Homeఎంటర్టైన్మెంట్Peddi Hindi collections 12 days: 'పెద్ది' హిందీ వెర్షన్ 12 రోజుల వసూళ్లు.. కనీసం...

Peddi Hindi collections 12 days: ‘పెద్ది’ హిందీ వెర్షన్ 12 రోజుల వసూళ్లు.. కనీసం 50 శాతం రీకవరీ కూడా అవ్వలేదు..

Peddi Hindi collections 12 days: వర్కింగ్ డేస్ లో కూడా స్టడీ కలెక్షన్స్ ని రాబడుతూ ‘పెద్ది’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రోజుకో బెంచ్ మార్క్ ని క్రియేట్ చేస్తూ , ముందుకు పోతున్న విధానం చూసి , బయ్యర్స్ ఫుల్ ఖుషీ లో ఉన్నారు. ఈ స్థాయి వసూళ్లు కేవలం సంక్రాంతి సీజన్ కి మాత్రమే పరిమితం అని భావించిన కొంతమంది విశ్లేషకుల నోర్లు మూయించింది ఈ చిత్రం. సోమవారం రోజున అనగా […]

Peddi Hindi collections 12 days: వర్కింగ్ డేస్ లో కూడా స్టడీ కలెక్షన్స్ ని రాబడుతూ ‘పెద్ది’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రోజుకో బెంచ్ మార్క్ ని క్రియేట్ చేస్తూ , ముందుకు పోతున్న విధానం చూసి , బయ్యర్స్ ఫుల్ ఖుషీ లో ఉన్నారు. ఈ స్థాయి వసూళ్లు కేవలం సంక్రాంతి సీజన్ కి మాత్రమే పరిమితం అని భావించిన కొంతమంది విశ్లేషకుల నోర్లు మూయించింది ఈ చిత్రం. సోమవారం రోజున అనగా 12వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 4 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా ఎలాంటి సునామీ సృష్టిస్తూ ముందుకు వెళ్తుంది అనేది. తెలుగు రాష్ట్రాల్లో ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ గా నిల్చిన ఈ చిత్రం , హిందీ వెర్షన్ లో డిజాస్టర్ కా బాప్ గా నిలవడం శోచనీయం.

ఈ సినిమా కంటెంట్ అక్కడి ఆడియన్సు పట్టుకునే విధంగానే ఉంది , కానీ ఎందుకో బాక్స్ ఆఫీస్ వద్ద జోరు చూపించడం లేదు. విడుదలకు ముందు ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కేవలం హిందీ వెర్షన్ కి గానూ పాతిక కోట్ల రూపాయలకు జరిగింది. అంటే ఈ చిత్రం కచ్చితంగా పాతిక కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సిందే. కానీ ఇప్పటి వరకు కేవలం 11 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది అట. అంటే సగం కూడా ఇప్పటి వరకు రీకవరీ అవ్వలేదు. రోజుల వారీగా ఈ చిత్రానికి హిందీ వెర్షన్ నుండి నమోదైన నెట్ వసూళ్లు ఎంతో ఒకసారి వివరంగా చూద్దాము. మొదటి రోజున హిందీ వెర్షన్ నుండి ఈ చిత్రం దాదాపుగా 3 కోట్ల 25 లక్షల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత రెండవ రోజున 2 కోట్ల 50 లక్షలు , 3 వ రోజున 3 కోట్ల 10 లక్షలు , 4 వ రోజున 3 కోట్ల 65 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి.

ఇది చాలా డీసెంట్ రేంజ్ నెట్ వసూళ్లు అని చెప్పొచ్చు. ఈ స్టడీ కలెక్షన్స్ ట్రెండ్ వర్కింగ్ డేస్ లో కూడా కొనసాగితే కచ్చితంగా బ్రేక్ ఈవెన్ అవ్వుద్దని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. 5 వ రోజున కేవలం 1 కోటి 30 లక్షల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , 6 వ రోజున 1 కోటి 55 లక్షలు , 7 వ రోజున 1 కోటి 15 లక్షలు , 8 వ రోజున 1 కోటి 10 లక్షలు , 9 వ రోజున 50 లక్షలు , 10 వ రోజున 90 లక్షలు , 11 వ రోజున 1 కోటి 20 లక్షలు , 12 వ రోజున 55 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా 12 రోజుల్లో 20 కోట్ల 75 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు , 26 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. షేర్ వసూల్ కేవలం 11 కోట్లు మాత్రమే. లాంగ్ రన్ లో మరో 2 కోట్ల షేర్ వసూళ్లు రావొచ్చు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper