Homeక్రీడలుక్రికెట్‌Harmanpreet Kaur-Fatima Sana: భారత్ పాక్ మ్యాచ్.. మైదానంలో ఆటగాళ్ల ఫైట్.. ఏం చేశారురా బాబూ

Harmanpreet Kaur-Fatima Sana: భారత్ పాక్ మ్యాచ్.. మైదానంలో ఆటగాళ్ల ఫైట్.. ఏం చేశారురా బాబూ

Harmanpreet Kaur-Fatima Sana: భారత్, పాకిస్థాన్ మధ్య టీ20 వరల్డ్ కప్ లో భాగంగా మ్యాచ్ జరిగింది. ఇంగ్లాండ్ లోని ఎడ్జ్ బాస్టన్ వేదిక జరిగిన ఈ పోరులో భారత్ అద్భుతమైన విజయం అందుకుంది. తద్వరా చిరకాల ప్రత్యర్థి మీద తనకు తిరుగులేదనిపించుకుంది. తన విజయాల రికార్డును మరింత బలోపేతం చేసుకుంది. టీమిండియా విజయంసాధించిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రశంసలు హోరెత్తిపోతున్నాయి. హర్మన్ ప్రీత్ కౌర్ నైతే అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. గతంలో టీమిండియాకు వన్డే వరల్డ్ […]

Harmanpreet Kaur-Fatima Sana: భారత్, పాకిస్థాన్ మధ్య టీ20 వరల్డ్ కప్ లో భాగంగా మ్యాచ్ జరిగింది. ఇంగ్లాండ్ లోని ఎడ్జ్ బాస్టన్ వేదిక జరిగిన ఈ పోరులో భారత్ అద్భుతమైన విజయం అందుకుంది. తద్వరా చిరకాల ప్రత్యర్థి మీద తనకు తిరుగులేదనిపించుకుంది. తన విజయాల రికార్డును మరింత బలోపేతం చేసుకుంది. టీమిండియా విజయంసాధించిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రశంసలు హోరెత్తిపోతున్నాయి. హర్మన్ ప్రీత్ కౌర్ నైతే అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. గతంలో టీమిండియాకు వన్డే వరల్డ్ కప్ అందించిందని, ఇప్పుడు ఏకంగా టీ 20 వరల్డ్ కప్ కూడా అందిస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు.

టీమిండియా విజయం సాధించేవిధంగా కౌర్ అనేక ప్రణాళికలు రూపొందించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాలలో జట్టును ముందు వరసలో నిలిపింది. తద్వారా టీమిండియా తిరుగులేని అధిపత్యాన్ని కొనసాగించింది. అంతేకాదు, పాకిస్థాన్ జట్టుకు ఏ దశలో కూడా గెలిచే అవకాశం లేకుండా ఆడింది. పాకిస్థాన్ జట్టు ఓడిపోవడంతో ఆ జట్టు మీద సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ గెలిచేదే. ప్రారంభంలో అద్బుతంగా ఆడింది. ఆతర్వాత చేతులెత్తేసింది. దీంతో పాకిస్థాన్ ఓడిపోవాల్సి వచ్చింది,

భారత్ గెలిచిన తర్వాత రకరకాల వీడియాలో సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. కొంతమంది ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను ఉపయోగించి రకరకాల వీడియాలు రూపొందిస్తున్నారు. ఆ వీడియోలలో భారత్, పాకిస్థాన్ ప్లేయర్లు మైదానంలో కొట్టుకున్నట్టు, ఒకరిమీద మరొకరు దాడి చేసినట్టు రూపొందించారు. దీంతో ఇదంతా నిజమేనా అని కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. అయితే మ్యాచ్ మొత్తం చూసిన వారు ఇదంతా అబద్ధమని కామెంట్లు చేస్తున్నారు.

వాస్తవానికి భారత జట్టు కెప్టెన్ కనీసం పాకిస్థాన్ కెప్టెన్ కు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. మాటవరసకైనా మాట్లడలేదు. అలాంటప్పుడు మన అమ్మాయిలు పాకిస్థాన్ ప్లేయర్లతో ఎలా గొడవపడతారు? ఇది సాధ్యంకాదు..ఇది ముమ్మాటికీ కొంతమంది టెక్నాలజీతో రూపొందించిన వీడియో. దీన్నిసరదాగా చూసి వదిలేయాలి. అదే నిజమని అనుకుంటే మాత్రం ఇబ్బందిపడక తప్పదని సోషల్ మీడియాలో నెటిజన్లు పేర్కొంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper