Asus Zenbook Duo UX807 price: కొత్తగా ల్యాప్ టాప్ కొనాలని అనుకునేవారికి టెక్నాలజీ దిగ్గజం అసుస్ (Asus) మంచి డివైజ్ లా ఆదరణ పొందుతోంది. ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చిన అసుస్ జెన్‌బుక్ డుయో 2026 (Asus Zenbook Duo UX807) డ్యూయల్ స్క్రీన్ ల్యాప్‌టాప్ విభాగంలోనే అత్యంత ప్రాక్టికల్, పవర్‌ఫుల్ మోడల్‌గా పేరు తెచ్చుకుంది. ఇది సాధారణ ల్యాప్‌టాప్‌లా కనిపిస్తూనే.. అవసరమైనప్పుడు రెండు పూర్తి స్థాయి స్క్రీన్లుగా మారిపోయే ఈ అద్భుతమైన డివైజ్ గురించి పూర్తి వివరాలు మీకోసం..
అసుస్ జెన్‌బుక్ డుయో 2026 డిజైన్ ఎంతో మెరుగైంది. దీని బాడీని సిరామిక్, అల్యూమినియం కలిసిన మెటీరియల్‌తో తయారు చేశారు. దీనివల్ల ల్యాప్‌టాప్‌పై వేలిముద్రలు పడకుండా ఉంటాయి. అలాగే ఇది చూడటానికి చాలా ప్రీమియం లుక్‌తో పాటు గట్టిదనాన్ని ఇస్తుంది. మునుపటి మోడల్‌తో పోలిస్తే దీని సైజును 5 శాతం మేర తగ్గించారు. దీని బరువు దాదాపు 1.65 కేజీలు ఉంటుంది. ఇందులో అమర్చిన సరికొత్త ‘హైడ్‌అవే హింజ్’ వల్ల రెండు స్క్రీన్‌ల మధ్య ఉండే గ్యాప్ చాలా వరకు తగ్గిపోయి రెండు కలిపి ఒకే పెద్ద స్క్రీన్‌లా కనిపిస్తాయి.
ఈ ల్యాప్‌టాప్‌లో అత్యంత ప్రధానమైన ఆకర్షణ దీని రెండు 14 అంగుళాల టచ్ స్క్రీన్లు. ఈ రెండు స్క్రీన్లు కూడా 3K హై రిజల్యూషన్ తో అత్యంత స్మూత్ గా ఉంటాయి. ఇది 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుండడంతో ఈ డిస్‌ప్లేలు డాల్బీ విజన్ , HDR True Black 1000 సర్టిఫికేషన్ కలిగి ఉన్నాయి. 1000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను అందించే ఇవి క్రియేటర్లు, ఎడిటర్లు, మల్టీటాస్కింగ్ చేసేవారికి ఈ రెండు స్క్రీన్లు ఒకే నాణ్యతతో అద్భుతమైన విజువల్స్ ను అందిస్తాయి.
Asus Zenbook Duo UX807ను ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. అయస్కాంతాల సహాయంతో కింద ఉండే రెండవ స్క్రీన్‌కు ‘పోగో పిన్స్’ ద్వారా అతుక్కుంటుంది. కీబోర్డ్‌ను స్క్రీన్ మీద పెట్టినప్పుడు ఇది సాధారణ ల్యాప్‌టాప్‌లా పనిచేస్తుంది ఒకవేళ మనకు రెండు స్క్రీన్లు కావాలనుకుంటే, ఆ కీబోర్డ్‌ను విడదీసి పక్కన పెట్టుకుని బ్లూటూత్ ద్వారా వాడుకోవచ్చు. రెండు స్క్రీన్లు ఉన్నప్పటికీ బ్యాటరీ లైఫ్ విషయంలో అసుస్ ఎలాంటి రాజీ పడలేదు. ఇందులో 99 W భారీ బ్యాటరీని అమర్చారు. కేవలం ఒకే స్క్రీన్ వాడుకున్నప్పుడు ఇది దాదాపు 22 గంటల వీడియో ప్లేబ్యాక్ టైమ్‌ను, రెండు స్క్రీన్లను కలిపి వాడుకున్నప్పుడు కూడా దాదాపు 13 గంటల బ్యాటరీ లైఫ్‌ను ఇస్తుంది. ఈ బ్యాటరీ 100W టైప్ సి ఫాస్ట్ ఛార్జర్ కు సపోర్టు చేస్తుంది. భారతదేశంలో దీని ప్రారంభ ధర దాదాపు రూ. 2,99,990 గా ఉంది.
















అలాంటి పాత్ర కోసమే ఎదురు చూస్తున్నాను అంటూ కీర్తి సురేష్ హాట్ కామెంట్స్..
Keerthy Suresh Sensational Comments: ప్రస్తుత తరం లో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అందాలను ఆరబోసే హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. ఈ విషయం లో కొంతమంది అయితే హద్దులు కూడా దాటేశారు. అయితే అందాల ఆరబోత తో పాటు అద్భుతంగా నటించగల టాలెంట్ ఉన్న హీరోయిన్లు కూడా ఉన్నారు. వారిలో ఒకరే కీర్తి సురేష్. నేటి తరం హీరోయిన్స్ లో నేషనల్ అవార్డు ని సొంతం చేసుకున్న ఘనత కేవలం ఒక్క కీర్తి సురేష్ కి మాత్రమే సొంతం. ‘మహానటి’ చిత్రం లో ఆమె పోషించిన పాత్రకు కరగని హృదయం అంటూ ఉండదు. అంత అద్భుతంగా నటించింది. అయితే ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ కి అదే తరహా పాత్రలు మాత్రం దొరకడం లేదు. ఈమధ్య కాలం లో ఆమె చేసిన ప్రతీ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిలుస్తూ వచ్చింది.
అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తాను ఎలాంటి పాత్రలు కావాలని కోరుకుంటుందో చెప్పుకొచ్చింది. దీనిపై ఆమె మాట్లాడుతూ ‘నా కెరీర్ ఎన్ని సినిమాలు చేసినా , మహానటి లాంటి పాత్ర మాత్రం మరొకటి లేదు. చాలా ఛాలెంజింగ్ గా అనిపించినా ఈ పాత్రకు నాకు నేషనల్ అవార్డు కూడా దక్కింది. ఇలాంటి పాత్ర కోసమే నేను మళ్లీ ఎదురు చూస్తున్నాను. కానీ ఈమధ్య కాలం లో నాకు ఇలాంటి పాటలు రానందుకు కాస్త బాధగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ఆమెకు ఒక పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్ కూడా చెయ్యాలని ఉందట. గతంలో జగపతి బాబు హోస్ట్ గా వ్యవహరించిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అనే ప్రోగ్రాం కి వచ్చినప్పుడు ఈ కోరిక ని చెప్పుకొచ్చింది. వాస్తవానికి కీర్తి సురేష్ కెరీర్ విలన్ రోల్ తోనే మొదలైంది.
మలయాళం లో ఆమె ‘గీతాంజలి’ అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమె డ్యూయల్ రోల్ లో కనిపించింది , ఒక పాత్ర లో విలన్ గా కనిపించింది. ఇదే సినిమాని తెలుగు లో ప్రియమణి ‘చారులత’ పేరుతో రీమేక్ చేయగా, హిందీ లో బిపాసా బసు ‘ఎలోన్’ అనే పేరుతో రీమేక్ చేసింది. కానీ వీళ్ళెవ్వరూ కూడా కీర్తి సురేష్ యాక్టింగ్ ని మ్యాచ్ చేయలేకపోయారు. ఆ రేంజ్ లో ఆమె విలన్ క్యారెక్టర్ లో రెచ్చిపోయింది. ఇకపోతే ప్రస్తుతం ఆమె అనిల్ రావిపూడి దర్శకత్వం లో విక్టరీ వెంకటేష్ , కళ్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తున్న మల్టీస్టార్రర్ లో వెంకటేష్ కి జోడీగా నటించబోతుంది. వచ్చే నెల నుండి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు కానుంది.