Homeబిజినెస్iPhone 18 Pro Max update news: ఐఫోన్ 18 Pro Maxపై కొత్త అప్డేట్.....

iPhone 18 Pro Max update news: ఐఫోన్ 18 Pro Maxపై కొత్త అప్డేట్.. వెంటనే తెలుసుకోండి..

iPhone 18 Pro Max update news: ఐ ఫోన్ అంటే ఎవరికైనా ఇష్టమే. యాపిల్ కంపెనీ నుంచి ప్రతీ ఏడాది సెప్టెంబర్ లో కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తూ ఉంటుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఐఫోన్ 18 ప్రో మాక్స్ (iPhone 18 Pro Max) రాబోతున్నట్లు ఇప్పటికే ప్రచారం జరిగింది. అయితే ఈ ఫోన్ కు సంబంధించిన లీక్‌లు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఈ ఫోన్ కు సంబంధించిన కొన్ని చిత్రాలు బయటకు రావడంతో […]

iPhone 18 Pro Max update news: ఐ ఫోన్ అంటే ఎవరికైనా ఇష్టమే. యాపిల్ కంపెనీ నుంచి ప్రతీ ఏడాది సెప్టెంబర్ లో కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తూ ఉంటుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఐఫోన్ 18 ప్రో మాక్స్ (iPhone 18 Pro Max) రాబోతున్నట్లు ఇప్పటికే ప్రచారం జరిగింది. అయితే ఈ ఫోన్ కు సంబంధించిన లీక్‌లు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఈ ఫోన్ కు సంబంధించిన కొన్ని చిత్రాలు బయటకు రావడంతో ఇది ఎలా ఉంటుందో అంచనా వేస్తున్నారు. ఇది ఎలా ఉండబోతుందంటే..?

ఐఫోన్ 18 ప్రో మాక్స్ డిజైన్ పరంగా మునుపటి మోడల్స్ లాగే ప్రీమియం లుక్‌ను కలిగి ఉన్నప్పటికీ.. డిస్‌ప్లే భాగంలో కీలక మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్క్రీన్ పైభాగంలో ఉండే ‘డైనమిక్ ఐలాండ్’ సైజును ఈసారి దాదాపు 35 శాతం మేర తగ్గించినట్లు తెలుస్తోంది. ఫేస్ ఐడీకి సంబంధించిన కొన్ని సెన్సార్లను స్క్రీన్ లోపల అమర్చడం ద్వారా ఈ మార్పు సాధ్యమైందని సమాచారం. ఇక స్క్రీన్ సైజ్ ఎప్పటిలాగే 6.9 అంగుళాల LTPO OLED ప్యానెల్‌ ఉండనుంది.

ఈసారి కొత్త ఐఫోన్ లో అతిపెద్ద అప్‌గ్రేడ్ కెమెరా వి ఉండబోతోంది. ఆపిల్ చరిత్రలోనే మొదటిసారిగా మెయిన్ కెమెరాకు వేరియబుల్ అపెర్చర్ టెక్నాలజీని పరిచయం చేయనున్నారు. దీనివల్ల కాంతి తక్కువగా ఉన్నప్పుడు లేదా ఎక్కువగా ఉన్నప్పుడు లెన్స్ ఎంత కాంతిని తీసుకోవాలో యూజర్లే మాన్యువల్‌గా లేదా ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వారికి బాగా ఉపయోగపడుతుంది. దీంతో పాటు టెలిఫోటో లెన్స్ అపెర్చర్‌ను కూడా పెంచినట్లు తెలుస్తోంది.

ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఆపిల్ యొక్క నెక్స్ట్ జనరేషన్ A20 ప్రో ప్రాసెసర్‌తో పనిచేయనుంది. ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన TSMC 2 నానోమీటర్ ప్రాసెస్ టెక్నాలజీతో ఈ చిప్‌ను తయారు చేస్తున్నారు. దీనివల్ల మునుపటి ప్రాసెసర్లతో పోలిస్తే ఇది 15 శాతం వేగవంతమైన పర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది. దీంతో 30 శాతం మెరుగైన బ్యాటరీ సామర్థ్యాన్ని ఇస్తుంది.

ఈ ఫోన్ లో సరికొత్త బ్యాటరీ ఉన్నట్లు తెలుస్తోంది. 5,100mAh నుంచి 5,200mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చనున్నట్లు తెలుస్తోంది. ఈ బ్యాటరీ 2nm ప్రాసెసర్ల కాంబినేషన్ వల్ల ఈ ఫోన్ సింగిల్ ఛార్జ్‌తో సుదీర్ఘ కాలం పాటు ఉంటుంది. అయితే ఈ భారీ బ్యాటరీకి అధునాతన కెమెరా సెటప్ వల్ల ఫోన్ బరువు కొద్దిగా పెరిగి, దాదాపు 240 గ్రాములకు పైగా ఉండే అవకాశం ఉంది.

ఈసారి ఆపిల్ కొత్త ఫోన్ డార్క్ చెర్రీ కలర్ లో రానుంది. ఇది ఒక రకమైన డీప్ రెడ్ పర్పుల్ షేడ్స్ కలయికతో లగ్జరీ లుక్‌ను ఇస్తుంది. దీనితో పాటు క్లౌడ్ బ్లూ, సిల్వర్ , డార్క్ గ్రే కలర్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉండనున్నాయి. ఇందులో కనెక్టివిటీ కోసం ఆపిల్ సొంతంగా అభివృద్ధి చేసిన ‘C2 మోడెమ్’ను ఇందులో వాడుతున్నారు. దీంతో మెరుగైన 5G స్పీడ్‌తో పాటు శాటిలైట్ ఇంటర్నెట్ ఫీచర్లకు కూడా సపోర్ట్ చేయగలదని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper