Homeఎంటర్టైన్మెంట్Maa Inti Bangaram Movie Review: మా ఇంటి బంగారం రివ్యూ: బంగారమే కానీ 8...

Maa Inti Bangaram Movie Review: మా ఇంటి బంగారం రివ్యూ: బంగారమే కానీ 8 క్యారెట్ గోల్డ్..!

Maa Inti Bangaram Movie Review: నటీనటులు: సమంత, దిగంత్, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, గౌతమి, ఆనంద్, మంజూష తదితరులు
సంగీత దర్శకుడు: సంతోష్ నారాయణన్
ఛాయాగ్రహణం: ఓం ప్రకాష్
ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల
దర్శకత్వం: B.V.నందిని రెడ్డి
నిర్మాణం: ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్

శుభం సినిమాలో అతిథి పాత్రలో తళుక్కున మెరిసినా, వెబ్ సీరీసుల్లో యాక్ట్ చేసినా, ఒక సినిమాలో సమంతా ప్రధాన పాత్రలో కనిపించి దాదాపు మూడేళ్లయింది. దీంతో సహజంగానే మా ఇంటి బంగారం సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అది కూడా ‘ఓ బేబీ’ లాంటి హిట్ సినిమాను తెరకెక్కించిన నందిని రెడ్డి దర్శకత్వంలో కావడం వల్ల, ట్రైలర్ కూడా ఆసక్తి కరంగా ఉండడంతో ఈ సినిమాపై డీసెంట్ అంచనాలైతే ఏర్పడ్డాయి. దీనికి తోడు సమంత భర్త, ప్రముఖ బాలీవుడ్ మేకర్ రాజ్ నిడిమోరు కథ అందించడం, స్వయంగా నిర్మించడంతో బిజినెస్ పరంగా కూడా ఈ చిత్రం విడుదలకు ముందే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ లో యాక్షన్ ఎలిమెంట్స్‌ జోడించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా లేదా ఉసూరుమనిపించిందా అనేది రివ్యూలో చూద్దాం.

అనిరుధ్ (దిగంత్) ఒక డాక్టర్. తన ఇంట్లో వాళ్ళ ఇష్టానికి విరుద్ధంగా స్వర్ణ (సమంత)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఈ కారణంగా కొన్నేళ్ళ పాటు కుటుంబానికి దూరంగా ఉంటారు. అయితే అనిరుధ్ చెల్లెలి పెళ్లి కుదరడంతో, భార్యతో కలిసి సొంత ఊరైన బల్లవరం వస్తాడు. అనిరుధ్ తండ్రి (ఆనంద్) సంప్రదాయాలకు, పద్ధతులకు ప్రాధాన్యతనిచ్చే లోకల్ పొలిటీషియన్. వంట,ఇంటి పనులేవీ పెద్దగా తెలియకపోయినా, ఆ ఇంట్లో పెద్ద కోడలిగా అందరి మెప్పు పొందడానికి తన స్నేహితురాలు కిరణ్మయి (మంజూష) సాయంతో స్వర్ణ రకరకాల ట్రిక్స్ ప్లే చేస్తూ మేనేజ్ చేస్తుంటుంది. ఇదే సమయంలో ఆమె తోడికోడలు అనసూయ (శ్రీముఖి) ఆమెను డామినేట్ చేయాలని చూస్తుంది.ఇలా కూల్ గా ఆదర్శకుటుంబం లాంటి ఫ్యామిలీ డ్రామాతో సరదాగా సాగిపోతున్న తరుణంలో, జైలు నుండి తప్పించుకున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కరుణ (గుల్షన్ దేవయ్య) మనుషులు స్వర్ణను వెతుక్కుంటూ బల్లవరం వస్తారు. అసలు స్వర్ణ గతం ఏంటి? తనను టార్గెట్ చేసిన వారు స్వర్ణ అని కాకుండా ఝాన్సీ అని ఎందుకు పిలుస్తున్నారు? కరుణ నుండి తనను, తన భర్త కుటుంబాన్ని కాపాడుకోవడానికి స్వర్ణ ఏం చేసింది? ఇదంతా తెలియాలంటే సినిమా చూడాలి.

ఒక సాధారణ హౌస్‌వైఫ్ వెనుక పవర్‌ఫుల్ యాక్షన్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా మెయిన్ థీమ్. ఫస్ట్ హాఫ్ లో చాలా భాగం సరదాగా సాగిపోతుంది. ఎప్పుడైతే విలన్ కరుణకు సంబంధించిన మనుషులు సమంతను గుర్తుపట్టారో అక్కడి నుంచి సినిమా యాక్షన్ థ్రిల్లర్ టర్న్ తీసుకుంటుంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్‌లో సమంత గతాన్ని రివీల్ చేస్తూ వచ్చే యాక్షన్ ఎపిసోడ్ ప్రేక్షకులను, ముఖ్యంగా సమంతా అభిమానులను మెప్పిస్తుంది. అయితే సెకండ్ హాఫ్ మాత్రం దాదాపు ప్రిడిక్టబుల్ గా, ఫ్లాట్ గా సాగుతుంది. సినిమాలో సమంతా పాత్రను చూస్తున్నప్పుడు మహేష్ బాబు సూపర్ హిట్ సినిమా ‘అతడు’ గుర్తుకువస్తే మీకు తెలుగు సినిమాల్లో మీకు డీప్ లెవెల్ నాలెడ్జ్ ఉన్నట్టు లెక్క. అలా అని సినిమా నీరసంగా ఏమీ లేదు. సెకండ్ హాఫ్ లో పెద్దగా ట్విస్టులు ఏమీ లేనందువల్ల కొంత ఫ్లాట్ గా ఉన్నప్పటికీ మధ్యలో వచ్చే కామెడీ సీన్స్ తో సినిమా దాదాపు సరదాగానే సాగుతుంది. ముఖ్యంగా సమంతా ఫ్రెండ్ పాత్రలో నటించిన మంజూష సీన్స్ నవ్వులు పూయించాయి. ఈమధ్యకాలంలో ఫ్యామిలీలను సినిమా హాలుకు రానివ్వకుండా అడ్డుకుంటున్న అడల్ట్ కంటెంట్, బూతు జోకులు, అంగాంగ ప్రదర్శనలు లేకుండా క్లీన్ గా ఉండడం ఈ సినిమాలో పెద్ద రిలీఫ్. ఈ విషయంలో దర్శకురాలు నందినిరెడ్డిని మెచ్చుకోవాలి.

ఈ సినిమాను సమంత తన స్క్రీన్ ప్రెజెన్స్ తో, నటనతో ఒంటి చేత్తో నిలబెట్టింది. అటు హౌస్ వైఫ్ అమాయకత్వాన్ని పండిస్తూనే, ఇటు యాక్షన్ సీన్స్‌లో ఇంటెన్సిటీ చూపిస్తూ చక్కగా నటించింది. సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం మంచి విషయమే అయినా కొన్ని ఎమోషనల్ సీన్స్ లో ఫుల్ ఇంపాక్ట్ అయితే లేదు. సమంత భర్తగా నటించిన కన్నడ నటుడు దిగంత్‌కు పెద్దగా నటనకు స్కోప్ దక్కలేదు. సమంతా ఫ్రెండ్ పాత్రలో నటించిన మంజూష మాత్రం ఈ సినిమాలో హైలైట్ అని చెప్పొచ్చు. తన కామెడీ సీన్స్ అన్నీ ఫుల్ జస్టిస్ చేసింది. సమంతా తోడికోడలు పాత్రలో శ్రీముఖి డీసెంట్ గా యాక్ట్ చేసింది. గుల్షన్ దేవయ్య నటన ఓకే ఓకే. కరుడుగట్టిన క్రిమినల్ పాత్ర అని ప్రొజెక్టు చేస్తున్నప్పటికీ అంత ఇంటెన్సిటీ కనిపించలేదు.

సంతోష్ నారాయణన్ అందించిన పాటలు గొప్పగా లేవు కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాను ఎలివేట్ చేసింది. ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. పల్లెటూరి వాతావరణాన్ని అందంగా చూపించారు. ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ సెకండాఫ్‌లో ఇంకా షార్ప్‌గా ఉండాల్సింది.

సినిమాలో ఏం బాగున్నాయో తెలుసా?

1. సమంత ఆల్‌రౌండ్ పర్ఫార్మెన్స్ & యాక్షన్ సీక్వెన్స్.

2. కామెడీ సీన్లు.

3,. ఇంటర్వెల్ ఫైట్ ఎపిసోడ్.

సినిమాలో బాగలేనివి ఇవి:

1. రొటీన్ అండ్ ప్రిడిక్టబుల్ సెకండాఫ్.

2. బలహీనమైన విలన్ క్యారెక్టరైజేషన్.

రేటింగ్: 2.5 / 5

ఫైనల్ వర్డ్: పిల్లా పాపలతో, పెద్దవాళ్ళతో కూడా చూడగలిగిన బంగారం.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular