Homeఎంటర్టైన్మెంట్Samantha 40 interviews in one day: ఒక్క రోజులో ఏకంగా 40 ఇంటర్వ్యూలు.. ఏం...

Samantha 40 interviews in one day: ఒక్క రోజులో ఏకంగా 40 ఇంటర్వ్యూలు.. ఏం మాట్లాడావమ్మ సమంత..

Samantha 40 interviews in one day: ఒక చిత్రాన్ని ఎంత అద్భుతంగా తీశాము అనేది కాదు , ఆ చిత్రాన్ని ప్రేక్షకులకు ఎంత చేరువ చేశారు అనేది ముఖ్యం. సినిమా ఎంత బాగున్నప్పటికీ , పబ్లిసిటీ లేకపోవడం వల్ల, ప్రేక్షకులకు పలానా సినిమా విడుదల అయ్యింది అనే విషయం కూడా తెలియక డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిల్చిన చిత్రాలు చాలానే ఉన్నాయి. అలాంటి పరిస్థితి రాకూడదు కాబట్టే , విడుదలకు ముందు ఒక సినిమాకు పబ్లిసిటీ […]

Samantha 40 interviews in one day: ఒక చిత్రాన్ని ఎంత అద్భుతంగా తీశాము అనేది కాదు , ఆ చిత్రాన్ని ప్రేక్షకులకు ఎంత చేరువ చేశారు అనేది ముఖ్యం. సినిమా ఎంత బాగున్నప్పటికీ , పబ్లిసిటీ లేకపోవడం వల్ల, ప్రేక్షకులకు పలానా సినిమా విడుదల అయ్యింది అనే విషయం కూడా తెలియక డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిల్చిన చిత్రాలు చాలానే ఉన్నాయి. అలాంటి పరిస్థితి రాకూడదు కాబట్టే , విడుదలకు ముందు ఒక సినిమాకు పబ్లిసిటీ అత్యంత ముఖ్యం అని అంటుంటారు విశ్లేషకులు. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాకు అయినా సరే , పబ్లిసిటీ కారణంగా ఒక నాలుగు రూపాయిలు ఎక్కువ రావడమే కానీ , తక్కువ రావడం ఎక్కడ జరగలేదు. ఈ విషయం లో ప్రముఖ హీరోయిన్ సమంత ని ఎట్టి పరిస్థితిలోనూ మెచ్చుకోవలసిందే. ఆమె హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మా ఇంటి బంగారం’.

షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం , ఈ నెల 19 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ప్రొమోషన్స్ లో భాగంగా సమంత ఒకటి కాదు , రెండు కాదు, ఏకంగా 40 ఇంటర్వ్యూలు ఇచ్చినట్టు తెలుస్తోంది. టాలీవుడ్ హిస్టరీ లో ఇదొక అరుదైన రికార్డు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రం విడుదలకు ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది. ఈ నాలుగు రోజుల్లో ఈ 40 ఇంటర్వ్యూ లు యూట్యూబ్ లో అప్లోడ్ కానున్నాయి. వీటికి ఆడియన్స్ ఎంత వరకు కనెక్ట్ అవుతారో, సినిమాకు ఎలా ఉపయోగపడుతుందో చూడాలి. సమంత కేవలం ఇంటర్వ్యూస్ తో సరిపెట్టడం లేదు, జనాలకు ఈ చిత్రాన్ని ఎన్ని విధాలుగా దగ్గర చేసే మార్గాలు ఉన్నాయో, అన్ని మార్గాలను చేరుకుంటుంది. అందులో భాగంగా ఆమె టీవీ లో ప్రసారమయ్యే పాపులర్ ఎంటర్టైన్మెంట్ షోస్ లో కూడా ప్లాగొంతు ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తోంది.

నిన్ననే స్టార్ మా ఛానల్ లో పాపులర్ ఎంటర్టైన్మెంట్ షో ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ అనే షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ షోలో ఆమె కాసేపు యాంకర్ శ్రీముఖి తో కలిసి చేసిన సందడి హైలైట్ గా నిల్చింది. ఇలా ప్రొమోషన్స్ విషయం లో ఇంతటి డెడికేషన్ చూపిస్తున్న సమంత కి ఆడియన్స్ ఎలాంటి ఫలితం ఇవ్వబోతున్నారో చూడాలి. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించింది. గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘జబర్దస్త్’, ‘ఓ బేబీ’ వంటి చిత్రాలు వచ్చాయి. వీటిల్లో ‘ఓ బేబీ’ చిత్రం ఎంత పెద్ద కమర్షియల్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం కావడంతో మార్కెట్ లో ఈ చిత్రం పై అంచనాలు భారీ గానే ఉన్నాయి. దానికి తగ్గట్టుగా ప్రొమోషనల్ కంటెంట్ కూడా బాగుండడం తో కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper