Homeక్రీడలుJaspal Rana: జస్పాల్ రాణా ఆరోగ్యంగా ఎంతో ఫిట్.. ఎందుకిలా జరిగింది..

Jaspal Rana: జస్పాల్ రాణా ఆరోగ్యంగా ఎంతో ఫిట్.. ఎందుకిలా జరిగింది..

Jaspal Rana: మనదేశంలో ప్రసిద్ధ షూటర్ జస్పాల్.. ఎన్నో మెడల్స్ సాధించాడు.. మన దేశానికి తిరుగులేని ఖ్యాతిని అందించాడు.నేడు షూటింగ్ విభాగంలోకి ఎంతోమంది క్రీడాకారులు వస్తున్నారంటే దానికి ప్రధాన కారణం జస్పాల్. తను ఆటగాడిగా దేశానికి ఎన్నో మెడల్స్ అందించాడు.. అంతేకాదు ఎంతోమంది షూటర్లకు తను ఇప్పుడు షూటింగ్ నేర్పిస్తున్నాడు. కేవలం షూటర్ గా తన బాధ్యతను.. శిక్షకుడిగా తన అనుభవాన్ని నేర్పించే పనిలోపడ్డాడు. ఒలంపిక్స్ లో మెడల్ సాధించిన మను భాకర్ కు జస్పాల్ శిక్షకుడిగా […]

Jaspal Rana: మనదేశంలో ప్రసిద్ధ షూటర్ జస్పాల్.. ఎన్నో మెడల్స్ సాధించాడు.. మన దేశానికి తిరుగులేని ఖ్యాతిని అందించాడు.నేడు షూటింగ్ విభాగంలోకి ఎంతోమంది క్రీడాకారులు వస్తున్నారంటే దానికి ప్రధాన కారణం జస్పాల్. తను ఆటగాడిగా దేశానికి ఎన్నో మెడల్స్ అందించాడు.. అంతేకాదు ఎంతోమంది షూటర్లకు తను ఇప్పుడు షూటింగ్ నేర్పిస్తున్నాడు. కేవలం షూటర్ గా తన బాధ్యతను.. శిక్షకుడిగా తన అనుభవాన్ని నేర్పించే పనిలోపడ్డాడు.

ఒలంపిక్స్ లో మెడల్ సాధించిన మను భాకర్ కు జస్పాల్ శిక్షకుడిగా కొనసాగుతున్నాడు. ఆమె మెడల్ సాధించడంలో ఎంతో కీలకపాత్ర పోషించాడు. 49 సంవత్సరాల వయసు ఉన్న జస్పాల్ ఆకస్మాత్తుగా కన్నుమూయడం ఒక్కసారిగా కలవరపాటుకు గురి చేసింది.. అతడు చనిపోడాన్ని భారత క్రీడా లోకం జీర్ణించుకోలేకపోతోంది.. జర్మనీలోని మ్యూనిచ్ ప్రాంతంలో ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ పోటీలను పూర్తి చేసుకొని భారత బృందం తిరిగి వస్తోంది. ఈ నేపథ్యంలో జస్పాల్ విమానంలోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.

విమానం ఢిల్లీకి చేరిన వెంటనే అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత అతడి గుండె నుంచి శరీరానికి రక్తాన్ని సరఫరా చేసే నాలంలో అడ్డంకి ఏర్పడిన నేపథ్యంలో.. వైద్యులు దానిని గుర్తించి తొలగించారు. స్టంట్ అమర్చారు. కొద్దిరోజుల తర్వాత మరో స్టంట్ వేసేందుకు వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. జస్పాల్ కోలుకున్నాడని.. అతడి పరిస్థితి నిలకడగా ఉందని అందరూ అనుకున్నారు. అయితే గురువారం అతడి పరిస్థితి మరోసారి విషమించింది. ఈసారి అతడి గుండె పని చేయడం మానేసింది. ఫలితంగా జస్పాల్ కానరాని లోకాలకు వెళ్లిపోయాడు.

ముందుగా అతడు తన చాతిలో నొప్పి వస్తే.. దానిని అజీర్తి సమస్య అనుకున్నాడు.. అప్పుడే నొప్పి వచ్చినప్పుడు ఆసుపత్రికి వెళ్లి ఉంటే బతికి బట్ట కట్టేవాడు. గత ఏడాది ఫిబ్రవరిలో జాతీయ కోచ్ గా జస్పాల్ నియమితుడయ్యాడు. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో హై పెర్ఫార్మన్స్ కోచ్ గా అతడు బాధ్యతలు తీసుకున్నాడు. జస్పాల్ ఉత్తరాఖండ్లో జన్మించాడు. 1994లో షూటింగ్ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. అదే సంవత్సరం హీరోషిమ ఆసియా గేమ్స్ లో స్వర్ణం, కాంస్యం గెలిచాడు. 2026 ఆసియా క్రీడల్లో మూడు స్వర్ణాలు, ఒక రజత పతకం సాధించాడు.

1994 నుంచి 2006 వరకు జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లలో 9 స్వర్ణాలు, నాలుగు రజత, రెండు కాంస్య మెడల్స్ సాధించాడు.. కేవలం 18 సంవత్సరాల వయసులోనే అర్జున అవార్డు అందుకున్నాడు. 21 సంవత్సరాల వయసులోనే పద్మశ్రీ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు. ఇతడి ట్రైనింగ్ లోనే మను బాకర్ 2024 పారిస్ ఒలంపిక్స్ లో రెండు కాంస్యాలు సాధించింది. 2020లో జస్పాల్ ద్రోణాచార్య అవార్డు దక్కించుకున్నాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper