spot_img
Homeలైఫ్ స్టైల్Hypoglycemia in cows: పొలంలో గుండ్రంగా తిరిగిన ఆవు.. పూజలు చేసిన స్థానికులు.. కానీ ఏం...

Hypoglycemia in cows: పొలంలో గుండ్రంగా తిరిగిన ఆవు.. పూజలు చేసిన స్థానికులు.. కానీ ఏం జరిగిందంటే..

Hypoglycemia in cows: వ్యవసాయంలో పశువుల పాత్ర కీలకంగా ఉంటుంది. వీటిని ఇంట్లో కుటుంబ సభ్యుల్లుగా, దేవుళ్లుగా చూస్తుంటారు. అయితే ఒక్కోసారి వాటికి ఏదైనా ఆపద వస్తే వెంటనే వాటిని పెంచేవారు చలించిపోతుంటారు. ఉత్తరప్రదేశ్‌లోని శ్రావస్తి అనే జిల్లాలో ఓ ఆవు వరుసగా ఎనిమిది రోజుల పాటు పొలంలో గుండ్రంగా తిరుగుతూ ఉండటం స్థానికంగా సంచలనంగా మారింది. కొందరు దీనిని దైవలీలగా భావించి పూజలు కూడా ప్రారంభించారు. అయితే వెటర్నరీ వైద్యులు ఆవును పరీక్షించారు. ఆ తరువాత ఏం జరిగిందంటే?

ఆవు వరుసగా పొలంలో గుండ్రంగా తిరగడంపై వైద్యులు పరీక్షించగా.. అది హైపోగ్లైసీమియా (Hypoglycemia) అనే వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. హైపోగ్లైసీమియా అంటే రక్తంలో గ్లూకోజ్ (చక్కెర) స్థాయిలు సాధారణం కంటే ప్రమాదకరంగా తగ్గిపోవడం. మనుషుల్లోనే కాకుండా పశువుల్లో కూడా ఈ సమస్య కనిపిస్తుంది. గ్లూకోజ్ అనేది మెదడు, నరాలు, శరీర అవయవాలకు ప్రధాన శక్తి వనరు. రక్తంలో చక్కెర స్థాయి బాగా పడిపోతే మెదడుకు సరిపడా శక్తి అందక నరాల వ్యవస్థపై ప్రభావం పడుతుంది.

ఆవులకు ఈ వ్యాధి ఎలా వస్తుంది?
ఆవులకు సరైన మేత అందకపోవడం, ఎక్కువసేపు ఆకలితో ఉండటం వల్ల ఈ సమస్య వస్తుంది. అలాగే ప్రసవం తర్వాత శరీరంలో శక్తి అవసరాలు పెరగడంతో జీర్ణక్రియ సమస్యలు లేదా కొన్ని జీవక్రియ సంబంధిత వ్యాధుల కారణంగా హైపోగ్లైసీమియా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పాలిచ్చే ఆవుల్లో శరీరానికి అవసరమైన శక్తి కంటే వినియోగం ఎక్కువైతే ఈ సమస్య తలెత్తుతుంది.

గుండ్రంగా ఎందుకు తిరుగుతాయి?
రక్తంలో గ్లూకోజ్ తగ్గిపోవడం వల్ల మెదడులోని కొన్ని భాగాలు సరిగా పనిచేయవు. ఫలితంగా ఆవులు ఒకే దిశలో పదేపదే నడవడం, గుండ్రంగా తిరగడం, గోడలకు లేదా వస్తువులకు ఢీకొనడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. దీనిని వెటర్నరీ వైద్యులు న్యూరోలాజికల్ లక్షణంగా పరిగణిస్తారు. కొన్ని సందర్భాల్లో తల ఒకవైపుకు వంచడం, అస్థిరంగా నడవడం కూడా కనిపిస్తుంది. హైపోగ్లైసీమియాతో బాధపడే ఆవుల్లో బలహీనత, ఆకలి తగ్గడం, అలసట, వణుకులు, కళ్లలో మసకదృష్టి, అసహజ ప్రవర్తన, నిలబడలేకపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. తీవ్రమైన పరిస్థితుల్లో ఆవు కుప్పకూలిపోవడం, అపస్మారక స్థితిలోకి వెళ్లడం కూడా జరుగుతుంది.

ఈ వ్యాధి ప్రమాదకరమా?
సమయానికి గుర్తించి చికిత్స చేస్తే సాధారణంగా ఆవు పూర్తిగా కోలుకుంటుంది. కానీ నిర్లక్ష్యం చేస్తే మెదడు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. తీవ్రమైన హైపోగ్లైసీమియా వల్ల కోమా లేదా మరణం కూడా సంభవించవచ్చని వెటర్నరీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఆవు అసాధారణంగా ప్రవర్తిస్తే వెంటనే పశువైద్యుడిని సంప్రదించడం అత్యంత ముఖ్యం. ఇదే సమయంలో ఆవులకు సమతుల్య పోషకాహారం అందించడం, ఎక్కువసేపు ఆకలితో ఉంచకపోవడం, శుభ్రమైన నీరు ఇవ్వడం, ప్రసవం తర్వాత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ద్వారా ఈ సమస్యను చాలా వరకు నివారించవచ్చు. ఆవు అకస్మాత్తుగా గుండ్రంగా తిరగడం, తల వంచడం లేదా అసాధారణ ప్రవర్తన చూపిస్తే దాన్ని మూఢనమ్మకాలతో కాకుండా వైద్యపరమైన సమస్యగా గుర్తించి వెంటనే పరీక్షలు చేయించాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...
Oktelugu Epaper