Homeజాతీయ వార్తలుVijay government collapse speculation: కౌంట్ డౌన్ స్టార్ట్.. త్వరలో విజయ్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం..

Vijay government collapse speculation: కౌంట్ డౌన్ స్టార్ట్.. త్వరలో విజయ్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం..

Vijay government collapse speculation: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కి ఇంటి పోరు కంటే బయటి పోరు అధికంగా ఉంది. అధికారాన్ని దక్కించుకునే స్థానాలు రాకపోయినప్పటికీ.. కాంగ్రెస్.. కమ్యూనిస్టులు.. కొంతమంది అన్నా డిఎంకె నేతల సపోర్టుతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సాఫీగా తన ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారు. పరిపాలనలో తన స్టైల్ మార్పులు చేపట్టుకుంటూ వెళ్తున్నారు.

కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ఆరు నెలల పాటు హనీమూన్ పీరియడ్ ఉంటుంది. అప్పటిదాకా ప్రతిపక్షాలు ఎటువంటి విమర్శలు చేయవు. ఆరు నెలల తర్వాత కూడా ప్రభుత్వ పరిపాలనలో ఎటువంటి మార్పులు రాకపోతే అప్పుడు విపక్షాలు విమర్శలు మొదలుపెడతాయి. ప్రభుత్వం మీద యుద్ధం చేస్తుంటాయి. నిరసనలు.. ఆందోళనలు చేపడుతుంటాయి.

తమిళనాడులో మాత్రం పరిస్థితి దీనికి విరుద్ధంగా కొనసాగుతోంది. ముఖ్యంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల వ్యవధిలోనే డీఎంకే అధినేత స్టాలిన్ విమర్శలు మొదలుపెట్టారు. చెన్నై నగర పరిధిలో జరిగిన పార్టీ సమావేశంలో విజయ్ మీద స్టాలిన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. విజయ్ ప్రభుత్వం కుప్పకూలిపోతుందని.. ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్టాలిన్ మాట్లాడిన మాటల పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు స్టాలిన్ అదే స్వరం తో మాట్లాడుతున్నారు.

ఇటీవల కాలంలో విజయ్ ప్రధానమంత్రిని కలిశారు. ఆ తర్వాత అమిత్ షాను కలవడానికి అపాయింట్మెంట్ ఉన్నప్పటికీ.. అకస్మాత్తుగా అమిత్ షా అపాయింట్మెంట్ రద్దు చేశారు. దీంతో విజయ్ వెను తిరిగి వచ్చారు. అయితే దీని వెనుక స్టాలిన్ ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇటీవల ఇండియా కూటమి నుంచి దూరం జరిగిన డీఎంకే బీజేపీకి దగ్గర అవుతున్నట్టు తెలుస్తోంది. అందువల్లే స్టాలిన్ విజయ్ ప్రభుత్వం కూలిపోతుందని వ్యాఖ్యానిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తెర వెనుక అమిత్ షా సపోర్ట్ చేస్తున్నారని.. అందువల్లే స్టాలిన్ ఇలా బరితెగించి మాట్లాడుతున్నారని టీవీకే నేతలు అంటున్నారు. తమిళనాడులో జరుగుతున్న పరిణామాలను ప్రజలు చూస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో డిఎంకేకు ప్రతిపక్ష హోదా కూడా రాదని వారు స్పష్టం చేస్తున్నారు. స్టాలిన్ విమర్శలపై ఇంతవరకు విజయ్ స్పందించలేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular