Home Blog Page 135

ఎవడ్రా నువ్వు.. డేటింగ్ తో న్యాయాధికారికే టోపీ.. ఎంత లాగాడో తెలుసా

Dating App Fraud
Dating App Fraud

Dating App Fraud: మన సమాజంలో న్యాయ విభాగంలో పనిచేసే వారికి ఎక్కువ ఆలోచన శక్తి ఉంటుంది అనుకుంటాం. వారి జ్ఞానం ముందు మిగతావారు తక్కువ అని భావిస్తుంటాం. కానీ ఇతడు ఏకంగా ఒక న్యాయాధికారికే చుక్కలు చూపించాడు. ఆమె వీక్నెస్ పాయింట్ దొరకబుచ్చుకొని చుక్కలు చూపించాడు. అదే కాదు ఏకంగా 52 లక్షలకు టోపీ పెట్టాడు. ఇక్కడితోనే కథ ముగిసిపోలేదు.

చండీగఢ్ ప్రాంతంలో ఒక మహిళ న్యాయాధికారిగా పని చేస్తోంది. ఈమెకు డేటింగ్ యాప్ టెండర్ ద్వారా ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అపరిచయం కాస్త చాలా దూరం వెళ్ళిపోయింది. ఇద్దరి మధ్య గట్టిగానే వ్యవహారం సాగింది. ఆమెకు అతడు స్వర్గసుఖాలు చూపించాడు. దీంతో అతడికి ఆమె సరెండర్ అయిపోయింది. ఏకంగా 52 లక్షలు ఆమె నుంచి అతడు వసూలు చేశాడు.. అతడి చేతిలో మోసపోయానని తెలుసుకున్న తర్వాత ఆ న్యాయాధికారి తన అధికారాన్ని ఉపయోగించి కోర్టు దాకా వెళ్ళింది. కోర్టు విచారణలో అసలైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

ఆ న్యాయ అధికారి తన పేరు మీద కేసు ఫైల్ చేస్తే పరువు పోతుందని భావించి.. తన ఇంట్లో పనిచేసే పనిమనిషి పేరు మీద కేసు నమోదు చేసింది. దీంతో కేసు విచారించిన న్యాయమూర్తి మోసం చేసిన ఆ వ్యక్తిని జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించారు. ఇటీవల ఆ నిందితుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. ఆ పిటిషన్ సెషన్ కోర్టులో విచారణకు వచ్చింది. విచారణ సమయంలో అసలైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వ్యక్తి ద్వారా మోసపోయింది పనిమనిషి కాదని.. న్యాయాధికారి అని బయటికి తేలింది. “భారీగా లాభాలు వచ్చే పెట్టుబడుల పేరుతో డబ్బులు వసూలు చేశాడు. ఆ తర్వాత ముఖం చాటేసాడని” ఆ పనిమనిషి పిటిషన్ లో పేర్కొంది..”ముందుగా నా ఖాతా నుంచి ఐదు లక్షలు.. మా యజమాని ఖాతా నుంచి మిగతా మొత్తం నగదు అతని ఖాతాకు బదిలీ చేసాం” అని ఆ పనిమనిషి ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై న్యాయమూర్తి విచారణ సాగించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ వ్యవహారంలో నిందితుడు దీపక్ వాట్స్.. 2025లో ఆ మహిళ న్యాయధికారికి డేటింగ్ యాప్ టిండర్ ద్వారా పరిచయం అయ్యాడు. తన పేరును అభిమన్యు వశిష్ట అని మార్చుకున్నాడు.. తాను ఇండియన్ గవర్నమెంట్ లో ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్నానని చెప్పుకున్నాడు. దీంతో అతని మాటలను నమ్మిన ఆ న్యాయ అధికారి అతడికి పూర్తిగా లొంగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆమెకు అతడు అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించాడు. రకరకాల మార్గాలలో పెట్టుబడులు పెడితే డబ్బులు వస్తాయని చెప్పాడు. అప్పటికే అతడికి లొంగిపోయిన ఆమె.. డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టింది. దాదాపు 52 లక్షలు వివిధ మార్గాల ద్వారా అతనికి బదిలీ చేసింది.

లాభాలు చూపించకపోగా.. పదేపదే డబ్బులు అడగడంతో ఆమెకు అనుమానం వచ్చింది. దీంతో ఆ న్యాయ అధికారి తన ఇంట్లో పని చేసే దీక్ష దేవి పేరు మీద కేసు నమోదు చేసింది.. మరోవైపు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా దీపక్ సరికొత్త విషయాలను బయటపెట్టాడు..”నన్ను ఆమె ఇష్టపడింది. నాతో కలిసి చాలా రోజులు ఉంది. ఆమెకు డబ్బు పిచ్చి ఎక్కువగా ఉంటుంది.. నాకు బెట్టింగ్లలో డబ్బు పెట్టమని ఆమె స్వచ్ఛందంగా ఇచ్చింది. అక్కడ నేను నష్టపోయానని” దీపక్ చెప్పాడు. దీంతో కేసును విచారిస్తున్న న్యాయమూర్తి ఆశ్చర్యపోయారు. అయితే ఈ కేసులో ఇంకా ఆసక్తికరమైన విషయాలు ఉండడంతో న్యాయమూర్తి బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేశారు.

చిన్న పడవకు.. భారీ చేపలు.. చూస్తే గగుర్పాటు!

Visakhapatnam Fishermen
Visakhapatnam Fishermen

Visakhapatnam Fishermen: సముద్రంలో అత్యంత ప్రమాదకరమైన చేపల్లో కొమ్ము కోణం ఒకటి.. సముద్రంలో అత్యంత వేగంగా ఈద గల జీవుల్లో ఇదొకటి.. గంటకు దాదాపు 130 కిలోమీటర్ల వేగంతో ఇది ఈదుతాయి. వీటికి ముక్కు భాగంలో ఉండే పదునైన కొమ్ము అత్యంత ప్రమాదకరమైనది. సముద్రంలో వేటాడే సమయంలో తోటి జీవులను చంపేస్తుంది. శత్రువుల నుంచి తనను తాను రక్షించుకునేందుకు ఈ కొమ్మును ఒక ఆయుధంగా వాడుతుంది. ఒక్కోసారి సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల బోట్లతోపాటు పడవలకు సైతం ప్రమాదం తెచ్చిపెడుతుంది. ఏకంగా వాటిని ముక్కుతో పొడిచి రంధ్రాలు కూడా చేస్తుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సాగర సామ్రాజ్యాన్ని శాసించే బ్లాక్ మార్నిన్ గా గుర్తింపు పొందింది. అయితే అటువంటి ప్రమాదకర చేపలు చిన్న బోట్లతో వేటకు వెళ్లిన విశాఖ మత్స్యకారులకు చిక్కడం విశేషం.

* చేపల వేట నిషేధం..
ప్రస్తుతం సముద్రంలో చేపల వేట నిషేధం. పెద్ద పెద్ద మేకనైజ్డ్ బోట్ల వినియోగం కూడా నిషేధం. కానీ సంప్రదాయ మత్స్యకారులకు మాత్రం చిన్నచిన్న తెరచాప పడవలపై తీరానికి కొద్ది దూరంలో వేట సాగించవచ్చు. ఇలా శుక్రవారం విశాఖ తీరంలో వేటకు వెళ్లారు మత్స్యకారులు. అనూహ్యంగా వారి వలకు బ్లాక్ మార్లిన్ చాపలు చిక్కడం విశేషం. ఇవి సాధారణంగా సముద్ర పై భాగంలో కాకుండా చాలా అగాధాల్లో జీవిస్తుంటాయి. వీటిని వేటాడాలంటే పెద్ద పెద్ద మేకనైజ్డ్ బోట్లతో కిలోమీటర్ల కొద్దీ సముద్రం లోపల కు వెళ్లాలి. కానీ ప్రస్తుతం వేట నిషేధం ఉండడంతో అంత దూరం వెళ్ళకూడదు. అయినా సరే విశాఖపట్నం మత్స్యకారుల వలకు ఈ భారీ చేపలు చిక్కాయి. వీటిని అతి కష్టం మీద విశాఖపట్నం చేపల రేవుకు తరలించారు. ఒక్కో దాని బరువు 120 కిలోల నుంచి 200 కిలోల వరకు ఉంటుంది. ఈ రెండు చేపలను చూసేందుకు స్థానికులు ఆసక్తి కనబరిచారు.

* భారీ గిరాకీ..
మరోవైపు ఈ భారీ చేపలను వేలం వేశారు. దక్కించుకునేందుకు వ్యాపారులు పోటీపడ్డారు. వేలం పాటలో ఒక్కో చేప 30 వేల రూపాయల వరకు ధర పలికింది. వేట లేని సమయంలో ఇబ్బంది పడుతున్న మత్స్యకారులకు ఈ భారీ చేపలు కొండంత ఆనందాన్ని ఇచ్చాయి. అత్యంత ప్రమాదకరమైన ఈ చేపలు.. చిన్న తెరచాప పడవపై చిక్కడం మాత్రం అందర్నీ ఆకట్టుకుంది.

అమెరికాకు యూఏఈ షాక్‌.. ఇరాన్‌తో ఆర్థిక సహకారం పునరుద్ధరణ!

UAE Iran Economic Cooperation
UAE Iran Economic Cooperation

UAE Iran Economic Cooperation: అమెరికా–ఇరాన్‌ వార్‌ ఇంకా ముగియలేదు. తుది శాంతి ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్‌ నిన్నటి వరకూ ఇరాన్‌పై దాడులు చేశాయి. ప్రతిగా ఇరాన్‌ అమెరికాకు మద్దతుగా ఉన్న గల్ఫ్‌ దేశాలు యూఏఈ, ఒమన్, ఖతార్, బహ్రెయిన్‌పై దాడులు చేసింది. ఆయిల్‌ రిఫైనరీలను ధ్వంసం చేసింది. ఇలాంటి పరిస్థితిలో యూఏఈ అమెరికాకు షాక్‌ ఇచ్చింది. ఇరాన్‌ దాడిని ఎదుర్కొన్న గల్ఫ్‌ దేశం.. ఇరాన్‌కే ఇప్పుడు ఆర్థిక సహకారం అందించింది. మొత్తం 10 బిలియన్‌ డాలర్లు విడుదల చేయాలని, వాటిలో 3 బిలియన్‌ డార్లకంటే కంటే ఎక్కువ ఇప్పటికే ఇరాన్‌కు అందించింది.

ఖండించిన యూఏఈ…
ఇదిలా ఉంటే యూఈఏ–ఇరాన్‌ ఆర్థిక సహకారం పునరుద్ధరణ వార్తలను యూఏఈ ఖండించింది. యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ రాయిటర్‌లో వచ్చిన వార్తలను పూర్తిగా తిరస్కరించింది. ‘‘ఫ్రోజెన్‌ ఇరానియన్‌ ఫండ్స్‌ ఏవీ విడుదల చేయలేదు, బదిలీ చేయలేదు లేదా సులభతరం చేయలేదు’’ అని అధికారికంగా ప్రకటించింది. వార్తలు వాస్తవాల ఆధారంగా లేవని, మీడియా అధికారిక వనరులపై ఆధారపడాలని సూచించింది.

యూఏఈపై ఇరాన్‌ దాడులు..
అమెరికా–ఇజ్రాయెల్‌–ఇరాన్‌ సంఘర్షణ నేపథ్యంలో యూఏఈపై ఇరాన్‌ దాడులు చేసింది. క్షిపణి, డ్రోన్‌లతో విరుచుకుపడింది. దీంతో యూఏఈ ఆర్థిక వ్యవస్థకు (లాజిస్టిక్స్, ఎనర్జీ, బ్యాంకింగ్‌) గణనీయమైన నష్టం కలిగించింది. యూఏఈ చారిత్రకంగా ఇరాన్‌ ఆర్థిక కార్యకలాపాలకు హబ్‌గా ఉంది, కానీ ఇటీవలి దాడుల తర్వాత భద్రతా చర్యలు తీసుకుంది. యూఏఈ మిత్రరాజ్యం (అబ్రహామ్‌ అకార్డ్స్, ఆయుధ ఒప్పందాలు), అయినప్పటికీ ప్రాగ్మాటిక్‌ విధానం అనుసరిస్తుంది. చైనా, ఇతర శక్తులతో సంబంధాలు కొనసాగిస్తూ, తన ఆర్థిక ప్రయోజనాలను రక్షించుకోవడానికి ఇరాన్‌తో సంభాషణలు జరపడం సాధారణం.

ట్రంప్‌పై నమ్మకం కోల్పోయిన యూఏఈ..
యుద్ధం నేపథ్యంలో ట్రంప్‌ నేతృత్వంలోని అమెరికాపై యూఏఈ నమ్మకం కోల్పోయింది. యూఎస్‌పై ఆధారపడటం ఆర్థిక నష్టం అని భావిస్తోంది. అందుకే ఇరాన్‌ దాడుల నుంచి తక్షణ రక్షణ ఇరాన్‌తో సహకారం పునరుద్ధరించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌ ఫండ్స్‌ అన్‌లాక్‌ అయితే యూఏఈ–ఇరాన్‌ వాణిజ్యం పుంజుకుంటుంది. ప్రాంతీయ ఉద్రిక్తతలు తగ్గుతాయి. నిజానికి యూఏఈ ఇరాన్‌ ఆస్తులను ఫ్రీజ్‌ చేయాలని ముందు ఆలోచించింది.ఇప్పుడు దాడులు ఆపడానికి వ్యతిరేక దిశలో వెళ్తే అది వాస్తవిక భద్రతా అవసరం.

యూఏఈ వంటి దేశాలు తమ ఆర్థిక–భద్రతా ప్రయోజనాల కోసం బహుముఖ విధానం అనుసరిస్తాయి. ట్రంప్‌ పరిపాలనలో అమెరికాకు మద్దతు ఉన్నప్పటికీ, తన స్వంత ప్రయోజనాలను రక్షించుకోవడం సహజం. ప్రాంతీయ శాంతి కోసం దౌత్యం ముఖ్యం.

ఆ రెండు సినిమాల్లో విలన్ పాత్రలను మిస్ చేసుకున్న వడ్డే నవీన్...

Vadde Naveen
Vadde Naveen

Vadde Naveen: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలందరు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్న క్రమంలో ఈ మధ్యకాలంలో వాళ్లు చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే సీనియర్ హీరోలు సైతం తమదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఇక ఇప్పటివరకు ఎవ్వరు ఎలాంటి సినిమాలు చేసినా రాని గుర్తింపు కొంత మంది స్టార్ హీరోల కైతే వచ్చింది. ఇక సీనియర్ హీరోలైనా చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లను మినహాయిస్తే మిగతా ఏ హీరోలు కూడా అంత పెద్ద సక్సెస్ లను సాధించలేకపోయారు. అప్పట్లో వడ్డే నవీన్ యూత్ లో ఒక మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకొని స్టార్ హీరో అయ్యాడు. ఒకానొక సందర్భంలో ఆయన స్టార్ హీరోలతో పాటు పోటీపడుతున్నాడు.

ఇక తనకు అనుకున్న సక్సెస్ రాకపోవడంతో ఇండస్ట్రీ నుంచి ఫెడౌట్ అయిపోయాడు. ఆ తర్వాత చాలా రోజులపాటు విరామం తీసుకున్న ఆయన ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ను చాలా గ్రౌండ్ గా స్టార్ట్ చేయడానికి సిద్ధమయ్యాడు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన నవీన్ తను చాలా కాలం పాటు ఇండస్ట్రీని వదిలి ఉండడానికి గల కారణం ఏంటంటే తనకున్న బిజినెస్ లను చూసుకుంటూ వచ్చానని చెప్పారు.

అలాగే బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన లెజెండ్, సరైనోడు సినిమాలో తనని విలన్ గా అడిగారని కానీ ఆయన ఆ క్యారెక్టర్ ని చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదని కూడా చెబుతుండడం విశేషం…

ఇక మొత్తానికైతే వడ్డే నవీన్ సినిమా ఇండస్ట్రీకి మరోసారి సెకండ్ ఇన్నింగ్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు అని అతని అభిమానులు వెయ్యి కన్నులతో ఎదురు చూశాడు. ఇక ఎట్టకేలకు అది ఇప్పుడు పాజిబుల్ అవుతుండడంతో ప్రతి ఒక్కరు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు… ఇక మీదటైన ఆయన ప్రేక్షకులను అలరించే విధంగా సినిమాలు చేస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…

జగన్ కోసం ఇద్దరు సీఎంల ఆరాటం!

Jagan
Jagan

Jagan: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి చిన్నపాటి ఊపు కనిపిస్తోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఆ పార్టీ బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటే బిజెపి బలం చాలా తక్కువ. అయితే ఇదే దూకుడుతో ముందుకు వెళ్లాలని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. మొన్ననే కేరళలో అధికారంలోకి వచ్చింది. కర్ణాటకలో ఎప్పటినుంచో అధికారంలో ఉంది. మధ్యలో తెలంగాణలో సైతం ఆ పార్టీ సత్తా చాటింది. మొన్నటికి మొన్న తమిళనాడులో విజయ్ సర్కార్ కొలువుదీరడానికి కాంగ్రెస్ కారణం అయింది. ఇలా దక్షిణాది రాష్ట్రాల్లోని నాలుగు ప్రధాన రాష్ట్రాల్లో హవా చాటుకుంది కాంగ్రెస్. ఏపీలో మాత్రం లోటు కనిపిస్తోంది. ఆ లోటు భర్తీ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డంగా ఉంది. అందుకే దాని అడ్డంకి తొలగించేందుకు కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగినట్లు స్పష్టం అవుతోంది.

* కాంగ్రెస్ రూట్ మ్యాప్..
2029 సార్వత్రిక ఎన్నికలకు ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేస్తోంది కాంగ్రెస్ హై కమాండ్. ఇందులో భాగంగా ఒకప్పుడు కాంగ్రెస్ డిఎన్ఏ నుంచి పుట్టి విడిపోయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ కాంగ్రెస్ వైపు రప్పించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా ఆ ఇద్దరు ట్రబుల్ షూటర్లకు అప్పగించినట్లు తెలుస్తోంది. దక్షిణాదిన కాంగ్రెస్ వ్యూహాలను విజయవంతంగా అమలు చేసే బాధ్యత డీకే శివకుమార్ తో పాటు రేవంత్ రెడ్డికి అప్పగించింది హై కమాండ్. ఇప్పటికే బెంగాల్ లో ఓడిపోయిన మమతా బెనర్జీ కాంగ్రెస్ గూటికి వచ్చేందుకు సిద్ధపడ్డారు. ఇప్పుడు అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఎదురయ్యేలా ఉంది.

* జగన్ కు అవసరం
వరుసగా ఎన్నికల్లో ఓటమితో ఒంటరివాడు అయ్యారు జగన్మోహన్ రెడ్డి. జాతీయస్థాయిలో ఒక బలమైన రక్షణ వలయం, రాజకీయ తోడ్పాటు అవసరం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి కూటమిని ఢీకొట్టాలంటే జాతీయస్థాయిలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ అండ జగన్మోహన్ రెడ్డికి అవసరం. ఆపై పొరుగు రాష్ట్రాల ప్రభావం ఏపీ పై స్పష్టంగా ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డికి తెలియంది కాదు. తోటి తెలుగు రాష్ట్రంలో కెసిఆర్ అధికారంలో ఉన్నప్పుడు సాయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అదే కెసిఆర్ లేకపోతే ఏ పరిస్థితి వచ్చిందో 2024 ఎన్నికల్లో కనిపించింది. అందుకే జగన్మోహన్ రెడ్డిని ఆకర్షించేందుకు రేవంత్ గట్టి ప్రయత్నాలు ఉన్నట్లు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి విషయంలో మునుపటి వైఖరి అనుసరించడం లేదు రేవంత్. దీని వెనుక కాంగ్రెస్ వ్యూహం ఉన్నట్లు స్పష్టం అవుతుంది. మరి డీకే శివకుమార్ గురించి చెప్పనవసరం లేదు. వైయస్ కుటుంబంతోపాటు జగన్మోహన్ రెడ్డికి ఆయన అత్యంత సన్నిహితుడు కూడా. సో వచ్చే ఎన్నికల నాటికి జగన్ కాంగ్రెస్ వైపు రావడం ఖాయం.

వైసిపి పై రగిలిపోతున్న మూగజీవాలు.. వీడియో వైరల్!

YSRCP Protest Buffalo Viral Video
YSRCP Protest Buffalo Viral Video

YSRCP Protest Buffalo Viral Video: ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాల్లో మూగజీవాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీనిపై ఎన్ని రకాల విమర్శలు వచ్చినా వారు వెనక్కి తగ్గడం లేదు. అందుకే వాటికి కోపం వచ్చినట్టు ఉంది. వైసీపీ నేతలు ఒక్క తన్ను తన్ని పరుగులు అందించుకున్నాయి. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో జరిగింది. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయిన తరుణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాన్ని నిర్వహించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది. అందులో భాగంగా నందిగామలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో అపశృతి జరిగింది.

* నందిగామలో అపశృతి..
నందిగామ నియోజకవర్గంలో ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ఇంటి నుంచి దున్నపోతుతో ర్యాలీ నిర్వహించారు. అయితే చుట్టుపక్కల జనం, వారి హడావిడి చూసిన దున్నపోతు బెదిరిపోయింది. చుట్టుపక్కల ఉన్న వారిని పొడిచి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేసింది. ఆర్డీవో కార్యాలయం వద్ద దున్నపోతుతో నిరసన చేపడుతుండగా ఈ ఘటన జరిగింది. దీంతో చాలామంది వైసిపి నేతలకు గాయాలయ్యాయి. అయితే ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాల్లో మూగజీవాలతో నిరసన చేపడుతుండడంపై జంతు ప్రేమికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

* మూగజీవాలతో నిరసన..
తిరుపతిలో మొన్న ఆ మధ్యన పెట్రోల్ డీజిల్ కొరతపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ భారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది తిరుపతిలో. అప్పట్లో టన్నుల కొద్ది ఉన్న ఆటోను దున్నపోతుపై ఉంచడంతో ఆ మూగ జీవి తీవ్ర అసౌకర్యానికి గురైంది . సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ కావడంతో జంతు ప్రేమికురాలు, జబర్దస్త్ యాంకర్ రేష్మి గౌతమ్ తీవ్రంగా స్పందించారు. నిర్వాహకులైన వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అక్కడకు కొద్ది రోజుల అనంతరం పెట్రోల్ డీజిల్ ధరలపై వైసీపీ ఆందోళనలు చేపట్టింది. గాడిదలపై ఒక మోపెడ్ వాహనాన్ని పెట్టి నిరసన చేపట్టారు. ఈ క్రమంలో ఆ మూగ జీవికి రక్తస్రావం జరిగింది. దీనిపై సైతం నిరసన వ్యక్తం అయింది. అయితే ఇప్పుడు నందిగామ నియోజకవర్గంలో వైసిపి ఆందోళనలో దున్నపోతులు భయంతో రంకెలు వేసాయి. వాటి తన్నులకు వైసీపీ నేతలు బాధితులుగా మారారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఇది కావాల్సిందే అని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

హార్ముజ్‌ చుట్టూ 18 వేల మంది భారతీయులు.. అంతా భద్రమేనా?

Hormuz Strait
Hormuz Strait

Hormuz Strait Indians Safety: అమెరికా సైనిక చర్యల్లో ఒక భారతీయ నౌకపై జరిగిన దాడిలో ముగ్గురు భారతీయులు మరణించారు. ఈ సంఘటన తర్వాత, హర్మూజ్‌ జలసంధి పరిసరాల్లో ఉన్న ఇతర భారతీయుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రాంతంలో పనిచేస్తున్న వేలాది మంది భారతీయులు ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ఉన్నారు? ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటోంది? అన్న టెన్షన్‌ నావికులు, వారి కుటుంబ సభ్యుల్లో నెలకొంది.

13 నౌకలు.. 562 మంది సిబ్బంది..
ప్రస్తుతం హర్మూజ్‌ జలసంధిలో భారత జెండా ఎగురవేస్తున్న 13 నౌకల్లో 562 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారిక సమాచారం. ఈ నౌకలు నేరుగా జలసంధి ప్రాంతంలోనే ఉన్నాయి. ఇక హర్మూజ్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో 18 వేల మందికి పైగా భారతీయ నావికులు, సముద్ర సిబ్బంది ఉద్యోగాల్లో ఉన్నారు. వారందరూ ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో చిక్కుకున్నట్లు భావిస్తున్నారు.

భద్రతపై ఆందోళనలు..
ఒక భారతీయ నౌకపై అమెరికా సైనిక దాడి జరిగి ముగ్గురు మరణించారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలోని మిగిలిన భారతీయుల భద్రతపై తీవ్రమైన ఆందోళన నెలకొంది. జలసంధి ప్రాంతం ఇప్పటికే సైనిక ఉద్రిక్తతలతో నిండి ఉండటం వల్ల, సాధారణ వాణిజ్య నౌకలు కూడా ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేయాల్సి వస్తోంది. ఇది కేవలం మరణాల సంఖ్యకు మాత్రమే పరిమితం కాకుండా, ఇక్కడ ఉన్న వేలాది మంది జీవితాలపై ప్రభావం చూపుతోంది.

కేంద్రం సహాయ చర్యలు..
ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, కేంద్రం తక్షణ చర్యలు తీసుకుంటోంది. హార్ముజ్‌ ప్రాంతంలో ఉన్న భారతీయులకు అవసరమైన సహాయం, రక్షణ ఏర్పాట్లపై గల్ఫ్‌ దేశాల్లోని భారత ఎంబసీలతో సమీక్ష జరుగుతోంది. సిబ్బంది భద్రతను నిర్ధారించడం, అవసరమైతే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి అంశాలపై దృష్టి పెట్టారు. ఈ సమీక్షలు పరిస్థితిని మరింత దగ్గరగా పర్యవేక్షించడానికి సహాయపడతాయి.

అవసరమైన చర్యలు…
హార్ముజ్‌ జలసంధి ప్రపంచ వాణిజ్యంలో కీలకమైన ప్రాంతం. అక్కడి ఉద్రిక్తతలు భారతీయ సిబ్బందిని నేరుగా ప్రభావితం చేస్తున్నాయి. ఒక వైపు అమెరికా దాడులు, మరోవైపు ప్రాంతీయ సంఘర్షణలు ఈ రెండూ సాధారణ నావికుల జీవితాలను ప్రమాదంలో పడేస్తున్నాయి. 18 వేల మందికి పైగా ఉన్న సంఖ్య ఈ సమస్య ఎంత విస్తృతమో చూపిస్తుంది. ప్రభుత్వం ఇప్పటికే ఎంబసీలతో సమన్వయం చేసుకోవడం సానుకూల చర్య. అయితే, దీర్ఘకాలికంగా నావికుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చి, అవసరమైతే త్వరిత తరలింపు ప్రణాళికలు రూపొందించాలి. ఇతర దేశాలతో దౌత్య సంప్రదింపులు పెంచి, వాణిజ్య నౌకలపై దాడులు ఆపాలని ఒత్తిడి చేయాలి. భారతీయ నావికుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున, వారి ఉద్యోగ భద్రత, బీమా, మానసిక ఆరోగ్యం వంటి అంశాలపై కూడా దృష్టి పెట్టాలి.

ప్రపంచ సంఘర్షణల్లో భారతీయులు ఎంత సులభంగా ప్రభావితమవుతారో తాజా పరిస్థితి చూపిస్తోంది. తక్షణ సహాయం మాత్రమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధించే వ్యూహాలు అవసరం. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆశావాదం కలిగిస్తున్నాయి. అయితే, పరిస్థితి మరింత దిగజారకుండా నిరంతర పర్యవేక్షణ, దౌత్య ప్రయత్నాలు కొనసాగాలి.

100 రోజుల యుద్ధం.. 347 బిలియన్‌ డాలర్ల నష్టం.. అయినా నిలదొక్కుకున్న ఇరాన్‌!

Iran Economy After 100 Days War
Iran Economy After 100 Days War

Iran Economy After 100 Days War: అమెరికా, ఇజ్రాయెల్‌ సంయుక్తంగా ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించి 100 రోజులైంది. ఇంకా వార్‌ కొనసాగుతోంది. ఈ యుద్ధంలో ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన దెబ్బ తిన్నా, పూర్తిగా క్రాష్‌ కాలేదు. సుమారు 347 బిలియన్‌ డాలర్ల నష్టం జరిగింది. గత ఆంక్షల అనుభవం, వ్యూహాత్మక మార్పులు, ప్రత్యామ్నాయ మార్గాలు ఇరాన్‌ను నిలబెట్టాయని కారణమని విశ్లేషకులు అంటున్నారు.

ఈ స్థిరత్వం ఎలా సాధ్యమైంది?
ఇజ్రాయెల్‌ సైనిక చర్యలు ఇరాన్‌పై నేరుగా ప్రభావం చూపాయి. మిలిటరీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లక్ష్యాలపై దాడులు జరిగాయి. ఇది ఉత్పత్తి, రవాణా, ఎగుమతులపై నేరుగా దెబ్బతీసింది. హర్మూజ్‌ జలసంధి ద్వారా ఆయిల్‌ ఎగుమతులు ప్రభావితమయ్యాయి. అయినా ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలలేదు. ఇది సాధారణ దేశాలకు అసాధ్యంగా అనిపించే విషయం. అమెరికా ఆంక్షలను ఎదుర్కొన్న ఇరాన్‌కు ఈ యుద్ధం కొత్త సవాలు కాదు. ఆ రోజుల్లో నేర్చుకున్న పాఠాలు ఇప్పుడు ఉపయోగపడ్డాయి. దేశీయ ఉత్పత్తి పెంపు, వనరుల సమర్థ వినియోగం, సమాంతర ఆర్థిక వ్యవస్థ ఏర్పాటు ఇవన్నీ ఇప్పటికే అమలులో ఉన్నాయి. యుద్ధం వల్ల కొత్త ఆంక్షలు, బ్లాకేడ్లు వచ్చినా, ఇరాన్‌ వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. ఇది ‘రెసిస్టెన్స్‌ ఎకానమీ’ అనే విధానం బలాన్ని చూపిస్తుంది.

దిగుమతుల భారం తగ్గింపు..
కొన్నేళ్లలో ఇరాన్‌ దిగుమతులపై ఆధారపడటం గణనీయంగా తగ్గించింది. ఆహారం, మందులు, పరికరాలు వంటి అవసరాల్లో దేశీయ ఉత్పత్తిని పెంచింది. యుద్ధ సమయంలో దిగుమతి మార్గాలు అడ్డుకున్నా, అంతర్గత సరఫరా గొలుసు పూర్తిగా విచ్ఛిన్నం కాలేదు. ఇది ఆర్థిక క్రాష్‌ను నివారించడంలో కీలక పాత్ర పోషించింది. హార్ముజ్‌ను దాటిహార్ముజ్‌ జలసంధి మూసివేత లేదా అడ్డంకులు ఏర్పడినా, ఇరాన్‌ రైలు–రోడ్డు మార్గాల ద్వారా ఎగుమతులు కొనసాగించింది. పొరుగు దేశాలైన పాకిస్తాన్, అఫ్గానిస్థాన్‌ మీదుగా వాణిజ్యం సాగింది. ఈ ల్యాండ్‌ కారిడార్లు సముద్ర మార్గాలపై ఆధారపడకుండా రక్షణ కల్పించాయి. ఇది యుద్ధ సమయంలో కూడా వాణిజ్య ప్రవాహాన్ని నిలబెట్టడంలో సహాయపడింది. ప్రాంతీయ సహకారం ఇక్కడ కీలకంగా మారింది.

ఆయిల్‌ ఎగుమతులు..
ఆయిల్‌ ఇరాన్‌కు ప్రధాన ఆదాయ వనరు. ఆంక్షలు, యుద్ధం వల్ల సాధారణ మార్గాలు మూసుకుపోయినా, షెల్‌ కంపెనీలు, షాడో ఫ్లీట్‌ వంటి వ్యూహాల ద్వారా ఆయిల్‌ అమ్మకాలు కొనసాగాయి. ఇది నగదు సంపాదించడానికి సహాయపడింది. ఈ పద్ధతులు సంవత్సరాలుగా అమలులో ఉన్నాయి. యుద్ధ సమయంలో కూడా ఆదాయ ప్రవాహం పూర్తిగా నిలిచిపోలేదు.

వంద రోజుల యుద్ధం, 347 బిలియన్‌ డాలర్ల నష్టం మధ్య కూడా ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోవడం ఆశ్చర్యకరం. ఇది గత అనుభవం, వ్యూహాత్మక సర్దుబాట్లు, ప్రాంతీయ సహకారం వల్ల సాధ్యమైంది. అయితే, యుద్ధం కొనసాగుతున్నంత కాలం ఈ స్థిరత్వం పరీక్షలోనే ఉంటుంది. ప్రపంచం ఇప్పుడు ఈ ‘రెసిస్టెన్స్‌ ఎకానమీ’ మోడల్‌ను ఎలా అధ్యయనం చేస్తుందో చూడాలి.

35 - 40 ఏళ్ళ మహిళలకు ఏమైంది.. భర్తలను వదిలేసి.. విచ్చలవిడిగా..

Women Extramarital Affairs
Women Extramarital Affairs

Women Extramarital Affairs: కొద్దిరోజుల క్రితం కేరళ రాష్ట్రంలో ఒక దారుణం జరిగింది. అక్కడ ఒక 35 సంవత్సరాల మహిళ భర్త చనిపోవడంతో.. ఏడాదిన్నర వయసు ఉన్న బాబును వదిలేసి మరొకడితో పారిపోయింది. ఆ తర్వాత మళ్లీ పుట్టింటికి వెళ్లి ఆ బాబును తెచ్చుకుంది. ప్రియుడితో సరసాలు ఆడుతున్నప్పుడు బాబు అడ్డుగా ఉండడంతో.. అతడిని తీవ్రంగా కొట్టింది. ఏడాదిన్నర బాబు అని కూడా చూడకుండా ప్రియుడితో కలిసి చంపేసింది. ఆ బాబు కాళ్లు చేతులు విరిగిపోయాయి. దేహం మీద 150 కి పైగా గాయాలు ఉన్నాయి.

ఆమె పేరు ప్రియాంక. ఉండేది కర్ణాటకలో.. 10 సంవత్సరాల బాబు.. ఆరు సంవత్సరాల బాలిక ఈమెకు సంతానం. భర్త టీచర్ గా పని చేస్తున్నాడు. ఇటీవల ఆమెకు తన చిన్ననాటి స్నేహితుడు పరిచయమయ్యాడు. అతడితో ఆమె వ్యవహారం మొదలుపెట్టింది. భర్తను, కొడుకుని వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయింది. వెళ్తు వెళ్తూ పాపను తనతో పాటు తీసుకెళ్లిపోయింది. ప్రియుడితో సంబంధం కొనసాగించేందుకు కుమార్తె అడ్డుగా ఉండడంతో ఆమెను చంపేసింది. ఆపై పోస్టుమార్టం నివేదికను తప్పుడుగా రూపొందించి భర్తకు పంపించింది. అతడికి అనుమానం రావడంతో విదేశాల్లో ఉంటున్న తన స్నేహితుడికి చూపించాడు. అందులో మొత్తం తప్పులు ఉన్నాయని అతడు చెప్పాడు. దీంతో ఆ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారిస్తే అసలు వాస్తవాలు వెలుగు చూయి.

ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే.. ఇంతకంటే దారుణాలు ఇటీవల కాలంలో చోటుచేసుకుంటున్నాయి. వాస్తవానికి మాతృత్వానికి సిసలైన చిరునామాగా.. ఆప్యాయతకు.. నిలువెత్తు ప్రేమకు ఆడవాళ్లను ఉదాహరణలుగా చెబుతుంటారు. అమ్మ ప్రేమ అత్యంత గొప్పదని వివరిస్తుంటారు. చివరికి నేటి కాలంలో అమ్మ ప్రేమ కూడా మారిపోయింది. తాచు పాము తన పిల్లల్ని తానే తిన్నట్టుగా.. నేటి కాలంలో అమలు కూడా తమ పిల్లల్ని తామే చంపుకుంటున్నారు.. అది కూడా చాటుమాటు సంబంధాల కోసం..

ఇటీవల కాలంలో ఈ తరహా సంఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో మానసిక విశ్లేషకులు ఒక సర్వే నిర్వహించారు. దాని ప్రకారం 35 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న మహిళలు ఇటువంటి తాత్కాలిక ప్రేమలకు లొంగిపోతున్నట్టు సమాచారం. ముఖ్యంగా కొంతమంది కామాంధులు 35 నుంచి 40 దాటిన మహిళలను టార్గెట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆ మహిళలను బాగా పొగుడుతుంటారు. వాళ్ల మీద విపరీతమైన శ్రద్ధ చూపిస్తుంటారు. ప్రేమ ఉన్నట్టు నటిస్తుంటారు. అసలు జీవితంలో ఏనాడు కూడా భర్త ఈ స్థాయిలో చూసుకో లేనంత అనుభూతిని కలిగిస్తారు.. ప్రపంచాన్ని కళ్ళముందు ఉంచుతారు. నీతోనే బతుకు అంటూ చెబుతుంటారు. ఆ మైకంలో ఈ మహిళలు అన్ని విషయాలను ఆ కామాంధులకు చెప్పేస్తుంటారు. ఇంట్లో విషయాలు.. ఆస్తులు.. డబ్బు.. భర్త వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు.. ఇలా ఏ విషయాన్ని కూడా దాచుకోరు. ఆ తర్వాత వీడియో కాల్స్ మొదలవుతాయి. అనంతరం అది అర్ధ నగ్నత్వానికి దారితీస్తుంది. అనంతరం పూర్తిస్థాయిలో నగ్నంగా మారి కాల్స్ చేసుకొనే స్థాయికి దిగజారుతారు. ఇక రాత్రి మొత్తం అదే పనిలో ఉంటారు.

మరింత ఏకాంతం కోసం ఏవో కారణాలు చెప్పి ఉన్న ఊర్లు వదిలి వెళ్ళిపోతారు. Oyo రూములలో కలుసుకుంటారు. ఒక బలహీనమైన క్షణంలో పిల్లల్ని.. కట్టుకున్న భర్తని వదిలేసి ఇంటి నుంచి వెళ్లిపోతారు. వెళ్తూ వెళ్తూ డబ్బు.. నగలు తీసుకెళ్తుంటారు. ఒకవేళ ఆ కామాంధుడు కొంతలో కొంత మంచోడు అయితే.. నగలు, డబ్బు తీసుకుంటాడు. లేకపోతే అవన్నీ తీసుకొని ఆమెను వేరే గృహాలకు హామీ ఇస్తుంటాడు. ఇక జన్మలో ఆమె బయట ప్రపంచాన్ని చూడలేదు.

ఇంకా కొందరైతే ఆ వీడియో కాల్స్.. ఆ ఫోటోలు అన్ని చూపించి.. నాకు ఎప్పటికీ సరెండర్ కావాల్సిందేనని బెదిరిస్తుంటారు. లేకపోతే వాటిని ఇంటర్నెట్లో పెట్టి ఇజ్జత్ మొత్తం తీస్తానని బెదిరిస్తారు. సమాజం ముందు పరువు.. పిల్లల ముందు గౌరవం.. తల్లిదండ్రులు, భర్త ముందు భయం ఇవన్నీ తట్టుకోలేక అటువంటి వారి డిమాండ్లను మహిళలు తీర్చేస్తుంటారు. ఫిజికల్ గా బంగారం.. డబ్బు ఇస్తారు. శరీరాన్ని కూడా సమర్పించుకుంటారు.

వాస్తవానికి 35 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళలకు ఇటువంటి పరిస్థితి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అప్పటికే పిల్లలు పెద్ద వాళ్ళు అవుతుంటారు. వాళ్లు స్కూలు లేదా కాలేజీలకు వెళ్తుంటారు. ఈ సమయంలో భర్త తో ఏకాంతాన్ని గడపాలని మహిళలకు ఉంటుంది. కానీ అప్పటికే కుటుంబ బాధ్యతలు మీద పడి ఉండడంతో భర్తలు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. అప్పటికే సంసారంలో అనేక రకాలుగా గొడవలు వస్తూ ఉంటాయి. అవి మహిళలకు ఇబ్బంది కలిగిస్తుంటాయి. ఇదే సమయంలో పరాయి పురుషులు రంగ ప్రవేశం చేసి ఆ మహిళల వీక్నెస్ లను పసిగడుతుంటారు. వాటి ఆధారంగా వాళ్లతో మాటలు కలుపుతుంటారు. చివరికి ఇంతటి దారుణాలకు కారణమవుతుంటారు. ఇదంతా జరిగిందని తెలిసేలోపే జరగాల్సిన నష్టం జరుగుతుంది. అందువల్ల ఇటువంటి తాత్కాలిక బంధాలకు ఆకర్షితులు కాకుండా.. తమను తాను నిగ్రహించుకోవడమే నేటి కాలంలో మహిళలు చేయాల్సిన పని. ఒకవేళ ఇటువంటి బంధాలకు ఆకర్షితులైతే కుటుంబాలు కూలిపోతాయి. పిల్లలు ఆగమైపోతారు. కొన్ని సందర్భాల్లో జీవితమే లేకుండా పోతుంది. తస్మాత్ జాగ్రత్త.

అప్పుడు బూతులు.. ఇప్పుడు భక్తి.. కొడాలి నాని లో ఏం మార్పు!

Kodali Nani
Kodali Nani

Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని మళ్లీ సౌండ్ చేయడం ప్రారంభించారు. గత కొద్దిరోజులుగా సైలెంట్ గా ఉన్న ఆయన వైసీపీ కార్యక్రమాల్లో ఇప్పుడు పాల్గొంటున్నారు. తాజాగా వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మొన్న మధ్యన జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన కోఆర్డినేటర్ల సమావేశానికి సైతం హాజరయ్యారు. అయితే ఇలా వచ్చిన క్రమంలో ఆయన సైలెంట్ గా ఉండలేదు. కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేశారు. చంద్రబాబుతో పాటు లోకేష్ పై విరుచుకుపడ్డారు. వైసిపి పై గొడ్డలి పార్టీ ప్రచారంపై మండిపడ్డారు. అది పరశురాముడి గొడ్డలి అని.. శివుడు చేతిలో ఉన్న గొడ్డలి అని ఆధ్యాత్మిక ప్రబోధం చేశారు. ఆధ్యాత్మిక కామెంట్స్ చేశారు. అందులో కూడా తనదైన దూకుడు తనం చూపించారు. అయితే కొడాలి నాని అన్నింటికి తెగించినట్టు కనిపిస్తున్నారు.

* ఓటమితో ఫుల్ సైలెన్స్..
వైసిపి అధికారంలో ఉన్నప్పుడు బూతులతో రెచ్చిపోయేవారు కొడాలి నాని. కానీ అధికారానికి దూరమయ్యేసరికి ఆయన ఫుల్ సైలెన్స్ పాటించాల్సి వచ్చింది. ఆయన అరెస్ట్ తప్పకుండా జరుగుతుందన్న ప్రచారం మొదలైంది అప్పట్లో. అందుకు తగ్గట్టుగానే ఆయనపై వ్యతిరేక ఫిర్యాదులు బాగానే వచ్చాయి. కేసులు కూడా నమోదయ్యాయి. ముందస్తు బెయిల్ ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే ఇంతలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. గుండెపోటు రావడంతో ముంబైలోని ఓ పేరు మోసిన ఆసుపత్రిలో ఆయనకు బైపాస్ సర్జరీ జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం ఆయన చాలా రోజులపాటు హైదరాబాదులో విశ్రాంతి తీసుకున్నారు. ప్రభుత్వం కూడా ఆయన విషయంలో పెద్దగా పట్టించుకున్న పరిస్థితి కనిపించలేదు. అయితే ఇప్పుడు కోలుకోవడంతో బయటకు వచ్చి తిరిగి విమర్శలు చేస్తున్నారు.

* మారిన వైఖరి..
కానీ గతం కంటే కొడాలి నాని వైఖరి మారింది. గతంలో బూతులతో రెచ్చిపోయే కొడాలి నాని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చారో తెలియదు కానీ.. ఆయన పుణ్యమా అని పార్టీపై బూతుల ప్రభావం కనిపించింది. తటస్తులు సైతం ఆయన వైఖరిని తప్పుపట్టారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఆయన నోటి నుంచి ఆధ్యాత్మిక పలుకులు వస్తున్నాయి. ఇటీవల గొడ్డలి పార్టీ అంటూ కూటమి పార్టీ నేతలు వైసిపి పై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా స్పందించారు కొడాలి నాని. దేవుళ్ళ చేతిలో ఉన్న గొడ్డలిగా దానిని అభివర్ణించారు. ఇదే పాత నాని అయి ఉంటే.. నీ అమ్మ మొగుడు.. అంటూ విరుచుకు పడేవారు. ఇప్పుడు మాత్రం భక్తి మాటలు ఆడుతున్నారు. ఎంతలా కొడాలి నాని మారిపోయారు అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. అధికారంలో ఉంటే బూతులు.. ప్రతిపక్షంలో ఉంటే భక్తి అన్నట్టు ఉంది కొడాలి నాని పరిస్థితి.

రుతుపవనాల ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వానలు!

Monsoon Effect
Monsoon Effect

Monsoon Effect: ఏపీలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారింది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా పడుతున్నాయి. ప్రధానంగా దక్షిణ కోస్తా తీర ప్రాంతం, రాయలసీమ జిల్లాలపై రుతుపవనాల ప్రభావం ఉంటుంది. పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు పాటు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసాయి. అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వాన బీభత్సం సృష్టించింది.

* ఉపరితల ఆవర్తన ప్రభావంతో..
ప్రస్తుతం బంగాళాఖాతం పై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దాని ప్రభావం కోస్తాంధ్ర పై ఉంది. చాలా చోట్ల ఉరుములతో కూడిన వాన పడుతోంది. రాయలసీమపై కూడా చల్లటి వాతావరణం కొనసాగుతోంది. నేడు కూడా ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో అయితే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, బాపట్ల,పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప,అన్నమయ్య, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాల్లో పిడుగులతో కూడిన వాన పడే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈదురు గాలులు వీస్తున్నప్పుడు.. పిడుగులు పడుతున్నప్పుడు స్తంభాలు, చెట్ల వద్ద నిల్చో వద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేస్తోంది.

* తెలంగాణలో సైతం..
మరోవైపు తెలంగాణకు సైతం భారీ వర్షం సూచన ఉంది. ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి అక్కడ. రాజధాని హైదరాబాద్ నగరం తో పాటు అన్ని జిల్లాల్లోనూ అత్యధిక వర్షపాతం నమోదయింది. మరో రెండు రోజులపాటు అదే పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్నగర్ జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. నిజామాబాద్, జగిత్యాల, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలో సైతం బలమైన మేఘాలు కమ్ముకునే అవకాశం ఉంది. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో వర్షాలు పడతాయి

ఈ 5 జీవులు.. నిశ్శబ్ధ హంతకులు..

Dangerous Animals List
Dangerous Animals List

Dangerous Animals List: ప్రాణాంతక జంతువులు అంటే చాలా మందికి సింహాలు, పులులు, మొసళ్లు వంటి వేటాడే జంతువులే గుర్తుకు వస్తాయి. కానీ ప్రకృతిలో కొన్ని జీవులు చడి చప్పుడు లేకుండా.. మనుషుల ప్రాణాలను తీయగలవు. కొన్ని విషపదార్థాల ద్వారా, మరికొన్ని వ్యాధులను వ్యాప్తి చేయడం ద్వారా, ఇంకొన్ని తమ చర్మం లేదా శరీరంలోని టాక్సిన్ల ద్వారా ప్రమాదాన్ని సృష్టిస్తాయి. ఈ జీవులు నిశ్శబ్దంగా పనిచేసే హంతకులుగా గుర్తింపు పొందాయి. అలాంటి వాటిలో ఈ ఐదింటి గురించి తెలుసుకుందాం..

దోమ
Mosquito పరిమాణంలో చిన్నదే అయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణమయ్యే జీవిగా దోమను భావిస్తారు. దోమలు నేరుగా విషం చిమ్మకపోయినా, మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా, జికా వైరస్, ఎల్లో ఫీవర్ వంటి ప్రమాదకర వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఈ వ్యాధుల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే దోమను ‘సైలెంట్ కిల్లర్’ అని కూడా పిలుస్తారు.

పఫర్ ఫిష్:
Pufferfish సముద్రంలో కనిపించే విచిత్రమైన చేపల్లో పఫర్ ఫిష్ ఒకటి. ప్రమాదం అనిపించినప్పుడు ఇది తన శరీరాన్ని బెలూన్‌లా ఉబ్బించుకుంటుంది. అయితే దీని అసలు ప్రమాదం శరీరంలోని ‘టెట్రోడోటాక్సిన్’ అనే విషపదార్థం. ఇది సైనైడ్ కంటే ఎన్నో రెట్లు ప్రమాదకరమైనదిగా పరిగణిస్తారు. సరైన విధంగా శుభ్రం చేయకుండా వండిన పఫర్ ఫిష్‌ను తింటే శరీరం క్రమంగా పక్షవాతానికి గురై మరణం సంభవించే అవకాశం ఉంటుంది.

గోల్డెన్ పాయిజన్ కప్ప:
Golden Poison Frog దక్షిణ అమెరికాలోని వర్షారణ్యాల్లో కనిపించే ఈ చిన్న కప్ప ప్రపంచంలోని అత్యంత విషపూరిత జీవుల్లో ఒకటి. దీని చర్మంపై ఉండే ‘బాట్రాకోటాక్సిన్’ అనే విషం నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పరిశోధకుల అంచనాల ప్రకారం.. ఒక గోల్డెన్ పాయిజన్ కప్పలో ఉండే విషం అనేక మంది మనుషులను చంపగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కేవలం చర్మాన్ని తాకడం ద్వారానే ప్రమాదం సంభవించే అవకాశం ఉండటంతో ఇది అత్యంత జాగ్రత్తగా చూడాల్సిన జీవిగా గుర్తించబడింది.

స్పిట్టింగ్ కోబ్రా :
Spitting Cobra సాధారణ నాగుపాముల మాదిరిగా కాటు వేయడమే కాకుండా, స్పిట్టింగ్ కోబ్రా తన విషాన్ని దూరం నుంచి చిమ్మగల ప్రత్యేక సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ విషం కళ్లలో పడితే తీవ్రమైన నొప్పి, చూపు కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. అవసరమైతే కాటు ద్వారా కూడా ప్రాణాంతక విషాన్ని శరీరంలోకి పంపుతుంది. అందుకే ఆఫ్రికా, ఆసియా ప్రాంతాల్లో ఈ పామును అత్యంత ప్రమాదకరమైన జాతిగా పరిగణిస్తారు.

రఫ్-స్కిన్న్డ్ న్యూట్:
Rough-skinned Newt ఉత్తర అమెరికాలో కనిపించే ఈ చిన్న ఉభయచర జీవి చూడటానికి హానికరంగా అనిపించదు. కానీ దీని చర్మంలో కూడా టెట్రోడోటాక్సిన్ అనే అత్యంత శక్తివంతమైన విషం ఉంటుంది. ఈ విషం నాడీ వ్యవస్థ పనితీరును దెబ్బతీసి శ్వాసకోశ వైఫల్యానికి దారితీయవచ్చు. ప్రకృతిలో శత్రువుల నుంచి రక్షించుకోవడానికి ఈ జీవి ఈ విషాన్ని ఉపయోగిస్తుంది.

‘ఆరుసెకన్ల’ఈ ప్రయోగంతో మైండ్ రిఫ్రెష్..

Relationship
Relationship

Relationship Tips: ‘ నేటి వేగవంతమైన జీవనశైలిలో భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ ఒకరితో ఒకరు గడిపే సమయం చాలా తగ్గిపోయింది. ఉదయం ఆఫీసుకు వెళ్లే హడావుడి, సాయంత్రం పనిభారం, మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా వంటి కారణాలతో భావోద్వేగ అనుబంధం క్రమంగా బలహీనపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దాంపత్య బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి ‘ఆరు సెకన్ల ముద్దు’ అనే సులభమైన పద్ధతిని రిలేషన్‌షిప్ నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆరు సెకన్ల పాటు కిస్ చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి?

సాధారణంగా చాలా మంది ఉదయం ఇంటి నుంచి బయలుదేరే ముందు భార్యకు లేదా భర్తకు త్వరత్వరగా ‘బై’ చెప్పి వెళ్లిపోతుంటారు. అయితే నిపుణుల ప్రకారం.. కేవలం ఒక క్షణం ఆగి భాగస్వామిని దగ్గరకు తీసుకుని, కళ్లలోకి ప్రేమగా చూస్తూ కనీసం ఆరు సెకన్ల పాటు ముద్దు పెట్టుకోవాలి. ఈ సమయంలో ఆఫీసు పనులు, సమావేశాలు లేదా ఇతర ఆలోచనల గురించి ఆలోచించకుండా పూర్తిగా ఆ క్షణాన్ని ఆస్వాదించాలని వారు సూచిస్తున్నారు.ఇలా చేస్తే కొత్త ఎనర్జీ వచ్చినట్లు అవుతుందని తెలుపుతున్నారు.

ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చాలామంది అలసటతో నేరుగా సోఫాలో కూర్చోవడం లేదా మొబైల్‌లో మునిగిపోవడం చేస్తుంటారు. కానీ ఇంటికి వచ్చిన వెంటనే చిరునవ్వుతో భాగస్వామిని పలకరించి, మరోసారి ఆరు సెకన్ల పాటు ప్రేమగా ముద్దాడితే రోజంతా ఉన్న ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది.

మనిషి ప్రేమగా కౌగిలించుకోవడం లేదా ముద్దు పెట్టుకోవడం సమయంలో శరీరంలో ‘ఆక్సిటోసిన్’ అనే హార్మోన్ విడుదల అవుతుంది. దీనిని ‘లవ్ హార్మోన్’ అని కూడా పిలుస్తారు. ఇది విశ్వాసాన్ని పెంచడమే కాకుండా ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఆరు సెకన్ల పాటు కొనసాగే ముద్దు ఈ హార్మోన్ విడుదలకు మరింత అనుకూలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ చిన్న ప్రేమపూర్వక చర్య దంపతులకు భావోద్వేగ శక్తిని అందిస్తుంది. ఎలా ఒక ఎనర్జీ డ్రింక్ శరీరానికి తాత్కాలిక ఉత్సాహాన్ని ఇస్తుందో, అలాగే ఆరు సెకన్ల ముద్దు మనసుకు ఆనందాన్ని, సానుకూల భావాలను అందిస్తుంది. దీంతో రోజంతా ఉత్సాహంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్నచిన్న అపార్థాలు, ఒత్తిడులు, పనిబారాలు సహజం. అయితే ప్రతిరోజూ కొన్ని సెకన్ల పాటు అయినా ప్రేమను వ్యక్తపరచడం వల్ల ఒకరిపై మరొకరికి ఉన్న అనుబంధం మరింత బలపడుతుంది. కమ్యూనికేషన్ మెరుగుపడటంతో పాటు భావోద్వేగ దూరం తగ్గే అవకాశం ఉంటుంది.

ఏపీకి ఇలాంటి భారీ బహుమానం వస్తుందని ఊహించలేదు

16th Finance Commission Funds
16th Finance Commission Funds

16th Finance Commission Funds: ఏపీకి మరోసారి తీపి కబురు చెప్పింది కేంద్రం. స్థానిక సంస్థలకు భారీగా నిధులు కేటాయించింది. 16వ ఆర్థిక సంఘం నిధులు ఏకంగా రూ.16,627 కోట్లు కేటాయింపులు చేసింది. ఇందులో బేసిక్ గ్రాండ్ రూ.13,302 కోట్లు, పెర్ఫార్మెన్స్ గ్రాంట్ రూ.3,225 కోట్లు ఉన్నాయి. 2026 – 27 నుంచి ఐదేళ్లపాటు అంటే 2030-31 వరకు ఈ నిధులు విడుదల చేయనుంది. గత ఐదేళ్లలో కేంద్రం రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.12,800 కోట్లు కేటాయించగా.. ఇప్పుడు 16వ ఆర్థిక సంఘం లో అదనంగా రూ.3,827 కోట్లు కేటాయించింది.

* ఐదేళ్ల పాటు నిధులు..
ఐదేళ్లపాటు 16వ ఆర్థిక సంఘం కొనసాగనుంది. అయితే ఈసారి ఖర్చు విషయంలో కీలక మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. పైడ్ నిధుల నుంచి 50% గ్రామాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యంలో ఘన వ్యర్ధాల నిర్వహణ కార్యక్రమాలకు ఖర్చు చేయాలని సూచించింది. 10% అన్ టైడ్ నిధుల నుంచి రోడ్ల నిర్మాణ పనులకు ఖర్చులు చేయాలని తెలిపింది. మిగిలిన నిధులను ఇతర అవసరాలకు కేటాయించాలని సూచించింది. ఇకనుంచి ఆర్థిక సంఘం నిధులను సిబ్బంది జీతభత్యాలకు వినియోగించకూడదు. కాగా ఈ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి గ్రామపంచాయతీలకు 70%, జిల్లా పరిషత్తులకు 15%, మండల పరిషత్తులకు మిగిలిన 15% నిధులను కేటాయించనున్నారు.

* సరికొత్త మార్గదర్శకాలు…
ఈసారి ఆర్థిక సంఘం నిధుల విడుదల, వినియోగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలను రూపొందించింది. స్థానిక సంస్థలకు సంబంధించిన ఆన్లైన్లో బ్యాంకు ఖాతాలు అందుబాటులో ఉంచాలి. ఈ గ్రామ్ స్వరాజ్ పోర్టల్ లో ఎప్పటికప్పుడు అభివృద్ధి ప్రణాళికలు అప్లోడ్ చేయాలి. నిధుల ఖర్చు వివరాలు కూడా తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే గత ఆర్థిక సంవత్సరం కంటే దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల సాయం ఏపీకి అదనంగా అందుతుండడం మాత్రం శుభపరిణామం. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ గుడ్ న్యూస్ చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఏపీకి రూ.7700 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే.

సాన్య అందాల విందు

Sanya Malhotra red look
Sanya Malhotra red look

 

మొన్న పాకిస్తాన్.. నిన్న బంగ్లాదేశ్.. ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు ఎందుకీ దుస్థితి..

Bangladesh vs Australia Series
Bangladesh vs Australia Series

Bangladesh vs Australia Series: క్రికెట్ గురించి ప్రస్తావన వస్తే కచ్చితంగా అందులో ఆస్ట్రేలియా జట్టుకు ప్రథమ స్థానం ఉంటుంది. ఇంగ్లాండ్లో క్రికెట్ పుట్టినప్పటికీ.. ఆ క్రీడలో ఆస్ట్రేలియా జట్టు తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించింది. బ్యాటింగ్.. బౌలింగ్.. ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాలలో సరికొత్త ప్రమాణాలను ఆస్ట్రేలియా జట్టు నెలకొల్పింది. వన్డే వరల్డ్ కప్ లను ఏకంగా ఆరుసార్లు సొంతం చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించింది ఆస్ట్రేలియా జట్టు.

అద్భుతమైన ప్లేయర్లతో నిండి ఉండే ఆస్ట్రేలియా జట్టు ఇప్పుడు తడబడుతోంది. కనీసం తమ జట్టు పేరును కూడా కలలో కూడా కలవరించడానికి భయపడే జట్ల చేతిలో ఊడిపోతుంది. దీంతో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఏమైంది అనే చర్చ మొదలైంది. ఆస్ట్రేలియా జట్టు 2023లో వన్డే వరల్డ్ కప్ సాధించింది. ఆ తర్వాత ఐసీసీ టోర్నీలలో ఆ స్థాయిలో సత్తా చూపించలేదు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీలో సత్తా చూపించలేకపోయింది. టి20 వరల్డ్ కప్ లో కూడా తన జోరు కొనసాగించలేకపోయింది. ఫలితంగా ఆస్ట్రేలియా క్రికెట్ మీద రకరకాల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇవన్నీ ఇలా సాగుతుండగానే ఆస్ట్రేలియా జట్టు దారుణమైన ఓటములను మూట కట్టుకోవాల్సి వస్తోంది.

ముఖ్యంగా వైట్ బాల్ ఫార్మేట్ లో ఆస్ట్రేలియా జట్టు పాకిస్తాన్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోయింది. అది కూడా పాకిస్తాన్ దేశంలో.. ఆస్ట్రేలియా బ్యాటర్లు ఏమాత్రం సత్తా చూపించలేదు ఆ సిరీస్లో. చివరికి బంగ్లాదేశ్ చేతిలో కూడా ఆస్ట్రేలియా జట్టు వన్డే సిరీస్ కోల్పోవాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్లు ఓడిపోయింది. దీంతో బంగ్లాదేశ్ తొలిసారిగా ఆస్ట్రేలియాపై అంతర్జాతీయ వన్డే సిరీస్ ట్రోఫీని అందుకుంది.. ఆస్ట్రేలియాపై దాదాపు 21 సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్ జట్టు తొలి వన్డే సిరీస్ దక్కించుకుంది.. ఆస్ట్రేలియా జట్టు చేతిలో గతంలో ఆడిన 4 వన్డే సిరీస్ లను బంగ్లాదేశ్ కోల్పోయింది. 2005లో ఇంగ్లాండ్ లో జరిగిన ట్రై సిరీస్లో ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ విజయం సాధించింది. 2021లో టి20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా మీద బాంగ్లాదేశ్ విజయం సాధించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు తొలి వన్డే సిరీస్ విజయాన్ని అందుకుంది.

బంగ్లాదేశ్ సిరీస్ ను ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ అంతగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. అందువల్లే మామూలు ప్లేయర్లను ఈ సిరీస్ కు పంపించింది. అయితే ఈ సిరీస్లో బంగ్లాదేశ్ ప్లేయర్లు కట్టుదిట్టంగా ఆడారు. ఆస్ట్రేలియా ప్లేయర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బ్యాటింగ్.. బౌలింగ్ చేశారు. దీంతో ఆస్ట్రేలియా తలవంచక తప్పలేదు. తొలి వన్డేలో ఓడిపోయిన ఆస్ట్రేలియా జట్టు.. రెండవ వన్డేలో కూడా ఓటమిపాలైంది. ఫలితంగా అనామకమైన బంగ్లాదేశ్ చేతిలో సిరీస్ కోల్పోవాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా జట్టు ఇటీవల పాకిస్తాన్ చేతిలో.. ఇప్పుడు బంగ్లాదేశ్ చేతిలో సిరీస్ కోల్పోవడం ఆ జట్టు అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. వన్డే ప్రపంచ కప్ ముందు ఆస్ట్రేలియా ఇలా ఆడటాన్ని ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఎన్డీఏతో జగన్ ది స్నేహమా? వైరమా?

YS Jagan Politics
YS Jagan Politics

YS Jagan Politics: జగన్మోహన్ రెడ్డి రాజకీయం వింతగా ఉంది. శత్రువు భాగస్వాములను మిత్రులుగా చూస్తున్నారు. నేను ఎన్డీఏ కూటమితో ఫైట్ చేయను. కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేయను. నా శత్రువు కేవలం చంద్రబాబు మాత్రమే అన్నట్టు ఆయన వ్యవహార శైలి ఉంది. చంద్రబాబును ప్రధాన శత్రువుగా ఫిక్స్ చేసి.. ఆయనకు మద్దతుగా నిలుస్తున్న పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి.. వీరిద్దరికీ సహకారం అందిస్తున్న బిజెపిని మాత్రం పెద్దన్నగా ఊహించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే జగన్ రాజకీయం చూసి జాతీయస్థాయిలో మిగతా రాజకీయ పార్టీలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. అంతెందుకు సొంత కేడర్ కు సైతం జగన్ చర్యలు విస్మయానికి గురిచేస్తున్నాయి. అసలు మనం యుద్ధం ఎవరితో చేస్తున్నాం? శత్రువు ఎవరు? అనే ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి జగన్ అడుగులు వేస్తున్నారు. అయితే జగన్ వైఖరి సొంత పార్టీ శ్రేణులతో పాటు జాతీయస్థాయిలో మిగతా రాజకీయ పార్టీలకు సైతం ఆశ్చర్యం కలగక మానదు.

* వారు వద్దంటున్నా..
ఏపీలో అధికారంలో ఉన్నది టిడిపి, జనసేన, బిజెపి లతో కూడిన ఎన్డీఏ ప్రభుత్వం. కానీ అదే జాతీయస్థాయి ఎన్డీఏలో తెలుగుదేశం కీలక భాగస్వామి. పరస్పర రాజకీయ ప్రయోజనాలు అందుకుంటున్నాయి ఆ మూడు పార్టీలు. కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై విపరీతమైన ద్వేష భావంతో రగిలిపోతున్న జగన్మోహన్ రెడ్డి వారితో భాగస్వాములుగా ఉన్న నరేంద్ర మోడీ, అమిత్ షాల పట్ల మాత్రం గొప్ప గౌరవభావంతో మెలుగుతున్నారు. ఇదేం రాజకీయమో చెప్పలేం. నీ స్నేహం వద్దు రా బాబు అంటూ కేంద్ర పెద్దలు పక్కన పెట్టిన జగన్ మాత్రం వారి వెంట పడుతూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ వింత రాజకీయం చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.

* అంతా సిల్లీ రాజకీయం..
రాష్ట్ర రాజకీయాలను సిల్లీ రాజకీయాలుగా మార్చేశారు జగన్మోహన్ రెడ్డి. ఏదో గ్రామస్థాయి రాజకీయం అన్నట్టు కూటమిలతో పనిలేదు, సిద్ధాంతాలతో పనిలేదు, భావాలతో పనిలేదు అన్నట్టు ఆయన వ్యవహార శైలి ఉంది. గతంలో రాజశేఖర్ రెడ్డి అయినా.. ఇప్పుడు చంద్రబాబు అయినా ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వాలతో పాటు వారి భాగస్వామ్య పక్షాలపై రాజీలేని పోరాటం చేసేవారు. కనీసం ఏపీకి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు విధులు పై గతంలో అధికార పార్టీలో ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేశారు. పైగా కేంద్రానికి అవసరం అయినప్పుడు రాజకీయ సహకారం అందించారు.

* పోరాడితేనే గుర్తింపు..
చంద్రబాబును వ్యతిరేకిస్తాను కానీ మోదీతో పాటు అమిత్ షాను ప్రేమిస్తాను అన్నట్టు ఉంది జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి. కేంద్ర పెద్దలు క్లియర్ కట్ గా తేల్చేశారు. తాము చంద్రబాబుతో సుదీర్ఘ పొత్తు ఉంటుందని ప్రకటించేశారు. పవన్ కళ్యాణ్ సైతం ఈ విషయంలో స్పష్టంగా ఉన్నారు. ఇటువంటి సమయంలో ఎన్డీఏకు వ్యతిరేకంగా గళం ఎత్తితేనే జగన్మోహన్ రెడ్డికి విలువ ఉంటుంది. రేపు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి ఎన్నికల ప్రచారం చేస్తే ఎన్డీఏకు మద్దతు ఇవ్వమని పిలుపునిస్తారే కానీ.. జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి అని చెప్పగలరా. ఆమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని సొంత పార్టీ వారే ఆవేదనతో ఉన్నారు. గత ఎన్నికల్లో ఇలాంటి వైఖరి వల్లే జగన్ దెబ్బతిన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక్క విషయాన్ని గుర్తించుకోవాలి. నాడు జాతీయస్థాయిలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వెళ్లారు కాబట్టి ప్రజలు గుర్తించారు. 2019 నుంచి 2024 మధ్య బిజెపితో స్నేహం చేశారు కాబట్టి ఆయన పోరాట పటిమ తగ్గి ప్రజలు వ్యతిరేకించారు. ఇప్పుడు కూడా ఆయన పోరాటం చేయకుండా.. చంద్రబాబును మాత్రమే వ్యక్తిగతంగా ప్రత్యర్థిగా చూస్తానంటే ప్రజలు గుర్తించే పరిస్థితి ఉండదు.