Home Blog Page 134

పాలమ్మిండు.. పూలమ్మిండు.. తెలంగాణలోనే అంబానీ అయ్యిండు.. మల్లారెడ్డి సార్ తోని అట్లుంటది మరి..

Malla Reddy viral speech
Malla Reddy viral speech

Malla Reddy viral speech: పబ్లిక్ రిలేషన్ టీం ఉండదు. జాకీలు పెట్టి లేపడానికి పెయింట్ యూట్యూబ్ ఛానల్స్ ఉండవు. సొంతంగా మీడియా సంస్థ కూడా ఉండదు. అయినప్పటికీ మల్లారెడ్డి సార్ ఎంట్రీ ఇచ్చాడు అంటే మీడియా షేక్ అవుతుంది. సోషల్ మీడియా బద్దలవుతుంది. ఆయన మాట్లాడితే మంటలు. అడుగుపెడితే పూనకాలు.. ఇలా ఉంటుంది మల్లారెడ్డి సార్ తోని.

మల్లారెడ్డి సార్ పాలు అమ్మి.. పూలు అమ్మి.. బోర్లు వేసి ఇక్కడ దాకా వచ్చిండు. దాదాపు ఆయన ఆధ్వర్యంలో 70 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. 500 ఎకరాలలో ఆయన విద్యాసంస్థలు ఉన్నాయి. బయటికి మాత్రమే ఇవి చెప్పిండు. చెప్పని ఆస్తులు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు.. విద్యా వ్యాపారం ద్వారా.. రాజకీయాల్లోకి రావడం ద్వారా మల్లారెడ్డి సార్ భారీగా సంపాదించిండు. ఆయన సంపాదన ఏ రేంజ్ లో ఉందంటే.. తెలంగాణలో ఎవరికి లేని ఆస్తులు ఆయనకు మాత్రమే ఉన్నాయి. ఒక రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఆయనను అంబానీ అని పిలుచుకోవచ్చు.

మల్కాజ్గిరి స్థానం నుంచి ఎంపీగా గెలిచిండు. రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యిండు. ఒకసారి మంత్రిగా కూడా పని చేసిండు. గులాబీ పార్టీలో ఎంతోమంది సీనియర్లు ఉన్నప్పటికీ.. తను మాత్రమే మంత్రి అయ్యిండు అంటే మామూలు విషయం కాదు. వచ్చే ఎన్నికల్లో మల్లారెడ్డి సార్ తన కోడలు ప్రీతి రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తుండు. ఈ క్రమంలోనే ప్రీతి రెడ్డి సోషల్ మీడియాలో విపరీతంగా కనిపిస్తున్నారు. మీడియాలో కూడా ప్రముఖంగా దర్శనమిస్తున్నారు. ఈ లెక్కన ఇద్దరు కొడుకులు విద్యా వ్యాపారం.. పెద్ద కోడలు కూడా బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటారు. ఆయనకు రాజకీయ వారసురాలిగా ప్రీతి రెడ్డి ఉంటారు. ఈ మాట మేము అంటున్నది కాదు.. స్వయంగా మల్లారెడ్డి సరే చెబుతున్నాడు.

అన్నట్టు ఇన్ని ఆస్తులున్నప్పటికీ.. మల్లారెడ్డి సార్ 300 గజాల చిన్న ఇంట్లో ఉంటున్నాడు. అదే కాదు ప్రతి ఒక్కరు ఆరోగ్యానికి కాపాడుకోవాలని చెబుతున్నాడు. ఎదుటివారిని చూసి ఈర్ష పడదని సూచిస్తున్నాడు. ప్రశాంతంగా ఉంటేనే జీవితంలో ఆనందంగా ఉంటామని ఆయన చెబుతున్నాడు. ఇటీవల కాలంలో వ్యక్తిత్వ పాఠాలను చెబుతున్నాడు మల్లారెడ్డి. అంతేకాదు టీవీ షోలలో కూడా కనిపిస్తున్నాడు. ఏడు పదుల వయసు దాటినా మల్లారెడ్డి ఇప్పటికీ ఉత్సాహంగా.. ఉల్లాసంగా కనిపిస్తున్నాడంటే దానంతటికి కారణం ప్రశాంతతనే కావచ్చు. కానీ ఇంతటి ప్రశాంతమైన వ్యక్తి రేవంత్ రెడ్డి మీద అప్పట్లో అంతగా ఎందుకు ఫైర్ అయ్యాడు.. ఐటీ అధికారులు దాడులు చేస్తే ఎందుకు బిపి తెచ్చుకున్నాడు.. ఇవి సమాధానం లేని ప్రశ్నలు.. మల్లారెడ్డి సమాధానం చెప్పలేని క్వశ్చన్లు.

అందంగా ముస్తాబై మొత్తం చూపించారు.. షాపు ఓనర్ గట్టిగా పట్టుకున్నాడు..పోలీసుల ఎంట్రీ.. ఇంతకీ ఈ అమ్మాయిలు ఏం చేశారో తెలుసా..

Girls Jewellery Shop Robbery
Girls Jewellery Shop Robbery

Girls Jewellery Shop Robbery: ఒకప్పుడు దొంగతనాలు కేవలం మగవాళ్ళు మాత్రమే చేసేవారు. ఎక్కడో పూలన్ దేవి లాంటి వాళ్ళు మాత్రమే చోర కళను ప్రదర్శించేవారు. కానీ ఇప్పటి కాలంలో అబ్బాయిలను అమ్మాయిలను మించి పోతున్నారు. దొంగతనాలు చేయడంలో ఆరి తేరిపోతున్నారు. ఆమధ్య ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువతి తన స్నేహితుడికి ఐఫోన్లు కొనివ్వడానికి ఏకంగా దొంగతనం చేసింది. చివరికి దొరికిపోయి జైలు పాలయింది.

ఖమ్మం యువతిని ఆదర్శంగా తీసుకున్నారేమో.. ఈ బీహార్ అమ్మాయిలు కూడా దొంగతనం చేశారు. చివరికి దొరికిపోయారు. అసలు ఎలా దొరికిపోయారు.. ఏం దొంగతనం చేశారు.. ఇంతకీ ఏం జరిగింది.. ఇదంతా కూడా ఒక సినిమా స్టోరీ మాదిరిగా ఉంది.

బీహార్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువతులు అత్యంత అందంగా ముస్తాబయ్యారు. కైపు కలిగించే విధంగా దుస్తులు ధరించారు. ఇద్దరు కలిసి ఓ బంగారం షాపుకు వెళ్లారు. అక్కడ నగలు కొనే వారి విధంగా బిల్డప్ ఇచ్చారు. ఆ షాప్ లోకి వెళ్లిన తర్వాత యజమానిని మాటలలో పెట్టారు. ఒక యువతి షాప్ ఓనర్ ముందు అన్ని చూపించడం మొదలుపెట్టింది. అతడేమో చొంగ కార్చుకుంటూ ఆమెను చూడటం ప్రారంభించాడు. మరో యువతి అతడి మీద పెప్పర్ స్ప్రే చేసింది. బంగారు నగలను మూట కట్టుకొని పారిపోతుండగా.. షాపు ఓనర్ తేరుకున్నాడు. గట్టిగా అరిచాడు. ఆ తర్వాత వారిని పట్టుకున్నాడు. మిగతా వారంతా అతడికి అండగా నిలిచారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు అక్కడికి చేరుకొని ఆ ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఈ దృశ్యాలు మొత్తం అక్కడి రహస్య కెమెరాలలో రికార్డ్ అయ్యాయి. ఆ అమ్మాయిలు గతంలో కూడా దొంగతనానికి పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు.. అమ్మాయిలు కావడంతో పోలీసులు మందలించి వదిలిపెట్టారు. అయితే పోలీసులు తమను ఏమీ చేయలేరని ధైర్యంతో మళ్ళీ దొంగతనానికి విఫలయత్నం చేశారు. ఈ సంఘటన బీహార్ రాష్ట్రంలో సంచలనం కలిగిస్తోంది. అందమైన అమ్మాయిలను చూసి చొంగ కార్చొద్దని.. షాపు ఓనర్లు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. బంగారం విలువ పెరిగిపోయిన నేపథ్యంలో దొంగతనాలు విపరీతంగా జరుగుతున్నాయని.. ఇలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, మాయమాటలకు కరిగిపోతే చివరికి ఉన్నది మొత్తం కోల్పోవాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Patna Press (@patna.press)

అసహనంలో షర్మిల.. మారిన కాంగ్రెస్ వైఖరి!

YS Sharmila
YS Sharmila

YS Sharmila: వైయస్ షర్మిల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ తీరుపై ఆవేదనతో ఉన్నారా? తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారా? తనకు రాజ్యసభ పదవి ఇవ్వకపోవడంపై కొందరి హస్తం ఉందన్న అనుమానాలు ఆమెలో ఉన్నాయా? అందుకే ఇండియా కూటమి సమావేశానికి ఆమె గైర్హాజరయ్యారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో దీనిపైనే చర్చ నడుస్తోంది. కొద్ది రోజుల కిందట కర్ణాటక నుంచి రాజ్యసభకు షర్మిలను ఎంపిక చేస్తారన్న ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆమెను ఢిల్లీ పిలిచి కాంగ్రెస్ అగ్ర నేతలు అభయం కూడా ఇచ్చారట. కానీ ఇంతలోనే సమీకరణలు మారిపోయాయి. చివరి నిమిషంలో షర్మిల పేరు లేకుండా పోయింది. అయితే కాంగ్రెస్ పార్టీ కోసం తాను నిలబడితే.. పార్టీ మాత్రం ఇచ్చిన మాట కట్టుబడి ఉండలేదన్న ఆవేదన షర్మిల లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ బాధతోనే రెండు రోజుల కిందట ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమావేశానికి ఆమె గైర్హాజరైనట్లు తెలుస్తోంది.

* అప్పట్లో హామీ..
2024 ఎన్నికలకు ముందు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్నారు షర్మిల. తెలంగాణలో తన తండ్రి పేరుతో పార్టీ ఏర్పాటు చేశారు. కానీ వర్కౌట్ కాకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు తన పార్టీని. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో ఒక నియోజకవర్గంలో నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే ఏపీలో పార్టీ బాధ్యతలు తీసుకుంటే రాజ్యసభకు అవకాశం ఇస్తామని.. అది కూడా కర్ణాటక నుంచి ఛాన్స్ కల్పిస్తామని అప్పట్లో అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ హామీ ఇచ్చారు. అప్పటినుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆమె కృషి చేస్తూ వచ్చారు. కర్ణాటక నుంచి రాజ్యసభ పదవులు ఖాళీ అయ్యాయి. అక్కడినుంచి ఛాన్స్ దక్కుతుందని భావించారు షర్మిల. అందుకు తగ్గట్టుగానే ఢిల్లీ నుంచి సమాచారం రావడంతో వెళ్లి వచ్చారు. నామినేషన్ వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ చివరి నిమిషంలో కాంగ్రెస్ హై కమాండ్ హ్యాండిచ్చింది. అయితే ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ద్వారానే.. తనకు రాజ్యసభ పదవి రాకుండా కుట్ర జరిగిందన్నది షర్మిల లో ఉన్న అనుమానం.

* జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నారని..
ప్రధానంగా కర్ణాటక కాంగ్రెస్ నేతలతో వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే ఆయన బెంగుళూరులో తన రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు అన్న ప్రచారం ఉంది. అయితే ఇప్పుడు అదే కర్ణాటక కాంగ్రెస్ నేతలతో కలిసి జగన్మోహన్ రెడ్డి తనకు రాజ్యసభ పదవి రాకుండా అడ్డుకున్నారన్న అనుమానం షర్మిల లో ఉంది. ఇదే విషయాన్ని పరోక్షంగా ఇటీవల ఆమె ఒక ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. పైగా జగన్మోహన్ రెడ్డిని మచ్చిక చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్న అనుమానాలు కాంగ్రెస్ హై కమాండ్ పై ఉన్నాయి. ఈ అనుమానాలతోనే ఆమె కాంగ్రెస్ హై కమాండ్ పై రగిలిపోతున్నారు. అందుకే కీలకమైన ఇండియా కూటమికి గైర్హాజరయ్యారు. ఇదే పరిణామాలు కొనసాగితే షర్మిల తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

పొలంలో గుండ్రంగా తిరిగిన ఆవు.. పూజలు చేసిన స్థానికులు.. కానీ ఏం జరిగిందంటే..

Hypoglycemia in cows
Hypoglycemia in cows

Hypoglycemia in cows: వ్యవసాయంలో పశువుల పాత్ర కీలకంగా ఉంటుంది. వీటిని ఇంట్లో కుటుంబ సభ్యుల్లుగా, దేవుళ్లుగా చూస్తుంటారు. అయితే ఒక్కోసారి వాటికి ఏదైనా ఆపద వస్తే వెంటనే వాటిని పెంచేవారు చలించిపోతుంటారు. ఉత్తరప్రదేశ్‌లోని శ్రావస్తి అనే జిల్లాలో ఓ ఆవు వరుసగా ఎనిమిది రోజుల పాటు పొలంలో గుండ్రంగా తిరుగుతూ ఉండటం స్థానికంగా సంచలనంగా మారింది. కొందరు దీనిని దైవలీలగా భావించి పూజలు కూడా ప్రారంభించారు. అయితే వెటర్నరీ వైద్యులు ఆవును పరీక్షించారు. ఆ తరువాత ఏం జరిగిందంటే?

ఆవు వరుసగా పొలంలో గుండ్రంగా తిరగడంపై వైద్యులు పరీక్షించగా.. అది హైపోగ్లైసీమియా (Hypoglycemia) అనే వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. హైపోగ్లైసీమియా అంటే రక్తంలో గ్లూకోజ్ (చక్కెర) స్థాయిలు సాధారణం కంటే ప్రమాదకరంగా తగ్గిపోవడం. మనుషుల్లోనే కాకుండా పశువుల్లో కూడా ఈ సమస్య కనిపిస్తుంది. గ్లూకోజ్ అనేది మెదడు, నరాలు, శరీర అవయవాలకు ప్రధాన శక్తి వనరు. రక్తంలో చక్కెర స్థాయి బాగా పడిపోతే మెదడుకు సరిపడా శక్తి అందక నరాల వ్యవస్థపై ప్రభావం పడుతుంది.

ఆవులకు ఈ వ్యాధి ఎలా వస్తుంది?
ఆవులకు సరైన మేత అందకపోవడం, ఎక్కువసేపు ఆకలితో ఉండటం వల్ల ఈ సమస్య వస్తుంది. అలాగే ప్రసవం తర్వాత శరీరంలో శక్తి అవసరాలు పెరగడంతో జీర్ణక్రియ సమస్యలు లేదా కొన్ని జీవక్రియ సంబంధిత వ్యాధుల కారణంగా హైపోగ్లైసీమియా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పాలిచ్చే ఆవుల్లో శరీరానికి అవసరమైన శక్తి కంటే వినియోగం ఎక్కువైతే ఈ సమస్య తలెత్తుతుంది.

గుండ్రంగా ఎందుకు తిరుగుతాయి?
రక్తంలో గ్లూకోజ్ తగ్గిపోవడం వల్ల మెదడులోని కొన్ని భాగాలు సరిగా పనిచేయవు. ఫలితంగా ఆవులు ఒకే దిశలో పదేపదే నడవడం, గుండ్రంగా తిరగడం, గోడలకు లేదా వస్తువులకు ఢీకొనడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. దీనిని వెటర్నరీ వైద్యులు న్యూరోలాజికల్ లక్షణంగా పరిగణిస్తారు. కొన్ని సందర్భాల్లో తల ఒకవైపుకు వంచడం, అస్థిరంగా నడవడం కూడా కనిపిస్తుంది. హైపోగ్లైసీమియాతో బాధపడే ఆవుల్లో బలహీనత, ఆకలి తగ్గడం, అలసట, వణుకులు, కళ్లలో మసకదృష్టి, అసహజ ప్రవర్తన, నిలబడలేకపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. తీవ్రమైన పరిస్థితుల్లో ఆవు కుప్పకూలిపోవడం, అపస్మారక స్థితిలోకి వెళ్లడం కూడా జరుగుతుంది.

ఈ వ్యాధి ప్రమాదకరమా?
సమయానికి గుర్తించి చికిత్స చేస్తే సాధారణంగా ఆవు పూర్తిగా కోలుకుంటుంది. కానీ నిర్లక్ష్యం చేస్తే మెదడు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. తీవ్రమైన హైపోగ్లైసీమియా వల్ల కోమా లేదా మరణం కూడా సంభవించవచ్చని వెటర్నరీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఆవు అసాధారణంగా ప్రవర్తిస్తే వెంటనే పశువైద్యుడిని సంప్రదించడం అత్యంత ముఖ్యం. ఇదే సమయంలో ఆవులకు సమతుల్య పోషకాహారం అందించడం, ఎక్కువసేపు ఆకలితో ఉంచకపోవడం, శుభ్రమైన నీరు ఇవ్వడం, ప్రసవం తర్వాత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ద్వారా ఈ సమస్యను చాలా వరకు నివారించవచ్చు. ఆవు అకస్మాత్తుగా గుండ్రంగా తిరగడం, తల వంచడం లేదా అసాధారణ ప్రవర్తన చూపిస్తే దాన్ని మూఢనమ్మకాలతో కాకుండా వైద్యపరమైన సమస్యగా గుర్తించి వెంటనే పరీక్షలు చేయించాలి.

4వ జనరేషన్ కు అనుగుణంగా ఈ కొత్త కారు.. బాలెనొ,గ్లాంజా కి దడ..

Hyundai i20 4th generation
Hyundai i20 4th generation

Hyundai i20 4th generation: హ్యుందాయ్ మోటార్స్ నుంచి ఇప్పటి వరకు ఎక్కువగా మిడిల్ క్లాస్ పీపుల్స్ కోసం హ్యాచ్ బ్యాక్ కార్లు మార్కెట్లోకి వచ్చాయి. అయితే ఇప్పుడు తన పాపులర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ i20ని గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ చేయడానికి సిద్ధం చేస్తోంది. అధికారికంగా విడుదల కావడానికి ముందే ఈ ఫోర్త్-జనరేషన్ హ్యుందాయ్ i20కి సంబంధించిన పూర్తి ప్రొడక్షన్-స్పెక్ ఫోటోలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే ఈ కొత్త కారు డిజైన్, ఇంటీరియర్ పరంగా భారీ మార్పులతో సరికొత్తగా రూపుదిద్దుకుంది. ఈ కారు ఎలా ఉండబోతుందంటే?

హ్యుందాయ్ ఇప్పటి వరకు పాటించిన తన సంప్రదాయ హ్యాచ్‌బ్యాక్ శైలిని పక్కనపెట్టి, ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా దీనికి కాంపాక్ట్ SUV లేదా క్రాస్ ఓవర్ రూపాన్ని ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. కారు ముందు భాగంలో బాక్సీ డిజైన్, నిలువుగా ఉండే బానెట్ లైన్, సరికొత్త పారామెట్రిక్ గ్రిల్‌ను అందించారు. వీల్ ఆర్చ్‌లు, బంపర్లు, డోర్ సిల్స్ చుట్టూ అమర్చిన బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్ కారుకు మరింత రగ్గడ్ తో పాటు మస్క్యులర్ లుక్‌ను తీసుకువచ్చింది.

కొత్త i20 ఎక్స్‌టీరియర్‌లో అత్యంత ఆకర్షణీయమైన మార్పును గమనించవచ్చు. గీని లైటింగ్ సిస్టమ్ లో భాగంగా కారు ముందు భాగంలో ఒక వైపు నుండి మరో వైపునకు సాగే కనెక్టెడ్ LED లైట్ బార్ ను అమర్చారు. ఇది ‘Y’ ఆకారంలో ఉంటూ డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన యారోహెడ్ హెడ్‌ల్యాంప్స్‌ను కలుపుతుంది. అలాగే వెనుక భాగంలో కూడా వెడల్పాటి కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్ స్ట్రిప్స్ కూడా ఉంటుంది. ట్రయాంగిల్ హౌసింగ్ , కొత్త డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ కారుకు ప్రీమియం రోడ్ ప్రెజెన్స్‌ను ఇస్తున్నాయి.

ఎక్స్‌టీరియర్ కంటే కూడా ఇంటీరియర్ క్యాబిన్‌లో హ్యుందాయ్ భారీ అప్‌గ్రేడ్స్ చేసింది. డ్యాష్‌బోర్డ్ పై సరికొత్త డ్యూయల్ స్క్రీన్ కర్వ్డ్ డిస్‌ప్లే సెటప్‌ను అందించారు. ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఒకే గ్లాస్ ప్యానెల్‌లో కలిసి ఉంటాయి. దీంతో పాటు కొత్త త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, వర్టికల్ ఎయిర్ వెంట్స్, ఐవరీ/గ్రే డ్యూయల్-టోన్ కలర్ థీమ్, టచ్-బేస్డ్ క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ వంటివి క్యాబిన్‌ను మరింత లగ్జరీగా మార్చాయి. రోజువారీ సౌలభ్యం కోసం అవసరమైన కొన్ని ముఖ్యమైన ఫిజికల్ బటన్లను అలాగే ఉంచడం విశేషం.

మెకానికల్ పరంగా ఈ ఫోర్త్ జెన్ i20లో హ్యుందాయ్ పెద్దగా మార్పులు చేయకపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లను ఇందులోనూ కొనసాగించే అవకాశం ఉంది. కొన్ని గ్లోబల్ మార్కెట్లలో మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీని కూడా జోడించవచ్చు. ఈ కారు 2027 ప్రారంభంలో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది మార్కెట్లోకి వస్తే మారుతి సుజుకి బాలెనొ, టయోటా గ్లాంజా వంటి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

దేశ భక్తికి, భార్యపై ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. సైన్యానికి రూ.25 లక్షల విరాళం

Indian Army Donation
Indian Army Donation

Indian Army Donation: భారత్‌లో పుట్టిన ప్రతీ పౌరుడికి దేశ భక్తి చాలా ముఖ్యం. మనలో అది నరనరానా జీర్ణించుకుపోయి ఉంటుంది. దేశానికి ఆపద వస్తే ఐక్యంగా పోరాడేందుకు ప్రతీ పౌరుడు సిద్ధమవుతాడు. ఇక దంపతుల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధం చాలా గొప్పవి. దేశ భక్తి, భార్యపై ప్రేమ ఉన్న ఓ ఉద్యోగి రిటైర్మెంట్‌ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని కలలు కన్నాడు. ఇందుకు డబ్బులు పోగు చేసుకున్నాడు. కానీ భార్య అకాల మరణం తర్వాత ఆ కలలు అసంపూర్తిగా మిగిలాయి. ఆ దుఃఖం నుంచి బయటకు రావడానికి, భార్యపై ఉన్న ప్రేమకు గుర్తుగా సేవ్‌ చేసిన రూ.25 లక్షలను ఆర్మీకి విరాళంగా ఇచ్చి నిజమైన దేశభక్తుడు అనిపించుకున్నాడు. ఈ చర్య ద్వారా ఆయనకు భార్యతో యాత్ర చేసినట్లు సంతోషం కలిగిందని భావించడం మనల్ని ఆలోచింపజేస్తుంది.

మరణం తర్వాత కూడా కొనసాగే బంధం..
ఈ కథ ద్వారా ప్రేమ అనేది జీవితం వరకే పరిమితం కాదని, మరణం తర్వాత కూడా హృదయంలో ఎలా నిలిచి ఉంటుందో తెలుస్తుంది. భార్యను కోల్పోయిన తర్వాత చాలా మంది వ్యక్తులు ఒంటరితనం, దుఃఖం, జీవితంపై ఆసక్తి కోల్పోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. అయితే శ్రీకాంత్‌ ఈ దుఃఖాన్ని విరాళంగా మార్చడం ద్వారా తన జ్ఞాపకాలను సానుకూలంగా మలచుకున్నారు. ఇది మనకు ఒక ముఖ్యమైన సందేశం ఇస్తుంది. ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు, వారి జ్ఞాపకాలను గౌరవించడానికి వివిధ మార్గాలు ఉంటాయి. డబ్బును వ్యక్తిగత ఆనందం కోసం ఖర్చు చేయకుండా, సమాజం లేదా దేశం కోసం వినియోగించడం ఒక రకమైన ఆధ్యాత్మిక సంతృప్తిని కలిగిస్తుంది.

దేశ సేవ, భక్తి..
ఆర్మీకి విరాళం ఇవ్వడం అనేది కేవలం డబ్బు ఇవ్వడం కాదు. ఇది దేశ రక్షణలో భాగమైన సైనికులకు, వారి కుటుంబాలకు సహాయం చేయడం. భార్యతో కలిసి ప్రపంచం చూడాలనుకున్న వ్యక్తి, ఆ కలను దేశ సేవగా మార్చడం ద్వారా తన ప్రేమను మరింత విశాలంగా వ్యాప్తి చేశారు. ఈ చర్య వ్యక్తిగత దుఃఖాన్ని సమాజ సేవగా మార్చడం వల్ల వ్యక్తికి మానసిక బలం వస్తుంది. అలాగే, ఇలాంటి విరాళాలు సైన్యం యొక్క సేవలను గౌరవించడానికి, దేశభక్తిని ప్రోత్సహించడానికి సహాయపడతాయి.

దుఃఖాన్ని సానుకూలంగా మార్చుకోవడం
ఈ కథ మన సమాజానికి ఒక గొప్ప సందేశం ఇస్తుంది. జీవితంలో ఎదురయ్యే నష్టాలను ఎలా ఎదుర్కోవాలి, ఎలా అర్థవంతంగా జీవించాలి అనేది ఇక్కడ నుంచి నేర్చుకోవచ్చు. చాలా మంది వ్యక్తులు ప్రియమైన వారిని కోల్పోయిన తర్వాత జీవితాన్ని వదిలేస్తారు లేదా ఒంటరిగా ఉంటారు. కానీ శ్రీకాంత్‌ లాంటి వ్యక్తులు ఆ దుఃఖాన్ని ఇతరుల సేవగా మార్చడం ద్వారా తమను తాము నయం చేసుకుంటారు.

డబ్బు, సంపద, కలలు అనేవి వ్యక్తిగతం కావచ్చు, కానీ వాటిని సమాజం కోసం వినియోగించినప్పుడు అవి మరింత విలువైనవిగా మారతాయి. ఇలాంటి కథలు మన సమాజంలో దాతృత్వం, దేశభక్తి, మానవ సంబంధాల విలువను పెంచుతాయి.

వర్షాకాలంలో ట్రిప్ కు వెళ్లాలని అనుకుంటున్నారా.. అద్భుతమైన 5 ప్రదేశాలు ఇవే..

Monsoon Travel Destinations
Monsoon Travel Destinations

Monsoon Travel Destinations: రెండు రోజులుగా వర్షాలు విజృంభిస్తున్నాయి. దీంతో ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగినట్లే అనుకోవచ్చు. ఇన్ని రోజులు వాతావరణ వేడిగా ఉండడంతో విహార యాత్రలకు వెళ్లేందుకు కొందరికి సాధ్యం కాలేదు. ప్రస్తుతం వాతావరణం చల్లబడడంతో కొన్ని ప్రదేశాలు ఆహ్లదంగా మారుతాయి. ప్రకృతి కొత్త అందాలను సంతరించుకోవడంతో కొండలు పచ్చదనంతో కళకళలాడుతాయి. జలపాతాలు ఉప్పొంగుతాయి. మేఘాలు పర్వతాలను తాకుతూ అద్భుతమైన దృశ్యాలను సృష్టిస్తాయి. అలాంటి సమయంలో ట్రిప్ ప్లాన్ చేస్తే మరపురాని అనుభూతిని పొందవచ్చు. వర్షాకాలంలో సందర్శించడానికి అనువైన ఐదు అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఇవే.

మున్నార్.. మేఘాలు, టీ తోటల స్వర్గం
కేరళలోని మున్నార్ వర్షాకాలంలో మరింత అందంగా కనిపిస్తుంది. పచ్చని టీ తోటలు, పొగమంచుతో కప్పుకున్న కొండలు, చిన్న చిన్న జలపాతాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఎరావికుళం నేషనల్ పార్క్, మట్టుపెట్టి డ్యామ్, టాప్ స్టేషన్ వంటి ప్రాంతాలు ప్రత్యేక ఆకర్షణలు. వర్షపు చినుకుల్లో టీ తోటల మధ్య నడవడం ఒక అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. ఇక్కడికి వెళ్లాలంటే కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి సుమారు 110 కిలోమీటర్ల దూరంలో మున్నార్ ఉంటుంది. బస్సులు, టాక్సీలు సులభంగా లభిస్తాయి.

కూర్గ్ .. ఇండియన్ స్కాట్లాండ్
కర్ణాటకలోని కూర్గ్‌ను ‘స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు. వర్షాకాలంలో ఇక్కడి కాఫీ తోటలు, జలపాతాలు, అడవులు మరింత సుందరంగా మారుతాయి. అబ్బే ఫాల్స్, రాజాస్ సీట్, దుబారే ఎలిఫెంట్ క్యాంప్ వంటి ప్రదేశాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. ప్రకృతి ప్రేమికులకు ఇది ఒక స్వర్గధామం. మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న తరువాత అక్కడి నుంచి సుమారు 140 కిలోమీటర్ల దూరంలో కూర్గ్ ఉంటుంది. మైసూరు నుంచి కూడా రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.

లోణావాలా… జలపాతాల అందాల నిలయం:
ముంబై, పుణే నగరాలకు సమీపంలో ఉన్న లోణావాలా వర్షాకాలంలో సందర్శించడానికి అత్యుత్తమ ప్రదేశాల్లో ఒకటి. భారీ జలపాతాలు, పచ్చని లోయలు, మేఘాలతో కప్పబడిన కొండలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణలు. టైగర్ పాయింట్, భూషి డ్యామ్, కార్లా గుహలు తప్పక చూడాల్సిన ప్రదేశాలు. ఇక్కడికి వెళ్లాలంటే ముంబై, పుణే నగరాల నుంచి రైలు, రోడ్డు మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. ముంబై నుంచి సుమారు 85 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

చిరపుంజి.. వర్షాలకు ప్రసిద్ధి చెందిన అద్భుత ప్రాంతం:
ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో చిరపుంజి ఒకటి. మేఘాలయ రాష్ట్రంలో ఉన్న ఇక్కడ వర్షాకాలంలో ఇక్కడి జలపాతాలు, గుహలు, పచ్చని లోయలు మరింత అందంగా కనిపిస్తాయి. ముఖ్యంగా లివింగ్ రూట్ బ్రిడ్జ్‌లు, నోహ్‌కాలికై ఫాల్స్ పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ప్రకృతి ప్రేమికులకు ఇది తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదేశం. షిల్లాంగ్ విమానాశ్రయం చేరుకున్న తరువాత అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సుమారు 55 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే చిరపుంజి చేరుకోవచ్చు.

వాలీ ఆఫ్ ఫ్లవర్స్.. పూలతో నిండిన ప్రకృతి అద్భుతం:
హిమాలయ పర్వతాల మధ్య ఉన్న వాలీ ఆఫ్ ఫ్లవర్స్ వర్షాకాలంలో రంగురంగుల పూలతో నిండిపోతుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు ప్రత్యేక ఆకర్షణ. జూలై నుంచి సెప్టెంబర్ మధ్య సందర్శిస్తే వేల రకాల పూల అందాలను ఆస్వాదించవచ్చు. జాలీ గ్రాంట్ విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి జోషిమఠ్, గోవింద్‌ఘాట్ చేరుకుని ట్రెక్కింగ్ ద్వారా వాలీ ఆఫ్ ఫ్లవర్స్‌కు వెళ్లవచ్చు.

ఇవి గుర్తుంచుకోవాలి..
వర్షాకాలంలో ప్రయాణించే వారు రెయిన్‌కోట్, వాటర్‌ప్రూఫ్ షూస్, అదనపు దుస్తులు వెంట తీసుకెళ్లాలి. వాతావరణ పరిస్థితులను ముందుగానే తెలుసుకోవడం మంచిది. కొండ ప్రాంతాల్లో రోడ్లు జారుడుగా ఉండే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ప్రయాణించాలి. ప్రకృతి తన అందాలను అత్యంత అద్భుతంగా ప్రదర్శించే కాలం వర్షాకాలం. ఈ ఐదు ప్రదేశాల్లో ఏదో ఒకటి సందర్శిస్తే మేఘాలు, జలపాతాలు, పచ్చని ప్రకృతి మధ్య మరపురాని అనుభూతిని సొంతం చేసుకోవచ్చు.

జస్పాల్ రాణా ఆరోగ్యంగా ఎంతో ఫిట్.. ఎందుకిలా జరిగింది..

Jaspal Rana
Jaspal Rana

Jaspal Rana: మనదేశంలో ప్రసిద్ధ షూటర్ జస్పాల్.. ఎన్నో మెడల్స్ సాధించాడు.. మన దేశానికి తిరుగులేని ఖ్యాతిని అందించాడు.నేడు షూటింగ్ విభాగంలోకి ఎంతోమంది క్రీడాకారులు వస్తున్నారంటే దానికి ప్రధాన కారణం జస్పాల్. తను ఆటగాడిగా దేశానికి ఎన్నో మెడల్స్ అందించాడు.. అంతేకాదు ఎంతోమంది షూటర్లకు తను ఇప్పుడు షూటింగ్ నేర్పిస్తున్నాడు. కేవలం షూటర్ గా తన బాధ్యతను.. శిక్షకుడిగా తన అనుభవాన్ని నేర్పించే పనిలోపడ్డాడు.

ఒలంపిక్స్ లో మెడల్ సాధించిన మను భాకర్ కు జస్పాల్ శిక్షకుడిగా కొనసాగుతున్నాడు. ఆమె మెడల్ సాధించడంలో ఎంతో కీలకపాత్ర పోషించాడు. 49 సంవత్సరాల వయసు ఉన్న జస్పాల్ ఆకస్మాత్తుగా కన్నుమూయడం ఒక్కసారిగా కలవరపాటుకు గురి చేసింది.. అతడు చనిపోడాన్ని భారత క్రీడా లోకం జీర్ణించుకోలేకపోతోంది.. జర్మనీలోని మ్యూనిచ్ ప్రాంతంలో ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ పోటీలను పూర్తి చేసుకొని భారత బృందం తిరిగి వస్తోంది. ఈ నేపథ్యంలో జస్పాల్ విమానంలోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.

విమానం ఢిల్లీకి చేరిన వెంటనే అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత అతడి గుండె నుంచి శరీరానికి రక్తాన్ని సరఫరా చేసే నాలంలో అడ్డంకి ఏర్పడిన నేపథ్యంలో.. వైద్యులు దానిని గుర్తించి తొలగించారు. స్టంట్ అమర్చారు. కొద్దిరోజుల తర్వాత మరో స్టంట్ వేసేందుకు వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. జస్పాల్ కోలుకున్నాడని.. అతడి పరిస్థితి నిలకడగా ఉందని అందరూ అనుకున్నారు. అయితే గురువారం అతడి పరిస్థితి మరోసారి విషమించింది. ఈసారి అతడి గుండె పని చేయడం మానేసింది. ఫలితంగా జస్పాల్ కానరాని లోకాలకు వెళ్లిపోయాడు.

ముందుగా అతడు తన చాతిలో నొప్పి వస్తే.. దానిని అజీర్తి సమస్య అనుకున్నాడు.. అప్పుడే నొప్పి వచ్చినప్పుడు ఆసుపత్రికి వెళ్లి ఉంటే బతికి బట్ట కట్టేవాడు. గత ఏడాది ఫిబ్రవరిలో జాతీయ కోచ్ గా జస్పాల్ నియమితుడయ్యాడు. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో హై పెర్ఫార్మన్స్ కోచ్ గా అతడు బాధ్యతలు తీసుకున్నాడు. జస్పాల్ ఉత్తరాఖండ్లో జన్మించాడు. 1994లో షూటింగ్ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. అదే సంవత్సరం హీరోషిమ ఆసియా గేమ్స్ లో స్వర్ణం, కాంస్యం గెలిచాడు. 2026 ఆసియా క్రీడల్లో మూడు స్వర్ణాలు, ఒక రజత పతకం సాధించాడు.

1994 నుంచి 2006 వరకు జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లలో 9 స్వర్ణాలు, నాలుగు రజత, రెండు కాంస్య మెడల్స్ సాధించాడు.. కేవలం 18 సంవత్సరాల వయసులోనే అర్జున అవార్డు అందుకున్నాడు. 21 సంవత్సరాల వయసులోనే పద్మశ్రీ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు. ఇతడి ట్రైనింగ్ లోనే మను బాకర్ 2024 పారిస్ ఒలంపిక్స్ లో రెండు కాంస్యాలు సాధించింది. 2020లో జస్పాల్ ద్రోణాచార్య అవార్డు దక్కించుకున్నాడు.

మొగుడు మాట్లాకపోతే కేసు.. కోర్టుకా? సుప్రీంకోర్టు తీర్పు భర్తలకు ఎంతో ఊరట

Supreme Court verdict
Supreme Court verdict

Supreme Court Verdict: సుప్రీం కోర్టు వరుసగా సంచలన తీర్పులు ఇస్తోంది. ఇటీవలే స్వచ్ఛంద వ్యభిచారం నేరం కాదని తెలిపింది. విటులను మహిళల అక్రమ రవాణాదారులుగా భావించొద్దని వెల్లడించింది. పెళ్లికి ముందు పరిచయం పెళ్లిదాకా వెళ్లవని పేర్కొంది. తాజాగా దాంపత్య జీవితంలో తలెత్తే సాధారణ వివాదాల కారణంగా భార్యాభర్తల మధ్య కొంతకాలం పలకరించుకోకపోవడాన్ని ‘క్రూరత్వం’గా భావించలేమని స్పష్టం చేసింది. 13 రోజుల అలకను ఆధారంగా భర్తను నేరస్థుడిగా నిర్ధారించడం సాధ్యం కాదని, దీనికి బలమైన ఆధారాలు అవసరమని న్యాయస్థానం అభిప్రాయపడింది. 498ఏ కింద వచ్చిన ఒక కేసులో భర్తకు విధించిన శిక్షను రద్దు చేసింది. భార్య ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో, భర్త విదేశంలో ఉండి ఫోన్‌లో మాట్లాడకపోవడం వల్లే ఆమె మానసికంగా బాధపడి ఆత్మహత్యకు పాల్పడ్డారన్న వాదనను కోర్టు తిరస్కరించింది.

చట్టపరమైన ప్రాముఖ్యత..
ఐపీసీ 498ఏ మహిళలను దాంపత్య హింస, ముఖ్యంగా వరకట్న వేధింపుల నుంచి రక్షించడానికి రూపొందించబడింది. ఇది కఠినమైన చట్టం కాబట్టి, దీనిని ఉపయోగించే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సుప్రీంకోర్టు అనేకసార్లు హెచ్చరించింది. ఈ తీర్పు ద్వారా కోర్టు మరోసారి స్పష్టం చేసింది. ‘ప్రతి దాంపత్య వివాదం, చిన్న కలతలు, లేదా తాత్కాలిక మౌనం నేరంగా మారకూడదు. కేవలం ఆధారాలు లేకుండా భర్తను శిక్షించడం వల్ల కుటుంబ వ్యవస్థలు దెబ్బతినవచ్చు, నిర్దోషులు బాధపడవచ్చు. అదే సమయంలో, నిజమైన హింస జరిగినప్పుడు బాధితులకు న్యాయం జరగాలని కోర్టు ఉద్దేశం’ అని వెల్లడించింది. ఈ తీర్పు ఆధారాల ప్రాధాన్యతను బలపరుస్తుంది.

దాంపత్య జీవితంలో వాస్తవికత
భారతీయ సంసారాల్లో చిన్నపాటి గొడవలు, అభిప్రాయ భేదాలు, కొంతకాలం మాట్లాడకుండా ఉండడం సహజమే. ఇది సంబంధాన్ని మరింత బలపరచడానికి కూడా సహాయపడుతుంది. కానీ ఇలాంటి సాధారణ విషయాలను క్రూరత్వంగా చిత్రీకరించడం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి, చట్టపరమైన ఇబ్బందులు పెరుగుతాయి. ఈ తీర్పు సమాజానికి ఒక సందేశం ఇస్తుంది. దాంపత్యంలో సంభాషణ ముఖ్యం, కానీ దాని లోపం మాత్రమే నేరం కాదు. ఆత్మహత్య వంటి విషాదకర సంఘటనల వెనుక ఉన్న కారణాలు సంక్లిష్టంగా ఉంటాయి.. మానసిక ఆరోగ్యం, కుటుంబ ఒత్తిళ్లు, ఇతర వ్యక్తిగత సమస్యలు కూడా ఉండవచ్చు. వీటిని కేవలం ఒక వ్యక్తి నిశ్శబ్దం కారణమని పాదించడం న్యాయం కాదు.

చట్టం దుర్వినియోగం..
ఈ తీర్పు మహిళల హక్కులను బలహీనపరచదు. నిజమైన వేధింపులు, హింస జరిగినప్పుడు చట్టం బాధితుల పక్షానే ఉంటుంది. కానీ దుర్వినియోగం నివారించడానికి ఆధారాలు తప్పనిసరి అని నొక్కి చెబుతుంది. సుప్రీంకోర్టు గతంలో కూడా 498ఏ దుర్వినియోగం గురించి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తీర్పు ద్వారా ట్రయల్‌ కోర్టులు, హైకోర్టులు ఆధారాలను జాగ్రత్తగా పరిశీలించాలని సూచన చేసింది. ఇది కుటుంబ సమగ్రతను కాపాడే దిశగా ఒక ముందడుగు.

సుప్రీంకోర్టు తీర్పు చట్టాన్ని కఠినంగా అమలు చేయడంతోపాటు, మానవ సంబంధాల్లోని సూక్ష్మతలను గుర్తించాలని బోధిస్తుంది. దాంపత్య జీవితం సవాళ్లతో నిండి ఉంటుంది. చిన్న గొడవలు, నిశ్శబ్ద కాలాలు సహజం. వాటిని నేరంగా మార్చడం వల్ల న్యాయం జరగదు, కుటుంబాలు దెబ్బతింటాయి. నిజమైన హింస ఉన్న చోట చట్టం బాధితులకు రక్షణ కల్పించాలి. అదే సమయంలో, ఆధారాలు లేని వాదనలతో నిర్దోషులను శిక్షించకూడదు. కుటుంబ సమస్యలను చట్టపరమైన సమస్యలుగా మార్చకుండా, సంభాషణ, అవగాహన ద్వారా పరిష్కరించుకోవడం మంచిదని ఈ తీర్పు గుర్తు చేస్తుంది.

కూటమి వెన్నుపోటు సరే.. వైసిపి ఆత్మ పరిశీలన ఏంటి?!

Andhra Pradesh Politics
Andhra Pradesh Politics

YSRCP: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. కూటమి రెండేళ్ల పాలనపై వెన్నుపోటు అనే ముద్ర వేసి నిన్ననే ఆందోళన కార్యక్రమాలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే పాలనతో పాటు సంక్షేమ పథకాల అమలు విషయంలో కూటమి వైఫల్యం చెందిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఒక ప్రతిపక్ష పార్టీగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆ ఆరోపణ చేయడంలో తప్పులేదు. కానీ ఈ రెండేళ్లలో విపక్షంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంత సక్సెస్ అయ్యింది? ఎంత పనితీరు కనబరిచింది? అనే దానిపై మాత్రం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్ 2.0 కోసం ఆయన చేస్తున్న రాజకీయాలకు ప్రజామోదం ఉందా? కూటమిపై చేస్తున్న విమర్శలకు ప్రజలు హర్షిస్తున్నారా? అన్నది మాత్రం గమనించుకుంటే మంచిది. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలను ప్రజలు నమ్మలేదు. ఇప్పుడు విపక్షంలోకి వచ్చి ఆయన చాలా మాటలు చెబుతున్నారు. ఆ మాటలను ఇప్పుడు ప్రజలు నమ్ముతున్నారా? లేదా అని తెలుసుకోవాల్సిన అవసరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అందుకు అనుగుణంగా రాజకీయాలు చేయాల్సిన అవసరం ఆ పార్టీకి ఉంది.

* మారిన రాజధానుల స్టాండ్..
రాజధానుల అంశాన్ని తీసుకుందాం. అసలు రాష్ట్ర రాజధానిపై మూడు మొక్కలు ఆడింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. తొలుత విశాఖ రాజధాని అన్నారు జగన్. తరువాత మాట మార్చి మావిగన్ అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అయితే దీనిని ప్రజలు సమర్ధిస్తున్నారా అనే విషయాన్ని జగన్ గుర్తించాలి. మద్యం స్కాం నుంచి తిరుమల లడ్డు కల్తీ వరకు వైసిపి ఎదుర్కొంటున్న కేసులు, ఆరోపణలను ప్రజలు మరిచిపోయే అవకాశం ఉంటుందా? పారిశ్రామికవేత్తలకు వైసీపీ నుంచి వస్తున్న బెదిరింపులు, పెట్టుబడిదారులను ఉద్దేశించి జగన్ చేస్తున్న హెచ్చరికలను ప్రజలు స్వాగతిస్తున్నారా? అనే విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఒకటికి రెండుసార్లు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది.

* ప్రజలు విశ్వసిస్తున్నారా?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రప్ప రప్ప అనే నినాదాలు చేస్తున్నాయి. వాటిని జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా సమర్థించారు. అయితే వాటిని ప్రజలు విశ్వసిస్తున్నారా? అనేది తెలుసుకోవాల్సిన అవసరం వైసీపీకి ఉంది. గత ఎన్నికలకు ముందు వై నాట్ 175 అన్న నినాదం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్ 2.0 అనే నినాదాలు ఇస్తున్నారు. వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న మాదిరిగానే 2.0 నినాదం మిగిలిపోతుందన్న విషయాన్ని వైసిపి గ్రహించాలి. గతంలో తన పార్టీ నేతల బూతు రాజకీయాన్ని ప్రజలు సమర్థిస్తారని భావించారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అదే బూతు నేతలు మళ్లీ ఎంట్రీ ఇస్తున్నారు. మళ్లీ ప్రజలను తక్కువ అంచనా వేస్తున్నట్టు ఉన్నారు.

* బలపడడం అంటే…
బలపడ్డం అని తాము అనుకోకూడదు. ప్రజల్లో మార్పు రావాలి. ప్రజలు మౌనంగా ఉన్నారని, ప్రభుత్వం వెతక వైఖరి అవలంబిస్తుంది అని వైసిపి ఎప్పటికీ తమదే పైచేయి అని భావిస్తోంది. అయితే ఆ ఆలోచన అజ్ఞానమే అవుతుంది. అసలు ప్రజలు ఏమి అనుకుంటున్నారో దానిని ముందుగా గ్రహించాలి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ప్రత్యర్థిని రాజకీయంగా దెబ్బ కొట్టాలి అంటే వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలి అని వైసిపి పైశాచిక రాజకీయ క్రీడ నుంచి బయటకు రావాలి. నిన్నటి వైసిపి పతనం ఈవీఎంల పుణ్యమే అని చెబుతున్న జగన్.. రేపు అధికారంలోకి వస్తే అదే ఈవీఎంలను సమర్ధించకూడదు. ఒక్కటి మాత్రం నిజం జగన్మోహన్ రెడ్డి నుంచి ఆ పార్టీ క్యాడర్ వరకు కూటమి గెలుపును జీర్ణించుకోలేకపోతోంది. దానిని అధిగమించేందుకు జనాలతో పాట్లు పడుతుంది. అయితే నమ్ముకోవాల్సింది జనాన్ని కానీ.. జనాలతో ప్రదర్శన మాత్రం కాదు. అది ఎంత మాత్రం మొన్నటి ఎన్నికల్లో ఫలితం ఇవ్వలేదు. ఆ విషయం గ్రహిస్తే ఎంతో మేలు.

ఆ ముగ్గురిలో కోహ్లీ స్థానంలో ఆడేది ఎవరు..

IND vs AFG
IND vs AFG

IND vs AFG: ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన ఏకైక టెస్టులో భారీ విజయం సాధించిన తర్వాత టీమిండియా వైట్ బాల్ ఫార్మాట్ కు సిద్ధమైంది. 2027 వన్డే వరల్డ్ కప్ కు ఈ టోర్నీని టీమిండియా సన్నాహకంగా భావిస్తుంది. ఇందులో భాగంగా ధర్మశాల వేదికగా జరిగే తొలి వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ తో పోటీ పడబోతోంది. ఈ మ్యాచ్లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఆడటం లేదు.

విరాట్ కోహ్లీ జట్టులో లేకపోతే అది కాస్త ఇబ్బందే. అతడి గాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆఫ్గనిస్తాన్ జట్టుతో జరిగే సిరీస్ కు ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో ఎవరు ఆడతారు అనే చర్చ మొదలైంది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు సంచలన ప్రదర్శన చేస్తుంది. గతంలో ఈ జట్టుకు ఆస్ట్రేలియాను.. దక్షిణాఫ్రికా ను ఓడించిన చరిత్ర ఉంది. అలాంటప్పుడు ఈ జట్టును అంత తేలికగా టీం ఇండియా మేనేజ్మెంట్ తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే విరాట్ కోహ్లీ స్థానంలో ఇషాన్ కిషన్.. కేఎల్ రాహుల్.. జైస్వాల్ వంటి ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఐపీఎల్లో పై ముగ్గురు సూపర్ ఆట తీరుతో ఆకట్టుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కేఎల్ రాహుల్ ఏకంగా సెంచరీ కూడా చేశాడు. కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. కిషన్ కూడా అదరగొడుతున్నాడు.. అయితే టెస్టులో మాత్రం జైస్వాల్ తన స్థాయికి తగ్గట్టుగా ఆడలేక పోయాడు.

బహుశా జైస్వాల్ కు విశ్రాంతి ఇచ్చి కే ఎల్ రాహుల్ లేదా కిషన్ కు జట్టులో చోటు కల్పిస్తారని తెలుస్తోంది. ఎందుకంటే కిషన్ కీపింగ్ చేయగలడు. కేఎల్ రాహుల్ కూడా వికెట్ల వెనుక గోడ మాదిరిగా ఉండగలడు. అయితే రాహుల్ తో పోల్చి చూస్తే కిషన్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అతడు టి20 లో ఆడినప్పటికీ.. వన్డేలలో అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. మేనేజ్మెంట్ కిషన్ వైపు ఆసక్తిగా చూస్తోంది. గంభీర్ కు కూడా కిషన్ మీద విపరీతమైన నమ్మకం ఉంది. అందువల్ల కిషన్ కు చోటు కల్పిస్తారని ప్రచారం కూడా జరుగుతోంది. మరి కాసేపట్లో కోహ్లీ స్థానంలో ఎవరు ఆడుతారో తేలిపోతుంది.

ధర్మశాల మైదానంలో కిషన్ కు మంచి రికార్డు ఉంది.. ఈ మైదానం మీద అతడు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలడు. గతంలో డొమెస్టిక్ టోర్నీలలో అతడు ఇక్కడ ఆడాడు.. ఐపీఎల్ లో ముంబై.. హైదరాబాద్ జట్టు తరఫున ధర్మశాల మైదానం మీద అతడు ఆడాడు. ఈ ప్రకారం కిషన్ కు కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం మేనేజ్మెంట్ కల్పిస్తుందని తెలుస్తోంది.

ఆఫ్ఘనిస్తాన్ తో తొలి వన్డే.. బౌలింగ్ కోచ్ మోర్కెల్ నోటికి కాస్త తాళం వేయండయ్యా

India vs Afghanistan ODI
India vs Afghanistan ODI

India vs Afghanistan ODI: 2027 వన్డే వరల్డ్ కప్ సాధించడమే లక్ష్యంగా టీమిండియా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో వైట్ బాల్ ఫార్మాట్లో మరింత శక్తివంతంగా తయారు కావాలని భావిస్తుంది. ప్రస్తుతం టీమిండియా సొంత దేశంలో ఆఫ్గనిస్తాన్ జట్టుతో వన్డే సిరీస్ ఆడుతోంది. 2027 వన్డే వరల్డ్ కప్ కంటే ముందు ఈ సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో.. దీనిని సన్నాహకంగా మార్చుకోవాలని టీమ్ ఇండియా బలంగా నిర్ణయించుకుంది. అందువల్లే మైదానంలో ఆటగాళ్లు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన ఏకైక టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో విజయం సాధించిన నేపథ్యంలో.. వన్డే సిరీస్లో పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది.

ధర్మశాల వేదికగా శనివారం ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మీద అందరి దృష్టి ఉంది. కొద్దిరోజులుగా అతడు తొడ కండరాల గాయంతో బాధపడ్డాడు. చికిత్స తీసుకున్నాడు. మైదానంలోకి అడుగు పెట్టబోతున్నాడు. గాయం వల్ల ఇటీవల ఐపీఎల్ మ్యాచ్లలో రోహిత్ సరిగా ఆడలేదు. కొన్ని మ్యాచ్ల్లో ఇంపాక్ట్ ఆటగాడిగానే బరిలోకి దిగాడు.

సామర్థ్య పరీక్షలను అతడు విజయవంతంగా ఎదుర్కొన్నాడు. దీంతో ఆఫ్గనిస్తాన్ సిరీస్ కు అతడు అందుబాటులోకి వచ్చేసాడు. అయితే ప్రాక్టీస్ సమయంలో శర్మ తన తొడ భాగానికి అదనపు రక్షణ ప్యాడ్ ధరించాడు. దీంతో అతడి సామర్థ్యం మీద మరోసారి ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. గాయం తగ్గిందా? అనే ప్రశ్నలు మీడియా లో వినిపిస్తున్నాయి.

రోహిత్ సామర్థ్యం మీద బౌలింగ్ కోచ్ మోర్కల్ క్లారిటీ ఇచ్చాడు.. అతడి సామర్థ్యం మీద ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. అతడు పూర్తిస్థాయిలో ఆడతాడు అని చెప్పాడు. అంతేకాదు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వేగంగా బంతులు వస్తాయి కాబట్టి.. ఆటగాళ్లు ఆమాత్రం రక్షణ తీసుకుంటారని చెప్పాడు.

డ్రెస్సింగ్ రూమ్ లో ప్రణాళికల గురించి చర్చిస్తామని.. అప్పుడప్పుడు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటామని మోర్కెల్ పేర్కొన్నాడు. పైగా రోహిత్ డ్రెస్సింగ్ రూమ్ లో ఉండడం ఎంతో బలాన్ని ఇస్తుందని అతడు స్పష్టం చేశాడు. మోర్కల్ డ్రెస్సింగ్ రూమ్ విషయాలు బయట పెట్టడంతో సోషల్ మీడియాలో టీమిండియా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ సాధించేవరకు మోర్కల్ తన నోటికి తాళం వెయ్యాలని సూచిస్తున్నారు. మేనేజ్మెంట్ ఈ విషయం మీద దృష్టి సారించాలని సూచిస్తున్నారు.

ఏకకాలంలో చైనాకు చెక్.. పాకిస్థాన్ కు రెడ్ ఫ్లాగ్.. మోడీ వేసిన స్కెచ్ అలాంటిది.. ఏం ప్లాన్ చేశారో తెలుసా..

India China Border land Ports
India China Border land Ports

India China Border land Ports: మనం ఎంతగా మన సైన్యాన్ని అభివృద్ధి చేసినప్పటికీ.. ప్రపంచ దేశాలతో ఎంత గొప్పగా విదేశాంగ విధానాన్ని రూపొందించుకుంటున్నప్పటికీ.. మన పక్కనే ఉన్న చైనా తో.. అది సపోర్ట్ చేసే పాకిస్తాన్ తో ఎప్పటికీ ఇబ్బందులే. పైగా సరిహద్దుల్లో ఈ రెండు దేశాలు నిత్యం కలహాలకు.. కవ్వింపులకు దిగుతూనే ఉంటాయి. ఈ రెండు దేశాల మధ్య ఉన్న సరిహద్దులను కాపాడుకోవడానికి భారత్ విపరీతంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. దీనికి తోడు పర్యావరణ అననుకూల పరిస్థితుల వల్ల చాలామంది సైనికులు చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు దేశాలకు చెక్ పెట్టేందుకు మోడీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది.

దేశంలో 74 ల్యాండ్ పోర్ట్ లు

చైనా, పాకిస్తాన్ సరిహద్దుల వెంట సరికొత్తగా ల్యాండ్ పోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. చైనా సరిహద్దు వెంట మూడు.. పాకిస్తాన్ సరిహద్దు వెంట ఆరింటిని నిర్మించే అవకాశం ఉంది. సరిహద్దు ప్రాంతాలలో ముఖ్యంగా పొరుగు దేశాలలో వ్యాపారాన్ని మెరుగుపరచుకోవడానికి.. భద్రతను బలోపేతం చేసుకోవడానికి భారత్ ల్యాండ్ పోర్టులను నిర్మించమంది. అంతర్జాతీయ సరిహద్దుల వెంట మొత్తంగా 74 భూ ఓడరేవులు (ల్యాండ్ పోర్ట్) నిర్మించబోతోంది.

వీటివల్ల ఏం ఉపయోగమంటే..

సముద్రంలేని ప్రాంతాలలో.. రోడ్డు లేదా రైలు మార్గం ద్వారా ఎగుమతులు, దిగుమతులు సాగించే ప్రక్రియను ల్యాండ్ పోర్టులు అని పిలుస్తుంటారు వీటి ద్వారా ఎటువంటి ఆటంకాలు లేకుండా వాణిజ్యాన్ని సాగించవచ్చు. అంతర్జాతీయంగా విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు.. ల్యాండ్ పోర్టుల ద్వారా ఎగుమతులు, దిగుమతులు నిర్వహించవచ్చు. చైనా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న హిమాచల్ ప్రదేశ్లోని నామ్ గియా, ఉత్తరాఖండ్లోని గుంజి, సిక్కిం లోని నాదూల ప్రాంతాలలో భూమార్గ ఓడరేవులు నిర్మించబోతున్నారు.

పాకిస్థాన్ సరిహద్దులో..

పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న జమ్ము కాశ్మీర్ లోని టిట్ వాల్, అదోసా, చెక్కన్ దబాంగ్, పంజాబ్ లోని అట్టారి రైల్వే స్టేషన్, హుస్సేనివాల, రాజస్థాన్లోని మునబావు రైల్వేస్టేషన్లో భూమార్గ ఓడరేవులను నిర్మించబోతున్నారు. మనదేశంలో ప్రస్తుతం 15 ల్యాండ్ పోర్ట్లు ఉన్నాయి. మిగతా 11 వివిధ దశలలో ఉన్నాయి. అంతర్జాతీయంగా యుద్ధాలు.. ఇతర విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇవి వాణిజ్యానికి అనుకూలంగా ఉంటాయి.. అందువల్లే భారత్ వీటి విషయంలో దూకుడుగా ఉంది. చైనా సరిహద్దు వెంట మూడు.. పాకిస్తాన్ సరిహద్దు వెంట ఆరు భూమార్గ ఓడరేవులను నిర్మిస్తోందంటే భారత్ ఎంత ముందుచూపుతో ఉందో అర్థం చేసుకోవచ్చు.

రోడ్లపై దుమ్ము దులిపిన వైసీపీ కాక్రోచ్ లు!

YSRCP Caste Politics
YSRCP Caste Politics

YSRCP Cockroach Remarks: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కాక్రోచ్ తో పోల్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడానికి ఏపీలో కూడా కాక్రోచ్ లు రోడ్డుపైకి వస్తాయని.. తాను కూడా ఒక కాక్రోచ్ నే అంటూ ప్రెస్ మీట్ లో ప్రకటించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే కూటమి రెండేళ్ల పాలనపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. కొంతమంది వైసీపీ నేతలు రోడ్లమీదకు వచ్చి సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, మరో మంత్రి సవిత పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అందులో మొదటిగా వైసీపీ మహిళా నేత ఉషశ్రీ చరణ్ మంత్రి సవిత పై రెచ్చిపోయారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చాలా దూకుడుగా వ్యవహరించాయి ఈ ఆందోళన కార్యక్రమంలో. జగన్మోహన్ రెడ్డి రోడ్లపైకి కాక్రోచ్లు వస్తాయని హెచ్చరించిన తరుణంలోనే ఇలా వైసిపి శ్రేణులు ఆందోళన చేయడం విశేషం.

* పూనకంలా తిట్ల దండకం
అయితే జగన్ కాక్రోచ్ అనే పేరు ప్రకటించగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో పూనకం వచ్చినట్టు కనిపించింది. ఎప్పుడు సాధారణ స్థితిలో మాట్లాడే ఉషశ్రీ చరణ్ సైతం మంత్రి సవిత పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నీ అబ్బ జాగీరా? సొంత తల్లికి అన్నం పెట్టలేని నువ్వు అన్నపూర్ణ క్యాంటీన్ పెడతావా? సొంత మామను వెన్నుపోటు పొడిచి మంత్రి పదవి దక్కించుకున్న నువ్వు జగన్ పై విమర్శలు చేస్తావా? అసలు జగన్మోహన్ రెడ్డిని విమర్శించేందుకు నువ్వెవరు? నీ స్థాయి ఏంటి? పెనుకొండలో బెల్ట్ షాపులను అనుమతులు ఇస్తూ ప్రతి లిక్కర్ బాటిల్ పై పది రూపాయలు తింటున్నావ్, తాగుతున్నావ్. అసలు నీకు సిగ్గు లేదా? నిన్ను నమ్మి నీ వెంట నడిచిన వారిని దగా చేసి నట్టేట ముంచావు. నువ్వా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేది అంటూ ఉషశ్రీ సంస్కారవంతమైన భాష వాడారు.

* అనవసరంగా నోరు పారేసుకుని..
మరోవైపు కాపు టైగర్ అంబటి రాంబాబు సైతం సీఎం చంద్రబాబుపై మరోసారి నోరు పారేసుకున్నారు. గుంటూరులో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో చంద్రబాబును ఉద్దేశించి వాడిని ఎప్పుడో పగలేశారు అంటూ వ్యాఖ్యానించారు. ఇక మాజీ మంత్రి రోజా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి పరమ చెత్త అని… పవన్ నువ్వు ఓజి కాదు పెద్ద క్యాబేజీ అంటూ వ్యాఖ్యానించారు. అయితే నిన్న సాగిన ఆందోళన కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బరితెగించి మాట్లాడారు. దీంతో జగన్ ప్రెస్మీట్లో చెప్పిన కాక్రోచ్ వీరేనా అంటూ సోషల్ మీడియాలో మిమ్స్ మొదలయ్యాయి. మొన్న మధ్యన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అతి తగ్గింది అనుకుంటే.. ఇప్పుడు మళ్లీ ఆ పార్టీ నేతలు రెచ్చిపోయి బూతులు మాట్లాడుతున్నారు. మాటలు వచ్చిన కాక్రోచ్ ల్లా వ్యవహరిస్తున్నారు.

ఎవడ్రా నువ్వు.. డేటింగ్ తో న్యాయాధికారికే టోపీ.. ఎంత లాగాడో తెలుసా

Dating App Fraud
Dating App Fraud

Dating App Fraud: మన సమాజంలో న్యాయ విభాగంలో పనిచేసే వారికి ఎక్కువ ఆలోచన శక్తి ఉంటుంది అనుకుంటాం. వారి జ్ఞానం ముందు మిగతావారు తక్కువ అని భావిస్తుంటాం. కానీ ఇతడు ఏకంగా ఒక న్యాయాధికారికే చుక్కలు చూపించాడు. ఆమె వీక్నెస్ పాయింట్ దొరకబుచ్చుకొని చుక్కలు చూపించాడు. అదే కాదు ఏకంగా 52 లక్షలకు టోపీ పెట్టాడు. ఇక్కడితోనే కథ ముగిసిపోలేదు.

చండీగఢ్ ప్రాంతంలో ఒక మహిళ న్యాయాధికారిగా పని చేస్తోంది. ఈమెకు డేటింగ్ యాప్ టెండర్ ద్వారా ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అపరిచయం కాస్త చాలా దూరం వెళ్ళిపోయింది. ఇద్దరి మధ్య గట్టిగానే వ్యవహారం సాగింది. ఆమెకు అతడు స్వర్గసుఖాలు చూపించాడు. దీంతో అతడికి ఆమె సరెండర్ అయిపోయింది. ఏకంగా 52 లక్షలు ఆమె నుంచి అతడు వసూలు చేశాడు.. అతడి చేతిలో మోసపోయానని తెలుసుకున్న తర్వాత ఆ న్యాయాధికారి తన అధికారాన్ని ఉపయోగించి కోర్టు దాకా వెళ్ళింది. కోర్టు విచారణలో అసలైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

ఆ న్యాయ అధికారి తన పేరు మీద కేసు ఫైల్ చేస్తే పరువు పోతుందని భావించి.. తన ఇంట్లో పనిచేసే పనిమనిషి పేరు మీద కేసు నమోదు చేసింది. దీంతో కేసు విచారించిన న్యాయమూర్తి మోసం చేసిన ఆ వ్యక్తిని జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించారు. ఇటీవల ఆ నిందితుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. ఆ పిటిషన్ సెషన్ కోర్టులో విచారణకు వచ్చింది. విచారణ సమయంలో అసలైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వ్యక్తి ద్వారా మోసపోయింది పనిమనిషి కాదని.. న్యాయాధికారి అని బయటికి తేలింది. “భారీగా లాభాలు వచ్చే పెట్టుబడుల పేరుతో డబ్బులు వసూలు చేశాడు. ఆ తర్వాత ముఖం చాటేసాడని” ఆ పనిమనిషి పిటిషన్ లో పేర్కొంది..”ముందుగా నా ఖాతా నుంచి ఐదు లక్షలు.. మా యజమాని ఖాతా నుంచి మిగతా మొత్తం నగదు అతని ఖాతాకు బదిలీ చేసాం” అని ఆ పనిమనిషి ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై న్యాయమూర్తి విచారణ సాగించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ వ్యవహారంలో నిందితుడు దీపక్ వాట్స్.. 2025లో ఆ మహిళ న్యాయధికారికి డేటింగ్ యాప్ టిండర్ ద్వారా పరిచయం అయ్యాడు. తన పేరును అభిమన్యు వశిష్ట అని మార్చుకున్నాడు.. తాను ఇండియన్ గవర్నమెంట్ లో ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్నానని చెప్పుకున్నాడు. దీంతో అతని మాటలను నమ్మిన ఆ న్యాయ అధికారి అతడికి పూర్తిగా లొంగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆమెకు అతడు అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించాడు. రకరకాల మార్గాలలో పెట్టుబడులు పెడితే డబ్బులు వస్తాయని చెప్పాడు. అప్పటికే అతడికి లొంగిపోయిన ఆమె.. డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టింది. దాదాపు 52 లక్షలు వివిధ మార్గాల ద్వారా అతనికి బదిలీ చేసింది.

లాభాలు చూపించకపోగా.. పదేపదే డబ్బులు అడగడంతో ఆమెకు అనుమానం వచ్చింది. దీంతో ఆ న్యాయ అధికారి తన ఇంట్లో పని చేసే దీక్ష దేవి పేరు మీద కేసు నమోదు చేసింది.. మరోవైపు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా దీపక్ సరికొత్త విషయాలను బయటపెట్టాడు..”నన్ను ఆమె ఇష్టపడింది. నాతో కలిసి చాలా రోజులు ఉంది. ఆమెకు డబ్బు పిచ్చి ఎక్కువగా ఉంటుంది.. నాకు బెట్టింగ్లలో డబ్బు పెట్టమని ఆమె స్వచ్ఛందంగా ఇచ్చింది. అక్కడ నేను నష్టపోయానని” దీపక్ చెప్పాడు. దీంతో కేసును విచారిస్తున్న న్యాయమూర్తి ఆశ్చర్యపోయారు. అయితే ఈ కేసులో ఇంకా ఆసక్తికరమైన విషయాలు ఉండడంతో న్యాయమూర్తి బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేశారు.

చిన్న పడవకు.. భారీ చేపలు.. చూస్తే గగుర్పాటు!

Visakhapatnam Fishermen
Visakhapatnam Fishermen

Visakhapatnam Fishermen: సముద్రంలో అత్యంత ప్రమాదకరమైన చేపల్లో కొమ్ము కోణం ఒకటి.. సముద్రంలో అత్యంత వేగంగా ఈద గల జీవుల్లో ఇదొకటి.. గంటకు దాదాపు 130 కిలోమీటర్ల వేగంతో ఇది ఈదుతాయి. వీటికి ముక్కు భాగంలో ఉండే పదునైన కొమ్ము అత్యంత ప్రమాదకరమైనది. సముద్రంలో వేటాడే సమయంలో తోటి జీవులను చంపేస్తుంది. శత్రువుల నుంచి తనను తాను రక్షించుకునేందుకు ఈ కొమ్మును ఒక ఆయుధంగా వాడుతుంది. ఒక్కోసారి సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల బోట్లతోపాటు పడవలకు సైతం ప్రమాదం తెచ్చిపెడుతుంది. ఏకంగా వాటిని ముక్కుతో పొడిచి రంధ్రాలు కూడా చేస్తుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సాగర సామ్రాజ్యాన్ని శాసించే బ్లాక్ మార్నిన్ గా గుర్తింపు పొందింది. అయితే అటువంటి ప్రమాదకర చేపలు చిన్న బోట్లతో వేటకు వెళ్లిన విశాఖ మత్స్యకారులకు చిక్కడం విశేషం.

* చేపల వేట నిషేధం..
ప్రస్తుతం సముద్రంలో చేపల వేట నిషేధం. పెద్ద పెద్ద మేకనైజ్డ్ బోట్ల వినియోగం కూడా నిషేధం. కానీ సంప్రదాయ మత్స్యకారులకు మాత్రం చిన్నచిన్న తెరచాప పడవలపై తీరానికి కొద్ది దూరంలో వేట సాగించవచ్చు. ఇలా శుక్రవారం విశాఖ తీరంలో వేటకు వెళ్లారు మత్స్యకారులు. అనూహ్యంగా వారి వలకు బ్లాక్ మార్లిన్ చాపలు చిక్కడం విశేషం. ఇవి సాధారణంగా సముద్ర పై భాగంలో కాకుండా చాలా అగాధాల్లో జీవిస్తుంటాయి. వీటిని వేటాడాలంటే పెద్ద పెద్ద మేకనైజ్డ్ బోట్లతో కిలోమీటర్ల కొద్దీ సముద్రం లోపల కు వెళ్లాలి. కానీ ప్రస్తుతం వేట నిషేధం ఉండడంతో అంత దూరం వెళ్ళకూడదు. అయినా సరే విశాఖపట్నం మత్స్యకారుల వలకు ఈ భారీ చేపలు చిక్కాయి. వీటిని అతి కష్టం మీద విశాఖపట్నం చేపల రేవుకు తరలించారు. ఒక్కో దాని బరువు 120 కిలోల నుంచి 200 కిలోల వరకు ఉంటుంది. ఈ రెండు చేపలను చూసేందుకు స్థానికులు ఆసక్తి కనబరిచారు.

* భారీ గిరాకీ..
మరోవైపు ఈ భారీ చేపలను వేలం వేశారు. దక్కించుకునేందుకు వ్యాపారులు పోటీపడ్డారు. వేలం పాటలో ఒక్కో చేప 30 వేల రూపాయల వరకు ధర పలికింది. వేట లేని సమయంలో ఇబ్బంది పడుతున్న మత్స్యకారులకు ఈ భారీ చేపలు కొండంత ఆనందాన్ని ఇచ్చాయి. అత్యంత ప్రమాదకరమైన ఈ చేపలు.. చిన్న తెరచాప పడవపై చిక్కడం మాత్రం అందర్నీ ఆకట్టుకుంది.

అమెరికాకు యూఏఈ షాక్‌.. ఇరాన్‌తో ఆర్థిక సహకారం పునరుద్ధరణ!

UAE Iran Economic Cooperation
UAE Iran Economic Cooperation

UAE Iran Economic Cooperation: అమెరికా–ఇరాన్‌ వార్‌ ఇంకా ముగియలేదు. తుది శాంతి ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్‌ నిన్నటి వరకూ ఇరాన్‌పై దాడులు చేశాయి. ప్రతిగా ఇరాన్‌ అమెరికాకు మద్దతుగా ఉన్న గల్ఫ్‌ దేశాలు యూఏఈ, ఒమన్, ఖతార్, బహ్రెయిన్‌పై దాడులు చేసింది. ఆయిల్‌ రిఫైనరీలను ధ్వంసం చేసింది. ఇలాంటి పరిస్థితిలో యూఏఈ అమెరికాకు షాక్‌ ఇచ్చింది. ఇరాన్‌ దాడిని ఎదుర్కొన్న గల్ఫ్‌ దేశం.. ఇరాన్‌కే ఇప్పుడు ఆర్థిక సహకారం అందించింది. మొత్తం 10 బిలియన్‌ డాలర్లు విడుదల చేయాలని, వాటిలో 3 బిలియన్‌ డార్లకంటే కంటే ఎక్కువ ఇప్పటికే ఇరాన్‌కు అందించింది.

ఖండించిన యూఏఈ…
ఇదిలా ఉంటే యూఈఏ–ఇరాన్‌ ఆర్థిక సహకారం పునరుద్ధరణ వార్తలను యూఏఈ ఖండించింది. యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ రాయిటర్‌లో వచ్చిన వార్తలను పూర్తిగా తిరస్కరించింది. ‘‘ఫ్రోజెన్‌ ఇరానియన్‌ ఫండ్స్‌ ఏవీ విడుదల చేయలేదు, బదిలీ చేయలేదు లేదా సులభతరం చేయలేదు’’ అని అధికారికంగా ప్రకటించింది. వార్తలు వాస్తవాల ఆధారంగా లేవని, మీడియా అధికారిక వనరులపై ఆధారపడాలని సూచించింది.

యూఏఈపై ఇరాన్‌ దాడులు..
అమెరికా–ఇజ్రాయెల్‌–ఇరాన్‌ సంఘర్షణ నేపథ్యంలో యూఏఈపై ఇరాన్‌ దాడులు చేసింది. క్షిపణి, డ్రోన్‌లతో విరుచుకుపడింది. దీంతో యూఏఈ ఆర్థిక వ్యవస్థకు (లాజిస్టిక్స్, ఎనర్జీ, బ్యాంకింగ్‌) గణనీయమైన నష్టం కలిగించింది. యూఏఈ చారిత్రకంగా ఇరాన్‌ ఆర్థిక కార్యకలాపాలకు హబ్‌గా ఉంది, కానీ ఇటీవలి దాడుల తర్వాత భద్రతా చర్యలు తీసుకుంది. యూఏఈ మిత్రరాజ్యం (అబ్రహామ్‌ అకార్డ్స్, ఆయుధ ఒప్పందాలు), అయినప్పటికీ ప్రాగ్మాటిక్‌ విధానం అనుసరిస్తుంది. చైనా, ఇతర శక్తులతో సంబంధాలు కొనసాగిస్తూ, తన ఆర్థిక ప్రయోజనాలను రక్షించుకోవడానికి ఇరాన్‌తో సంభాషణలు జరపడం సాధారణం.

ట్రంప్‌పై నమ్మకం కోల్పోయిన యూఏఈ..
యుద్ధం నేపథ్యంలో ట్రంప్‌ నేతృత్వంలోని అమెరికాపై యూఏఈ నమ్మకం కోల్పోయింది. యూఎస్‌పై ఆధారపడటం ఆర్థిక నష్టం అని భావిస్తోంది. అందుకే ఇరాన్‌ దాడుల నుంచి తక్షణ రక్షణ ఇరాన్‌తో సహకారం పునరుద్ధరించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌ ఫండ్స్‌ అన్‌లాక్‌ అయితే యూఏఈ–ఇరాన్‌ వాణిజ్యం పుంజుకుంటుంది. ప్రాంతీయ ఉద్రిక్తతలు తగ్గుతాయి. నిజానికి యూఏఈ ఇరాన్‌ ఆస్తులను ఫ్రీజ్‌ చేయాలని ముందు ఆలోచించింది.ఇప్పుడు దాడులు ఆపడానికి వ్యతిరేక దిశలో వెళ్తే అది వాస్తవిక భద్రతా అవసరం.

యూఏఈ వంటి దేశాలు తమ ఆర్థిక–భద్రతా ప్రయోజనాల కోసం బహుముఖ విధానం అనుసరిస్తాయి. ట్రంప్‌ పరిపాలనలో అమెరికాకు మద్దతు ఉన్నప్పటికీ, తన స్వంత ప్రయోజనాలను రక్షించుకోవడం సహజం. ప్రాంతీయ శాంతి కోసం దౌత్యం ముఖ్యం.