Homeఎంటర్టైన్మెంట్Nagarjuna movie assistant director: నాగార్జున సినిమా కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ఆ...

Nagarjuna movie assistant director: నాగార్జున సినిమా కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ఆ స్టార్ హీరో.. నాగ్ పక్కన నటించడం లేదా..?

Nagarjuna movie assistant director: అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు నాగార్జున…చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా అవతరించాడు. ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉండేది. రొమాంటిక్ హీరోగా పేరు సంపాదించుకున్న ఆయన ఆ తర్వాత మాస్ హీరోగా అవతరించి కమర్షియల్ సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను రాబట్టాడు. ఇక పౌరాణిక సినిమాల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం […]

Nagarjuna movie assistant director: అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు నాగార్జున…చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా అవతరించాడు. ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉండేది. రొమాంటిక్ హీరోగా పేరు సంపాదించుకున్న ఆయన ఆ తర్వాత మాస్ హీరోగా అవతరించి కమర్షియల్ సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను రాబట్టాడు. ఇక పౌరాణిక సినిమాల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశాడు. ఇక ఇప్పటికీ ఆయన ప్రయోగాత్మకమైన సినిమాలను చేయడానికి ముందు వరుసలో ఉంటాడు. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఎవరు చేయనటువంటి ఎక్స్పెరిమెంటల్ సినిమాలను చేసిన ఘనత కూడా తనకే దక్కింది… ఇక అలాంటి నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో కొంతవరకు డీలా పడ్డాడు. కారణం ఏదైనా కూడా తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. లేకపోతే మాత్రం ఆయన చాలా వరకు డీలా పడిపోతాడు…

ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు నాగార్జున సూపర్ హిట్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన ఒక వ్యక్తి ఆ తర్వాత కాలంలో నటుడిగా మారి ఆ తర్వాత స్టార్ హీరోగా కూడా అవతరించాడు. ప్రస్తుతం నాగార్జున చేస్తున్న ఒక సినిమాలో అతన్ని నటించమని అడగగా తను నాగార్జున పక్కన నటించడానికి ఇంట్రెస్ట్ చూపించనట్టుగా తెలుస్తుంది.

ఇంతకీ ఆ హీరో ఎవరు అంటే రవితేజ కావడం విశేషం… నాగార్జున హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో చేసిన ‘నిన్నే పెళ్లాడుతా’ సినిమాకి రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఆ తర్వాత హీరోగా మారి వరస సక్సెస్ లను సాధించి టాప్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.

ప్రస్తుతం నాగార్జున చేస్తున్న ఒక సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం రవితేజ ని సంప్రదించగా నాగార్జున పక్కన నటించడం అంటే తనకి చాలా భయంగా ఉంటుందని అతనితో నటించడం చాలా వరకు తను ఆన్ కంఫర్ట్ గా ఫీల్ అవుతానని చెప్పి రవితేజ ఆ పాత్రని రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి అతని ప్లేస్ లో ఎవరిని తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper