Homeక్రీడలుక్రికెట్‌Shubman Gill Gautam Gambhir: గిల్.. గౌతమ్ గంభీర్.. ఇండియా పుట్టి ముంచేలా ఉన్నారుగా..

Shubman Gill Gautam Gambhir: గిల్.. గౌతమ్ గంభీర్.. ఇండియా పుట్టి ముంచేలా ఉన్నారుగా..

Shubman Gill Gautam Gambhir: ఏకపక్షంగా విజయాలు సాధ్యమైనప్పుడు.. టోర్నీలు గెలిచినప్పుడు.. ఇంకా ఏమైనా మ్యాచ్ లు మిగిలి ఉంటే మేనేజ్మెంట్ ప్రయోగాలు చేయాలి. అప్పుడు మిగతా ఆటగాళ్లలో ఉన్న దమ్ము బయటపడుతుంది. వారు జట్టుకు ఏ మేరకు సహకరిస్తారో తెలుస్తుంది. కానీ, చాంతాడంత లక్ష్యాన్ని ముందు పెట్టుకొని.. బలమైన ఆకాంక్షలను నిర్ణయించుకొని.. ఆ దిశగా అడుగులు వేయాల్సిన చోట.. తడబడితే.. పనికిమాలిన ప్రయోగాలు చేస్తే అంతకుమించిన దరిద్రం మరొకటి ఉండదు.

ఇప్పుడు టీమిండియాకు ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ముఖ్యంగా కోచ్ గౌతమ్ గంభీర్.. కెప్టెన్ గిల్ చేస్తున్న ప్రయోగాలు టీమ్ ఇండియా పుట్టి ముంచే విధంగా ఉన్నాయి. వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ జరుగుతుంది. దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే వేదికలుగా ఈ మెగా టోర్నీ కొనసాగుతూ ఉంటుంది. 2023 లో టీమిండియా వన్డే వరల్డ్ కప్ కోల్పోయింది. సొంత దేశంలో ఈ టోర్నీ నిర్వహించినప్పటికీ టీమిండియా విజేతగా నిలవలేకపోయింది. ఈసారి ఎలాగైనా ఛాంపియన్ గా అవతరించాలని టీమిండియా భావిస్తోంది. ఈ క్రమంలోనే వైట్ బాల్ ఫార్మాట్లో స్థిరమైన స్థాయి ప్రదర్శన చేస్తోంది.

అనవసరమైన ప్రయోగాలు స్థిరమైన ఆటతీరు కొనసాగిస్తున్న నేపథ్యంలో మేనేజ్మెంట్ ప్రయోగాలు మొదలుపెట్టింది. గౌతమ్ గంభీర్.. గిల్ ప్రస్తుతం జరుగుతున్న ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ లో వింత వింత నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా ఓపెనర్ గా రావలసిన గిల్ రెండో స్థానంలోకి వచ్చాడు. జైస్వాల్ ఓపెనర్ అవతారం ఎత్తాడు. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయాల్సిన అతడు.. తడబడుతున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ల బౌలింగ్ ముందు తేలిపోతున్నాడు. రెండు మ్యాచ్ల్లో ఇదే వరుస. మరో ఓపెనర్ రోహిత్ శర్మ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తుంటే.. జైస్వాల్ మాత్రం ఇబ్బంది పడుతున్నాడు.. రోహిత్ శర్మతోపాటు గిల్ ఓపెనర్ గా వచ్చుంటే జైస్వాల్ మీద ఒత్తిడి తగ్గేది. అతడు వన్ డౌన్ లో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసేవాడు. కానీ, లేని ప్రయోగాలకు పోయి గంభీర్.. గిల్ అతడిని ఓపెనర్ గా పంపించారు. ఫలితంగా రెండు మ్యాచ్ల్లో అతడి విఫలమయ్యాడు. దీంతో గంభీర్ .. గిల్ ప్రయోగాల పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వీరిద్దరూ టీమిండియా పుట్టించే విధంగా ఉన్నారని మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు. వన్డే వరల్డ్ కప్ ముందు ఇలాంటి నిర్ణయాలు వద్దని వారు సూచిస్తున్నారు. వన్డే వరల్డ్ కప్ నెగ్గిన తర్వాత.. ఇలాంటి ప్రయోగాలు ఎన్నైనా చేసుకోవచ్చని వారు సూచిస్తున్నారు. వన్డే వరల్డ్ కప్ ముందు కొంతమంది అంచనాలు ఉన్న ఆటగాళ్లు విఫలమైతే.. వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని చెబుతున్నారు. ఇప్పటికైనా గిల్.. గంభీర్ మారతారా.. ప్రయోగాలను పక్కనపెట్టి.. అసలైన ఆటగాళ్లకు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇస్తారా.. ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular