spot_img
Homeబిజినెస్Samsung Foldable Phone Leak: సరికొత్త డిస్ ప్లే..పవర్ ఫుల్ ప్రాసెసర్.. Samsung ఫోల్డబుల్ వివరాలు...

Samsung Foldable Phone Leak: సరికొత్త డిస్ ప్లే..పవర్ ఫుల్ ప్రాసెసర్.. Samsung ఫోల్డబుల్ వివరాలు లీక్..

Samsung Foldable Phone Leak: మొబైల్ వినియోగదారులను ఎక్కువగా ఆకట్టుకునే శామ్‌సంగ్ (Samsung) కంపెనీ నుంచి ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లు మార్కెట్లోకి వస్తుంటాయి. ఇందులో భాగంగా లేటెస్ట్గా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ ను తీసుకురానుంది. త్వరలోనే జరగబోయే ‘గెలాక్సీ అన్‌ప్యాక్డ్’ ఈవెంట్‌లో కంపెనీ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 , జెడ్ ఫోల్డ్ 8 ఆల్ట్రా జెడ్ ఫ్లిప్ అనే మూడు మోడళ్లను పరిచయం చేయనుంది. అయితే, లాంచ్‌కు ముందే వీటికి సంబంధించిన కొన్ని వివరాలు బయటకు వచ్చాయి. ఈ ఫోన్లు ఎలా ఉంటాయంటే?

శాంసంగ్ కంపెనీ నుంచి మార్కెట్లోకి సరికొత్త డిజైన్‌తో బేస్ మోడల్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 రాబోతుంది. ఇప్పటివరకు వచ్చిన శామ్‌సంగ్ ఫోల్డ్ ఫోన్‌లు మూసి ఉన్నప్పుడు చాలా పొడవుగా, ఇరుగ్గా ఉండేవి. కానీ ఈసారి రాబోయే జెడ్ ఫోల్డ్ 8 మోడల్‌ను శామ్‌సంగ్ ‘వైడ్ డిజైన్’తో కనిపిస్తుంది. 5.4 అంగుళాల లోపలి డిస్‌ప్లేను కలిగి ఉండి.. ఓపెన్ చేసినప్పుడు 7.6 అంగుళాల వరకు పెరుగుతుంది. దీంతో వీడియోలు చూసేవారికి, టైపింగ్ చేసేవారికి అనుగుణంగా ఉంటుంది.

అలాగే ప్రీమియం లుక్ కోరుకునేవారికి గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 ఆల్ట్రా పాత క్లాసిక్ డిజైన్‌ను మరింత మెరుగుపరిచి తీసుకువస్తున్నారు. ఇది 6.5-ఇంచుల భారీ కవర్ డిస్‌ప్లే ఉండి ఓపెన్ చేస్తే 8.0-ఇంచుల అతిపెద్ద మెయిన్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. దీని అంచులు చాలా సన్నగా ఉంటాయి.. ఇందులో పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలిట్ జెన్ 5 ప్రాసెసర్, 5,000mAh బ్యాటరీఉంటుంది. ఈ బ్యాటరీకి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు చేస్తుంది.

స్టైలిష్ లుక్‌తో రానుంది గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 8. దీని డిస్‌ప్లేలో శామ్‌సంగ్ కీలక మార్పులు చేసింది. ఈసారి కవర్ స్క్రీన్‌పై కెమెరాల కోసం పొడవాటి సింగిల్ కటౌట్ ను డిజైన్ చేసినట్లు తెలుస్తంది. అంతేకాకుండా, స్క్రీన్‌ను మడతబెట్టినప్పుడు ముడత కనిపించకుండా ఉండేలా ‘క్రీజ్-ఫ్రీ’ టెక్నాలజీని ఇందులో వాడుతున్నట్లు సమాచారం. ఈ మోడల్ శామ్‌సంగ్ సొంత ఎక్సినోస్ 2600 చిప్‌సెట్‌తో వచ్చే అవకాశం ఉంది. సరికొత్త షేప్స్, అప్‌గ్రేడెడ్ ఫీచర్లతో రాబోతున్న ఈ మూడు ఫోన్‌లు ఫోల్డబుల్ మార్కెట్లో శామ్‌సంగ్ హవాను మరింత పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Lenin 2 Weeks Collections

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Jabardasth Naresh

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...
Jana Nayagan

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ కి సెన్సేషనల్ ఓపెనింగ్స్.. మ్యాట్నీ షోస్ వరకు వచ్చిన గ్రాస్...

Chennai Love Story: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ప్రీమియర్ షోస్ నుండి బ్లాక్...
Korean Kanakaraju

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ బడ్జెట్ 38 కోట్లు.. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఎన్ని కోట్లు...

Korean Kanakaraju: ప్రస్తుత ట్రెండ్ లో నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవడం చాలా కష్టమైన విషయం గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కరీనా లాక్ డౌన్ సమయం లో నిర్మాతలకు నాన్...
Oktelugu Epaper