Homeక్రీడలుJapan fans cleaning stadium: చెత్త అభిమానానికి.. శుభ్రం చేసి జపాన్ క్రమశిక్షణ నేర్పారు.. వైరల్...

Japan fans cleaning stadium: చెత్త అభిమానానికి.. శుభ్రం చేసి జపాన్ క్రమశిక్షణ నేర్పారు.. వైరల్ వీడియో

Japan fans cleaning stadium: జపాన్ ఆసియాలో దేశమే. కానీ ఎంత శుభ్రంగా ఉంటుందో. అక్కడ ప్రజలు పనిని ప్రేమిస్తుంటారు. శుభ్రంగా ఉండటాన్ని మరింత ఎక్కువగా ప్రేమిస్తుంటారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించరు. ప్రజారవాణాను ఎక్కువగా వాడుతుంటారు. తినేతిండి విషయంలో జాగ్రత్తగా ఉంటారు. సమయానికి తింటారు. సమయానికి పడుకుంటారు. ఇళ్లను ఎంతలా అయితే శుభ్రంగా ఉంచుకుంటారో.. వీధులను, చుట్టు పక్కల పరిసరాలను కూడా అదేస్థాయిలో శుభ్రంగా ఉంచుకుంటారు. అందుకే జపనీయులు ప్రపంచానికి ఆదర్శంగా ఉంటారు. కేవలం ఇళ్లు, వీధులు, […]

Japan fans cleaning stadium: జపాన్ ఆసియాలో దేశమే. కానీ ఎంత శుభ్రంగా ఉంటుందో. అక్కడ ప్రజలు పనిని ప్రేమిస్తుంటారు. శుభ్రంగా ఉండటాన్ని మరింత ఎక్కువగా ప్రేమిస్తుంటారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించరు. ప్రజారవాణాను ఎక్కువగా వాడుతుంటారు. తినేతిండి విషయంలో జాగ్రత్తగా ఉంటారు. సమయానికి తింటారు. సమయానికి పడుకుంటారు. ఇళ్లను ఎంతలా అయితే శుభ్రంగా ఉంచుకుంటారో.. వీధులను, చుట్టు పక్కల పరిసరాలను కూడా అదేస్థాయిలో శుభ్రంగా ఉంచుకుంటారు. అందుకే జపనీయులు ప్రపంచానికి ఆదర్శంగా ఉంటారు.

కేవలం ఇళ్లు, వీధులు, కార్యాలయాలను మాత్రమే కాదు, అవసరమైతే మైదానాలను కూడా శుభ్రం చేస్తారు జపనీయులు. ప్రస్తుతం ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ మెక్సికో, అమెరికా, కెనడా వేదికగా జరుగుతోంది. ఈ టోర్నీలో జపాన్ కూడా ఆడుతోంది. జపాన్ నెదర్లాండ్స్ జట్టుతో ఆడింది. ఈ మ్యాచ్ లో 2 -2 గోల్స్ నమోదుకావడంతో డ్రా అయింది. ఈ మ్యాచ్ చూసేందుకు జపాన్ అభిమానులు భారీగా మైదానానికి వచ్చారు. తమదేశ ఆటగాళ్లకు సపోర్ట్ ఇచ్చారు. మైదానంలో కేరింతలు కొట్టారు.

మ్యాచ్ డ్రా అయిన తర్వాత జపాన్ అభిమానులు మైదానంలో చెత్తను తొలగించారు. అంతేకాదు, సీట్లను కడిగారు. కూల్ డ్రింక్ సీసాలను, బీరు గ్లాస్ లను జాగ్రత్తగా ఏరి, ప్రత్యేకమైన సంచింలో భద్రపరిచారు.కొందరు అభిమానులు సీట్లను విరగొట్టారు. ఆ ముక్కలను జాగ్రత్తగా భద్రపరిచి సంచిలలో వేశారు.అంతేకాదు, స్టేడియంలో గ్లాసు ఫ్రేములను కూడా శుభ్రం చేశారు. అంతేకాదు, పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోకపోతే ఎలాంటి పరిణామాలను చవిచూడాల్సి వస్తుందో చేతల్లో చేసిచూపించారు.

జపాన్ అభిమానులు చేసిన పని సోషల్ మీడియాలో ప్రకంపనలు కలిగిస్తోంది. ఆటను ఆస్వాదించాలని, అభిమానులు ఇలా చెత్తను పోగు చేయకూడదని జపాన్ వాసులు పరోక్షంగా చెబుతున్నారు. చెత్తను పోగు చేయడం ద్వారా పరిసరాలకాలుష్యం పెరుగుతుందని, తద్వారా రకరకాల వ్యాధులు వస్తాయని, అలా రాకముందు జాగ్రత్తగా ఉండాలని జపాన్ వాసులు తమ చేతల ద్వారా నిరూపిస్తున్నారు. జపాన్ విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలోనే పరిసరాల పరిశుభ్రత గురించి పాఠాలు ఉంటాయి. చిన్నప్పటి నుంచే వారికి పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పిస్తారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper