Home Blog Page 125

కౌంట్ డౌన్ స్టార్ట్.. త్వరలో విజయ్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం..

Vijay government collapse speculation
Vijay government collapse speculation

Vijay government collapse speculation: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కి ఇంటి పోరు కంటే బయటి పోరు అధికంగా ఉంది. అధికారాన్ని దక్కించుకునే స్థానాలు రాకపోయినప్పటికీ.. కాంగ్రెస్.. కమ్యూనిస్టులు.. కొంతమంది అన్నా డిఎంకె నేతల సపోర్టుతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సాఫీగా తన ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారు. పరిపాలనలో తన స్టైల్ మార్పులు చేపట్టుకుంటూ వెళ్తున్నారు.

కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ఆరు నెలల పాటు హనీమూన్ పీరియడ్ ఉంటుంది. అప్పటిదాకా ప్రతిపక్షాలు ఎటువంటి విమర్శలు చేయవు. ఆరు నెలల తర్వాత కూడా ప్రభుత్వ పరిపాలనలో ఎటువంటి మార్పులు రాకపోతే అప్పుడు విపక్షాలు విమర్శలు మొదలుపెడతాయి. ప్రభుత్వం మీద యుద్ధం చేస్తుంటాయి. నిరసనలు.. ఆందోళనలు చేపడుతుంటాయి.

తమిళనాడులో మాత్రం పరిస్థితి దీనికి విరుద్ధంగా కొనసాగుతోంది. ముఖ్యంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల వ్యవధిలోనే డీఎంకే అధినేత స్టాలిన్ విమర్శలు మొదలుపెట్టారు. చెన్నై నగర పరిధిలో జరిగిన పార్టీ సమావేశంలో విజయ్ మీద స్టాలిన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. విజయ్ ప్రభుత్వం కుప్పకూలిపోతుందని.. ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్టాలిన్ మాట్లాడిన మాటల పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు స్టాలిన్ అదే స్వరం తో మాట్లాడుతున్నారు.

ఇటీవల కాలంలో విజయ్ ప్రధానమంత్రిని కలిశారు. ఆ తర్వాత అమిత్ షాను కలవడానికి అపాయింట్మెంట్ ఉన్నప్పటికీ.. అకస్మాత్తుగా అమిత్ షా అపాయింట్మెంట్ రద్దు చేశారు. దీంతో విజయ్ వెను తిరిగి వచ్చారు. అయితే దీని వెనుక స్టాలిన్ ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇటీవల ఇండియా కూటమి నుంచి దూరం జరిగిన డీఎంకే బీజేపీకి దగ్గర అవుతున్నట్టు తెలుస్తోంది. అందువల్లే స్టాలిన్ విజయ్ ప్రభుత్వం కూలిపోతుందని వ్యాఖ్యానిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తెర వెనుక అమిత్ షా సపోర్ట్ చేస్తున్నారని.. అందువల్లే స్టాలిన్ ఇలా బరితెగించి మాట్లాడుతున్నారని టీవీకే నేతలు అంటున్నారు. తమిళనాడులో జరుగుతున్న పరిణామాలను ప్రజలు చూస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో డిఎంకేకు ప్రతిపక్ష హోదా కూడా రాదని వారు స్పష్టం చేస్తున్నారు. స్టాలిన్ విమర్శలపై ఇంతవరకు విజయ్ స్పందించలేదు.

చైనాలో చేతితో దాన్ని పట్టుకొని పదేపదే గీకుతున్నారు.. ఏమైంది.. ఎందుకిలా జరుగుతోంది

China online food delivery workers
China online food delivery workers

China online food delivery workers: చైనాలో ఏం జరిగినా సరే ప్రపంచానికి కాస్త ఆలస్యంగా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ప్రభుత్వ మీడియా మాత్రమే ఉంటుంది. చైనా ప్రభుత్వ అనుకూల వార్తలు మాత్రమే అక్కడ ప్రసారమవుతూ ఉంటాయి.. ప్రభుత్వానికి సంబంధించిన ఒక్క వ్యతిరేక వార్త కూడా బయటి ప్రపంచానికి తెలియదు. సోషల్ మీడియా మీద కూడా ఒక కన్ను ఉంటుంది. అందువల్లే అక్కడ ప్రజలు ఎటువంటి విషయాన్ని కూడా బయటికి పంచుకోవడానికి ఇష్టపడరు.. చివరికి చైనాలో భారీ వర్షాలు కురిసి.. విపరీతంగా నష్టం వాటిల్లితేనే రోజుల తర్వాత ఆ వార్త బయటకు తెలుస్తుంది. అంతటి కఠినమైన నిఘా చైనా దేశంలో ఉంటుంది.

చైనాలో కొంతకాలంగా అక్కడి గిగ్ వర్కర్లు తెగ తిప్పలు పడుతున్నారు. చేతిలో ఫోన్ పట్టుకొని తెగ గీకేస్తూ ఉన్నారు. దీని వెనక కారణం లేకపోలేదు. చైనాలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు చాలానే ఉంటాయి. కాకపోతే అక్కడ ఫుడ్ డెలివరీ చేయడానికి చాలామంది ఉంటారు. అయితే ఫుడ్ ఆర్డర్లు పెట్టుకునేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందువల్లే ఆర్డర్ కోసం అక్కడి వర్కర్లు తెగ తిప్పలు పడుతుంటారు. ఆర్డర్ రాగానే వెంటనే తమకే దక్కే విధంగా ఫోన్ అరచేతులలో పట్టుకొని పదేపదే గీకుతూ ఉంటారు. షాంగై నుంచి మొదలు పెడితే బీజింగ్ వరకు ఇదే పరిస్థితి.

మనదేశంలో అయితే అలా ఉండదు ఫుడ్ డెలివరీ చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటే.. ఫుడ్ ఆర్డర్ పెట్టే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అందువల్లే ఫుడ్ ఆర్డర్ పెట్టగానే.. వెంటనే డెలివరీ సంస్థలు యాక్సిస్ చేయలేవు. యాక్సిస్ చేసిన తర్వాతనే ఫలనా సమయానికి ఇస్తామని ఆ కంపెనీ సందేశం పంపుతుంది. మనదేశంలో గిగ్ వర్కర్లు చాలామంది ఉన్నారు. అయితే వారికి మించిన స్థాయిలో ఆన్లైన్లో చాలామంది ఆర్డర్లు పెడుతుండడంతో కొన్ని సందర్భాలలో సరైన సమయానికి ఆహారం డెలివరీ కాదు.

ఇటీవల కాలంలో మనదేశంలో ఇంట్లో వండడం తగ్గిపోయింది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తుంటే కచ్చితంగా వారు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటున్నారు. కేవలం ఫుడ్ మాత్రమే కాదు.. గ్రాసరీ నుంచి మొదలు పెడితే ఫ్రూట్స్ వరకు అన్ని ఆన్లైన్ లోనే ఆర్డర్ పెడుతున్నారు. చైనా ఈ స్థాయిలో డెవలప్ అయినప్పటికీ.. ప్రపంచ రెండవ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నప్పటికీ అక్కడి ప్రజలు ఇంటి వంటకే ప్రాధాన్యమిస్తున్నారు. వాళ్లకు మనకు ఎంత తేడా ఉందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.

చైనా దేశ ప్రజలు ఇంట్లో వంటకాలకే ప్రాధాన్యం ఇస్తారు. బయట తిండిని సాధ్యమైనంతవరకు ఇష్టపడరు. కాకపోతే కరోనా సమయంలో చైనా దేశ ప్రజలు తినే తిండి మీద రకరకాల విమర్శలు వచ్చినప్పటికీ.. అక్కడ దేశ ప్రజల ఆహారపు అలవాట్లు అలా ఉంటాయి. శతాబ్దాలుగా అక్కడి ప్రజలు అలానే తింటూ ఉంటారు. కాకపోతే కొంతమందికి ఇది నచ్చదు. వారు ఎలా తిన్నా సరే ఇంట్లోనే వండుకుంటారు. బయట తిండి చాలా పరిమితంగా తీసుకుంటారు.. కానీ మనదేశంలో అలా కాదు. ఇంట్లో వండడం తక్కువ.. బయట తినడం ఎక్కువ.. అందువల్లే ఈ స్థాయిలో రోగాలు వస్తున్నాయి.

హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ లో సత్తా చాటిన ఈ కంపెనీ.. టాప్ 5 కార్లు ఇవే..

Best hatchback cars in India
Best hatchback cars in India

Best hatchback cars in India: భారత ఆటోమొబైల్ మార్కెట్లో 2026 మే నెల కార్ల అమ్మకాల గణాంకాలు విడుదల కాగా, ప్రయాణికుల కార్ల విభాగంలో మారుతి సుజుకి మోడళ్లు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నాయి. ముఖ్యంగా హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లోని పలు మోడళ్లు భారీ వృద్ధిని నమోదు చేస్తూ వినియోగదారుల ఆదరణను పొందాయి. గత ఏడాదితో పోలిస్తే అనేక మోడళ్ల అమ్మకాలు గణనీయంగా పెరగడం విశేషం. ఇంతకీ ఆ కార్లు ఏవంటే?

అమ్మకాల జాబితాలో మొదటి స్థానాన్ని మారుతి సుజుకి బాలెనో కైవసం చేసుకుంది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌గా మంచి గుర్తింపు పొందిన ఈ కారు 2026 మే నెలలో 18,398 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో 11,618 యూనిట్లు మాత్రమే విక్రయించబడగా, ఈసారి భారీ వృద్ధిని సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఈ కారు ధర రూ.5.99 లక్షల నుంచి రూ.9.10 లక్షల వరకు విక్రయిస్తున్నారు.

రెండో స్థానంలో మారుతి వ్యాగన్ఆర్ నిలిచింది. కుటుంబాలకు అనువైన ఈ కారు మే నెలలో 18,076 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. 2025 మేలో 13,949 యూనిట్లుగా ఉన్న అమ్మకాలు ఈ ఏడాది గణనీయంగా పెరగడం ద్వారా వినియోగదారుల విశ్వాసాన్ని మరోసారి నిరూపించింది. దీనిని రూ. 5.00 లక్షల నుంచి రూ. 6.85 లక్షల వరకు విక్రయిస్తున్నారు.

మూడో స్థానంలో మారుతి స్విఫ్ట్ నిలిచింది. యువతను ఆకట్టుకునే డిజైన్, మెరుగైన మైలేజీ కారణంగా స్విఫ్ట్‌కు మంచి డిమాండ్ కొనసాగుతోంది. 2026 మేలో ఈ కారు 17,519 యూనిట్ల అమ్మకాలను నమోదు చేయగా, గత ఏడాది ఇదే సమయంలో 14,135 యూనిట్లు మాత్రమే విక్రయించబడ్డాయి. ఈ కారును రూ. 5.79 లక్షల నుంచి రూ. 8.50 లక్షల వరకు విక్రయిస్తున్నారు.

నాలుగో స్థానంలో ఆల్టో నిలిచింది. తక్కువ ధరలో అందుబాటులో ఉండే ఈ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ 2026 మేలో 9,887 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది మేలో కేవలం 4,970 యూనిట్లు మాత్రమే అమ్ముడవగా, ఈసారి దాదాపు రెట్టింపు స్థాయిలో విక్రయాలు జరగడం విశేషంగా చెప్పుకోవచ్చు.

ఐదో స్థానంలో ఎస్-ప్రెస్సో నిలిచింది. కాంపాక్ట్ ఎస్‌యూవీ తరహా డిజైన్‌తో ఆకట్టుకునే ఈ మోడల్ గత ఏడాది మేలో 1,806 యూనిట్ల అమ్మకాలను మాత్రమే నమోదు చేసింది. అయితే 2026 మే నాటికి అమ్మకాలు భారీగా పెరిగి 6,388 యూనిట్లకు చేరుకోవడం మార్కెట్లో ఈ కారు ఆదరణ పెరుగుతున్న సంకేతంగా భావిస్తున్నారు.

మొత్తంగా చూస్తే, 2026 మే నెలలో అత్యధికంగా అమ్ముడైన తొలి ఐదు కార్ల జాబితాలో మారుతి సుజుకి మోడళ్లే చోటు దక్కించుకోవడం విశేషం. పెరుగుతున్న డిమాండ్, మెరుగైన ఫీచర్లు, మంచి మైలేజీ మరియు అందుబాటు ధరలు ఈ కార్ల విజయానికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.

తృణమూల్ చీలిక ఢిల్లీలో ఆంధ్ర ప్రయోజనాల్ని దెబ్బతీస్తుందా?

Trinamool Congress crisis

Trinamool Congress crisis : రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు.. ఊహించలేరు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 200 కు పైగా బీజేపీకి సీట్లు వస్తాయని ఎవరూ ఊహించలేదు. మెజార్టీకి దగ్గరగా వస్తారని అనుకున్నారు కానీ ఇంత స్థాయిలో గెలుస్తుందని అనుకోలేదు.

అధికారం కోల్పోగానే తృణమూల్ కాంగ్రెస్ చీలిపోయి.. పార్టీ మమత నుంచి చేజారి ఇంతలా నీరుగారి పోయి పటాపంచలు అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఓటమి సహజం కానీ ఇలా దారుణంగా విచ్ఛిన్నం కావడం అనేది అసహజం..

తమిళనాడులో డీఎంకే ఓడినా ఇలా విచ్చిన్నం కాలేదు. కేరళలో పినరయి విజయ్ సీపీఎం ఓడినా ఇలా విచ్చిన్నం కాలేదు. వరుసగా మూడు దఫాలు గెలిచిన టీఎంసీ ఒక్కసారి ఓటమి చెందేసరికి.. అసలు ఎవరూ ఊహించనంత స్థాయిలో పతనమైంది. 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు గెలిస్తే 64 మంది మమత బెనర్జీపై తిరుగుబాటు ఎగురవేశారు. ఇక లోక్ సభలో టీఎంసీ ఎంపీల్లో 28లో 20 మంది తిరుగుబాటు చేశారు. రాజ్యసభలో ముగ్గురు రాజీనామా చేశారు. అధికారం పోగానే ఈ స్థాయిలో పతనమైన నాయకురాలు, పార్టీ మరొకరు లేరు. నిన్నటిదాకా మకుటం లేని మహారాణి.. నేడు అంటరాని , అప్రతిష్ట నాయకురాలుగా మారారు.

తృణమూల్ చీలిక ఢిల్లీలో ఆంధ్ర ప్రయోజనాల్ని దెబ్బతీస్తుందా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

గూగుల్ లో ఈ 5 టైప్ చేస్తే డేంజర్లో పడ్డట్లే..

Google search safety tips
Google search safety tips

Google search safety tips: ప్రస్తుత రోజుల్లో ఇంటర్నెట్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. ఏ సమాచారం కావాలన్నా క్షణాల్లో గూగుల్‌లో వెతికి తెలుసుకుంటున్నాం. అయితే కొన్ని రకాల సమాచారాన్ని నిర్లక్ష్యంగా వెతకడం లేదా నమ్మడం వల్ల సైబర్ మోసాలు, ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత డేటా చోరీ వంటి ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఐదు అంశాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వాటి వివరాల్లోకి వెళితె..

1. కస్టమర్ కేర్ నంబర్ల కోసం గూగుల్ సెర్చ్:
బ్యాంకులు, ఈ-కామర్స్ సంస్థలు లేదా ఇతర సేవలకు సంబంధించిన కస్టమర్ కేర్ నంబర్ల కోసం చాలామంది గూగుల్‌లో వెతుకుతుంటారు. అయితే సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్లు, ఫేక్ నంబర్లను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తుంటారు. ఆ నంబర్లకు కాల్ చేసిన తర్వాత OTPలు, బ్యాంక్ వివరాలు, డెబిట్ కార్డు సమాచారం అడిగి ఖాతాల్లోని డబ్బును దోచుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఎప్పుడూ అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే కస్టమర్ కేర్ నంబర్లను పొందాలి.

2. ఫ్రీ సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్లు:
‘ఫ్రీ వెర్షన్’, ‘క్రాక్ సాఫ్ట్‌వేర్’, ‘ప్రీమియం సాఫ్ట్‌వేర్ ఉచితం’ వంటి సెర్చ్‌లకు ఆకర్షితులవడం ప్రమాదకరం. ఇలాంటి లింకుల ద్వారా డౌన్‌లోడ్ చేసే ఫైళ్లలో వైరస్‌లు, మాల్వేర్ లేదా స్పైవేర్ దాగి ఉండే అవకాశం ఉంది. ఒకసారి కంప్యూటర్ లేదా మొబైల్‌లోకి ప్రవేశించిన తర్వాత అవి వ్యక్తిగత సమాచారం, పాస్‌వర్డ్‌లు, బ్యాంకింగ్ వివరాలను దొంగిలించవచ్చు. కాబట్టి ఎప్పుడూ అధికారిక వెబ్‌సైట్లు లేదా విశ్వసనీయ యాప్ స్టోర్ల నుంచే సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేయాలి.

3. స్వీయ వైద్యం కోసం:
చిన్న అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే గూగుల్‌లో సెర్చ్ చేసి తామే వ్యాధిని నిర్ధారించుకోవడం చాలా మంది అలవాటుగా మార్చుకున్నారు. అయితే ఒకే లక్షణం అనేక వ్యాధులకు సూచన కావచ్చు. ఇంటర్నెట్‌లో చదివిన సమాచారం ఆధారంగా మందులు వాడటం లేదా చికిత్స చేయించుకోవడం ప్రమాదకర పరిణామాలకు దారితీయొచ్చు. కొన్ని సందర్భాల్లో సరైన వైద్య చికిత్స ఆలస్యం కావడం వల్ల ప్రాణాపాయం కూడా ఏర్పడే అవకాశం ఉంది.

4. ఈజీగా డబ్బు సంపాదించే మార్గాలు:
‘రోజుకు లక్షలు సంపాదించండి’, ‘ఇంట్లో నుంచే భారీ ఆదాయం’, ‘ఒక్క క్లిక్‌తో డబ్బు’ వంటి ప్రకటనలు తరచూ కనిపిస్తుంటాయి. వీటిలో చాలా వరకు మోసపూరిత పథకాలు, నకిలీ పెట్టుబడి అవకాశాలు లేదా ఫిషింగ్ స్కామ్‌లు కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. త్వరగా సంపాదించాలనే ఆశతో వ్యక్తిగత వివరాలు లేదా డబ్బు చెల్లిస్తే భారీ నష్టాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.

5. వ్యక్తిగత సమాచారం కోసం సెర్చ్‌లు
తమ ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్‌వర్డ్‌లు లేదా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్‌లో వెతకడం కూడా ప్రమాదకరం. కొన్ని వెబ్‌సైట్లు ఈ వివరాలను పొందేందుకు మోసపూరిత ఫారమ్‌లు, నకిలీ లాగిన్ పేజీలను ఉపయోగిస్తాయి. ఒక్కసారి వివరాలు అందిస్తే హ్యాకర్లు వాటిని దుర్వినియోగం చేసి ఆర్థిక మోసాలకు పాల్పడే అవకాశం ఉంటుంది.

ఇంటర్నెట్ ఉపయోగించే ప్రతి ఒక్కరూ అధికారిక వెబ్‌సైట్లు మాత్రమే సందర్శించడం, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకపోవడం, OTPలు లేదా పాస్‌వర్డ్‌లను ఎవరికీ చెప్పకపోవడం, యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే రెండు దశల భద్రత (Two-Factor Authentication)ను యాక్టివేట్ చేసుకోవడం మంచిది.

చచ్చింది గొర్రె.. అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందం ఒప్పుకోం.. మా ఫైట్ మాదే.. అగ్రరాజ్యానికి ఇజ్రాయెల్ షాక్

Israel rejects Iran US peace agreement
Israel rejects Iran US peace agreement

Israel rejects Iran US peace agreement: ఇరాన్ – అమెరికా మధ్య జరిగిన శాంతి ఒప్పందం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా హర్హం వ్యక్తం అవుతుంది. పశ్చిమాసియా ఇక పీస్ గా ఉంటుంది అని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. అయితే ఈ విషయంలో ఇజ్రాయెల్ తన స్థానాన్ని స్పష్టంగా వెల్లడించింది షాక్ ఇచ్చింది. ఈ ఒప్పందంలో తాము భాగస్వాములం కాదని, దేశ భద్రతకు సంబంధించిన నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకుంటామని స్పష్టం చేసింది. అమెరికా, ట్రంప్‌ను గౌరవిస్తున్నప్పటికీ, ఈ ఒప్పందం తమ ప్రాధాన్యతలకు సంబంధం లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.

ఇజ్రాయెల్ స్వతంత్ర భద్రతా విధానం..
ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇటామర్ ద్వారా వచ్చిన ఈ ప్రకటన ఇజ్రాయెల్ ప్రాథమిక విధానాన్ని ప్రతిబింబిస్తోంది. దేశ భద్రత విషయంలో ఏ బాహ్య ఒప్పందం తమ నిర్ణయ స్వాతంత్ర్యాన్ని పరిమితం చేయకూడదని ఇజ్రాయెల్ భావిస్తోంది. ట్రంప్ కాలంలో జరిగిన ఈ ఒప్పందం విషయంలో తాము భాగం కాదని చెప్పడం ద్వారా, ఇజ్రాయెల్ తన లెక్కలు, ప్రాధాన్యతలు వేరే ఉన్నాయని సంకేతాలు ఇచ్చింది. ఇది ద్వైపాక్షిక సంబంధాలను గౌరవిస్తూ కూడా, భద్రతా విషయంలో ఏకపక్ష విధానాన్ని అనుసరించే సంకల్పాన్ని చూపుతోంది.

లెబనాన్ పై దాడులు..
లెబనాన్‌పై దాడులను కొనసాగించే సంకేతాలు ఇవ్వడం వల్ల శాంతి ఒప్పందం అమలుపై అనుమానాలు ఏర్పడ్డాయి. ఇజ్రాయెల్ తన సైనిక చర్యలను ఆపేందుకు సిద్ధంగా లేదని స్పష్టం చేయడం, ఒప్పందం ద్వారా ఆశించిన స్థిరత్వం సాధించడం కష్టమని సూచిస్తోంది. ఈ చర్యలు ఒప్పందం సాధించిన పురోగతిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. శాంతి ప్రక్రియలో తన సైనిక విధానాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా లేకపోవడం, ఒప్పందం వాస్తవ అమలును సవాల్ చేస్తోంది.

ప్రాంతీయ స్థిరత్వంపై ప్రభావం..
ఈ పరిణామం మధ్యప్రాచ్యంలో శాంతి ప్రయత్నాల సంక్లిష్టతను మరోసారి బయటపెడుతోంది. ఇజ్రాయెల్ తన భద్రతా నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకుంటుందని చెప్పడం వల్ల, బహుపక్ష ఒప్పందాలు మరింత సవాలుగా మారవచ్చు. అమెరికాతో సంబంధాలను గౌరవిస్తూ ఉండటంతో ద్వైపాక్షిక సహకారం కొనసాగవచ్చు, కానీ లెబనాన్ వంటి సమస్యలపై కొనసాగుతున్న చర్యలు మొత్తం ప్రాంతీయ స్థిరత్వాన్ని ప్రభావితం చేయవచ్చు. ఇజ్రాయెల్ భద్రతా విషయంలో ఏ ఒప్పందం తన స్వాతంత్ర్యాన్ని పరిమితం చేయకూడదనే దృఢ నిశ్చయాన్ని ప్రతిబింబిస్తోంది. ఇది శాంతి ప్రక్రియను మరింత సంక్లిష్టం చేసే అవకాశం ఉంది.

మొత్తంగా, ఈ పరిణామాలు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరియు భద్రతా సమస్యలను కొనసాగించే సూచనలుగా కనిపిస్తున్నాయి.

వారణాసి మూవీ షూటింగ్ కి మహేష్ బాబు డుమ్మా కొడుతున్నాడా..?

Mahesh Babu Varanasi shoot update
Mahesh Babu Varanasi shoot update

Mahesh Babu Varanasi shoot update: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమా భారీ అంచనాల మధ్య తెరకెక్కుతుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి పనిని రాజమౌళి చాలా దగ్గరుండి మరి చూసుకుంటున్నాడు. ఇక ఈ క్రమంలోనే కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవ్వనున్న నేపథ్యంలో రాజమౌళి మహేష్ బాబు తో చెప్పి ఈ సినిమాను స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. కానీ మహేష్ బాబు మాత్రం ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఈ ఎండలు తగ్గిన తర్వాత సినిమా షూటింగ్ పెట్టుకుంటే బాగుంటుందని రాజమౌళితో చెప్పారట. ఎట్టకేలకు రాజమౌళి సైతం మహేష్ పోర్షన్ ని పక్కన పెట్టి మిగిలిన ఆర్టిస్టులతో కొన్ని సన్నివేశాలను తీస్తున్నారట. ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకే పరిమితమైనప్పటికి వారణాసి సినిమాతో ప్రపంచ స్థాయి ఇమేజ్ ని సంపాదించుకోవడం పక్క అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మహేష్ బాబు రాజమౌళి లాక్ చేసిన షెడ్యూల్ ని ఇప్పుడు కొత్తగా మార్చడం లేదు. ఇంతకుముందు రెండుసార్లు కూడా ఆయన వెకేషన్ కి వెళ్లడం కోసం షెడ్యూల్ లో మార్పులు చేర్పులు చేశాడు.

రాజమౌళి ఇప్పటివరకు ఏ హీరోతో సినిమా చేసిన కూడా ఒకసారి షెడ్యూల్ వేశారు అంటే చాలా అందరూ దానిని బ్లైండ్ గా ఫాలో అయిపోతుండేవారు. కానీ మహేష్ బాబు విషయంలో మాత్రం జక్కన్న చాలా లూజ్ గా ఉంటున్నాడు. ఇంతకుముందు హీరోలతో ఉన్నట్టుగా స్ట్రిక్ట్ గా ఉండడం లేదంటూ కొన్ని వార్తలైతే వైరల్ అవుతున్నాయి.

ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తు బాక్సాఫీస్ బొనాంజా గా మిగులుతుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ఇక ఇప్పటివరకు ఎవ్వరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా రాజమౌళి సినిమాలకు ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపైతే లభిస్తుంది. మరోసారి తన దర్శకత్వ ప్రతిభ ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి రాజమౌళి విపరీతంగా కష్టపడుతున్నాడు…

హీరో రామ్ ని అవమానించిన యంగ్ హీరోయిన్.. షూటింగ్ నుండి వాకౌట్..

Ram Pothineni latest news
Ram Pothineni latest news

Ram Pothineni latest news: ఈమధ్య కాలం లో పాపం హీరో రామ్ పోతినేని కి అసలు ఏమి కలిసి రావడం లేదు. వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ వస్తున్నాయి. ఆయన గత చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కి ఆడియన్స్ నుండి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని , 40 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను కొల్లగొట్టిన రామ్ ని చూసి , ఎట్టకేలకు కుర్రాడు ఫార్మ్ లోకి వచ్చాడు, ఇక తన టాలెంట్ కి తగ్గ సినిమాలు చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ అది జరగలేదు , వరుస ఫెయిల్యూర్స్ తో అభిమానులను , ప్రేక్షకులను నిరాశపరుస్తూనే ఉన్నాడు. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన డైరెక్టర్ గా మారిపోయిన సంగతి తెలిసిందే.

తనని ఆకర్షించే కథలు రాకపోవడం తో , స్వయంగా ఆయనే ఒక కథని రాసుకున్నాడు. ముందుగా డైరెక్టర్స్ కోసం చాలా వెతికాడు , ఎవ్వరూ దొరక్కపోవడం తో స్వీయ దర్శకత్వం లోనే ఈ చిత్రం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు రామ్. ప్రస్తుతానికి ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ చిత్రం లో హీరోయిన్ పాత్ర కోసం కేజీఎఫ్ బ్యూటీ శ్రీ నిధి శెట్టి ని సంప్రదించారని , ఆమె కూడా ఈ చిత్రం లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో నటించడం కోసం శ్రీనిధి శెట్టి డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ కి షాకైన నిర్మాతలు ఆమెని ఈ చిత్రం నుండి తప్పించినట్టు తెలుస్తోంది. శ్రీనిధి శెట్టి గత చిత్రాలకు కోటి రూపాయిల కంటే తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటూ వచ్చేది. కానీ ఈ చిత్రానికి ఆమె ఏకంగా కోటిన్నర నుండి రెండు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట.

ప్రస్తుతం రామ్ కంటే తనకే ఎక్కువ క్రేజ్ ఉందని , తన వల్ల ఈ సినిమాకు చాలా ప్లస్ అవుతుంది కాబట్టే, ఈ రేంజ్ రెమ్యూనరేషన్ ని ఆమె డిమాండ్ చేసినట్టు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇది హీరో రామ్ స్టేటస్ కి అవమానం లాంటిదే అని చెప్పొచ్చు. సక్సెస్ ట్రాక్ లో లేకపోతే ఎవ్వరూ కూడా విలువ ఇవ్వరు , సందర్భాన్ని చూసి ఇలా డిమాండ్ చేస్తారు అనడానికి ఇదొక ఉదాహరణ. అయితే శ్రీనిధి శెట్టి ని ఈ చిత్రం నుండి తప్పించిన మేకర్స్, ‘డ్రాగన్’ ఫేమ్ కాయదు లోహర్ ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. యూత్ లో ప్రస్తుతం ఈమెకు మంచి క్రేజ్ ఉంది , అందంతో పాటు అద్భుతంగా నటించగల కెపాసిటీ ఉంది , రెమ్యూనరేషన్ కూడా తక్కువే అవ్వడం తో , ఆమెని లాక్ చేసినట్టు సమాచారం.

హీరోయిన్ రష్మిక కి తప్పిన ఘోర ప్రమాదం.. ఆమెని కాపాడిన మరో యంగ్ హీరోయిన్..వీడియో వైరల్..

Rashmika Kriti Sanon viral video
Rashmika Kriti Sanon viral video

Rashmika Kriti Sanon viral video: ఈమధ్య కాలం లో సినీ సెలబ్రిటీలు ఏదైనా ఈవెంట్స్ కి వచ్చినప్పుడు అభిమానుల నుండి ఎదురయ్యే అత్యుత్సాహం కారణంగా ఎలాంటి ఇబ్బందులను , పరిణామాలను ఎదురుకుంటున్నారో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. నిధి అగర్వాల్ కి గత ఏడాది జరిగిన సంఘటన ని అంత తేలికగా మరచిపోలేము. ‘రాజా సాబ్’ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లోని ‘లుల్లూ మాల్’ లో ఏర్పాటు చేసిన సాంగ్ లాంచ్ ఈవెంట్ కి విచ్చేసిన నిధి అగర్వాల్ అభిమానుల తాకిడి ని తట్టుకోలేకపోయింది. ఆ తోపులాట లో ఆమె బట్టలు కూడా చిరిగిపోయే పరిస్థితి ఏర్పడింది. సెక్యూరిటీ ఆమెని సురక్షితంగా కారు ఎక్కించడానికి ఎంతో ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇలాంటి సంఘటనలు ఆ తర్వాత సమంత , అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి, తమిళనాడు సీఎం విజయ్ , ఇలా ఎంతో మంది సినీ సెలబ్రిటీలకు జరిగింది.

ఇప్పుడు లేటెస్ట్ గా ప్రముఖ హీరోయిన్ , నేషనల్ క్రష్ రష్మిక మందాన విషయం లో కూడా జరగబోయింది, సమయానికి ఆమె తో పాటు ఉన్న మరో హీరోయిన్ కృతి సనన్ తేరుకొని రక్షించడం తో రష్మిక సురక్షితంగా బయటపడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే బాలీవుడ్ లో షాహిద్ కపూర్ హీరో గా నటించిన ‘కాక్ టైల్ 2’ చిత్రం ఈ నెల 19 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో రష్మిక, కృతి సనన్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సందర్భంగా ప్రొమోషన్స్ లో భాగంగా నిన్న వీళ్ళు ఒక షాపింగ్ మాల్ లో ఏర్పాటు చేసిన మ్యూజిక్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో ఈ ముగ్గురు నటీనటులు చూసేందుకు వేల సంఖ్యలో అభిమానులు విచ్చేసారు. ఆరంభం లో అంతా బాగానే ఉంది , అభిమానులతో వీళ్ళు కలిసి సరదాగా వడాపావ్ కూడా తిన్నారు. కానీ స్టేజి మీదకు వచ్చినప్పుడే అసలు సమస్య ఎదురైంది.

అభిమానులు బారికేడ్లను బద్దలు కొట్టుకొని స్టేజి మీదకు దూసుకొని రావడం మొదలు పెట్టారు. దీంతో తీవ్రమైన గందరగోళ వాతావరణం ఎదురైంది. హీరోయిన్ రష్మిక అయితే భయపడిపోయింది. అప్పుడు పక్కనే ఉన్న కృతి సనన్ రష్మిక కి రక్షణా కవచం లాగా మారిపోయింది. తన రెండు చేతులతో రష్మిక ని గట్టిగా హత్తుకొని , అభిమానుల తాకిడి నుండి కాపాడుతూ , జాగ్రత్తగా బయటకు తీసుకెళ్లింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అనుకోకుండా ఏర్పడిన ఈ గందరగోళం కారణంగా ఈవెంట్ ని మధ్యలోనే రద్దు చేయాల్సి వచ్చింది, హీరో షాహిద్ కపూర్ కూడా తీవమైన అసహనానికి గురయ్యాడు. ఇకపోతే హీరోయిన్ కృతి సనన్ రష్మిక పట్ల చూపించిన ప్రేమ, శ్రద్ద లపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి ప్రశంసల వర్షం కురుస్తోంది. అదే సమయం లో ఈవెంట్ నిర్వాహకులపై నెటిజెన్స్ మండిపడుతున్నారు.

అప్పట్లో 'మహర్షి'..ఇప్పుడు 'పెద్ది'.. మహేష్ , చరణ్ లక్ మామూలుగా లేదు..

Peddi Movie 11 Days Collections
Peddi Movie 11 Days Collections

Ram Charan Peddi movie Success: భారీ హైప్ ఉన్న సినిమాలకు ఓపెనింగ్స్ రావడం సహజమే, కానీ లాంగ్ రన్ రావాలంటే మంచి సీజన్ ఉండాలి. సీజన్ లో విడుదల అవ్వకపోతే ఎంత మంచి సూపర్ హిట్ సినిమాకు అయినా పొటెన్షియల్ కి తగ్గ కలెక్షన్స్ ఉండవు. అందుకు ది బెస్ట్ ఉదాహరణ గత ఏడాది విడుదలైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద 321 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. అయితే ఈ సినిమాకు లాంగ్ రన్ లో ఫ్రీ గ్రౌండ్ లేదు. ఈ చిత్రం విడుదలైన వారం రోజులకే ‘కాంతారా 2’ వంటి భారీ పాన్ ఇండియన్ చిత్రం విడుదలైంది. ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో చాలా వరకు ఓజీ కి రావాల్సిన వసూళ్లు , ఈ చిత్రానికి డివైడ్ అయ్యాయి.

అలా ‘ఓజీ’ చిత్రం థియేటర్స్ లో ఉన్నన్ని రోజులు ప్రతీ రోజు ఎదో ఒక సినిమా విడుదల అవుతూనే ఉండేది. ఆ కారణం చేత ఈ చిత్రం లాంగ్ రన్ పై చాలా బలమైన ప్రభావం పడింది. లేదంటే మరో 50 కోట్ల గ్రాస్ వసూళ్లు అదనంగా రాబట్టి ఉండేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అయితే ఓజీ లాగా కాకుండా , ఒక సినిమాకు భారీ లాంగ్ రావాలంటే , ఎలాంటి సీజన్స్ ఉండాలో ఉదాహరణగా నిలిచాయి ‘పెద్ది’, ‘మహర్షి’ చిత్రాలు అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు కూడా సమ్మర్ సీజన్ బాగా కలిసొచ్చింది. మరో జాక్ పాట్ ఏమిటంటే , ఈ రెండు సినిమాలకు పోటీ గా కనీసం మీడియం రేంజ్ సినిమాలు కూడా లేకపోవడం.

‘పెద్ది’ చిత్రం విడుదలై 11 రోజులు పూర్తి అయ్యింది. ఈ 11 రోజుల్లో ఈ చిత్రానికి పోటీ వచ్చిన సినిమా ఒక్కటి కూడా లేదు. రాబట్టాల్సిన వసూళ్లు మొత్తం ఈ 11 రోజుల్లోనే లాగేసింది , బయ్యర్స్ దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ సేఫ్ అయ్యారు. ఈ నెల 19 వరకు ‘పెద్ది’ కి తిరుగేలేదు. 19 న సమంత ‘మా ఇంటి బంగారం’ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమాకు భారీ థియేటర్స్ ఏ మాత్రం అవసరం లేదు కాబట్టి , పెద్ది చిత్రం వసూళ్లపై ఎలాంటి ప్రభావం చూపలేదు. జూన్ 25 న విడుదల అవ్వాల్సిన ‘లెనిన్’ కూడా వాయిదా పడింది. దీంతో ఈ నెల మొత్తం ‘పెద్ది’ కి తిరుగే లేకుండా పోయింది. సరిగ్గా ఇలాంటి సందర్భమే ‘మహర్షి’ చిత్రానికి ఎదురైంది. సమ్మర్ లో విడుదలైన ఈ చిత్రానికి పోటీ గా అప్పట్లో కనీసం చిన్న సినిమా కూడా రాలేదు , ఆడియన్స్ కి కేవలం ఈ సినిమా ఒక్కటే ఛాయస్ అవ్వడం తో లాంగ్ రన్ ఇరగకుమ్మేసింది. అలా సోలో సమ్మర్ సీజన్స్ లో ఈ ఇద్దరి హీరోల సినిమాలు విడుదల అవ్వడం వాళ్ళ అదృష్టం అనే చెప్పొచ్చు.

హీరోల కంటే విలన్స్ కి ఎక్కువ క్రేజ్ దక్కిన సినిమాలు ఇవేనా..?

Best Villain Performances
Best Villain Performances

Best Villain Performances: సినిమా ఇండస్ట్రీలో ఒక మూవీ సక్సెస్ అయితే ఆ హీరో క్రేజ్ తార స్థాయికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే హీరో స్క్రీన్ మీద కనిపిస్తాడు. కాబట్టి అతనికి ఎక్కువ మంది అభిమానులు ఏర్పడతారు. దాంతో పాటుగా ఆయన సినిమాలను చూడడానికి సైతం వాళ్ళు ఆసక్తి చూపించి మొదటి రోజు మొదటి షోనే సినిమాను చూసి అది సక్సెస్ అయ్యే విధంగా ప్రణాళికలు రూపొందిస్తారు. ఇక ఏది ఏమైనా కూడా సినిమా హీరోలతో పాటు కొన్ని సందర్భాల్లో దర్శకులకు కూడా మంచి గుర్తింపైతే వస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఒక సినిమా హీరో వల్ల కాకుండా విలన్ వల్ల కూడా సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఆ సినిమాలు ఏంటంటే…

రాజమౌళి దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన ఈగ సినిమాలో నాని కంటే కూడా కిచ్చా సుదీప్ కి చాలా మంచి గుర్తింపు వచ్చింది. ఆయన విలనిజానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మహేష్ బాబు హీరోగా ప్రకాష్ రాజు విలన్ గా నటించిన ‘ఒక్కడు’ సినిమా సక్సెస్ ని సాధించడంలో ప్రకాష్ రాజ్ కీలకపాత్ర వహించాడని అతని విలనిజం సినిమా మొత్తానికి హైలైట్ గా నిలిచిందని చాలామంది ఇప్పటికి చెబుతూ ఉంటారు. ఆ సినిమా వాళ్ళ ప్రకాష్ రాజ్ క్రేజ్ తార స్థాయికి వెళ్లిపోయింది…

రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధృవ’ సినిమాలో అరవింద్ స్వామి విలన్ క్యారెక్టర్ లో నటించాడు. ఆ పాత్ర చాలా స్టైలిష్ గా ఉండడమే కాకుండా రామ్ చరణ్ కంటే కూడా అరవింద్ స్వామికి మంచి ఆదరణ దక్కింది…

అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరైనోడు’ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ గా నటించాడు. ఒకరకంగా అల్లు అర్జున్ కంటే కూడా ఆది పినిశెట్టి కి ఈ సినిమా ద్వారా మంచి పాపులారిటి దక్కింది…

ఓటీటీ రివ్యూ : టినేజర్ల మర్డర్ కేస్ మిస్టరీ కి సొల్యూషన్ దొరికిందా..?

Raakh murder mystery
Raakh murder mystery

Raakh murder mystery: ప్రస్తుతం ఓటిటి కంటెంట్లకు విపరీతమైన క్రేజీ పెరుగుతుంది. ముఖ్యంగా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలకు ఓటిటి లో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలోనే అలాంటి జానర్ లో వచ్చిన ప్రతి సినిమా కూడా ఓటిటిలో పెను సంచలనాలను క్రియేట్ చేస్తున్నాయి. ఇక ఇప్పుడు రాక్ అనే ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ని చూడడానికి చాలా మంది ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుండటం విశేషం…

1970 వ సంత్సరంలో ఢిల్లీలో జరిగిన ఇద్దరు టీనేజీ అమ్మాయిల హత్య కేసు ఆధారంగా ఈ సిరీస్ ని తెరకెక్కించారు. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా అలీ ఫసల్ చేశారు. ఆయన ప్రతి సీన్ లో కూడా తన ఇంటెన్స్ నటనను చూపించాడు. ఆ క్యారెక్టర్ కి చాలా మంచి గుర్తింపైతే వస్తుంది…

యదార్థ సంఘటన ఆధారంగానే ఈ సినిమాను తెరకెక్కించడం వల్ల పత్రాలకు ఒరిజినల్ పేర్లు పెడతారని అందరూ అనుకున్నారు. కానీ ఆ పాత్రల పేర్లు మార్చి పెట్టారు. కానీ వాళ్ల కుటుంబంలోని ఎమోషనల్ సన్నివేశాలను మాత్రం పెట్టారు. దీనివల్ల సిరీస్ ను చూసే ప్రేక్షకులను ఎంగేజ్ చేయడానికి అవకాశమైతే దొరికింది…

ఇక ఈ సిరీస్ లోని కొన్ని సన్నివేశాలు చూస్తున్నంత సేపు ప్రేక్షకుడిని చాలా ఎక్సైజ్మెంట్ కి గురి చేస్తుంటాయి. సస్పెన్స్ తో కూడిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కావడం వల్ల ప్రతి సీను మనకు ఎంగేజింగ్ గానే ఉంటుంది. ఎమోషనల్ సన్నివేశాలను పెర్ఫెక్ట్ గా బోల్డ్ చేయడంలో కూడా దర్శకుడు చాలా వరకు సక్సెస్ అయ్యాడు.

మొత్తానికైతే యధార్థ కథ ఆధారంగా తెరకెక్కినప్పటికి ఈ సినిమాలో కొంతవరకు ఫిక్షన్ స్టోరీ అయితే జోడించి స్క్రీన్ ప్లే ను గ్రిప్పింగ్ గా రాసుకున్నారు. మొత్తానికైతే ఆమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ని చూడడానికి చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…

సీఎం విజయ్ - సంగీత విడాకుల వ్యవహారం పై షాకింగ్ ట్విస్టు ఇచ్చిన కోర్టు..

CM Vijay Sangeetha divorce case
CM Vijay Sangeetha divorce case

CM Vijay Sangeetha divorce case: తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్, సంగీత విడాకుల వ్యవహారం పై సోషల్ మీడియా లో గత రెండు మూడు రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని మనమంతా చూస్తూనే ఉన్నాం. విజయ్ తల్లి శోభా చంద్ర శేఖర్ , ఈ భార్య భర్తలు కలిపే బాధ్యతని భుజాన వేసుకొని , దిగ్విజయం గా చర్చలతో వాళ్ళిద్దరి మధ్య ఉన్న మనస్పర్థలు చెరిపేసి, ఒకటి చేసిందని, ఈ కారణం చేత లండన్ లో ఉన్న సంగీత ఇప్పుడు చెన్నై కి తిరిగి వచ్చేసిందని , సీఎం విజయ్ ఇంట్లోనే ఆమె ఉంటున్నట్టు వార్తలు వినిపించాయి. ఇందులో ఎంతో మాత్రం నిజముందో రాబోయే రోజుల్లో తెలుస్తుంది కానీ , వీళ్లిద్దరి విడాకుల వ్యవహారం ఇప్పటికీ కోర్టు లోనే ఉంది. ఎన్నికలకు ముందు సంగీత చెంగాలపట్టు ఫ్యామిలీ కోర్టులో, తనకు విజయ్ నుండి విడాకులు కావాలంటూ ఒక పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే.

ఈ పిటీషన్ పై నేడు చెంగాలపట్టు ఫ్యామిలీ కోర్టు విచారణ చేపట్టింది. ఎలాంటి తీర్పు వస్తుందో అని ఆసక్తి గా ఎదురు చూసిన అభిమానులకు నిరాశే మిగిలింది. ఎందుకంటే ఈ కేసుని ఆగస్టు 7 కి వాయిదా వేస్తున్నట్టు మహిళా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ విడాకుల వ్యవహారం గురించి తీర్పు కోసం మరో నెల రోజులకు పైగా ఎదురు చూడక తప్పదు. ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియా ప్రస్తుతం సీఎం విజయ్ కి సంబంధించి ఒక ఫోటో బాగా వైరల్ అయ్యింది. ఇందులో ఆయన తన భార్య సంగీత తో పాటు , పిల్లలతో కలిసి డిన్నర్ చేస్తున్నట్టుగా ఉంది. ఇది ప్రస్తుతానికి AI ద్వారా జెనెరేట్ చేసిన ఫోటో అయ్యుండొచ్చు , కానీ రాబోయే రోజుల్లో ఇది నిజం కాబోతుంది అంటూ విజయ్ అభిమానులు చెప్పుకొస్తున్నారు.

ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది, అయితే పాపం త్రిష పరిస్థితి ఏంటి ఇప్పుడు?, ప్రస్తుతం త్రిష తో విజయ్ సహజీవనం చేస్తున్నాడు అనేది నిజం. ఇద్దరూ ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించేశారు. ఎన్నికలకు ముందు వీళ్లిద్దరు జంటగా కలిసి ఒక పెళ్లి ఫంక్షన్ కి వెళ్లడం, అదే విధంగా ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత త్రిష అందరికంటే ముందు విజయ్ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేయడం, రీసెంట్ గా తమిళ సూపర్ స్టార్ అజిత్ తల్లి చనిపోయినప్పుడు విజయ్ తో జంటగా కలిసి త్రిష అజిత్ ఇంటికి వెళ్లడం వంటివి చాలానే జరిగాయి. బహిరంగంగానే వీళ్లిద్దరు ఇప్పుడు కలిసి తిరుగుతున్నారు. మరి భార్య సంగీత ని విజయ్ మళ్లీ తన జీవితం లోకి ఆహ్వానిస్తే త్రిష ని దూరం పెట్టేస్తాడా?, లేకపోతే త్రిష తర్వాతే తన భార్యకు ప్రాధాన్యత అన్నట్టుగా ఉంటాడా అనేది చూడాలి.

చెత్త అభిమానానికి.. శుభ్రం చేసి జపాన్ క్రమశిక్షణ నేర్పారు.. వైరల్ వీడియో

Japan fans cleaning stadium
Japan fans cleaning stadium

Japan fans cleaning stadium: జపాన్ ఆసియాలో దేశమే. కానీ ఎంత శుభ్రంగా ఉంటుందో. అక్కడ ప్రజలు పనిని ప్రేమిస్తుంటారు. శుభ్రంగా ఉండటాన్ని మరింత ఎక్కువగా ప్రేమిస్తుంటారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించరు. ప్రజారవాణాను ఎక్కువగా వాడుతుంటారు. తినేతిండి విషయంలో జాగ్రత్తగా ఉంటారు. సమయానికి తింటారు. సమయానికి పడుకుంటారు. ఇళ్లను ఎంతలా అయితే శుభ్రంగా ఉంచుకుంటారో.. వీధులను, చుట్టు పక్కల పరిసరాలను కూడా అదేస్థాయిలో శుభ్రంగా ఉంచుకుంటారు. అందుకే జపనీయులు ప్రపంచానికి ఆదర్శంగా ఉంటారు.

కేవలం ఇళ్లు, వీధులు, కార్యాలయాలను మాత్రమే కాదు, అవసరమైతే మైదానాలను కూడా శుభ్రం చేస్తారు జపనీయులు. ప్రస్తుతం ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ మెక్సికో, అమెరికా, కెనడా వేదికగా జరుగుతోంది. ఈ టోర్నీలో జపాన్ కూడా ఆడుతోంది. జపాన్ నెదర్లాండ్స్ జట్టుతో ఆడింది. ఈ మ్యాచ్ లో 2 -2 గోల్స్ నమోదుకావడంతో డ్రా అయింది. ఈ మ్యాచ్ చూసేందుకు జపాన్ అభిమానులు భారీగా మైదానానికి వచ్చారు. తమదేశ ఆటగాళ్లకు సపోర్ట్ ఇచ్చారు. మైదానంలో కేరింతలు కొట్టారు.

మ్యాచ్ డ్రా అయిన తర్వాత జపాన్ అభిమానులు మైదానంలో చెత్తను తొలగించారు. అంతేకాదు, సీట్లను కడిగారు. కూల్ డ్రింక్ సీసాలను, బీరు గ్లాస్ లను జాగ్రత్తగా ఏరి, ప్రత్యేకమైన సంచింలో భద్రపరిచారు.కొందరు అభిమానులు సీట్లను విరగొట్టారు. ఆ ముక్కలను జాగ్రత్తగా భద్రపరిచి సంచిలలో వేశారు.అంతేకాదు, స్టేడియంలో గ్లాసు ఫ్రేములను కూడా శుభ్రం చేశారు. అంతేకాదు, పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోకపోతే ఎలాంటి పరిణామాలను చవిచూడాల్సి వస్తుందో చేతల్లో చేసిచూపించారు.

జపాన్ అభిమానులు చేసిన పని సోషల్ మీడియాలో ప్రకంపనలు కలిగిస్తోంది. ఆటను ఆస్వాదించాలని, అభిమానులు ఇలా చెత్తను పోగు చేయకూడదని జపాన్ వాసులు పరోక్షంగా చెబుతున్నారు. చెత్తను పోగు చేయడం ద్వారా పరిసరాలకాలుష్యం పెరుగుతుందని, తద్వారా రకరకాల వ్యాధులు వస్తాయని, అలా రాకముందు జాగ్రత్తగా ఉండాలని జపాన్ వాసులు తమ చేతల ద్వారా నిరూపిస్తున్నారు. జపాన్ విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలోనే పరిసరాల పరిశుభ్రత గురించి పాఠాలు ఉంటాయి. చిన్నప్పటి నుంచే వారికి పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పిస్తారు.

ఒక్క రోజులో ఏకంగా 40 ఇంటర్వ్యూలు.. ఏం మాట్లాడావమ్మ సమంత..

Samantha 40 interviews in one day
Samantha 40 interviews in one day

Samantha 40 interviews in one day: ఒక చిత్రాన్ని ఎంత అద్భుతంగా తీశాము అనేది కాదు , ఆ చిత్రాన్ని ప్రేక్షకులకు ఎంత చేరువ చేశారు అనేది ముఖ్యం. సినిమా ఎంత బాగున్నప్పటికీ , పబ్లిసిటీ లేకపోవడం వల్ల, ప్రేక్షకులకు పలానా సినిమా విడుదల అయ్యింది అనే విషయం కూడా తెలియక డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిల్చిన చిత్రాలు చాలానే ఉన్నాయి. అలాంటి పరిస్థితి రాకూడదు కాబట్టే , విడుదలకు ముందు ఒక సినిమాకు పబ్లిసిటీ అత్యంత ముఖ్యం అని అంటుంటారు విశ్లేషకులు. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాకు అయినా సరే , పబ్లిసిటీ కారణంగా ఒక నాలుగు రూపాయిలు ఎక్కువ రావడమే కానీ , తక్కువ రావడం ఎక్కడ జరగలేదు. ఈ విషయం లో ప్రముఖ హీరోయిన్ సమంత ని ఎట్టి పరిస్థితిలోనూ మెచ్చుకోవలసిందే. ఆమె హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మా ఇంటి బంగారం’.

షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం , ఈ నెల 19 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ప్రొమోషన్స్ లో భాగంగా సమంత ఒకటి కాదు , రెండు కాదు, ఏకంగా 40 ఇంటర్వ్యూలు ఇచ్చినట్టు తెలుస్తోంది. టాలీవుడ్ హిస్టరీ లో ఇదొక అరుదైన రికార్డు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రం విడుదలకు ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది. ఈ నాలుగు రోజుల్లో ఈ 40 ఇంటర్వ్యూ లు యూట్యూబ్ లో అప్లోడ్ కానున్నాయి. వీటికి ఆడియన్స్ ఎంత వరకు కనెక్ట్ అవుతారో, సినిమాకు ఎలా ఉపయోగపడుతుందో చూడాలి. సమంత కేవలం ఇంటర్వ్యూస్ తో సరిపెట్టడం లేదు, జనాలకు ఈ చిత్రాన్ని ఎన్ని విధాలుగా దగ్గర చేసే మార్గాలు ఉన్నాయో, అన్ని మార్గాలను చేరుకుంటుంది. అందులో భాగంగా ఆమె టీవీ లో ప్రసారమయ్యే పాపులర్ ఎంటర్టైన్మెంట్ షోస్ లో కూడా ప్లాగొంతు ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తోంది.

నిన్ననే స్టార్ మా ఛానల్ లో పాపులర్ ఎంటర్టైన్మెంట్ షో ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ అనే షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ షోలో ఆమె కాసేపు యాంకర్ శ్రీముఖి తో కలిసి చేసిన సందడి హైలైట్ గా నిల్చింది. ఇలా ప్రొమోషన్స్ విషయం లో ఇంతటి డెడికేషన్ చూపిస్తున్న సమంత కి ఆడియన్స్ ఎలాంటి ఫలితం ఇవ్వబోతున్నారో చూడాలి. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించింది. గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘జబర్దస్త్’, ‘ఓ బేబీ’ వంటి చిత్రాలు వచ్చాయి. వీటిల్లో ‘ఓ బేబీ’ చిత్రం ఎంత పెద్ద కమర్షియల్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం కావడంతో మార్కెట్ లో ఈ చిత్రం పై అంచనాలు భారీ గానే ఉన్నాయి. దానికి తగ్గట్టుగా ప్రొమోషనల్ కంటెంట్ కూడా బాగుండడం తో కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్.

ఇరాన్-అమెరికా శాంతి ఒప్పందం.. కీలక అంశాలు ఇవే!

Iran America peace agreement
Iran America peace agreement

Iran America peace agreement: ఇరాన్-అమెరికా మధ్య సంఘర్షణలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. ఇటీవలి నెలల్లో లెబనాన్‌లోని హిజ్‌బుల్లా సంఘర్షణలు, హార్ముజ్ జలసంధి చుట్టూ ఉద్రిక్తతలు, అమెరికా నౌకాదళ దిగ్బంధనం వంటి అంశాలు ప్రాంతీయ స్థిరత్వాన్ని బాగా దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో అమెరికా ఇరాన్ మధ్య జరిగిన మెమోరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ (ఎం ఓ యూ) డ్రాఫ్ట్ ను మెహర్ న్యూస్ ఏజెన్సీ బయట పెట్టింది. ఇది ఒక కొత్త అధ్యాయానికి సంకేతంగా కనిపిస్తోంది.

ఒప్పందం ముఖ్య నిబంధనలు.
మెహర్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ డ్రాఫ్ట్‌లో అనేక కీలక అంశాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి..

– లెబనాన్‌తో సహా అన్ని రంగాల్లో వెంటనే శత్రుత్వాలు పూర్తిగా నిలిపివేయడం.
అమెరికా ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం మరియు సార్వభౌమత్వాన్ని గౌరవించడం.

– అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని 30 రోజుల్లోగా ఎత్తివేయడం.

– హార్ముజ్ జలసంధిని 30 రోజుల్లోగా ఇరాన్ అరేంజ్‌మెంట్లతో తిరిగి తెరవడం.

– ఇరాన్ పునర్నిర్మాణం కోసం అమెరికా, దాని మిత్రులు కనీసం 300 బిలియన్ డాలర్ల ప్రణాళికలు సమర్పించడం.

– ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా ఎన్ పీ టీ(న్యూక్లియర్ నాన్-ప్రొలిఫరేషన్ ట్రీటీ) నిబంధనలను పాటించడం.

– ఇరాన్‌కు చెందిన 24 బిలియన్ డాలర్ల ఫ్రోజెన్ ఫండ్స్‌ను విడుదల చేయడం.

– ఇవి కాకుండా, చమురు మరియు పెట్రోకెమికల్ ఎగుమతులపై సాంక్షన్లు తాత్కాలికంగా నిలిపివేయడం, 60 రోజుల చర్చల కాలం, మానిటరింగ్ మెకానిజం, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ రిజల్యూషన్ వంటి అంశాలు కూడా డ్రాఫ్ట్‌లో ఉన్నట్లు సమాచారం.

ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలు..
ఈ ఒప్పందం అమలైతే ఇరాన్‌కు ఆర్థికంగా పెద్ద ఊపిరి లభిస్తుంది. ఆంక్షల ఎత్తివేత, ఫండ్స్ విడుదల, పునర్నిర్మాణ సహాయం వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు కొంత ఊతం లభించవచ్చు. హార్ముజ్ జలసంధి తిరిగి తెరవడం వల్ల ప్రపంచ చమురు సరఫరా సాధారణ స్థితికి వచ్చి, ఆయిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మంచిది. ప్రాంతీయంగా లెబనాన్‌లో యుద్ధం ముగింపు ఒక పెద్ద ఉపశమనం. ఇది హిజ్‌బుల్లా-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలను తగ్గించి, సిరియా, యెమెన్ వంటి ఇతర సంఘర్షణలపైనా పరోక్ష ప్రభావం చూపవచ్చు. అమెరికా-ఇరాన్ మధ్య నేరుగా చర్చలు జరగడం అనేది రెండు దేశాల మధ్య నమ్మకం నిర్మాణానికి మొదటి అడుగు కావచ్చు.

ఒప్పందం అమలైతే చైనా, రష్యా వంటి దేశాల ప్రభావం మధ్యప్రాచ్యంలో తగ్గవచ్చు లేదా మారవచ్చు. అమెరికా తన దృష్టిని ఇతర ప్రాంతాలకు మరల్చవచ్చు. అయితే, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా వంటి మిత్రుల అభిప్రాయాలు కూడా ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ మార్కెట్లు, షిప్పింగ్, ఇన్వెస్ట్‌మెంట్లు ఈ పరిణామాలను బట్టి మారవచ్చు. ఇప్పటికే కొన్ని నివేదికల ప్రకారం ఆయిల్ ధరలు తగ్గడం ప్రారంభమైంది. కానీ దీని విజయం పూర్తిగా అమలు, నమ్మకం నిర్మాణం, అన్ని పక్షాల సహకారంపై ఆధారపడి ఉంది. జూన్ 19న స్విట్జర్లాండ్‌లో సంతకం కార్యక్రమం జరగవచ్చని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

భారత్ పాక్ మ్యాచ్.. మైదానంలో ఆటగాళ్ల ఫైట్.. ఏం చేశారురా బాబూ

Harmanpreet Kaur-Fatima Sana
Harmanpreet Kaur-Fatima Sana
Harmanpreet Kaur-Fatima Sana: భారత్, పాకిస్థాన్ మధ్య టీ20 వరల్డ్ కప్ లో భాగంగా మ్యాచ్ జరిగింది. ఇంగ్లాండ్ లోని ఎడ్జ్ బాస్టన్ వేదిక జరిగిన ఈ పోరులో భారత్ అద్భుతమైన విజయం అందుకుంది. తద్వరా చిరకాల ప్రత్యర్థి మీద తనకు తిరుగులేదనిపించుకుంది. తన విజయాల రికార్డును మరింత బలోపేతం చేసుకుంది. టీమిండియా విజయంసాధించిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రశంసలు హోరెత్తిపోతున్నాయి. హర్మన్ ప్రీత్ కౌర్ నైతే అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. గతంలో టీమిండియాకు వన్డే వరల్డ్ కప్ అందించిందని, ఇప్పుడు ఏకంగా టీ 20 వరల్డ్ కప్ కూడా అందిస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు.

టీమిండియా విజయం సాధించేవిధంగా కౌర్ అనేక ప్రణాళికలు రూపొందించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాలలో జట్టును ముందు వరసలో నిలిపింది. తద్వారా టీమిండియా తిరుగులేని అధిపత్యాన్ని కొనసాగించింది. అంతేకాదు, పాకిస్థాన్ జట్టుకు ఏ దశలో కూడా గెలిచే అవకాశం లేకుండా ఆడింది. పాకిస్థాన్ జట్టు ఓడిపోవడంతో ఆ జట్టు మీద సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ గెలిచేదే. ప్రారంభంలో అద్బుతంగా ఆడింది. ఆతర్వాత చేతులెత్తేసింది. దీంతో పాకిస్థాన్ ఓడిపోవాల్సి వచ్చింది,

భారత్ గెలిచిన తర్వాత రకరకాల వీడియాలో సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. కొంతమంది ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను ఉపయోగించి రకరకాల వీడియాలు రూపొందిస్తున్నారు. ఆ వీడియోలలో భారత్, పాకిస్థాన్ ప్లేయర్లు మైదానంలో కొట్టుకున్నట్టు, ఒకరిమీద మరొకరు దాడి చేసినట్టు రూపొందించారు. దీంతో ఇదంతా నిజమేనా అని కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. అయితే మ్యాచ్ మొత్తం చూసిన వారు ఇదంతా అబద్ధమని కామెంట్లు చేస్తున్నారు.

వాస్తవానికి భారత జట్టు కెప్టెన్ కనీసం పాకిస్థాన్ కెప్టెన్ కు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. మాటవరసకైనా మాట్లడలేదు. అలాంటప్పుడు మన అమ్మాయిలు పాకిస్థాన్ ప్లేయర్లతో ఎలా గొడవపడతారు? ఇది సాధ్యంకాదు..ఇది ముమ్మాటికీ కొంతమంది టెక్నాలజీతో రూపొందించిన వీడియో. దీన్నిసరదాగా చూసి వదిలేయాలి. అదే నిజమని అనుకుంటే మాత్రం ఇబ్బందిపడక తప్పదని సోషల్ మీడియాలో నెటిజన్లు పేర్కొంటున్నారు.