Woman affairs with ten people: చూడ్డానికి అందంగా ఉంది. అమాయకంగా కనిపిస్తోంది. ఈ కాలపు యువతి కావడంతో అధునాతనంగా దర్శనమిస్తోంది. పక్కింటి అమ్మాయిలా ఉన్న ఆమెకు గతంలోనే వివాహం జరిగింది. వివాహం జరిగిన కొద్ది రోజుల వరకు ఆమె సంసారం సజావుగానే సాగింది. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. కట్టుకున్న భర్తను దూరం పెట్టడం మొదలుపెట్టింది. అంతకుముందే ప్రేమ వ్యవహారం ఉండడంతో.. అతడు తట్టుకోలేకపోయాడు. దీంతో ఎన్నాళ్ళు ఇలా అనుకుంటూ ఆమెకు దూరంగా జరిగాడు. ఆమె కూడా దొరికిందే సందు అనుకుని అతనిని వదిలేసింది. ప్రియుడి మోజులో విడాకులు ఇచ్చేసింది.
భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత.. ప్రియుడితో కొద్దిరోజుల పాటు కలిసి ఉన్న ఆమె.. ఆ తర్వాత అతనిని కూడా దూరం పెట్టింది. కొద్ది రోజులకు మరొక యువకుడితో వ్యవహారం మొదలుపెట్టింది.. ఇలా తన బంధాలను.. కొత్త వ్యక్తులను జీవితంలోకి ఆహ్వానించింది. ఫలితంగా ఆమె బాయ్ ఫ్రెండ్స్ సంఖ్య పదికి చేరుకుంది. ఇక్కడతో ఆగిందో తెలియదు.. ఇంకా ఆమె యుద్ధమే చేస్తుందో తెలియదు. కాకపోతే ఈ అభినవ మల్టీ రిలేషన్ గర్ల్ వ్యవహారం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆమె చేసుకున్న పెళ్లి.. నడిపిన బంధాలు.. సాగించిన వ్యవహారాలను ఓ యువకుడు బయటపెట్టాడు. ఆమె నోటి ద్వారానే చెప్పించాడు. చివరికి ఆమెకు పనిష్మెంట్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. ఏ అందం చూసుకొని అయితే ఇంతమందిని మోసం చేశావో.. అది లేకుండా చేస్తానంటూ హెచ్చరించాడు. ఆమెకు అరగుండు కొట్టించి ఊరంతా ఊరేగిస్తానంటూ శపథం చేశాడు.
వాస్తవానికి ఆమె చేతిలో మోసపోయిన వారు.. ఆమెను పెళ్లి చేసుకున్న వారు ఈ స్థాయిలో రెస్పాండ్ కాలేదు. ఈ స్థాయిలో ఆమెను హెచ్చరించలేదు. ఇతడు ఆమెను ఆ స్థాయిలో హెచ్చరించడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే అతడు గతంలో ఆమెను ప్రేమించాడు. అదే విషయాన్ని చెప్పాడు. కానీ దానికి ఆమె ఒప్పుకోలేదు. ఇన్నాళ్లకు ఆమె దొరకడంతో తన పగను మొత్తం ఈ విధంగా తీర్చుకున్నాడు. అయితే ఈ వీడియోని చూసిన చాలామంది అతడి తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నువ్వు ప్రేమించిన అంత మాత్రాన ఆమె ప్రేమించాలని.. నీతో ఉండాలని రూల్ లేదు కదా.. ఆమె జీవితం ఆమె ఇష్టం.. మధ్యలో నువ్వు ఎవడివంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆమె బతుకును బతకనీయంటూ సూచిస్తున్నారు.