spot_img
Homeఎంటర్టైన్మెంట్Peddi 9 days worldwide collections: 'పెద్ది' 9 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. బ్రేక్...

Peddi 9 days worldwide collections: ‘పెద్ది’ 9 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. బ్రేక్ ఈవెన్ కి ఇంకా ఎంత దూరంలో ఉందంటే..

Peddi 9 days worldwide collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ మూవీ జోరు బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా ఏ మాత్రం తగ్గలేదు. నేడు కూడా ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో గంటకు 12 వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. ఒక స్టార్ హీరో సినిమాకు వారం రోజులు దాటిన తర్వాత కూడా బుక్ మై షో యాప్ లో ఇలాంటి ట్రెండ్ ఉండడం చివరిసారిగా ‘ఓజీ’ చిత్రానికి చూశాము , మళ్లీ ఈ సినిమాకే చూస్తున్నాము. ఇకపోతే బాక్స్ ఆఫీస్ వద్ద దిగ్విజయంగా ఈ చిత్రం 9 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకొని 10 వ రోజు లోకి అడుగుపెట్టింది. ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న లెక్కల ప్రకారం ఈ చిత్రానికి 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 296 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ప్రాంతాల వారీగా ఈ సినిమాకు ఎంత వసూళ్లు వచ్చాయో ఇప్పుడు చూద్దాం.

నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి 48 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరగ్గా, 9 రోజుల్లో 48 కోట్ల 41 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి లాభాల్లోకి అడుగుపెట్టింది. అదే విధంగా సీడెడ్ ప్రాంతం లో ఈ చిత్రానికి దాదాపుగా 18 కోట్ల 44 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు ఈ 9 రోజుల్లో వచ్చాయి. ఇక ఉత్తరాంధ్ర ప్రాంతం లో అయితే ఈ సినిమా మొదటి రోజు నుండి ఏ మాత్రం జోరు తగ్గకుండా సంచలనాత్మక రికార్డులను నమోదు చేసుకుంది. ట్రేడ్ వర్గాలు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి 9 రోజుల్లో 19 కోట్ల 51 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. నేడు ఈ ప్రాంతం లో ప్రతితాత్మక 20 కోట్ల క్లబ్ లోకి చేరనుంది.

ఇక తూర్పు గోదావరి జిల్లా విషయానికి వస్తే 9 రోజుల్లో దాదాపుగా ఈ చిత్రానికి 11 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ ప్రాంతం లో కూడా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంది ఈ చిత్రం. అదే విధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 8 కోట్ల రూపాయిలు , గుంటూరు జిల్లాలో 11 కోట్ల 48 లక్షల రూపాయిలు , కృష్ణా జిల్లాలో 9 కోట్ల రూపాయిలు, నెల్లూరు జిల్లా లో 5 కోట్ల 12 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 131 కోట్ల 32 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 196 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక నుండి 13 కోట్ల 10 లక్షలు , తమిళనాడు + కేరళ నుండి 2 కోట్ల 3 లక్షలు , హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 10 కోట్ల 10 లక్షల రూపాయిలు ఓవర్సీస్ నుండి 21 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి , ఓవరాల్ గా 178 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు , 296 కోట్ల 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి మరో 41 కోట్ల 85 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Lenin 2 Weeks Collections

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Jabardasth Naresh

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...
Jana Nayagan

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ కి సెన్సేషనల్ ఓపెనింగ్స్.. మ్యాట్నీ షోస్ వరకు వచ్చిన గ్రాస్...

Chennai Love Story: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ప్రీమియర్ షోస్ నుండి బ్లాక్...
Korean Kanakaraju

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ బడ్జెట్ 38 కోట్లు.. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఎన్ని కోట్లు...

Korean Kanakaraju: ప్రస్తుత ట్రెండ్ లో నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవడం చాలా కష్టమైన విషయం గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కరీనా లాక్ డౌన్ సమయం లో నిర్మాతలకు నాన్...
Oktelugu Epaper