Homeఎంటర్టైన్మెంట్Sing Geetham 4 days Collections: 'సింగ్ గీతం' 4 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.....

Sing Geetham 4 days Collections: ‘సింగ్ గీతం’ 4 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. చిన్న సినిమాకు ఈ రేంజ్ గ్రాస్ ఊహించలేదు..

Sing Geetham 4 days Collections: ఈమధ్య కాలం లో పెద్ద సినిమాలకంటే చిన్న సినిమాలే బయ్యర్స్ కి , నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెడుతున్నాయి. వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు తీసి, అవి రీకవరీ అవ్వక, నష్టాలను అనుభవించడం కంటే , అతి తక్కువ బడ్జెట్ తో క్వాలిటీ కంటెంట్ సినిమాలు తీసి , భారీ లాభాలు దక్కించుకోవడం ఎంతో బెటర్ అనేలా నిరూపించాయి కొన్ని సినిమాలు. అలాంటి సినిమాల్లో రీసెంట్ గా విడుదలైన […]

Sing Geetham 4 days Collections: ఈమధ్య కాలం లో పెద్ద సినిమాలకంటే చిన్న సినిమాలే బయ్యర్స్ కి , నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెడుతున్నాయి. వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు తీసి, అవి రీకవరీ అవ్వక, నష్టాలను అనుభవించడం కంటే , అతి తక్కువ బడ్జెట్ తో క్వాలిటీ కంటెంట్ సినిమాలు తీసి , భారీ లాభాలు దక్కించుకోవడం ఎంతో బెటర్ అనేలా నిరూపించాయి కొన్ని సినిమాలు. అలాంటి సినిమాల్లో రీసెంట్ గా విడుదలైన ‘సింగ్ గీతం’ అనే చిత్రం కూడా చేరింది. 94 ఏళ్ళ వయస్సులో నేటి తరం యూత్ కి తగ్గట్టుగా ఒక డిఫరెంట్ సబ్జెక్టు ని తెరకెక్కించి , అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకోవడం కేవలం సింగీతం శ్రీనివాస్ కి మాత్రమే చెల్లింది. పాటలతో సినిమా కథని నదించాలనే ఆయన అద్భుతమైన ఆలోచనకు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు , విడుదలైన నాలుగు రోజుల్లో ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద నమోదైన కలెక్షన్స్ ఎలాంటివి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము.

ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం , ఈ చిత్రానికి మొదటి మూడు రోజుల్లో ఇండియా వైడ్ గా దాదాపుగా 3 కోట్ల 80 లక్షల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లను నమోదు చేసుకుంది. ఓవర్సీస్ కలెక్షన్స్ ని కూడా కలుపుకుంటే , ఈ చిత్రానికి మొదటి వీకెండ్ లో 4 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు , 2 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. మొదటి సోమవారం , అనగా 5 వ రోజున కూడా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లోని A సెంటర్స్ లో స్టడీ కలెక్షన్స్ నమోదు అయ్యాయి. ముఖ్యంగా ఫస్ట్ షోస్ , సెకండ్ షోస్ మల్టీప్లెక్స్ థియేటర్స్ లో ఆక్యుపెన్సీలు బాగున్నాయి. మొత్తం ఓవరాల్ గా 4 వ రోజున వర్కింగ్ డే అయ్యినప్పటికీ ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి 50 లక్షల రూపాయిల రేంజ్ గ్రాస్ గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

షేర్ వసూళ్లు పాతిక లక్షల వరకు ఉండొచ్చు , ఇదే రేంజ్ స్టడీ ట్రెండ్ కొనసాగుతూ ముందుకు వెళ్తే ఈ చిత్రం కచ్చితంగా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని , సూపర్ హిట్ స్టేటస్ కి చేరుకుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. విడుదలకు ముందు ఈ చిత్రానికి 7 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ వీకెండ్ తో బ్రేక్ ఈవెన్ మార్కుని కచ్చితంగా అందుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు, చూడాలి మరి ఆ స్థాయికి వెళ్తుందా లేదా అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper