Homeఆంధ్రప్రదేశ్‌Gnaneshwari missing case update: జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో మరో కీలక పరిణామం.. జీపీఎస్ కట్టిన...

Gnaneshwari missing case update: జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో మరో కీలక పరిణామం.. జీపీఎస్ కట్టిన కుక్క మృతి.. కేసులో ఏం జరుగుతోంది..

Gnaneshwari missing case update: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారం రోజులుగా తీవ్ర ఉత్కంఠకు దారితీసిన జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు మరో మలుపుతీసుకుంది. తప్పిపోయిన పాప కేసులో పురోగతి సాధించాలని పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసు పోలీసులకు సవాల్ గా మారింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఎంతో కీలకమైన కుక్క అనూహ్యంగా ట్విస్ట్ ఇచ్చింది. జ్ఞానేశ్వరి తప్పిపోయినప్పుడు.. ఆమె వెంట పెంపుడు కుక్క కూడా వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో ఆ కుక్క ద్వారా పాప […]

Gnaneshwari missing case update: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారం రోజులుగా తీవ్ర ఉత్కంఠకు దారితీసిన జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు మరో మలుపుతీసుకుంది. తప్పిపోయిన పాప కేసులో పురోగతి సాధించాలని పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసు పోలీసులకు సవాల్ గా మారింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఎంతో కీలకమైన కుక్క అనూహ్యంగా ట్విస్ట్ ఇచ్చింది.

జ్ఞానేశ్వరి తప్పిపోయినప్పుడు.. ఆమె వెంట పెంపుడు కుక్క కూడా వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో ఆ కుక్క ద్వారా పాప ఆచూకీ కనిపెట్టాలని పోలీసులు ప్రయత్నాలు చేశారు. కుక్క మెడలో జిపిఎస్ ట్రాకర్ ఏర్పాటు చేశారు. సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాల్లోకి పంపించారు. మనుషులు హడావిడి ఎక్కువగా ఉండడంతో ఆ కుక్క విపరీతంగా భయపడుతోంది. దీంతో ఆ కుక్కను బోనులో ఉంచారు. జ్ఞానేశ్వరి బయటికి వెళ్తున్నప్పుడు ఎవరూ చూడలేదు. పైగా ఆమె వెంట కుక్క మాత్రమే ఉంది. దీంతో పోలీసులు అత్యంత జాగ్రత్తగా దానిని చూసుకుంటున్నారు.

జ్ఞానేశ్వరి ఆచూకీ లభించకపోవడంతో ఆమె తల్లి గుండెలు పగిలే విధంగా రోదిస్తోంది. దీనికి తోడు ఆ కుక్కతో..”జానును తీసుకొస్తావా” అని అడిగింది. ఆ వీడియోలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తున్నాయి. అయితే ఆ కుక్క ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా చనిపోయింది. దీంతో పోలీసులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. కుక్క కూడా గడిచిన రెండు రోజులుగా విచిత్రంగా ప్రవర్తిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కేసును పోలీసులు అనేక కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు.

ఈ కేసులో ఎంతో కీలకమైన కుక్కను కావాలని కొంతమంది చంపేశారా.. లేదా అడవిలో తిరగడం వల్ల అలసటకు గురై చనిపోయిందా.. అనే కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. వారం రోజులైనప్పటికీ జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంతవరకు లభించలేదు. ఇది కుటుంబ సభ్యులను తీవ్రమైన కలవర పాటుకు గురి చేస్తోంది. పోలీసులు ఇప్పటికే చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకడం మొదలుపెట్టారు. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. జ్ఞానేశ్వరి బంధుమిత్రుల ఇంట్లో కూడా తనిఖీలు చేస్తున్నారు. చిన్నారి వారం క్రితం తప్పిపోవడం.. కేసులో కీలకమైన కుక్క చనిపోవడం.. అది కూడా అనుమానాస్పదంగా కన్నుమూయడంతో.. ఈ కేసును మరింత జటిలం చేస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper