Homeఎంటర్టైన్మెంట్Samantha warning to Naga Chaitanya: వేదిక పై నుండే నాగ చైతన్య కి వార్నింగ్...

Samantha warning to Naga Chaitanya: వేదిక పై నుండే నాగ చైతన్య కి వార్నింగ్ ఇచ్చిన సమంత.. సంచలనం రేపుతున్న వీడియో..

Samantha warning to Naga Chaitanya: చాలా కాలం విరామం తర్వాత ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత ‘మా ఇంటి బంగారం’ చిత్రం తో ఈ నెల 19 వ తేదీన మన ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా , ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ ఆద్యంతం వినోదభరితంగా సాగింది. సమంత చాలా కాలం తర్వాత ఎంతో ఉత్సాహంగా కనిపించడం చూసి ఆమె […]

Samantha warning to Naga Chaitanya: చాలా కాలం విరామం తర్వాత ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత ‘మా ఇంటి బంగారం’ చిత్రం తో ఈ నెల 19 వ తేదీన మన ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా , ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ ఆద్యంతం వినోదభరితంగా సాగింది. సమంత చాలా కాలం తర్వాత ఎంతో ఉత్సాహంగా కనిపించడం చూసి ఆమె అభిమానులు సంబరపడుతున్నారు. ఈ ఈవెంట్ కి సమంత భర్త రాజ్ నిడిమోరు కూడా హాజరయ్యాడు. ఎందుకంటే ఈ చిత్రానికి ఆయన కూడా సహనిర్మాతగా వ్యవహరించాడు. అయితే ఈ ఈవెంట్ లో సమంత మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ సినిమా ప్రొమోషన్స్ కోసం ఆమె ఏ ఈవెంట్ కి వెళ్లినా ప్రధానంగా ఒక డైలాగ్ ని కొడుతూ వస్తుంది.

‘ఒక్కొక్కరిని కొడుతాను చూడూ’ అని గ్యాప్ ఇచ్చి ‘ప్రేమతో అబ్బా’ అని చివర్లో అంటుంది. నిన్నటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఆమె ఇదే డైలాగ్ ని కొడుతూ ‘ ఈ సినిమాతో ఒక్కక్కరిని కొడుతాను చూడూ’ అని గ్యాప్ ఇస్తుంది. అప్పుడు ఆడియన్స్ నుండి ఈలలు, చప్పట్లు రాగా, ‘ప్రేమతో అబ్బా’ అని అంటుంది. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ డైలాగ్ కచ్చితంగా అక్కినేని ఫ్యామిలీ ని , అక్కినేని నాగ చైతన్య ని ఉద్దేశించే సమంత కొట్టిందని సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే సమంత పెద్ద సూపర్ స్టార్ , ఆమె సినిమాకు మినిమం గ్యారంటీ ఓపెనింగ్స్ వస్తాయి , ఆ ఓపెనింగ్స్ అక్కినేని ఫ్యామిలీ హీరోల ఓపెనింగ్స్ కంటే ఎక్కువ ఉంటాయని నెటిజెన్స్ ఉద్దేశ్యం. సోషల్ మీడియా లో ఇలాంటి ట్రోల్స్ ప్రతీ హీరో కి కామన్ అనుకోండి , అది వేరే విషయం.

ఇంకా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆమె మాట్లాడుతూ ‘ఒక నిర్మాతకు సినిమా విడుదలకు ముందు ఎంత ఒత్తిడి ఉంటుంది అనేది నాకు ఈ సినిమాతో అర్థం అయ్యింది. ఇప్పటి వరకు ఒక నటిగా , చాలా హాయిగా నా జీవితాన్ని అనుభవించాను. కానీ ఇప్పుడు అర్థం అవుతుంది నిర్మాత విలువ ఏంటో. ఒక సినిమా హిట్ అయితే డైరెక్టర్, నటీనటులకు మాత్రమే క్రెడిట్ వెళ్తుంది, కానీ నిర్మాతకు వెళ్ళదు. ఈ వేదిక నుండి నేడు నిర్మాతలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను, మీరు లేకపోతే నేను ఈరోజు ఈ స్థాయికి ఎదిగి, ఒక నిర్మాతగా సినిమా తీసే రేంజ్ కి వచేదాన్ని కాదు’ అంటూ చెప్పుకొచ్చింది సమంత. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించింది. గతంలో ఈమెతో సమంత కలిసి చేసిన ‘ఓ బేబీ’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper