Home Blog Page 120

త్వరలో ఇండిమా మార్కెట్లోకి కొత్త ఫ్లాగ్ ఫిష్ ఫోన్.. ధర ఎంతంటే..

iQOO 15T 5G price in India
iQOO 15T 5G price in India

iQOO 15T 5G price in India: నేటి కాలంలో మొబైల్ ఫోన్ వాడేవారు ఎక్కువగా ఫ్లాగ్ ఫిష్ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వారి కోసం iQOO కంపెనీ నుండి iQOO 15T 5G త్వరలో మార్కెట్లోకి రాబోతుంది. చైనా మార్కెట్లో ఇప్పటికే దీనికి సంబంధించిన అఫీషియల్ టీజర్లు, లీక్స్ హల్చల్ చేస్తుండగా, త్వరలోనే ఈ మొబైల్ ఇండియాలో కూడా లాంచ్ కానుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఫోన్‌కు సంబంధించిన ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..

iQOO 15T 5G స్మార్ట్‌ఫోన్ 6.82 అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లేతో రానుంది. 2K రిజల్యూషన్ తో 144Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ ఉండడం వల్ల ఈ ఫోన్ లో గేమింగ్ ఆడేటప్పుడు, స్క్రోలింగ్ చేసేటప్పుడు స్క్రీన్ చాలా స్మూత్‌గా ఉంటుంది. దీని పీక్ బ్రైట్‌నెస్ 4500 నిట్స్ వరకు ఉండడంతో ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ప్రీమియం లుక్ కోసం మెటల్ ఫ్రేమ్, భద్రత కోసం స్క్రీన్ కింద ఫాస్ట్ అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అందించారు. దుమ్ము, నీటి నుండి రక్షణ కోసం దీనికి IP68 రేటింగ్ కూడా ఉంది.

ఈ మొబైల్‌లో సరికొత్త MediaTek Dimensity 9500 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది 3nm ఆర్కిటెక్చర్‌పై పనిచేసే అత్యంత శక్తివంతమైన చిప్‌సెట్. దీనికి తోడు iQOO స్వయంగా డెవలప్ చేసిన Q3 గేమింగ్ చిప్ కూడా ఇందులో ఉండబోతోంది. దీంతో ‘గెన్‌షిన్ ఇంపాక్ట్’ వంటి భారీ గ్రాఫిక్స్ ఉన్న గేమ్స్‌ను కూడా ఎలాంటి లాగ్స్ లేకుండా, తక్కువ పవర్ వినియోగంతో రన్ చేయగలదు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.

ఈ కొత్త మొబైల్ లో ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ప్రధాన కెమెరా 200MP సెన్సార్‌తో వస్తోంది. దీంతో ఫోటోలు, వీడియోలు షేక్ అవ్వకుండా చాలా క్లారిటీగా వస్తాయి. దీని ద్వారా 8K వీడియోలను కూడా రికార్డ్ చేయవచ్చు. ఇక 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం ముందు భాగంలో 16MP కెమెరాను అమర్చారు.

ఇందులో అతిపెద్ద హైలైట్ బ్యాటరీ. iQOO 15T లో ఏకంగా 8,000mAh భారీ సిలికాన్-కార్బన్ బ్యాటరీని ప్యాక్ చేశారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సులభంగా రెండు నుండి మూడు రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని లీక్స్ చెబుతున్నాయి. ఇంత పెద్ద బ్యాటరీని త్వరగా ఛార్జ్ చేయడం కోసం 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా ఇచ్చారు.

లీక్ అయిన సమాచారం ప్రకారం.. చైనా మార్కెట్ ధరల ఆధారంగా చూస్తే, బేస్ వేరియంట్ (12GB RAM + 256GB స్టోరేజ్) ధర ఇండియాలో సుమారు రూ. 58,000 నుండి ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. ఇందులో టాప్-ఎండ్ మోడల్ 16GB RAM మరియు 1TB స్టోరేజ్ వరకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. సాధారణంగా స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ ఫోన్ల కంటే మీడియాటెక్ చిప్‌సెట్ ఫోన్ల ధర కొంచెం తక్కువగా ఉంటుంది.

రెవెన్యూ అధికారి అయితే ఇంత దోచుకోవచ్చా.. తెలంగాణలో ఏంటి అవినీతి తిమింగలాలు..

ACB raids Narahari house
ACB raids Narahari house

ACB raids Narahari house: కేవలం రెండు సంవత్సరాలు.. 441 కేసులు.. ఇదేదో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ లో నమోదు చేసిన కేసులు కాదు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నమోదు చేసిన కేసులు కాదు. తెలంగాణలో ఏసీబీ ఆఫీసర్లు కరప్షన్ కు పాల్పడుతున్న అధికారుల మీద నమోదు చేసిన కేసులు. పైగా వీరిలో చాలామంది లంచం తీసుకుంటూ దొరికిపోయారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు లంచం తీసుకుంటే ట్రాప్ చేస్తున్నారు. అక్రమంగా ఆస్తులను కూడ పెడితే రైడ్ చేస్తున్నారు. 2024 నుంచి ఇప్పటివరకు ఏకంగా 441 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇంత స్థాయిలో కేసులు నమోదు చేస్తున్నప్పటికీ అవినీతి అధికారులు తమ ధోరణి మార్చుకోవడం లేదు. ఇటీవల కాలంలో డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న రాము నాయక్ అనే అధికారిని ప్రభుత్వం డిస్మిస్ చేసింది. అతడు ఏకంగా ప్రభుత్వ భూములను ఇతర వ్యక్తులకు అక్రమంగా పట్టా చేయించాడు. దీనికోసం భారీగా లంచం తీసుకున్నాడు. ఇటీవల మోహన్ నాయక్ అనే అధికారి 100 కోట్లకు పైగా ఆస్తులను కూడబెట్టిన నేపథ్యంలో.. అతని మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అవినీతి అధికారుల మీద ఏసీబీ అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ వారి ప్రవర్తన మారడం లేదు. ఇటీవల కాలంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సింహులపేట మండలంలో ఒక ఎంపీడీవో, ఎంపీవో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పకడ్బందీగా పట్టుకున్నారు. పైగా ఆ మహిళా అధికారి తన కుమారుడిని కూడా వసూళ్లకు ప్రత్యేకంగా నియమించుకోవడం విశేషం. ఏసీబీ అధికారుల తనిఖీలు ఆ ఎంపీడీవో, ఎంపీవో పట్టుబడిన నేపథ్యంలో.. అక్కడి ప్రజలు పటాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.

అవినీతి అధికారులు రోజురోజుకు ప్రజల మీద పడి దోచుకుంటున్నారు. ఏదైనా పని ఉందని వెళ్తే.. మొహమాటం లేకుండా ఏమిస్తామని అడుగుతున్నారు. తాజాగా ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. అతడికి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని అధికారులు గుర్తించారు. పాతబస్తీలోని ఛత్రినాక ప్రాంతంలో అతడి నివాసం.. కార్యాలయం.. బంధువుల గృహాలలో తనిఖీలు చేపట్టారు. నరహరి ఇంట్లో ఏకంగా 1.10 కోట్ల నగదును గుర్తించారు. ఇవే కాక బంగారు ఆభరణాలు.. ఇతర రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతాలలో అతడికి ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి ఉంది. బహిరంగ మార్కెట్లో వీటి విలువ వందల కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఇటీవల కాలంలో పెద్దపెద్ద ఆఫీసర్లను ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి పట్టుకుంటున్నప్పటికీ. అవినీతి అధికారులు తమ ధోరణి మార్చుకోవడం లేదు.

భోజనం చేసిన వెంటనే ఈ పనులు చేయొద్దు.. ఆరోగ్య నిపుణుల హెచ్చరిక!

Health tips after Meals
Health tips after Meals

Health tips after Meals: మన ఆరోగ్యం ఆహారపు అలవాట్లపై మాత్రమే కాకుండా, భోజనం చేసిన తర్వాత మనం ఏం చేస్తామన్న దానిపైనా ఆధారపడి ఉంటుంది. చాలామంది తెలియక చేసే కొన్ని అలవాట్లు జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా భోజనం చేసిన వెంటనే కొన్ని పనులకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇవి చేయడం వల్ల కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ భోజనం చేసిన వెంటనే ఏ పనులు చేయకూడదో చూద్దాం..

నిద్ర:
ఆహారం తిన్న వెంటనే పడుకోవడం లేదా నిద్రపోవడం వల్ల జీర్ణక్రియ సరిగా జరగదు. దీంతో కడుపులోని ఆమ్లాలు అన్నవాహికలోకి చేరే అవకాశం పెరుగుతుంది. ఫలితంగా యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి. కనీసం రెండు నుంచి మూడు గంటల తర్వాత మాత్రమే నిద్రకు ఉపక్రమించడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.

టీ, కాఫీలకు దూరం..:
భోజనం చేసిన వెంటనే టీ లేదా కాఫీ తాగడం కూడా మంచిది కాదు. వీటిలో ఉండే కొన్ని పదార్థాలు ఆహారంలోని ఐరన్‌ను శరీరం శోషించుకునే ప్రక్రియను అడ్డుకుంటాయి. అంతేకాకుండా అసిడిటీ సమస్యను మరింత పెంచే అవకాశం ఉంటుంది. అందువల్ల భోజనం తర్వాత కనీసం గంట సమయం గ్యాప్ ఇవ్వడం ఉత్తమం.

పండ్లు తినకండి:
చాలామంది భోజనం ముగిసిన వెంటనే పండ్లు తినడం ఆరోగ్యకరమని భావిస్తారు. అయితే పండ్లు త్వరగా జీర్ణమవుతాయి, భోజనం చేసిన ఆహారం మాత్రం ఎక్కువ సమయం తీసుకుంటుంది. దీంతో కడుపులో ఉబ్బరం, గ్యాస్, అసౌకర్యం వంటి సమస్యలు రావచ్చు. పండ్లను భోజనానికి ముందు లేదా కొన్ని గంటల తర్వాత తీసుకోవడం మంచిది.

స్నానం చేయొద్దు:
ఆహారం తిన్న వెంటనే స్నానం చేయడం వల్ల శరీరంలోని రక్తప్రసరణలో మార్పులు చోటుచేసుకుంటాయి. జీర్ణక్రియకు అవసరమైన రక్తప్రవాహం కొంత మేర చర్మం వైపు మళ్లే అవకాశం ఉంటుంది. దీనివల్ల జీర్ణక్రియ ప్రక్రియ మందగించి ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు.

ధూమపానం.. ప్రమాదకరం:
భోజనం చేసిన వెంటనే సిగరెట్ తాగడం అత్యంత హానికరమైన అలవాట్లలో ఒకటిగా నిపుణులు పేర్కొంటున్నారు. ధూమపానం జీర్ణక్రియను నెమ్మదింపజేయడమే కాకుండా, శరీరం ఆహారంలోని పోషకాలను గ్రహించే సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తుంది. దీర్ఘకాలంలో ఇది జీర్ణాశయ సంబంధిత సమస్యలకు కారణమయ్యే ప్రమాదం ఉంది.

భావకుడే నాయకుడయితే అదే పవన్ కళ్యాణ్

Pawan Kalyan leadership

Pawan Kalyan leadership : దేశమంటే మట్టి కాదు.. దేశమంటే మనుషులోయ్ అని గురజాడ రాస్తే పవన్ కళ్యాణ్ చేసి చూపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ వినూత్న పర్సనాలిటీలాగా కనిపిస్తున్నాడు. తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నాయకులందరినీ కూడగట్టుకొని తీసుకొని వెళ్లి ఢిల్లీ అమరవీరుల స్తూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఇది మరుపురాని ఘట్టం.. దేశ భక్తి గుండెల నిండా పెట్టుకున్న మంచి మనసున్న వ్యక్తి పవన్ కళ్యాణ్..

ఆంధ్రాలో జనం, నేతలు కులాల వారీగా కొట్టుకుంటున్న ఆంధ్రాలో ఇది కాదు మానవత్వం.. మనం కులాలు ప్రాంతాలు, మతాల ఆధారంగా కొట్టుకోవద్దని పవన్ నిరూపించారు. దేశమంటే మనుషులోయ్ అని పవన్ నిరూపిస్తున్నారు.

సనాతన సంస్కృతి గురించి మనం గర్వపడాలి. అది మనం మర్చిపోయి ఆత్మనూన్యత భావంతో మిగిలిపోతున్నాం. అంత ఘన చరిత్ర గల భారత్ కు వాళ్లు దాడి చేశారు. వీళ్లు దాడి చేశారని చెబుతున్నారు తప్పితే ఆ దాడుల గురించి పోరాడిన చరిత్రను మనం మాట్లాడుకోం..

భావకుడే నాయకుడయితే అదే పవన్ కళ్యాణ్ .. దీనిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

ఊహించని దేశం నుంచి ‘ఖలిస్తాన్’ కుట్ర.. సంచలన పరిణామం

Khalistan conspiracy latest news
Khalistan conspiracy latest news

Khalistan conspiracy latest news: జూన్‌ 4వ తేదీ ఉదయం 9:54 గంటలకు ఢిల్లీ సమీపంలోని పంచ్‌కుల మేయర్‌ శ్యాంలాల్‌కు ఒక ఈమెయిల్‌ వచ్చింది. దాని పంపినవారు ఖలిస్తాన్‌ నేషనల్‌ ఆర్మీ అని పేర్కొన్నారు. ఢిల్లీలోని ఆరు ఆలయాల్లో బాంబులు పెట్టామని, 5, 6వ తేదీల్లో ఆ ఆలయాలకు వెళ్లవద్దని బెదిరించారు. మేయర్‌ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. డాగ్‌ స్క్వాడ్, బాంబ్‌ స్వాడ్‌తో పూర్తి తనిఖీలు జరిగాయి. బాంబు లేదని తేలింది. ఇది కేవలం హోక్స్‌.

దేశవ్యాప్తంగా బెదిరింపులు..
జనవరి 28 నుంచి జూన్‌ 10 వరకు దేశంలోని ఐదు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో (పంజాబ్‌ మినహా) దేవాలయాలు, నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయం, కోర్టులు ఇలా అనేక ముఖ్యమైన ప్రదేశాలకు ఇలాంటి బెదిరింపు మెయిల్స్‌ వరుసగా వచ్చాయి. ముఖ్యంగా ఆ రాష్ట్రాలన్నీ బీజేపీ పాలనలో ఉన్న ఆర్థికంగా బలమైన రాష్ట్రాలు. పది ప్రముఖ దేవాలయాలకు పదే పదే మెయిల్స్‌ వచ్చాయి. ఇవి కేవలం బెదిరింపులే అయినప్పటికీ, ప్రజల్లో భయం, అనుమానం, గందరగోళం సృష్టించాలనుకున్నారు.

ఇంటెలిజెన్స్‌ విచారణలో షాకింగ్‌ విషయాలు..
గూఢచార సంస్థలు ఈ మెయిల్స్‌ను లోతుగా పరిశీలించాయి. ఫలితంగా ఈ మెయిల్సన్నీ అజర్‌బైజాన్‌ నుంచి వస్తున్నట్లు తేలింది. అజర్‌బైజాన్‌ మాజీ సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నం అయిన తర్వాత ఏర్పడిన దేశం. ఇక్కడి నుండి బెదిరింపులు పంపడం యాదృచ్ఛికం కాదు. జనవరి 16 అజర్‌బైజాన్‌లో ఖలిస్తాన్‌ నేషనల్‌ ఆర్మీ సమావేశం జరిగింది. అమెరికా, యూరప్, పాకిస్తాన్‌లోని ఖలిస్తానీ కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో అన్ని అనుబంధ సంస్థలు ఇకపై ఖలిస్తాన్‌ నేషనల్‌ ఆర్మీ పేరిటే పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది వివిధ ఖలిస్తానీ గ్రూపులను ఒకే ఛత్రం కిందకు తీసుకురావడానికి చేసిన ప్రయత్నం.

అజర్‌బైజాన్‌లోనే ఎందుకు..
ఈ దేశాన్ని కొత్త కేంద్రంగా ఎంచుకోవడం వెనుక కొన్ని కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్కడి ప్రభుత్వానికి తెలియకుండా సమావేశం జరగడం సాధ్యమైంది. ఇతర దేశాల్లో ఉన్నట్లు కఠినమైన నిఘా ఉంటుంది. అజర్‌బైజాన్‌లో అలాంటిది ఉండదు. ముస్లిం దేశం. తుక్కియేకు సన్నిహితంగా ఉంటుంది. భారత్‌పై వ్యతిరేక వైఖరి కలిగి ఉందని సమాచారం. ఖలిస్తానీ ఉగ్రవాదులు ఈ కొత్త దేశాన్ని ఉపయోగించి డిజిటల్‌గా బెదిరింపులు పంపి, భారత్‌లో భయోత్పాతం సృష్టించాలని చూస్తున్నారు.

ఖలిస్తానీ గ్రూపులు ఇప్పుడు పాకిస్తాన్‌కు మాత్రమే పరిమితం కాకుండా, అజర్‌బైజాన్‌ వంటి కొత్త దేశాలను ఆశ్రయంగా ఎంచుకుంటున్నాయి. ఇది వారి వ్యూహంలో మార్పును సూచిస్తుంది. సంప్రదాయికంగా పాకిస్తాన్‌లో ఉన్న నిఘా, అంతర్జాతీయ ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి కొత్త ఆశ్రయాలు వెతుకుతున్నారు.

అమెజాన్ జాబ్ కంటే డ్రైవర్ గా మంచి ఉద్యోగం...ఎందుకంటే.. ఓ వ్యక్తి పోస్టు వైరల్..

Man left Amazon to drive cabs
Man left Amazon to drive cabs

Man left Amazon to drive cabs: నేటి కాలంలో చాలా మంది యువత ఎక్కువ జీతం, కార్పొరేట్ ఉద్యోగం, విలాసవంతమైన జీవితం కావాలని కోరుకుంటున్నారు. ఇదే తమ జీవిత విజయానికి కొలమానాలుగా భావిస్తున్నారు. అయితే హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఎప్పుడూ కంప్యూటర్ల ముందు మెకానికల్ గా పనిచేయడం కంటే.. మనుషుల మధ్య ఉండడం చాలా అవసరం అని చెబుతున్నారు. ప్రతిరోజూ ఎంతో మందితో మాట్లాడడం వల్ల అధిక సంతోషంగా ఉండవచ్చని తెలుపుతున్నారు. అందులో భాగంగా క్యాబ్ డ్రైవర్‌గా సంతోషంగా జీవితస్తున్నట్లు తెలిపారు. ఇంతకీ ఆయన ఇలా ఎందుకు చెబుతున్నాడు?

హైదరాబాద్ కు చెందిన కుమార్ 2014 వరకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ Amazon లో ఉద్యోగం చేశారు. మంచి జీతం, స్థిరమైన కెరీర్ ఉన్నప్పటికీ ఆయనకు ఆ పని అంతగా సంతృప్తిని ఇవ్వలేదట. కొత్త ప్రాంతాలను చూడడం, కొత్త వ్యక్తులను కలవడం తనకు ఎంతో ఇష్టమని భావించిన కుమార్ చివరకు ఉద్యోగానికి రాజీనామా చేసి క్యాబ్ డ్రైవర్‌గా మారాలని నిర్ణయించుకున్నారు. 12 ఏళ్లుగా ఆయన హైదరాబాద్ నగరంలో క్యాబ్ నడుపుతున్నారు. ఈ కాలంలో దాదాపు 23,600 ట్రిప్పులు పూర్తి చేసినట్లు చెబుతున్నారు. నగరంలోని ప్రతి ప్రాంతాన్ని అన్వేషించడం, కొత్త మార్గాలను తెలుసుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని కుమార్ పేర్కొన్నారు. ఒకే కార్యాలయంలో కూర్చొని పనిచేయడం కంటే నగరాన్ని చుట్టేస్తూ పని చేయడమే తనకు నచ్చుతుందని చెప్పారు.

ప్రతిరోజూ వందలాది మంది ప్రయాణికులను కలవడం తన ఉద్యోగంలో అత్యంత ఆసక్తికరమైన అంశమని ఆయన అంటున్నారు. వివిధ వృత్తులు, ప్రాంతాలు, సంస్కృతులకు చెందిన వ్యక్తులతో మాట్లాడటం ద్వారా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటానని చెప్పారు. ప్రతి ప్రయాణికుడి కథ భిన్నంగా ఉండటం వల్ల తన పని ఎప్పుడూ బోర్‌గా అనిపించదని వెల్లడించారు.

ఇటీవల ఓ మహిళా టెకీ కుమార్‌తో చేసిన ప్రయాణ అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. మంచి కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి, తనకు ఇష్టమైన పనిని ఎంచుకుని సంతోషంగా జీవిస్తున్న కుమార్ గురించి ఆమె చేసిన పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంది. డబ్బు కంటే మనసుకు నచ్చిన పని ముఖ్యమని ఆయన నిరూపించారని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

కుమార్ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీసింది. జీవితంలో విజయం అంటే కేవలం అధిక జీతం కాదని, మనకు ఆనందాన్ని ఇచ్చే పనిని చేస్తూ సంతృప్తిగా జీవించడమూ విజయమేనని ఆయన కథ మరోసారి గుర్తు చేస్తోంది. బాధ్యతలను నిర్వర్తిస్తూనే ప్యాషన్‌ను కొనసాగించవచ్చని కుమార్ జీవితం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by ChetnaSingh (@chetnasingh___)

'సింగ్ గీతం' 4 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. చిన్న సినిమాకు ఈ రేంజ్ గ్రాస్ ఊహించలేదు..

Sing Geetham 4 days Collections
Sing Geetham 4 days Collections

Sing Geetham 4 days Collections: ఈమధ్య కాలం లో పెద్ద సినిమాలకంటే చిన్న సినిమాలే బయ్యర్స్ కి , నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెడుతున్నాయి. వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు తీసి, అవి రీకవరీ అవ్వక, నష్టాలను అనుభవించడం కంటే , అతి తక్కువ బడ్జెట్ తో క్వాలిటీ కంటెంట్ సినిమాలు తీసి , భారీ లాభాలు దక్కించుకోవడం ఎంతో బెటర్ అనేలా నిరూపించాయి కొన్ని సినిమాలు. అలాంటి సినిమాల్లో రీసెంట్ గా విడుదలైన ‘సింగ్ గీతం’ అనే చిత్రం కూడా చేరింది. 94 ఏళ్ళ వయస్సులో నేటి తరం యూత్ కి తగ్గట్టుగా ఒక డిఫరెంట్ సబ్జెక్టు ని తెరకెక్కించి , అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకోవడం కేవలం సింగీతం శ్రీనివాస్ కి మాత్రమే చెల్లింది. పాటలతో సినిమా కథని నదించాలనే ఆయన అద్భుతమైన ఆలోచనకు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు , విడుదలైన నాలుగు రోజుల్లో ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద నమోదైన కలెక్షన్స్ ఎలాంటివి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము.

ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం , ఈ చిత్రానికి మొదటి మూడు రోజుల్లో ఇండియా వైడ్ గా దాదాపుగా 3 కోట్ల 80 లక్షల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లను నమోదు చేసుకుంది. ఓవర్సీస్ కలెక్షన్స్ ని కూడా కలుపుకుంటే , ఈ చిత్రానికి మొదటి వీకెండ్ లో 4 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు , 2 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. మొదటి సోమవారం , అనగా 5 వ రోజున కూడా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లోని A సెంటర్స్ లో స్టడీ కలెక్షన్స్ నమోదు అయ్యాయి. ముఖ్యంగా ఫస్ట్ షోస్ , సెకండ్ షోస్ మల్టీప్లెక్స్ థియేటర్స్ లో ఆక్యుపెన్సీలు బాగున్నాయి. మొత్తం ఓవరాల్ గా 4 వ రోజున వర్కింగ్ డే అయ్యినప్పటికీ ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి 50 లక్షల రూపాయిల రేంజ్ గ్రాస్ గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

షేర్ వసూళ్లు పాతిక లక్షల వరకు ఉండొచ్చు , ఇదే రేంజ్ స్టడీ ట్రెండ్ కొనసాగుతూ ముందుకు వెళ్తే ఈ చిత్రం కచ్చితంగా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని , సూపర్ హిట్ స్టేటస్ కి చేరుకుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. విడుదలకు ముందు ఈ చిత్రానికి 7 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ వీకెండ్ తో బ్రేక్ ఈవెన్ మార్కుని కచ్చితంగా అందుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు, చూడాలి మరి ఆ స్థాయికి వెళ్తుందా లేదా అనేది.

ఏరో స్పేస్ జాబ్ వదిలి.. రాగులు, జొన్నలతో వ్యాపారం.. రూ.1.44 కోట్ల టర్నోవర్..

Nishtha Chauhan
Nishtha Chauhan

Nishtha Chauhan: నేటి యువతలో చాలా మంది అధిక జీతాల ఉద్యోగాల కోసం పరుగులు తీస్తున్నారు. ఎక్కువ మంది తక్కువ శ్రమతో ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుంటున్నారు. ఈ క్రమంలో పర్యావరణం గురించి పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితిని గమనించిన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన నిష్ఠా చౌహాన్ కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ రంగంలో మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి, సమాజానికి ఉపయోగపడేలా పర్యావరణ హిత వ్యాపారాన్ని ప్రారంభించి అందరికీ ఆదర్శంగా నిలిచింది. అయితే ఇందులోనూ ఆమె ఏడాదికి సుమారు రూ.1.44 కోట్ల టర్నోవర్ సాధిస్తోంది. ఇంతకీ నిష్ఠా చేసే పనేంటి? ఆమె వల్ల సమాజానికి ఎటువంటి ఉపయోగం జరుగుతోంది?

ఇంజనీరింగ్ పూర్తిచేసిన నిష్ఠా చౌహాన్ ఏరోస్పేస్ రంగంలో పనిచేస్తూ మంచి ఆదాయం పొందేవారు. అయితే ఆరోగ్యకరమైన ఆహారం, పర్యావరణ పరిరక్షణపై ఉన్న ఆసక్తి ఆమెను కొత్త ఆలోచన వైపు మళ్లించింది. ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు ఆహార వ్యర్థాలను కూడా తగ్గించే విధంగా ఒక వ్యాపార నమూనాను రూపొందించాలని నిర్ణయించుకుంది. ఈ ఆలోచనతోనే ఆమె అహ్మదాబాద్‌లో ‘కేఫ్ ఆరంభ్’ పేరుతో జీరో-వేస్ట్ మిల్లెట్స్ కేఫ్‌ను ప్రారంభించింది. ఈ కేఫ్‌లో ప్రధానంగా చిరుధాన్యాలతో తయారైన ఆహార పదార్థాలను అందిస్తున్నారు. సంప్రదాయంగా మన పెద్దలు తినే రాగులు, జొన్నలు, సజ్జలు వంటి మిల్లెట్స్‌ను ఆధునిక రుచులకు అనుగుణంగా మార్చి యువతను ఆకర్షిస్తోంది.

నిష్ఠా ప్రయత్నాలు వ్యాపారపరంగా కూడా అద్భుత ఫలితాలు ఇచ్చాయి. ప్రస్తుతం ‘కేఫ్ ఆరంభ్’ ఏడాదికి సుమారు రూ.1.44 కోట్ల టర్నోవర్ సాధిస్తోంది. ఆరోగ్యకరమైన ఆహారం కోసం పెరుగుతున్న డిమాండ్‌ను సద్వినియోగం చేసుకుంటూ ఆమె వ్యాపారాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తోంది. ఇక్కడ ఆహార పదార్థాల తయారీలో వ్యర్థాలు దాదాపు లేకుండా చూసుకుంటారు. ముడి పదార్థాల వినియోగం నుంచి మిగిలిపోయే ఆహార అవశేషాల నిర్వహణ వరకు ప్రతి దశలో జీరో-వేస్ట్ విధానాన్ని అనుసరిస్తున్నారు. దీంతో పర్యావరణంపై ప్రతికూల ప్రభావం గణనీయంగా తగ్గుతోంది.

వ్యాపార లాభాలతో పాటు సామాజిక బాధ్యతను కూడా నిష్ఠా విస్మరించలేదు. జీరో-వేస్ట్ విధానాన్ని అమలు చేయడం ద్వారా ప్రతి సంవత్సరం సుమారు 47 టన్నుల ఆహార వ్యర్థాలను అరికడుతున్నట్లు సమాచారం. దీంతో ఆహార వృథా తగ్గడమే కాకుండా కార్బన్ ఉద్గారాల నియంత్రణకూ తోడ్పడుతోంది.

సంప్రదాయ ఆహారాలకు ఆధునిక రూపాన్ని ఇచ్చి, ఆరోగ్యం పర్యావరణం వ్యాపారం అనే మూడు అంశాలను సమతుల్యం చేస్తూ నిష్ఠా చౌహాన్ కొత్త తరానికి స్ఫూర్తిగా నిలుస్తోంది. మంచి ఉద్యోగాన్ని వదిలినా, స్పష్టమైన లక్ష్యం మరియు వినూత్న ఆలోచన ఉంటే విజయాన్ని సాధించవచ్చని ఆమె కథ నిరూపిస్తోంది.

వడ్డే నవీన్ సెకండ్ ఇన్నింగ్స్ లో సక్సెస్ అవుతాడా..?ఆయన ఆ జానర్ సినిమాలు సెట్ అవుతాయా..?

Vadde Naveen second innings
Vadde Naveen second innings

Vadde Naveen second innings: ఒకప్పుడు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునతో పాటుగా అంత మంచి క్రేజ్ ను సంపాదించుకున్న వాళ్ళలో వడ్డే నవీన్ ఒకరు…ఆయన స్టార్ హీరో గా అవతరించకపోయిన ప్రేమ కథ చిత్రాలను చేసి సక్సెస్ లను సాధించాడు. ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత కాలంలో అతనికి అనుకున్న సక్సెసులు రాకపోవడంతో ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అయిపోయాడు. ఇక మొత్తానికైతే మరోసారి తను సెకండ్ ఇన్నింగ్స్ ను చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేస్తున్నాడు… ఇప్పటివరకు నవీన్ చేసిన క్యారెక్టర్లు ఒకెత్తయితే ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ అనే సినిమాతో ఇప్పటివరకు తను చేయనటువంటి ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు. మరి ఈ సినిమా అతనికి ఎంతవరకు హెల్ప్ అవుతుంది. ఈ మూవీతో మరోసారి తన సత్తా ఏంటో చూపించుకుంటాడా?

తద్వారా ఆయన మరోసారి నటుడిగా తనను తాను ఎలివేట్ చేసుకోగలుగుతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే నవీన్ థ్రిల్లర్ సినిమాల వైపు కాకుండా ఫ్యామిలీ సినిమాల వైపు అడుగులు వేస్తే బాగుంటుందని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకుముందు ఆయనకు ఒక సాఫ్ట్ ఇమేజ్ ఉంది.

లేడీ అభిమానులు కూడా అతన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కాబట్టి ఫ్యామిలీ సినిమాలను చేసి ప్రేక్షకుల్లో ఒక కొత్త అనుభూతిని నింపినట్లైతే ఆయన నటుడిగా సక్సెస్ అవ్వడమే కాకుండా సెకండ్ ఇన్నింగ్స్ లో సైతం అతనికి మంచి విజయాలైతే దక్కుతాయి. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆయన ముందుకు సాగితే బాగుంటుందని మరి కొంతమంది సినిమా మేధావులు సైతం భావిస్తున్నారు.

ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు సినిమా ఆడితేనే సెకండ్ ఇన్నింగ్స్ లో అతని కెరియర్ సాఫీగా సాగుతుంది. లేకపోతే మాత్రం ఆయన చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు… చూడాలి మరి ఆయన రాబోయే రోజుల్లో ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది…ఇక తన తోటి హీరోలందరు సెకండ్ ఇన్నింగ్స్ లో అదరగొడుతుండటం విశేషం…

'పెద్ది' హిందీ వెర్షన్ 12 రోజుల వసూళ్లు.. కనీసం 50 శాతం రీకవరీ కూడా అవ్వలేదు..

Peddi Hindi collections 12 days
Peddi Hindi collections 12 days

Peddi Hindi collections 12 days: వర్కింగ్ డేస్ లో కూడా స్టడీ కలెక్షన్స్ ని రాబడుతూ ‘పెద్ది’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రోజుకో బెంచ్ మార్క్ ని క్రియేట్ చేస్తూ , ముందుకు పోతున్న విధానం చూసి , బయ్యర్స్ ఫుల్ ఖుషీ లో ఉన్నారు. ఈ స్థాయి వసూళ్లు కేవలం సంక్రాంతి సీజన్ కి మాత్రమే పరిమితం అని భావించిన కొంతమంది విశ్లేషకుల నోర్లు మూయించింది ఈ చిత్రం. సోమవారం రోజున అనగా 12వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 4 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా ఎలాంటి సునామీ సృష్టిస్తూ ముందుకు వెళ్తుంది అనేది. తెలుగు రాష్ట్రాల్లో ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ గా నిల్చిన ఈ చిత్రం , హిందీ వెర్షన్ లో డిజాస్టర్ కా బాప్ గా నిలవడం శోచనీయం.

ఈ సినిమా కంటెంట్ అక్కడి ఆడియన్సు పట్టుకునే విధంగానే ఉంది , కానీ ఎందుకో బాక్స్ ఆఫీస్ వద్ద జోరు చూపించడం లేదు. విడుదలకు ముందు ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కేవలం హిందీ వెర్షన్ కి గానూ పాతిక కోట్ల రూపాయలకు జరిగింది. అంటే ఈ చిత్రం కచ్చితంగా పాతిక కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సిందే. కానీ ఇప్పటి వరకు కేవలం 11 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది అట. అంటే సగం కూడా ఇప్పటి వరకు రీకవరీ అవ్వలేదు. రోజుల వారీగా ఈ చిత్రానికి హిందీ వెర్షన్ నుండి నమోదైన నెట్ వసూళ్లు ఎంతో ఒకసారి వివరంగా చూద్దాము. మొదటి రోజున హిందీ వెర్షన్ నుండి ఈ చిత్రం దాదాపుగా 3 కోట్ల 25 లక్షల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత రెండవ రోజున 2 కోట్ల 50 లక్షలు , 3 వ రోజున 3 కోట్ల 10 లక్షలు , 4 వ రోజున 3 కోట్ల 65 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి.

ఇది చాలా డీసెంట్ రేంజ్ నెట్ వసూళ్లు అని చెప్పొచ్చు. ఈ స్టడీ కలెక్షన్స్ ట్రెండ్ వర్కింగ్ డేస్ లో కూడా కొనసాగితే కచ్చితంగా బ్రేక్ ఈవెన్ అవ్వుద్దని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. 5 వ రోజున కేవలం 1 కోటి 30 లక్షల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , 6 వ రోజున 1 కోటి 55 లక్షలు , 7 వ రోజున 1 కోటి 15 లక్షలు , 8 వ రోజున 1 కోటి 10 లక్షలు , 9 వ రోజున 50 లక్షలు , 10 వ రోజున 90 లక్షలు , 11 వ రోజున 1 కోటి 20 లక్షలు , 12 వ రోజున 55 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా 12 రోజుల్లో 20 కోట్ల 75 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు , 26 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. షేర్ వసూల్ కేవలం 11 కోట్లు మాత్రమే. లాంగ్ రన్ లో మరో 2 కోట్ల షేర్ వసూళ్లు రావొచ్చు.

నాగార్జున సినిమా కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ఆ స్టార్ హీరో.. నాగ్ పక్కన నటించడం లేదా..?

Nagarjuna
Nagarjuna

Nagarjuna movie assistant director: అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు నాగార్జున…చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా అవతరించాడు. ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉండేది. రొమాంటిక్ హీరోగా పేరు సంపాదించుకున్న ఆయన ఆ తర్వాత మాస్ హీరోగా అవతరించి కమర్షియల్ సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను రాబట్టాడు. ఇక పౌరాణిక సినిమాల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశాడు. ఇక ఇప్పటికీ ఆయన ప్రయోగాత్మకమైన సినిమాలను చేయడానికి ముందు వరుసలో ఉంటాడు. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఎవరు చేయనటువంటి ఎక్స్పెరిమెంటల్ సినిమాలను చేసిన ఘనత కూడా తనకే దక్కింది… ఇక అలాంటి నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో కొంతవరకు డీలా పడ్డాడు. కారణం ఏదైనా కూడా తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. లేకపోతే మాత్రం ఆయన చాలా వరకు డీలా పడిపోతాడు…

ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు నాగార్జున సూపర్ హిట్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన ఒక వ్యక్తి ఆ తర్వాత కాలంలో నటుడిగా మారి ఆ తర్వాత స్టార్ హీరోగా కూడా అవతరించాడు. ప్రస్తుతం నాగార్జున చేస్తున్న ఒక సినిమాలో అతన్ని నటించమని అడగగా తను నాగార్జున పక్కన నటించడానికి ఇంట్రెస్ట్ చూపించనట్టుగా తెలుస్తుంది.

ఇంతకీ ఆ హీరో ఎవరు అంటే రవితేజ కావడం విశేషం… నాగార్జున హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో చేసిన ‘నిన్నే పెళ్లాడుతా’ సినిమాకి రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఆ తర్వాత హీరోగా మారి వరస సక్సెస్ లను సాధించి టాప్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.

ప్రస్తుతం నాగార్జున చేస్తున్న ఒక సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం రవితేజ ని సంప్రదించగా నాగార్జున పక్కన నటించడం అంటే తనకి చాలా భయంగా ఉంటుందని అతనితో నటించడం చాలా వరకు తను ఆన్ కంఫర్ట్ గా ఫీల్ అవుతానని చెప్పి రవితేజ ఆ పాత్రని రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి అతని ప్లేస్ లో ఎవరిని తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది…

చాన్నాళ్లకు రఘు కుంచె కదిలింది.. ఓ కొత్త సినిమాకు ఊపిరి పోసింది..

Raghu Kunche new movie
Raghu Kunche new movie

Raghu Kunche new movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతుంది. స్టార్ హీరోలు వైవిధ్యభరితమైన సినిమాలను చేస్తున్న క్రమంలో చిన్న హీరోలు చిన్న బడ్జెట్లో సినిమాలను చేసుకుంటూ వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటున్నారు. కొంతమంది కొత్త దర్శకులు సైతం ఇండస్ట్రీలో రాణించాలనే ప్రయత్నంలో మంచి సబ్జెక్ట్స్ ను రెడీ చేసుకొని ముందుకు సాగుతున్నారు… ఇక ఈ క్రమంలోనే కొంతమంది నిర్మాతలు గా రాణించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో విడిగే పల్లి కృష్ణ మొకిలా సైతం మంచి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుండటం విశేషం…ఇక ప్రస్తుతం ఆయన ప్రొడక్షన్ నెంబర్ వన్ కింద రేవంత్ అనే ఒక కొత్త కుర్రాడిని హీరోగా పెట్టి ఒక యాక్షన్ సినిమాని చేస్తున్నాడు… ఇక ఈ సినిమాకి రామ్ భరదరం కథ, స్క్రీన్ ప్లే అందిస్తూనే దర్శకత్వ బాధ్యతలను కూడా చేపడుతున్నాడు… ఈ మూవీకి రఘు కుంచె మ్యూజిక్ ని అందిస్తుండడం విశేషం…

ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలకు ఆయన ఎక్కువగా సంగీతాన్ని అందిస్తున్నాడు. ఆయన నుంచి వచ్చే సినిమాలు నెక్స్ట్ స్టాండర్డ్ లో ఉంటున్నాయి. అందువల్లే అతని మ్యూజిక్ కి కూడా చాలా మంచి డిమాండ్ పెరిగింది. తద్వారా కొత్త సినిమాలకు అతను బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తున్నాడు. అందుకే ప్రతి ఒక్క చిన్న దర్శకుడి చూపు రఘు కుంచె మీదే పడుతుంది.

ఇక ఏది ఏమైనా కూడా అతను నటుడిగా రాణిస్తూనే మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా తనదైన రీతిలో సత్తా చాటుతుండటం విశేషం… ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన సక్సెస్ లు ఒక రేంజ్ లో ఉంటే ఇప్పుడు సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి… మ్యూజిక్ ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలకు ప్రాణం పోస్తుంది.

మరి ఈ క్రమంలోనే ఇప్పుడు రాబోతున్న ఈ సినిమాకి రఘు కుంచె తనదైన రీతిలో సంగీతాన్ని సమకూరుస్తూ ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఈ సినిమా ప్యూర్ లవ్ అండ్ ఎమోషన్స్ తో కూడుకున్న సబ్జెక్టుగా తెలుస్తుంది. అలాగే ఈ సినిమాకి మాటలను మరుదురి రాజా అందిస్తుండడం విశేషం…నందమూరి హరి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నాడు…

అల్లు అర్జున్ మ్యూజిక్ ని వాడుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. వైరల్ అవుతున్న పోస్ట్..

Allu Arjun music used by PM Modi
Allu Arjun music used by PM Modi

Allu Arjun music used by PM Modi: ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి పాన్ ఇండియా లెవెల్ లో ఏ రేంజ్ క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ట్రేడ్ వర్గాలు చెప్తున్నది ఏమిటంటే , ప్రస్తుతానికి అల్లు అర్జున్ రేంజ్ రజినీకాంత్ , బాలీవుడ్ ఖాన్స్ ని మించినది అని , నార్త్ ఇండియా లో ఆయనకు ఉన్న మార్కెట్ ఏ హీరో కి లేదని అంటున్నారు. ఎందుకంటే ‘పుష్ప 2’ తో ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ సృష్టించిన సునామీ అలాంటిది మరి. ఈ సినిమా తర్వాత ఆయన తమిళ టాప్ డైరెక్టర్ అట్లీ తో ‘రాకా’ అనే చిత్రం చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం , వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా సంగతి పక్కన పెడితే , అల్లు అర్జున్ ప్రముఖ తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో కూడా ఒక సినిమా ఒప్పుకున్నా సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన ఒక స్పెషల్ కాన్సెప్ట్ వీడియో తో గ్రాండ్ గా ప్రకటించారు. ఈ చిత్రానికి అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ఈ కాన్సెప్ట్ వీడియో కి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సోషల్ మీడియా లో ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు ఈ మ్యూజిక్ పై ఇన్ స్టాగ్రామ్ లో 12 లక్షల రీల్స్ పడ్డాయి. నేడు ఈ మ్యూజిక్ ని మన భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఉపయోగించుకున్నాడు. విదేశీ పర్యటనలో భాగంగా బ్రటిస్లావా దేశానికీ వెళ్లిన ప్రధాని ని , ఆ దేశ ప్రెసిడెంట్ పీటర్ పెల్లెగ్రినీ ‘ది ఆర్డర్ ఆఫ్ ది వియ డబల్ క్రాస్’ అనే సత్కారం తో సన్మానించారు. అందుకు సంబంధించిన ఫోటోలకు , #AA23 మ్యూజిక్ ని అటాచ్ చేశారు.

దీంతో ఇప్పుడు ఇది సోషల్ మీడియా లో పెద్ద చర్చ అయ్యింది. అల్లు అర్జున్ మ్యూజిక్ ని ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉపయోగించాడంటే , మా హీరో పాన్ ఇండియా రీచ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ సోషల్ మీడియా లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కేవలం ప్రకటన కు సంబంధించిన వీడియో నే ఈ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తే , రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్ లో రాబోయే సినిమాకు సంబంధించిన టీజర్స్, ట్రైలర్స్, పాటలు వచ్చినప్పుడు ఏ రేంజ్ మేనియా ఉంటుందో మీరే ఊహించుకోండి అంటూ సోషల్ మీడియా లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Narendra Modi (@narendramodi)

మీడియా సమావేశంలో దీపికా పదుకొనే తో అసభ్యంగా ప్రవర్తించిన డైరెక్టర్.. వీడియో వైరల్..

Deepika Padukone viral video
Deepika Padukone viral video

Deepika Padukone viral video: బాలీవుడ్ నటీనటులు సినిమాల్లోనే కాదు , పబ్లిక్ ఈవెంట్స్ లో కూడా రొమాన్స్ చేసుకోవడం సర్వ సాధారణమైన విషయం గా మారిపోయింది. అక్కడి కల్చర్ మన టాలీవుడ్ లోకి ఇంకా రాలేదు , ఒకవేళ వస్తే ?, ఆ ఊహ కూడా ఎంతో భయంకరంగా ఉంది. ఇక్కడ శివాజీ ‘హీరోయిన్స్ సామాన్లు కంపించే విధమైన బట్టలు కాకుండా, చక్కగా చీర కట్టుకొని వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు’ అన్న మాటలకు ఎంత రచ్చ చేశారో మనమంతా చూశాము . దాదాపుగా మూడు నెలలపాటు ఆ అంశం పై చర్చ జరిగింది. అయితే ఇలాంటివి బాలీవుడ్ లో సర్వ సాధారణం. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మాత్రమే కాదు , పబ్లిక్ గా హీరోయిన్స్ తో డైరెక్టర్స్ , హీరోలు ప్రవర్తించిన తీరు చూస్తే ఏమి ఇండస్ట్రీ రా బాబు అని మనకు అనిపించక తప్పదు.

దీపికా పదుకొనే లాంటి లేడీ సూపర్ స్టార్ విషయం లో ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఇప్పుడు రణవీర్ సింగ్ తో పెళ్లి అయ్యింది కాబట్టి సరిపోయింది , పెళ్లి అవ్వని రోజుల్లో దీపికా పదుకొనే ఓపెన్ గా ఉండేదో అని చెప్పడానికి ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారిన ఒక వీడియో నే ఉదాహరణ. ఇది ఒక ప్రెస్ మీట్ కి సంబంధించిన వీడియో. ఇందులో దీపికా పదుకొనె హోమీ అదజనియా అనే బాలీవుడ్ డైరెక్టర్ తో ఉంది. ఈ వీడియో లో దీపికా పదుకొనే మాట్లాడుతుంటే హోమీ ఆమె వీపు పై ముద్దు పెడుతున్నాడు. అందుకు దీపికా పదుకొనే ఎలాంటి ఇబ్బంది పడలేదు , పైగా అతనిపై చేతులు వేస్తూ మీడియా కి అతన్ని పరిచయం చేయడం గమనార్హం. ఇది 2015 వ సంవత్సరం లో జరిగింది. సోషల్ మీడియా లో ఈ వీడియో ఇప్పుడు చాలా కాలం తర్వాత తెగ చక్కర్లు కొడుతోంది.

ఆ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. దీపికా పదుకొనే గతం లో ఎంతో మంది హీరోలతో డేటింగ్ చేసింది. ఈ విషయాన్ని బాలీవుడ్ పాపులర్ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్ ‘ లో తన భర్త రణవీర్ సింగ్ తో కలిసి పాల్గొన్నప్పుడు , అతని ముందే దీపికా చెప్పుకొచ్చింది. ఆ మాటలు విన్న తర్వాత పాపం రణవీర్ సింగ్ ముఖం మాడిపోవడం, అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవ్వడం అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. ఇక దీపికా సినిమాల విషయానికి వస్తే , ప్రస్తుతం ఆమె ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘రాకా’ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియో ని విడుదల చేయబోతున్నారు మేకర్స్.

 

View this post on Instagram

 

A post shared by Reels creator (@theworld.in4k)

పవన్ కళ్యాణ్, విజయ్ పొలిటికల్ సక్సెస్ పై సమంత హాట్ కామెంట్స్.. ఇలాంటి మాటలు ఊహించలేదు..

Samantha comments on Pawan Kalyan
Samantha comments on Pawan Kalyan

Samantha comments on Pawan Kalyan: సౌత్ ఇండియా లో ఒక్క ప్రభాస్ తో మినహా, దాదాపుగా నేటి తరం స్టార్ హీరోలందరితో కలిసి సినిమాలు చేసిన హీరోయిన్ గా సమంత కి ఒక అరుదైన రికార్డు ఉంది. సీనియర్ హీరోల్లో ఇప్పటి వరకు ఈమె కేవలం ఒక్క నాగార్జున తో మాత్రమే చేసింది , ఇతర సీనియర్ హీరోలతో కూడా ఆమె చేసి ఉండొచ్చు , కానీ ఇంతలోపు ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు షిఫ్ట్ అవ్వడం తో ఇప్పుడు కష్టం అయ్యింది. ఇకపోతే రీసెంట్ గా ఆమె ఒక చిన్న గ్యాప్ తర్వాత ‘మా ఇంటి బంగారం’ అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రం చేసింది. ఈ సినిమా ఈ నెల 19 న విడుదల అవ్వబోతున్న సందర్భంగా , సమంత నాన్ స్టాప్ గా ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఫుల్ బిజీ గా గడుపుతోంది.

ఒక్క రోజులోనే ఆమె ఏకంగా 40 ఇంటర్వ్యూస్ కి పైగా ఇచ్చిందంటే , ఈ సినిమా ప్రొమోషన్స్ విషయం లో ఆమె ఎంత డెడికేషన్ చూపిస్తుందో అర్థం చేసుకోవచ్చు. అయితే రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ ఒక ప్రశ్న అడుగుతూ ‘మీతో కలిసి పని చేసిన విజయ్ , పవన్ కళ్యాణ్ వంటి వారు నేడు రాజకీయాల్లో అత్యున్నత స్థాయిలో ఉన్నారు. ఒకరు సీఎం గా తమ రాష్ట్రంలో ఉంటే , మరొకరు డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నారు , మీకు వాళ్ళిద్దరిని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది?’ అని అడగ్గా, అందుకు సమంత సమాధానం చెప్తూ ‘నాకు చాలా గర్వంగా , ఆనందంగా ఉంది. వాళ్ళిద్దరితో కలిసి నేను పని చేస్తున్న రోజుల్లోనే గమనించాను , వీళ్ళు సామాన్యులు కాదు , భవిష్యత్తులో ఎదో పెద్ద అద్భుతాలే చేయబోతున్నారని అనిపించింది. నేడు నా అంచనాలు నిజం అవ్వడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది.

పవన్ కళ్యాణ్ తో సమంత ‘అత్తారింటికి దారేది’ అనే చిత్రం చేసింది. ఈ సినిమా కమర్షియల్ గా ఆరోజుల్లో ఇండస్ట్రీ హిట్ గా నిల్చిన సంగతి తెలిసిందే. అదే విధంగా విజయ్ తో సమంత ఇప్పటి వరకు ‘తేరి’, ‘మెర్సల్’ వంటి చిత్రాల్లో నటించింది. ఈ రెండు సినిమాలు విజయ్ కెరీర్ లో ఎలాంటి సంచనాలు నమోదు చేశాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన సీఎం అవ్వడానికి కూడా ఈ రెండు సినిమాలు చాలా బలమైన పాత్ర పోషించాయి అనడంలో అతిశయోక్తి లేదు. అలా అటు తమిళనాడు , ఇటు ఆంధ్ర ప్రదేశ్ లో శక్తివంతమైన స్థానాల్లో కూర్చున్న పవన్ కళ్యాణ్ , విజయ్ కెరీర్స్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్లిన సినిమాల్లో సమంత హీరోయిన్ గా నటించడం అనేది చిన్న విషయం కాదు.

'ఓజీ 2' లో హీరోయిన్ గా నటించబోతుంది ఆమేనా ...? ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటో..

Bhagyashri Borse in OG 2
Bhagyashri Borse in OG 2

Bhagyashri Borse in OG 2: సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ఓజీ’ గురించే చర్చ. కేవలం పవన్ కళ్యాణ్ టీం ‘ఓజీ 2’ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతుంది , సుజిత్ ఫారిన్ నుండి రాగానే ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ చర్చల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటాడు అని చెప్పరంతే, ఇక సోషల్ మీడియా లో పవన్ ఫ్యాన్స్ మేనియా తారా స్థాయికి వెళ్ళిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుండి వచ్చిన ఆ ట్వీట్ కి ఏకంగా 1 కోటి 20 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. టాలీవుడ్ హిస్టరీ లోనే ఇదొక అరుదైన రికార్డు గా చెప్పుకోవచ్చు. ఆరోజు నుండి ‘ఓజీ 2’ గురించి సోషల్ మీడియా లో ప్రతీ రోజు ఎదో ఒక చర్చ నడుస్తూనే ఉంది. నేషనల్ మీడియా నుండి ఇంటర్నేషనల్ మీడియా వరకు ‘ఓజీ 2’ గురించి ప్రత్యేకంగా ఆర్టికల్స్ రాశాయి.

ఇంతటి క్రేజ్ ఈమధ్య కాలం లో రాజమౌళి ‘వారణాసి’ కి మాత్రమే చూశారు , ఆ తర్వాత ‘ఓజీ 2’ కి చూస్తున్నారు నెటిజెన్స్. సుజిత్ ఈ నెలాఖరున విదేశాల నుండి హైదరాబాద్ కి రాబోతున్నాడు. అప్పటి నుండి ‘ఓజీ 2’ గురించి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఈ సినిమా లుక్స్ కోసం పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రత్యేకమైన డైట్ ని అనుసరిస్తున్నాడు అట. ఇదంతా పక్కన పెడితే , ‘ఓజీ 2’ లో హీరోయిన్ ఉంటుందా లేదా అనేది పెద్ద చర్చ గా మారింది. ఎందుకంటే ‘ఓజీ 2’ లో పవన్ కళ్యాణ్ గతం గురించి చూపించబోతున్నారు. సత్య దాదా ని వదిలి వెళ్లిపోయిన తర్వాత 8 ఏళ్ళు ఓజాస్ గంభీర ఏమి చేశాడు అనే దానిపైనే ఈ చిత్రం ఉంటుంది. ఆ 8 ఏళ్ళ కాలం లో ఆయన జపాన్ లోకి రీ ఎంట్రీ ఇవ్వడం, అక్కడ మాస్టర్ ‘ఓరోచి గెంషిన్’ గా మారి , ఆ తర్వాత సమురాయ్ క్లాన్ కి లీడర్ గా ఎదిగిన తీరు.

యాకూజా మొత్తాన్ని సంహరించి , తానూ చనిపోయినట్టుగా నమ్మించి మధురై కి రావడం, ఇలాంటి అంశాలన్నీ ఈ ‘ఓజీ 2’ లో చూపించబోతున్నాడు డైరెక్టర్ సుజిత్. అయితే ఈ సినిమా అత్యధిక శాతం జపాన్ లోనే ఉంటుంది కాబట్టి , అప్పటికి ఆయనకు ప్రియాంక అరుళ్ మోహనన్ తో పరిచయం ఉండదు కాబట్టి , ఈ సినిమాలో ఆమె కనిపించకపోవచ్చు. కానీ మధురై కి వచ్చిన తర్వాత ఆమెతో పరిచయం ఎలా ఏర్పడింది , ప్రేమ ఎలా పుట్టింది వంటివి ఈ ‘ఓజీ 2’ లో చూపించే అవకాశం ఉంది. అయితే ఈ ‘ఓజీ 2’ లో ప్రముఖ హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే ని తీసుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈమె హీరోయిన్ పాత్ర పోషిస్తుందా? , లేదా వేరే ఏదైనా కీలక పాత్ర పోషిస్తుందా అనేది చూడాలి.

వేదిక పై నుండే నాగ చైతన్య కి వార్నింగ్ ఇచ్చిన సమంత.. సంచలనం రేపుతున్న వీడియో..

Samantha warning to Naga Chaitanya
Samantha warning to Naga Chaitanya

Samantha warning to Naga Chaitanya: చాలా కాలం విరామం తర్వాత ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత ‘మా ఇంటి బంగారం’ చిత్రం తో ఈ నెల 19 వ తేదీన మన ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా , ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ ఆద్యంతం వినోదభరితంగా సాగింది. సమంత చాలా కాలం తర్వాత ఎంతో ఉత్సాహంగా కనిపించడం చూసి ఆమె అభిమానులు సంబరపడుతున్నారు. ఈ ఈవెంట్ కి సమంత భర్త రాజ్ నిడిమోరు కూడా హాజరయ్యాడు. ఎందుకంటే ఈ చిత్రానికి ఆయన కూడా సహనిర్మాతగా వ్యవహరించాడు. అయితే ఈ ఈవెంట్ లో సమంత మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ సినిమా ప్రొమోషన్స్ కోసం ఆమె ఏ ఈవెంట్ కి వెళ్లినా ప్రధానంగా ఒక డైలాగ్ ని కొడుతూ వస్తుంది.

‘ఒక్కొక్కరిని కొడుతాను చూడూ’ అని గ్యాప్ ఇచ్చి ‘ప్రేమతో అబ్బా’ అని చివర్లో అంటుంది. నిన్నటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఆమె ఇదే డైలాగ్ ని కొడుతూ ‘ ఈ సినిమాతో ఒక్కక్కరిని కొడుతాను చూడూ’ అని గ్యాప్ ఇస్తుంది. అప్పుడు ఆడియన్స్ నుండి ఈలలు, చప్పట్లు రాగా, ‘ప్రేమతో అబ్బా’ అని అంటుంది. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ డైలాగ్ కచ్చితంగా అక్కినేని ఫ్యామిలీ ని , అక్కినేని నాగ చైతన్య ని ఉద్దేశించే సమంత కొట్టిందని సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే సమంత పెద్ద సూపర్ స్టార్ , ఆమె సినిమాకు మినిమం గ్యారంటీ ఓపెనింగ్స్ వస్తాయి , ఆ ఓపెనింగ్స్ అక్కినేని ఫ్యామిలీ హీరోల ఓపెనింగ్స్ కంటే ఎక్కువ ఉంటాయని నెటిజెన్స్ ఉద్దేశ్యం. సోషల్ మీడియా లో ఇలాంటి ట్రోల్స్ ప్రతీ హీరో కి కామన్ అనుకోండి , అది వేరే విషయం.

ఇంకా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆమె మాట్లాడుతూ ‘ఒక నిర్మాతకు సినిమా విడుదలకు ముందు ఎంత ఒత్తిడి ఉంటుంది అనేది నాకు ఈ సినిమాతో అర్థం అయ్యింది. ఇప్పటి వరకు ఒక నటిగా , చాలా హాయిగా నా జీవితాన్ని అనుభవించాను. కానీ ఇప్పుడు అర్థం అవుతుంది నిర్మాత విలువ ఏంటో. ఒక సినిమా హిట్ అయితే డైరెక్టర్, నటీనటులకు మాత్రమే క్రెడిట్ వెళ్తుంది, కానీ నిర్మాతకు వెళ్ళదు. ఈ వేదిక నుండి నేడు నిర్మాతలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను, మీరు లేకపోతే నేను ఈరోజు ఈ స్థాయికి ఎదిగి, ఒక నిర్మాతగా సినిమా తీసే రేంజ్ కి వచేదాన్ని కాదు’ అంటూ చెప్పుకొచ్చింది సమంత. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించింది. గతంలో ఈమెతో సమంత కలిసి చేసిన ‘ఓ బేబీ’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.