Home Blog Page 101

అత్త ను అలా చూడాలనుంది.. హుండీలో కోడలి కానుక.. పూజారుల ఫ్యూజులు ఎగిరిపోయాయి..

Rs 20 Note Prayer Goes Viral
Rs 20 Note Prayer Goes Viral

Rs 20 Note Prayer Goes Viral: సాధారణంగా మనం ఆలయానికి వెళ్ళినప్పుడు.. దేవుడిని దర్శించుకుంటాం. ఆ తర్వాత హుండీలో కానుకలు వేస్తుంటాం. తాము మొక్కుకున్న మొక్కుల ఆధారంగా కానుకలు వేస్తుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు కొంతమంది భక్తులు నిలువు దోపిడీ కూడా సమర్పించుకుంటారు. ఇలా భక్తుల మొక్కుల ఆధారంగానే కానుకలు సమర్పిస్తుంటారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలోని ఆత్మకూరు మండలంలో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఆత్మకూరు మండలంలోని పంపనూరు ప్రాంతంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం హుండీలో ఇటీవల అర్చకులు లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. హుండీలో ఉన్న కానుకలను లెక్కించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో అర్చకులకు ఒక 20 రూపాయల నోటు లభించింది. ఆ నోటు మీద ఉన్న రాత చూసి వారికి దిమ్మ తిరిగిపోయింది.

“స్వామి మా అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నాను.. ఆమె త్వరగా చనిపోయేలా చూడు” అంటూ ఆ నోటు మీద రాసింది.. దీంతో అర్చకులు ఒకసారిగా ముక్కున వేలేసుకున్నారు. దేవుడికి సమర్పించే కానుకల విషయంలో కూడా ఇలా కూడా వ్యవహరిస్తారా అంటూ ఆశ్చర్యపోయారు.. అయితే ఆ అజ్ఞాత భక్తురాలు ఎవరో గాని కొంతకాలంగా ఆమె అత్త చేతిలో వేదింపులకు గురవుతున్నట్టు తెలుస్తోంది. అందువల్లే ఇలాంటి కోరిక కోరినట్టు అక్కడి అర్చకులు చర్చించుకుంటున్నారు.

ఈ వ్యవహారం ఆ నోటా ఈ నోటా పడి చర్చకు దారి తీస్తోంది. మీడియాలో విస్తృతంగా ప్రసారమవుతోంది. ఇటీవల కాలంలో ఈ ఆలయంలో ఇటువంటి విచిత్ర కోరికలు కోరుకుంటూ.. స్వామివారికి కానుకలు సమర్పించేవారు పెరిగిపోయారంటూ అక్కడి అర్చకులు చెబుతున్నారు.. అయితే స్వామి వారిని కోరికలు కోరుతున్నప్పుడు అవి సహజ సిద్ధంగా ఉండాలని.. అంతేతప్ప ఇటువంటి దారుణాలకు సంబంధించినవి ఉండకూడదని అర్చకులు అంటున్నారు. దేవుడు మనిషి బాగు మాత్రమే కోరుతాడని.. చావును ఇష్టపడడని అర్చకులు అంటున్నారు.

ఇక్కడ సుబ్రమణ్య స్వామి ఆలయం చాలా ఫేమస్. అయ్యప్ప స్వామి దీక్షల సమయంలో ఈ ఆలయం మాల ధారులతో సందడిగా ఉంటుంది. ప్రతిరోజు ఇక్కడ భజన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్య షష్టినాడు ఇక్కడ విశేషమైన పూజలు జరుపుతుంటారు. భక్తులకు అన్నదానం.. స్వామివారికి పూజలు జరుపుతూ ఉంటారు.

2026లో అందుబాటులో ఉన్న అద్భుతమై స్టైలిష్ బైకుల్లో 5 బెస్ట్ ఇవే..

Best Stylish Bikes 2026
Best Stylish Bikes 2026

Best Stylish Bikes 2026: బైక్ కొనే సమయంలో కొందరు మైలేజ్ గురించి ఆలోచిస్తారు. మరికొందరు మాత్రం స్టైలిష్ గా ఉండే వెహికిల్ కొనుగోలుపై ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇలాంటి వారు ధరతో సంబంధం లేకుండా స్పోర్టీ లుక్ తో పాటు మోడ్రన్ లుక్ లో ఉండాలని అనుకుంటారు. అయితే 2026లో రోడ్లపై వెళ్తుంటే అందరి దృష్టిని ఆకర్షించే 5 స్టైలిష్ బైకులు ఏవో ఇప్పుడుచూద్దాం..

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 (Royal Enfield Interceptor 650):
మోడ్రన్ రెట్రో క్లాసిక్ లుక్‌తో బైక్ ప్రియులను అమితంగా ఆకట్టుకునే బైక్ ఇది. ఇందులో 648cc, పారలల్-ట్విన్ ఇంజన్ ఉంటుంది. ప్రయాణంలో అద్భుతమైన పవర్ తో పాటు క్లాసిక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎగ్జాస్ట్ సౌండ్‌ను అందిస్తుంది. క్రూయిజింగ్ కోసం, లాంగ్ రైడ్స్ కోసం ఎంతో సౌకర్యవంతంగా ఉండే ఈ బైక్, తన క్రోమ్ ఫినిషింగ్ మరియు వింటేజ్ డిజైన్‌తో రోడ్డుపై వెళ్తుంటే పాతకాలపు రాయల్ లుక్‌ను గుర్తుచేస్తూ అందరి కళ్లూ తనవైపే తిప్పుకునేలా చేస్తుంది. దీని ధర సుమారు రూ. 3.35 లక్షలు (ఎక్స్-షోరూమ్).

కావసాకి Z650 (Kawasaki Z650):
మిడ్-వెయిట్ స్ట్రీట్ ఫైటర్ సెగ్మెంట్‌లో కావసాకి Z650 ఒక అద్భుతం. దీనికి ఉండే పదునైన ‘సుగోమి’ డిజైన్ ఫిలాసఫీ, అగ్రెసివ్ హెడ్‌ల్యాంప్, మజిల్ ట్యాంక్ బైక్‌కు స్పోర్టీ లుక్‌ను ఇస్తాయి. ఇందులో 649cc, పారలల్-ట్విన్ ఇంజన్ ఉండడంతో అత్యంత వేగవంతమైన పర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది. అటు సిటీ రోడ్లపై, ఇటు హైవేలపై దూసుకుపోవడానికి, స్టైల్‌తో పాటు పవర్‌ను ఆశించే రైడర్లకు ఇది బెస్ట్ ఛాయిస్. దీనిని సుమారు రూ. 7.26 లక్షల (ఎక్స్-షోరూమ్)తో కొనుగోలు చేయొచ్చు.

టీవీఎస్ అపాచీ RTX 300 (TVS Apache RTX 300):
టీవీఎస్ నుంచి మార్కెట్లోకి వచ్చిన సరికొత్త అడ్వెంచర్ టూరర్ మోటార్ సైకిల్ ఇది. రఫ్‌గా, ఎంతో స్టైలిష్‌గా ఉండే దీని డిజైన్ అడ్వెంచర్ ప్రియులను కట్టిపడేస్తుంది. 299.1cc, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌తో వచ్చే ఈ బైక్ 36 PS పవర్‌ను జనరేట్ చేస్తుంది. 200mm గ్రౌండ్ క్లియరెన్స్, లాంగ్-ట్రావెల్ సస్పెన్షన్ 5 అంగుళాల TFT డిస్‌ప్లే వంటి మోడ్రన్ ఫీచర్లు రైడర్లను ఆకట్టుకుంటుంది. దీనిని కొనుగోలు చేయాలంటే రూ. 1.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) వెచ్చించాలి.

అప్రిలియా RS 457 (Aprilia RS 457):
రేసింగ్ బైక్స్ ఇష్టపడే యువతకు అప్రిలియా RS 457 ఒక కలల బైక్. దీని సూపర్ స్పోర్ట్స్ ఏరోడైనమిక్ డిజైన్, స్ప్లిట్ LED హెడ్‌లైట్స్ , అగ్రెసివ్ ఫెయిరింగ్ లుక్ చూడగానే వావ్ అనిపిస్తాయి. 457cc, లిక్విడ్-కూల్డ్, పారలల్-ట్విన్ ఇంజన్‌తో పర్ఫార్మెన్స్‌లో దూసుకుపోయే ఈ బైక్.. రైడ్ బై వైర్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ప్రీమియం ఎలక్ట్రానిక్స్ ఫీచర్లతో వస్తుంది. ట్రాక్ రేసింగ్ లుక్‌తో రోడ్లపై వెళ్తుంటే ఇది ఖచ్చితంగా అందరి చూపులను ఆకర్షిస్తుంది. ఈ బైక్ ధర సుమారు రూ. 4.22 lakh (ఎక్స్-షోరూమ్) గా ఉంది.

కేటీఎమ్ 200 డ్యూక్ (KTM 200 Duke):
యువతలో ఎప్పటికీ క్రేజ్ తగ్గని నెక్డ్ స్ట్రీట్ ఫైటర్ బైక్ కేటీఎమ్ 200 డ్యూక్. దీని సిగ్నేచర్ ఆరెంజ్ కలర్ థీమ్, షార్ప్ ఎక్స్‌టెన్షన్స్, అగ్రెసివ్ స్టాన్స్ దీనికి ఒక యూనిక్ ఐడెంటిటీని ఇస్తాయి. 199.5cc, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ అందించే ఇన్‌స్టంట్ పికప్ మరియు తేలికపాటి హ్యాండ్లింగ్ దీని సొంతం. సిటీ ట్రాఫిక్‌లో సులువుగా దూసుకుపోతూ, కాలేజ్ స్టూడెంట్స్ మరియు యంగ్ రైడర్ల స్టైల్ స్టేట్‌మెంట్‌గా ఈ బైక్ నిలుస్తుంది. దీనిని రూ. 2.00 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి విక్రయిస్తున్నారు.

గిల్.. గౌతమ్ గంభీర్.. ఇండియా పుట్టి ముంచేలా ఉన్నారుగా..

Shubman Gill Gautam Gambhir
Shubman Gill Gautam Gambhir

Shubman Gill Gautam Gambhir: ఏకపక్షంగా విజయాలు సాధ్యమైనప్పుడు.. టోర్నీలు గెలిచినప్పుడు.. ఇంకా ఏమైనా మ్యాచ్ లు మిగిలి ఉంటే మేనేజ్మెంట్ ప్రయోగాలు చేయాలి. అప్పుడు మిగతా ఆటగాళ్లలో ఉన్న దమ్ము బయటపడుతుంది. వారు జట్టుకు ఏ మేరకు సహకరిస్తారో తెలుస్తుంది. కానీ, చాంతాడంత లక్ష్యాన్ని ముందు పెట్టుకొని.. బలమైన ఆకాంక్షలను నిర్ణయించుకొని.. ఆ దిశగా అడుగులు వేయాల్సిన చోట.. తడబడితే.. పనికిమాలిన ప్రయోగాలు చేస్తే అంతకుమించిన దరిద్రం మరొకటి ఉండదు.

ఇప్పుడు టీమిండియాకు ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ముఖ్యంగా కోచ్ గౌతమ్ గంభీర్.. కెప్టెన్ గిల్ చేస్తున్న ప్రయోగాలు టీమ్ ఇండియా పుట్టి ముంచే విధంగా ఉన్నాయి. వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ జరుగుతుంది. దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే వేదికలుగా ఈ మెగా టోర్నీ కొనసాగుతూ ఉంటుంది. 2023 లో టీమిండియా వన్డే వరల్డ్ కప్ కోల్పోయింది. సొంత దేశంలో ఈ టోర్నీ నిర్వహించినప్పటికీ టీమిండియా విజేతగా నిలవలేకపోయింది. ఈసారి ఎలాగైనా ఛాంపియన్ గా అవతరించాలని టీమిండియా భావిస్తోంది. ఈ క్రమంలోనే వైట్ బాల్ ఫార్మాట్లో స్థిరమైన స్థాయి ప్రదర్శన చేస్తోంది.

అనవసరమైన ప్రయోగాలు స్థిరమైన ఆటతీరు కొనసాగిస్తున్న నేపథ్యంలో మేనేజ్మెంట్ ప్రయోగాలు మొదలుపెట్టింది. గౌతమ్ గంభీర్.. గిల్ ప్రస్తుతం జరుగుతున్న ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ లో వింత వింత నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా ఓపెనర్ గా రావలసిన గిల్ రెండో స్థానంలోకి వచ్చాడు. జైస్వాల్ ఓపెనర్ అవతారం ఎత్తాడు. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయాల్సిన అతడు.. తడబడుతున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ల బౌలింగ్ ముందు తేలిపోతున్నాడు. రెండు మ్యాచ్ల్లో ఇదే వరుస. మరో ఓపెనర్ రోహిత్ శర్మ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తుంటే.. జైస్వాల్ మాత్రం ఇబ్బంది పడుతున్నాడు.. రోహిత్ శర్మతోపాటు గిల్ ఓపెనర్ గా వచ్చుంటే జైస్వాల్ మీద ఒత్తిడి తగ్గేది. అతడు వన్ డౌన్ లో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసేవాడు. కానీ, లేని ప్రయోగాలకు పోయి గంభీర్.. గిల్ అతడిని ఓపెనర్ గా పంపించారు. ఫలితంగా రెండు మ్యాచ్ల్లో అతడి విఫలమయ్యాడు. దీంతో గంభీర్ .. గిల్ ప్రయోగాల పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వీరిద్దరూ టీమిండియా పుట్టించే విధంగా ఉన్నారని మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు. వన్డే వరల్డ్ కప్ ముందు ఇలాంటి నిర్ణయాలు వద్దని వారు సూచిస్తున్నారు. వన్డే వరల్డ్ కప్ నెగ్గిన తర్వాత.. ఇలాంటి ప్రయోగాలు ఎన్నైనా చేసుకోవచ్చని వారు సూచిస్తున్నారు. వన్డే వరల్డ్ కప్ ముందు కొంతమంది అంచనాలు ఉన్న ఆటగాళ్లు విఫలమైతే.. వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని చెబుతున్నారు. ఇప్పటికైనా గిల్.. గంభీర్ మారతారా.. ప్రయోగాలను పక్కనపెట్టి.. అసలైన ఆటగాళ్లకు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇస్తారా.. ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

డీఎస్సీ 2025.. డ్యామేజ్ ప్రభుత్వానికా? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకా?

DSC 2025 Andhra Pradesh
DSC 2025 Andhra Pradesh

DSC 2025 Andhra Pradesh: డీఎస్సీ 2025 విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరోసారి షాక్ తప్పులేదు. ఉపాధ్యాయ నియామక ప్రక్రియలు అనేక రకాల అవకతవకలు జరిగాయని గత కొద్ది రోజులుగా ఆరోపణలు చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి అయితే తన పక్కన డీఎస్సీ అభ్యర్థులను పెట్టుకుని మరి ఆరోపణలు చేస్తూ వచ్చారు. అయితే ఈ విషయంలో అనుకున్న స్థాయిలో వైసీపీకి ప్రజల్లో మైలేజ్ దక్కలేదు. అలా దక్కలేదు సరి కదా తిరిగి డ్యామేజ్ జరిగింది. దానికి కారణం లేకపోలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు మాదిరిగా కూటమి నుంచి ఎదురుదాడి రాలేదు. ఒక పద్ధతి ప్రకారం అధికారులు మీడియా ముందుకు వచ్చి సుదీర్ఘ వివరణలు ఇచ్చారు. ప్రతి అంశంపై స్పష్టత ఇచ్చారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు తేలిపోయాయి. ఇదంతా రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ప్రయత్నం గా ప్రజలు ఒక అంచనాకు వచ్చారు. అందుకే లైట్ తీసుకుంటున్నారు. మరికొందరైతే అసహ్యించుకుంటున్నారు వైసీపీ తీరుపై.

ఎప్పటికప్పుడు స్టాండ్ మార్చుతూ..
డీఎస్సీ విషయంలో వైసిపి ఒక స్టాండ్ తో ముందుకు వెళ్లలేదు. రకరకాల ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూసింది. వైసీపీ నుంచి వచ్చిన ఆరోపణలకు కూటమి నేతలు కౌంటర్ ఇచ్చి ఉంటే అది రాజకీయ రగడగా మారి ఉండేది. అందుకే ప్రభుత్వం వ్యూహాత్మకంగా విద్యాశాఖ ఉన్నతాధికారులను రంగంలోకి దించింది. సాక్షి మీడియాలో వచ్చిన వ్యతిరేక కథనాలను కేస్ స్టడీస్ గా తీసుకుంటూ ఒక్కో అనుమానాన్ని నివృత్తి చేశారు. ఎంతో ఓపికగా అధికారులు సమాధానాలు చెప్పారు. దీంతో ఆదిలోనే దానికి కౌంటర్ ఇవ్వగలిగారు అధికారులు. సోషల్ మీడియాలో అధికారులు ఇచ్చే కౌంటర్ ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళింది. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు తేలిపోయాయి.

లోకేష్ సవాల్ తో..
అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వద్ద ఆధారాలు ఉంటే కచ్చితంగా న్యాయస్థానాన్ని సంప్రదించవచ్చు అని ప్రభుత్వ వర్గాలు సలహా ఇచ్చాయి. అది కూడా ప్రజల్లోకి వెళ్ళింది. వైసీపీ నేతలు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు అంటూ ప్రజలు ఒక నిర్ధారణకు కూడా వచ్చారు. అక్కడితో ఆగలేదు. మళ్లీ కమ్మ డీఎస్సీ అంటూ చెప్పుకొచ్చారు. స్పోర్ట్స్ కోటాలో కమ్మ సామాజిక వర్గం వారికి అధిక అవకాశాలు కల్పించారు అంటూ ఆరోపణలు చేశారు. దానిని కూడా నివృత్తి చేసింది విద్యాశాఖ. రెడ్డి సామాజిక వర్గానికి 10 పోస్టులు, కాపు సామాజిక వర్గానికి 16 పోస్టులు ఇస్తే కమ్మ సామాజిక వర్గానికి మాత్రం 9 పోస్టులు కేటాయించినట్లు చెప్పుకొచ్చారు. ఆ విషయంలో కూడా ఆ పార్టీకి షాక్ తప్పలేదు. చివరిగా లోకేష్ సాహసించి.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు చర్యలను తప్పుపడుతూ.. అవసరం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి తనతో చర్చకు రావాలంటూ సవాల్ చేశారు. దానికి సై అనలేకపోయారు జగన్మోహన్ రెడ్డి. లక్ష్మీపార్వతి తో పాటు యాంకర్ శ్యామల లాంటి వారిని పంపించారు. మరోసారి డీఎస్సీ విషయంలో చతికిల పడ్డారు. ఈ మొత్తం పరిణామాలతో ప్రజలు ఒక నిర్ధారణకు వచ్చారు. డీఎస్సీ విషయంలో వైసిపి కుట్ర చేస్తుంది అనే అనుమానాలను ఎక్కువమంది నమ్మారు. అంతిమంగా ఇప్పుడు ఈ డీఎస్సీ అంశం అనేది వైసీపీకి ఎక్కువగా డ్యామేజ్ చేస్తోంది. మున్ముందు వైసీపీ మూల్యం చెల్లించుకోక తప్పదు అని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

'ధురంధర్' డైరెక్టర్ కోసం కొట్లాడుకుంటున్న టాలీవుడ్ , బాలీవుడ్ హీరోలు..

Dhurandhar Movie Director
Dhurandhar Movie Director

Dhurandhar Movie Director: ఒక డైరెక్టర్ పాన్ ఇండియా లెవెల్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొడితే చాలు, ఆ డైరెక్టర్ కోసం ఇండియా లో ఉన్నటువంటి స్టార్ హీరోలందరూ పోటీ పడుతారు. బ్లాంక్ చెక్కులు పట్టుకొని అడ్వాన్స్ ఇవ్వడానికి సిద్ధం అయిపోతూ ఉంటారు. ప్రస్తుతం ఇండియా వైడ్ గా ‘ధురంధర్’ డైరెక్టర్ ఆదిత్య డర్ కి ఉన్నటువంటి క్రేజ్, డిమాండ్ రాజమౌళి కి కూడా లేదు అనడంలో అతిశయోక్తి లేదేమో. ఈమధ్య కాలంలో తన దర్శకత్వ ప్రతిభ తో ప్రేక్షకులకు అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని ఇచ్చింది కచ్చితంగా ఆయనే, అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఈ డైరెక్టర్ కోసం ఇంతమంది సూపర్ స్టార్స్ క్యూలు కడుతున్నారు. ఒక టాలీవుడ్ పాన్ ఇండియా హీరో అయితే , తనతో సినిమా చేయాల్సిందిగా ఎంతో బ్రతిమిలాడాడు , కానీ తనకు సెట్ అవ్వదని మొహమాటం లేకుండానే చెప్పాడట ఆదిత్య డర్.

దీంతో ఆ టాలీవుడ్ పాన్ ఇండియన్ హీరో బాగా నిరాశకు గురైనట్టు తెలుస్తోంది. ఆదిత్య డర్ ప్రస్తుతానికి ప్రభాస్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడని , హోమబుల్ ఫిలిమ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది అంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. మరి ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్తుందో లేదో చూడాలి. మరోవైపు ఆదిత్య డర్ ‘ధురంధర్’ హీరో రణవీర్ సింగ్ తో కూడా మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కచ్చితంగా వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకరితో ఆయన సినిమా చేసే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు హృతిక్ రోషన్ , రణబీర్ కపూర్, అమీర్ ఖాన్ వంటి వారు కూడా ఆదిత్య డర్ తో సినిమాలు చేయడానికి చూస్తున్నారట. మన టాలీవుడ్ నుండి అల్లు అర్జున్ టీం కూడా ఆదిత్య డర్ తో సినిమాని సెట్ చేసేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి.

ఈ స్థాయిలో ఒక డైరెక్టర్ కోసం ఇంతమంది హీరోలు పోటీ పడడం అనేది గతం లో ఎప్పుడూ జరగలేదు. ఈ దశాబ్ద కాలం లో ప్రశాంత్ నీల్ , లోకేష్ కనకరాజ్, అట్లీ, నెల్సన్ దిలీప్ కుమార్ , ఇలా ఎంతో మంది టాప్ డైరెక్టర్స్ , జెన్ జీ డైరెక్టర్స్ పుట్టుకొచ్చారు. అందరికీ మంచి డిమాండ్ ఉంది , కానీ ఈ రేంజ్ డిమాండ్ మాత్రం వాళ్ళు కూడా చూసి ఉండరు. ఆదిత్య డర్ తన తదుపరి చిత్రాన్ని ఎప్పుడు ప్రకటిస్తాడో తెలియదు కానీ , ప్రకటించిన రోజు మాత్రం ఇండియా మొత్తం షేక్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

పాన్ ఇండియా లెవెల్ లో రీ రిలీజ్ కానున్న అల్లు అర్జున్ 'ఆర్య'.. క్రేజ్ మామూలుగా లేదుగా..

Allu Arjun Arya Re Release
Allu Arjun Arya Re Release

Allu Arjun Arya Re Release: టాలీవుడ్ లో మరోసారి రీ రిలీజ్ ట్రెండ్ జోరు ఊపందుకుంది. ఈ నెల 26 నుండి వరుసగా స్టార్ హీరోలకు సంబంధించిన పాత సూపర్ హిట్ చిత్రాలు దండయాత్ర చేయనున్నాయి. ఈ నెల 26 న సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కడు చిత్రం రీ రిలీజ్ కాబోతుందని. అదే రోజున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ చిత్రం కూడా రీ రిలీజ్ అవ్వాల్సింది , కానీ రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం కోసం వాయిదా వేస్తున్నట్టు ఆ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ నిన్న ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చాడు. ఇక జూన్ 27 న మంచు విష్ణు ‘కన్నప్ప’ రీ రిలీజ్ కాబోతుంది. ఇక జులై నెలలో అయితే అల్లు అర్జున్ పాత సినిమాలు వరుసగా దండయాత్ర చేయబోతున్నాయి. రీసెంట్ గానే కేరళలో ‘హ్యాపీ’ మలయాళం వెర్షన్ ని రీ రిలీజ్ చేయగా, అక్కడ సెన్సేషన్ సృష్టించింది.

ఇప్పటి వరకు ఈ చిత్రం కేరళలో 2 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి, ఇప్పటికీ డీసెంట్ స్థాయి వసూళ్లతో ముందుకు వెళ్తోంది. ‘హ్యాపీ’ చిత్రం సెన్సేషన్ ని గమనించిన మన తెలుగు ఎక్సిభిటర్స్ జులై లో ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారు. మలయాళం లో సెన్సేషన్ సృష్టించిన ఈ చిత్రం , తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందా లేదా అనేది చూడాలి. ఇకపోతే ఇదే జులై నెలలో , అల్లు అర్జున్ కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ గా నిల్చిన ‘ఆర్య’ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నారు. ఎన్నేళ్లు గడిచినా , ఈ చిత్రానికి క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. నేటి తరం ఆడియన్స్ కూడా ఈ చిత్రాన్ని ఎంతగానో ఇష్టపడుతున్నారు.

అంతే కాకుండా, ఈ చిత్రం లోని పాటలు కూడా పెద్ద సెన్సేషన్ అనొచ్చు. ‘అ అంటే అమలాపురం’ అనే పాట ఆరోజుల్లో ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ టీవీ డ్యాన్స్ షోస్ లలో ఈ పాట వినిపిస్తూనే ఉంటుంది. ఈ పాటకు నేటి తరం జెన్ జీ ఆడియన్స్ ఏ రేంజ్ లో వైబ్ అవుతారో మీరే ఊహించుకోండి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే , హ్యాపీ చిత్రానికి మలయాళం వెర్షన్ లో వచ్చిన రెస్పాన్స్ ని చూసి ‘ఆర్య’ చిత్రాన్ని తెలుగు తో పాటు, మలయాళం, హిందీ వెర్షన్స్ లో కూడా డబ్ చేసి జులై లో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాబోతుందో చూడాలి.

#RRR లో నటించిన 'మల్లి' అనే చిన్నారి గుర్తుందా..? ఇప్పుడు ఎంత హాట్ గా తయారైందో చూడండి..

RRR Child Artist
RRR Child Artist

RRR Child Artist: గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ సృష్టించి , మన ఇండియన్ సినిమాకు ఆస్కార్ అవార్డు ని తెచ్చిపెట్టిన #RRR చిత్రాన్ని అంత తేలికగా మర్చిపోగలమా చెప్పండి. సినీ ఇండస్ట్రీ ఉన్నంత కాలం, తెలుగు జనాలు ఈ భూమి మీద ఉన్నంత కాలం , ఈ చిత్రాన్ని ఎవ్వరూ మర్చిపోలేరు. అలాగే ఈ చిత్రం లోని కొన్ని పాత్రలను కూడా ఆడియన్స్ అంత తేలికగా మర్చిపోలేరు. అందులో మల్లి పాత్ర ఒకటి. ఈ సినిమా కథ మొదలు అయ్యేదే ఈ చిన్నారితో. చాలా చిన్న వయస్సు అయినప్పటికీ , మల్లి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించింది. ఈమె పేరు ట్విన్కిల్ శర్మ. ఈమె #RRR చిత్రం లో గోండు జాతికి చెందిన పిల్లగా, డీ గ్లామర్ గా కనిపిస్తూ ఎలా కనిపించిందో తెలిసిందే. అయితే ఈమె లేటెస్ట్ ఫోటోలను చూస్తే మాత్రం ఎవరికైనా మతి పోవాల్సిందే .

ఇన్ స్టాగ్రామ్ లో ఈమె తనకు సంబంధించిన ఫోటోలను అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటుంది. మోడరన్ డ్రెస్సులతో , యంగ్ హీరోయిన్స్ ఎంత హాట్ గా కనిపిస్తారో , ఈమె కూడా అదే రేంజ్ లో కనిపిస్తూ నెటిజెన్స్ ని సర్పైజ్ కి గురి చేస్తోంది. అసలు మేము చూసింది #RRR చిత్రం లోని మల్లి నేనా?, ఇంత అందం గా , ఇంత హాట్ గా ఉందేంటి?, భవిష్యత్తులో ఈమె కచ్చితంగా సినిమాల్లోకి హీరోయిన్ గా వస్తుంది , అందులో ఎలాంటి సందేహం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. #RRR చిత్రం విడుదలై 4 ఏళ్ళు కావొస్తుంది, ఈ నాలుగేళ్లలో ఈమె ఇంతలా మారిపోతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. రాబోయే రోజుల్లో ఈమె ఇంకా ఏ రేంజ్ లో తయారు అవుతుందో చూడాలి. ఒకవేళ #RRR చిత్రానికి సీక్వెల్ తీస్తే రాజమౌళి ఈమెను ఎలా చూపిస్తాడో చూడాలి.

ఇన్ స్టాగ్రామ్ లో ఈమెను ప్రస్తుతానికి 13 వేల మంది ఫాలో అవుతున్నారు. ఈమెకు సంబంధించిన ఫోటోలు , రీల్స్ వంటివి ఈ అకౌంట్ లో రెగ్యులర్ గా షేర్ చేస్తూ ఉంటుంది ట్విన్కిల్ శర్మ. ఆమెకు ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కి సంబంధించిన ఫోటోలను కొన్ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. #RRR తర్వాత ఈమె మళ్లీ ఎలాంటి సినిమాలో కూడా కనిపించలేదు. బహుశా ఆమె డైరెక్ట్ గా హీరోయిన్ గానే ఎంట్రీ ఇస్తుంది అనుకుంటా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

సమంత 'మా ఇంటి బంగారం' కి సెన్సేషనల్ ఓపెనింగ్స్.. మ్యాట్నీ షోస్ వరకు వచ్చిన గ్రాస్ ఏంటంటే..

Maa Inti Bangaram Box Office
Maa Inti Bangaram Box Office

Maa Inti Bangaram Collections: సమంత ప్రధాన పాత్ర పోషించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం నేడు గ్రాండ్ గా తెలుగు , తమిళ భాషల్లో విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. విడుదలకు ముందు సమంత పడిన కష్టానికి ఎట్టకేలకు ప్రతిఫలం దక్కిందని ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం లో ఆమె ప్రధాన పాత్ర పోషించడం మాత్రమే కాదు , నిర్మాతగా కూడా వ్యవహరించింది. సినిమాని జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఈమె చేసిన ప్రొమోషన్స్ మేకర్స్ కి ఒక కేసు స్టడీ లాంటిది. ఆ ప్రొమోషన్స్ తాలూకు ఫలితం స్పష్టంగా నేడు కళ్ళముందు కనిపిస్తోంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రానికి సెన్సేషనల్ వసూళ్లు నమోదు అవుతున్నాయి. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 7 వేల నుండి 10 వేల టిక్కెట్స్ అమ్ముడుపోతున్నాయి, ఇది సాధారణమైన విషయం కాదు.

ఇక ఆన్లైన్ ట్రాకింగ్ సిస్టం ద్వారా ఈ చిత్రానికి ఇండియా వైడ్ గా మ్యాట్నీ షోస్ వరకు నమోదైన గ్రాస్ దాదాపుగా 5 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని , కేవలం డొమెస్టిక్ మార్కెట్ నుండి ఈ చిత్రానికి 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వస్తాయని , ఓవర్సీస్ కూడా కలుపుకుంటే 15 కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ వస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి ఈ స్థాయి ఓపెనింగ్ వసూళ్లు ఈమధ్య కాలం లో రాలేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఊపు చూస్తుంటే ఈ చిత్రం వీకెండ్ లోపే బ్రేక్ ఈవెన్ మార్కుకి దగ్గరగా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘పెద్ది’ చిత్రం సక్సెస్ తో బయ్యర్స్ లో మంచి ఉత్సాహం వచ్చింది.

ఆ ఉత్సాహాన్ని కొనసాగిస్తూ సమంత ‘మా ఇంటి బంగారం’ చిత్రానికి నేడు నమోదు అవుతున్న ఓపెనింగ్స్ ని చూస్తుంటే , టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ మళ్లీ ట్రాక్ లో పడ్డట్టుగా అనిపిస్తోంది. ఇదే ఊపు ని లాంగ్ రన్ లో కూడా కొనసాగిస్తే , ఈ చిత్రం వంద కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక్కడి నుండి సమంత మరియు మూవీ టీం చేసే ప్రమోషనల్ ఈవెంట్స్ ఆధారంగా కూడా ఈ సినిమా థియేట్రికల్ రన్ ఉంటుంది. ఓవరాల్ గా సమంత నిర్మాతగా రెండవసారి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. ఆమె నిర్మాతగా వ్యవహరించిన మొదటి చిత్రం ‘శుభం’ కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.

అనిల్ రావిపూడి 10 వ విజయాన్ని సాధించాలంటే ఇలా చేస్తున్నాడా..?

Anil Ravipudi 10th Film Success
Anil Ravipudi 10th Film Success

Anil Ravipudi 10th Film Success: సినిమా ఇండస్ట్రీ లో ఎంతమంది దర్శకులు ఉన్నప్పటికి సక్సెస్ లలో ఉన్న వాళ్ళకు మాత్రమే ఎక్కువ గుర్తింపైతే ఉంటుంది. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి తను చేస్తున్న సినిమాలతో వరుస సక్సెస్ లను సాధిస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ప్లాప్ అనేది తన దరికి చేయకూడదనే ఉద్దేశ్యంతో ఉన్నాడు. ఆయన నుంచి ఒక సినిమా వచ్చిందంటే చాలు ఆ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందనే నమ్మకం ప్రతి ఒక్క ప్రేక్షకుడిలో కలిగింది.

కారణమేంటంటే ఆయన చేసే ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించే విధంగా ఉంటున్నాయి. ఇక సగటు ప్రేక్షకులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను సైతం తన అభిమానులుగా మార్చుకున్నాడు. అందువల్లే వాళ్ళందరు అతని సినిమాలను చూసి ఆదరిస్తున్నారు. ముఖ్యంగా పండగ సీజన్లో రావడం కూడా అనిల్ రావిపూడి కి చాలా వరకు ప్లస్ అవుతుంది.

వెంకటేష్, కళ్యాణ్ రామ్ లను హీరోలుగా పెట్టి చేస్తున్న సినిమాని సైతం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు…ఈ సినిమా సక్సెస్ సాధించాలంటే అనిల్ రావిపూడి ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ఈ సినిమాలో సస్పెన్స్ ని కూడా మైంటైన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఏదో ఒక ఎలిమెంట్ తో ఎగ్జైట్ చేయాలనే ఉద్దేశ్యంతో అనిల్ రావిపూడి ఈ సినిమాను చేస్తున్నాడట.

ఇక రొటీన్ కామెడీని చేస్తే జనాలు తన సినిమాని ఆదరించే అవకాశాలు లేవని తెలుసుకున్న అనిల్ రావిపూడి మొత్తానికైతే ఒక సస్పెన్స్ ను కూడా ఇందులో జోడించి దాని చుట్టూ కథ మొత్తాన్ని అల్లినట్టుగా తెలుస్తుంది. మరి ఇంతకీ ఆ కథను గ్రిప్పింగ్ ఎలా చేశాడు మొత్తానికైతే ఈ సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలిపే ప్రయత్నంలో భాగంగా ఆయన ఈ సినిమాను ఎలా తీర్చిదిద్దుతాడు అనేది తెలియాల్సి ఉంది…

సుకుమార్ రైటింగ్స్ నుంచి వచ్చే సినిమాలకు సుకుమార్ కి ఎంత లాభం వస్తుంది..?

Sukumar
Sukumar

Sukumar Writings Movies: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. స్టార్ డైరెక్టర్లు సైతం తమదైన రీతిలో సత్తా చారుతున్నారు. ఇంటలిజెంట్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నాడు తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవ్వబోతుంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ తో ఒక భారీ పియాడికల్ డ్రామా సినిమాని చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాని సైతం సక్సెస్ ఫుల్ గా నిలిపితే సుకుమార్ క్రేజ్ తారా స్థాయికి వెళ్ళిపోతుంది… ఇక సుకుమార్ దర్శకుడిగానే కాకుండా సుకుమార్ రైటింగ్స్ కింద తన శిష్యులను దర్శకులుగా పరిచయం చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇక ఇప్పటికే బుచ్చిబాబు లాంటి దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేసి అతన్ని టాప్ డైరెక్టర్ అయ్యేలా చేశాడు. ఇక వీరూపాక్ష లాంటి సినిమాని సైతం సుకుమార్ రైటింగ్స్ నుంచే తీసుకురావడం విశేషం. ఇక ఇలాంటి క్రమంలోనే సుకుమార్ రైటింగ్స్ అంటూ తన నేమ్ ని వాడుకున్నందుకు సుకుమార్ కి భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తున్నారట…

సుకుమార్ రైటింగ్స్ కింద కథలో హెల్ప్ చేస్తూనే సినిమా ఎలా వస్తుంది అనేది ఎప్పటికప్పుడు తను చెక్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రొడ్యూసర్ దగ్గర నుంచి సుకుమార్ కు భారీ మొత్తంలో డబ్బులు మూడుతున్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

సుకుమార్ అటు దర్శకుడిగా డబ్బులు సంపాదిస్తూనే, ఇటు ఖాళీ సమయంలో సుకుమార్ రైటింగ్స్ కింద తను చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. తన అండర్ లో జరిగే సినిమాల విషయంలో కూడా స్పెషల్ కేర్ తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…ఇక మీదట ఆయన ఎలాంటి సినిమాలు చేస్తాడు అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

వివో T5 ప్రో vs వన్‌ప్లస్ నార్డ్ CE6 : భారీ బ్యాటరీల్లో పోటీ పడుతున్న ఈ రెండు ఫోన్లలో ఏది కొనాలి..

Vivo T5 Pro Vs OnePlus Nord CE6
Vivo T5 Pro Vs OnePlus Nord CE6

Vivo T5 Pro Vs OnePlus Nord CE6: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రస్తుతం ‘బిగ్ బ్యాటరీ’ విప్లవం నడుస్తోంది. రోజూవారీ అవసరాల్లో భాగంగా ఫోన్ వినియోగం ఎక్కువ అవడంతో చాలా మంది బ్యాటరీ బ్యాకప్ ఎక్కవ ఉండాలని అనుకుంటున్నారు. దీంతో పవర్‌ఫుల్ ఫీచర్లతో పాటు ఛార్జింగ్ ఎక్కువ కాలం రావాలనుకునే యూజర్ల కోసం ప్రముఖ బ్రాండ్లు పోటీపడుతున్నాయి. ఈ రేసులో వివో (Vivo)కంపెనీ భారీ బ్యాటరీని అందించే సరొకొత్త ఫోన్ ను మార్కెట్లోకి తీసుకురాబోతుంది. ఇదే సమయంలో వన్ ప్లస్ కంపెనీ సైతం దీనితో పోటీ పడుతోంది. మరి ఈ రెండు ఫోన్లలో ఏది బెస్ట్? ఏ బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా ఉంటుంది?

Vivo తన సరికొత్త వివో T5 ప్రో ఫోన్‌ను ఇటీవల లాంచ్ చేసింది. త్వరలోనే ఇది మార్కెట్లోకి రాబోతుంది. ఈ కొత్త ఫోన్ లో ఏకంగా 9020mAh భారీ బ్యాటరీని అమర్చారు. బ్యాటరీ పరంగా వివో T5 ప్రో మొబైలో ఉపయోగించిన నెక్స్ట్ జనరేషన్ సిలికాన్ కార్బన్ టెక్నాలజీ వల్ల కేవలం 0.825 సెం.మీ సన్నని బాడీలోనే ఏకంగా 9020mAh బ్యాటరీని అమర్చారు. ఈ బ్యాటరీకి 90W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీనికి గట్టి పోటీగా వన్‌ప్లస్ కూడా 8000mAh బ్యాటరీతో వన్‌ప్లస్ నార్డ్ CE6 ను మార్కెట్లోకి తెచ్చింది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే రెండున్నర రోజుల పాటు నాన్‌స్టాప్‌గా పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్ ఇతర డివైజ్‌లను ఛార్జ్ చేయడానికి పవర్ బ్యాంక్‌లా (రివర్స్ ఛార్జింగ్) కూడా ఉపయోగపడుతుంది.

రెండు ఫోన్లు కూడా పవర్‌ఫుల్ గేమింగ్, మల్టీటాస్కింగ్ కోసం స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 4nm ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. అలాగే అద్భుతమైన AMOLED డిస్ ప్లేలో భాగంగా 1.5K రిజల్యూషన్ తో పనిచేస్తూ 144Hz హై రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంటాయి. అయితే వివో T5 ప్రో ఫోన్ లో 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఎండలో కూడా స్పష్టమైన స్క్రీన్‌ను అందిస్తుంది. కానీ వన్‌ప్లస్ నార్డ్ CE6 లో 3600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను మాత్రమే అందిస్తుంది. గేమింగ్ సమయంలో వేడిని తగ్గించడానికి వివోలో పెద్ద వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉంది.

వన్‌ప్లస్ నార్డ్ CE6 వెనుక వైపు 50MP మెయిన్ కెమెరా, ముందు వైపు ఆటోఫోకస్‌తో కూడిన 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ ముందు, వెనుక కెమెరాల నుండి 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది. వివో T5 ప్రో మొబైల్ లో కూడా 50MP మెయిన్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. రెండు ఫోన్లలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లు, గూగుల్ జెమిని ఇన్-బిల్ట్‌గా వస్తాయి. అలాగే రెండు ఫోన్లకు అత్యంత కఠినమైన IP68 మరియు IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్స్ ఉండటం విశేషం.

 

తొక్కిసలాట కేసులో మరోసారి చిక్కుల్లో పడ్డ అల్లు అర్జున్.. నోటీసులు జారీ చేసిన హై కోర్టు..

Allu Arjun Stampede Case
Allu Arjun Stampede Case

Allu Arjun Stampede Case: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ని ఇప్పుడిప్పుడే అందరూ మర్చిపోవడం మొదలుపెట్టారు. ఇలాంటి ఘటనలు మళ్లీ రిపీట్ కాకుండా తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. అయితే నేడు ఈ కేసు మళ్లీ తెరమీదకు వచ్చింది. నాంపల్లి హైకోర్టు అల్లు అర్జున్ తో పాటు మరో 18 మందిని నిందితులుగా గుర్తిస్తూ సమన్లు జారీ చేసింది. ఈ కేసు లో అల్లు అర్జున్ A11 ముద్దాయిగా ఉన్నారు. వచ్చే సోమవారం అల్లు అర్జున్ నాంపల్లి హైకోర్టుకు వచ్చి , విచారణ లో కచ్చితంగా పాల్గొనాలని ఈ సందర్భంగా నాంపల్లి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మరి అల్లు అర్జున్ ఈ విచారణకు హాజరు అవుతారా?, లేదా వేరే ఏదైనా కారణం తో ఆగిపోతారా అనేది చూడాలి. దీని పై పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

ఇకపోతే శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా బాగుపడలేదు. ప్రాణాపాయ స్థితి నుండి బయట అయితే పడ్డాడు కానీ , ఇప్పటికీ మనుషులను గుర్తు పట్టలేని పరిస్థితి లోనే ఉన్నాడు. ప్రతీ నెల ఆ కుర్రాడి వైద్యానికి అయ్యే ఖర్చు ని భరించలేక తండ్రి పడుతున్న ఇబ్బందులు చూస్తే కన్నీళ్లు రాక తప్పదు. రీసెంట్ గానే అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి , అల్లు అరవింద్ తదితరులు శ్రీతేజ్ ఇంటికి వెళ్లి , వాళ్ళ పరిస్థితులను అడిగి తెలుసుకొని, అన్ని విధాలుగా మేము అండగా ఉంటామని మాటిచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. శ్రీతేజ్ ని అల్లు కుటుంబం మర్చిపోలేదు, చాలా సంతోషం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ హర్షం వ్యక్తం చేశారు. శ్రీతేజ్ త్వరగా కోలుకొని , అందరి పిల్లలు లాగానే , సంతోషంగా చదువుకుంటూ , ఆడుకుంటూ తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం ‘రాకా’ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ముంబై లో జరుగుతోంది. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే పూర్తి కానుంది. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ‘పుష్ప 2’ చిత్రం తో పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి 2000 కోట్లు కొల్లగొట్టిన అల్లు అర్జున్ , ఈ సినిమాతో ఎలాంటి అద్భుతాలు నెలకొల్పుతాడో చూడాలి. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ఆయన లోకేష్ కనకరాజ్ మూవీ కి షిఫ్ట్ అవ్వబోతున్నారు.

సాయికృష్ణ కేసు.. సీఐతో పాటు వైసిపి బుక్ అయినట్టే!

Sai Krishna Case Update
Sai Krishna Case Update

Sai Krishna Case Update: ఏపీలో రౌడీ షీటర్ గాదె సాయి కృష్ణ అదృశ్యం మిస్టరీ వీడడం లేదు. అయితే దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంత రాజకీయం చేయాలో అంతలా చేసేసింది. ఒక నేరస్తుడు అని గుర్తించకుండా కాపు యువకుడు అన్నదాన్నిపై హైలైట్ చేస్తోంది. మరోవైపు ఈ యువకుడి అదృశ్యం విషయంలో పోలీసుల తప్పిదాలు కూడా ఉన్నాయి. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుంటే.. కచ్చితంగా నేరాలు, అభియోగాలు మోపి కోర్టులో హాజరు పరచాలి. కానీ అలా చేయలేదు. ఆపై ఆ యువకుడి ఆచూకీ లేదు. దీనికి ముమ్మాటికీ పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజు అడ్డంగా బుక్కయ్యారు. ఆయనపై తొలుత వి ఆర్ వేటు పడింది. తరువాత సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆయనను సస్పెండ్ చేశారు. ఇప్పుడు తాజాగా క్రిమినల్ కేసు నమోదయింది. కేవలం పోలీస్ కేసు, అరెస్టులు, నేరం దర్యాప్తులో భాగంగానే ఈ ప్రక్రియ జరిగింది. అయితే నిందితుడిని అరెస్టు చేసినప్పుడు కచ్చితంగా కోర్టులో హాజరు పరచాలి. కోర్టులో హాజరు పరచకపోగా ఆ నిందితుడు ఇప్పుడు అదృశ్యం కావడంతో పోలీసుల మెడకు చుట్టుకుంది. అయితే కాపు యువకుడు అని వైసిపి బయటకు తీసుకురావడం వెనుక రాజకీయ లబ్ధి ఆశించడం స్పష్టంగా కనిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ ఉద్దేశ్యంతో చేసిన ఈ ఇష్యూ మాత్రం పెరిగింది. కానీ అక్కడే తప్పులో కాలేసారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.

వెనుకేసుకొచ్చిన జగన్..
వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి ఏకంగా ఆ కుటుంబాన్ని పరామర్శించేశారు. చిన్న కుర్రాడు తప్పు చేస్తే ఏంటి అని అర్థం వచ్చేలా మాట్లాడారు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో సాయి కృష్ణ నేరాలు హైలెట్ అవుతున్నాయి. ఆయన అదృశ్యం వెనుక పోలీసులు ఉంటే ఓకే. ఆ తీరును తప్పు పట్టాలి కానీ ఒక నేరస్తుడిని వెనకేసుకు రావడం ఏంటి అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చుట్టూ జరుగుతున్న ప్రచారం. పైగా అంబటి రాంబాబు ఒక ఫోటోను తీసుకొచ్చి మీడియాకు చూపించారు. గాయాలతో కనిపిస్తున్న యువకుడు సాయి కృష్ణ అని చెప్పుకొచ్చారు. కానీ అందులో ఉన్నది సాయి కృష్ణ కాదు నవీన్ రెడ్డి అని బయటకు వచ్చేసింది. అది కూడా సాయి కృష్ణ చేతిలో నవీన్ రెడ్డి హత్యకు గురైన అంశం కూడా సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభమైంది. అప్పటినుంచి ఈ అంశం కొత్తదారి పట్టింది.

వ్యతిరేక కామెంట్స్..
అంబటి రాంబాబు నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు ఒక నేరస్తుడు గురించి ఇంతలా బాధపడుతున్నారు ఏంటి అని చాలామంది ప్రశ్నించడం ప్రారంభించారు. గతంలో ఇదే సాయి కృష్ణ గురించి సమీప బంధువులు యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. మామ వరుస అయ్యే వ్యక్తి.. ఇలాంటి వాడిని ఎన్కౌంటర్ చేస్తే తప్పు ఏంటి అని మాట్లాడారు. ఇప్పుడు తాజాగా అదే వ్యక్తి మాట మార్చిన తీరు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. మరోవైపు సాయి కృష్ణను హత్య చేశారని, లాకప్ డెత్ చేసేసారని, అంత్యక్రియల్లో ఆనవాళ్లు లేకుండా చేశారని వైసీపీ నేతలు ఆరోపించడం ప్రారంభించారు. సాక్షి మీడియా సైతం దానిని హైలెట్ చేయడం మొదలుపెట్టింది. ఇంకా ఈ మిస్టరీ వీడక ముందే హత్య, చనిపోయాడంటూ నిర్ధారించడం ఏంటి అనేది కొత్తగా పుట్టుకొస్తున్న ప్రశ్న. ఈ మొత్తం ఎపిసోడ్లో రోజురోజుకు ఒక్కో మలుపు కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే ఈ కేసులో సీఐ నాగరాజు అడ్డంగా బుక్కయ్యారు. చివరకు వైసీపీ బుక్ అవుతుందా అన్న అనుమానం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

17 ఏళ్ల సామ్రాజ్యం కూలింది.. టర్కీని చావు దెబ్బ కొట్టిన భారత్‌

Celebi India Ouster
Celebi India Ouster

Celebi India Ouster: టర్కీ నాటో దేశం. ఇస్లామిక్‌ దేశం. అయిన భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌కు ముందు వరకు టర్కీతో స్నేహం కోరుకుంది. వ్యాపార సంబంధాలు పెంచుకుంది. కానీ ఒక నిర్దిష్ట సైనిక చర్య సమయంలో టర్కీ పాకిస్తాన్‌కు మద్దతుగా నిలబడి, అనేక డ్రోన్‌లను సరఫరా చేసింది. అలాగే భారతదేశానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రచార కార్యకలాపాలు చేపట్టింది. ఇది భారతదేశం భద్రతా ప్రయోజనాలను ప్రభావితం చేసింది. దీనికి ప్రతిస్పందనగా భారతదేశం టర్కీకి చెందిన ఒక ప్రముఖ ఏవియేషన్‌ సంస్థను తన విమాన రంగం నుంచి తొలగించింది. ఈ నిర్ణయం టర్కీకి ఆర్థికంగా, రాజకీయంగా భారీ దెబ్బ తగిలింది.

భారత్‌లో సెలబీ కార్యకలాపాలు..
టరీకి చెందిన ప్రముఖ ఏవియేషన్‌ సంస్థ సెలబీ భారత విమానాశ్రయాల్లో గ్రౌండ్‌ నిర్మాణం, కార్గో నిర్వహణ, భద్రతా సేవలు వంటి విభాగాల్లో కీలక భాగస్వామిగా ఉంది. 17 సంవత్సరాలుగా ఇది భారత ఏవియేషన్‌ రంగంలో స్థిరంగా పనిచేసింది. అయితే ఆపరేషన్‌ తర్వాత భారతదేశం తీసుకున్న నిర్ణయం వల్ల ఈ భాగస్వామ్యం పూర్తిగా ముగిసింది. సంస్థ భద్రతా సేవల ఒప్పందాలు రద్దు అయ్యాయి, దీంతో వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయాయి.

బాయికాట్‌ టర్కీ ఉద్యమం..
ఆపరేషన్‌ తర్వాత సోషల్‌ మీడియా వేదికగా టర్కీ ఉత్పత్తులు, సేవలపై బాయికాట్‌ పిలుపులు వచ్చాయి. ఇది టర్కీ యొక్క పర్యాటక రంగం, విమానయాన సంబంధిత వ్యాపారాలను తీవ్రంగా దెబ్బతీసింది. టర్కీ సంస్థలకు భారతదేశంలో వ్యాపార అవకాశాలు తగ్గాయి. ఈ ప్రచారాలు ఆధునిక సామాజిక వేదికలు ఎలా ఆర్థిక నిర్ణయాలను ప్రభావితం చేస్తాయో చూపించాయి.

ఆర్థిక నష్టాలు, ఉద్యోగాలు ఊస్ట్‌..
ఈ తొలగింపు వల్ల సంస్థకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. దీంతో ఉద్యోగులను ఇతర కంపెనీలకు బదిలీ చేయాల్సి వచ్చింది. పరికరాలు, వనరులు భారతదేశం స్వాధీనం చేసుకున్నాయి. సంస్థ నాయకత్వం ఈ నష్టాలను బహిరంగంగా వ్యక్తం చేసింది. భారతదేశంతో ఉన్న దీర్ఘకాలిక సంబంధం ఒక్కసారిగా ముగిసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

భారత్‌తో పెట్టుకుంటే..
ఈ సంఘటన భౌగోళిక రాజకీయాలు ఎలా ఆర్థిక వ్యవహారాలను ప్రభావితం చేస్తాయో చూపిస్తుంది. ఒక దేశం మరొక దేశం యొక్క భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిలబడినప్పుడు, దాని వ్యాపార సంస్థలు కూడా పరోక్షంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. భారతదేశం తీసుకున్న నిర్ణయం జాతీయ భద్రతను ప్రాధాన్యతగా భావించి, విదేశీ సంస్థలపై ఆధారపడకుండా స్వావలంబనను ప్రోత్సహించే దిశగా ఉంది. అయితే ఇది ఆర్థిక ఆధారపడటం, ప్రమాదాలను కూడా బయటపెడుతుంది. టర్కీ సంస్థలు భారత విమాన రంగంలో దీర్ఘకాలం పనిచేసినప్పటికీ, రాజకీయ వ్యతిరేకత వల్ల వాటి స్థానం కోల్పోయింది. సోషల్‌ మీడియా ద్వారా వచ్చిన బాయికాట్‌ ప్రచారాలు ప్రజాభిప్రాయాన్ని రూపొందించడంలో పాత్ర పోషించాయి. ఇది ఆధునిక యుగంలో సామాజిక వేదికల ప్రభావాన్ని సూచిస్తుంది.

మొత్తంమీద, ఈ ఘటన ప్రపంచ దేశాలకు ఒక ముఖ్యమైన సందేశం ఇస్తుంది. విదేశాంగ విధానాలు కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితం కావు, అవి ఆర్థిక సంబంధాలను కూడా బలంగా ప్రభావితం చేస్తాయి. భారతదేశం తన స్వంత భద్రతా ప్రయోజనాలను రక్షించుకోవడానికి ఇలాంటి చర్యలు తీసుకుంటుంది. ఇతర దేశాలు కూడా తమ విధానాలను సమీక్షించి, దీర్ఘకాలిక సహకారాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది.

పీఎం కిసాన్- అన్నదాత సుఖీభవ.. అది తప్పనిసరి!

PM Kisan Scheme Update
PM Kisan Scheme Update

PM Kisan Scheme Update: ఏపీలో రైతులకు గుడ్ న్యూస్. అన్నదాత సుఖీభవ తో పాటు పిఎం కిసాన్ నిధుల విడుదలకు రంగం సిద్ధమైంది. రేపు రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.7000, కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ.2000 అందించనున్నారు. ఒకేసారి రైతుల ఖాతాల్లో ఏడు వేలు చొప్పున జమ కానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అన్నదాత సుఖీభవ నిధులకు సంబంధించి గత ఏడాది మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.13000 అందించింది. ఇప్పుడు ఈ ఏడాదికి సంబంధించి తొలి విడతగా కేంద్ర ప్రభుత్వంతో కలిపి రూ.7000 జమ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. మరో రెండు విడతల్లో మిగతా రూ.14000 అందించి.. హామీ ఇచ్చిన మాదిరిగా రూ.20,000 సాయం పూర్తిగా అందించనున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.

పిఎం కి సాన్ నిరంతరంగా..
పిఎం కిసాన్ అనేది గత 21 విడతల్లో అందుతూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి. కేంద్ర ప్రభుత్వం రూ.6000 అందిస్తూ వస్తోంది. వైసీపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పేరుతో మరో రూ.7500 జమ చేసేది మూడు విడతల్లో. అలా ఏడాదికి రూ.13,500 అందించేవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అయితే తాము అధికారంలోకి వస్తే రైతులకు సాగు సాయం కింద ప్రతి సంవత్సరం 20 వేల రూపాయలు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు గత ఏడాది నుండి అందిస్తూ వచ్చారు కేంద్ర ప్రభుత్వంతో కలిసి. అయితే ఈ ఏడాదికి సంబంధించి రేపు ఈ పథకం మొదటి విడత సాయం విడుదల చేయనున్నారు.

వేర్వేరుగా నిధుల విడుదల..
పీఎం కిసాన్ నిధులను పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ లో ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ ఉత్సవ దివాస్ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అన్నదాత సుఖీభవ నిధులను అదేరోజు పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగం గుంట్లలో సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు. పీఎం కిసాన్ తో పాటు అన్నదాత సుఖీభవ కింద ఏపీలో 46,85,838 మంది రైతుల ఖాతాల్లో రూ.3125. 92 కోట్లు జమ కానున్నాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2342.92 కోట్లు, కేంద్ర ప్రభుత్వ వాటా రూ.782.5 కోట్లు. అయితే పీఎం కిసాన్ కు మాత్రం ఈ కేవైసీ తప్పనిసరి. ఎవరికైనా అర్హత ఉండి నిధులు అందకపోతే వెంటనే రైతు సేవా కేంద్రాల్లో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

గ్రేటర్ రాయలసీమ బాధ్యతలు ఆయనకే.. వైసీపీకి నష్టం!

Greater Rayalaseema
Greater Rayalaseema

Greater Rayalaseema: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక టెన్షన్ ప్రారంభం అయింది. జనసేన చేరికల కమిటీ ప్రకటించడంతో తమ పార్టీ నాయకత్వంతో పాటు క్యాడర్ చేజారి పోతుందన్న అనుమానం వైసీపీలో ఉంది. ఆపై రాయలసీమకు సంబంధించి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి పవన్ కళ్యాణ్ బాధ్యతలు అప్పగించడం కూడా టెన్షన్ కు కారణం. పైగా బాలినేని కోసం ప్రకాశం తో పాటు నెల్లూరు జిల్లాల కమిటీలను రద్దు చేశారు పవన్ కళ్యాణ్. గ్రేటర్ రాయలసీమ బాధ్యతలన్నింటినీ బాలినేని కట్టబెట్టడంతో… ఆయన నుంచి తమకు ఇబ్బందులు తప్పవని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఎందుకంటే పార్టీ గురించి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి బాలినేని. అందుకే వైసిపికి ఉన్న బలం,బలహీనతలు ఆయనకు తెలుసు. చేరికల కమిటీలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

తిరుగులేని నేతగా..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. అంతకుముందు వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించారు. ఎంతోమంది పార్టీ నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ బాలినేని లేకపోవడం ఆ పార్టీకి లోటు. ప్రస్తుతం బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లా బాధ్యతలు చూస్తున్న.. మాజీ మంత్రి బాలినేని లేని లోటు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. వై వి సుబ్బారెడ్డి లాంటివారు ఉన్న పెద్దగా ప్రభావం చూపలేరు. వైసీపీలో బాలినేని లేరు అన్న లోటు కంటే ఇప్పుడు పార్టీ క్యాడర్ను ఎక్కడ లాగేస్తారు అన్న ఆందోళన నాయకత్వంలో ఉంది.

చంద్రబాబు మంత్రాంగం..
నెల్లూరు ప్రకాశం జిల్లాతో పాటు రాయలసీమ లోని నాలుగు జిల్లాల బాధ్యతను మాజీ మంత్రి బాలినేనికి పవన్ కళ్యాణ్ అప్పగించారు. అయితే ఇదంతా ఒక వ్యూహం ప్రకారం జరుగుతోంది అనేది అర్థమవుతుంది. ఒక నెల రోజుల కిందట ఏపీ సీఎం చంద్రబాబును ప్రత్యేకంగా కలిశారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఆయన రాజకీయ జీవితంలో చంద్రబాబును వ్యతిరేకిస్తూ వచ్చారు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు దగ్గర కావడం ద్వారా చంద్రబాబుతో సన్నిహిత్యం పెంచుకున్నారు బాలినేని. దీని వెనుక రాజకీయ రాయలసీమ వ్యూహం ముందు. బాలినేని ముందు పెట్టి రాయలసీమలో జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయాలని పవన్ కళ్యాణ్ తో పాటు చంద్రబాబు భావిస్తున్నారు. ఆ విషయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కూడా తెలుసు. ఆ పార్టీలో ఒక రకమైన ఆందోళనకు అదే కారణం.