Homeఎంటర్టైన్మెంట్Anil Ravipudi 10th Film Success: అనిల్ రావిపూడి 10 వ విజయాన్ని సాధించాలంటే ఇలా...

Anil Ravipudi 10th Film Success: అనిల్ రావిపూడి 10 వ విజయాన్ని సాధించాలంటే ఇలా చేస్తున్నాడా..?

Anil Ravipudi 10th Film Success: సినిమా ఇండస్ట్రీ లో ఎంతమంది దర్శకులు ఉన్నప్పటికి సక్సెస్ లలో ఉన్న వాళ్ళకు మాత్రమే ఎక్కువ గుర్తింపైతే ఉంటుంది. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి తను చేస్తున్న సినిమాలతో వరుస సక్సెస్ లను సాధిస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ప్లాప్ అనేది తన దరికి చేయకూడదనే ఉద్దేశ్యంతో ఉన్నాడు. ఆయన నుంచి ఒక సినిమా వచ్చిందంటే […]

Anil Ravipudi 10th Film Success: సినిమా ఇండస్ట్రీ లో ఎంతమంది దర్శకులు ఉన్నప్పటికి సక్సెస్ లలో ఉన్న వాళ్ళకు మాత్రమే ఎక్కువ గుర్తింపైతే ఉంటుంది. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి తను చేస్తున్న సినిమాలతో వరుస సక్సెస్ లను సాధిస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ప్లాప్ అనేది తన దరికి చేయకూడదనే ఉద్దేశ్యంతో ఉన్నాడు. ఆయన నుంచి ఒక సినిమా వచ్చిందంటే చాలు ఆ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందనే నమ్మకం ప్రతి ఒక్క ప్రేక్షకుడిలో కలిగింది.

కారణమేంటంటే ఆయన చేసే ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించే విధంగా ఉంటున్నాయి. ఇక సగటు ప్రేక్షకులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను సైతం తన అభిమానులుగా మార్చుకున్నాడు. అందువల్లే వాళ్ళందరు అతని సినిమాలను చూసి ఆదరిస్తున్నారు. ముఖ్యంగా పండగ సీజన్లో రావడం కూడా అనిల్ రావిపూడి కి చాలా వరకు ప్లస్ అవుతుంది.

వెంకటేష్, కళ్యాణ్ రామ్ లను హీరోలుగా పెట్టి చేస్తున్న సినిమాని సైతం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు…ఈ సినిమా సక్సెస్ సాధించాలంటే అనిల్ రావిపూడి ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ఈ సినిమాలో సస్పెన్స్ ని కూడా మైంటైన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఏదో ఒక ఎలిమెంట్ తో ఎగ్జైట్ చేయాలనే ఉద్దేశ్యంతో అనిల్ రావిపూడి ఈ సినిమాను చేస్తున్నాడట.

ఇక రొటీన్ కామెడీని చేస్తే జనాలు తన సినిమాని ఆదరించే అవకాశాలు లేవని తెలుసుకున్న అనిల్ రావిపూడి మొత్తానికైతే ఒక సస్పెన్స్ ను కూడా ఇందులో జోడించి దాని చుట్టూ కథ మొత్తాన్ని అల్లినట్టుగా తెలుస్తుంది. మరి ఇంతకీ ఆ కథను గ్రిప్పింగ్ ఎలా చేశాడు మొత్తానికైతే ఈ సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలిపే ప్రయత్నంలో భాగంగా ఆయన ఈ సినిమాను ఎలా తీర్చిదిద్దుతాడు అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper