్స్ ని ఒక ఊపు ఊపింది. అలాంటి సోనాలి బ్రిందే పెళ్లి తర్వాత సినిమాలు బాగా తగ్గించేసింది.
ఆమె చివరిసారిగా హీరోయిన్ గా వెండితెర పై కనిపించిన చిత్రం ‘వన్స్ అపాన్ ఏ టైం ఇన్ ముంబై దొబారా’. 2013 వ సంవత్సరం లో విడుదలైన ఈ సినిమా తర్వాత ఆమె వెండితెర కి దూరమైంది. వ్యక్తిగతంగా క్యాన్సర్ వ్యాధిని ఎదురుకొని , దాంతో పోరాడి జయించిన ఈమె , 2025 వ సంవత్సరం లో ‘బీ హ్యాపీ’ అనే చిత్రంలో గెస్ట్ రోల్ ద్వారా మరోసారి ఆడియన్స్ ని పలకరించింది. ఇకపోతే రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో బాలీవుడ్ , టాలీవుడ్ లపై చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఆమె మాట్లాడుతూ ‘హిందీ కంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎంతో ఆర్గనైజ్డ్ గా ఉంటుంది. అక్కడ స్క్రిప్ట్స్ విషయం లో చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు. బౌండెడ్ స్క్రిప్ట్స్ ఉంటేనే షూటింగ్ కి వెళ్తారు. హిందీ లో అలా కాదు , షూటింగ్ సెట్స్ లోనే సీన్స్ రాస్తుంటారు. దీని వల్ల క్వాలిటీ ఔట్పుట్ రాదు. అంతే కాదు బాలీవుడ్ లో అందించే ఫుడ్ కంటే , టాలీవుడ్ లో అందించే ఫుడ్ చాలా బాగుంటుంది. తెలుగు సినిమాల బడ్జెట్ లు కూడా భారీగా ఉంటుంది. బాలీవుడ్ తో పోలిస్తే టాలీవుడ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగుంటాయి’ అంటూ చెప్పుకొచ్చింది సోనాలి బ్రిందే. మన టాలీవుడ్ సినిమాల ద్వారా క్రేజ్ ని సంపాదించుకొని , ఆ తర్వాత బాలీవుడ్ లోకి వెళ్లి మన ఇండస్ట్రీ ని తక్కువ చేసి మాట్లాడే హీరోయిన్స్ ఉన్న ఈ రోజుల్లో , బాలీవుడ్ కి చెందిన ఒక హీరోయిన్ మన ఇండస్ట్రీ గురించి ఇంత గొప్పగా మాట్లాడడం గమనార్హం.
OG 2 Teaser: పవన్ కళ్యాణ్ అభిమానులకు ‘ఓజీ’ చిత్రం ఒక ఎమోషన్ లాంటిది. కఠినమైన సమయంలో ఈ సినిమా ఇచ్చిన భారీ అంచనాల నడుమ విడుదలై , సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. మొదటి రోజు నుండి క్లోజింగ్ వరకు ఈ సినిమా పెట్టిన రికార్డ్స్ పవన్ ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. జెన్ జీ యూత్ మొత్తాన్ని పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో ఒక ఊపు ఊపేసారు అనే చెప్పొచ్చు. అలాంటి చిత్రానికి ప్రీక్వెల్ గా ‘ఓజీ 2’ త్వరలోనే మొదలు కాబోతుందని రీసెంట్ గానే అధికారిక ప్రకటన చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ప్రకటన సోషల్ మీడియా లో సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. ‘ఓజీ యూనివర్స్’ పేరుతో సీక్వెల్ , ప్రీక్వెల్ ని ఏకకాలం లో తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారు డైరెక్టర్ సుజిత్.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీ గా ఉన్నారు డైరెక్టర్ సుజిత్. నవంబర్ నుండి షూటింగ్ కార్యక్రమాలను మొదలుపెట్టే ప్లాన్ లో ఉన్నారు ఆయన. అయితే సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు గూస్ బంప్స్ రప్పించేలా ఒక గ్లింప్స్ లేదా టీజర్ ని రెడీ చేసే ప్లాన్ లో ఉన్నారట మూవీ టీం. అయితే షూటింగ్ అప్పటికి ప్రారంభం అవ్వదు కదా, గ్లింప్స్ / టీజర్ ని ఎలా రెడీ చేస్తారు అంటూ సోషల్ మీడియా లో అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే మొదటి భాగం షూటింగ్ సమయం లోనే ప్రీక్వెల్ కి సంబంధించి కొన్ని రోజులు జపాన్ లో , అదే విధంగా సీక్వెల్ కి సంబంధించి కొన్ని రోజులు కాకినాడ పోర్ట్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారా సుజిత్.
అందులోని షాట్స్ ని ఈ గ్లింప్స్ వీడియో లో పొందుపరిచే ప్లాన్ లో ఉన్నారట టీం. అంతే కాకుండా ఆగష్టు నెలలో పవన్ కళ్యాణ్ కి సంబంధించి కొన్ని షాట్స్ ని కేవలం గ్లింప్స్ ఫుటేజీ కోసం చిత్రీకరించే ప్లాన్ లో కూడా సుజిత్ ఉన్నట్టు తెలుస్తోంది. 2023 లో విడుదల చేసిన ‘ఓజీ’ గ్లింప్స్ వీడియో కి ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కాబట్టి ‘ఓజీ 2’ గ్లింప్స్ పై అంచనాలు ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటాయి. మరి ఆ అంచనాలను సుజిత్ ఎంత వరకు అందుకుంటాడో చూడాలి. మరోపక్క మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా నిన్న ఒక ఈవెంట్ లో సెప్టెంబర్ నెలలో ‘ఓజీ 2’ అప్డేట్ ఉంటుందని అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. చూడాలి మరి ఈ గ్లింప్స్ వీడియో అభిమానుల్లో ఎలాంటి అంచనాలు రేపుతోంది అనేది.
Sonu Sood: కొద్దిరోజుల క్రితమే జెన్యు సంబంధిత ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న వరంగల్ కి చెందిన పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ పరిస్థితి ని చూసినప్పుడు మన హృదయం విచారం తో నిండిపోయింది. 17 ఏళ్ళ ఈ కుర్రాడు మరికొద్దిరోజుల్లోనే చనిపోతాడని డాక్టర్లు చెప్పడం , చివరి కోరికగా తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ ని కలవాలని కోరిక ని ఆ కుర్రాడు వ్యక్తం చేయడం , ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వెంటనే వరంగల్ కి వెళ్లి నిరంజన్ ని ఎంతో ఆప్యాయంగా పలకరించడం , అతను కోరిన పుడిల్ కుక్కని , ఐప్యాడ్ ని బహుమతిగా ఇవ్వడం తో పాటు , వైద్యానికి అవసరమయ్యే డబ్బులు ఇచ్చి , ఆ కుటుంబం చేత క్యాంటీన్ కూడా పెట్టించడం వంటివి కోట్లాది మంది తెలుగు ప్రజల హృదయాలను టచ్ చేసింది.
‘నా ఓజీ 2 మూవీ కి విశిష్ట అతిథి నువ్వే’ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు కూడా బాగా వైరల్ అయ్యాయి. నిరంజన్ బ్రతికేందుకు ఒక్క శాతం అవకాశం ఉన్నా , దయచేసి అతన్ని బ్రతికించండి అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు , నెటిజెన్స్ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా ద్వారా ప్రార్తించారు. ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కూడా 5 లక్షల రూపాయిల ఆర్ధిక సాయం అందించారు. అయితే ఈ కుర్రాడు నిన్న రాత్రి కన్నుమూసిన సంఘటన తెలుసుకున్న అభిమానులు , నెటిజెన్స్ తీవ్రమైన దిగ్బ్రాంతి ని వ్యక్తం చేశారు. ఇంత తొందరగా చనిపోతాడని అసలు ఊహించలేదని , అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ పోస్టులు వేస్తున్నారు. ఇకపోతే ఆపదలో ఉన్నవారికి సహాయం అందించడంలో ఎప్పుడూ ముందు ఉండే వారిలో సోనూసూద్ ఒకరు అనే సంగతి అందరికీ తెలిసిందే. కరోనా లాక్ డౌన్ సమయం లో ఈయన అందించిన సేవలు ఎలాంటివో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు , అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు కూడా.
అయితే నిరంజన్ సమస్యని తెలుసుకున్న సోనూసూద్ పవన్ కళ్యాణ్ కంటే ముందే స్పందించారు. అతన్ని ఒకసారి కలిసి , అవసరమయ్యే డబ్బులు , వస్తువులు అన్నీ అందించారు. ఇప్పుడు నిరంజన్ చనిపోయాడు అనే విషయం తెలుసుకున్న సోనూసూద్ తీవ్రమైన విచారం వ్యక్తం చేశారు. వెంటనే కుటుంబానికి వీడియో కాల్ చేసి ఓదార్చారు. భవిష్యత్తులో కుటుంబానికి ఏ చిన్న అవసరం వచ్చినా తాను అండగా ఉంటానని , భరోసా ఇచ్చారు. సోను సూద్ చూపించిన ఈ ఉదారంగా స్వభావాన్ని చూసి , పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Rajinikanth Jailer 2: తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే ఏ సినిమా కూడా పాన్ ఇండియాలో తమ సత్తా చాటలేక పోతుంది. ఇప్పటివరకు స్టార్ హీరోలు ఎన్ని సినిమాలు చేసినా కూడా 1000 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టడం అనేది అసాధ్యం అవుతుంది. ఇక ఇలాంటి క్రమంలోనే రజినీకాంత్ లాంటి స్టార్ హీరో ఇప్పుడు ‘జైలర్ 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇంతకుముందు ఆయన నెల్సన్ డైరెక్షన్ లో చేసిన జైలర్ సినిమా భారీ విజయాన్ని సాధించింది. దాంతో దానికి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి… జైలర్ మొదటి పార్ట్ కొంతమందికి నచ్చింది. మరి కొంతమందికి నచ్చలేదు. నిజానికి ఈ సినిమాని బ్యాగ్రౌండ్ స్కోర్ లేకుండా చూస్తే ఏమాత్రం ఇంపాక్ట్ ఇవ్వదు.
కథ పరంగా కూడా ఈ సినిమాలో అంత పెద్ద గొప్ప కథ అయితే ఏమీలేదు. కాబట్టి అనిరుధ్ ఈ సినిమాను తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో కాపాడాడు. మరి సెకండ్ పార్ట్ లో కూడా బ్యా గ్రౌండ్ స్కోర్ హైలెట్ కాబోతుందా? దర్శకుడు కథను ఎలా మలిచాడు ప్రేక్షకులు ఈ సినిమాని ఎలా ఆదరిస్తారు అనేది తెలియాల్సి ఉంది.
నిజానికి అనిరుధ్ తన బ్యా గ్రౌండ్ స్కోర్ తో ఈ సినిమాకు ప్రాణం పోశారట. ఇందులో అదో ఒక్కటే హైలైట్ అవుతుందా? లేదంటే కథలో వైవిధ్య ఉంటుందా? దర్శకుడు తన దర్శకత్వ ప్రతిభతో కూడా సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లగలుగుతాడా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రజినీకాంత్ ఎన్ని మంచి సినిమాలు చేసిన కూడా అవేవీ 1000 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టడం లేదు. గత సంవత్సరం లోకేష్ కనకరాజు డైరెక్షన్లో చేసిన కూలీ సినిమా 500 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.
అయినప్పటికీ 1000 కోట్లు సంపాదించాలి అనే కల మాత్రం కలగాలని మిగిలిపోయింది. ఇప్పుడున్న స్టార్ హీరోలు 1000 కోట్ల కలెక్షన్స్ ని అలవోకగా రాబడుతుంటే ఒకప్పటి స్టార్ హీరో అయిన రజనీకాంత్ మాత్రమే దానికోసం తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. ఇది చూసిన అతని అభిమానులు కొంతవరకు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు…
Toxic Tabahi Song Review: కన్నడ సూపర్ స్టార్ యాష్ హీరో గా నటించిన ‘టాక్సిక్’ చిత్రం పై యూత్ ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అన్నీ అనుకున్న విధంగా జరిగి ఉండుంటే ఈ చిత్రం ఈ ఏడాది ఉగాది కానుకగా మార్చి 19 న విడుదల అయ్యి ఉండేది. కానీ బెస్ట్ ఔట్పుట్ కోసం జూన్ కి వాయిదా వేశారు. అప్పటికీ కూడా ఔట్పుట్ రెడీ గా లేకపోవడం ఆగస్టు 26 కి వాయిదా వేశారు. ఈసారి ఎలాంటి ఆలస్యం ఉండదు , మరోసారి వాయిదా కూడా ఉండదు, కచ్చితంగా ఆ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం నుండి ప్రమోషనల్ కంటెంట్ ని ఒక్కొక్కటిగా వదులుతున్నారు మేకర్స్. రీసెంట్ గా విడుదల చేసిన ‘లేడీస్ & లేడీస్’ టీజర్ కి ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ఇక నేడు ఈ చిత్రం నుండి కాసేపటి క్రితమే ‘తబాహి’ పాటని విడుదల చేశారు. తెలుగు వెర్షన్ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ ని అందించగా, విశాల్ మిశ్రా సంగీతం అందించారు. టీజర్ , ట్రైలర్ లాగానే ఈ సాంగ్ కూడా చాలా బోల్డ్ గా ఉంది. హీరో హీరోయిన్ మధ్య పాట మొత్తం చూపించిన రొమాన్స్ కి యూత్ ఆడియన్స్ పిచ్చెక్కిపోతున్నారు. హీరో కి ఏ మూడ్ వచ్చినా హీరోయిన్ కియారా అద్వానీ తో రొమాన్స్ చేయడానికి వెళ్లిపోతుండడం గమనార్హం. మాఫియా డాన్స్ తో డీల్ మాట్లాడుతున్నప్పుడు , హీరో కి ఎదో అసంతృప్తి కలుగుతుంది. అప్పుడు మీటింగ్ మధ్యలోనే లేచి వెళ్ళిపోయి హీరోయిన్ తో రొమాన్స్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఈ మీటింగ్ లో హీరో కి అక్క పాత్ర పోషించిన నయనతార కూడా ఉంటుంది.
ఇక హీరోయిన్ కియారా అద్వానీ కూడా లిమిట్స్ దాటేసింది. హీరో తో బోల్డ్ రొమాన్స్ చేయడానికి ఆమె అన్ని విధాలుగా సహకరించింది. ఈ రేంజ్ రొమాన్స్ చేయడానికి ఆమె భర్త సిద్దార్థ్ మల్హోత్రా అనుమతి ఇవ్వడం గమనార్హం. కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియా లో తనకు సంబంధించిన బోల్డ్ రొమాంటిక్ సన్నివేశాలను తొలగించాలని కియారా అద్వానీ కోరినట్టు ఒక ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే అందులో ఎలాంటి నిజం లేదని కియారా అద్వానీ ఆ తర్వాత ఒక క్లారిటీ ఇచ్చింది. ఈరోజు ఈ పాట చూసిన తర్వాత అర్థమైంది , అది ఏ రేంజ్ బోల్డ్ రొమాన్స్ అనేది. ఇక ట్యూన్ కూడా బాగానే క్యాచీ గా ఉంది , రామజోగయ్య శాస్త్రి మరోసారి తన మార్క్ చూపించారు. కేవలం పాటలోనే ఇంత రొమాన్స్ ఉంటే , ఇక సినిమాలో ఏ రేంజ్ లో ఉంటుందో అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Bigg Boss Telugu: ప్రతీ ఏడాది లాగానే ఈ ఏడాది కూడా బిగ్ బాస్ సీజన్ అట్టహాసం గా ప్రారంభం కానుంది. రీసెంట్ గానే ‘అగ్నిపరీక్ష 2’ కి సంబంధించిన దరఖాస్తులు కూడా స్వీకరించిన బిగ్ బాస్ టీం , ఈ నెల 27 నుండి ఈ షో ని ప్రారంభించనుంది. ఆగస్టు 15 నుండి సెప్టెంబర్ 6 వరకు ఈ షో కి సంబంధించిన ఎపిసోడ్స్ జియో హాట్ స్టార్ మరియు స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ కానుంది. ఈ షో ద్వారా సామాన్యులను బిగ్ బాస్ హౌస్ లోకి పంపనున్నారు. గత సీజన్ లో లాగానే ఈ సీజన్ లో సామాన్యులుగా అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ ఏ రేంజ్ సునామీ ని సృష్టించారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సామాన్యుడిగా అడుగుపెట్టిన కళ్యాణ్ పడాల టైటిల్ విన్నర్ గా నిలిచాడు , అదే విధంగా మరో సామాన్యుడు డిమోన్ పవన్ టాప్ 3 కంటెస్టెంట్ గా నిలిచి సెన్సేషన్ సృష్టించాడు.
ఈ ఏడాది కూడా అలాంటి సామాన్యుల కోసం వేట గట్టిగానే జరగబోతుంది. ఇదంతా పక్కన పెడితే ఈ షో గురించి రెండు సార్లు కంటెస్టెంట్ గా బిగ్ బాస్ షో లో పాల్గొన్న హరితేజ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆమె మాట్లాడుతూ ‘బిగ్ బాస్ మొదటి సీజన్ మన హైదరాబాద్ లో జరగలేదు. ముంబై కి దగ్గర్లో ఉన్నటువంటి లోనావాలాలో జరిగింది. ఒక అడవి లో బిగ్ బాస్ సెట్ వేశారు. రాత్రి సమయంలో పులుల గర్జనలకు సంబంధించిన శబ్దాలు కూడా మాకు వినిపించేవి. ఒక్కోసారి మా హౌస్ లోకి పాములు కూడా వచ్చేవి. కానీ నేను ఎలాంటి కలత చెందలేదు , ఆ షో ని బాగానే ఎంజాయ్ చేశాను. ఆ అనుభవాలు భయంకరమైనవే , కానీ చాలా థ్రిల్లింగ్ గా అనిపించేవి. ఆ సీజన్ లో హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్ తో మేము చేసిన సరదా సంభాషణలు ఇప్పటికీ గుర్తున్నాయి’.
‘కానీ బిగ్ బాస్ 8 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న తర్వాత నాకు ఆ షో పై నా అభిప్రాయం మారింది. ఈ షో కారణంగా నా ఇమేజ్ బాగా దెబ్బతినింది. బయట నాపై చాలా నెగెటివిటీ పెరిగింది. వాటి వల్ల నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. తిరిగి కోలుకోవడానికి నాకు చాలా సమయమే పట్టింది. ఇప్పుడు ఆ రియాలిటీ షో పై పూర్తిగా ఆసక్తి పోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ షో పై చిరాకు కలుగుతుంది. మళ్లీ ఆ షో కి వెళ్లాలనే ఆలోచన నాకు అసలు లేదు’ అంటూ చెప్పుకొచ్చింది హరితేజ. బిగ్ బాస్ సీజన్ 1 లో టాప్ 3 కంటెస్టెంట్ గా నిల్చిన హరితేజ, బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డు గా ఎంట్రీ ఇచ్చి కేవలం నాలుగు వారాలకే ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.
Prashna Ravan: గత కొంతకాలంగా సోషల్ మీడియా లో , ఎలక్ట్రానిక్ మీడియా లో ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు ‘ప్రశ్న రావణ్’. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై , హిందూ దేవుళ్లపై ఇష్టమొచ్చినట్టు నోరు పారేసుకోవడం, ఉగ్రవాదులు , నక్సలైట్ లను సపోర్టు చేస్తూ వీడియోలు చేయడం వంటి కార్యక్రమాల వల్ల , ఇతని పై UAPA చట్టం క్రింద గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు రావణ్ కి 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన నెల్లూరు జైలు లో ఉన్నారు. అయితే ‘ప్రశ్న రావణ్’ ని విచారణ లో భాగంగా ఆయన మొబైల్ ని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు. చాలా వరకు డేటా ఆయన తన మొబైల్ నుండి తొలగించడంతో , రీ స్టోర్ చేసే ప్రక్రియ కోసమే ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు.
ఈ ల్యాబ్ లో ఆయన మొబైల్ నుండి సంచలన విషయాలను కనుగొన్నారు అధికారులు. అనేక అశ్లీల వీడియోలు రావణ్ మొబైల్ లో ఉన్నాయట. ఈ వీడియోలను వాడుకొని దాదాపుగా 10 మంది మహిళలను ఇతగాడు బ్లాక్ మెయిల్ చేశాడని , వాళ్ళని లైంగికంగా ఎంతో వేధించినట్టు ఫోరెన్సిక్ అధికారులు గుర్తించారు. వీటి వివరాలు పూర్తిగా రిమాండ్ రిపోర్ట్ లో పొందుపర్చనున్నారు పోలీసులు. ఇంకా ఆయనకు సంబంధించిన వివరాలను , నెట్వర్క్ ని ఛేదించడానికి పోలీసులు సుదీర్ఘ విచారణ చేపడుతున్నారు. ఇతన్ని అరెస్ట్ చేసిన మొదటి రోజు నుండి ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఎలా గిలగిలలాడిపోతున్నాడో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. నాన్ స్టాప్ గా వీడియోల మీద వీడియోలు అప్లోడ్ చేస్తూ ప్రశ్న రావణ్ పై అన్యాయంగా కేసులు పెట్టినట్టు జనాలను నమ్మించే ప్రయత్నం చేశాడు. అంతే కాకుండా తన మొబైల్ ఫోన్ లోని డేటా ని వాడుకొని అతనికి మద్దతుగా నిల్చిన వారిని వేధించబోతున్నారనే విషయాన్ని కూడా ప్రకాష్ రాజ్ తెలిపాడు.
దీన్ని బట్టి చూస్తుంటే ఆయనకు సంబంధించిన సమాచారం ఎదో బలమైనది ఉందని తెలుస్తోంది. ఆ సమాచారం బయటపడితే తన చాప్టర్ క్లోజ్ అని ప్రకాష్ రాజ్ భయపడుతున్నదని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. చూస్తుంటే అదే నిజం అయ్యేలా ఉంది , ప్రకాష్ రాజ్ తో రావణ్ కి ఉన్నటువంటి సంబంధాలను మొత్తం బయటపెట్టే పనిలో ఉన్నారట పోలీసులు. ఒకవేళ ఏదైనా సంఘ విద్రోహ చర్యలకు వీళ్లిద్దరు ప్రయత్నం చేసుంటే , కచ్చితంగా ప్రకాష్ రాజ్ కి కూడా నోటీసులు అందే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే రావణ్ అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండడంతో , ఇతనికి సపోర్టుగా నిలుస్తూ వచ్చిన వైసీపీ నెమ్మదిగా ప్లేట్ ఫిరాయించింది. రావణ్ తమ మనిషి కాదని , అతను తెలుగు దేశం పార్టీ కి చెందిన వాడు అంటూ స్టీరింగ్ తిప్పింది. మొత్తానికి ఈ అంశంలో వేలుపెట్టి వైసీపీ పార్టీ కొత్త సమస్యలను కొని తెచ్చుకుంది అనే చెప్పాలి.
Ambati Vs Peddireddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో విభేదాల పర్వం తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ఆ పార్టీలో ఆలోచించి నాయకులు వర్సెస్ దూకుడు కలిగిన నాయకులు అన్నట్టు పరిస్థితి మారింది. ఏపీలో జోసెఫ్ రావణ్ అరెస్ట్ ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు వైసిపి మద్దతుగా నిలిచింది. న్యాయ పోరాటానికి సహాయం అందించింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే చేస్తే తప్పు ఏంటి అని ప్రశ్నించారు. మేము ఉన్నది అందుకే కదా అన్నట్టు మాట్లాడారు.. అయితే తాజాగా మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అందుకు విరుద్ధంగా ప్రకటన చేశారు. జోసెఫ్ రావణ్ కు తమ పార్టీతో అసలు సంబంధం లేదని తేల్చేశారు. అంతర్గతంగా వైసీపీలో పార్టీకి డ్యామేజ్ జరుగుతుందన్న కోణంలోనే పెద్దిరెడ్డి ప్రకటన అని తెలుస్తోంది.
* అప్పట్లో వైసీపీ లైన్లోనే..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు కూటమి ప్రభుత్వంపై యూట్యూబ్ వేదికగా నిత్య విమర్శలు చేస్తూ వస్తున్నారు జోసెఫ్ రావణ్. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లైన్లో పనిచేస్తున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. తాజాగా ఆయన అరెస్టుతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పందించిన తీరుతో కూడా ఈ అనుమానాలు బలపడ్డాయి. హిందూ దేవుళ్ళతో పాటు దేవతలపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. అవి తీవ్ర ప్రతికూలత చూపాయి. ఇటువంటి పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. రావణ్ అనే వ్యక్తి తమ పార్టీకి చెందిన వాడు కాదని.. తాము అతడిని ఎక్కడినుంచో తీసుకువచ్చి.. కూటమి ప్రభుత్వంపై మాట్లాడించలేదని డిఫెన్స్ మోడ్ లోకి వెళ్లారు. సదరు వ్యక్తి కేవలం పవన్ కళ్యాణ్ ను.. ఆయన విధానాలను మాత్రమే ప్రశ్నించాడని.. దానికి తమకు ముడి పెట్టడం సరికాదని చెప్పుకొచ్చారు. అయితే నిన్నటి వరకు తమ అనుకూల సోషల్ మీడియా నెట్వర్క్ లో.. రావణ్ వీడియోలను విపరీతంగా షేర్ చేస్తూ.. ఓ రేంజ్ లో ఓనర్ షిప్ తీసుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించడంతో అసలు సీన్ అర్థం అవుతోంది.
* బిజెపి భయం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యూటర్న్ తీసుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆయన పాత వీడియోలు వెలుగులోకి వచ్చాయి. రావణ్ గతంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పై అత్యంత ఘోరమైన, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏకంగా దేశ సార్వభౌమత్యాన్ని, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన వీడియోలు వైరల్ అయ్యాయి. అటువంటి వ్యక్తిని నెత్తిన పెట్టుకుంటే బిజెపికి కోపం వస్తుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భయపడుతోంది. అందుకే దానిని వదిలించుకునే పనిలో పడింది. జోసెఫ్ రావణ్ కు మద్దతు తెలిపితే తప్పు ఏంటి అని అంబటి రాంబాబు ప్రశ్నించగా.. ఇప్పుడు అసలు తమకు ఆయనతో సంబంధం లేదని తేల్చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. దీనిపై పార్టీలో చర్చ నడుస్తోంది. దూకుడు గల నేతలను నియంత్రించకపోతే పార్టీకి నష్టమన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి జగన్ మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.
Joseph Ravan Case: ఏపీలో జోసెఫ్ రావణ్ పై కేసులు సంచలనం సృష్టిస్తున్నాయి. రాజకీయ ప్రముఖులతోపాటు హిందూ దేవుళ్లను కించపరుస్తూ ఆయన చేసిన కామెంట్స్ ప్రకంపనలు రేపాయి. దీనిని ఏపీ పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది. తాజాగా ఆయన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేసిన క్రమంలో.. పాత వీడియోలు వెలుగులోకి వచ్చాయి. పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. యూట్యూబర్ గా గతంలో ఆయన చాలా రకాల వీడియోలు చేశారు. ప్రధానంగా హిందూ సంప్రదాయాలతో పాటు దేవుళ్లను టార్గెట్ చేసుకున్నారు.. ఆ వీడియోలు బయటకు రావడంతో పోలీస్ శాఖ ఉక్కు పాదం మోపింది. వరుసగా ఆయనపై కేసులు నమోదవుతున్నాయి. అదే సమయంలో ఆయన పై లోతైన విచారణ కొనసాగుతోంది. మతోన్మాద శక్తులతో పాటు జాతీయస్థాయి కుట్ర ఉందన్న అనుమానాలతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే కళ్ళు బైర్లు కమ్మేలా నిజాలు వెలుగు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
* అశ్లీల వీడియోలు..
తాజాగా జోసెఫ్ రావణ్ కు చెందిన సెల్ఫోన్లో అశ్లీల వీడియోలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈనెల ఒకటి నాయన అరెస్ట్ అయ్యారు. ఆ సమయంలో ఫోన్ చేస్తాను విశ్లేషించిన పోలీసులు అందులో కీలక సమాచారం ఉన్నట్లు తెలుసుకున్నారు. అయితే అప్పటికే రావని తెలివిగా తన ఫోన్లోని వీడియోలను డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. అలా డిలీట్ చేసిన డేటా కోసం ఫోన్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఆ ల్యాబ్ నుంచి వచ్చిన నివేదిక షాకింగ్ అనిపిస్తోంది. అమాయక యువతులను టార్గెట్ గా చేసుకుని వారితో అసభ్యకరంగా ప్రవర్తించడం.. ఏకాంతంగా ఉన్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పుడు మరో కోణం దొరికింది పోలీసులకు. రావణ్ బారిన పడిన బాధితులు ఎంతమంది ఉన్నారన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేశారు. డేటా ఆధారంగా పదిమంది బాధితులను గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో మరింత కఠినమైన కేసులు జోసెఫ్ రావణ్ పై మోపే అవకాశం ఉంది.
* కఠినమైన సెక్షన్లు..
ఇప్పటికే కఠినమైన చట్టం కింద కేసు నమోదు చేశారు. మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేసేలా, సాయుధ తిరుగుబాటును ప్రోత్సహించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదుతో రావణ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు భంగం కలిగిస్తూ దేశద్రోహానికి పాల్పడ్డారంటూ పలు సెక్షన్ల కింద, చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం ( ఉపా ) సెక్షన్ల కింద అభియోగాలు మోస్తారు. కోర్టులో హాజరు పరచగా ఈనెల 18 వరకు రిమాండ్ విధించారు. అయితే ఇప్పుడు కొత్తగా అమాయక యువతులను టార్గెట్ చేసి.. అశ్లీలంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై అదనపు సెక్షన్లు నమోదు చేసే ఛాన్స్ కనిపిస్తోంది.
Andhra Pradesh MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ప్రారంభం అయింది. గవర్నర్ కోటా కింద ఎన్నికైన ఇద్దరు సభ్యులు ఈనెల 28న పదవి విరమణ చేస్తారు. దీంతో కూటమికి చెందిన ఇద్దరు నేతలకు ఛాన్స్ దక్కనుంది. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీ ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలను తీసుకుంటుందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆశావాహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. చాలామంది సీనియర్ నేతలు సైతం పోటీలో ఉన్నారు. అయితే ఈసారి ఉత్తరాంధ్రకు ఒక ఎమ్మెల్సీ పదవి ఖాయమని తెలుస్తోంది. ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాల నుంచి ఆశావహులు ఉన్నారు. ప్రధానంగా టిక్కెట్లు త్యాగం చేసిన వారికి ఈసారి ఛాన్స్ ఉంటుందన్న ప్రచారం సాగుతోంది. పార్టీలో సీనియారిటీతో పాటు సిన్సియారిటీకి ప్రాధాన్యం ఇచ్చి ఎమ్మెల్సీ అవకాసం ఇస్తారని తెలుస్తోంది. ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాల్లో పదిమందికి పైగా ఆశావహులు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
* విశాఖలో మాజీ మంత్రి..
ఉత్తరాంధ్ర అంటేనే ఎక్కువగా బీసీలు గుర్తుకొస్తారు. అందుకే ఆ రెండు ఎమ్మెల్సీలు ఒక పదవి ఉత్తరాంధ్రకు చెందిన బీసీ నేతకు ఇస్తారని తెలుస్తోంది. విశాఖ జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఎమ్మెల్సీ పదవి కోరుకుంటున్నారు. మొన్నటి ఎన్నికలకు ముందు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు. గతంలో ఎమ్మెల్సీ పదవిని రెన్యువల్ చేయలేదని చెప్పి 2012లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే అక్కడ దాదాపు పుష్కర కాలం ఉన్న ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. అందుకే తిరిగి మాతృ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్న హామీ తోనే ఆయన చేరినట్లు అప్పట్లో ప్రచారం నడిచింది. దీంతో ఈసారి ఆయనకు చాన్స్ ఉండబోతుందన్న ప్రచారం సాగుతోంది. ఇంకోవైపు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి పేరు కూడా వినిపిస్తోంది. ఆయన సైతం మొన్నటి ఎన్నికల్లో టికెట్ ఆశించారు. దక్కలేదు కానీ కూటమి తరుపున బాగానే పనిచేశారు. పైగా బీసీ నేత కావడంతో ఆయనకు ఛాన్స్ ఇస్తారని విశాఖ పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం సాగుతోంది.
* నెల్లిమర్ల నేత సైతం..
విజయనగరం జిల్లాకు సంబంధించిన నెల్లిమర్ల టిడిపి ఇన్చార్జ్ కర్రోతు బంగార్రాజు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన ప్రస్తుతం రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవిలో ఉన్నారు. కానీ చట్టసభలకు వెళ్లాలన్నది ఆయన కోరిక. మొన్నటి ఎన్నికల్లో భోగాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ పొత్తులో భాగంగా నెల్లిమర్ల నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు ఆయన. అయితే కూటమి వచ్చిన తర్వాత ఆయనకు రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవి ఇచ్చారు. ఆయన మాత్రం ఎమ్మెల్సీ పదవిని కోరుకుంటున్నారు. నెల్లిమర్ల అనేది కీలక నియోజకవర్గం. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మితం అవుతుండడంతో ఆ నియోజకవర్గాన్ని టిడిపి తీసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే అశోక్గజపతిరాజు కుమార్తె భోగాపురం నుండి పోటీ చేస్తారని ఒక ప్రచారం ఉంది. అయితే బంగారు రాజుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే అక్కడ అదితి గజపతిరాజు ఈజీగా గెలుస్తారన్న ఈక్వేషన్ ఉంది.
* సిక్కోలు నుంచి..
శ్రీకాకుళం జిల్లా నుంచి తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన కలమట వెంకటరమణ ఎమ్మెల్సీ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో పాతపట్నం టికెట్ త్యాగం చేశారు. కొత్త నేత మామిడి గోవిందరావుకు టికెట్ లభించగా.. ఆయన గెలుపు కోసం కృషి చేశారు. అందుకే తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఇలా ఉత్తరాంధ్ర నుంచి ఎమ్మెల్సీ పదవుల కోసం గట్టి పోటీ ఉంది. చూడాలి ఎవరికి అవకాశం దొరుకుతుందో..
El Nino Andhra Pradesh: ఏపీలో వర్షాభావం కనిపిస్తోంది. జూలై రెండవ వారం దాటుతున్న ఆశించిన స్థాయిలో వర్షాలు పడడం లేదు. సాగునీటి జలాశయాలు, ప్రాజెక్టుల్లో నీరు లేదు. డెడ్ స్టోరేజ్ కు చేరుకున్నాయి నిల్వలు. మరోవైపు ఖరీఫ్ సీజన్ కూడా ప్రారంభమైంది కానీ.. వర్షాలు లేక ఆశించిన స్థాయిలో పనులు ముందుకు వెళ్లడం లేదు. అల్పపీడనం ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు పడ్డాయి కానీ.. ప్రస్తుతానికి ముఖం చాటేసాయి. వరి విత్తనాలు చల్లి వర్షం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు అన్నదాతలు. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే మాత్రం ఖరీఫ్ ప్రమాదకరమే అని అర్థం అవుతోంది. ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమయింది. ఈ వాతావరణ విపత్తుని ఎదుర్కొనేందుకు సన్నద్ధం అవుతోంది.
* ముందుగానే హెచ్చరికలు..
ప్రధానంగా ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. అది మన రాష్ట్రంపై స్పష్టంగా కనిపించింది. నైరుతి రుతుపవనాల రాక కూడా ఆలస్యం అయ్యింది. జూన్ రెండో వారానికి రాష్ట్రానికి రుతుపవనాలు తాకాయి. తీవ్ర వర్షాభావం నెలకొంది. వర్షపాతం లోటు కనిపిస్తోంది. జూన్లో మైనస్ 25 వర్షపాతం లోటు నమోదు కాగా.. జూలైలో ఇప్పటివరకు మైనస్ 41 శాతం వర్షపాతం లోటు నమోదయింది. సాధారణంగా జూన్ నుంచి నవంబర్ వరకు నైరుతీ రుతుపవనాలు విస్తరిస్తాయి. ఖరీఫ్ కు ఇవే ప్రధానం. ఈ సీజన్ మొత్తం మైనస్ 27% వర్షపాతం లోటుతో ముగిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
* ఇది పరిస్థితి..
ఉమ్మడి 13 జిల్లాల్లో 68 మండలాలు ఉన్నాయి. అందులో ఎల్ నినో ప్రభావం 105 మండలాలపై తీవ్రంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 208 మండలాలపై మాత్రం మద్యస్థ స్థాయిలో ప్రభావం ఉండనుంది. ప్రధానంగా శ్రీ సత్య సాయి, అన్నమయ్య, అనంతపురం జిల్లాలపై ప్రభావం ఉండనుంది.
* మద్యస్థ స్థాయి ప్రభావం కర్నూలు, నంద్యాల, చిత్తూరు, వైయస్సార్ కడప, తిరుపతి, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాలపై ఉండనుంది. నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ప్రత్యామ్నాయ పంటలపై వ్యవసాయ శాఖ కీలక సూచనలు చేస్తోంది.
కాలర్ టాపిక్ వద్దు బాబోయ్ అంటూ ఎన్టీఆర్ పై సెటైర్లు విసిరిన నిర్మాత నాగవంశీ..
ప్రతీ హీరో కి , నిర్మాతకు , వాళ్ళ అభిమానులకు కెరీర్ పరంగా కొన్ని అవమానాలు ఎదురు అవుతుంటాయి. ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమా అయినా , ఏదో ఒక సందర్భంలో ఘోరమైన డిజాస్టర్ ఫలితాన్ని అందుకోవాల్సి వస్తుంది , అది తప్పదు. అలా ఎన్టీఆర్ కెరీర్ లో కూడా ఇటీవల కాలంలో ఒక మాయని మచ్చ లాగా , ఆయన అభిమానులకు పీడకల లాగా మిగిలిపోయిన సినిమాల్లో ‘వార్ 2’ ఒకటి. యాష్ రాజ్ ఫిలిమ్స్ పై , ఆయన ముఖర్జీ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రంలో హృతిక్ రోషన్ హీరో గా నటించగా, ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఘోరమైన డిజాస్టర్ గా నిల్చింది. తెలుగు వెర్షన్ నుండి ఈ చిత్రానికి కనీసం 100 కోట్ల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదు.
ఈ సినిమా డిజాస్టర్ అవ్వడం తో నిర్మాత నాగవంశీ ఎదుర్కొన్న ట్రోల్స్ మామూలివి కాదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన ఈ చిత్రం గురించి కాస్త హద్దులు దాటి మరీ మాట్లాడారు. ఈ సినిమా ఫ్లాప్ అయితే నన్ను మీ ఇష్టమొచ్చిన బూతులతో తిట్టండి అంటూ తొడగొట్టి మరీ సవాల్ చేశారు నాగవంశీ. అంతే కాకుండా, అదే ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ తన రెండు కాలర్లను పైకి ఎత్తి మరీ చూపడం అప్పట్లో సెన్సేషనల్ టాపిక్ గా మారింది. ఇక నేడు జరిగిన ‘లెనిన్’ మూవీ ప్రెస్ మీట్ లో నాగవంశీ ని ఒక విలేక్షరి ప్రశ్న అడుగుతూ ‘ఈ సినిమాతో అక్కినేని ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోవచ్చా ‘ అని అడగ్గా , అందుకు నాగవంశీ సమాధానం చెప్తూ ‘కాలర్ ఎత్తడాలు వంటివి ఏమి లేవు , అసలు కాలర్ టాపిక్ తీసుకొని రాకండి’ అంటూ సమాధానం ఇచ్చారు నాగవంశీ.
అంటే ఆయన పరోక్షంగా జూనియర్ ఎన్టీఆర్ కాలర్ ఎత్తడం పై సెటైర్లు వేసినట్టుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అర్థమైంది. దీంతో సోషల్ మీడియా లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నాగవంశీ పై మండిపడుతున్నారు. తిన్నగా అడిగిన దానికి సమాధానం చెప్పకుండా, ఈ బలుపు కామెంట్స్ ఏంటి అంటూ నాగవంశీ ని ట్యాగ్ చేసి బూతులు తిడుతున్నారు. మరి దీనిపై నాగవంశీ క్లారిటీ ఇచ్చి అభిమానులకు క్షమాపణలు చెప్తారో లేదో చూడాలి. ఈ ఏడాది ఆరంభం లో ‘అనగనగా ఒక రాజు’ తో భారీ హిట్ ని అందుకున్న నాగవంశీ , ఆ తర్వాత ‘ఫంకీ ‘ చిత్రం తో భారీ డిజాస్టర్ ని ఎదుర్కొన్నారు. ఇప్పుడు ‘లెనిన్’ తో సూపర్ హిట్ ని అందుకొని మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కుతారో లేదో చూడాలి.