Tirupati Viral News: తాగిన మైకంలో కొంతమంది దారుణాలకు పాల్పడుతుంటారు. ఆకృత్యాలకు ఒడిగడుతుంటారు. ఇంకొందరేమో విచిత్రమైన పనులు చేస్తుంటారు. అయితే ఆ పనులలో ఇతడు పీహెచ్డీ చేశాడనుకుంటా. ఏకంగా పాముతోనే సయ్యాటలాడాడు. పాము ముందు తొడ కొట్టాడు. చివరికి పాముకు చుక్కలు చూపించాడు. ప్రస్తుతం ఇతడు ఒకసారిగా వార్తల్లో వ్యక్తయ్యాడు.
తిరుపతి జిల్లా తొట్టంబేడులో చియ్యవరం అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో వెంకటేష్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివసిస్తుంటాడు. వెంకటేష్ చిన్న చిన్న పనులు చేస్తుంటాడు. కాకపోతే ఇతడికి మద్యం తాగడం విపరీతమైన ఇష్టం. ఉదయం నుంచి మొదలుపెడితే సాయంత్రం వరకు తాగుతూనే ఉంటాడు. తాగిన మైకంలో ఏవేవో పనులు చేస్తుంటాడు. అప్పుడప్పుడు ఇతరులతో గొడవలు కూడా పడుతుంటాడు. గురువారం వెంకటేష్ ఎప్పటిలాగే విపరీతంగా మద్యం తాగాడు. మద్యం తాగిన మత్తులో ఇంటికి వెళ్తున్నాడు. రోడ్డుమీద వెళ్తుండగా ఒక తాచుపాము పొదల్లోకి పాకుకుంటూ పోతున్నది. దానితోకను వెంకటేష్ తొక్కాడు. దీంతో అది ఇతడిని కాటు వేసింది. కాటు వేసిన పామును చూసిన వెంకటేష్ ఒక్కసారి ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Also Read: వెకిలి వేషాలు వేశారు.. మక్కెలు విరిగిపోయాయి..పోకిరీ వెదవలు చూడాల్సిన వీడియో ఇది!
తనని కాటు వేసిందని కోపంతో పామును చేతుల్లో పట్టుకున్నాడు. తన తలను అమాంతం నోట్లోకి తీసుకొని కొరికి అవతల పడేశాడు. చనిపోయిన పామును ఇంటికి తీసుకొచ్చి పక్కన వేసుకొని నిద్రపోయాడు. కుటుంబ సభ్యులు ఉదయం చూసేసరికి వెంకటేష్ పక్కన పాము ఉంది. దీంతో వారు ఒకసారి గా భయపడ్డారు. వెంకటేష్ అపస్మారక స్థితిలో ఉండడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతడికి వైద్యులు అత్యవసర చికిత్స విభాగంలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వెంకటేష్ చేసిన పని ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ” కాటు వేసిన పాము తలను కొరికావంటే నువ్వు మామూలోడివి కాదు భయ్యా. చివరికి పామును కూడా నీ పక్కలో వేసుకొని పడుకున్నావ్. నీ ధైర్యానికి సలాం చేయాల్సిందే.. ఈ స్థాయి ధైర్యం ఎవరికీ ఉండదంటూ” నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.