Homeఎంటర్టైన్మెంట్Dhurandhar Movie Director: 'ధురంధర్' డైరెక్టర్ కోసం కొట్లాడుకుంటున్న టాలీవుడ్ , బాలీవుడ్ హీరోలు..

Dhurandhar Movie Director: ‘ధురంధర్’ డైరెక్టర్ కోసం కొట్లాడుకుంటున్న టాలీవుడ్ , బాలీవుడ్ హీరోలు..

Dhurandhar Movie Director: ఒక డైరెక్టర్ పాన్ ఇండియా లెవెల్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొడితే చాలు, ఆ డైరెక్టర్ కోసం ఇండియా లో ఉన్నటువంటి స్టార్ హీరోలందరూ పోటీ పడుతారు. బ్లాంక్ చెక్కులు పట్టుకొని అడ్వాన్స్ ఇవ్వడానికి సిద్ధం అయిపోతూ ఉంటారు. ప్రస్తుతం ఇండియా వైడ్ గా ‘ధురంధర్’ డైరెక్టర్ ఆదిత్య డర్ కి ఉన్నటువంటి క్రేజ్, డిమాండ్ రాజమౌళి కి కూడా లేదు అనడంలో అతిశయోక్తి లేదేమో. ఈమధ్య కాలంలో తన […]

Dhurandhar Movie Director: ఒక డైరెక్టర్ పాన్ ఇండియా లెవెల్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొడితే చాలు, ఆ డైరెక్టర్ కోసం ఇండియా లో ఉన్నటువంటి స్టార్ హీరోలందరూ పోటీ పడుతారు. బ్లాంక్ చెక్కులు పట్టుకొని అడ్వాన్స్ ఇవ్వడానికి సిద్ధం అయిపోతూ ఉంటారు. ప్రస్తుతం ఇండియా వైడ్ గా ‘ధురంధర్’ డైరెక్టర్ ఆదిత్య డర్ కి ఉన్నటువంటి క్రేజ్, డిమాండ్ రాజమౌళి కి కూడా లేదు అనడంలో అతిశయోక్తి లేదేమో. ఈమధ్య కాలంలో తన దర్శకత్వ ప్రతిభ తో ప్రేక్షకులకు అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని ఇచ్చింది కచ్చితంగా ఆయనే, అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఈ డైరెక్టర్ కోసం ఇంతమంది సూపర్ స్టార్స్ క్యూలు కడుతున్నారు. ఒక టాలీవుడ్ పాన్ ఇండియా హీరో అయితే , తనతో సినిమా చేయాల్సిందిగా ఎంతో బ్రతిమిలాడాడు , కానీ తనకు సెట్ అవ్వదని మొహమాటం లేకుండానే చెప్పాడట ఆదిత్య డర్.

దీంతో ఆ టాలీవుడ్ పాన్ ఇండియన్ హీరో బాగా నిరాశకు గురైనట్టు తెలుస్తోంది. ఆదిత్య డర్ ప్రస్తుతానికి ప్రభాస్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడని , హోమబుల్ ఫిలిమ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది అంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. మరి ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్తుందో లేదో చూడాలి. మరోవైపు ఆదిత్య డర్ ‘ధురంధర్’ హీరో రణవీర్ సింగ్ తో కూడా మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కచ్చితంగా వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకరితో ఆయన సినిమా చేసే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు హృతిక్ రోషన్ , రణబీర్ కపూర్, అమీర్ ఖాన్ వంటి వారు కూడా ఆదిత్య డర్ తో సినిమాలు చేయడానికి చూస్తున్నారట. మన టాలీవుడ్ నుండి అల్లు అర్జున్ టీం కూడా ఆదిత్య డర్ తో సినిమాని సెట్ చేసేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి.

ఈ స్థాయిలో ఒక డైరెక్టర్ కోసం ఇంతమంది హీరోలు పోటీ పడడం అనేది గతం లో ఎప్పుడూ జరగలేదు. ఈ దశాబ్ద కాలం లో ప్రశాంత్ నీల్ , లోకేష్ కనకరాజ్, అట్లీ, నెల్సన్ దిలీప్ కుమార్ , ఇలా ఎంతో మంది టాప్ డైరెక్టర్స్ , జెన్ జీ డైరెక్టర్స్ పుట్టుకొచ్చారు. అందరికీ మంచి డిమాండ్ ఉంది , కానీ ఈ రేంజ్ డిమాండ్ మాత్రం వాళ్ళు కూడా చూసి ఉండరు. ఆదిత్య డర్ తన తదుపరి చిత్రాన్ని ఎప్పుడు ప్రకటిస్తాడో తెలియదు కానీ , ప్రకటించిన రోజు మాత్రం ఇండియా మొత్తం షేక్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper